Tuesday, 5 November 2019

30th october 2019 current affairs

✍  కరెంట్ అఫైర్స్ 30 అక్టోబరు 2019 Wednesday ✍
రాష్ట్రాలు / కేంద్ర పాలిత ప్రాంతాల వార్తలు
ఏపీకి ప్రత్యేకంగా ఫ్యాప్సీ. విజయవాడలో కార్యాలయం ఏర్పాటు. తొలి అధ్యక్షుడిగా సీవీ అచ్యుతరావు :

i. ఆంధ్రప్రదేశ్ వాణిజ్య, పారిశ్రామిక మండళ్ల సమాఖ్య (ఫ్యాప్సీ) 2014 కంటే ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్లోని రెడ్హిల్స్ కేంద్రంగా కార్యకలాపాలు సాగించింది.
ii. రాష్ట్ర విభజన తర్వాత ఆ సంస్థ పేరును రెండు రాష్ట్రాలకూ వర్తించే విధంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వాణిజ్య మండళ్ల సమాఖ్య (ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ) అని మార్చారు. ఇటీవల వరకూ ఇదే కొనసాగింది.
iii. కొద్దికాలం క్రితం ఈ సంస్థను పూర్తిగా తెలంగాణ రాష్ట్రానికి పరిమితం చేస్తూ తెలంగాణ వాణిజ్య, పారిశ్రామిక మండళ్ల సమాఖ్య (ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ-ఎఫ్టీసీసీఐ)ని ఏర్పాటు చేశారు.
iv. ఈ నేపథ్యంలో ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ కోసం ఆంధ్రప్రదేశ్ వాణిజ్య, పారిశ్రామిక మండళ్ల సమాఖ్య      (ఫ్యాప్సీ)ను విజయవాడ కేంద్రంగా ఏర్పాటు చేశారు.
v. మొదటి కార్యవర్గ సమావేశంలో ఫ్యాప్సీ అధ్యక్షుడిగా సీవీ అచ్యుతరావును ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. రెండేళ్ల పాటు ఆయన ఈ హోదాలో బాధ్యతలు నిర్వర్తిస్తారు.
 సైన్స్ అండ్ టెక్నాలజీ
‘పేపర్ ఫోన్’ తోడుగా.. డిజిటల్ జీవితం. సరికొత్త యాప్ను ఆవిష్కరించిన గూగుల్ :
 

i. గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ నిరుడు ‘డిజిటల్ వెల్బీయింగ్’ ప్రచారాన్ని ప్రారంభించారు. అందులో భాగంగానే ఇప్పుడు ఈ యాప్ను గూగుల్ ఆవిష్కరించింది.
ii. ఈ యాప్లో ఏ రోజుకారోజు మనకు అవసరమైన వ్యక్తుల ఫోన్ నంబర్లు, మ్యాప్లు, సమావేశాల వివరాలు ఎంపిక చేసుకుంటే చాలు. అది మనకో పర్సనల్ బుక్లెట్ తయారుచేసి ఇస్తుంది. దీన్ని కావాలంటే ప్రింట్ తీసుకోవచ్చు.
iii. ఐటీ నిపుణుల కోసం ఈ యాప్ కోడ్ను ‘జిట్హబ్’లో పెట్టింది గూగుల్. పేపర్ ఫోన్ను లండన్ కేంద్రంగా పనిచేసే ‘స్పెషల్ ప్రాజెక్ట్స్’ డిజిటల్ స్టూడియో అభివృద్ధి చేసింది.
iv. డిజిటల్ ఆరోగ్య పరిరక్షణ’లో భాగంగా ఇప్పటికే ఐదు యాప్లను గూగుల్ అందుబాటులోకి తెచ్చింది. ఇవన్నీ మన సమయాన్ని ఆదా చేసి, చేయాల్సిన పనిలో నిమగ్నం కావడానికి, మనకు అవసరమైన యాప్లను అందుబాటులో ఉంచడానికి ఉద్దేశించినవే.

