తెలంగాణ
పునరావిష్కరణ
సామాజిక
ఆర్ధిక విశ్లేషణ 2016
తెలంగాణ
ప్రభుత్వం
ప్రణాళిక
సంఘం
తెలంగాణ
ప్రభుత్వం
తెలంగాణ
పునరావిష్కరణ
ముందు
మార్గం
సామాజిక
ఆర్ధిక దృక్పథం 2016
ప్రణాళిక
సంఘం
విషయసూచిక
క్రమసంఖ్య పేజి
నం.
సెక్షన్ 1
తెలంగాణ
పునరావిష్కరణ
1. ముందు మార్గం
2.స్థూల ఆర్థిక పరిణామాలు, వృద్ధి పథం
సెక్షన్ 2
రంగాలవారీ విశ్లేషణ
3.వ్యవసాయం, అనుబంధ రంగాల కార్యకలాపాలు
4.పరిశ్రమలు
5.సేవారంగం
సెక్షన్ 3
తెలంగాణలో మానవాభివృద్ధి
6. మానవాభివృద్ధి సూచీ: తెలంగాణ స్థాయి
7. సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు: ముందు మార్గం
సెక్షన్ 4
గణాంకాల కూర్పు
సెక్షన్ 1
అధ్యాయం 1
తెలంగాణ పునరావిష్కరణ
కొత్త ఆశలు, ఆకాంక్షాలకు కోసం వర్గాలకతీతంగా ప్రజలంతా
కలిసి సుదీర్ఘంగా చేసిన ఉద్యమ ఫలితం తెలంగాణ రాష్ట్రం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉద్దేశపూర్వకంగా
తెలంగాణను నిర్లక్ష్యం చేసిన ధోరణి ఈ ఉద్యమానికి కారణంగా చెప్పవచ్చు. నీళ్లు , నిధులు,
నియమాకాలు విషయంలో తెలంగాణ అన్యాయమానికి గురైంది.
నిర్లక్ష్యపు వారస్వతం
గత వ్యయాలను మదింపు చేస్తే రెవెన్యూ ఉత్పాదకత విషయంలో
తెలంగాణను ఏ మాత్రం పట్టించుకోలేదనే విషయం స్పష్టమవుతుంది. భారత ప్రభుత్వం 1969లో నియమించిన
లలిత్ కమిటీ నివేదిక ప్రకారం 1956-1969 మధ్య
కాలంలో తెలంగాణలో బడ్జెట్ మిగులు దాదాపు రూ.85.83
కోట్లు. ప్రస్తుతం విలువ ప్రకారం ఆర్థిక నష్టం, ఆదాయం, ఉపాధి, పబ్లిక్ రెవెన్యూల ప్రత్యక్ష,
పరోక్ష నష్టం అనేక రెట్లు ఎక్కువ ఉంటుంది. ప్రముఖ ఆర్థికవేత సి.హెచ్. హనుమంతరావు, తన
పుస్తకంలో “రీజినల్ డిస్పారిటిస్, స్మాల్ స్టేట్స్ అండ్ స్టేట్ హుడ్ ఫర్ తెలంగాణలో
ఈ నివేదికను విశ్లేషించారు.
2004-05 నుంచి 2012-13 మధ్య కాలంలో జిల్లాలవారీగా
ఆదాయ, వ్యయాన్ని పరిశీలించిన పద్నాలుగో ఆర్థిక సంఘం, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణ
వాటా 49.5 శాతంగా ఉందని, అయితే ఆ ప్రాంతంలో చేసిన రెవెన్యూ వ్యయం 38.5 శాతమేనని నిర్థారణకు
వచ్చింది. ఆదాయంలో ఆంధ్ర, రాయలసీమ జిల్లాల వాటా 50.5 శాతమని, కాని ఉమ్మడి రాష్ట్రంలో
అక్కడ చేసిన వ్యయం 61.5 శాతం. అంటే తెలంగాణను ఉద్దేశపూర్వకంగానే నిర్లక్ష్యం చేసిన
తీరు స్పష్టమవుతోంది. తెలంగాణ మిగులు ఆదాయాన్ని 1956 నుంచి 2014 వరకు మొత్తం 58 సంవత్సరాలు
తరలించారు. ఈ కారణంగా సామాజిక, ఆర్థిక అభివృద్ధిలో ప్రభుత్వపెట్టుబడులు తగ్గి ఆర్థిక
వ్యవస్థలో అసమానతలు చోటుచేసుకున్నాయి.
