Friday 29 November 2019

29th november 2019 current affairs

✍  కరెంట్ అఫైర్స్ 29 నవంబరు 2019 Friday ✍

ఇతర రాష్ట్రాలు / కేంద్ర పాలిత ప్రాంతాల వార్తలు

ADB approves 2nd tranche of USD 150 mn for West Bengal :

i. రాష్ట్రంలో మూలధన పెట్టుబడులు, మౌలిక సదుపాయాలను పెంచడానికి పశ్చిమ బెంగాల్‌కు 150 మిలియన్ డాలర్ల (సుమారు 1,065 కోట్ల రూపాయలు) రుణాన్ని ఆసియా అభివృద్ధి బ్యాంకు ఆమోదం తెలిపింది.
ii. ప్రభుత్వ రంగ సంస్థల ఆర్థిక ఆరోగ్యాన్ని పునరుద్ధరించడానికి పశ్చిమ బెంగాల్‌లో సమగ్ర ఆర్థిక సంస్కరణలను కొనసాగించడానికి 300 మిలియన్ డాలర్ల (సుమారు రూ .1,130 కోట్లు) రుణాన్ని ADB బోర్డు ఆమోదించింది. రెండు విభాగాలలో మధ్యస్థ వ్యయ చట్రాలను ప్రవేశపెట్టడం మరియు ఇంటిగ్రేటెడ్ టాక్స్ మానిటరింగ్ సిస్టమ్ అమలు చేయడం ఆమోదించింది.
అంతర్జాతీయ వార్తలు
పాక్ సైన్యాధిపతి పదవీ కాలం పొడిగింపు :

i. పాకిస్థాన్ సైన్యాధిపతి జనరల్ కమర్ జావేద్ బజ్వా పదవీ కాలాన్ని మరో ఆరు నెలల పాటు పెంచుతూ పాకిస్థాన్ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
ii. అయితే పదవీ కాలం పొడిగింపు, పునర్నియామకంపై పార్లమెంటు చట్టం చేయాల్సి ఉందంటూ షరతు విధించింది. దీన్ని అమలు చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. ప్రధాని ఇమ్రాన్ఖాన్కు జనరల్ బజ్వా అత్యంత సన్నిహితుడు కావడం విశేషం.
హాంకాంగ్ ఉద్యమకారులకు మద్దతుగా అమెరికా చట్టం :

i. హాంకాంగ్లో ప్రజాస్వామ్యం కోసం పోరాడుతున్న ఉద్యమకారులకు మద్దతుగా రూపొందిన ఒక బిల్లుపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంతకం చేశారు. దీనిపై చైనా తీవ్రంగా మండిపడింది.
ii. హాంకాంగ్కు ప్రస్తుతం ప్రత్యేక ‘అమెరికా వాణిజ్య పరిశీలన’ హోదా ఉంది. ఇది ఈ ప్రాంత ఆర్థిక వ్యవస్థకు ఉపయోగపడుతోంది. ఈ హోదాను కాపాడుకోవాలంటే హాంకాంగ్కు సరిపడిన స్థాయిలో స్వయంప్రతిపత్తి ఉందని అమెరికా విదేశాంగ శాఖ ఏటా ధ్రువీకరించాల్సి ఉంటుందని తాజా చట్టం స్పష్టంచేస్తోంది.
iii. హాంకాంగ్లో మానవ హక్కుల ఉల్లంఘనకు కారకులైన చైనా, హాంకాంగ్ అధికారులపై ఆంక్షలకూ ఇది వీలు కల్పిస్తుంది.
సైన్స్ అండ్ టెక్నాలజీ
పీఎస్ఎల్వీ-సి48 ప్రయోగం డిసెంబర్ 11న :
i. భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రమైన శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్ షార్ నుంచి వచ్చే నెల 11న పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్-సి48ను ప్రయోగించనున్నారు.
ii. పీఎస్ఎల్వీ-సి48 ద్వారా రీశాట్-2బీఆర్1తోపాటు విదేశాలకు చెందిన ఉపగ్రహాలను నిర్ణీతకక్ష్యలో ప్రవేశపెట్టనున్నారు.
Defence News
Bipin Rawat to be first Chief of Defence Staff :

i. General Bipin Rawat to be first Chief of Defence Staff. He will end his tenure as the Army Chief in December 2019.
ii. He will take over as the first Chief of Defence Staff – a four-star position being created as part of a defence management overhaul. He will get a term of 2 years as the CDS.
iii. He took over as the 27th Chief of Army Staff on 31 December 2016 after General Dalbir Singh retired.
India & Japan holds Mine Countermeasure Exercise (MINEX) 2019 :

i. A maiden bilateral exercise between the Indian Navy and the Japanese Maritime Self Defence Force (JMSDF) have conducted Mine Countermeasure Exercise (MINEX) 2019 at Kochi, Kerala.
ii. Officials of the Indian Navy and from the warships Bungo and Takashima of JMSDF’s Minesweeper (a naval ship that is deployed in removing naval mines) Division 3, commanded by Captain Seiji Ikubu took part in the exercise.
ఆర్థిక అంశాలు
రూ.10 లక్షల కోట్లకు రిలయన్స్ మార్కెట్ విలువ. తొలి భారతీయ కంపెనీగా రికార్డు :
 
i. రూ.10,000 కోట్ల త్రైమాసిక లాభాన్ని ఆర్జించిన భారతీయ తొలి ప్రైవేట్ కంపెనీగా రిలయన్స్ నిలిచింది. షేరు మార్కెట్ విలువ రూ.10,00,000 కోట్లకు చేరింది. ఆ వ్యక్తే ముకేశ్ అంబానీ.. ఆ కంపెనీ రిలయన్స్ ఇండస్ట్రీస్.
ii. కంపెనీ మార్కెట్ విలువ రూ.10 లక్షల కోట్ల మైలురాయిని చేరింది. ఈ ఘనత సాధించిన తొలి భారతీయ కంపెనీ ఆర్ఐఎల్ కావడం గమనార్హం.
iii. 2020-21లో రుణ రహిత కంపెనీగా మారేందుకు సౌదీ ఆరామ్కోతో కుదుర్చుకున్న భారీ ఒప్పందం చేసుకుంది.
సదస్సులు
47th All India Police Science Congress begins in Lucknow :

i. 47వ ఆల్ ఇండియా పోలీస్ సైన్స్ కాంగ్రెస్ (AIPASC) లక్నోలో ప్రారంభమైంది. ఈ కార్యక్రమాన్ని పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్, రిటైర్డ్ ఐపిఎస్ అధికారి కిరణ్ బేడి ప్రారంభించారు.
ii. ఉత్తర ప్రదేశ్ పోలీసులు హోం మంత్రిత్వ శాఖ, బ్యూరో ఆఫ్ పోలీస్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ సహకారంతో లక్నోలోని పోలీసు ప్రధాన కార్యాలయంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.
iii. ఈ కార్యక్రమం యొక్క 6 సెషన్లలో, పోలీసు అధికారులు, విద్యావేత్తలు, పరిశోధకులు, న్యాయ మరియు శాస్త్రీయ నిపుణులు తమ పత్రాలను సమర్పించనున్నారు.
సినిమా వార్తలు
‘ఇఫి 2019’ విజేతలు :

i. గోవాలో తొమ్మిది రోజుల పాటు అట్టహాసంగా జరిగిన ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (ఇఫి) స్వర్ణోత్సవాలు ముగిశాయి.
ii. ఉత్తమ చిత్రం (గోల్డెన్ పీకాక్ అవార్డ్) : పార్టికల్స్ (ఫ్రెంచ్)
iii. ఉత్తమ నటుడు (సిల్వర్ పీకాక్ అవార్డ్) : సివ్జార్జ్ (మరిఘెల్లా - పోర్చుగీస్)
iv. ఉత్తమ నటి (సిల్వర్ పీకాక్ అవార్డ్) : ఉషాజాదవ్ (మాయ్ ఘాట్ - మరాఠీ)
v. ఉత్తమ దర్శకుడు : లిజో జోస్ పెల్లిస్సెరీ (జల్లికట్టు - మలయాళం)
vi. స్పెషల్ జ్యూరీ అవార్డ్ : బెలూన్ (చైనీస్)
vii. స్పెషల్ మెన్షన్ : హెల్లరో (గుజరాతీ)
viii. ఐసీఎఫ్టీ-యునెస్కో గాంధీ అవార్డ్ : రువాండా దర్శకుడు రికార్డో సాల్వెట్టి
ముఖ్యమైన రోజులు
29 November - International Day of Solidarity with Palestinian People (పాలస్తీనా ప్రజలతో అంతర్జాతీయ సంఘీభావ దినం)
 
i. పాలస్తీనా ప్రజలతో అంతర్జాతీయ సాలిడారిటీ దినం UN- వ్యవస్థీకృత ఆచారం. న్యూయార్క్లోని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలో,  అలాగే జెనీవా , వియన్నా మరియు నైరోబిలోని ఐక్యరాజ్యసమితి కార్యాలయాలలో కార్యక్రమాలు జరుగుతాయి.
ii. దీనిని 2003, డిసెంబర్ 1 న గమనించారు. పాలస్తీనా ప్రజల అసమర్థ హక్కుల వ్యాయామంపై కమిటీతో సంప్రదించి, ఐక్యరాజ్యసమితి సచివాలయం యొక్క పాలస్తీనా హక్కుల కోసం డివిజన్ ప్రత్యేక స్మారక కార్యక్రమాలను నిర్వహిస్తుంది.
JRD టాటా 26వ వర్ధంతి  : నవంబర్ 29, 1993

i. జె.ఆర్.డి.టాటా (జూలై 29, 1904 - నవంబర్ 29, 1993) భారతదేశపు ప్రముఖ పారిశ్రామికవేత్త మరియు తొలి విమాన చోదకుడు. ఈయనకు 1992లో భారతరత్న పురస్కారం ఇవ్వబడింది.
ii. ప్యారిస్ లో జన్మించిన ఈయనను "జెహ్" లేక "జేఆర్డీ"గా సంబోధిస్తారు. ఈయన తల్లి ఫ్రాన్సు దేశస్థురాలు కావడంతో, ఈయన ఫ్రెంచి భాషను మొదటి భాషగా నేర్చుకున్నాడు. 1929లో ఈయన భారతదేశములోనే మొట్టమొదటి పైలట్ లైసెన్సు పొందాడు.
iii. 1932 లో ఈయన భారతదేశపు తొలి వాణిజ్య విమానసేవలను టాటా ఎయిర్ లైన్స్ పేరుతో ప్రవేశపెట్టాడు. 1946లో అది "ఎయిర్ ఇండియా"గా రూపాంతరం చెందింది. తర్వాతికాలంలో ఆయన భారతదేశపు పౌరవిమానయాన పితామహుడుగా ప్రశంసింపబడ్డాడు.
iv. 34 ఏళ్ళ వయసులో ఆయన టాటా వ్యాపారసంస్థలకు పెట్టుబడిదారీ సంస్థ అయిన టాటా సన్స్ సంస్థకు చైర్మనుగా బాధ్యతలు చేపట్టి 1991 వరకు ఆ పదవిలో కొనసాగాడు.
v. 1954 లో ఫ్రెంచ్ ప్రభుత్వం అయనకు అవార్డు నిచ్చింది. జెఆర్డి టాటా తన 89వ ఏట 1993 లో స్విట్జర్లండ్లోని జెనీవాలో మరణించాడు. ఆయనను పారిస్లోని పెర్ షైజ్ శ్మశానవాటికలో ఖననం చేశారు.
vi. ఇండియన్ పార్లమెంట్, అసాధారణంగా ఏ ప్రభుత్వ రాజకీయపదవీ అనుభవించని సామాన్య పౌరుడైన ఆయనకు నివాళిగా సభను వాయిదా వేసింది. మహారాష్ట్ర మూడు రోజు సంతాపదినాలుగా ప్రకటించింది.
క్రీడలు
ఉప్పల్లో అజ్జూ స్టాండ్ :

i. టీమ్ఇండియా మాజీ కెప్టెన్, హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్సీఏ) అధ్యక్షుడు మహ్మద్ అజహరుద్దీన్కు గౌరవం దక్కింది.
ii. ఉప్పల్ స్టేడియంలో స్టాండ్కు అజహర్ పేరు పెట్టాలని హెచ్సీఏ ఎపెక్స్ కౌన్సిల్ నిర్ణయించింది.
Bajrang finally gets his Khel Ratna. Sports Minister Rijiju awards National honours to four :
   
i. Bajrang Punia, who missed out on receiving the Rajiv Gandhi Khel Ratna earlier this year due to his preparations for the World Championships, was handed over the same by Sports Minister Kiren Rijiju.
ii. The Asian and Commonwealth champion won bronze at the competition in Nur-Sultan, Kazakhstan, in September to secure an Olympic spot in the 65kg category.
iii. Punia, who was honoured with Padma Shri this year, had caused a stir after being ignored for the Khel Ratna last year but was the unanimous choice this time around.
iv. Also receiving their respective Arjuna Awards on the occasion were National record-holders quartermiler Muhammad Anas and shotputter Tejinderpal Singh Toor while Toor’s coach Mohinder Singh Dhillon was conferred the Dronacharya Award.
 >>>>>>>>>>>>>>>>  End of the day  <<<<<<<<<<<<<<<<
 
RIP to the yesterday’s rape and murder victims of Dr. Priyanka reddy at Shadnagar & Manasa at Hanmakonda..

తిట్టాల్సింది పోలీసులను, చట్టాలను, పాలించే నాయకులను కాదు !!
తుంచివేయాల్సింది మానవుని రూపంలో ఉన్న మొగాడి క్రూరమైన ఉన్మాదపు లైంగిక వాంఛలు, చుట్టూ ఆవరించిపోతున్న విష సంస్కృతి..
క్యాండిల్ వాక్, ర్యాలీలు, నష్టపరిహరం, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం సమస్యకి పరిష్కారం కావు !!
నా అనుకునే సొంత మనిషికి ఏదో ఒకరోజు అనుకొని సంఘటన జరిగితే తప్ప వ్యక్తిగతంగా ఒక సాధారణ మనిషిలో అసలైన చైతన్యం, కసి, ఆలోచన పుట్టవు..
ఎవ్వరూ మారనంత కాలం ఇది  నిత్యం చూసే ఒక సాధారణ హెడ్ లైన్ లాగానే ఉంటుంది....!!
ఆడపిల్ల పుట్టినా భారంగా, బయటకు ఒంటరిగా పంపాలన్నా, వివాహం చేయాలన్నా భారంగా భావిస్తున్న ఈ వింత లోకంలో ఇంకా నిజమైన  స్వాతంత్ర్యం వచ్చేది ఎప్పుడు ? ఆడది లేకుంటే అసలు సృష్టికి మూలముంటుందా ?


Thursday 28 November 2019

28th november 2019 current affairs

✍  కరెంట్ అఫైర్స్ 28 నవంబరు 2019 Thursday ✍

  Daily Current affairs prepared from Eenadu, The Hindu news papers and bankersadda, Wikipedia, Google etc..
జాతీయ వార్తలు
Lok Sabha passes Bill banning e-cigarettes :
 
i. Health Minister Harsh Vardhan told the Lok Sabha that the Union government’s move to ban the sale of electronic cigarettes was a “pre-emptive strike” before the new form of intoxication spreads as the companies making them were looking at India as an attractive market.
ii. He made these remarks during the passage of a Bill in the Lower House that bans the sale of e-cigarettes with a penal provision of up to six months imprisonment or a fine of up to ₹50,000 or both.
ఇతర రాష్ట్రాలు / కేంద్ర పాలిత ప్రాంతాల వార్తలు
మహారాష్ట్ర 18వ ముఖ్యమంత్రిగా నేడు ఉద్ధవ్ ఠాక్రే ప్రమాణం. కాంగ్రెస్కు స్పీకర్ పదవి. ఎన్సీపీకి ఉప ముఖ్యమంత్రి :
 
i. బద్ధ శత్రువులే ప్రాణమిత్రులుగా మారిన వేళ మరాఠా గడ్డపై సరికొత్త అధ్యాయం మొదలు కాబోతోంది! శివసేన-ఎన్సీపీ-కాంగ్రెస్ కలిసికట్టుగా ‘మహా వికాస్ ఆఘాడీ’ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయబోతున్నాయి.
ii. కూటమి నుంచి శివసేన అధిపతి ఉద్ధవ్ ఠాక్రే మహారాష్ట్ర 18వ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయనున్నారు. ఉప ముఖ్యమంత్రి పదవి ఎన్సీపీకి, స్పీకర్ పదవి కాంగ్రెస్కు దక్కనున్నాయి.
iii. తన తండ్రి, శివసేన వ్యవస్థాపకుడు బాల్ ఠాక్రే దసరా ర్యాలీల్లో భాగంగా పలు కీలక ప్రసంగాలు చేసిన శివాజీ పార్కులో ఉద్ధవ్ గురువారం(Nov 28) సీఎంగా ప్రమాణం చేయనున్నారు.
iv. ఠాక్రే కుటుంబం నుంచి ప్రభుత్వంలో పదవి చేపట్టిన తొలి నేతగా ఉద్ధవ్ రికార్డు సృష్టించనున్నారు. శివసేన తరఫున సీఎం పీఠమెక్కిన మూడో నేతగానూ ఘనత సాధించనున్నారు. గతంలో ఆ పార్టీ తరఫున మనోహర్ జోషి, నారాయణ్ రాణే ముఖ్యమంత్రులుగా పనిచేశారు.
v. మహారాష్ట్రలో గరిష్ఠంగా 43 మంది మంత్రులుగా ఉండేందుకు అవకాశం ఉంటుంది. ప్రొటెం స్పీకర్ కాళిదాస్ కొలంబకర్ ఎమ్మెల్యేలతో ప్రమాణ స్వీకారం చేయించారు.
రెండు కేంద్ర పాలిత ప్రాంతాల విలీనం :
i. దాద్రా-నాగర్ హవేలీ, దమణ్ దీవ్ కేంద్ర పాలిత ప్రాంతాల విలీనానికి ఉద్దేశించిన బిల్లును లోక్సభ ఆమోదించింది. ఇకపై ఈ రెండింటినీ కలిపి ‘‘దాద్రా-నాగర్ హవేలీ- దమణ్ దీవ్’’ కేంద్ర పాలిత ప్రాంతంగా వ్యవహరిస్తారు.
ii. ఏ తేదీ నుంచి అమల్లోకి వచ్చేదీ తర్వాత ప్రకటిస్తారు. మెరుగైన సేవలు అందించడమే విలీనం ఉద్దేశమని హోం శాఖ సహాయ మంత్రి జి.కిషన్రెడ్డి చెప్పారు.
State’s 1st Vulture Conservation to set up by UP Government :