1) అన్లాక్ క్లాక్ : ఇది సెల్ఫోన్ తెరపై ఉండే వాల్పేపర్. మనం ఫోన్ని ఎన్నిసార్లు అన్లాక్ చేస్తున్నామన్నది లెక్కపెట్టి మనకు ఎప్పటికప్పుడు చెప్పేస్తుంది. తద్వారా రోజూ మనం ఫోన్ను ఎన్నిసార్లు చూస్తున్నామో తెలుసుకుని జాగ్రత్త పడొచ్చు.
2) పోస్ట్ బాక్స్ : మనకు వివిధ రూపాల్లో వచ్చే సందేశాలన్నింటినీ ఒక్క చోట చేర్చే యాప్. నిర్ణీత సమయం వరకూ సందేశాలను దాచిపెడుతుంది. తర్వాత మనం వాటిని చదువుకోవచ్చు.
3) వి ఫ్లిప్ : చుట్టూ జనం ఉన్నప్పుడు ఫోన్లో నిమగ్నం కాకుండా మన ఫోన్ వాడకం సమయాన్ని తగ్గిస్తుంది.
4) డిసెర్ట్ ఐలాండ్ : మనకు ముఖ్యమైన మెయిల్స్, నోట్ టేకింగ్, యాప్లు ఏమిటన్నది గుర్తించి, వాటిని షార్ట్కట్ రూపంలో మనకు అందిస్తుంది. దీంతో మిగతా యాప్ల జోలికి అనవసరంగా వెళ్లే పనుండదు.
5) మార్ఫ్ : సరైన సమయంలో సరైన అప్లికేషన్ నినాదంతో తీసుకొచ్చిన యాప్ ఇది. స్థలం, కాలం, పనులకు అనుగుణంగా... మనకు ఎప్పుడేం యాప్లు అవసరమో వాటిని అందుబాటులో ఉంచడం ఈ అప్లికేషన్ ప్రత్యేకత.
Modern humans came from Botswana : study
 
i. ఆధునిక మానవులు 2,00,000 సంవత్సరాల క్రితం ఉత్తర బోట్స్వానాలోని ఒక ప్రాంతంలో ఉద్భవించారని శాస్త్రవేత్తలు కనుగొన్నారు.
ii. ఆధునిక మానవులు - హోమో సేపియన్స్ - ఆఫ్రికాలో ఉద్భవించారని చాలా కాలంగా తెలిసినప్పటికీ, శాస్త్రవేత్తలు ఇప్పటివరకు మన జాతుల జన్మస్థలం యొక్క ఖచ్చితమైన స్థానాన్ని గుర్తించలేకపోయారు. ఒక బృందం 200 ఖోసాన్ ప్రజల నుండి డిఎన్ఎ నమూనాలను విశ్లేషించింది.
Defence News
India-France joint Army exercise 'Exercise SHAKTI' to begin from Oct 31 :

i. The bilateral 'Exercise SHAKTI' between the armies of India & France will be conducted from 31 October-13 November 2019.
ii. It will focus on counter terrorism operations in semi-desert terrain & aims at enhancing interoperability between the two armies.
iii. The exercise will be held in Rajasthan.
ఆర్థిక అంశాలు
విదేశాల్లోనూ రూపే కార్డు మిలమిల. కొత్తగా సౌదీ అరేబియాలోకి అడుగు :