II. బంగారు తెలంగాణ నిర్మాణం – ప్రభుత్వ దార్శనికత
ఉద్దేశపూర్వక నిర్లక్ష్యానికి గురైన తెలంగాణ రాష్ట్రాన్ని
రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా నిలదొక్కుకునేలా చేసి పెట్టుబడులు, అభివృద్ధి, మానవ
వికాసానికి బాటలు వేయడం ప్రస్తుతం రాష్ట్రం ముందున్న సవాల్.
అవసరమైన పథకాలను తొలగించి సంస్కరణల ద్వారా భాగస్వామ్య,
జవాబుదారీ, అభివృద్ధి కాంక్షిత పాలక వ్యవస్థను ఏర్పాటు చేసుకునేందుకు ప్రత్యేక రాష్ట్ర
ఏర్పాటు సువర్ణవకాశం కల్పిస్తోంది. గతంలో జరిగిన నిర్లక్ష్యాన్ని చక్కదిద్దడమే కాదు,
భవిష్యత్తుకు అనుగుణంగా అందర్ని భాగస్వాములను చేసే బంగారు తెలంగాణ నిర్మించేందుకు ప్రస్తుతం
ప్రభుత్వం దృష్టిసారించింది.
బంగారు తెలంగాణ నిర్మాణానికి బాటలు వేసేందుకు అమల్లో
ఉన్న విధానాలు మార్చుకుంటూ గతంలో జరిగిన చారిత్రక తప్పిదాలను చక్కదిద్దేందుకు గడిచిన
21 నెలలుగా తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తోంది.
“ప్రగతి చక్రాన్ని సరిదిద్దడమే కాదు అందరిని అందులో
భాగస్వాములు చేయడం” రాష్ట్ర ప్రభుత్వం ముందున్న అతి పెద్ద సవాలని బంగారు తెలంగాణ నిర్మాణంపై
ముఖ్యమంత్రి చెప్పిన మాటలు ప్రభుత్వ దార్శనికతను తెలియజేస్తున్నాయి. సమాజంలో అణగారిన వర్గాలు వెనుకబడే ఉంటే ఆ అభివృద్ధికి
అర్థం లేదని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఈ తప్పనిసరి నిర్బంధాలే రాష్ట్రం ఏర్పడిన
నాటి నుంచి ప్రభుత్వానికి మార్గదర్శకంగా నిలుస్తున్నాయని ముఖ్యమంత్రి అన్నారు. (14వ
ఆర్థిక సంఘం, 2014 ముందు చేసిన ప్రసంగం)
బంగారు తెలంగాణ నిర్మాణం కోసం ప్రభుత్వం చేపడుతున్న
చర్యలను స్థూలంగా మూడు భాగాలుగా పేర్కొనవచ్చు. (i) ఆర్థిక ప్రగతిని వేగవంతం చేసే చర్యలు
(ii) మౌలిక సదుపాయాల మెరుగుదల (iii) సామాజిక సంక్షేమం, సమిష్టి అభివృద్ధి దిశగా లక్షిత
విధానాలు.
ఆర్థిక ప్రగతిని వేగవంతం చేసే చర్యలు
గడిచిన 20 నెలలుగా ప్రభుత్వం తీసుకున్న చర్యల కారణంగా
తెలంగాణ ఆర్థిక వ్యవస్థ మెరుగుపడి ఉన్నత అభివృద్ధి పథంలో ప్రయాణించడం తెలంగాణ ప్రజలు
గర్వకారణంగా చెప్పుకోవచ్చు. ప్రస్తుత ధరల ప్రకారం జాతీయ సగటు 8.6% ( ముందస్తు అంచనాలు)
కంటే 11.7 శాతం అభివృద్ధి నమోదు చేస్తూ తెలంగాణ రాష్ట్రం భారత్ లో అత్యంత వేగంగా అభివృద్ధి
చెందుతున్న రాష్ట్రాలు జాబితాలో చోటు సంపాదించుకుంది.
(2011-12) స్థిర ధరల్లో జాతీయ సగటు వృద్ధి 7.6 శాతంగా ఉంటే తెలంగాణ 9.2% వృద్ధి సాధిస్తుందని
అంచనా.
గ్రామీణ జనాభా జీవన ప్రమాణాలు మెరుగుపరిచేందుకు వ్యవసాయ
రంగంలో స్థిరమైన అత్యున్నత వృద్ధి అవసరం. ఈ మధ్యకాలంలో చోటుచేసుకుంటున్న వృద్ధిలో వ్యవసాయరంగం
వాటా తగ్గుతుండటం ఆందోళన కలిగించే పరిణామం. వరుస కరువు, వ్యవస్థీకృతమైన క్లిష్టత కారణంగా
గడిచిన రెండేళ్లుగా వ్యవసాయ రంగం ప్రతికూల ప్రగతి నమోదు చేస్తోంది. రాష్ట్రం జనాభాలో
సగం కంటే ఎక్కువ మంది ఆదాయం తగ్గిపోయింది.