i. అంతరించిపోతున్న రాబందుల జనాభాను పరిరక్షించడానికి ఒక ప్రధాన దశలో, ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం మహారాజ్‌గంజ్ జిల్లాలోని ఫారెండా ప్రాంతంలో రాష్ట్ర మొట్టమొదటి రాబందుల సంరక్షణ మరియు పెంపకం కేంద్రాన్ని ఏర్పాటు చేస్తుంది.
ii. మూడు దశాబ్దాల వ్యవధిలో దేశంలో రాబందుల జనాభాలో 40 మిలియన్ల నుండి 19,000 కు తగ్గినట్లు పర్యావరణ మంత్రి తెలిపారు.
Chattisgarh declares Guru Ghasidas National Park as tiger reserve :

i. కొరియా జిల్లాలోని గురు ఘాసిదాస్ నేషనల్ పార్క్ ను పులి రిజర్వ్ గా ప్రకటించాలని ఛత్తీస్గర్ ప్రభుత్వం నిర్ణయించింది. ముఖ్యమంత్రి భూపేశ్ బాగెల్ అధ్యక్షతన ఛత్తీస్గర్ రాష్ట్ర వన్యప్రాణి బోర్డు సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.
ii. ప్రస్తుతం రాష్ట్రంలో మూడు పులుల నిల్వలు ఉన్నాయి, అవి బీజాపూర్ జిల్లాలో ఇంద్రవతి, గారియాబంద్‌లోని ఉదాంతి-సీతనాది మరియు బిలాస్‌పూర్‌లోని అచనక్‌మార్.
iii. గురు ఘాసిదాస్ జాతీయ ఉద్యానవనాన్ని 2014 లో పులుల సంరక్షణ కేంద్రంగా ప్రకటించడానికి జాతీయ పులుల పరిరక్షణ అథారిటీ (NTCA) ఆమోదం తెలిపింది.
సైన్స్ అండ్ టెక్నాలజీ
నింగికెగసిన నిఘా కన్ను. కక్ష్యలోకి కార్టోశాట్-3 ఉపగ్రహం. పీఎస్ఎల్వీ-సి47 ప్రయోగం విజయవంతం :
 
i. సరిహద్దుల్లో నిఘా కోసం అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో, పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపకల్పన చేసిన కార్టోశాట్-3 ఉపగ్రహాన్ని శాస్త్రవేత్తలు నిర్దేశిత కక్ష్యలో ప్రవేశపెట్టారు.
ii. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని సతీశ్ ధవన్ అంతరిక్ష ప్రయోగ కేంద్రం షార్లో రెండో ప్రయోగ వేదిక నుంచి పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్-సి47 నిప్పులు చిమ్ముకుంటూ నింగిలోకి దూసుకెళ్లింది. మనదేశానికి చెందిన కార్టోశాట్-3తోపాటు, అమెరికాకు చెందిన 13 నానో ఉపగ్రహాలను నిర్దేశిత కక్ష్యలోకి మోసుకెళ్లింది.
iii. ప్రయోగ వేదిక నుంచి బయలుదేరాక నాలుగు దశలూ విజయవంతమయ్యాయి. నిర్దేశిత కక్ష్యను చేరాక రాకెట్ నుంచి ఉపగ్రహాలు ఒక్కొక్కటిగా విడిపోయాయి.
iv. ప్రయోగం తర్వాత కార్టోశాట్-3 నుంచి అంటార్కిటికాలోని ఇస్రో కేంద్రానికి సంకేతాలు అందాయి. మూడో తరానికి చెందిన భూపరిశీలన ఉపగ్రహం కార్టోశాట్-3. దీనిని హై రెజల్యూషన్ ఎర్త్ ఇమేజింగ్ ఉపగ్రహంగా ఇస్రో శాస్త్రవేత్తలు రూపొందించారు.
v. సరిహద్దుల్లో భద్రతను కట్టుదిట్టం చేయడానికి ఇందులో ప్రత్యేక ఇమేజింగ్ వ్యవస్థలున్నాయి. ఉగ్రవాద శిబిరాల ఫొటోలను మరింత దగ్గరగా(జూమ్) తీసే అవకాశం ఉంది.
vi. ఇది సైనిక నిఘాకు ఎంతగానో ఉపయోగపడనుంది. ప్రకృతి విపత్తుల సమయాల్లోనూ కార్టోశాట్-3 సేవలందించనుంది. ఇస్రో ఇప్పటిదాకా కార్టోశాట్ సిరీస్లో 9 ఉపగ్రహాలను కక్ష్యలోకి పంపినట్లయింది.
Defence News
India to host naval drill Milan 2020 @Vizag :
   
i. భారత నావికాదళం మార్చిలో మిలటరీ డ్రిల్ ‘మిలన్ 2020’ ను నిర్వహించనుంది, ఇది అనేక దేశాల భాగస్వామ్యాన్ని చూస్తుంది.
ii. భారతదేశంతో రక్షణ సహకారాన్ని పంచుకునే దక్షిణ ఆసియా, ఆగ్నేయాసియా, ఆఫ్రికా మరియు యూరప్ నుండి 41 దేశాలను ఈ డ్రిల్ కోసం ఆహ్వానించారు.
iii. MILAN అంటే ‘Multilateral Naval Exercise’ (బహుపాక్షిక నావికా వ్యాయామం).
iv. స్టాఫ్ టాక్స్, ఎంపవర్డ్ స్టీరింగ్ గ్రూప్ వంటి నిర్మాణాత్మక పరస్పర చర్యల ద్వారా హిందూ మహాసముద్ర ప్రాంతంతో సహా స్నేహపూర్వక విదేశీ దేశాలతో ప్రభుత్వం సహకార కార్యక్రమాలను అనుసరిస్తుంది.
v. సహకార రంగాలలో సామర్థ్యం పెంపు, మెరైన్ డొమైన్ అవగాహన, శిక్షణ, హైడ్రోగ్రఫీ, సాంకేతిక సహాయం, కార్యాచరణ వ్యాయామం ఉన్నాయి.
అవార్డులు
Indian journalist Neha Dixit recipients of International Press Freedom Award :

i. Indian journalist Neha Dixit has receipt 2019 International Press Freedom Awards. This award is awarded by Committee to Protect Journalists (CPJ), a non-profit organization whose aim is to enable journalists to work without the fear of reprisal.
ii. Dixit received the award for her reports on sex trafficking scandals in India by Investigative reporter in Miami Herald, Julie k.Brown.
మరణాలు
Ex-Navy Chief Admiral Sushil Kumar dead :

i. Former Navy Chief Admiral Sushil Kumar passed away at the Army’s Research and Referral Hospital in Delhi. He was 79.
ii. Admiral Kumar was the 16th Chief of Naval Staff and oversaw Naval operations during the Kargil conflict of 1999.
Explorer Barbara Hillary passes away at 88 :

i. Barbara Hillary, who was in her 70s when she became the first black woman to officially make it to the North and South Poles, has died at 88.
ii. She had retired from a nursing career and survived separate occurrences of breast and lung cancer when she started travelling in the Arctic.
ముఖ్యమైన రోజులు
జ్యోతిరావు ఫులే మరణం : 28 నవంబరు 1890

i. జ్యోతిరావు గోవిందరావు ఫులే (1827 ఏప్రిల్ 11 - 1890 నవంబరు 28) ఒక భారతీయ సామాజిక కార్యకర్త, మేధావి, కుల వ్యతిరేక సామాజిక సంస్కర్త మరియు మహారాష్ట్రకు చెందిన రచయిత.
ii. అతను కులం పేరుతో తరతరాలుగా, అన్నిరకాలుగా అణచివేతకుగురెైన బడుగు, బలహీనవర్గాల ప్రజలకు ఆత్మస్థైర్యం కల్పించి, వారి హక్కుల కోసం పోరాడి, సాధికారత కల్పనకు కృషి చేసినమహనీయుడు. అతను భారతదేశంలో కుల వివక్షకు వ్యతిరేకంగా కోట్లాది ప్రజానీకం కోసం, పేద, అణగారిన, అంటరాని ప్రజల హక్కుల కోసం పోరాడాడు.
iii. అతను అంటరానితనం, కులవ్యవస్థ నిర్మూలనతో పాటు మహిళోద్ధరణకు కృషి చేసాడు. 1873 సెప్టెంబరు 24న , ఫులే తన అనుచరులతో కలిసి, దిగువ కులాల ప్రజలకు సమాన హక్కులను పొందటానికి సత్యశోధక్ సమాజ్ (సొసైటీ ఆఫ్ సీకర్స్ ఆఫ్ ట్రూత్) ను ఏర్పాటు చేశాడు.
iv. ఫులే బాలికల కోసం మొదటి పాఠశాలను 1848 లో పూనాలో ప్రారంభించారు. అతను వితంతువుల కోసం ఒక గృహాన్ని కూడా స్థాపించాడు. భారతదేశ బాలికల కోసం ఒక పాఠశాల ప్రారంభించిన మొట్టమొదటి స్థానిక భారతీయులలో ఈ జంట ఉన్నారు. విద్య యొక్క విశ్వీకరణను సమర్థించిన మొదటి సంస్కర్త కూడా ఆయన.
క్రీడలు
Bhubaneswar, Rourkela to host 2023 men’s hockey WC :
 
i. 2023 పురుషుల ప్రపంచ కప్కు ఆతిథ్యమిచ్చే నగరాన్ని ఎఫ్ఐహెచ్ పేరు పెట్టడంతో ఒడిశా దేశంలో హాకీ టోర్నమెంట్లకు కేంద్రంగా కొనసాగుతుంది.
ii. ఒక దేశం క్రీడలో ప్రీమియర్ టోర్నమెంట్ యొక్క వరుస సంచికలను హోస్ట్ చేయడం ఇదే మొదటిసారి, కానీ అదే నగరం రెండుసార్లు హోస్ట్ చేయడం కూడా ప్రత్యేకతను సంతరించుకుంటుంది.
iii. అయితే, ఈసారి, భువనేశ్వర్ (2018 డబ్ల్యుసికి ఆతిథ్యం ఇచ్చింది) రూర్కెలాలోని బిజు పట్నాయక్ హాకీ స్టేడియంతో హోస్టింగ్ హక్కులను పంచుకుంటుంది.
iv. ప్రపంచ కప్ అనేది FIH కోసం హాకీలో టోర్నమెంట్ల పరాకాష్ట. దీనికి ఒక నిర్దిష్ట ప్రమాణం ఉండాలి మరియు ప్రస్తుతం భువనేశ్వర్ మరియు ఢిల్లీలకు మాత్రమే సౌకర్యాలు ఉన్నాయి. ఇప్పుడు రూర్కెలా కూడా ఉంది, ఇది అప్గ్రేడ్ కావాలి.
v. ఢిల్లీ సాధ్యం కాదు ఎందుకంటే స్టేడియం పూర్తిగా కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆక్రమించి, ప్రభుత్వ నియమాలను తీవ్రంగా పరిమితం చేస్తుంది అని FIH అధ్యక్షుడు అయిన IOA అధ్యక్షుడు నరీందర్ బాత్రా అన్నారు.
 >>>>>>>>>>>>>>>>  End of the day  <<<<<<<<<<<<<<<<

Wednesday 27 November 2019

27th november 2019 current affairs

✍  కరెంట్ అఫైర్స్ 27 నవంబరు 2019 Wednesday ✍

జాతీయ వార్తలు

రెండు కేంద్రపాలిత ప్రాంతాల  విలీనానికి లోక్సభలో బిల్లు ప్రవేశపెట్టిన కిషన్రెడ్డి :
 
i. కేంద్రపాలిత ప్రాంతాలైన డామన్ మరియు డియు (దమణ్దీవ్), దాద్రా నాగర్ హవేలీలను విలీనం చేసేందుకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్రెడ్డి లోక్సభలో బిల్లు ప్రవేశపెట్టారు.
ii. జనాభా, భూ విస్తీర్ణం పరిమితంగానే ఉండటం వల్ల వీటిని విలీనం చేసి అధికారుల సేవలు మరింత సమర్థంగా ఉపయోగించుకునే లక్ష్యంతో బిల్లు ప్రవేశపెట్టినట్లు మంత్రి తెలిపారు.
iii. బిల్లు ఆమోదం పొందిన తరవాత ఈ రెండు కేంద్ర పాలిత ప్రాంతాలనూ కలిపి దాద్రా నాగర్ హవేలీ, దమణ్ దీవ్గా పిలుస్తారు.
రాజ్యసభ 250వ సమావేశాన్ని పురస్కరించుకొని రూ.250 నాణెం విడుదల :

i. రాజ్యసభ 250వ సమావేశాన్ని పురస్కరించుకొని రాష్ట్రపతి చేతుల మీదుగా రూ.250 విలువైన వెండి నాణెం, రూ.5 ప్రత్యేక తపాలా బిళ్లను విడుదల చేశారు.
ii. ‘భారత పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో రాజ్యసభ పాత్ర’ అనే పుస్తకాన్ని ఉపరాష్ట్రపతి ఆవిష్కరించి దాని ప్రతులను రాష్ట్రపతికి, ప్రధానమంత్రికి అందజేశారు.
‘పరుల సొమ్ము ఆశించరాదు’ లోక్పాల్ నినాదమిదే :

i. Motto of Lokpal : Ma Gridhah Kasyasvidhanam (Sanskrit) Do not be greedy for anyone's wealth (English)
ii. సుదీర్ఘ కసరత్తు తరవాత లోక్పాల్కు లోగోను (చిహ్నం), లోక్పాల్ లక్ష్యాన్ని తెలియజెప్పేలా నినాదాన్ని ఖరారు చేశారు. ప్రజల నుంచి లోగో డిజైన్లను ఆహ్వానించగా అలహాబాద్కు చెందిన ప్రశాంత్ మిశ్ర రూపొందించిన లోగోను ఎంపిక చేశారు.
iii. అయితే నినాదం కోసం వచ్చిన ఎంట్రీల్లో ఏవీ అర్హమైనవిగా లేకపోవడంతో లోక్పాల్ పూర్తి ధర్మాసనం సొంతంగా ఉపనిషత్తు నుంచి ఒక శ్లోకాన్ని నినాదంగా ఎంపిక చేసింది. ‘పరుల సొమ్ము ఆశించరాదు’ అన్నది ఈ శ్లోకం సారాంశం.
Transgender persons rights Bill passed in RS :
i. ట్రాన్స్జెండర్ పర్సన్స్ (హక్కుల పరిరక్షణ) బిల్లు, 2019 ను పార్లమెంటు ఆమోదించింది, దీనిని ఎంపిక కమిటీకి సూచించాలన్న మోషన్ తరువాత రాజ్యసభ ఆమోదించింది.
ii. ఆగస్టు 8 న లోక్సభ ఆమోదించి, రాజ్యసభలో కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత మంత్రి తవర్చంద్ గెహ్లాట్ నవంబర్ 20 న ప్రవేశపెట్టిన ఈ చట్టం లింగమార్పిడి వ్యక్తులపై వివక్షను అంతం చేసే ఉద్దేశ్యమని మంత్రి తెలిపారు.
iii. అయితే, ప్రతిపక్ష ఎంపీలు జిల్లా మేజిస్ట్రేట్ నుండి లింగమార్పిడి ధృవీకరణ పత్రం పొందవలసిన అవసరాలతో సహా కొన్ని నిబంధనల గురించి ఆందోళన వ్యక్తం చేశారు. లింగమార్పిడి హక్కుల పరిరక్షణ కోసం ప్రైవేటు సభ్యుల బిల్లును 2015 లో రాజ్యసభ ఆమోదించిన DMK ఎంపి తిరుచి శివా, బిల్లును ఎంపిక కమిటీకి సూచించడానికి ఒక తీర్మానాన్ని తరలించారు.

iv. 74 మంది ఎంపీలు దీనికి వ్యతిరేకంగా మరియు 55 మంది అనుకూలంగా ఓటు వేయడంతో ఈ మోషన్ ఓడిపోయింది, మరియు బిల్లును వాయిస్ ఓటు ద్వారా ఆమోదించారు.
v. ఈ బిల్లును ఇప్పటికే పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీకి పంపించి, ఎగువ సభలో ప్రవేశపెట్టడానికి ముందు రెండుసార్లు లోక్ సభ ఆమోదించింది.
Lok Sabha clears National Institute of Design Bill :
i. లోక్ సభ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ (సవరణ) బిల్లును ఆమోదించింది, ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, హర్యానా మరియు అస్సాం సంస్థలలోని జాతీయ ప్రాముఖ్యత కలిగిన ఎన్ఐడిలను ప్రకటించింది.
 
