Saturday, 25 January 2020

25 th January 2020 current affairs telugu eenadu


25 th January 2020 current affairs telugu
కిలిమంజారోపై మెరిసిన పేదింటి కిరణం


కృషి, పట్టుదల ఉంటే ఎంతటి లక్ష్యమైనా పాదాక్రాంతం కావాల్సిందేనని నిరూపించింది మహబూబ్నగర్జిల్లాకు చెందిన విద్యార్థిని లక్ష్మి. శుక్రవారం సాయంత్రం ఆమె దక్షిణాఫ్రికాలోని అత్యున్నత పర్వతం కిలిమంజారోను అధిరోహించి అబ్బురపరిచింది.
మద్దూరు మండలం చెన్వార్గ్రామానికి చెందిన కాశమ్మ, ఎల్లప్ప దంపతుల కుమార్తె మీదింటి లక్ష్మి. చిన్నతనంలోనే ఆమె తల్లి మృతిచెందింది. తండ్రి హైదరాబాద్లో కూలిపనులు చేస్తారు. క్రమంలో ఎన్నో కష్టాలకోర్చుతూ మహబూబ్నగర్సాంఘిక సంక్షేమ గురుకులంలో డిగ్రీ(ద్వితీయ) చదువుతోంది. తెలంగాణ రాష్ట్రం నుంచి కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించేందుకు ఇద్దరికి అవకాశం రాగా.. అందులో లక్ష్మి ఒకరు. నెల 17 విద్యార్థిని దక్షిణాఫ్రికా చేరుకొంది. 18 పర్వతారోహణ ప్రారంభించింది. శుక్రవారం సాయంత్రŸ 4 గంటలకల్లా విజయవంతంగా కిలిమంజారో శిఖరానికి చేరింది.


తెలంగాణకు జాతీయ -పరిపాలన పురస్కారం
తెలంగాణ ప్రభుత్వ బ్లాక్చెయిన్ప్రాజెక్టును దిల్లీలోని జాతీయ -పరిపాలన మండలి నూతన సాంకేతికత విభాగంలో మొదటి స్థానానికి ఎంపిక చేసింది. వచ్చే నెల ఏడో తేదీన ముంబయిలో జరిగే కార్యక్రమంలో స్వర్ణ పతకాన్ని తెలంగాణ ప్రభుత్వానికి ప్రదానం చేయనుంది.
మేరకు తెలంగాణ ప్రభుత్వానికి జాతీయ -పరిపాలన మండలి శుక్రవారం సమాచారం అందించింది. విలువైన, రహస్యమైన సమాచారాన్ని ఇతరులు తస్కరించకుండా సాంకేతిక భద్రత కల్పించేందుకు ఉద్దేశించిన బ్లాక్చెయిన్విధానాన్ని తెలంగాణ ప్రభుత్వం చేపట్టింది.

టర్కీలో భారీ భూకంపం : 14 మంది మృతి

టర్కీకి తూర్పున ఉన్న ఇలాజిజ్ ఫ్రావిన్స్లోని సివ్రిస్ జిల్లాలో భారత కాలమానం ప్రకారం శుక్రవారం రాత్రి భారీ భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.8గా నమోదైంది. ఘటనలో సుమారు 14 మంది మృతి చెందారు. 500మందికి పైగా గాయాలపాలయ్యారు. భూకంపం ధాటికి నివాసితులు ఇళ్లు వదిలి వీధుల్లోకి పరుగెత్తారు. టర్కీ విపత్తు, అత్యవసర నిర్వహణ అథారిటీ తెలిపిన వివరాల ప్రకారం భూకంపం తర్వాత 60 ప్రకంపనలు నమోదయ్యాయి. పొరుగు దేశాలైన సిరియా, లెబనాన్లోనూ భూప్రకంపనలు సంభవించాయి

