Thursday, 23 January 2020

23 rd January 2019 CURRENT AFFAIRS from EENADU

23 rd January 2019  CURRENT AFFAIRS from  EENADU 


ఐదుగురు తెలుగు చిన్నారులకు ప్రధానమంత్రి బాలశక్తి పురస్కారాలు


గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రతి సంవత్సరం అందించే ‘ప్రధానమంత్రి రాష్ట్రీయ బాలశక్తి పురస్కార్-2020’ను తెలుగు రాష్ట్రాలకు చెందిన ఐదుగురు చిన్నారులు అందుకున్నారు. బుధవారం రాష్ట్రపతి భవన్లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ చేతుల మీదుగా వీటిని స్వీకరించారు. కళలు-సంస్కృతి, సాహసం, నవకల్పన, పాండిత్యం, సామాజికసేవ, క్రీడల విభాగాల్లో విశేష ప్రతిభ కనబరిచిన 5 నుంచి 18 ఏళ్లలోపు పిల్లలకు రూ.లక్ష నగదు బహుమతి, ప్రశంసా పత్రం అందించారు. ఇందులో తెలంగాణ నుంచి ఇంద్రజాలంలో అద్భుత ప్రతిభ కనబరుస్తున్న దర్శ్మలాని (కళలు-సంస్కృతి), 10 మీటర్ల ఎయిర్పిస్టల్ విభాగంలో జాతీయ రికార్డు   నెలకొల్పిన ఇషా సింగ్, మౌంట్ కిలిమంజారో, మౌంట్ ఖుషీకోజ్ అధిరోహించినందుకు సామాన్యు పోతురాజు (క్రీడలు) ఉన్నారు.   కర్ణాటక సంగీతంలో అద్భుత ప్రతిభ కనబరుస్తూ దేశ విదేశాల్లో ప్రదర్శనలు ఇచ్చినందుకు శరణ్య ముదుండి (కళలు-సంస్కృతి), అంతర్జాతీయ రోలర్ స్కేటింగ్లో స్వర్ణ పతకం గెలుచుకున్నందుకు ఆకుల సాయి సంహిత (క్రీడలు) ఆంధ్రప్రదేశ్ నుంచి ఈ గౌరవ పురస్కారాలు అందుకున్నారు.

ప్రజాస్వామ్య సూచీలో దిగజారిన భారత్.


ప్రజాస్వామ్య సూచీ ప్రపంచ ర్యాంకింగ్ లో భారత్ స్థానం దిగజారింది. అంతకుముందు సంవత్సరంతో పోల్చితే 2019లో పది స్థానాలను కోల్పోయింది. క్రమేణా పౌరహక్కులను అణచి వేయడమే ఇందుకు ప్రధాన కారణమని ది ఎకనమిస్ట్  ఇంటెలిజెన్స్ యూనిట్ జరిపిన ప్రపంచ వ్యాప్త సర్వేలో వెల్లడయింది. ప్రజాస్వామ్య సూచీ ప్రపంచ ర్యాంకింగ్  విషయంలో 2019లో భారత్ 6.90 స్కోరు సంపాదించి 51వ స్థానంలో నిలిచింది. అదే 2018లో 7.23 స్కోరు పొందింది.. మొత్తం 165 స్వతంత్ర దేశాలు, రెండు ప్రాంతాల్లో సర్వే నిర్వహించారు. ఎన్నికల ప్రక్రియ, బహుళత్వం, ప్రభుత్వ పనితీరు, రాజకీయ పార్టీల భాగస్వామ్యం, రాజకీయ సంస్కృతి, పౌర హక్కులు అనే అయిదు అంశాలను ఆధారం చేసుకొని స్కోరు ఇచ్చింది. 8 కన్నా ఎక్కువ స్కోరు వస్తే ‘సంపూర్ణ ప్రజాస్వామ్యం’, 8-6ల మధ్య స్కోరు ఉంటే ‘బలహీన ప్రజాస్వామ్యం’, 6-4 మధ్య స్కోరు ఉంటే ‘హైబ్రిడ్  పరిపాలన’, 4 కన్నా తక్కువ స్కోరు ఉంటే ‘నియంతృత్వం’ అన్న వర్గీకరణ చేసింది. ఈ మేరకు భారత్ బలహీన ప్రజాస్వామ్యం అన్న వర్గంలో చేరింది. బ్రెజిల్ కన్నా కేవలం ఒక్క స్థానం ముందుండడం గమనార్హం. 6.86 స్కోరుతో ఆ దేశం 52వ స్థానంలో ఉంది.
చైనాకు 2.26 స్కోరు (153వ ర్యాంకు), పాకిస్థాన్కు 4.25 (108వ ర్యాంకు), శ్రీలంకకు 6.27 (69వ స్థానం), బంగ్లాదేశ్కు 5.88 (80వ స్థానం), రష్యాకు 3.11 స్కోరు (134వ స్థానం) లభించాయి. చిట్టచివరిదైన 167వ స్థానంలో దక్షిణ కొరియా నిలిచింది. మొదటి పది స్థానాల్లో... నార్వే (1), ఐస్లాండ్ (2), స్వీడన్ (3), న్యూజిలాండ్ (4), ఫిన్లాండ్ (5), ఐర్లండ్ (6), డెన్మార్క్ (7), కెనడా (8), ఆస్ట్రేలియా (9), స్విట్జర్లాండ్ (10) ఉన్నాయి.