ii. మునుపటి సెషన్ లో రాజ్యసభ బిల్లును క్లియర్ చేసింది. అంతకుముందు, ఈ సంస్థలు సొసైటీల రిజిస్ట్రేషన్ చట్టం క్రిందకు వచ్చాయి మరియు డిగ్రీలు లేదా డిప్లొమా జారీ చేసే అధికారం లేదు.
iii. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ (ఎన్ఐడి) అహ్మదాబాద్, బెంగళూరు మరియు గాంధీనగర్ ఇండియాలోని డిజైన్ స్కూల్. ఈ సంస్థ భారత ప్రభుత్వం యొక్క వాణిజ్య మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ, పరిశ్రమ మరియు అంతర్గత వాణిజ్య ప్రోత్సాహక శాఖ (DPIIT - Department for Promotion of Industry and Internal Trade) క్రింద స్వయంప్రతిపత్త సంస్థగా పనిచేస్తుంది.
iv. భారత ప్రభుత్వంలోని సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖలోని శాస్త్రీయ మరియు పారిశ్రామిక పరిశోధన విభాగం ఎన్ఐడిని శాస్త్రీయ మరియు పారిశ్రామిక రూపకల్పన పరిశోధన సంస్థగా గుర్తించింది.
v. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ యాక్ట్, 2014 ప్రకారం, పార్లమెంటు చట్టం ద్వారా ఎన్ఐడిని "ఇన్స్టిట్యూట్ ఆఫ్ నేషనల్ డిజైన్" గా గుర్తించారు.
vi.   పారిశ్రామిక రూపకల్పన మరియు విజువల్ కమ్యూనికేషన్లో పరిశోధన, సేవ మరియు శిక్షణ కోసం భారత ప్రభుత్వం 1961 లో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ను స్వయంప్రతిపత్త జాతీయ సంస్థగా ఏర్పాటు చేసింది.
ఆంధ్రప్రదేశ్ వార్తలు
Kolleru lake has become a safe breeding ground for grey pelicans, painted storks :

i. The Atapaka bird sanctuary on the West Godavari-Krishna district border at Kaikaluru in Kolleru lake has become a safe breeding ground for two migratory bird species.
ii. Atapaka village is the only location in the lake where bird lovers can have a glimpse of the painted storks up close, less than 100 metres, and it’s the prime spot for photographers.
ఇతర రాష్ట్రాలు / కేంద్ర పాలిత ప్రాంతాల వార్తలు
కూటమిదే పీఠం. శివసేనానే ముఖ్యమంత్రి. అనూహ్యంగా అజిత్ పవార్ రాజీనామా..  గద్దె దిగిన ఫడణవీస్. ఉద్ధవ్ ఠాక్రేను సీఎం అభ్యర్థిగా ఎన్నుకున్న కూటమి :
 
i. ఇంటిపెద్దను కాదని పొరుగింటికెళ్లిన అజిత్పవార్ నాలుగు రోజులు తిరగకముందే సొంతగూటికి చేరుకున్నారు. కమలదళంలో ‘మెజారిటీ’ ఆశలు రేపిన ఆయన అనూహ్య రాజీనామాతో భాజపా ‘80 గంటల ప్రభుత్వం’ కుప్పకూలింది.
ii. ఆగమేఘాల మీద ముఖ్యమంత్రి పదవి చేపట్టిన దేవేంద్ర ఫడణవీస్ అంతలోనే దిగిపోవలసి వచ్చింది. శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ కూటమి గద్దెనెక్కడానికి మార్గం సుగమమైంది. శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రేను ముఖ్యమంత్రి అభ్యర్థిగా కూటమి ఎన్నుకుంది.
iii. ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అజిత్ పవార్ తన పదవికి రాజీనామా చేశారు. రెండోసారి సీఎంగా ఫడణవీస్ కేవలం 80 గంటలే పదవిలో ఉన్నారు.
iv. మహారాష్ట్ర ముఖ్యమంత్రి అధికారిక నివాసమైన ‘వర్ష’కు అజిత్ వెళ్లారు. అక్కడ జరిగిన భాజపా కోర్కమిటీ సమావేశం అనంతరం అజిత్ తన రాజీనామా సమర్పించారు.
v. మహారాష్ట్రలో మొత్తం 288 అసెంబ్లీ స్థానాలున్నాయి.  ఎన్నికల్లో భాజపా 105, శివసేన 56, ఎన్సీపీ 54, కాంగ్రెస్ 44 సీట్లను గెల్చుకున్నాయి. ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసేందుకు 145 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం.
vi. ‘మహా వికాస్ ఆఘాడీ’ ఎమ్మెల్యేల సంయుక్త సమావేశంలో ఉద్ధవ్ ఠాక్రే ప్రసంగించారు. తన తండ్రి, శివసేన వ్యవస్థాపకుడు బాల్ ఠాక్రే స్మృతులను గుర్తుచేసుకున్నారు.
vii. ప్రొటెం స్పీకర్గా భాజపా ఎమ్మెల్యే(వడాలా) కాళిదాస్ కొలంబకర్ను గవర్నర్ కోశ్యారీ నియమించారు. ఎమ్మెల్యేలందరితో ప్రొటెం స్పీకర్ ప్రమాణం చేయిస్తారు.
ఎస్.ఆర్.బొమ్మై కేసు :

viii. 1988 జనతాదళ్ ముఖ్యమంత్రి ఎస్.ఆర్.బొమ్మైకి శాసనసభలో సంపూర్ణ  మెజారిటీ ఉన్నా... నిరూపించుకునే అవకాశాన్ని అప్పటి గవర్నర్ పి.వెంకటసుబ్బయ్య ఇవ్వలేదు.
ix. రాష్ట్రపతి పాలనకు సిఫార్సు చేశారు. దీనికి కేంద్రంలోని రాజీవ్గాంధీ ప్రభుత్వం ఆమోదముద్ర వేసింది.   గవర్నర్ నిర్ణయంపై సుప్రీంకోర్టులో సుదీర్ఘకాలం వ్యాజ్యం నడిచింది. గవర్నర్ల పాత్రపై చర్చకు తెరతీసిన కేసు ఇది.
x. గవర్నర్ పదవిని రాజకీయాలకు అతీతంగా, సమాఖ్య స్ఫూర్తికి అనుగుణంగా నిర్వర్తించాలి. లౌకిక దృక్పథం, మానవతా విలువలు, జాతీయ సమైక్యతా స్ఫూర్తి వంటి ఉన్నత లక్షణాల ప్రాతిపదికగా ఈ విధులుండాలి. ఆ పదవికి ఉన్న ఔన్నత్యాన్ని కాపాడాలి. కేంద్ర ప్రభుత్వం సైతం రాజ్యాంగ స్ఫూర్తికి భంగం  వాటిల్లకుండా వ్యవహరించాలి అని 1994లో ఎస్.ఆర్.బొమ్మై కేసులో సుప్రీంకోర్టు పేర్కొన్నది.
Madhya Pradesh govt to give 5% reservation to sportspersons in jobs :

i. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో జాతీయ, అంతర్జాతీయ పతక విజేతలు, క్రీడాకారులకు మధ్యప్రదేశ్ ప్రభుత్వం 5% రిజర్వేషన్ ప్రకటించింది.
ii. గ్వాలియర్‌లోని కంపూ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో ప్రాంతీయ ఒలింపిక్ క్రీడలను ప్రారంభిస్తూ మధ్యప్రదేశ్ క్రీడా, యువజన సంక్షేమ శాఖ మంత్రి జితు పట్వారీ ఈ ప్రకటన చేశారు.
Naveen Patnaik inaugurates National Tribal Craft Mela 2019 :

i. ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ భువనేశ్వర్‌లో జాతీయ గిరిజన క్రాఫ్ట్ మేళా - 2019 ను ప్రారంభించారు.
ii. సాంప్రదాయ గిరిజన కళ మరియు కళలను సంరక్షించడం, ప్రోత్సహించడం మరియు ప్రాచుర్యం పొందడం మరియు చేతివృత్తుల వారి ఉత్పత్తుల వాణిజ్య సాధ్యత కోసం సాంస్కృతిక పరస్పర చర్యల ద్వారా వారి నైపుణ్యాలను పెంపొందించుకోవడానికి మంచి అవకాశాలను కనుగొనడంలో మేళా యొక్క లక్ష్యం.
iii. సిక్కిం, మణిపూర్, నాగాలాండ్, అస్సాం, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, మహారాష్ట్ర, తమిళనాడు, మధ్యప్రదేశ్, కర్ణాటక, ఛత్తీస్గర్, రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, గుజరాత్, పశ్చిమ బెంగాల్, ఉత్తర బెంగాల్, 18 రాష్ట్రాల నుండి 240 మందికి పైగా గిరిజన కళాకారులు మేళాలో ఉన్నారు.
iv. హస్తకళా వస్తువులు, చేనేత ఉత్పత్తులు, ఇనుము, వెదురు ఉత్పత్తులు, తోలుబొమ్మ, లక్క క్రాఫ్ట్‌తో పాటు గిరిజన ఆభరణాలు, చేతిపనులు, వస్త్రాలు చేతివృత్తులవారు ప్రదర్శిస్తారు.
సైన్స్ అండ్ టెక్నాలజీ
పీఎస్ఎల్వీ-సీ47 ప్రయోగం విజయవంతం :
 
i. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో చేపట్టిన పీఎస్ఎల్వీ సీ47 ప్రయోగం విజయవంతమైంది. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్ షార్లోని రెండో ప్రయోగ వేదిక నుంచి ఈ ప్రయోగాన్ని  చేపట్టారు.
ii. అనంతరం వివిధ దశల్లో 26.50 నిమిషాల వ్యవధిలో 14 ఉపగ్రహాలను నిర్దేశిత కక్ష్యలో ఇది ప్రవేశపెట్టింది. పీఎస్ఎల్వీ సంకేతాలను అంటార్కిటకలోని ఇస్రో కేంద్రం అందుకుంది.
iii. ఈ ప్రయోగం ద్వారా కార్టోశాట్-3తోపాటు అమెరికాకు చెందిన 13 నానో ఉపగ్రహాలను నింగిలోకి పంపారు.. మూడోతరం హైరెజల్యూషన్ ఎర్త్ ఇమేజింగ్ ఉపగ్రహం కార్టోశాట్-3. దీని జీవిత కాలం ఐదేళ్లు.. బరువు సుమారు 1625 కిలోలు.
iv. పట్టణాభివృద్ధి ప్రణాళిక, గ్రామీణ వనరులకు సంబంధించిన సేవలను ఇది అందించనుంది. ఉగ్రవాద శిబిరాలను కార్టోశాట్-3 మరింత స్పష్టంగా తీయనుంది.
Reports/Ranks/Records
తక్కువ కాలం పదవిలో ఉన్న ముఖ్యమంత్రులు :
i. ముఖ్యమంత్రి పదవి రాష్ట్ర స్థాయిలో అత్యంత కీలకమైనది. ఈ పదవి దక్కినట్లే దక్కి.. కొద్ది రోజులకే దిగిపోవాల్సిన పరిస్థితి వివిధ రాష్ట్రాల్లో చాలామందికి ఎదురైంది.
ii. తగినంత మెజారిటీ లేకపోవడం, అసెంబ్లీలో బల నిరూపణ చేసుకోలేకపోవడం వంటి కారణాలతోనే వారంతా ఆ పదవిని వదులుకోవాల్సి వచ్చింది.
iii. తాజాగా మహారాష్ట్రలో రెండో దఫా ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన దేవేంద్ర ఫడణవీస్ 4 రోజులకే రాజీనామా చేశారు.

Global prosperity index 2019 @ Bangalore top ranked city in India :

i. The first-ever Prosperity & Inclusion City Seal and Awards (PICSA) Index, released in the Basque Country capital of Bilbao in northern Spain.
ii. The Index is designed to showcase not only the quantity of economic growth of a city but also its quality and distribution across populations.
iii. Bengaluru emerged as India’s highest-ranked city at No. 83 in a new index of the world’s 113 cities in terms of economic and social inclusivity, topped by Zurich in Switzerland.
iv. Delhi at 101 and Mumbai at 107 are the other Indian cities to make at the index, with the top 20 awarded a PICSA Seal as the world’s highest-ranked cities building inclusive prosperity.
v. Vienna, the Austrian capital in second place, scores close to top marks on healthcare.
vi. Copenhagen, Luxembourg and Helsinki complete the top five.
అవార్డులు
డీఆర్డీవో అధిపతి సతీశ్రెడ్డికి రాయల్ ఏరోనాటికల్ సొసైటీ గౌరవ ఫెలోషిప్ ప్రదానం :

i. రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో) అధిపతి జి.సతీశ్ రెడ్డికి అరుదైన గౌరవం దక్కింది. లండన్లోని ప్రతిష్ఠాత్మక రాయల్ ఏరోనాటికల్ సొసైటీ (ఆర్ఏఈఎస్) ఆయనకు గౌరవ ఫెలోషిప్ను ప్రదానం చేసింది.
ii. ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన ఈ ఏరోనాటికల్ సొసైటీలో భారతీయుడొకరికి ఈ ఘనత దక్కడం వందేళ్లలో ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఏరోస్పేస్ రంగంలో దీన్ని నోబెల్ పురస్కారానికి సమానంగా పరిగణిస్తారు.
iii. ఈ గౌరవ ఫెలోషిప్ను తొలిసారిగా 1917లో ప్రదానం చేశారు. విమానాన్ని కనిపెట్టిన రైట్ సోదరుల్లో ఒకరైన ఆర్విల్ రైట్కు అది దక్కింది.
Floating school project of Bangladesh wins Aga Khan Architecture Award :

i. బంగ్లాదేశ్ యొక్క ఫ్లోటింగ్ స్కూల్ ప్రాజెక్ట్ అగా ఖాన్ ఆర్కిటెక్చర్ అవార్డును గెలుచుకుంది. బంగ్లాదేశ్ ని ‘నీటి భూమి’ గా పేర్కొంటారు.
ii. వర్షాకాలంలో దాని ప్రకృతి దృశ్యంలో ఎక్కువ భాగం నీటి అడుగున మునిగిపోతుంది. పాఠశాల రూపకల్పన కోసం ఉపాధ్యాయురాలిగా పదవీ విరమణ చేసిన తరువాత రజియా ఆలం అంతర్జాతీయంగా ప్రసిద్ధి చెందిన బంగ్లాదేశ్ ఆర్కిటెక్ట్ సైఫ్ ఉల్ హక్ను సంప్రదించింది. ఇది ‘ది ఆర్కాడియా ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్’ అనే తేలియాడే పాఠశాల.
సినిమా వార్తలు
Films from 12 countries for children’s festival @ Kolkata :

i. Selected films from 12 countries are being screened in Kolkata at the 19th International Children’s Film Festival organised by UNICEF, Cine Central Calcutta, and another voluntary organisation.
ii. The month-long festival is based on the theme of protecting children against violence.
మరణాలు
Cartoonist Sudhir Dhar dies at 87 :

i. Renowned cartoonist Sudhir Dhar, whose works have graced several newspapers in a career spanning 58 years, died after suffering a cardiac arrest.
ii. Dhar began his career with The Statesman in 1961, after which he moved to Hindustan Times. His cartoons have also appeared in The Independent, The Pioneer, Delhi Times, New York Times, Washington Post and Saturday Review, among others.
ముఖ్యమైన రోజులు
V.P. సింగ్ 11వ వర్ధంతి - నవంబరు 27, 2008

i. విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ (జూన్ 25, 1931 - నవంబరు 27, 2008), భారతీయ రాజకీయ నాయకుడు, భారతదేశ ఏడవ ప్రధానమంత్రిగా 1989 నుండి 1990 వరకు పనిచేసాడు.
ii. మండల్ కమిషన్ నివేదిక ప్రకారం ప్రభుత్వ ఉద్యోగాలలో వెనుకబడిన కులాలకు 27% రిజర్వేషన్ కల్పించాలని నిర్ణయించిన ప్రధాని.
iii. 1974లో ప్రధానమంత్రి ఇందిరా గాంధీ మంత్రి వర్గంలో వాణిజ్య శాఖ ఉపమంత్రిగా ఎన్నుకోబడ్డాడు. 1976 నుండి 1977 వరకు వాణిజ్య శాఖామంత్రిగా తన సేవలనందించాడు. 1980లో జనతా పార్టీ తరువాత ఇందిరా గాంధీ మరల ఎన్నుకోబడినప్పుడు, ఇందిరా గాంధీ అతనిని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా నియమించింది.
iv. అతను ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని నైఋతి ప్రాంత జిల్లాలలోని గ్రామీణ ప్రాంతాలలో ముఖ్యంగా తీవ్రమైన సమస్య అయిన బందిపోటు దొంగతనాలను తగ్గించే కార్యక్రమాలు చేసాడు. 1983లో తిరిగి వాణిజ్య మంత్రిగా పదవిని పొందాడు.
v. 1989 ఎన్నికలలో రాజీవ్ గాంధీని పదవినుంచి తొలగించటానికి, అతనికి వ్యతిరేకంగా వామపక్షాలు, భారతీయ జనతా పార్టీతో కలసి ఒక కూటమి ఏర్పాటు చేయడానికి అతను బాధ్యత వహించాడు.
vi. 1984 సార్వత్రిక ఎన్నికల తరువాత భారతదేశ 10వ కేబినెట్ లో ఆర్థిక మంత్రిగా రాజీవ్ గాంధీచే ఎన్నుకోబడ్డాడు. రాజీవ్ మనస్సులో ఉన్న లైసెన్స్ రాజ్ (ప్రభుత్వ నియంత్రణ) తొలగింపును క్రమేణా అమలు చేసాడు.
vii. ఆర్థిక మంత్రిగా ఉన్న కాలంలో అతను బంగారంపై పన్నులు తగ్గించడం ద్వారా, జప్తు చేసిన బంగారంలో కొంత భాగాన్ని పోలీసులకు ఇవ్వడం ద్వారా బంగారం అక్రమ రవాణాను నిరోధించాడు. అతను ఆర్థిక శాఖలో ఎన్ఫోర్స్మెంటు డైరెక్టరేట్ కు అసాధారణ అధికారాలనిచ్చాడు. రాజీవ్ గాంధీ అతనిని ఆర్థిక మంత్రి పదవి నుండి తొలగించాడు.
viii. 1986 మార్చి 24న రాజీవ్ ప్రధానిగా ఉన్న సమయంలో బోఫోర్స్ ఒప్పందం కుదరింది. స్వీడిష్ కంపెనీ ఏబీ బోఫోర్స్ కంపెనీ నుంచి 1437 కోట్ల రూపాయల ఖర్చుతో కొనడానికి ఒప్పందం కుదిరింది.
ix. భారతదేశం, స్వీడన్ ప్రభుత్వాల్లోని పెద్దల మధ్య జరిగిన అవకతవకలపై దృష్టి సారించాడు. ఈ అంశం రాజీవ్ గాంధీ ప్రభుత్వాన్ని కుదిపేసింది.  దానిపై దర్యాప్తు చేయించడానికి ముందే అతనిని క్యాబినెట్ నుండి తొలగించారు. దాని ఫలితంగా అతను కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి, లోక్సభ సభ్యత్వానికి రాజీనామా చేసాడు.
x. కాంగ్రెస్ పార్టీ నుండి బయటికి వచ్చిన తరువాత సింగ్ అరుణ్ నెహ్రూ, అరిఫ్ మొహమ్మద్ ఖాన్ లతో కలసి జనమోర్చా పేరుతో ప్రతిపక్ష పార్టీని ప్రారంభించాడు. 1988 అక్టోబరు 11 న జనతాపార్టీ సంకీర్ణం నాయకుడు జయప్రకాశ్ నారాయణ్ జన్మదినం సందర్భంగా రాజీవ్ గాంధీని వ్యతిరేకించే పార్టీలైన జనమోర్చా, జనతాపార్టీ, లోక్దళ్, కాంగ్రెస్ (ఎస్) పార్టీలను కలిపి జనతాదళ్ పార్టీని స్థాపించాడు. జనతాదళ్ పార్టీకి అధ్యక్షుడైనాడు.
xi. వి.పి.సింగ్ 1989 డిసెంబరు 2 న భారత దేశ 7వ ప్రధానమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టాడు. 1990 నవంబరు 10 వరకు ఒక సంవత్సరం లోపే ప్రధానమంత్రిగా పనిచేసాడు.
xii. మండల్ కమిషన్ భారతదేశంలోని సామాజిక, విద్యాపరంగా వెనుకబడిన తరగతుల పరిస్థితులని అధ్యయనం చేసే కమీషన్. దీనిని 1979 జనవరి 1 న అప్పటి జనతాపార్టీ కి చెందిన భారత ప్రధానమంత్రి మొరార్జీ దేశాయ్ చే ప్రారంభించబడినది. ఆ కాలంలో ఏర్పాటు చేసిన కమిషన్ ఛైర్మన్ గా బి.పి.మండల్ వ్యవహరించాడు.
xiii. కాంగ్రెస్ పాలనలో సుమారు 10 సంవత్సరాలు మండల్ కమీషన్ నివేదిక బుట్ట దాఖలు అయిపోయింది. తిరిగి కాంగ్రెస్ ప్రభుత్వం పతనమై వి.పి. సింగ్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత మండల్ కమీషన్ నివేదికకు తన ప్రభుత్వ ఆమోద ముద్ర వేసాడు.
xiv. 10,000 కిలోమీటర్ల రథయాత్ర చేసి 1990 అక్టోబర్ 30న అయోధ్య చేరుకోవాలని ప్రణాళిక వేసుకున్న రథయాత్ర అయోధ్యకు చేరక ముందే సమస్తిపూర్ వద్ద శాంతిభద్రతలకు విఘాతం కలుగకుండా ఉండేందుకు అధ్వానీ అరెస్టుకు సింగ్ ఆదేశించాడు. దీని ఫలితంగా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించడంతో లోక్సభలో సింగ్ అవిశ్వాస తీర్మానాన్ని ఎదుర్కొన్నాడు.
xv. అతను 142–346 ఓట్లతో అవిశ్వాసంలో ఓడిపోయే ముందు "మీరు ఎటువండి భారతదేశాన్ని కోరుకుటున్నారు?" అని విపక్షాలను పార్లమెంటులో ప్రశ్నించాడు. నేషనల్ ఫ్రంటులోని కొన్ని పార్టీలు, వామపక్షాలు మాత్రమే అతనిని సమర్థించాయి. సింగ్ 1990 నవంబరు 7 న తన పదవికి రాజీనామా చేసాడు.
xvi. వి.పి.సింగ్ ఎముకల మజ్జ క్యాన్సర్, మూత్రపిండాల వైఫల్యంతో బాధపడి 2008 నవంబరు 27న న్యూఢిల్లీ లోని అపోలో ఆసుపత్రిలో మరణించాడు.
క్రీడలు
స్టీవ్ స్మిత్ నంబర్వన్ @ టెస్టు బ్యాట్స్మెన్ ర్యాంకింగ్స్ :