కరువును ఎదుర్కొనేందుకు ప్రభుత్వం పటిష్టమైన కార్యాచరణ రూపొందించింది. కరువు
దుష్ప్రభావం నుంచి ఇన్ పుట్్ సబ్సిడీ అందించడంతో పాటు పశుగ్రాసం అందుబాటులో ఉంచడం,
పశుపోషణకు తగిన సాయమందిస్తోంది.
వ్యవస్థీకృత సంక్లిష్టతల నుంచి వ్యవసాయ రంగాన్ని గట్టెక్కించి
వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు రెండో హరిత విప్లవం అవసరమనే విషయాన్ని ప్రభుత్వం
గుర్తించింది. ఈ క్రమంలో భాగంగా రైతులు ధాన్యేతర పంటల సాగు, సమృద్ధ పోషకాలతో కూడిన
పాలు, గుడ్లు, తదితర ఉత్పత్తుల వైపు రైతులు దృష్టి కేంద్రీకరించాల్సిన అవసరముంది. ఉద్యాన
పంటల సాగు, పశుపోషణపై తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక
దృష్టి సారించింది. మామిడి, మిర్చి, పసుపు, కూరగాయలు, పాలు, పౌల్ట్రీ వస్తువుల ఉత్పత్తిలో
తెలంగాణ రాష్ట్రం కీలకమైన వాటాదారు. ఈ రంగాలను మరింత అభివృద్ధిపరిచేందుకు తెలంగాణ ప్రభుత్వం
ఐదు భారీ పథకాలు ప్రారంభించింది. (i) సూక్ష్మసాగు (ii) హరిత గృహాలు/పాలీ హౌజ్ పథకం
(iii) వ్యవసాయ యాంత్రీకరణ (iv) పాలరైతులకు లీటరుకు రూ.4 సబ్సిడీ (v) పౌల్ట్రీ రైతులకు
విద్యుత్ సబ్సిడీ
వ్యవసాయ ఉత్పాదకతలో ముఖ్యంగా కరువు సమయాల్లో సాగునీటి
వసతి చాలా కీలకం. వ్యవసాయానికి సాగునీటి వసతి మరింత మెరుగుపరిచేందుకు తెలంగాణ ప్రభుత్వం
రెండు భారీ చర్యలు తీసుకుంది. (i) మిషన్ కాకతీయ
– ప్రస్తుతమున్న చెరువుల మరమ్మతు, పునరుద్ధరించి వాటిని పూర్తిస్థాయిలో వినియోగంలోకి
తేవడం (ii) ముఖ్యమైన నదుల్లో రాష్ట్ర వాటాను పూర్తిస్థాయిలో వాడుకునేందుకు భారీ సాగునీటి
ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేయడం, రాష్ట్ర అవసరాలకు తగ్గట్టుగా అవసరమైన చోట్ల
డిజైన్లు మార్పు చేయడం. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రతిష్టాత్మకమైన పథకం మిషన్ కాకతీయ.
ఈ పథకం కింద 8200 చెరువుల పునురుద్ధరణ పనులు చేపట్టారు. ఇందులో 6000 చెరువుల్లో పనులు
దాదాపుగా పూర్తయ్యాయి. రెండో దశలో 9000 చెరువుల్లో పనులు చేపట్టనున్నారు.
యువతకు అవసరమైన ఉపాధి కల్పనకు పారిశ్రామిక, సేవా రంగాల్లో
అభివృద్ధిని వేగవంతం చేయాల్సిన అవసరముంది. రాష్ట్రానికి కొత్త పెట్టుబడులు వచ్చినప్పుడే
పారిశ్రామిక, సేవారంగాల్లో అత్యధిక వృద్ధి రేటు సాధించడం సాధ్యం. ఇందులో భాగంగా రాష్ట్రంలో
వ్యాపార అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించేందుకు, పరిశ్రమల ఏర్పాటుకు సంబంధించి వివిధ
దశల్లో అనుమతులను వేగవంతం చేసేందుకు ఏకీకృత విధానం “తెలంగా స్టేట్ ఇండస్ట్రియల్ ప్రాజెక్టు
అప్రూవల్ అండ్ సెల్ఫ్ సర్టిఫికేషన్ సిస్టమ్ (టీఎస్ ఐపాస్) పేరుతో కొత్త విధానాన్ని
ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. కొత్త పారిశ్రామికవేత్తలను ప్రోత్సాహించేందుకు తెలంగాణ
ప్రభుత్వం అనేక రాయితీలు అందిస్తోంది.