ప్రపంచ ప్రతిభా సూచీలో భారత్కు 72వ స్థానం


ప్రపంచ ప్రతిభా పోటీతత్వ సూచీలో భారత్ ఎనిమిది స్థానాలను మెరుగుపరుచుకుని 72వ స్థానంలో నిలిచింది. ప్రతిభను పెంచడం, ఆకర్షించడం, కాపాడుకోవడంలో ఆయా దేశాల సామర్థ్యాలను బేరీజు వేసి ఈ సూచీలో ర్యాంకులు కేటాయిస్తారు. 132 దేశాలతో రూపొందించిన ఈ సూచీలో స్విట్జర్లాండ్  మొదటి స్థానంలో నిలిచింది. అమెరికా, సింగపూర్లు 2, 3 స్థానాలు దక్కించుకున్నాయి.

శిఖరాగ్రానికి తరుణ్జోష్

మంచు ఖండమైన అంటార్కిటికాలోని 4,897 మీటర్ల ఎత్తెన పర్వతం విన్సన్ మాసిఫ్ను హైదరాబాద్ పోలీస్ సంయుక్త కమిషనర్ తరుణ్జోషి అధిరోహించారు. పర్వతారోహణలో భాగంగా కొద్దిరోజుల క్రితం ఆయన అంటార్కిటికాకు వెళ్లారు. భారత కాలమానం ప్రకారం ఈ నెల 16న ఉదయం 8.30 గంటలకు విన్సన్ మాసిఫ్ శిఖరాగ్రాన్ని ఆయన చేరుకున్నారు. తరుణ్జోషి హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్లో ప్రత్యేక విభాగం సంయుక్త కమిషనర్గా విధులు నిర్వహిస్తున్నారు. మంచు పర్వతాలను అధిరోహించడంపై మక్కువ పెంచుకున్న తరుణ్జోషి నాలుగు నెలల వ్యవధిలోనే రెండు మంచు పర్వతాల శిఖరాగ్రాలను చేరుకున్నారు. గత ఏడాది ఆగస్టులో ఇండోనేసియాలోని పపువా ద్వీపంలో ఉన్న కార్స్టెన్జ్(4,884 మీటర్లు) పర్వతంపైకి ఎక్కారు. మంచు, రాళ్లతో కూడిన ఈ పర్వతాన్ని ఎక్కిన రెండో భారతీయుడిగా ఆయన ఘనత సాధించారు.

అధ్యక్షుడు కోవింద్ ప్రధాన మంత్రి రాష్ట్రీయ బాల్ పురస్కర్ 2020 ను సమర్పించారు

అధ్యక్షుడు రామ్ నాథ్ కోవింద్ 2020 లో ప్రధాన్ మంత్రి రాష్ట్రీయ బాల్ పురస్కర్ ను న్యూ Delhi ిల్లీలోని రాష్ట్రపతి భవన్ లో సమర్పించారు. వివిధ రంగాలలో పిల్లలు సాధించిన అసాధారణమైన విజయాలను గుర్తించడానికి ప్రతి సంవత్సరం బాల్ పురస్కర్ ప్రభుత్వం ఇస్తుంది. ఈ రంగాలు ఆవిష్కరణ, విద్యావిషయక విజయాలు, సామాజిక సేవ, కళలు మరియు సంస్కృతి, క్రీడలు మరియు ధైర్యం. ఈ సంవత్సరం జాతీయ ధైర్య పురస్కారాలకు ఎంపికైన 22 మంది పిల్లలు కూడా రాష్ట్రపతి నుండి అవార్డులను అందుకున్నారు.

భారత మాజీ క్రికెటర్ మన్మోహన్ సూద్ కన్నుమూశారు

భారత మాజీ టెస్ట్ బ్యాట్స్‌మన్, జాతీయ సెలెక్టర్ మ్యాన్ మోహన్ సూద్ కన్నుమూశారు. అతను 1 సెంచరీతో 1 టెస్ట్ మరియు 39 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడాడు. అతను 1960 లో మద్రాసులో ఆస్ట్రేలియాలోని రిచీ బెనాడ్‌తో తన ఒంటరి టెస్ట్ మ్యాచ్ ఆడాడు.

భారతదేశ 71 వ రిపబ్లిక్ డే ముఖ్య అతిథిగా బ్రెజిల్ అధ్యక్షుడు జె. ఎం. బోల్సోనారో


జనవరి 26 న న్యూ డిల్లీలోని రాజ్ పాత్లో 71 వ రిపబ్లిక్ డే పరేడ్లో బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ మెస్సియాస్ బోల్సోనారో ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. దేశం యొక్క రిపబ్లిక్ డే కార్యక్రమంలో భారతదేశం బ్రెజిల్ నాయకుడిని ముఖ్య అతిథిగా ఆహ్వానించడం ఇది మూడవసారి. న్యూ Delhi ిల్లీ 1996 లో వేడుకలకు ఫెర్నాండో హెన్రిక్ కార్డోసోను ఆహ్వానించింది మరియు 2004 లో గౌరవ అతిథిగా లూయిజ్ ఇనాసియో లూలా డా సిల్వాకు ఆతిథ్యం ఇచ్చింది.

PLEASE INSTALL NEWS JAAGA  APP FOR DAILY NEWS & CURRENT AFFAIRS         



No comments:

telangana neighbouring states

One of India's largest states, Telangana is situated in the heart of the Indian subcontinent. Telangana State is bordered by the states ...