i. భారత ఓపెనర్ మయాంక్ అగర్వాల్ టెస్టు ర్యాంకింగ్స్లో తొలిసారి టాప్-10లోకి వచ్చాడు. తాజాగా ప్రకటించిన బ్యాట్స్మెన్ ర్యాంకింగ్స్లో (700 పాయింట్లు) పదో ర్యాంకులో నిలిచాడు.
ii. మరోవైపు కెప్టెన్ విరాట్ కోహ్లి (928) రేటింగ్ పాయింట్లను మరింత మెరుగుపరుచుకున్నాడు. నంబర్వన్ ర్యాంకర్ స్టీవ్ స్మిత్ (931)కు అతను కేవలం 3 పాయింట్ల దూరంలో నిలిచాడు.
iii. చతేశ్వర్ పుజారా 4, రహానె  5 ర్యాంకులు సాధించారు. బౌలర్లలో అశ్విన్.. ఒక స్థానాన్ని మెరుగు పరుచుకుని 9వ ర్యాంకులో నిలిచాడు.

అరుణ్ జైట్లీ స్టేడియంలో గంభీర్ పేరిట ఓ స్టాండ్ :

i. ఓపెనర్గా భారత క్రికెట్కు ఎన్నో అద్భుత విజయాలందించిన మాజీ ఆటగాడు గౌతమ్ గంభీర్ పేరిట దిల్లీలోని అరుణ్ జైట్లీ (ఫిరోజ్షా కోట్లా) స్టేడియంలో ఓ స్టాండ్ ఏర్పాటైంది.
ACES Awards ceremony on Jan. 12 in Mumbai :

i. 2019 లో అత్యుత్తమ భారతీయ క్రీడలను జరుపుకునే స్పోర్ట్స్టార్ ACES అవార్డుల రెండవ ఎడిషన్ 2020 జనవరి 12 న ముంబైలో జరుగుతుంది.
ii. ఈ సంవత్సరం భారతీయ క్రీడాకారులు మునుపెన్నడూ లేని విధంగా విభాగాలలో రాణించారు. బ్యాడ్మింటన్ ప్రపంచ ఛాంపియన్షిప్లో స్వర్ణం సాధించిన తొలి భారతీయరాలుగా P.V.సింధు చరిత్ర సృష్టించింది.
iii. ఆస్ట్రేలియాలో తొలిసారిగా టెస్ట్ సిరీస్ గెలిచి భారత పురుషుల క్రికెట్ జట్టు బలీయమైన సరిహద్దును జయించడం, వన్డే ప్రపంచ కప్లో సెమీఫైనల్కు చేరుకోవడం, ఇందులో రోహిత్ శర్మ ఐదు సెంచరీలు సాధించడం, దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్తో జరిగిన హోమ్ టెస్ట్ సిరీస్ను కైవసం చేసుకోవడం లాంటివి జరిగాయి.
iv. అమిత్ పంగల్ ప్రపంచ ఛాంపియన్షిప్లో రజత పతకం సాధించిన తొలి భారతీయ బాక్సర్ అయ్యాడు.
v. ACES 2020 లో, పాపులర్ అవార్డులు, నామినేటెడ్ అవార్డులు మరియు జ్యూరీ అవార్డులు అనే మూడు విభాగాలలో 21 అవార్డులు ప్రదానం చేయబడతాయి.
vi. ఈ పురస్కారాలు భారతదేశాన్ని ‘క్రీడా దేశంగా’ మార్చాలనే కలను సాకారం చేసుకోవటానికి తమ జీవితాలను క్రీడ కోసం అంకితం చేసిన తారలు, భవిష్యత్ తారలు మరియు అలసిపోని నిశ్శబ్ద భాగస్వాములను జరుపుకుంటాయి.
vii. వార్షిక కార్యక్రమంలో భారతీయ క్రీడలతో సంబంధం ఉన్న వాటాదారులు భారత క్రీడ యొక్క వృద్ధి కోసం వారి దృష్టిని పంచుకునే వేదికను సృష్టించడం లక్ష్యంగా పెట్టుకున్నారు.
viii. స్పోర్ట్స్టార్ మ్యాగజైన్ 40 వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని, 2019 అవార్డులు ప్రకాష్ పడుకొనేకు జీవిత సాఫల్య పురస్కారంతో సత్కరించగా, విరాట్ కోహ్లీ మరియు జస్ప్రీత్ బుమ్రా స్పోర్ట్స్ మ్యాన్ ఆఫ్ ది ఇయర్ (క్రికెట్) అవార్డును, మరియు చేతేశ్వర్ పుజారా ఛైర్మన్ ఛాయిస్ అవార్డును ఇతర అవార్డులతో అందుకున్నారు.
ix. క్రీడల ప్రోత్సాహానికి ఉత్తమ రాష్ట్రంగా అవార్డును  ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ అందుకున్నారు.
>>>>>>>>>>>>>>>>  End of the day  <<<<<<<<<<<<<<<<

26th november 2019 current affairs

    కరెంట్ అఫైర్స్ 26 నవంబరు 2019 Tuesday  

 జాతీయ వార్తలు

దేశంలో 16వ సారి జనగణన :
 
i. దేశంలో 1872 నుంచి ప్రతీ పదేళ్లకోమారు జనగణన చేస్తున్నారు. ఇప్పుడు చేస్తున్నది 16వ సారి. స్వాతంత్య్రం వచ్చాక 8వ సారి. తొలిసారి డిజిటల్ విధానంలో ట్యాబ్లో జనాభా లెక్కల నమోదుకు నిర్ణయించారు.
ii. జిల్లా స్థాయిలో కలెక్టర్, మండల స్థాయిలో తహసీల్దార్ జనగణనకు ముఖ్య అధికారులుగా వ్యవహరిస్తారు. పట్టణాల్లో పురపాలక కమిషనర్లకు ఈ బాధ్యతలిచ్చారు.
iii. జాతీయ జనాభా రికార్డు   (ఎన్పీఆర్)లో కుటుంబాలు, కట్టడాల వివరాలన్నీ రికార్డు చేస్తారు. ఇంతకుముందు ఈ లెక్కలను 2010లో తీసుకున్నారు.
iv. రాష్ట్ర జనగణన సంచాలకుడిగా ఐఏఎస్ అధికారి ఇలంబర్తిని నియమించారు.
 ఆంధ్రప్రదేశ్ వార్తలు
అవినీతిపై ఫిర్యాదులకు.. 14400..  ప్రత్యేక కాల్సెంటర్ నంబరును ప్రారంభించిన ఏపీ సీఎం జగన్ :

i. అవినీతిపై ప్రజల నుంచి ఫిర్యాదుల స్వీకరణకు ప్రత్యేక కాల్ సెంటర్ నంబరు 14400ను ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చింది.
ii. ఫిర్యాదు అందిన 15 నుంచి 30 రోజుల్లో దర్యాప్తు పూర్తిచేసి తగిన చర్యలు తీసుకోవాలి. జవాబుదారీతనంతో పనిచేసి, ఫిర్యాదులకు పరిష్కారం చూపినపుడే వ్యవస్థపై నమ్మకం కలుగుతుంది. ఆ దిశగా సంబంధిత శాఖల అధికారులు చర్యలు తీసుకోవాలి అని ఆదేశించారు.
సైన్స్ అండ్ టెక్నాలజీ
భూకంపాలు, సునామీలను మెరుగ్గా గుర్తించే సాధనం :
 
i. భూకంపాలు, సునామీలు, అగ్నిపర్వత విస్ఫోటాలను మెరుగ్గా గుర్తించే అద్భుత సాధనాన్ని అమెరికా శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. ఇది సముద్ర గర్భంలో చిన్నపాటి కదలికలు, మార్పులను సైతం ఇట్టే పసిగట్టేస్తుంది.
ii. సముద్ర గర్భాన్ని పర్యవేక్షించేందుకు ప్రస్తుతం అనేక విధానాలు అందుబాటులో ఉన్నాయి. అయితే ఇతరత్రా ధ్వనుల జోక్యం తక్కువగా ఉండే సముద్ర లోతుల్లోనే అవి బాగా పనిచేస్తాయి.
iii. తీరానికి చేరువలో లోతు తక్కువగా ఉండే ప్రాంతాల్లో పరిస్థితులను గమనించడం చాలా సవాళ్లతో కూడుకున్న వ్యవహారం.  ఇందుకోసం శాస్త్రవేత్తలు ‘షాలో వాటర్ బోయ్’ను రూపొందించారు. సముద్రంలో చమురు, సహజవాయువు అన్వేషణకూ ఇది ఉపయోగపడుతుంది.
Reports/Ranks/Records
Greenhouse gases hit a new record in 2018 : WMO

i. Greenhouse gases in the atmosphere hit a new record in 2018, the World Meteorological Organization said.
ii. The concentration of carbon dioxide surged from 405.5 ppm in 2017 to 407.8 ppm in 2018, exceeding the average annual increase of 2.06 ppm in 2005-2015. The annual increase in methane was the highest since 1998, said the report.
BOOKS
‘హేమంత్ కర్కరే - ఏ డాటర్స్ మెమొయిర్’ – By జూయ్ నవారే

i. 26/11 దాడులు... ప్రపంచాన్నే ఉలిక్కిపడేలా చేసిన మారణహోమం. ఆ దాడుల్లో వెన్నుచూపక ముందుకెళ్లిన పోలీస్ అధికారి హేమంత్ కర్కరే అని చెప్పక్కర్లేదు.
ii. ఆ అమరుడి జీవితాన్ని ప్రపంచానికి పరిచయం చేస్తోంది ఆయన కూతురు. తండ్రిపై పుస్తకం రాసి నేడు(26/11/2019) విడుదల చేస్తోంది.
iii. చివరి క్షణం వరకూ దేశం కోసం పోరాడిన అతని గురించి ప్రపంచానికి తెలియజేయాలనుకుంది ఆయన కూతురు 38ఏళ్ల జూయ్ నవారే. ‘హేమంత్ కర్కరే-ఏ డాటర్స్ మెమొయిర్’ పేరుతో పుస్తకం రాసింది. ఈ ఏడాది నవంబరు 26న కర్కరే 11వ వర్ధంతి సందర్భంగా ముంబయిలో ఆవిష్కరించనుంది.
సినిమా వార్తలు
అయోధ్య కేసు నేపథ్యంలో కంగన చిత్రం ‘అపరాజిత అయోధ్య’ :

i. ఎన్నో వివాదాలకు, ఉద్రిక్తతలకు కారణమైన అయోధ్య అంశం నేపథ్యంగా త్వరలో ఓ చిత్రాన్ని నిర్మించనున్నట్లు ప్రముఖ బాలీవుడ్ నాయిక కంగనా రనౌత్ ప్రకటించింది.
ii. ‘అపరాజిత అయోధ్య’ పేరుతో దీన్ని తెరకెక్కించనున్నట్లు వెల్లడించింది. ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్ స్క్రిప్టును అందించబోతున్నారు.
ముఖ్యమైన రోజులు
70వ రాజ్యాంగ దినోత్సవం (Constitution Day of India) – 26 నవంబర్

  భారత రాజ్యాంగాన్ని ఆమోదించి 70 ఏళ్లు అవుతున్న సందర్భంగా... పార్లమెంటు సెంట్రల్ హాల్లో రాజ్యాంగ దినోత్సవం (సంవిధాన్ దివస్) జరుగనుంది.
  రాజ్యసభ 250వ సమావేశాలకు గుర్తుగా రూపొందించిన రూ.250 విలువైన వెండి నాణేన్ని... ఈ సందర్భంగా రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ఉప రాష్ట్రపతి  వెంకయ్యనాయుడు, ప్రధాని మోదీ ఆవిష్కరిస్తారు.
  ఇప్పటివరకూ జరిగిన 103 రాజ్యాంగ సవరణలకు సంబంధించిన వివరాలతో కూడిన సంకలనాన్నీ వారు విడుదల చేస్తారు. ‘రాజ్యసభ: ద జర్నీ సిన్స్ 1952’ శీర్షికన దీన్ని సిద్ధం చేసినట్టు రాజ్యసభ సచివాలయం తెలిపింది.
  రాజ్యాంగ్యాన్ని తొలిసారిగా 1951లో ఎస్సీ, ఎస్టీ, బీసీల సంక్షేమార్థం సవరించగా... చివరిసారిగా ఆర్థికంగా వెనుకబడిన వారికి విద్య, ఉద్యోగావకాశాల్లో 10% రిజర్వేషన్ కల్పిస్తూ 103వ సవరణ చేపట్టినట్టు వివరించింది.
  ప్రతి సంవత్సరం, నవంబర్ 26 ను జాతీయ రాజ్యాంగ దినోత్సవంగా జరుపుకుంటారు, ఎందుకంటే ఇది 1949 లో రాజ్యాంగ సభచే మన రాజ్యాంగాన్ని స్వీకరించినట్లు సూచిస్తుంది. ఇది రాజ్యాంగాన్ని స్వీకరించిన వార్షికోత్సవంగా పరిగణించబడుతుంది.
  మన దేశానికి లిఖితపూర్వక చట్టాలను అందించడానికి బాబాసాహెబ్ భీమ్ రావు అంబేద్కర్ నాయకత్వంలో 1946 లో రాజ్యాంగ సభ రూపొందించబడింది. కమిటీ చేతితో రాసిన మరియు కాలిగ్రాఫ్ చేసిన రాజ్యాంగాన్ని హిందీ మరియు ఇంగ్లీష్ రెండింటిలోనూ రూపొందించింది. ఇది ఎలాంటి టైపింగ్ లేదా ప్రింట్ ఉపయోగించలేదు.
  మొత్తం 284 మంది సభ్యులతో, రాజ్యాంగ అసెంబ్లీ 26 నవంబర్ 1949 న పాక్షికంగా ఆమోదించబడిన రాజ్యాంగాన్ని రూపొందించింది, ఇది భారత రిపబ్లిక్ చరిత్రలో కొత్త శకానికి నాంది పలికింది. అప్పటి నుండి, నవంబర్ 26 ను భారత రాజ్యాంగ దినోత్సవంగా జరుపుకుంటారు. అంతకుముందు దీనిని జాతీయ న్యాయ దినోత్సవం అని పిలిచేవారు.
  రాజ్యాంగ దినోత్సవం రాజ్యాంగంలో వ్యక్తీకరించబడిన విలువలు మరియు సూత్రాల పట్ల పౌరులను పునరుద్ఘాటించడం మరియు తిరిగి మార్చడం మరియు భారతీయ ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడంలో భారతీయులందరూ తమ సరైన పాత్ర పోషించమని ప్రోత్సహించడం. రాజ్యాంగంలో పొందుపరిచిన ప్రాథమిక విధులపై అవగాహన కల్పించడం కూడా దీని లక్ష్యం.
  భారతదేశం యొక్క రాజ్యాంగం ప్రపంచంలోనే అతి పొడవైన వ్రాతపూర్వక రాజ్యాంగం. రాజ్యాంగాన్ని పూర్తి చేయడానికి సుమారు 2 సంవత్సరాలు, 11 నెలలు, 17 రోజులు పట్టింది.
  వాస్తవానికి, రాజ్యాంగంలో ఒక ఉపోద్ఘాతం (Preamble), 395 Articles (22 భాగాలుగా) మరియు 8 షెడ్యూల్ ఉన్నాయి. ప్రస్తుతం, ఇది ఒక ఉపోద్ఘాతం (Preamble), సుమారు 465 Articles (25 భాగాలుగా విభజించబడింది) మరియు 12 షెడ్యూల్లను కలిగి ఉంది.
ముంబయిలో ఉగ్రదాడులు జరిగి నేటితో పదకొండేళ్లు : 2008 నవంబరు 26-29

i. సరిగ్గా పదకొండేళ్ల కిందట 2008 నవంబరు 26న పాకిస్థాన్ ఉగ్రవాద సంస్థ లష్కరే తొయిబాకు చెందిన పది మంది ఉగ్రవాదులు ముంబైలో ప్రవేశించి నాలుగు రోజుల పాటు మారణహోమానికి పాల్పడ్డారు. నాటి 26/11 ఉగ్రదాడిలో 166 మంది ప్రాణాలు కోల్పోగా, 300 మంది వరకు గాయపడ్డారు. వీరిలో ఆరుగురు అమెరికా పౌరులు సైతం ఉన్నారు.
ii. ఈ ఉగ్రదాడి జరిగి పదేళ్లు పూర్తయిన సందర్భంగా దీని సూత్రధారుల గురించి సరైన సమాచారం ఇస్తే 5 మిలియన్ డాలర్ల రివార్డు ఇస్తామని అగ్రరాజ్యం అమెరికా ప్రకటించింది. ఉగ్రదాడికి సూత్రదారులు, సహాయ పడినవారు, దాడికి ప్రేరేపించిన వారి వివరాలు ఏదైనా తెలియజేస్తే 5 మిలియన్ డాలర్లు అంటే దాదాపు రూ.35కోట్లు నజరానాగా ఇస్తామని డొనాల్డ్ ట్రంప్ యంత్రాంగం వెల్లడించింది.
iii. దక్షిణ ముంబైలో ఛత్రపతి శివాజీ టెర్మినస్, ముంబై చాబాద్ హౌస్, ది ఒబెరాయ్ ట్రైడెంట్,  తాజ్ ప్యాలెస్ & టవర్,  లియోపోల్డ్ కేఫ్, కామా హాస్పిటల్, ది నరిమన్ హౌస్,  మెట్రో సినిమా,  మరియు టైమ్స్ ఆఫ్ ఇండియా భవనం మరియు సెయింట్ జేవియర్స్ కాలేజ్ వెనుక సందులో దాడులకు పాల్పడ్డారు.
జాతీయ పాల దినోత్సవం (వర్ఘీస్ కురియన్ జయంతి) : నవంబర్ 26