i. ఒకప్పుడు డెబిట్, క్రెడిట్ కార్డులంటే.. వీసా, మాస్టర్ కార్డ్లే. జారీ చేసే బ్యాంకు ఏదైనా.. ఈ రెండు చెల్లింపుల నెట్వర్క్ సేవలనే వాడుకునేవి. అంతర్జాతీయంగా వీటికి మాత్రమే అంగీకారం ఉండేది.
ii. దేశీయంగా డిజిటల్ చెల్లింపుల సేవలు పెరుగుతున్నా.. ఈ విదేశీ కార్డుల చెల్లింపుల నెట్వర్క్ సేవలపైనే ఆధారపడాల్సిన పరిస్థితి. వీటికి పోటీగా, వీటికి మించి పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో కొత్త కార్డును తీసుకురావాలని ప్రభుత్వం ఆలోచించింది.
iii. ఇలా పుట్టుకొచ్చిందే ‘రూపే కార్డు’. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) 2012లో దీన్ని తీసుకొచ్చింది. మొదట రూపే డెబిట్ కార్డు, ఆ తర్వాత రూపే క్రెడిట్ కార్డూ అందుబాటులోకి వచ్చాయి.
iv. భారత్తోపాటు సింగపూర్, భూటాన్, బహ్రెయిన్, యూఏఈలలో ఇప్పటికే ఈ కార్డులు అందుబాటులోకి వచ్చాయి. కొత్తగా సౌదీ అరేబియాలో వినియోగంలోకి రాబోతోంది. దీన్ని అక్కడ ప్రధాని నరేంద్ర మోదీ తన తాజా పర్యటనలో భాగంగా ప్రవేశ పెట్టారు.
v. అంతర్జాతీయ కార్డులకు చెల్లించే రుసుములతో పోలిస్తే రూపే కార్డులకు చెల్లించే ఫీజు చాలా తక్కువ.. అనతికాలంలోనే రూపే కార్డుకు ఆదరణ లభించడానికి ప్రధాన కారణం. దీంతోపాటు రూపే క్రెడిట్ కార్డును వినియోగించేవారికి ఎలాంటి ఖర్చూ లేకుండా రూ.10లక్షల వరకూ వ్యక్తిగత ప్రమాద బీమా సౌకర్యం కల్పించడమూ ఒక ఆకర్షణ.
vi. ప్రారంభంలో ఈ కార్డును అందించేందుకు చాలా బ్యాంకులు ముందుకు రాలేదు. జన్ ధన్ యోజన ఖాతాలను ప్రారంభించడం, 2016లో పెద్ద నోట్ల రద్దు  తర్వాత వీటికి ఒక్కసారిగా ఆదరణ పెరిగింది.
vii. ప్రస్తుతం దాదాపు 1,100 బ్యాంకులు దాదాపు 60 కోట్ల వరకూ ఈ కార్డులను అందించాయి. ఇందులో చిన్న, పెద్ద బ్యాంకులతోపాటు, అంతర్జాతీయ బ్యాంకులూ ఉన్నాయి.
viii. భారత్ నుంచి అంతర్జాతీయ స్థాయిలో వచ్చిన మొదటి చెల్లింపుల నెట్వర్క్ కార్డు రూపే. ఈ కార్డు ద్వారా జరిగే లావాదేవీలన్నీ NPCI చెల్లింపుల వ్యవస్థను వినియోగించుకుంటాయి.
ix. రూపే కార్డు వాడకం వృద్ధి చెందుతుండటంతో అమెరికాకు చెందిన మాస్టర్ కార్డు, వీసాలకు భారత్లో మార్కెట్ వాటా తగ్గిపోతోంది. దేశీయంగా డిజిటల్ లావాదేవీలు అధికం అయినప్పటికీ.. వాటికి ఆశించినంత వృద్ధి కనిపించడం లేదు.
x. విదేశాలలో డిస్కవర్, డైనర్స్, పల్స్, జపాన్ క్రెడిట్ బ్యూరో, చైనా యూనియన్ పే తదితర సంస్థలతో ఒప్పందం కుదుర్చుకోవడం ద్వారా ప్రపంచ వ్యాప్తంగా రూపే కార్డు వినియోగంలోకి వచ్చింది. ఇప్పటి వరకూ 2.5 కోట్ల రూపే- డిస్కవర్ గ్లోబల్ కార్డులను విడుదల చేసిన ఘనతను ఎన్పీసీఐ దక్కించుకుంది.
   Appointments
47వ సీజేఐగా జస్టిస్ బోబ్డే :

