Wednesday, 6 February 2019

పోప్‌ఫ్రాన్సిస్‌ మూడురోజుల పర్యటన నిమిత్తం ముస్లిం దేశమైన యూఏఈ పర్యటనకు వచ్చారు

కేథలిక్‌ ప్రపంచానికి మతగురువైన పోప్‌ఫ్రాన్సిస్‌ మూడురోజుల పర్యటన నిమిత్తం ముస్లిం దేశమైన యూఏఈ పర్యటనకు వచ్చారు. పోప్‌ ఇలా ఓ ముస్లిందేశానికి పర్యటనకు రావడం ఇదే ప్రథమం. అధ్యక్ష భవనంలో అక్కడ ఆయనకు అత్యంతఘనమైన రీతిలో స్వాగతం లభించింది. పరస్పరసహకారం, సుహృద్భావపూరిత సహచ్కీజీజివనం తదితర అనేక అంశాలు పోప్‌, యువరాజు ప్రిన్స్‌మొహమ్మద్‌ బిన్‌ జయేద్‌ల మధ్య జరిగిన చర్చల్లో  ప్రస్తావనకు వచ్చాయి.
ప్రపంచవ్యాప్తంగా ఉన్న కేథలిక్‌ల మతగురువైన పోప్‌ ఫ్రాన్సిస్‌.. అత్యున్నత స్థాయి సున్నీ మతగురువు షేక్‌ అహ్మద్‌ అల్‌ తయేబ్‌తో సమావేశమయ్యారు. యూఏఈలో ఉన్న అన్ని మతాల ప్రజల హక్కులకు కచ్చితమైన గుర్తింపు.,సంపూర్ణస్వేచ్ఛ ఉండాలని పోప్‌ఫ్రాన్సిస్‌ ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. 

No comments:

ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ 2025: పూర్తి విజేతల జాబితా, ముఖ్యాంశాలు & ముఖ్య క్షణాలు

  Category Winner(s) Film Best Film – Laapataa Ladies Best Director Kiran Rao Laapataa Ladies Best Actor in Leading Role (Male) Abhishek Bac...