Monday, 4 February 2019

6న జీశాట్‌-31 ఉపగ్రహ ప్రయోగం

  • భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) ఈనెల ఆరో తేదీన ఫ్రెంచి గయానాలోని కౌరు అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి జీశాట్‌-31 ఉపగ్రహాన్ని నింగిలోకి పంపేందుకు సన్నాహాలు చేస్తోంది.
  •  భారత కాలమానం ప్రకారం ఈనెల ఆరో తేదీన వేకువజామున 2.31 గంటలకు ప్రయోగం చేపట్టనున్నారు. 
  • దీని ద్వారా 2,535 కిలోల బరువున్న జీశాట్‌-31 ఉపగ్రహాన్ని నిర్ణీత కక్ష్యలో ప్రవేశ పెట్టనున్నారు.
  • ఇది ఇస్రోకు చెందిన 40వ కమ్యూనికేషన్‌ ఉపగ్రహం.
  • జీవితకాలం 15 ఏళ్లు. ఇన్సాట్‌-4సీఆర్‌కు ప్రత్యామ్నాయంగా జీశాట్‌-31 ఉపగ్రహాన్ని కక్ష్యలోకి పంపుతున్నారు.
  • సోమవారం రాకెట్‌ సన్నద్ధత సమావేశం జరగనుంది.
  • ఆ తర్వాత ఫైనల్‌ కౌంట్‌డౌన్‌ ప్రారంభిస్తారు.
  • జీశాట్‌-31 ఉపగ్రహం హైస్పీడు ఇంటర్నెట్‌ సేవలకు, టెలి కమ్యూనికేషన్‌ ప్రసారాలకు ఉపయోగపడనుంది.
  • కేంద్రం ఈసారి భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో)కు రూ.10,252 కోట్లకుపైగా బడ్జెట్‌ను కేటాయించింది.
  • ఇప్పటివరకు ఇంత పెద్ద మొత్తంలో బడ్జెట్‌ కేటాయింపులు లేవు.
  • 2018-19 ఆర్థిక సంవత్సరానికి రూ.9,918 కోట్లను కేటాయించింది.
  • ఈ ఏడాది ఇస్రో 32 ప్రయోగాలు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.
  • ఇందులో 14 వాహక నౌకలు, 17 ఉపగ్రహాలు, ఒక టెక్‌డెమో మిషన్‌ ఉన్నాయి.

No comments:

ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ 2025: పూర్తి విజేతల జాబితా, ముఖ్యాంశాలు & ముఖ్య క్షణాలు

  Category Winner(s) Film Best Film – Laapataa Ladies Best Director Kiran Rao Laapataa Ladies Best Actor in Leading Role (Male) Abhishek Bac...