Saturday, 14 September 2019

ఆదర్శ ఐఏఎస్ యుగంధర్ ఇకలేరు :

అభివృద్ధి పథకాల రూపకల్పనతో పాటు ఐటీడీఏ, పేదరిక నిర్మూలనా సంస్థ (సెర్ప్) ఏర్పాటులో కీలకపాత్ర పోషించిన విశ్రాంత సీనియర్ ఐఏఎస్ అధికారి, మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల తండ్రి బీఎన్ యుగంధర్ (82) హైదరాబాద్లో కన్నుమూశారు.
వాటర్షెడ్ కార్యక్రమం, కరవు నివారణ పథకం, జాతీయ ఉపాధి హామీ పథకం, సమాచారహక్కు చట్టం.. ఇలా అనేక కీలకమైన చట్టాలు, విధానాల రూపకల్పనలో ఈయనది ప్రత్యేక పాత్ర.
పి.వి.నరసింహారావు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు యుగంధర్, కేఆర్ వేణుగోపాల్లు ఆయన కార్యదర్శులుగా పనిచేసేవారు. కేంద్ర ప్రణాళికాసంఘం సభ్యుడిగా తనదైన ముద్ర వేశారు.
1937 అక్టోబరు 22న జన్మించిన యుగంధర్ది అనంతపురం జిల్లా యల్లనూరు మండలం బుక్కాపురం గ్రామం. శ్రీవెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ఆర్థికశాస్త్రంలో ఎం.ఎ చదివారు.
1962లో ఐఏఎస్కు ఎంపికయ్యారు. పదవీ విరమణ చేసిన తర్వాత ఆంధ్రప్రదేశ్ పేదరిక నిర్మూలనా సంస్థ (సెర్ప్) ఏర్పాటులో కీలకపాత్ర పోషించడమే కాదు, ఆ సంస్థకు ఉపాధ్యక్షుడిగా పని చేశారు.
2004లో కేంద్రంలో ఏర్పడిన యూపీయే ప్రభుత్వంలో ప్రణాళికా సంఘం సభ్యునిగా పని చేశారు.

No comments:

ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ 2025: పూర్తి విజేతల జాబితా, ముఖ్యాంశాలు & ముఖ్య క్షణాలు

  Category Winner(s) Film Best Film – Laapataa Ladies Best Director Kiran Rao Laapataa Ladies Best Actor in Leading Role (Male) Abhishek Bac...