i. వర్ఘీస్ కురియన్ (నవంబర్26, 1921 – సెప్టెంబరు 9, 2012) భారతదేశ ప్రముఖ సామాజిక వ్యాపారవేత్త మరియు శ్వేత విప్లవ పితామహుడు. భారతదేశం ప్రపంచ పాల ఉత్పత్తిలో మొదటి స్థానం లో ఉండటంలో ప్రముఖ పాత్ర పోషించాడు.
ii. 2014లో, దేశంలోని డెయిరీ మేజర్లందరూ, ఇండియన్ డెయిరీ అసోసియేషన్తో కలిసి, కురియన్ పుట్టినరోజు నవంబర్ 26 ను జాతీయ పాల దినోత్సవంగా జరుపుకోవాలని సంకల్పించారు
iii. కురియన్ కేరళ లోనికాలికట్ లో నవంబరు 26 1921 న సిరియన్ క్రిస్టియన్ కుటుంబంలో జన్మించారు. ఆయన యొక్క "బిలియన్ లీటర్ ఐడియా" (ఆపరేషన్ ప్లడ్ - ప్రపంచంలో అతి పెద్ద వ్యవసాయాభివృద్ధి కార్తక్రమంగా నిలిచింది.
iv. 1998లో పాల ఉత్పత్తిలో అమెరికా సంయుక్త రాష్ట్రాలను అధిగమించేటట్లు భారత దేశాన్ని నిలిపాడు. పాడి పరిశ్రమ భారతదేశం యొక్క అతిపెద్ద స్వీయ నిరంతర పరిశ్రమ అయ్యింది. అతను, తరువాత దేశం వంట నూనెల ఉత్పత్తిలో కూడా స్వయం ప్రతిపత్తి సాధించేందుకు ప్రయత్నించి, పాక్షికంగా విజయవంతం అయ్యారు.
v. ఆయన 30 విశిష్ట సంస్థలను (AMUL, GCMMF, IRMA, NDDB వంటివి) స్థాపించి వాటిని రైతుల ద్వారా నిర్వహింపజేస్తూ అనేక మంది నిపుణులచే నడిపాడు. ఆయన గుజరాత్ కో-ఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ (GCMMF) కు వ్యవస్థాపక చైర్మన్ గా యున్నపుడు Amul(అమూల్) బ్రాండ్ ఉత్పత్తిని సృష్టించి విజయం సాధించాడు.
vi. బర్రె పాలతో అమూల్ పాలపొడి తయారీ ఆవిష్కరణ విజయంతో ఆయనకు ఆవు పాలతో పాలపొడి తయారీని అనేక పాలఉత్పత్తులు తయారుచేసే దేశాలు వ్యతిరేకించాయి. ఆయన తయారు చేసిన అమూల్ డైరీ విజయం 1965 లో భారత ప్రధాని లాల్ బహాదుర్ శాస్త్రి చే ఆయనను "నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు" కు వ్యవస్థాపక చైర్మన్ గా ఎంపిక చేయబడినది. అమూల్ యొక్క నకలు "ఆనంద్ మోడల్" ను దేశ వ్యాప్తంగా పరిచయం చేయబడినది.
vii. ఆయన 2006 నుండి 2011 వరకు అలహాబాదు విశ్వవిద్యాలయానికి మొదటి ఛాన్సలర్ గా సేవలందించారు.
అవార్డులు మరియు గౌరవాలు :
viii. 1963 రామన్ మెగసెసె అవార్డు; 1965 పద్మశ్రీ ; 1966 పద్మభూషణ్; 1993 ఇంటర్నేషనల్ పెర్సన్ ఆఫ్ ద ఇయర్ అవార్డు ; 1999 పద్మవిభూషణ్.

క్రీడలు
స్పెయిన్దే డేవిస్కప్. ఫైనల్లో కెనడాపై విజయం :

i. స్పెయిన్ జట్టు ఆరోసారి డేవిస్కప్ టైటిల్ను చేజిక్కించుకుంది. ఫైనల్లో డబుల్స్ మ్యాచ్తో పని లేకుండానే కెనడాపై విజయం సాధించింది. రెండో సింగిల్స్లో రఫెల్ నాదల్ 6-3, 7-6 (9-7)తో షపోవలోవ్ను ఓడించడంతో స్పెయిన్ 2-0తో తిరుగులేని ఆధిక్యం సాధించి విజేతగా నిలిచింది.
ii. తొలి మ్యాచ్లో రాబర్టో బటిస్టా 7-6 (7-3), 6-3తో ఫెలిక్స్ అగర్-అలియాసిమ్పై విజయం సాధించాడు.
iii. 19 సార్లు గ్రాండ్స్లామ్ ఛాంపియన్ నాదల్కు ఇది నాలుగో డేవిస్కప్ టైటిల్. ఇంతకుముందు 2004, 2009, 2011లో డేవిస్కప్ గెలిచిన స్పెయిన్ జట్టులో ఉన్నాడు.
>>>>>>>>>>>>>>>>  End of the day  <<<<<<<<<<<<<<<<
          

25th november 2019 current affairs

✍  కరెంట్ అఫైర్స్ 25 నవంబరు 2019 Monday ✍

జాతీయ వార్తలు

 ప్రధాని నరేంద్ర మోదీ ‘మన్ కీ బాత్’ కార్యక్రమ ప్రసంగం :
 
అమ్మభాషను విస్మరిస్తే అభివృద్ధి అసాధ్యం.. ఇది అంతర్జాతీయ స్థానిక భాషల సంవత్సరం :
i. మాతృభాషను నిర్లక్ష్యం చేస్తే అభివృద్ధి అసాధ్యమని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. దేశ ప్రజలనుద్దేశించి ఆదివారం ఆయన ‘మన్ కీ బాత్’ కార్యక్రమంలో ప్రసంగించారు.
ii. ఐక్యరాజ్య సమితి (ఐరాస) కూడా మాతృభాషల ప్రాధాన్యాన్ని గుర్తించిందని, అందుకే 2019ని ‘అంతర్జాతీయ స్థానిక భాషల సంవత్సరం’గా ప్రకటించిందని చెప్పారు. అంతరించే దశలో ఉన్న భాషలను కాపాడడమే దీని ఉద్దేశమని తెలిపారు.
iii. ‘భారత మాతకు 30 కోట్ల ముఖాలు.. కానీ ఒకటే శరీరం. 18 భాషలు మాట్లాడుతుంది..కానీ ఒకేలా ఆలోచిస్తుంది’ అంటూ నాడు ప్రముఖ తమిళ కవి సుబ్రహ్మణ్య భారతి రాసిన కవితను ఉటంకించారు.
iv. ఉత్తరాఖండ్లోని దారుచులా ప్రాంతంలో రంగ్ జాతి ప్రజలు లిపిలేని తమ భాష ‘రంగ్లో’ను కాపాడుకోవడానికి   చేస్తున్న ప్రయత్నాలను ఉదహరించారు. ఆ భాష మాట్లాడే వారు పదివేల మంది వరకు ఉంటారని చెప్పారు. వారంతా వాట్సప్ గ్రూపులు ఏర్పాటు చేసుకొని భాషను అభివృద్ధి చేసుకుంటున్నారని తెలిపారు. వాట్సపే వారికి తరగతిగదిగా మారింది.
v. ఎవరైనా అభివృద్ధి చెందాలంటే తొలుత వారి భాష అభివృద్ధి చెందాల్సి ఉందంటూ 150 ఏళ్ల క్రితం ఆధునిక హిందీ  పితామహుడు భారతేందు హరిశ్చంద్ర చేసిన సూచనను కూడా గుర్తుచేశారు.
విశాఖ స్కూబా డైవర్లకు ప్రశంస :
vi. ప్లాస్టిక్ వ్యర్థాల నిర్మూలనకు విశాఖపట్నానికి చెందిన స్కూబా డైవర్లు విశేషమైన కృషి చేస్తున్నారని ప్రధాని మోదీ ప్రశంసించారు.
vii. ప్రతి రోజూ సముద్రంలో వంద మీటర్ల లోపలికి వెళ్లి పాస్టిక్ వ్యర్థాలను సేకరిస్తున్నారు. 13 రోజుల్లోనే 4,000 కేజీల చెత్తను వెలికి తీశారు.
viii. వారికి స్థానిక మత్స్యకారులు అన్ని విధాలుగా సహకరిస్తున్నారు. ఓ చిన్న ప్రయత్నం ఇప్పుడు పెద్ద ఉద్యమంగానే రూపుదిద్దుకోనుంది అని చెప్పారు. దీన్ని ఆదర్శంగా తీసుకొని ప్లాస్టిక్ రహిత భారత్ కోసం అందరూ ప్రతిజ్ఞ చేయాలని పిలుపునిచ్చారు.
పుష్కరాలు నదుల ప్రాధాన్యాన్ని తెలియజేస్తాయి :
ix. బ్రహ్మపుత్ర పుష్కరాలకు తగిన ప్రచారం లభించలేదంటూ ఫిర్యాదు అందిందని తెలిపారు.  పుష్కరాలు నదుల ప్రాధాన్యాన్ని తెలియజేస్తాయని చెప్పారు.
x. వచ్చే ఏడాది ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటకల్లో తుంగభద్ర పుష్కరాలు జరుగుతాయని వివరించారు.
రాజ్యాంగ రచనకు మూడేళ్ల అవిరళ కృషి. 70 వసంతాల రాజ్యాంగం :

i. కాలం 3 సంవత్సరాలు, మథనం 165 రోజులు, తయారైన అధికరణలు 395, రూపొందిన షెడ్యూళ్లు 12, ఆమోదం పొందింది 1949 నవంబరు 26, అమల్లోకి వచ్చింది 1950 జనవరి 26.. గణాంకాల్లో చూస్తే ఇదీ భారత రాజ్యాంగ స్వరూపం.
ii. ఒక్కో అధికరణం రూపొందడానికి ఎంత భావ సంఘర్షణ జరిగిందో చెప్పేందుకు 11 మహా సంపుటాలే సాక్ష్యాలు.
iii. మొదటి రాజ్యాంగ పరిషత్ సమావేశం 1946 డిసెంబరు 9న జరిగింది. రాజ్యాంగ పరిషత్లో 82 శాతం సభ్యులు కాంగ్రెస్కు చెందిన వారే. వీళ్లందరి ఆలోచనలు, దృక్పథాలు ఒక తీరులో ఉండేవి కావు. వీళ్లందరినీ సమన్వయపరుచుకుంటూ ప్రపంచంలో అతి పెద్దదయిన లిఖిత రాజ్యాంగాన్ని రూపొందించడం మామూలు విషయం కాదు.
iv. రాజ్యాంగ ముసాయిదా రచనా కమిటీ సారథ్యాన్ని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్కు అప్పగించడమే అందుకు నిదర్శనం.
 
మహామహుల కృషి :
v. 300 మంది వరకు రాజ్యాంగ పరిషత్లో ఉన్నప్పటికీ కీలక పాత్ర వహించింది 20 మంది మాత్రమే. కాంగ్రెస్ వైపు నుంచి జవహర్లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభ్భాయ్ పటేల్, బాబూ రాజేంద్రప్రసాద్ ముఖ్యభూమిక పోషించారు.
vi. కెం.ఎం.మున్షీ, అల్లాడి కృష్ణస్వామి అయ్యర్ల పాత్ర కూడా గణనీయమైందే. రాజ్యాంగ పరిషత్కు న్యాయ సలహాదారుగా వ్యవహరించిన బి.ఎన్.రావు, చీఫ్ డ్రాఫ్ట్స్మన్గా వ్యవహరించిన ఎస్.ఎన్.ముఖర్జీలదీ అద్వితీయ పాత్రే.
vii. బ్రిటిష్ పాలకులు రూపొందించిన 1935 భారత ప్రభుత్వ చట్టంలోని చాలా విషయాలను భారత రాజ్యాంగంలో పొందుపరిచారు. ఆధునిక ప్రజాస్వామ్య దేశాల అనుభవాల నుంచి చాలా విషయాలు తీసుకున్నారు.
viii. 1928 ఒలింపిక్స్లో భారత హాకీ జట్టుకు సారథ్యం వహించి బంగారు పతకాన్ని సాధించటంలో కీలకపాత్ర పోషించిన జైపాల్సింగ్ తన అద్భుత వాదనాపటిమతో దేశంలో గిరిజనుల దుస్థితిని సభ్యుల దృష్టికి తీసుకొచ్చారు. అనంతరం చర్పోపచర్చలు జరిగి గిరిజనులకు కూడా రిజర్వేషన్లు కల్పించాలని నిర్ణయించారు.
ix. ప్రాథమిక హక్కుల విషయంలో దాదాపు ఏకాభిప్రాయం వ్యక్తమైంది. రాజ్యాంగ లక్ష్యాలను సూచించే తీర్మానాన్ని 1946 డిసెంబరు 13న నెహ్రూ రాజ్యాంగ పరిషత్లో ప్రవేశపెట్టారు. అధికారభాషగా హిందీని గుర్తిస్తూ.. 15 ఏళ్లపాటు ఇంగ్లీష్ని కొనసాగించాలని నిర్ణయించారు.
x. భూసంస్కరణలకు, హిందూ కోడ్ బిల్లుకు అప్పట్లో రాష్ట్రపతి నుంచే అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. తాను మంత్రివర్గ సలహాకు బద్ధుడనై ఎందుకుండాలని రాష్ట్రపతి రాజేంద్రప్రసాద్ ప్రశ్నించారు.
xi. అత్యవసర పరిస్థితి కాలంలో పలు రాజ్యాంగ మౌలిక నియమాలను నీరుగార్చటానికి 42వ రాజ్యాంగ సవరణను తీసుకువచ్చారు. తర్వాత వచ్చిన జనతా ప్రభుత్వం ఆ మార్పులను నిరోధిస్తూ రాజ్యాంగ సవరణను తీసుకుని రావటంతో పరిస్థితి కుదుటపడింది.
xii. కేశవానందభారతి కేసులో రాజ్యాంగ మౌలిక నిర్మాణానికి ఇచ్చిన నిర్వచనం కార్యనిర్వాహకవర్గం బాధ్యతాయుతంగా వ్యవహరించడానికి ఎంతో తోడ్పడింది. 1990ల్లో లౌకిక వాదం ఒక విలువగా చాలా ఒడిదుడుకులకు లోనైనా తట్టుకుంది. మహా ఉద్గ్రంథంగా వేనోళ్ల కొనియాడే భారత రాజ్యాంగం సరిగ్గా 70 ఏళ్ల క్రితం.. 1949 నవంబరు 26న ఆమోదం పొందింది.
 
xiii. బి.ఆర్.అంబేడ్కర్ : “రాజ్యాంగం ఎంత మంచిదైనా దాన్ని అమలు చేసేవారు మంచివారు కానట్లయితే అది చెడ్డ ఫలితాల్ని ఇస్తుంది. ఎంత చెడు రాజ్యాంగమైనా దాన్ని అమలు చేసేవాళ్లు మంచివాళ్లయితే అది మంచి ఫలితాలను ఇస్తుంది”.
xiv. డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ : “భారత రాజ్యాంగం దేశ ప్రజల  ఐక్యతకు ప్రతీక. కోట్ల మంది భారతీయుల సంక్షేమానికి ఇది పూచీగా నిలుస్తుంది. శ్రేయోరాజ్యం, సమ సమాజ స్థాపనకు దోహదపడుతుంది”.
xv. జవహర్లాల్ నెహ్రూ : “సకల సమస్యల్నీ రాజ్యాంగమే పరిష్కరిస్తుందనుకోవడం తప్పు. మేధోశక్తి, కఠోర శ్రమతో సమస్యల్ని పరిష్కరించుకోవచ్చు. రాజ్యాంగ ప్రవేశిక భారతానికి ఒక నిశ్చితమైన తీర్మానం, హామీ”.
ప్రజాస్వామ్య విభూషణం. దేశానికి రాజ్యాంగమే మూలస్తంభం :

i. రాజ్యాంగ 17వ ప్రకరణ అనాదిగా కొనసాగుతున్న అంటరానితనమనే సాంఘిక దురాచారాన్ని నిషేధించింది. ఇలాంటి హామీలన్నీ ఒక ఎత్తయితే.. స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన న్యాయ వ్యవస్థను ఏర్పాటు చేయడం మరో కీలకాంశం.
ii. సమాఖ్య వ్యవస్థకు నాంది పలికిన అమెరికా రాజ్యాంగం భారత రాజ్యాంగాన్ని ప్రభావితం చేసినప్పటికీ.. మన రాజ్యాంగ నిర్మాతలు అర్ధ సమాఖ్య వ్యవస్థ వైపు మొగ్గుచూపారు.
iii. రాజ్యాంగ నిర్మాతలు పార్లమెంటరీ తరహా ప్రభుత్వాన్నే ఎంపిక చేశారు.  దేశంలోని వివిధ ప్రాంతాలకు, వర్గాలకు పాలన బాధ్యతల్లో సముచిత స్థానాన్ని కల్పిస్తూ.. అధ్యక్ష తరహా వ్యవస్థలో తలెత్తే అధికార కేంద్రీకరణను ఇది నివారిస్తుంది.
iv. రెండో ప్రపంచ యుద్ధానంతరం స్వాతంత్య్రాన్ని పొందిన అనేక దేశాలు ప్రజాస్వామ్యం నుంచి నిరంకుశం వైపు మళ్లాయి. యుగొస్లావియా, సోవియట్ యూనియన్, సూడాన్ లాంటి దేశాలు విచ్ఛిన్నమయ్యాయి. భారతదేశం మాత్రం నేటికీ ప్రజాస్వామ్య దేశంగా కొనసాగుతూ తన ప్రాదేశిక సమగ్రతను పరిరక్షించుకుంటోందంటే అది మన రాజ్యాంగంలో పొందుపరిచిన అదుపులు, అన్వయాల(చెక్స్ అండ్ బ్యాలెన్సెస్) ఫలితమే.
దేశ గతిని మార్చిన ముఖ్య సవరణలు :

i. మారుతున్న పరిస్థితులు, ఎదురవుతున్న సవాళ్లు, పెరుగుతున్న అవసరాల నేపథ్యంలో.. రాజ్యాంగ మౌలిక సూత్రాలకు భంగం కలగకుండా వివిధ లక్ష్యాలతో రాజ్యాంగాన్ని ఇప్పటివరకు 103 సార్లు సవరించారు.

