Monday, 9 November 2015

పోలీసు ఉద్యోగానికి పరుగే కీలకం

పోలీసు ఉద్యోగానికి పరుగే కీలకం

తెలంగాణ ప్రభుత్వం కొత్తగా ప్రకటించిన పోలీసు ఉద్యోగాల నియమాకానికి పరుగు కీలకం కాబోతోంది. పోలీసు విభాగం, అగ్నిమాపక విభాగంలో మొత్తంగా 9,056 పోస్టులు భర్తీ చేయనున్నారు. ఇందులో 1/3 ఉద్యోగాలు మహిళలకు ప్రత్యేకం.  రాత పరీక్ష, దేహాదారుఢ్య పరీక్షల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 


రాత పరీక్షకు తెలంగాణ చరిత్ర తప్పనిసరి.  దేహాదారుఢ్య పరీక్షలను ప్రభుత్వం భారీగా సడలించింది. గతంలో పురుషులకు ఐదు కిలోమీటర్లు, మహిళలకు రెండు కిలోమీటర్ల పరుగు పోటీ ఉండేది. అంతే కాదు 100, 800 స్పింట్ర్స్, లాంగ్ జంప్, హై జంప్, షాట్ పుట్ లో అభ్యర్థులు ప్రావీణ్యం ప్రదర్శించాల్సి ఉండేది. 

తాజాగా చేపట్టబోయే నియామకాల్లో భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. పురుష అభ్యర్థులు ఇక ఐదు మీటర్ల రన్నింగ్ లో పాల్గొనాల్సిన అవసరం లేదు. ఐదు దేహాదారుఢ్య పరీక్షలకుగాను 800 మీటర్ల పరుగు, లాంగ్ జంప్ లేదా హై జంప్, షాట్ పుట్ లేదా 100 మీటర్ల పరుగు పోటీలో ఏవేవి రెండింటిలో ప్రావీణ్యం ప్రదర్శిస్తే చాలు. 

మహిళ అభ్యర్థులు 100 మీటర్ల పరుగు పందెంలో పాల్గొని లాంగ్ జంప్ లేదా షాట్ ఫుట్ లో ప్రావీణ్యం ప్రదర్శిస్తే చాలు.
వీటితో పాటు వ్యక్తిత్వ పరీక్షల్లో కూడా పాస్ కావాల్సి ఉంటుంది. ఈ పరీక్ష సైనిక నియామకాల్లో అనుసరించే రీతిలో ఉంటుంది. జాతీయ సమగ్రత, మహిళలు, సమాజంలో అణగారిన వర్గాలు వంటి అంశాలు ఈ పరీక్షలో ఉంటాయి. 

9056 పోస్టుల్లో  185 స్పెషల్ ప్రొటెక్షన్ పోస్టులు సహ 8,360 ఉద్యోగాలు పోలీసు శాఖలో, 510 ఉద్యోగాలు అగ్నిమాపక శాఖలో ఉన్నాయి.

No comments:

ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ 2025: పూర్తి విజేతల జాబితా, ముఖ్యాంశాలు & ముఖ్య క్షణాలు

  Category Winner(s) Film Best Film – Laapataa Ladies Best Director Kiran Rao Laapataa Ladies Best Actor in Leading Role (Male) Abhishek Bac...