అరుణ్ జైట్లీ
గురించి సంక్షిప్తంగా..
1. అరుణ్ జైట్లీ 1952లో పంజాబ్‌లో జన్మించారు .
2. తల్లి రతన్‌ప్రభ(అమృత్‌సర్), తండ్రి మహరాజ్ కిషన్ జైట్లీ(లాహోర్)
3. తండ్రి ప్రముఖ న్యాయవాది. దేశ విభజన తరువాత
వీరు అమృత్‌సర్‌లో స్థిరపడ్డారు.
4. జైట్లీ సెయింట్ గ్జావియర్స్ మిషనరీ స్కూల్‌లో
చదివారు. డిగ్రీ, న్యాయశాస్త్రంలో పట్టా పొందారు.
5. ఇందిరా గాంధీ ఎమర్జెన్సీ విధించిన సమయంలో
ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థి సంఘం(ఏబీవీపీ) అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఇది
జైట్లీ తొలి విజయం. అప్పుడు ఈయన లా చదువుతున్నారు.
6. అంతేకాదు ఆ సమయంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా
వ్యవహరించినందుకు అరెస్టు కావడంతో 19 నెలల జైలులోనే ఉండాల్సి వచ్చింది.
7. 1982లో సంగీతను వివాహం చేసుకున్నారు. రోహన్, సోనాలీ ఇద్దరు సంతానం.
8. 1986-87లో జనసంఘ్ పార్టీ(ఇప్పుటి భారతీయ జనతా
పార్టీ)లో చేరారు.
9. 1989లో వీపీ సింగ్ ప్రభుత్వాన్ని ఏర్పాటు
చేసినప్పుడు అడిషనల్ సోలిసిటర్ జనరల్‌గా జైట్లీని నియమించారు. అప్పటికి ఆ పదవి
నిర్వహించిన వారిలో అత్యంత పిన్నవయస్కుడు ఈయనే.
10. 1999లో తొలిసారి ఎన్‌డీఏ ప్రభుత్వంలో లా, సమాచార, ప్రసార, పెట్టుబడులు, నౌకాయాన, పరిశ్రమల శాఖల మంత్రిగా పనిచేశారు.
11. 2004లో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు
చేపట్టారు. తరువాత గుజరాత్ నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు.
12. 2009లో పార్టీ పదవికి రాజీనామా చేసి రాజ్యసభలో
ప్రతిపక్ష నేతగా బాధ్యతలు స్వీకరించారు.
13. 2014 ఎన్నికల్లో అమృత్‌సర్ నుంచి పోటీచేసి ఓటమి
చెందారు. గత మేలో కేంద్ర ఆర్థిక, రక్షణ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు.
No comments:
Post a Comment