Wednesday, 13 February 2019

ఏపీలో టౌన్‌ ప్లానింగ్‌ బిల్డింగ్ ఓవర్‌సీర్ పోస్టులు

ఏపీ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్‌ విభాగంలో ఉద్యోగాల భర్తీకి ఆంధ్రప్రదేశ్ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ (ఏపీపీఎస్సీ) ఉద్యోగ ప్రకటన విడుదల చేసింది. సంబంధిత విభాగాల్లో డిప్లొమా లేదా బ్యాచిలర్స్ డిగ్రీ ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అభ్యర్థుల వయసు 18-42 సంవత్సరాల మధ్య ఉండాలి. అభ్యర్థులు దరఖాస్తు ప్రాసెసింగ్ ఫీజుగా రూ.250, పరీక్ష ఫీజుగా రూ.80 చెల్లించి ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఫిబ్రవరి 19 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కానుంది. అభ్యర్థులు మార్చి 12లోగా ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. మార్చి 13 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. 

రెండంచెల రాతపరీక్ష (స్క్రీనింగ్, మెయిన్) ద్వారా అభ్యర్థులను ఎంపికచేస్తారు. స్క్రీనింగ్ పరీక్ష తేదీ వెల్లడించలేదు.. అయితే మే 21న మెయిన్ పరీక్షను నిర్వహించనున్నట్లు కమిషన్ ప్రకటించింది. మెయిన్ పరీక్షను ఆన్‌లైన్ విధానంలో నిర్వహిస్తుండగా.. స్క్రీనింగ్ పరీక్షను ఆఫ్‌లైన్ ద్వారా నిర్వహించనున్నారు. ఒకవేళ స్క్రీనింగ్ పరీక్ష రాసే అభ్యర్థుల సంఖ్య 25వేలలోపు ఉంటే.. వారికి కూడా ఆన్‌‌లైన్ విధానంలోనే పరీక్ష నిర్వహించనున్నారు. 

పోస్టుల వివరాలు..
* టౌన్‌ ప్లానింగ్‌ బిల్డింగ్ ఓవర్‌సీర్: 18 పోస్టులు 
అర్హత‌: డిప్లొమా (డీసీఈ/ఎల్‌సీఈ/ఎల్ఏఏ) లేదా బీఆర్క్‌/ బీఈ/ బీటెక్‌(సివిల్‌) లేదా బీప్లానింగ్‌/ బీటెక్‌(ప్లానింగ్‌) ఉత్తీర్ణత‌. 

వయసు: 01.07.2019 నాటికి 18 నుంచి 42 సంవత్సరాల మ‌ధ్య ఉండాలి. 02.07.1977 - 01.07.2001 మధ్య జన్మించి ఉండాలి. నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి. 

దరఖాస్తు ఫీజు: అభ్యర్థులు దరఖాస్తు ప్రాసెసింగ్ ఫీజుగా రూ.250, పరీక్ష ఫీజుగా రూ.80 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, తెల్లరేషన్ కార్డుదారులకు, నిబంధనల ప్రకారం ఉన్న నిరుద్యోగులకు పరీక్ష ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. దరఖాస్తు ఫీజు మాత్రమే చెల్లిస్తే సరిపోతుంది. ఆన్‌లైన్ ద్వారానే ఫీజు చెల్లించాలి. 

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా. 

ఎంపిక‌ విధానం: స్క్రీనింగ్ టెస్ట్, మెయిన్ ఎగ్జామినేషన్ ద్వారా. 

స్కేల్‌పే: రూ.22,460- రూ.66,330. 
టీపీబీవో పరీక్ష స్వభావం, సిలబస్
ముఖ్యమైన తేదీలు.. 
✷ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 19.02.2019. 
✷ ఫీజు చెల్లించడానికి చివరితేది: 12.03.2019. 
✷ దరఖాస్తుల సమర్పణకు చివరితేది: 13.03.2019. 
✷ స్క్రీనింగ్ పరీక్ష తేది: ప్రకటించాల్సి ఉంది. 
✷ మెయిన్ పరీక్ష తేది: 21.05.2019. 
నోటిఫికేషన్ 

వెబ్‌సైట్ 

No comments:

ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ 2025: పూర్తి విజేతల జాబితా, ముఖ్యాంశాలు & ముఖ్య క్షణాలు

  Category Winner(s) Film Best Film – Laapataa Ladies Best Director Kiran Rao Laapataa Ladies Best Actor in Leading Role (Male) Abhishek Bac...