i. భారత తదుపరి ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ)గా సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఏ బోబ్డేను నియమిస్తూ ఉత్తర్వులపై రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ సంతకం చేశారు. అనంతరం న్యాయ మంత్రిత్వశాఖ నుంచి నియామక ప్రకటన వెలువడింది.
ii. ప్రస్తుత సీజేఐ జస్టిస్ రంజన్ గొగొయి నవంబరు 17న పదవీ విరమణ చేయనున్నారు. మర్నాడు జస్టిస్ బోబ్డే ప్రమాణం చేస్తారు. సీజేఐగా 17 నెలలకు పైగా ఆయన కొనసాగనున్నారు.
iii. అయోధ్యపై విచారణ జరుపుతున్న కీలక రాజ్యాంగ ధర్మాసనంలో జస్టిస్ బోబ్డే ఒకరు. జస్టిస్ గొగొయిపై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలపై విచారణ జరిపిన ధర్మాసనంలో కూడా ఆయన ఉన్నారు.
iv. పూర్తి పేరు :  జస్టిస్ శరద్ అర్వింద్ బోబ్డే
v. న్యాయవాదిగా నమోదు : 1978లో మహారాష్ట్ర బార్కౌన్సిల్లో న్యాయవాదిగా పేరు నమోదు చేయించుకున్నారు. నాగ్పూర్ బెంచ్లో సుమారు 21 ఏళ్లు న్యాయవాదిగా కొనసాగారు.
vi. న్యాయమూర్తిగా: 2000 మార్చి 29న బాంబే హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమితులయ్యారు.
vii. 2012 అక్టోబరు 16న మధ్యప్రదేశ్ హైకోర్టుకు ప్రధాన న్యాయమూర్తి అయ్యారు.
viii. 2013 ఏప్రిల్ 12న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు.
ix. పదవీ విరమణ :  23-04-2021
ఎస్వీబీసీ డైరెక్టర్గా జయప్రద రామమూర్తి :

i. వేణుగాన విద్వాంసురాలు డా.జయప్రద రామమూర్తి తితిదేకు చెందిన శ్రీవేంకటేశ్వర భక్తి ఛానల్(ఎస్వీబీసీ) బోర్డు డైరెక్టర్గా నియమితులయ్యారు. ఈ పదవిలో ఆమె రెండేళ్ల పాటు కొనసాగుతారు.
ii. తెలుగు రాష్ట్రాల్లో తొలి మహిళా వేణుగాన విద్వాంసురాలిగా ఆమె పేరు గడించారు. భారత మాజీ రాష్ట్రపతులు ప్రణబ్ ముఖర్జీ, కె.ఆర్.నారాయణన్ల ఆహ్వానం మేరకు రాష్ట్రపతి భవన్లో ఆమె ప్రత్యేక ప్రదర్శనలిచ్చి మెప్పించారు.
iii. కంచి కామకోటి పీఠం, మైసూర్ దత్తపీఠం, శ్రీశైలం దేవస్థానం, యాదాద్రి దేవస్థానం వంటి వివిధ ధార్మిక సంస్థలలో ఆస్థాన విద్వాంసురాలిగా గౌరవం అందుకున్నారు.
Manoj Jain to be new chairman and managing director of GAIL :

i. పబ్లిక్ ఎంటర్ప్రైజ్ సెలక్షన్ బోర్డ్ (PESB) ప్రస్తుతం గెయిల్ (ఇండియా) లో డైరెక్టర్ (బిజినెస్ డెవలప్మెంట్) గా పనిచేస్తున్న మనోజ్ జైన్ ను భారతదేశపు అతిపెద్ద సహజవాయువు సంస్థ చైర్మన్ మరియు ఎండిగా నియమించింది.
ii. ఆగస్టు 2022 వరకు ఆయనకు పదవీకాలం ఉంటుంది.
Persons in news
లెబనాన్ ప్రధాని రాజీనామా :

i. లెబనాన్ ప్రధాని సాద్ హరిరి రాజీనామా చేశారు. వాట్సాప్ కాల్స్పై పన్ను విధింపు తదితర పొదుపు చర్యలను ఆయన సర్కారు ప్రకటించడంతో దేశవ్యాప్తంగా దాదాపు రెండువారాలుగా భారీ నిరసన ప్రదర్శనలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆయన రాజీనామా  చేశారు.
ii. Lebanon is a country in Western Asia.  Capital : Beirut
Reports/Ranks/Records
ప్రపంచ అత్యుత్తమ 10 మంది సీఈఓల్లో మనోళ్లు ముగ్గురు. శంతను నారాయణ్, అజయ్ బంగా, నాదెళ్లకు చోటు : హార్వర్డ్ బిజినెస్ రివ్యూ నివేదిక
 