ఐటీ, ఐటీ ఆధారిత సర్వీసుల్లో దేశంలో తెలంగాణ అతిపెద్ద
ఎగుమతిదారు. ఐటీ, ఐటీఈఎస్ రంగాలకు హైదరాబాద్ విశ్వవాప్తగమ్యస్థానం. ఐటీ రంగంలో వృద్ధి
కోసం రాష్ట్ర ప్రభుత్వం అత్యాధునిక మౌలిక సదుపాయాలు కల్పిస్తోంది.
ఐటీ పరిశ్రమను ఇతర నగరాల్లో విస్తరించే చర్యల్లో భాగంగా
టైయర్ టూ ఐటీ హబ్ గా వరంగల్ ను ప్రభుత్వం గుర్తించి అక్కడ అవసరమైన మౌలిక వసతుల రూపకల్పనకు
కృషి చేస్తోంది. హైదరాబాద్ నగరాన్ని స్టార్టప్ సిటీగా, తెలంగాణ రాష్ట్రాన్ని స్టార్టప్
రాష్ట్రంగా అభివృద్ది చేసేందుకు ప్రభుత్వం టీ-హబ్ ప్రారంభించింది.
మౌలిక సదుపాయల మెరుగుదల
ఉత్పాదక పెంపుతో పాటు జీవన ప్రమాణాల మెరుగుదలకు అవసరమైన
వసతులతో కూడిన ఆర్థిక అభివృద్ధికి మౌలిక వసతులు దోహదపడతాయి. రాష్ట్రం అత్యధిక వృద్ధితో
కూడిన మార్గంలో పయనించాలంటే మౌలికరంగంలో పెట్టుబటులు అవసరం. భారీ మొత్తంలో వనరులు అవసరం
కాబట్టి మౌలిక రంగానికి ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరముంది. ఇందులో భాగంగా సాగునీరు,
రహదారులు, విద్యుత్ రంగాల్లో అవసరమైన మౌలిక వసతుల మెరుగుదల కోసం ప్రభుత్వం కృషి చేస్తోంది.
వ్యవసాయానికి కనీసం 9 గంటల విద్యుత్, పరిశ్రమలు, గృహవినియోగానికి నిరంతరాయ సరఫరా చేయడం
ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ లక్ష్యాల సాధన కోసం ప్రభుత్వం 6840 మెగావాట్ల అదనపు
విద్యుత్ ఉత్పత్తి కోసం కొత్తగా ఆరు విద్యుత్ ప్రాజెక్టులు ప్రారంభిస్తోంది. విద్యుత్
రంగంలో భారీ లోటు ఉన్నప్పటికీ 2015-16 సంవత్సరంలో ప్రభుత్వం నిరాంతరయంగా నాణ్యమైన విద్యుత్
సరఫరా చేసింది. విద్యుత్ రంగంలో చోటుచేసుకున్న ఈ గణనీయమైన మెరుగుదల ప్రభుత్వ విజయగాధాల్లో
ఒకటి. విద్యుత్ రంగంలో స్వయం సమృద్ధి సాధించేందుకు, భవిష్యత్ లో పెరగనున్న పారిశ్రామిక
అవసరాలను దృష్టిలో ఉంచుకొని, సౌరశక్తిని కూడా వినియోగించుకొని వచ్చే మూడేళ్లలో విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని
23,912 మెగావాట్ల స్థాయికి తీసుకెళ్లేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. విద్యుత్
ఉత్పత్తి చేసేందుకు టీఎస్ జెన్ కో, సింగరేణఇ
కాలరీస్, ఎన్ టీపీసీ, సౌర విద్యుత్కేంద్రాలకు దాదాపు రూ.91,500 కోట్ల రుణాలు కూడా మంజూరయ్యాయి.
సరుకు రవాణకు, ప్రయాణికుల రాకపోకలకు సరైన రోడ్లు చాలా
ముఖ్యం. రాష్ట్రంలో రహదారులను మెరుగుపరిచేందుకు ప్రభుత్వం ఎన్నో చర్యలు చేపట్టింది. (i) మండల కేంద్రాల నుంచి జిల్లా కేంద్రాలకు అనుసంధాత
కల్పించేందుకు సింగిల్ రోడ్లను డబుల్ గా మార్చడం (ii) పెరుగుతున్న రద్దీకి అనుగుణంగా
ప్రధానమైన జిల్లా రహదార్లు, రాష్ట్ర హై-వేలను డబుల్ లేన్ రోడ్లుగా మార్చడం. దాదాపు
15,000 కిలోమీటర్ల రహదారి ఈ ప్రణాళికల్లో భాగం కానున్నాయి. వీటి కారణంగా కొత్తగా
358 వంతెనలు నిర్మించనున్నారు.
