కేంద్ర ప్రభుత్వ పరిధిలోని స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్‌ఎస్‌సీ).. కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవల్ (సీహెచ్‌ఎస్‌ఎల్)-2019 నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఖాళీల వివరాలు త్వరలో వెబ్‌సైట్లో అందుబాటులో ఉంటాయి.
| ||||||||||||||||||
పోస్టులు: వివిధ మంత్రిత్వ శాఖలు/విభాగాలు/కార్యాలయాల్లోని లోయర్ డివిజన్ క్లర్క్, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, పోస్టల్ అసిస్టెంట్/సార్టింగ్ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులను భర్తీ చేస్తారు.అర్హత: లోయర్ డివిజన్ క్లర్క్/జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, పోస్టల్ అసిస్టెంట్/సార్టింగ్ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్ (సీ అండ్ ఏజీ మినహా) పోస్టులకు గుర్తింపు పొందిన బోర్డు నుంచి ఇంటర్/తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత. అదే విధంగా డేటా ఎంట్రీ ఆపరేటర్ (సీ అండ్ ఏజీ) పోస్టులకు మ్యాథమెటిక్స్ సబ్జెక్టుతో సైన్స్ స్ట్రీమ్‌లో ఇంటర్మీడియట్/తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత ఉండాలి. వయసు: 2019, ఆగస్టు 1 నాటికి 18-27 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ల ఆధారంగా వయో సడలింపు ఉంటుంది. ఎంపిక: టైర్-1, 2, 3 పరీక్షల ఆధారంగా. టైర్-1 పరీక్ష విధానం :
దరఖాస్తు ఫీజు: రూ.100. (రిజర్వేషన్ వర్గాలకు మినహాయింపు ఉంటుంది. దరఖాస్తుకు చివరితేదీ: ఏప్రిల్ 5, 2019. ఫీజు చెల్లించడానికి చివరి తేదీ: ఏప్రిల్ 7, 2019. టైర్-1: 2019, జూలై 1-26. టైర్-2 (డిస్క్రిప్టివ్): సెప్టెంబర్ 29, 2019. పూర్తి వివరాలకు వెబ్‌సైట్: https://ssc.nic.in |
Showing posts with label job news in telugu. Show all posts
Showing posts with label job news in telugu. Show all posts
Thursday, 7 March 2019
ఎస్‌ఎస్‌సీ- సీహెచ్‌ఎస్‌ఎల్ - 2019
ఎన్‌పీసీఐఎల్‌లో 90 ఖాళీలు
న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఎన్‌పీసీఐఎల్-కాక్రపార) ఖాళీగా ఉన్న 90 ట్రేడ్ అప్రెంటీస్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
|
విభాగాల వారీ ఖాళీలు: ఫిట్టర్-25, టర్నర్-5, మెషినిస్ట్-5, వెల్డర్-5, ఎలక్ట్రీషియన్-25, ఎలక్ట్రానిక్ మెకానిక్-10, పాసా-5, ఇన్‌స్ట్రుమెంట్ మెకానిక్-10.అర్హత: పదో తరగతితో పాటు సంబంధిత ట్రేడులో ఐటీఐ ఉత్తీర్ణత, నిర్దిష్ట శారీరక ప్రమాణాలుండాలి. వయసు: 14-24 ఏళ్ల మధ్య ఉండాలి. ఎంపిక: ఐటీఐ అకడమిక్ మార్కుల ఆధారంగా. దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌లో. దరఖాస్తుకు చివరితేదీ: మార్చి 30, 2019. పూర్తి వివరాలకు వెబ్‌సైట్: www.npcil.nic.in |