i. ప్రపంచంలోని అత్యుత్తమ 10 మంది ముఖ్య కార్యనిర్వహణ అధికారుల్లో (సీఈఓ) భారత సంతతికి చెందిన ముగ్గురికి చోటు లభించింది. ఆ మగ్గురు.. అడోబ్ సీఈఓ శంతను నారాయణ్, మాస్టర్ కార్డ్ సీఈఓ అజయ్ బంగా, మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల.
ii. శంతను ఆరో స్థానంలో నిలవగా.. బంగాకు 7వ ర్యాంకు, నాదెళ్లకు 9వ ర్యాంకు లభించింది. ప్రపంచవ్యాప్తంగా అత్యుత్తమ 100 మంది సీఈఓలతో హర్వర్డ్ బిజినెస్ రివ్యూ (హెచ్బీఆర్) ఈ జాబితాను రూపొందించింది.
iii. ఇందులో న్విదియా సీఈఓ జెన్సన్ హాంగ్ మొదటి స్థానంలో నిలిచారు. 2015 నుంచి కేవలం ఆర్థిక పనితీరు ఆధారంగానే కాకుండా పర్యావరణ, సామాజిక, పరిపాలనా (ఈఎస్జీ) వ్యవహార అంశాలను లెక్కలోకి తీసుకొని ర్యాంకులు ఇస్తున్నట్లు హెచ్బీఆర్ పేర్కొంది.
ముఖ్యమైన రోజులు
అంతర్జాతీయ పొదుపు దినోత్సవం (World Thrift Day, World Savings Day) – అక్టోబర్ 30,31

i. 1924 అక్టోబరు... ఇటలీలోని మిలన్ నగరంలో మొదటి ‘అంతర్జాతీయ సేవింగ్స్ బ్యాంక్ కాంగ్రెస్’ జరిగింది. సదస్సు ముగింపు రోజైన అక్టోబరు 30వ తేదీని ‘అంతర్జాతీయ పొదుపు దినోత్సవం’గా ప్రకటించారు.
ii. ప్రతి సంవత్సరం అక్టోబర్ 31 న ప్రపంచ పొదుపు దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా వ్యక్తి మరియు దేశం యొక్క పొదుపు మరియు ఆర్థిక భద్రతను ప్రోత్సహించడానికి జరుపుకుంటారు.
iii. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలకు వారి డబ్బును ఇంట్లో ఉంచడం కంటే బ్యాంకులో ఆదా చేయాలనే ఆలోచన గురించి తెలియజేయడానికి ప్రపంచ పొదుపు దినం స్థాపించబడింది.
iv. 1984లో దివంగత ప్రధాని ఇందిరా గాంధీ మరణం(October 31, 1984) కారణంగా భారతదేశంలో ఈ రోజు జరుపుకుంటారు.
v. 1924లో ఇటలీలోని మిలన్లో జరిగిన మొదటి అంతర్జాతీయ పొదుపు కాంగ్రెస్ అక్టోబర్ 31 ను ప్రపంచ పొదుపు దినంగా ప్రకటించింది. ఈ రోజును జరుపుకునే లక్ష్యం పొదుపు పట్ల మన ప్రవర్తనను మార్చడం మరియు సంపద యొక్క ప్రాముఖ్యతను నిరంతరం గుర్తు చేస్తుంది.
vi. పొదుపు పరంగా సంపద ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొనే రక్షణగా పనిచేస్తుంది. ఇది వ్యాపారాన్ని ప్రారంభించడంలో, మంచి విద్యను పొందడంలో మరియు మంచి ఆరోగ్య చికిత్సను పొందడంలో మాకు సహాయపడుతుంది. పొదుపు అలవాటు దేశంతో పాటు ప్రజలకు కూడా స్వాతంత్ర్యం ఇస్తుంది.
హోమీ జహంగీర్ భాభా జననం : 30 అక్టోబర్ 1909