ఐటీ శాఖ మంత్రి కె.తారక రామారావుకి అరుదైన గౌరవం



తెలంగాణ రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కె.తారక రామారావుకి అరుదైన గౌరవం దక్కింది.
వరల్డ్ ఎకనామిక్ ఫోరం (డబ్ల్యూఈఎఫ్) ప్రత్యేక ఆహ్వానం మేరకు జనవరి 23న జరిగిన ‘వరల్డ్ ఎకనామిక్ లీడర్స్’ సమావేశంలో కేటీఆర్ పాల్గొన్నారు. ‘సాంకేతిక అభివృద్ధి వేగాన్ని కొనసాగించడం-సాంకేతిక ఆధారిత పరిపాలన’ అనే అంశంపై ఈ సమావేశాన్ని నిర్వహించారు. సాధారణంగా ఈ సమావేశానికి ప్రభుత్వాధినేతలు, కేంద్ర ప్రభుత్వాల విధానరూపకర్తలైన సీనియర్ మంత్రులను మాత్రమే ఆహ్వానిస్తారు. ఈ సమావేశానికి హాజరైనవారిలో రాష్ట్ర మంత్రి స్థాయిలో కేటీఆర్ ఒక్కరే ఉన్నారు.
ప్రపంచంలోనే అతిచిన్న బంగారు నాణెం
పరిమాణం పరంగా ప్రపంచంలోనే అతి చిన్న బంగారు నాణేన్ని స్విట్జర్లాండ్ ప్రభుత్వం తయారు చేసింది.


ఈ నాణెంపై ప్రఖ్యాత శాస్త్రవేత్త ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ తన నాలుకను బయటపెట్టి వెక్కిరిస్తున్నట్లున్న చిత్రాన్ని ఒకవైపు, నాణెం విలువను తెలిపే 1/4 స్విస్ ఫ్రాంక్స్‌ను మరోవైపు ముద్రించింది. 0.0163 గ్రాముల బంగారంతో రూపొందించిన ఈ నాణెం పరిమాణం 2.96 మిల్లీమీటర్లుగా ఉందని స్విస్‌మింట్ జనవరి 23న వెల్లడించింది. ఇటువంటి 999 నాణేలను మాత్రమే ముద్రించామనీ, ఒక్కో నాణెం వెల సుమారు రూ.18 కాగా రూ.14,657కు విక్రయిస్తామని తెలిపింది. నాణెంతోపాటు దానిపైని ఐన్‌స్టీన్ చిత్రం చూసేందుకు కొనుగోలుదారులకు కళ్లద్దాలు కూడా అందజేస్తామని వివరించింది.


ఏమిటీ కరోనా వైరస్
జలుబు నుంచి తీవ్రస్థాయి శ్వాసకోశ వ్యాధులకు కారణమైన వైరస్ కుటుంబానికి చెందింది. ఎంఈఆర్ఎస్, సార్స్ వంటి వాటిని ఇప్పటికే గుర్తించగా.. ఏడవ రకం వైరస్ అయిన కరోనా వైరస్ను వూహాన్లో తొలిసారి గుర్తించారు.

వ్యాప్తి ఇలా..
·         వైరస్ జంతువుల్లోను, జంతువుల నుంచి మనుషులకూ వ్యాప్తి చెందగలదు.
·         గాలి ద్వారా ఇతర ఇతరులకు సోకుతుంది. వైరస్ బారినపడ్డ వారికి సన్నిహితంగా ఉన్నా ప్రమాదమే.
·         వూహాన్లోని సముద్ర ఉత్పత్తుల మార్కెట్.. వ్యాధికి కేంద్ర స్థానమని భావిస్తున్నారు.
వ్యాధి లక్షణాలు : జ్వరం, దగ్గు; శ్వాసతీసుకోవడంలో సమస్యలు; ఉదరకోశ సమస్యలు; విరోచనాలు
వ్యాధి ముదిరితే : న్యుమోనియా; సివియర్ అక్యూట్; రెస్పిరేటరీ సిండ్రోమ్; మూత్రపిండాల వైఫల్యం; మరణం
చికిత్స : ప్రస్తుతానికి రకమైన యాంటీ రెట్రోవైరల్ మందులు, టీకాలు అందుబాటులో లేవు. వ్యాధి లక్షణాలకు మాత్రమే చికిత్స కల్పించవచ్చు.


No comments:

ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ 2025: పూర్తి విజేతల జాబితా, ముఖ్యాంశాలు & ముఖ్య క్షణాలు

  Category Winner(s) Film Best Film – Laapataa Ladies Best Director Kiran Rao Laapataa Ladies Best Actor in Leading Role (Male) Abhishek Bac...