ii. తొలి సవరణ (1951) : భూ సంస్కరణలు, ఇతర చట్టాలకు న్యాయ సమీక్ష నుంచి రక్షణ కల్పించారు. మాట్లాడే హక్కుకు 3 పరిమితులను విధించారు.
iii. ఏడో సవరణ (1956) : దేశాన్ని భాషా ప్రాతిపదికన 14 రాష్ట్రాలు, 6 కేంద్ర పాలిత ప్రాంతాలుగా పునర్విభజించారు. భాషల పరిరక్షణకు ప్రాథమిక పాఠశాలల్లో మాతృభాషలోనే బోధించేలా 350ఏ ప్రకరణ జోడించారు.
iv. 24వ సవరణ (1971) : రాజ్యాంగంలోని ఏ భాగాన్నైనా సవరించే అధికారం లోక్సభకు కట్టబెట్టారు. ఏదైనా రాజ్యాంగ సవరణను పార్లమెంటు ఉభయసభలు అంగీకరించి, రాష్ట్రపతికి నివేదిస్తే ఆయన తప్పనిసరిగా ఆమోదించాలన్నారు.
v. 42వ సవరణ (1976) : సామ్యవాద, లౌకిక, సమగ్రత అనే మూడు పదాలను ప్రవేశికకు అదనంగా జోడించారు.పౌరులకు ప్రాథమిక విధులను నిర్దేశించారు. న్యాయ సమీక్ష, రిట్ పిటిషన్ల విచారణలో సుప్రీం, హైకోర్టుల పరిధి తగ్గించి, రాజ్యాంగ సవరణలను న్యాయసమీక్ష పరిధి నుంచి తొలగించారు. జాతీయ న్యాయ సేవల సంస్థను ఏర్పాటుచేశారు.
vi. 44వ సవరణ (1978) : అత్యయిక పరిస్థితి ప్రకటించే నిబంధనలో ‘అంతర్గత సమస్యలు’ అనే పదం స్థానంలో ‘సైనిక తిరుగుబాటు’ అనే పదాన్ని చేర్చారు. కేంద్ర మంత్రివర్గం రాతపూర్వక సలహా ఇస్తేనే రాష్ట్రపతి అత్యయిక పరిస్థితిని విధించాలి. ప్రాథమిక హక్కుల జాబితా నుంచి ఆస్తిహక్కు తొలగింపు.
vii. 61వ సవరణ (1988) : రాజీవ్గాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు 1988లో రాజ్యాంగానికి 61వ సవరణ చేశారు. అప్పటివరకు 21 ఏళ్లుగా ఉన్న ఓటు హక్కు వయసును ఏకంగా మూడేళ్లు తగ్గిస్తూ 18 ఏళ్లకు కుదించారు. నాటి నుంచే నవ యువత సైతం ఓటేస్తోంది.
viii. 73, 74 సవరణలు (1992) : గ్రామ పంచాయతీలు, పట్టణ స్థానిక సంస్థలకు రాజ్యాంగబద్ధ హోదా కల్పించారు. ‘మున్సిపాలిటీలు’ అనే కొత్త భాగాన్ని చేర్చారు. అన్ని స్థానిక సంస్థలకు ప్రత్యక్ష ఎన్నికలకు ఆదేశం.
ix. 86వ సవరణ (2002) : కొత్తగా విద్యాహక్కును చేర్చారు. 6 నుంచి 14 ఏళ్ల వయసులోని బాలబాలికలు అందరికీ ఉచిత, నిర్బంధ విద్య అందించాలని నిర్దేశించారు.
x. 101వ సవరణ (2016) : దేశంలో వస్తు, సేవల పన్ను(జీఎస్టీ)ని అమలులోకి తెస్తూ కొత్తగా 269ఏ, 279ఏ ప్రకరణల ఏర్పాటు.
xi. 102వ సవరణ (2018) : వెనుకబడిన తరగతుల జాతీయ కమిషన్ ఏర్పాటు. బీసీల జాబితాలో మార్పులు, చేర్పులపై అధ్యయనం చేసే బాధ్యత అప్పగింత.
xii. 103వ సవరణ (2019) : విద్య, ఉద్యోగాల్లో ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు 10% రిజర్వేషన్ల కల్పన.
నిర్దేశపు అడుగులివీ.. రాజ్యాంగ పరిషత్ ఆవిర్భావం :

i. భారత్లోని రాష్ట్రాల శాసనసభలకు తొలుత ఎన్నికలు నిర్వహించి.. తర్వాత రాజ్యాంగ పరిషత్ సభ్యులను ఎన్నుకుంటామంటూ 1945 సెప్టెంబరు 19న ఆకాశవాణి (ఆల్ ఇండియా రేడియో)లో నాటి గవర్నర్ జనరల్ లార్డ్ వేవెల్ ప్రకటనతో రాజ్యాంగ పరిషత్ ఏర్పాటుకు అంకురార్పణ జరిగింది. 1946 డిసెంబరు 6న రాజ్యాంగ పరిషత్ ఆవిర్భావం జరిగింది.
ii. రాజ్యాంగ పరిషత్ శాశ్వత అధ్యక్షుడిగా డాక్టర్ బాబూ రాజేంద్రప్రసాద్, ఉపాధ్యక్షులుగా హెచ్సీ ముఖర్జీ, కృష్ణమాచారి, న్యాయ సలహాదారుగా బి.ఎన్.రావు ఎన్నికయ్యారు.
iii. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన అనంతరం 1947 ఆగస్టు 29న డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ అధ్యక్షతన ఆరుగురు సభ్యులతో రాజ్యాంగ రచనా కమిటీ ఏర్పాటైంది.

iv. 1929 డిసెంబరు 31 : నెహ్రూ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు.
v. 1930 జనవరి 26 : ‘సంపూర్ణ స్వరాజ్యం’ ప్రకటనను బహిరంగంగా విడుదల చేశారు. ఆ రోజు నుంచి జనవరి 26వ తేదీని భారత స్వాతంత్య్ర దినోత్సవంగా స్వాతంత్రోద్యమకారులు పాటిస్తూ వచ్చారు.
vi. 1946 డిసెంబరు 9 : జేబీ కృపలానీ ఆధ్వర్యంలో పార్లమెంటులోని రాజ్యాంగ (సెంట్రల్) హాల్లో రాజ్యాంగ పరిషత్ తొలి సమావేశం జరిగింది. పరిషత్ తాత్కాలిక అధ్యక్షుడిగా సచిదానంద సిన్హా ఎన్నికయ్యారు. తమకు ప్రత్యేక దేశం, ప్రత్యేక రాజ్యాంగ పరిషత్ కావాలని డిమాండ్ చేస్తూ ముస్లింలీగ్ ఈ సమావేశాన్ని బహిష్కరించింది.
vii. 1947, ఆగస్టు 29 : భారత రాజ్యాంగ రచనకు ఎన్నికైన రాజ్యాంగ పరిషత్ వివిధ అంశాల పరిశీలనకు 22 కమిటీలను, 7ఉప కమిటీలను ఏర్పాటుచేసింది. వీటిలో అత్యంత ముఖ్యమైన ముసాయిదా(డ్రాఫ్టింగ్) కమిటీని 1947, ఆగస్టు 29న డా.బి.ఆర్.అంబేడ్కర్ అధ్యక్షుడిగా, ఆరుగురు సభ్యులతో ఏర్పాటు చేశారు.
viii. 1948 ఫిబ్రవరి 21 : ముసాయిదా రాజ్యాంగాన్ని 395 నిబంధనలతో, 8 అనుబంధాలతో ప్రచురించి రాష్ట్ర శాసనసభలకు, పత్రికలకు ఇచ్చారు. ముసాయిదా రాజ్యాంగంపై ప్రజలు తమ అభిప్రాయాలు పంపేందుకు 8 నెలల సమయం కేటాయించారు. 1948 నవంబరు 4న పరిషత్తు సమావేశమై చర్చను ప్రారంభించింది.
ix. 1949 నవంబరు 26 : 2వేల సవరణల అనంతరం ప్రజాభి   ప్రాయాలకు పట్టం కడుతూ రూపొందించిన ముసాయిదా రాజ్యాంగానికి రాజ్యాంగ సభ ఆమోదం తెలిపింది.
x. 1947 జనవరి 22 : రాజ్యాంగ మౌలిక నియమాలను విశదీకరిస్తూ రూపొందించిన ‘లక్ష్యాలు-ఆశయాలు’ తీర్మానాన్ని జవహర్లాల్ నెహ్రూ ప్రవేశపెట్టారు. 1947 జనవరి 22న ఈ తీర్మానానికి ఏకగ్రీవ ఆమోదం లభించింది.
xi. 1950 జనవరి 24 : రాజ్యాంగ సభ చివరి సమావేశం నిర్వహించి రాజ్యాంగానికి పూర్తిస్థాయిలో ఆమోదం తెలిపారు. ఏక పౌరసత్వం, రాష్ట్రపతి, స్పీకరు, ఉపస్పీకరు పదవులు, ప్రొవిజినల్ పార్లమెంటు తక్షణం అమల్లోకి వచ్చాయి.
xii. 1950 జనవరి 26 : భారతదేశ రాజ్యాంగం అమల్లోకి వచ్చిన పర్వదినం.
xiii. 1947లో బ్రిటిష్ ప్రభుత్వం భారతదేశానికి స్వాతంత్య్రం ఇచ్చినప్పుడు కూడా.. జనవరి 26వ తేదీనాడే ఇవ్వాలని మన సమరయోధులు కోరినప్పటికీ.. నాటి గవర్నర్ జనరల్ మౌంట్బాటన్ మాత్రం ఆగస్టు 15వ తేదీవైపు మొగ్గుచూపారు. 1930 నాటి సంపూర్ణ స్వరాజ్య ప్రకటన జనవరి 26వ తేదీన జరిగింది కాబట్టి.. అదే తేదీన (1950లో) రాజ్యాంగాన్ని అమల్లోకి తెచ్చారు.
xiv. ఈ ప్రక్రియ మొత్తానికి అప్పట్లో  రూ.64 లక్షల ఖర్చయింది. రాజ్యాంగ అసలు ప్రతిని ఆంగ్లంలో ప్రేమ్బెహారీ నారాయణ్ రైజదా అందమైన దస్తూరీలో ఇటాలిక్ ఫాంట్లో రాశారు. ఎలాంటి పారితోషికం తీసుకోలేదు. అందుకు బదులుగా ప్రతి పేజీలో తన పేరు, మొదటి పేజీలో తనతోపాటు తన తాత పేరు రాసుకోవడానికి అనుమతి కోరారు.
xv. రాజ్యాంగం తొలి ప్రతిని డెహ్రాడూన్లో ప్రచురించగా... ఫొటోలను సర్వే ఆఫ్ ఇండియా సమకూర్చింది. రాజ్యాంగ పరిషత్ సభ్యుల్లో జాతిపిత మహాత్మాగాంధీ లేరు.
xvi. భారత రాజ్యాంగ పరిషత్ చిహ్నం ఏనుగు (ఐరావతం). దీనినే తర్వాత మన దేశ వారసత్వ జంతువుగా గుర్తించారు.
xvii. రాజ్యాంగం హిందీ, ఆంగ్లం మూల ప్రతులను పార్లమెంటు గ్రంథాలయంలో హీలియంతో నింపిన పెట్టెల్లో భద్రపరిచారు. హీలియం వాయువు ఇతర పదార్థాలతో రసాయన చర్యలకు గురవదు.
xviii. ‘‘ప్రాథమిక హక్కులతో సహా రాజ్యాంగంలోని ఏ అంశాన్నైనా సవరించే అధికారం పార్లమెంటుకు ఉంది. కానీ రాజ్యాంగ ‘మౌలిక స్వరూపాన్ని’ మార్చే అధికారం లేదు’’ - 1973లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఇది.
బీఎన్ రావు అవిరళ కృషి. రాజ్యాంగ పరిషత్కు న్యాయ సలహాదారు :
i. భారత రాజ్యాంగ పరిషత్కు న్యాయ సలహాదారుగా బెనగళ్ నర్సింగరావు అందించిన సేవలు అనన్య సామాన్యం. బీఎన్ రావుగా సుప్రసిద్ధుడైన ఆయన భారత తొలితరం ఐసీఎస్ అధికారి.

ii. బ్రిటిష్ పాలనలో 1935లో వచ్చిన భారత ప్రభుత్వ చట్టం రూపకల్పనలో కీలకపాత్ర పోషించారు. విజయవంతంగా నడుస్తున్న ప్రస్తుత సమాఖ్య వ్యవస్థను ఆయన అప్పుడే ప్రవేశపెట్టారు.
iii. 1946లో భారత రాజ్యాంగ పరిషత్కు న్యాయ సలహాదారు హోదాలో బీఎన్ రావు అందరినీ ఒప్పించగలిగారు. 1948 ఫిబ్రవరిలో రాజ్యాంగ తొలి ముసాయిదా ప్రతిని తయారుచేశారు.
ఏ దేశం నుంచి ఏం సంగ్రహించాం ?

తెలంగాణ వార్తలు
ప్రపంచ ఔషధరంగంలో అతిపెద్ద సమీకృత పార్క్ ‘ఔషధనగరి’ :

i. రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలంలో ఏర్పాటు చేస్తున్న ఔషధనగరి ప్రపంచ ఔషధరంగంలో అతిపెద్ద సమీకృత పార్క్. మొత్తం 19,333 ఎకరాలలో ఏర్పాటుకు ప్రణాళిక సిద్ధమయింది.
ii. కేంద్రం పర్యావరణ అనుమతులు ఇచ్చింది. దీని ద్వారా రూ.64,000 కోట్ల పెట్టుబడులు; ప్రత్యక్షంగా, పరోక్షంగా సుమారు 5.60 లక్షల మందికి ఉద్యోగాలను అంచనా వేసింది. జాతీయ ప్రాధాన్యం కలిగిన ప్రాజెక్టుగా దీనిని గుర్తించి కేంద్ర ప్రభుత్వం నిమ్జ్ హోదా ఇచ్చింది.

కాకతీయ మెగా జౌళి పార్కు @ వరంగల్ గ్రామీణ జిల్లా :


i. వరంగల్ గ్రామీణ జిల్లాలో 2,100 ఎకరాల్లో కాకతీయ మెగా జౌళి పార్కు ఏర్పాటవుతోంది. 2017 అక్టోబరు 22న కేసీఆర్ శంకుస్థాపన చేశారు.
ii. రూ.10 వేల కోట్ల పెట్టుబడులు, లక్ష మందికి ఉపాధిని దీని ద్వారా అంచనా వేశారు. కేంద్ర ప్రభుత్వం దీనిని జాతీయ జౌళిపార్కుల పథకం కింద గుర్తించాలని ప్రభుత్వం కోరుతోంది.
ఇతర రాష్ట్రాలు / కేంద్ర పాలిత ప్రాంతాల వార్తలు
సాంగ్లీ రాజవంశీయుల స్విస్ ఖాతాలపై దర్యాప్తు. వివరాలివ్వాలని స్విట్జర్లాండ్ను కోరిన భారత ప్రభుత్వం :
i. మహారాష్ట్రలోని సాంగ్లీ రాజవంశీయుల స్విస్ బ్యాంకు ఖాతాలపై భారత ప్రభుత్వం దర్యాప్తు జరపనుంది. సాంగ్లీ రాజవంశానికి చెందిన విజయ్సింగ్ మాధవరావు పట్వర్ధన్, ఆయన భార్య రోహిణిలపై విచారణ జరగనుంది.
ii. వారికి సంబంధించిన ఖాతాల సమాచారం ఇవ్వాలని భారత ప్రభుత్వం స్విట్జర్లాండ్ను కోరింది.
సదస్సులు
India to host SCO forum of Young Scientists and Innovators 2020 :
 
i. India will host the Shanghai Cooperation Organisation (SCO) Forum of Young Scientists and Innovators in 2020.
ii. The 5th Meeting of Shanghai Cooperation Organisation (SCO) Member States Heads of Ministries and Departments of Science and Technology and Permanent Working Group on S&T Cooperation concluded in Moscow, Russia.
iii. Eight SCO member states’ heads of delegation signed the Protocol of the 5th Meeting of Ministries and Departments of Science and Technology at the end of the three-day meeting.
iv. The meeting agreed with India & proposal to host the SCO Forum of Young Scientists and Innovators in 2020.
Reports/Ranks/Records
Latest survey by NSO debunks Swachh Bharat ODF claims :

i. The latest National Statistical Office (NSO) survey on sanitation debunked the claims of an open defecation-free or ODF India made by the Centre’s flagship Swachh Bharat scheme, although it did record great progress in toilet access and use in rural areas.
ii. The results, released on Saturday, showed that about 71% of rural households had access to toilets at a time when the Centre was claiming 95% had access.
iii. On October 2, 2019, Prime Minister Narendra Modi declared that the whole country was ODF with complete access to toilets.
iv. The survey was carried out between July and December 2018, with a reference date of October 1. Large States which had been declared ODF — that is, 100% access to toilets and 100% usage — even before the survey began included Andhra Pradesh, Gujarat, Maharashtra and Rajasthan.
v. According to the NSO, almost 42% of the rural households in Jharkhand had no access to a toilet at that time. In Tamil Nadu, the gap was 37%, followed by 34% in Rajasthan.
vi. In Gujarat, which was one of the earliest States declared ODF, back in October 2017, almost a quarter of all rural households had no toilet access, the NSO data showed.
Manipur, J&K top UAPA cases list :

i. More than 35% of the cases registered under the stringent Unlawful Activities (Prevention) Act (UAPA) were recorded in Manipur, show the National Crime Records Data (NCRB) provided by the Home Ministry in the Rajya Sabha.
ii. Under the UAPA, the investigating agency can file a chargesheet in maximum 180 days after the arrests and the duration can be extended further after intimating the court. The anti-terror Act has death penalty and life imprisonment as maximum punishment.
iii. The NCRB is yet to publish the crime report for 2018. The data reveal that though U.P. has recorded only 12% of the cases, it topped the States in the number of arrests made.
Art and Culture
Ocean Dance Festival 2019 starts in Cox Bazar :

