మహిళా శిశు అభివృద్ధి మంత్రిత్వశాఖకు కేంద్రప్రభుత్వం ఈ బడ్జెట్‌లో రూ.29 వేల కోట్లను కేటాయించింది. గత ఏడాదితో పోలిస్తే ఈ దఫా కేటాయింపులను 20 శాతం పెంచింది. ప్రసూతి కార్యక్రమాలకు కేటాయింపులను రెట్టింపు చేస్తూ నిర్ణయం తీసుకుంది.
* ప్రధానమంత్రి మాతృవందన యోజన (పీఎంఎంవీవై)కు రూ.2,500 కోట్ల కేటాయింపు.
* సమగ్ర శిశు అభివృద్ధి సేవల(ఐసీడీఎస్) కింద చిన్నారుల సంరక్షణ సేవా కార్యకమ్రాలకు రూ.1500 కోట్ల కేటాయింపు.
* మహిళా శిశు అభివృద్ధి మంత్రిత్వశాఖకు రూ.29,164.90 కోట్ల కేటాయింపు.
* ‘బేటీ బచావో బేటీ పఢావో’ పథకానికి రూ.280 కోట్లు.
* ‘జాతీయ పౌష్టికాహార కార్యక్రమాని(ఎన్‌ఎన్‌ఎం)’కి రూ.3,400 కోట్లు.
* ‘మహిళా శక్తికేంద్రాల’కు రూ.150 కోట్లు.
* ఉద్యోగినులు కార్యాలయాల నుంచి తిరిగి వచ్చే వరకూ వారి పిల్లల ఆలనాపాలనా చూసే కేంద్రాలకు సంబంధించిన జాతీయ క్రెచ్ పథకానికి రూ.50 కోట్ల కేటాయింపు.
* వర్కింగ్ విమెన్స్ హాస్టల్ పథకానికి రూ.165 కోట్లు.
* అక్రమ రవాణా బాధితుల పునరావాస కార్యక్రమం ‘ఉజ్వల’కు రూ.30 కోట్ల కేటాయింపు.
* వితంతు శరణాలయాలకు బడ్జెట్ కేటాయింపులు రూ.15 కోట్లు
No comments:
Post a Comment