Monday, 4 February 2019

కేంద్ర పన్నుల్లో తెలంగానా రాష్ట్ర వాటా రూ.20 వేల కోట్లు

కేంద్ర పన్నుల్లో వాటా కింద తెలంగాణకు 2019-20 ఆర్థిక సంవత్సరంలో రూ.20,583.05 కోట్లు రానుంది. గతేడాది కంటే ఇది రూ.1,978 కోట్లు అధికం. అంటే 10% ఎక్కువ. 14వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు కేంద్ర పన్నుల్లో 2.437% మొత్తాన్ని కేంద్రం తెలంగాణకు ఇస్తోంది. 2018-19 ఆర్థిక సంవత్సరం అంచనాల ప్రకారం రాష్ట్రానికి రూ.17,960.01 కోట్లు రావాల్సి ఉండగా, సవరించిన అంచనాల నాటికి ఆ మొత్తం రూ.18,560.88 కోట్లకు పెరిగింది. అంటే తొలి అంచనాల కంటే రూ.600 కోట్లు అధికంగా వచ్చింది.కార్పొరేట్‌, సీజీఎస్‌టీ, ఆదాయ పన్ను రూపంలో కేంద్రం నుంచి అధిక మొత్తంలో వాటా రాష్ట్రానికి దక్కుతోంది.

No comments:

ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ 2025: పూర్తి విజేతల జాబితా, ముఖ్యాంశాలు & ముఖ్య క్షణాలు

  Category Winner(s) Film Best Film – Laapataa Ladies Best Director Kiran Rao Laapataa Ladies Best Actor in Leading Role (Male) Abhishek Bac...