i. The  Ocean Dance Festival 2019 kicked off in Cox Bazar of Bangladesh. Ocean Dance Festival is the largest international dance festival of Bangladesh in which more than 200 dancers, choreographers and scholars from 15 countries are participating.
ii. The theme of this year’s festival is ‘Bridging the distance’ or Durotter Shetubandhan. The dances performed at the event will show the idea of bridging cultural and economic distances.
iii. The festival is being organised by the Nrityajog which is the Bangladesh wing of World Dance Alliance (WDA). The festival aims to expand cultural tourism in Bangladesh. It also features seminars and discussion apart from the dance performances by the artists.
Sangai Festival 2019 begins in Manipur :

i. Every year the State of Manipur celebrates the “Manipur Sangai Festival” from 21st to 30th November. The ‘Festival’ is named after the State animal, Sangai, the brow-antlered deer found only in Manipur.
ii. It started in the year 2010 and has grown over the years into a big platform for Manipur to showcase its rich tradition and culture to the world.
iii. The festival is organized by the State Tourism Department and biggest festival held annually to promote tourism. The formal inaugural function of the festival was held at Hapta Kangjeibung at Imphal.
iv. During the festival, cultural programmes, traditional games, folk dance and classical music will be performed by different communities of the State as well as from other States.
మరణాలు
Former Madhya Pradesh CM Kailash Joshi dead :

i. Bharatiya Janata Party leader and former Madhya Pradesh Chief Minister Kailash Joshi died after prolonged illness.
ii. Mr. Joshi served as the first Janata Party Chief Minister of the State from 1977 to 1978. He represented the Bhopal Lok Sabha constituency from 2004 to 2014.
ముఖ్యమైన రోజులు
NCC celebrates its 71st Raising Day : 24 November

i. The National Cadet Corps (NCC), the world’s largest uniformed youth organization, is celebrating its 71st Raising Day on 24 November.
ii. The NCC Raising Day was also celebrated all over the country with the cadets participating in marches, cultural activities and social development programs.
iii. NCC continues its relentless efforts towards moulding the youth into responsible citizens of the country.
iv. Director-General of NCC : Lt Gen Rajeev Chopra.
v. Founder : Government of the United Kingdom.
vi. Founded : 16 April 1948.
vii. Headquarters location : New Delhi.
ప్రపంచ స్త్రీ హింసా నిరోధక దినోత్సవం (International Day for the Elimination of Violence against Women) : నవంబర్ 25
 
i. Theme 2019 : “Orange the World: Generation Equality Stands Against Rape”
ii. స్త్రీల భద్రత, స్వేచ్ఛ, సమానత్వం, ఆత్మగౌరవ పరిరక్షణే లక్ష్యంగా ఏటా నవంబర్ 25న ప్రపంచవ్యాప్తంగా స్త్రీలపై హింసా నిరోధక దినోత్సవంగా జరుపుకోవాలని నిర్ణయించింది. ఈ రోజు 1993 లో UN జనరల్ అసెంబ్లీ చేత స్థాపించబడింది.
iii. గృహహింస చట్టం-2005 వివాహ బంధంలో ఉండి హింసకు గురవుతున్న మహిళలకు వర్తిస్తుంది. అధిక కట్నం, పుట్టింటి ఆస్తిలో భాగం, విలాసాలకు డబ్బు తీసుకురావాలని అడగడం, వివాహేతర సంబంధాలతో చిత్రవధకు గురిచేయడం వంటివి నేరాలుగా పరిగణిస్తారు.
iv. నేర సంబంధిత న్యాయసవరణ చట్టం -2013. ఆమ్లదాడులు, లైంగిక వేధింపులు, అత్యాచారం వంటివన్నీ నేరాలుగా పరిగణిస్తారు.
v. పనిచేసే చోట లైంగిక వేధింపుల నిరోధక చట్టం, సెక్స్వర్కర్ల చట్టం, స్త్రీల అసభ్య చిత్ర నిషేధ చట్టం- 1986, మానవ అక్రమ రవాణా నియంత్రణ చట్టం... వంటివెన్నో మహిళలకు అండగా ఉన్నాయి.
క్రీడలు
కార్ల్సన్దే ర్యాపిడ్ :

i. టాస్స్టీల్ ర్యాపిడ్ అండ్ బ్లిట్జ్ చెస్ టోర్నమెంట్ ర్యాపిడ్ విభాగంలో మాగ్నస్ కార్ల్సన్ విజేతగా నిలిచాడు.  ఆనంద్, హరికృష్ణ, డింగ్ లిరెన్ తలో ఎనిమిది పాయింట్లతో ఉమ్మడిగా ఆరో స్థానంలో నిలిచారు. ఏడో రౌండ్లో కార్ల్సన్ చేతిలో ఓడిన ఆనంద్.. విదిత్, హరికృష్ణతో గేమ్లను డ్రాగా ముగించాడు.
Marathon man Kipchoge, hurdle heroine Muhammad win Athlete of the Year :

i. Eliud Kipchoge, the first man to run a marathon in less than two hours, and 400 metres hurdles world champion Dalilah Muhammad won the World Athlete of the Year awards.
ii. Kipchoge, claimed governing body World Athletics’ year-ending prize in Monaco after making history last month when he ran the marathon distance of 42.195 kilometres (26.219 miles) in 1hr 59min 40.2sec.
iii. American Muhammad won her award after a magnificent year that saw her set a world record of 52.20 seconds at the US Trials in Iowa in July breaking a record that had stood since 2003.
Rafael Nadal wins Davis Cup title 2019 :

i. Rafael Nadal has clinched 6th Davis Cup title for Spain after beating Denis Shapovalov of Canada in front of a jubilant home crowd in Madrid.
ii. Nadal defeated Shapovalov 6-3, 7-6 (9-7) to clinch Spain’s 2-0 win against Canada.

Sunday 24 November 2019

24th november 2019 current affairs

✍  కరెంట్ అఫైర్స్ 24 నవంబరు 2019 Sunday ✍

ఇతర రాష్ట్రాలు / కేంద్ర పాలిత ప్రాంతాల వార్తలు
మహారాష్ట్రలో భాజపా ‘మెరుపు వ్యూహం’. ముఖ్యమంత్రి పీఠంపై మళ్లీ ఫడణవీస్. డిప్యూటీ సీఎంగా అజిత్ పవార్ :
 
i. అనూహ్య పరిణామాల మధ్య భాజపా నేత దేవేంద్ర ఫడణవీస్ మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా రెండోసారి ప్రమాణస్వీకారం చేశారు. సొంత పార్టీకి ఝలక్ ఇచ్చి, ఆయనకు మద్దతుగా నిలిచిన ఎన్సీపీ శాసనసభాపక్ష నేత అజిత్ పవార్ ఉప ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టారు.
ii. అజిత్ను శాసనసభా పక్ష నేత పదవి నుంచి తొలగిస్తున్నట్లు ఎన్సీపీ ప్రకటించింది. 288 మంది సభ్యులున్న సభలో భాజపాకు 105, శివసేనకు 56 సీట్లు వచ్చాయి.  కాంగ్రెస్కు 44, ఎన్సీపీకి 54 సీట్లు వచ్చాయి.
World’s biggest Islamic Congregation begins in Bhopal:

In Madhya Pradesh, the 4-day Aalmi Tablighi Ijtima, world’s biggest Islamic Congregation began in Bhopal.
More than one million people from 54 countries are expected to attend the congregation which will continue till 25th November.
It is a forum for delivering some important religious-spiritual messages to Muslims around the world.
Ijtima started in the era of Nawabs in Bhopal and now it has become the identity of Bhopal worldwide.
The first Alami Tablighi Ijtima took place in Bhopal in 1944 and only 14 people attended it then.
Now the number has increased to millions. Thousands of people from various countries across the world including Russia, France, Indonesia, Malaysia, Iraq and Saudi Arabia have reached Bhopal to participate in this event.
అంతర్జాతీయ వార్తలు
Oxford Dictionary names ‘Climate Emergency’ its 2019 Word of the Year :

Oxford Dictionaries has named “climate emergency” as its 2019 Word of the Year, choosing it from an all-environmental shortlist that also included “climate action,” “climate denial,” “eco-anxiety,” “extinction” and “flight shame.
The word is selected because it shows the increase in usage since 2018. Climate emergency defines as “a situation in which urgent action is required to reduce or halt climate change and also to avoid the possible irreversible environmental loss resulting from it.
Persons in news
Army dedicates Goodwill Park to Late Naib Subedar Chuni Lal :
     
i. As a mark of tribute to one of the most decorated soldiers of Indian Army Late Naib Subedar Chuni Lal, an Army Goodwill Park was dedicated at his native village Bhara in Doda, Jammu and Kashmir.
ii. The Army Goodwill Park has a statue of the martyred soldier, beside a Children park and open Gym for the villagers.
అవార్డులు
Greta Thunberg awarded international children’s peace prize :
 
i. Swedish teen activist Greta Thunberg was awarded an international children’s peace prize, for her work in the struggle against climate change which has resonated with schoolchildren across the world.
ii. Cameroonian peace activist Divina Maloum, aged 15, also received the International Children’s Peace Prize, for her fighting spirit and ‘Peaceful struggle’ against Boko Haram jihadist group.
iii. The prizes were distributed by Laureate Kailash Satyarthi, an Indian children’s rights activist and 2014 Nobel Peace Prize winner.
iv. The award ceremony was organized by the Dutch Kids Right Organization.
సినిమా వార్తలు
చందాకొచ్చర్ ఫిర్యాదు.. ఆగిన సినిమా రిలీజ్ :

i. ఐసీఐసీఐ బ్యాంక్ మాజీ సీఈవో జీవితాన్ని ఆధారంగా చేసుకుని తెరకెక్కుతోన్న ఓ బాలీవుడ్ చిత్రానికి దిల్లీ కోర్టు స్టే ఇచ్చింది. తన జీవితాన్ని ఆధారంగా చేసుకుని బాలీవుడ్లో ‘చందా: ఏ సిగ్నేచర్ దట్ రూవండ్ ఏ కెరీర్’ అనే టైటిల్తో ఓ చిత్రం తెరకెక్కుతోందని.. దానిని వెంటనే నిలిపివేయాలని కోరుతూ చందా కొచ్చర్ ఇటీవల దిల్లీ కోర్టును సంప్రదించారు.
ii. కోర్టులో కేసు నడుస్తున్నప్పటికీ తనను అపరాధిగా చూపించే విధంగా ఈ సినిమా తెరకెక్కిస్తున్నారని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు.
iii. The movie – “Chanda: A Signature that Ruined A Career”, produced by Manoj Nandwana and S Akhileswaran and directed by Ajay Singh, was supposed to be screened at Goa Film Festival on November 28.
iv. Actress Gurleen Chopra has played the lead role in the movie, which she has been promoting from on her Instagram profile as well.
ముఖ్యమైన రోజులు
భోగరాజు పట్టాభి సీతారామయ్య జననం : నవంబర్ 24, 1880

i. భోగరాజు పట్టాభి సీతారామయ్య (నవంబర్ 24, 1880 - డిసెంబర్ 17, 1959) (Bhogaraju Pattabhi Sitaramayya) స్వాతంత్ర్య సమరయోధుడు, భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడు, ఆంధ్రా బ్యాంకు వ్యవస్థాపకుడు.
ii. సీతారామయ్య నవంబర్ 24 1880 న మద్రాసు ప్రెసిడెంసి రాష్ట్రములోని కృష్ణా జిల్లా ( పశ్చిమ గోదావరి జిల్లా, గుండుగొలను )గ్రామములో జన్మించాడు . భారత జాతీయోద్యమ సమయంలో గాంధీజీ చే ప్రభావితుడై ఉద్యమంలో చేరి అతడికి సన్నిహితుడై కాంగ్రెస్లో ప్రముఖ స్థానం ఆక్రమించాడు.
iii. 1939లో గాంధీజీ అభ్యర్థిగా కాంగ్రెస్ అధ్యక్ష పదవికి పోటీపడి నేతాజీ చేతిలో ఓడిపోయిననూ 1948లో పురుషోత్తమ దాస్ టాండన్ పై విజయం సాధించాడు. ఆ తర్వాత పార్లమెంటు సభ్యుడిగా, మధ్యప్రదేశ్ గవర్నర్ గా పనిచేశాడు.
iv. రాష్ట్రం బయట పనిచేసిననూ తెలుగు భాషపై మమకారం కోల్పోలేదు. తను స్థాపించిన ఆర్థిక సంస్థలలో ఉత్తర ప్రత్యుత్తరాలు తెలుగులోనే జరగాలని సూచించాడు.
v. పట్టాభి సీతారామయ్య ఎన్నో ఆర్థిక సంస్థలను స్థాపించాడు. ఆంధ్రా బ్యాంకు (1923లో స్థాపన), ఆంధ్రా ఇన్స్యూరెన్స్ కంపెనీ, భారత లక్ష్మీ బ్యాంకు, కృష్ణా కో-ఆపరేటివ్ బ్యాంకు మొదలగునవి స్థాపించాడు. ఆంధ్రాబ్యాంకు ద్వారా వ్యవసాయదారులకు రుణాలిచ్చి వ్యవసాయాభివృద్ధికి తోడ్పడినాడు. చిన్న మొత్తంలో డిపాజిట్లు సేకరించి పొదుపును ప్రోత్సహించాడు.
vi. స్వాతంత్ర్యం తరువాత 1948లో కాంగ్రెసు అధ్యక్ష పదవి పోటీలో నెగ్గి పీఠాన్ని అధిష్టించాడు. ఆ తరువాత 1952లో రాజ్యసభ సభ్యునిగా ఎన్నికై పార్లమెంటులో ప్రవేశించాడు. 1952 నుండి 1957 వరకు మధ్య ప్రదేశ్ గవర్నరుగా పనిచేశాడు.
vii. తెలుగు ప్రజలకు ఎంతగానో తోడ్పాటు అందించిన పట్టాభి 1959, డిసెంబర్ 17న స్వర్గస్థుడయ్యాడు.
అరుంధతీ రాయ్ జననం : 1961 నవంబరు 24

i. అరుంధతీ రాయ్ (జననం 1961 నవంబరు 24) ఒక భారతీయ రచయిత్రి, ఉద్యమకారిణి. ఈమెకు 1997లో తన రచన ‘ద గాడ్ ఆఫ్ స్మాల్ థింగ్స్’ కు బుకర్ ప్రైజు మరియు 2002 లో లన్నాన్ సాంస్కృతిక స్వేచ్ఛ బహుమతి ప్రదానం చేయబడింది. బుకర్ ప్రైజు పొందిన మొట్టమొదటి భారతీయురాలిగా చరిత్రకెక్కారు.
ii. ఈమె మేఘాలయ లోని షిల్లాంగ్ లో జన్మించింది. సర్దార్ సరోవర్ డ్యామ్ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ, "నర్మదా బచావో" ఆందోళనను సమర్ధిస్తూ ఈమెరాసిన "ది గ్రేటర్ కామన్ గుడ్" రచన వివాదాస్పదంగా మారినది.
iii. సిడ్నీ శాంతి బహుమతి మే 2004 లో లభించింది.సాహిత్య అకాడెమీ అవార్డు 2006 లో, తన రచన వ్యాసాలుద ఆల్జీబ్రా ఆఫ్ ఇన్ఫినైట్ జస్టిస్కొరకు లభించింది. కానీ భారత ప్రభుత్వం అమెరికా అడుగుజాడలలో నడుస్తోంది అని ఈ అవార్డు స్వీకరించడానికి నిరాకరించింది.
క్రీడలు
Bodybuilder Chitahresh Natesan crowned Mr Universe 2019 :

Chitahresh Natesan 33yr old former hockey player turned bodybuilder also known as the ‘Indian Monster’ by bodybuilding circles became the first Indian to win ‘Mr. Universe (Pro) 2019’ in 90kg category at the 11th World Bodybuilding and Physique Sports Championship(WBPF) in South Korea.
India secured the second position in the team championship category at the same event.

23rd november 2019 current affairs

✍  కరెంట్ అఫైర్స్ 23 నవంబరు 2019 Saturday ✍

జాతీయ వార్తలు
ఫాస్టాగ్.. తెలుసుకుంటే సులభమిక ప్రయాణం :

i. ఫాస్టాగ్ను ఇప్పటికే ప్రయోగాత్మకంగా 2014 నుంచి వివిధ జాతీయ రహదారుల మీద అమలు చేస్తున్నారు. ఈ ఏడాది మార్చి నుంచి దేశవ్యాప్తంగా అన్ని టోల్ప్లాజాల్లో కొన్నిలైన్లలో తప్పనిసరి చేశారు.
ii. ఈ డిసెంబరు 1 నుంచి ఒక్క లైన్ మినహా మిగిలినవన్నీ ఫాస్టాగ్కే కేటాయిస్తారు. అంటే... నగదు చెల్లించే వాహనదారులకు ఒక్క లైనే మిగులుతుంది.
iii. టోల్ప్లాజాల వద్ద వాహనం ఆగకుండా వెళ్లిపోయేందుకు వీలుగా ఉపయోగపడే చిన్న సాంకేతిక సాధనమే ఈ ఫాస్టాగ్. నగదు రహిత, డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించడానికి కేంద్ర ప్రభుత్వం దీన్ని అమలు చేస్తోంది.
iv. చిన్న ఎలక్ట్రానిక్ చిప్ రూపంలో ఉండే ఈ ఫాస్టాగ్ను వాహనం ముందుండే అద్దం లోపలివైపు అతికిస్తారు. మన వాహనం టోల్ప్లాజా లైన్లోకి రావడంతోనే అక్కడ అమర్చిన ఎలక్ట్రానిక్ పరికరం వాహన ఫాస్టాగ్ ఐడీ, రిజిస్ట్రేషన్ నంబరు, మన పేరును గుర్తించి, ఖాతా నుంచి టోల్ రుసుంను ఆన్లైన్లోనే తీసుకుంటుంది. ఇదంతా 10సెకండ్లలోనే జరిగిపోతుంది.
v. ఫాస్టాగ్ తీసుకున్న తర్వాత, ఆండ్రాయిడ్ ఫోనులో ‘మై ఫాస్టాగ్ యాప్’ను వేసుకుని, అందులో బ్యాంకు ఖాతా, వాహన నంబర్లను నమోదు చేసుకొని లింకు చేసుకోవచ్చు.
vi. ఎన్హెచ్ఏఐకి చెందిన ‘సుఖద్ యాత్ర’ అనే యాప్ను డౌన్లోడ్ చేసుకుంటే అందులో ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్లానుకుంటున్నామో పేర్కొంటే... ఆ మార్గంలో ఎన్ని టోల్ప్లాజాలు ఉన్నాయి, ఎంత రుసుం తదితర వివరాల సమాచారం తెలుస్తుంది.
రైల్వేను ప్రైవేటీకరించడం లేదు : పీయూష్ గోయల్