i. హోమీ జహంగీర్ భాభా (30 అక్టోబర్ 1909 – 24 జనవరి 1966) ఒక భారతీయ అణు భౌతికశాస్త్రవేత్త.
ii. అతను భారత అణుశక్తి కార్యక్రమం అభివృద్ధిలో ముఖ్యపాత్ర వహించారు మరియు భారతదేశం యెుక్క అణు కార్యక్రమం యెుక్క పితామహుడిగా భావించబడతారు.
iii. ఆయన కాస్మిక్ కిరణాల యెుక్క శోషణగుణం మరియు ఎలక్ట్రానుల ధారాళ ఉత్పత్తిలో బలమైన పరిశోధనను చేశారు. 1945లో, అతను బొంబాయిలోని టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ను మరియు అటామిక్ ఎనర్జీ కమిషన్ ఆఫ్ ఇండియాను స్థాపించాడు.
iv. 1950లలో, భాభా ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఫోరంలలో భారతదేశం తరుపున ప్రాతినిధ్యం వహించారు మరియు 1955లో జెనీవా, స్విట్జంర్లాండ్లో అణుశక్తి యెుక్క శాంతియుతమైన ఉపయోగాల మీద జరిగిన ఐక్యరాజ్యసమితి సమావేశంలో అధ్యక్షడిగా ఉన్నారు.
v. భారతదేశ ప్రభుత్వంచే పద్మభూషణ్ పురస్కారాన్ని 1954లో పొందారు. ఆయన భారత మంత్రిమండలి యెుక్క సాంకేతిక సలహాదారు సంఘం యెుక్క సభ్యుడిగా ఉన్నారు మరియు విక్రమ్ సారాభాయితో కలసి ఇండియన్ నేషనల్ కమిటీ ఫర్ స్పేస్ రీసెర్చ్ ఏర్పరచారు.
vi. జనవరి 1966లో, ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజన్సీ యెుక్క సాంకేతిక సలహాదారు సంఘం సమావేశానికి హాజరుకావటానికి వియన్నా, ఆస్ట్రియా వెళుతూ భాభా విమాన ప్రమాదంలో మోంట్ బ్లాంక్ వద్ద మరణించారు.
స్వామి దయానంద సరస్వతి మరణం : అక్టోబర్ 30, 1883

i. స్వామి దయానంద సరస్వతి (ఫిబ్రవరి 12, 1824 - అక్టోబర్ 30, 1883) ఆర్యసమాజ్ స్థాపకుడు, అజ్ఙానాంధకారం, దారిద్య్రం, అన్యాయన్ని ఎదురించి పోరాడిన ముని.
ii. హిందు ధర్మ సంస్థాపనకు నడుం బిగించిన ఋషి. 1857 ప్రథమ స్వాతంత్ర్య పోరాటంలో కీలక పాత్ర పోషించి, ఎందరో స్వాతంత్ర్య సమర యోధులకు ప్రేరణ అయిన పండితుడు.
iii. మూల శంకర్ ఫిబ్రవరి 12, 1824లో గుజరాత్ లోని ఠంకార అనే గ్రామంలో ఒక వర్తక కుటుంబంలో జన్మించాడు. పద్నాలుగేళ్ల ప్రాయంలో ఒక శివరాత్రి నాడు శివలింగంపై విసర్జిస్తున్న మూషికాలను చూసి, ధర్మం పేరిట జరిగే మోసాలు మూఢనమ్మకాలు గ్రహించి 1846లో భగవంతుడిని వెతకడానికి ఇల్లు వదిలి వెళ్లాడు. ఈ ప్రయాణంలో ఎందరో యోగులు మునుల సాంగత్యంలో గడిపి దయానంద అన్న నామం పొందాడు.
iv. ధర్మ సంస్థాపనకు శాశ్వత సంస్థగా, దేశ సంఘ సంస్కరణకు పునాదిగా, 10 ఏప్రిల్ 1875 న ముంబాయి నగరంలో మొదటి ఆర్యసమాజము స్థాపించాడు.
క్రీడలు
షకిబ్పై వేటు. రెండేళ్ల నిషేధం.. ఏడాది మినహాయింపు. ఫిక్సింగ్ సంప్రదింపులపై సమాచారమివ్వనందుకే :

