Saturday, 14 September 2019

శాసన కమిటీల నియామకంపై ముఖ్యమంత్రి కేసీఆర్ కసరత్తు :

i. రాష్ట్ర శాసనసభ, మండలిలో మొత్తం 21 కమిటీలు ఉంటాయి.
ii. వీటిలో సౌకర్యాలు, పర్యావరణ కమిటీలకు శాసనసభాపతి ఛైర్మన్గా ఉంటారు.
iii. మిగిలిన వాటికి ఛైర్మన్లను, సభ్యులను ముఖ్యమంత్రి ఎంపిక చేసి సభాపతికి పేర్లను పంపనున్నట్లు తెలిసింది.
iv. గత డిసెంబరులో అసెంబ్లీ ఎన్నికలు జరిగి తెలంగాణలో రెండోసారి తెరాస ప్రభుత్వం ఏర్పాటు కాగా.. అప్పటి నుంచి కమిటీల నియామకం జరగలేదు.
v. ఇందులో భాగంగా శాసనసభ, మండలి కమిటీలను ప్రకటించబోతున్నారు. కమిటీ ఛైర్మన్కు ప్రత్యేక ప్రొటోకాల్ ఉంటుంది.
vi. వీటిలో ప్రజాపద్దుల సంఘం కీలకమైంది. కాగ్ నివేదికలను పరిశీలించి, అందులో లేవనెత్తిన లోపాలపై ప్రభుత్వాన్ని, ప్రభుత్వ శాఖలను ప్రశ్నించే అవకాశం ఉంటుంది.
vii. శాసనసభ, మండలిలో కలిసి తెరాసకు 137 మంది సభ్యులున్నారు. వీరిలో సీఎం కాకుండా 17 మందికి మంత్రి పదవులు ఉన్నాయి. మండలి ఛైర్మన్, ఉప ఛైర్మన్, శాసనసభాపతి, ఉపసభాపతి, ఇద్దరు చీఫ్ విప్లు, సభలో ఆరుగురు, మండలిలో నలుగురు చొప్పున విప్లు ఉన్నారు.
viii. ఒక్కో కమిటీలో పది మంది వరకు సభ్యులను నియమించవచ్చు.
ix. పీఏసీ ఛైర్మన్ పదవిని సంప్రదాయం ప్రకారం ప్రతిపక్షానికి ఇవ్వాలి. ప్రస్తుతం శాసనసభలో కాంగ్రెస్కు ప్రతిపక్ష హోదా లేదు. తెరాస మిత్రపక్షమైన మజ్లిస్ రెండో అతిపెద్ద పార్టీగా ఉంది.

No comments:

ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ 2025: పూర్తి విజేతల జాబితా, ముఖ్యాంశాలు & ముఖ్య క్షణాలు

  Category Winner(s) Film Best Film – Laapataa Ladies Best Director Kiran Rao Laapataa Ladies Best Actor in Leading Role (Male) Abhishek Bac...