i. భారతీయ రైల్వేను ప్రైవేటీకరించడం లేదని కేంద్ర రైల్వే మంత్రి పీయూష్ గోయెల్ తెలిపారు.
ii. ప్రయాణికులకు నాణ్యమైన సేవలు అందించడానికి కొన్ని రైళ్లలో వాణిజ్య, ఆన్బోర్డ్ సేవలను మాత్రమే ప్రైవేటుకి అప్పగిస్తున్నామని పేర్కొన్నారు.
Jitendra Singh to inaugurate ‘Destination North East’ Festival :

i. కేంద్ర రాష్ట్ర మంత్రి (ఇండిపెండెంట్ ఛార్జ్) ఈశాన్య ప్రాంత అభివృద్ధి మంత్రిత్వ శాఖ (DoNER) డాక్టర్ జితేంద్ర సింగ్ 2019 నవంబర్ 23న ఉత్తరప్రదేశ్ వారణాసిలో జరిగే ‘నార్త్ ఈస్ట్ గమ్యం (Destination North East)’ ఉత్సవాన్ని ప్రారంభిస్తారు.
ii. మొత్తం 8 నార్త్ ఈస్ట్ రాష్ట్రాలు వారి హస్తకళలు, చేనేత, సేంద్రీయ ఉత్పత్తులు మరియు సాంస్కృతిక బృందాలతో పాటు ఈ కార్యక్రమంలో పాల్గొంటాయి.
iii. పండుగ సందర్భంగా, సందర్శకులు తమ మగ్గాలు మరియు చేతిపనులపై పనిచేసే ఈశాన్య రాష్ట్రాల కళాకారులు మరియు కళాకారుల ప్రత్యక్ష అనుభవాలను కలిగి ఉంటారు, పగటిపూట బహిరంగ వేదికలో వారి పాటలు మరియు నృత్యాలను ప్రదర్శిస్తారు. సందర్శకులు కూడా పాల్గొనే స్వదేశీ ఆటలు కూడా ప్రదర్శించబడతాయి.
ఇతర రాష్ట్రాలు / కేంద్ర పాలిత ప్రాంతాల వార్తలు
మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఫడణవీస్ :

i. మహారాష్ట్ర రాజకీయాల్లో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్ర ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడణవీస్ ప్రమాణస్వీకారం చేశారు. ఉపముఖ్యమంత్రిగా ఎన్సీపీకి చెందిన అజిత్ పవార్ ప్రమాణం చేశారు.
ii. వీరితో గవర్నర్ భగత్సింగ్ కోశ్యారీ శనివారం (Nov 23) ఉదయం ప్రమాణం చేయించారు. అందరి అంచనాలను తలకిందులు చేస్తూ భాజపా-ఎన్సీపీ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి.
iii. రాత్రికి రాత్రే పరిణామాలు పూర్తిగా మారిపోయాయి. దీంతో మిత్రపక్షం శివసేనకు భాజపా భారీ షాక్ ఇచ్చినట్లయింది.
iv. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు గత నెల 24న వెలువడ్డాయి. ప్రభుత్వ ఏర్పాటుకు పార్టీలేవీ ముందుకు రాలేదంటూ గవర్నర్ చేసిన సిఫార్సు మేరకు ఆ రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం ఈ నెల 12 నుంచి రాష్ట్రపతి పాలన విధించింది.
Assam government releases the new Land Policy 2019 after 30 years :

i. రెవెన్యూ, విపత్తు నిర్వహణ విభాగం తయారుచేసిన కొత్త ల్యాండ్ పాలసీ 2019 ను అస్సాం ముఖ్యమంత్రి సర్బానంద సోనోవాల్ విడుదల చేశారు.
ii. ల్యాండ్ పాలసీని అక్టోబర్ 21న కేబినెట్ ఆమోదించింది మరియు దీనిని 30 సంవత్సరాల తరువాత రెవెన్యూ మరియు విపత్తు నిర్వహణ విభాగం తయారు చేసింది. ఇది చివరిసారిగా 1989 లో తయారు చేయబడింది.
iii. స్వదేశీ ప్రజల ఆసక్తిని కాపాడటానికి ల్యాండ్ పాలసీని సిద్ధం చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రాధాన్యత ఇస్తోంది మరియు ఈ విధానం భూమి కేటాయింపులు మరియు స్థావరాలకి సంబంధించిన సమస్యలను తొలగిస్తుంది.
గుజరాత్లో ఇనుప యుగపు ఆనవాళ్లు. కనుగొన్న ఐఐటీ-ఖరగ్పుర్ పరిశోధకులు :

i. గుజరాత్లో దాదాపు మూడువేల ఏళ్లనాటి ఇనుపయుగపు ఆనవాళ్లను ఐఐటీ-ఖరగ్పుర్ పరిశోధకులు గుర్తించారు. ప్రస్తుతం కచ్ప్రాంతంలో ఉన్న ఉప్పునేలలకు సమీపంలోని కరీంషాహి, విగకోట్ ప్రాంతాల్లో ఇనుపయుగం పరిఢవిల్లినట్లు వారు పేర్కొన్నారు.
ii. థార్ఎడారి సమీపంలో పాక్ సరిహద్దు సమీప ప్రాంతంలో సుమారు 3000-2500 ఏళ్ల క్రితం జనావాసాలున్నట్లు సాక్ష్యాలు లభించాయన్నారు.
iii. రుతుపవనాల క్షీణత, తీవ్రమైన కరవుతో అమూల్యమైన సింధూనాగరికత అంతరించిపోయిన తర్వాత ఇనుప యుగం మొదలైంది. గుజరాత్లో సంభవించిన ఈ పరిణామాన్ని పురాతత్వశాస్త్రవేత్తలు ‘చీకటియుగం’గా అభివర్ణించిన విషయం గమనార్హం.
 అంతర్జాతీయ వార్తలు
వివాదాస్పద చైనా-పాకిస్థాన్ ఆర్థిక నడవా (సీపెక్)పై అమెరికా తీవ్ర స్థాయిలో నిప్పులు :

i. ఇది పాక్ ఆర్థిక వ్యవస్థను దారుణంగా దెబ్బతీస్తుందని, సార్వభౌమాధికారాన్ని కబళిస్తుందని అమెరికా హెచ్చరించింది.  ప్రాజెక్టుపై చైనాకు ‘కఠిన ప్రశ్నలు’ సంధించాలని పాకిస్థాన్కు సూచించింది.
ii. ఆసియా, ఆఫ్రికా, చైనా, ఐరోపా మధ్య సంధానత, సహకారం కోసం ఓబీఓఆర్ ప్రాజెక్టును చైనా చేపట్టింది. ఇందులో భాగంగా ‘సీపెక్’ను తెరపైకి తెచ్చింది.
iii. చైనాలోని షిన్జియాంగ్ యుగుర్ స్వయంప్రతిపత్తి ప్రాంతాన్ని పాకిస్థాన్లోని వ్యూహాత్మక గ్వాదర్ రేవుతో అనుసంధానించడం దీని ఉద్దేశం. ఈ నడవాలో వందల కోట్ల డాలర్లతో రోడ్లు, రైల్వేలు, ఇంధన ప్రాజెక్టులను చైనా నిర్మిస్తుంది.
Defence News
The NIA will host the first-ever counter-terrorism (CT) exercise :

i. The National Investigation Agency (NIA) will host the first-ever counter-terrorism (CT) exercise for the Quad countries in New Delhi.
ii. The Quad countries include the United States (US), India, Australia, and Japan.
iii. According to the NIA, the exercise is to assess and validate CT response mechanisms in the light of emerging terrorist threats.
iv. It also aims to provide opportunities to share the best practices and to explore areas for enhanced cooperation amongst participating countries.
సదస్సులు
Global Bio-India Summit – Delhi

i. మూడు రోజుల గ్లోబల్ బయో ఇండియా సమ్మిట్ 2019 న్యూఢిల్లీ లో ప్రారంభమైంది. భారతదేశంలో తొలిసారిగా జరగబోయే అతిపెద్ద బయోటెక్నాలజీ వాటాదారుల సమ్మేళనాలలో ఇది ఒకటి.
ii. ఇది అకాడెమియా, ఇన్నోవేటర్లు, పరిశోధకులు, స్టార్టప్‌లు, మీడియం మరియు పెద్ద కంపెనీలను ఒకే వేదికపైకి తెస్తుంది. మెగా ఈవెంట్‌లో సుమారు 25 దేశాల నుండి, భారతదేశంలోని 15 కి పైగా రాష్ట్రాల నుండి మూడు వేలకు పైగా ప్రతినిధులు పాల్గొంటారు.
Persons in news
భారత నౌకా దళంలో తొలి మహిళా పైలట్గా శివాంగి :

i. భారత నౌకా దళంలో తొలి మహిళా పైలట్గా చరిత్ర సృష్టించింది బిహార్కు చెందిన సబ్ లెఫ్టినెంట్ శివాంగి.
ii. శివాంగి బిహార్లోని చిన్నపట్టణం ముజఫర్పుర్లో పుట్టి పెరిగింది. సిక్కిం, మణిపాల్ సాంకేతిక విశ్వవిద్యాలయంలో మెకానికల్ ఇంజినీరింగ్ పూర్తి చేసింది.
iii. మహిళలను పైలట్ పోస్టులకు ఎంపిక చేయడం నౌకాదళంలో ఇదే మొదటిసారి. సదరన్ నేవల్ అకాడమీలో శివాంగి ఎంతో కఠినమైన శిక్షణను పూర్తి చేసింది.
Reports/Ranks/Records
చెమట చుక్కలు చిందించట్లేదు. వ్యాయామానికి దూరంగా పిల్లలు. రోజుకు గంటపాటు శ్రమించేవారు 20% కంటే తక్కువే : ప్రపంచ ఆరోగ్య సంస్థ  అధ్యయనంలో వెల్లడి
 
i. ఆట పాటలతో హుషారుగా ఉండాల్సిన కిశోరప్రాయం స్తబ్ధుగా తయారవుతోంది! సెల్ఫోన్కు దగ్గరవుతూ మైదానానికి దూరమవుతోంది. ఏకంగా 146 దేశాల్లో ఇదే పరిస్థితి. ప్రపంచవ్యాప్తంగా 11-17 ఏళ్ల మధ్య వయసు పిల్లల్లో 80 శాతం కంటే ఎక్కువమంది రోజుకు కనీసం గంటసేపు కూడా వ్యాయామం చేయట్లేదు. ఫలితంగా వారి శారీరక ఆరోగ్యం దెబ్బతినే అవకాశాలు పెరుగుతున్నాయి.
ii. మేధో వికాసంపైనా ప్రతికూల ప్రభావం పడుతోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) పరిశోధకులు జరిపిన అధ్యయనం ఆందోళనకర విషయాలను బయటపెట్టింది. 2016 నాటికి ప్రపంచవ్యాప్తంగా 146 దేశాల్లో ఉన్న పరిస్థితులను కళ్లకు కట్టింది.
iii. మనదేశంలో 72% మంది బాలురు రోజులో కనీసం గంట కూడా శారీరక శ్రమ చేయట్లేదు. ప్రపంచ సగటు(78%)తో పోలిస్తే ఇది కాస్త మెరుగే.

iv. కిశోరప్రాయులు ప్రతిరోజు గంట పాటు వ్యాయామం చేయాలన్నది డబ్ల్యూహెచ్వో సిఫార్సు.
అవార్డులు
స్వచ్ఛ సర్వేక్షన్ గ్రామీన్ అవార్డులు 2019 :

i. న్యూఢిల్లీలోని ప్రవాసి భారతీయ కేంద్రంలో ప్రపంచ మరుగుదొడ్డి దినోత్సవం సందర్భంగా కేంద్ర రసాయన, ఎరువుల మంత్రిత్వ శాఖ మంత్రి వివిధ వర్గాలలోని అగ్రశ్రేణి రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు మరియు జిల్లాలకు స్వచ్ఛ సర్వేక్షన్ గ్రామీన్ 2019 అవార్డులను ప్రదానం చేశారు.
ii. అగ్రస్థానంలో ఉన్న రాష్ట్రం : తమిళనాడు
iii. అగ్రస్థానంలో ఉన్న జిల్లా : పెద్దపల్లి (తెలంగాణ)
iv. గరిష్ట పౌరుల భాగస్వామ్యంతో రాష్ట్రం : ఉత్తర ప్రదేశ్.
తెలంగాణకు ఇండియాటుడే సుపరిపాలన పురస్కారం :

i. ఇండియాటుడే తెలంగాణకు సుపరిపాలన పురస్కారాన్ని ప్రకటించింది. దిల్లీలో స్టేట్ ఆఫ్ స్టేట్స్ కాన్క్లేవ్-2019 పేరిట నిర్వహించిన కార్యక్రమంలో పలు విభాగాల్లో రాష్ట్రాలకు అవార్డులు ప్రదానం చేశారు.
ii. కేంద్ర పర్యావరణ, అటవీ శాఖల మంత్రి ప్రకాష్ జావడేకర్ చేతుల మీదుగా తెరాస పార్లమెంటరీ పార్టీ నేత కె.కేశవరావు అవార్డును అందుకున్నారు.
సినిమా వార్తలు
తాన్హాజీ జీవిత కథతో ‘తాన్హాజీ : ది అన్సంగ్ వారియర్’ :

i. మరాఠా యోధుడు తాన్హాజీ జీవిత కథతో తెరకెక్కుతోన్న చిత్రం ‘తాన్హాజీ:ది అన్సంగ్ వారియర్’. ఛత్రపతి శివాజీ దగ్గర సుబేదార్గా  పనిచేసిన తాన్హాజీ కథ ఇది.
ii. తాన్హాజీ పాత్రలో అజయ్దేవ్గణ్ నటించారు. 1670లో తాన్హాజీ మొఘల్ సామ్రాజ్యంపై జరిపిన యుద్ధం నేపథ్యంలో ఈ కథ నడుస్తుంది. ఔరంగజేబు సామ్రాజ్యంలో పనిచేసే కీలకమైన వ్యక్తి ఉదయ్ భాన్ పాత్రలో సైఫ్ అలీఖాన్ నటించారు.
iii. తాన్హాజీ భార్య సావిత్రీబాయి పాత్రలో కాజోల్ నటించింది. ఓం రౌత్ తెరకెక్కించిన ఈ సినిమా జనవరి 10న విడుదల కానుంది.
మరణాలు
కమ్యూనిస్టు యోధుడు గుర్రం యాదగిరిరెడ్డి కన్నుమూత :

i. తెలంగాణ సాయుధ పోరాట యోధుడు, మాజీ ఎమ్మెల్యే గుర్రం యాదగిరిరెడ్డి (88) హైదరాబాద్లో మరణించారు. ఉమ్మడి నల్గొండ జిల్లా గుండాల మండలం సుద్దాల గ్రామంలో 1931లో జన్మించిన యాదగిరిరెడ్డి చిన్నప్పటి నుంచే సాయుధ పోరాటం వైపు ఆకర్షితులయ్యారు.
ii. ప్రముఖ కవి సుద్దాల హనుమంతుతో కలిసి పనిచేసిన ఆయన.. రామన్నపేట నియోజకవర్గం నుంచి 1985, 1989, 1994లో వరుసగా మూడుసార్లు సీపీఐ ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1999లో ఎమ్మెల్యే పదవీకాలం ముగిశాక పూర్తిగా రాజకీయాలకు దూరమయ్యారు.
iii. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఉప్పునూతల పురుషోత్తంరెడ్డిపై ఆయన చివరి రెండుసార్లు విజయం సాధించారు. మూడోసారి 1994లో పోటీ చేసేటప్పుడు ఆర్థిక ఇబ్బందులు రావడంతో ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉండగా శాసనసభ్యులకు ఇచ్చిన ఇంటి స్థలాన్ని అమ్మేసి ఎన్నికల్లో పోటీచేశారు.
ఉస్మానియా మాజీ వీసీ రామకిష్టయ్య కన్నుమూత :

i. ఉస్మానియా విశ్వవిద్యాలయం మాజీ వీసీ, APPSC మాజీ ఛైర్మన్ ప్రొఫెసర్ వి.రామకిష్టయ్య(87) హైదరాబాద్ విజ్ఞానపురి కాలనీలోని స్వగృహంలో కన్నుమూశారు.
ii. నల్లగొండ జిల్లా మునుగోడుకు చెందిన ఆయన.. 1996-99 మధ్య ఓయూ వీసీగా వ్యవహరించారు. 1986-1992 వరకు APPSC ఛైర్మన్గా ఉన్నారు. ముగ్గురు ముఖ్యమంత్రుల పాలనలో ఛైర్మన్గా సమర్థంగా బాధ్యతలు నిర్వహించి వారి మన్ననలను పొందారు.
ముఖ్యమైన రోజులు
World Chronic Obstructive Pulmonary Disease(COPD) Day (ప్రపంచ ముదిరిన ఊపిరితిత్తుల వ్యాధి దినం) - Third Wednesday of November (In 2019, November 20)

i. Theme 2019 : All Together to End COPD
ii. The WHO (World Health Organization) and Global Initiative for Chronic Obstructive Lung Disease (GOLD) organize World COPD (Chronic Obstructive Pulmonary Disease) Day on the third Wednesday of November every year.
iii. It was first launched in 1997 by WHO, GOLD and other institutes in the US.
iv. COPD is Chronic Obstructive Pulmonary Disease. It causes severe breathlessness and predisposes to exacerbations.
క్రీడలు
మను ఖాతాలో మరో పసిడి :

i. ప్రపంచకప్ షూటింగ్ ఫైనల్స్ టోర్నీని భారత్ ఘనంగా ముగించింది.
ii. మిక్స్డ్ ఎయిర్ పిస్టల్ విభాగంలో ప్రపంచ నంబర్వన్ చెర్నోసోవ్ (రష్యా)తో జోడీ కట్టిన మను.. ఫైనల్లో 17-13తో సౌరభ్ చౌదరి-అనా కొరాకకి (రష్యా)పై గెలిచింది.
iii. వ్యక్తిగత విభాగాల్లోనూ స్వర్ణాలు గెలిచిన మను, దివ్యాంశ్ ప్రెసిడెంట్స్ ట్రోఫీలను కూడా సొంతం చేసుకున్నారు.

>>>>>>>>>>>>>>>>  End of the day  <<<<<<<<<<<<<<<<

WRITING A RESEARCH REPORT

 రీసెర్చ్ రిపోర్ట్ రాయడం పరిశోధన నివేదిక అనేది సాంప్రదాయిక నిర్మాణం లేదా ఆకృతిని అనుసరించి కఠినంగా ఆకృతీకరించిన పత్రంలో పరిశోధన మరియు దాని ఫ...