i. ఫిక్సింగ్ కోసం దీపక్ అగర్వాల్ అనే భారత బుకీ తనను సంప్రదించిన విషయాన్ని ఐసీసీకి చేరవేయనందుకు అతడిపై రెండేళ్ల నిషేధం పడింది. తప్పు అంగీకరించినందుకు ఐసీసీ నిషేధంలో ఓ ఏడాదిని సస్పెన్షన్లో ఉంచింది.
ii. నిబంధనల ప్రకారం ఫిక్సింగ్, బెట్టింగ్ కోసం బుకీలు సంప్రదిస్తే.. వెంటనే కౌన్సిల్ అవినీతి నిరోధక విభాగానికి (ఏసీయూ) సమాచారం ఇవ్వాలి. కానీ షకిబ్ మౌనంగా ఉండిపోయాడు.
iii. షకిబ్ ప్రస్తుతం మూడు ఫార్మాట్లలోనూ బంగ్లా జట్టుకు కెప్టెన్గా ఉన్నాడు. స్తుతం అతను ఐసీసీ ఆల్రౌండర్ ర్యాంకింగ్స్లో వన్డేల్లో అగ్రస్థానం, టీ20ల్లో రెండు, టెస్టుల్లో మూడు ర్యాంకుల్లో కొనసాగుతుండటం విశేషం.
మళ్లీ టాప్-10లో సాత్విక్ జోడీ. సింధు 6వ, కిదాంబి శ్రీకాంత్ 10వ ర్యాంకు :

i. ఫ్రెంచ్ ఓపెన్లో రన్నరప్గా నిలిచిన భారత డబుల్స్ క్రీడాకారులు సాత్విక్ సాయిరాజ్- చిరాగ్శెట్టి జోడీ మళ్లీ టాప్-10లో అడుగుపెట్టింది. బీడబ్ల్యూఎఫ్ ప్రకటించిన ర్యాంకింగ్స్లో రెండు స్థానాలు మెరుగుపర్చుకుని 9వ ర్యాంకు సాధించింది.
ii. మహిళల సింగిల్స్లో పి.వి.సింధు 6వ, సైనా నెహ్వాల్ 9వ.. పురుషుల సింగిల్స్లో కిదాంబి శ్రీకాంత్ 10వ, సాయిప్రణీత్ 11వ ర్యాంకుల్లో కొనసాగుతున్నారు.
ప్రపంచ టీ20 టోర్నీకి నెదర్లాండ్స్ :

i. వచ్చే ఏడాది ఆస్ట్రేలియా వేదికగా జరిగే ప్రపంచ టీ20 టోర్నమెంట్కు నెదర్లాండ్స్ అర్హత సాధించింది. క్వాలిఫయింగ్ ప్లేఆఫ్ మ్యాచ్లో ఆ జట్టు 8 వికెట్ల తేడాతో యూఏఈని ఓడించింది.
ii. 2020 టీ20 ప్రపంచకప్కు అర్హత సాధించిన మూడో అసోసియేట్ జట్టు నెదర్లాండ్స్. పపువా న్యూగినియా, ఐర్లాండ్ ఇప్పటికే టీ20 ప్రపంచకప్ బెర్తు సంపాదించాయి. 2009, 2015 టీ20 ప్రపంచకప్లలో ఇంగ్లాండ్ను ఓడించి నెదర్లాండ్స్ సంచలనం సృష్టించింది.
iii. స్కాట్లాండ్తో మ్యాచ్లో విజయం సాధిస్తే యూఏఈ కూడా టీ20 ప్రపంచకప్కు అర్హత సాధిస్తుంది.
డేనైట్కు రైట్ రైట్. గులాబి టెస్టుకు బంగ్లాదేశ్ ఓకే. నవంబరు 22న ఈడెన్లో షురూ :