తిరుపతి స్విమ్స్‌లో 26 ఉద్యోగాలు
తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్ (స్విమ్స్) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 26 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
|
విభాగాల వారీ ఖాళీలు: మెడికల్ సూపరింటెండెంట్-1, ఫైనాన్స్ కంట్రోలర్-1, చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్-1, చార్టర్డ్ అకౌంటెంట్ (ఇంటర్) ప్రొఫెషనల్-2, క్లినికల్ సైకాలజిస్ట్-1, స్పీచ్ థెరపిస్ట్-1, ఫార్మసిస్ట్ గ్రే డ్2-3, రీసెర్చ్ అసిస్టెంట్/ఫ్యాకల్టీ-3, రీసెర్చ్ డేటా మేనేజర్-2, రీసెర్చ్ నర్సు-3, జూనియర్ అసిస్టెంట్/పీఏ-3, కంప్యూటర్ అసిస్టెంట్-1, హార్డ్‌వేర్ టెక్నీషియన్-1, పబ్లిక్ రిలేషన్స్ అసిస్టెంట్-1, డ్రైవర్-2. అర్హత: పోస్టునుబట్టి ఆయా సబ్జెక్టుల్లో ఎంఎస్సీ, పీహెచ్‌డీ/బ్యాచిలర్స్ డిగ్రీ/కంప్యూటర్ పరిజ్ఞానం/పీజీ డిప్లొమా/డిప్లొమా/అనుభవం తదితర అర్హతలు ఉండాలి. డ్రైవర్ పోస్టుకు ఎస్‌ఎస్‌సీతో పాటు హెవీ మోటార్ వెహికల్స్ డ్రైవింగ్ లెసైన్సు అవసరం. వయసు: పోస్టును బట్టి 18-50 ఏళ్ల మధ్య ఉండాలి. ఎంపిక: ఇంటర్వ్యూ/రాత పరీక్ష ఆధారంగా. దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌లో. దరఖాస్తుకు చివరితేదీ: మార్చి 20, 2019. పూర్తి వివరాలకు వెబ్‌సైట్: http://svimstpt.ap.nic.in |
ఈఎస్‌ఐసీ-హైదరాబాద్లో 133 పోస్టులు
హైదరాబాద్‌లోని ఎంప్లాయిస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఈఎస్‌ఐసీ) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 133 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
|
ఖాళీల వివరాలు: అర్హతలు..
వయసు: 2019, ఏప్రిల్ 15 నాటికి 18-27 ఏళ్ల మధ్యలో ఉండాలి. రిజర్వేషన్ అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. ఎంపిక విధానం : స్టెనోగ్రాఫర్: తొలుత 200 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు. ఇందులో ఇంగ్లిష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రెహెన్షన్; రీజనింగ్ ఎబిలిటీ, జనరల్ అవేర్‌నెస్ నుంచి ప్రశ్నలుంటాయి. తుది జాబితా రూపకల్పనకు ఇందులో సాధించిన మార్కులను పరిగణనలోకి తీసుకుంటారు. రెండో దశలో కంప్యూటర్ స్కిల్ టెస్ట్, స్టెనోగ్రఫీ టెస్ట్ ఉంటాయి. యూడీసీ: తొలిదశలో ప్రిలిమినరీ పరీక్ష ఉంటుంది. ఇందులో జనరల్ ఇంటెలిజెన్స్, రీజనింగ్; జనరల్ అవేర్‌నెస్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, ఇంగ్లిష్ కాంప్రెహెన్షన్ విభాగాల నుంచి ప్రశ్నలుంటాయి. ఇందులో అర్హత సాధించిన వారికి 200 మార్కులకు మెయిన్ పరీక్ష నిర్వహిస్తారు. తుది జాబితా రూపకల్పనకు మెయిన్ మార్కులను పరిగణనలోకి తీసుకుంటారు. మూడో దశలో కంప్యూటర్ స్కిల్‌టెస్ట్ ఉంటుంది. దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో. దరఖాస్తు ఫీజు: ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, ఎక్స్ సర్వీస్‌మెన్, మహిళా అభ్యర్థులకు రూ.250; మిగిలిన వారికి రూ.500. దరఖాస్తుకు చివరితేదీ: ఏప్రిల్ 15, 2019. పూర్తి వివరాలకు వెబ్‌సైట్: www.esic.nic.in |
ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ 275 ఉద్యోగాలు
భారత ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 275 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
|
విభాగాల వారీ ఖాళీలు: అసిస్టెంట్ డెరైక్టర్-5, అసిస్టెంట్ డెరైక్టర్ (టెక్నికల్)-15, టెక్నికల్ ఆఫీసర్-130, సెంట్రల్ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్-37, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్-2, అసిస్టెంట్-34, జూనియర్ అసిస్టెంట్ గ్రేడ్ 1- 7, హిందీ ట్రాన్స్‌లేటర్-2, పర్సనల్ అసిస్టెంట్-25, అసిస్టెంట్ మేనేజర్ (ఐటీ)-5, ఐటీ అసిస్టెంట్-3, డిప్యూటీ మేనేజర్-6, అసిస్టెంట్ మేనేజర్-4.వయసు, అర్హతలు తదితర వివరాలు త్వరలో వెబ్‌సైట్లో అందుబాటులో ఉంటాయి. దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో. దరఖాస్తుకు చివరితేదీ: ఏప్రిల్ 14, 2019. పూర్తి వివరాలకు వెబ్‌సైట్: https://fssai.gov.in |
రైల్వేలో 1937 పారామెడికల్ ఉద్యోగాలు
భారతీయ రైల్వే 1937 పారామెడికల్ కేటగిరీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఈ పోస్టులు ఆయా ఆర్‌ఆర్‌బీల ద్వారా భర్తీ కానున్నాయి.
|
ఆర్‌ఆర్‌బీల వారీ ఖాళీలు: అహ్మదాబాద్-80, అజ్మీర్-89, అలహాబాద్-176, బెంగళూరు-51, భోపాల్-48, భువనేశ్వర్-35, బిలాస్‌పూర్-40, చంఢీగఢ్-197, చెన్నై-173, గోరఖ్‌పూర్-66, గువాహటి-117, జమ్మూ-శ్రీనగర్-70, కోల్‌కతా-236, మాల్దా-45, ముంబై-232, ముజఫర్‌పూర్-26, పట్నా-76, రాంచీ-38, సికింద్రాబాద్-112, సిలిగురి-30.అర్హత: పోస్టులను బట్టి సంబంధిత విభాగంలో బీఎస్సీ, పీజీ డిప్లొమా, ఎంఎస్సీ, డిప్లొమా, గ్రాడ్యుయేషన్, ఇంటర్/తత్సమాన ఉత్తీర్ణత. వయసు: పోస్టులను బట్టి 18-40 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ అభ్యర్థులకు వయో సడలింపు ఉంటుంది. ఎంపిక: కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (సీబీటీ) ఆధారంగా. దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో. దరఖాస్తు ఫీజు: రూ.500. రాయితీ వర్తించే వర్గాలకు రూ.250. రిజిస్ట్రేషన్‌కు చివరితేదీ: ఏప్రిల్ 2, 2019. దరఖాస్తుకు చివరితేదీ: ఏప్రిల్ 7, 2019. పూర్తి వివరాలకు వెబ్‌సైట్: http://rrbsecunderabad.nic.in |
ఇండియన్ నేవీలో 554 పోస్టులు
ఇండియన్ నేవీ 554 ట్రేడ్స్ మ్యాన్ మేట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
|
పోస్టుల వివరాలు..
