Tuesday, 16 July 2019

తెలంగాణలో ప్రైవేటు వర్సిటీల చట్టం

తెలంగాణలో ప్రైవేటు వర్సిటీల చట్టం

తెలంగాణ రాష్ట్రంలో ప్రైవేటు యూనివర్సిటీల చట్టం అమల్లోకి వచ్చింది.
Current Affairsతెలంగాణ స్టేట్ ప్రైవేటు యూనివర్సిటీస్ (ఎస్టాబ్లిష్‌మెంట్ అండ్ రెగ్యులేషన్) యాక్ట్-2018ని అమల్లోకి తెస్తూ విద్యాశాఖ కార్యదర్శి బి.జనార్దన్‌రెడ్డి జూలై 15న జీవో 17 జారీ చేశారు. అయితే చట్టం అమలుకు సంబంధించిన మార్గదర్శకాలను ఇంకా జారీ చేయలేదు. 2018, మార్చి 28వ తేదీన రాష్ట్ర అసెంబ్లీలో ప్రైవేటు యూనివర్సిటీల చట్టం బిల్లు పాస్ అయింది.

చట్టంలోని ప్రధాన అంశాలు.. 
  • ప్రపంచస్థాయి యూనివర్సిటీలను ఈ చట్టం ద్వారా ఏర్పాటుకు అనుమతి ఇవ్వడం జరగుతుంది
  • ఈ చట్టం కింద ఏర్పాటయ్యే విద్యా సంస్థలకు పూర్తి స్వయం ప్రతిపత్తి ఉంటుంది. కోర్సుల నిర్వహణ, ప్రవేశాల విధానం ఆయా యూనివర్సిటీలే నిర్ణయిస్తాయి. తెలంగాణ విద్యార్థులకు మాత్రం 25 శాతం సీట్లు కల్పించాలి.
  • వాటిల్లో ఫీజులను యూనివర్సిటీనే నిర్ణయిస్తుంది. ప్రతి వర్సిటీ ఫీ ఫిక్సేషన్ కమిటీని ఏర్పాటు చేసి ఫీజులను ఖరారు చేయాలి
  • లింగ వివక్ష, ప్రాంతం, కులం, పుట్టిన ప్రదేశం, మతం, రాజకీయ కోణం, ఇతర కారణాలతో ఎవరికీ ప్రవేశాలను తిరస్కరించడానికి వీల్లేదు. ఈ నిబంధనలు కొత్తగా వర్సిటీని ఏర్పాటు చేసే సంస్థలకు వర్తిస్తాయి
  • యూనివర్సిటీలు ఏర్పాటైన ఐదేళ్లలోగా నేషనల్ అసేస్‌మెంట్ అండ్ అక్రెడిటేషన్ కౌన్సిల్ నుంచి గుర్తింపు పొందాలి
  • ఈ యూనివర్సిటీలు యూజీసీ, ఏఐసీటీఈ, ఎంసీఐ, ఎన్సీటీఈ తదితర జాతీయ స్థాయి విద్యా సంస్థల నిబంధనలకు లోబడే కోర్సులను రూపొందించాలి
  • యూనివర్సిటీని తెలంగాణ రాష్ట్ర భౌగోళిక పరిధిలోనే ఏర్పాటు చేయాలి. ఇవి మరే కాలేజీలకు గుర్తింపు ఇవ్వడానికి వీల్లేదు
  • ప్రభుత్వం నుంచి ఎలాంటి గ్రాంట్స్ ఉండవు. గౌరవ డిగ్రీలు కూడా ఇచ్చుకోవచ్చు
  • ప్రపంచంలో ఏ యూనివర్సిటీతోనైనా ఒప్పందం చేసుకోవచ్చు
  • నిధుల సేకరణ విషయంలో ఎలాంటి నిబంధనలు లేవు.
  • ప్రభుత్వ అనుమతి లేకుండా యూనివర్సిటీ మూసివేయకూడదు.

No comments:

ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ 2025: పూర్తి విజేతల జాబితా, ముఖ్యాంశాలు & ముఖ్య క్షణాలు

  Category Winner(s) Film Best Film – Laapataa Ladies Best Director Kiran Rao Laapataa Ladies Best Actor in Leading Role (Male) Abhishek Bac...