కెనరా బ్యాంకుకు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న పీవీ భారతిని కార్పొరేషన్ బ్యాంకుకు మేనేజింగ్ డైరెక్టర్, ముఖ్య కార్యనిర్వహణ అధికారి CEO గా నియమిస్తున్నట్లు కార్పొరేషన్ బ్యాంకు తెలిపింది. బ్యాంకు చరిత్రలోనే ఒక మహిళకు ఈ హోదా దక్కడం ఇదే ప్రథమం.
సెప్టెంబరు 15, 2016 నుంచి ఆమె కెనరా బ్యాంకుకు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా సేవలందిస్తున్నారు. బ్యాంకింగ్ రంగంలో ఆమెకు 37 సంవత్సరాల కంటే ఎక్కువ అనుభవం ఉంది. ఇప్పటి వరకు ఆమె తమిళనాడు, నేషనల్ కాపిటల్ రీజియన్(ఎన్‌సీఆర్) పరిధిలోని వివిధ శాఖల్లో విధులు నిర్వర్తించారు.
- Corporation Bank Headquarters: Mangalore
No comments:
Post a Comment