i. భారత్ తొలి డేనైట్ టెస్టుకు మార్గం సుగమమైంది. టీమ్ ఇండియా తన తొలి డేనైట్ టెస్టును వచ్చే నెలలో బంగ్లాదేశ్తో ఆడనుంది. ఈ మ్యాచ్కు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ)ను బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ ఒప్పించాడు.
ii. భారత పర్యటనలో బంగ్లా రెండు టెస్టులు ఆడనున్న సంగతి తెలిసిందే. అందులో కోల్కతాలో జరిగే రెండు టెస్టు (నవంబరు 22-26)ను ఇప్పుడు డేనైట్ మ్యాచ్గా మార్చారు. గులాబీ బంతితో టెస్టు మ్యాచ్ ఆడేందుకు బీసీబీ అంగీకరించింది.
iii. ఈడెన్ గార్డెన్స్లో డేనైట్ టెస్టు సందర్భంగా దిగ్గజ ఒలింపియన్లు మేరీకోమ్, అభినవ్ బింద్రా, పీవీ సింధు వంటి వారిని సన్మానించాలని బీసీసీఐ భావిస్తున్నట్లు సమాచారం. బంగ్లాదేశ్ ప్రధానమంత్రి షేక్ హసీనా తొలి రోజు మ్యాచ్ను ప్రత్యక్షంగా వీక్షించనున్నారు.
iv. కోల్కతాలో ఎస్జీ బంతులతో డేనైట్ నిర్వహిస్తామని గంగూలీ చెప్పాడు. డ్యూక్స్ లేదా కూకబుర్రా బంతితో మ్యాచ్ సాధ్యం కాదని అన్నాడు.
v. కొత్తగా టెస్టు హోదా పొందిన అఫ్గానిస్థాన్, ఐర్లాండ్ మినహా ఇప్పటివరకు డేనైట్ టెస్టు ఆడని దేశాలు భారత్, బంగ్లాదేశ్ మాత్రమే. ఇప్పటివరకు 11 డేనైట్ టెస్టులు జరిగాయి.
vi. తొలి మ్యాచ్ 2015లో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ మధ్య జరిగింది. నిరుడు ఆస్ట్రేలియా పర్యటన సందర్భంగా ఓ డేనైట్ టెస్టు ఆడాలని క్రికెట్ ఆస్ట్రేలియా చేసిన విజ్ఞప్తిని భారత్ తిరస్కరించింది. కానీ గంగూలీ అధ్యక్షుడయ్యాక ఈ విషయంలో బీసీసీఐ వైఖరి మారింది.
టెన్నిస్లో దూసుకెళ్తున్న తెలంగాణ రాకెట్ సంజన :

i. అండర్-12లో నంబర్వన్.. అండర్-14లో నంబర్వన్.. అండర్-16లో నంబర్వన్! తెలంగాణ టెన్నిస్ క్రీడాకారిణి.. జాతీయ ఛాంపియన్ సంజన సిరిమల్ల రికార్డిది.
ii. అంచనాలను మించి రాణిస్తున్న సంజన ఖాతాలో ఇప్పుడు మరో ఘనత చేరింది. ప్రతిష్టాత్మక డబ్ల్యూటీఏ ఫ్యూచర్ టెన్నిస్ టోర్నీలో వరుసగా రెండో ఏడాది పాల్గొని ప్రశంసలు అందుకుంది.
iii. ఫ్యూచర్ స్టార్స్ టోర్నీ ఈ అక్టోబర్ 23 నుంచి 27 వరకు చైనాలో షెంజెన్లో జరిగింది. 24 దేశాల నుంచి క్రీడాకారిణులు బరిలో దిగగా.. భారత్ నుంచి సంజన (అండర్-16), పరి సింగ్ (అండర్-14) పాల్గొన్నారు.
iv. మే నెలలో ముంబయిలో జరిగిన జాతీయ అండర్-16 టెన్నిస్ ఛాంపియన్షిప్లో విజేతగా నిలవడంతో.. అభిల భారత టెన్నిస్ సంఘం (ఐటా) ఫ్యూచర్ స్టార్స్ టోర్నీకి సంజన పేరును సిఫార్సు చేసింది.
v. గత ఏడాది అండర్-14లో జాతీయ ఛాంపియన్గా నిలిచిన సంజన అప్పుడు కూడా ఫ్యూచర్ టోర్నీకి వెళ్లింది.
Roger Federer Wins 10th Swiss Open Crown, Career Title No. 103 :

i. టాప్ సీడ్ ఫెదరర్,  10 వ సారి స్విస్ ఓపెన్ గెలిచాడు. ఆస్ట్రేలియాకు చెందిన 20 ఏళ్ల అలెక్స్ డి మినౌర్ను 6-2, 6-2 తేడాతో ఓడించి, 2019 లో నాల్గవ టైటిల్ మరియు అతని కెరీర్లో 103 వ టైటిల్ను సాధించాడు.
ii. జిమ్మీ కానర్స్ 109 టోర్నమెంట్ విజయాలతో పురుషులలో ఆల్ టైం మొదటి స్థానంలో ఉన్నాడు.

No comments:

ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ 2025: పూర్తి విజేతల జాబితా, ముఖ్యాంశాలు & ముఖ్య క్షణాలు

  Category Winner(s) Film Best Film – Laapataa Ladies Best Director Kiran Rao Laapataa Ladies Best Actor in Leading Role (Male) Abhishek Bac...