వయసు: 18-25 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ అభ్యర్థులకు సడలింపు ఉంటుంది. ఎంపిక: ఆన్‌లైన్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఆధారంగా. దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో. దరఖాస్తు ఫీజు: రూ.205. (కొన్ని వర్గాలకు మినహాయింపు ఉంది) దరఖాస్తుకు చివరితేదీ: మార్చి 15, 2019. పూర్తి వివరాలకు వెబ్‌సైట్ : www.joinindiannavy.gov.in |
ఏపీపీఎస్సీ 31 గెజిటెడ్ పోస్టులకు నోటిఫికేషన్
ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ ప్రభుత్వ విభాగాల్లో ఖాళీగా ఉన్న 31 గెజిటెడ్ పోస్టుల భర్తీకి రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) ప్రకటన విడుదల చేసింది.
|
విభాగాల వారీ ఖాళీలు: అసిస్టెంట్ బీసీ వెల్ఫేర్ ఆఫీసర్-4, అసిస్టెంట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్-3, అసిస్టెంట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్-2, సివిల్ అసిస్టెంట్ సర్జన్-9, జిల్లా సైనిక్ వెల్ఫేర్ ఆఫీసర్-6, అసిస్టెంట్ డెరైక్టర్ ఇన్ ఏపీ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్-2, అసిస్టెంట్ కెమిస్ట్-1, టౌన్ ప్లానింగ్ అసిస్టెంట్-1, రాయల్టీ ఇన్‌స్పెక్టర్-2, టెక్నికల్ అసిస్టెంట్ ఇన్ పోలీస్ ట్రాన్స్‌పోర్ట్ ఆర్గనైజేషన్-1. అర్హత: పోస్టులను బట్టి బ్యాచిలర్ డిగ్రీ, ఎంబీబీఎస్, సంబంధిత విభాగాల్లో బీఈ/బీటెక్, పీజీ డిప్లొమా, ఎంఎస్సీ ఉత్తీర్ణత. వయసు: జులై 1, 2019 నాటికి జిల్లా సైనిక్ వెల్ఫేర్ ఆఫీసర్ పోస్టుకు గరిష్టంగా 52 ఏళ్లు మించకూడదు. టెక్నికల్ అసిస్టెంట్ పోస్టుకు 21-30 ఏళ్ల మధ్య ఉండాలి. మిగిలిన వాటికి 18-42 ఏళ్ల మధ్య ఉండాలి. ఎంపిక: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా.దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో. దరఖాస్తు ఫీజు: అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీజు రూ.250, ఎగ్జామ్ ఫీజు రూ.120 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, నిరుద్యోగ యువత, తెల్లరేషన్ కార్డు దారులకు ఎగ్జామ్ ఫీజు ఉండదు. దరఖాస్తు ప్రారంభం: మార్చి 26, 2019. దరఖాస్తుకు చివరితేదీ: ఏప్రిల్ 16, 2019. ఫీజు చెల్లించుటకు చివరితేదీ: ఏప్రిల్ 15, 2019. పూర్తి వివరాలకు వెబ్‌సైట్: https://psc.ap.gov.in |
Subscribe to:
Posts (Atom)
భారత్ ఫ్యూచర్ సిటీని గ్లోబల్ అర్బన్ హబ్‌గా అభివృద్ధి చేయడానికి యుఎఇ-తెలంగాణ భాగస్వామ్యం
భారత్ ఫ్యూచర్ సిటీని గ్లోబల్ అర్బన్ హబ్‌గా అభివృద్ధి చేయడానికి యుఎఇ-తెలంగాణ భాగస్వామ్యం వరల్డ్ ఎకనామిక్ ఫోరం 2026లో, భారతదేశపు మొట్టమొదటి న...
-
తెలంగాణ ఆధునిక కవులు సురవరం ప్రతాపరెడ్డి : స్వస్థలం మహబూబ్ నగర్ జిల్లా ఆలంపూర్. మద్రాస్‌లో లా చేశారు. రాజాబహదూర్ వెంకట్రామిరెడ్డి, పి...
-
Sathavahana Dynasty founder - Sathavahana Kingdom Founder - Sri Muka Capitals - Koti Lingala (Karimnagar), Dhaanyakatakam ...