సామాజిక సంక్షేమం, సమిష్టి వృద్ధికి
చేపడుతున్న పథకాలు
సమాజంలో ఉన్న బలహీనవర్గాల అభ్యున్నతే కాదు వారిని
సమాజంలో ఉన్న వారితో సమానంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం బహుముఖ విధానాన్ని అమలు చేస్తోంది.
ఇందులో భాగంగా (i) మానవ వనరుల అభివృద్ధికి అవసరమైన విద్యా, ఆరోగ్యానికి ప్రాధాన్యత
(ii) అణిచివేతకు గురయ్యే ముసలివాళ్లు, అనాధల సంక్షేమం కోసం పథకాలు (iii) ఆర్థికంగా,
సామాజికంగా బలహీనమైనవర్గాల సంక్షేమం కోసం పథకాలు.
ఆర్థిక ప్రగతి, భాగ్యంలో తెలంగాణ ప్రభుత్వం గణనీయమైన
ప్రగతి సాధించినప్పటికీ విద్య, ఆరోగ్య రంగాల్లో మాత్రం చాలా వెనుకబడి ఉండటం దురదృష్టకరం. సామాజిక సూచికలైన అక్షరాస్యత రేటు, స్త్రీ-పురుష
గ్యాప్, శిశు మరణాలు, ప్రసవ మరణాల రేటు వంటి అంశాలు చాలా జిల్లాల్లో ఆందోళనకరంగానే
ఉన్నాయి. దీర్ఘకాల ప్రయాణంలో
సామాజిక ప్రగతి లేకుండా ఆర్థిక అభ్యున్నతి మనుగడు సాధించలేదన్న విషయాన్ని గుర్తించారు. అందుకే సామాజిక అభివృద్ధికి తగిన కృషి ప్రభుత్వం
చేస్తోంది. ఇందులో భాగంగా విద్యా, ఆరోగ్య రంగాలకు సంబంధించి ప్రభుత్వం అనేక పథకాలు
చేపడుతోంది. ప్రస్తుతమున్న ఆరోగ్య సదుపాయాలను పటిష్టపరచడమే కాదు, వాటిని స్థిరీకరించి
ప్రభుత్వాస్పత్రులపై
ప్రజల్లో నమ్మకం పెంచేందుకు అవసరమైన పరికరాలు, ఔషధాలు, తగిన సిబ్బందిని ఏర్పాటు చేసేందుకు
ప్రభుత్వం కట్టుబడి ఉంది.
రాష్ట్రంలో శిశు మరణాలను తగ్గించేందుకు ప్రభుత్వం
అనేక చర్యలు చేపడుతోంది. తెలంగాణలో శిశుమరణాలు ప్రతీ 1000 జననాలకు 39 నుంచి 28కి తగ్గాయి. జాతీయ రేటు 40తో పోల్చితే
ఇది చాలా గణనీయమైన వృద్ధి. రాష్ట్రం ఏర్పడిన తర్వాత సాధించిన విజయమిది.
జాతీయ ఆహార భద్రత చట్టం తెలంగాణలో ఆహార పంపిణీ వ్యవస్థలోనే కాదు పోషకాహారల స్థాయిల్లోనూ మెరుగుదల తెచ్చింది.
సబ్సిడీ ధరకు ఆహార ధాన్యాలు అందించే ఆహార హక్కును ఈ చట్టం కల్పించింది. చట్టం ప్రకారం
కవరేజే కాకుండా అదనంగా తక్కువ ధరకు అదనపు బియ్యం అందించేందుకు ప్రభుత్వం నిబంధనలు సడలించింది.
కుటుంబంలో ఎంత మంది ఉన్నారనే దానితో సంబంధం లేకుండా అర్హులైన ప్రతీ ఒక్కరికీ ఆరు కేజీల
బియ్యం అందిస్తోంది. సాంఘిక సంక్షేమ హాస్టళ్లలో చదువుకుంటున్న విద్యార్థులకు, మధ్యాహ్న
భోజన పథకం పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు సన్న బియ్యం సమకూర్చుతోంది. ఈ పథకాన్ని
కాలేజీ విద్యార్థులకు అందించేందుకు ప్రతిపాదించారు.
ఆవాస ప్రాంతాల్లో ఉండే ప్రతీ కుటుంబానికి నల్లా కనెక్షన్
కల్పించి
తాగునీరు అందించేందుకు మిషన్ భగీరథ పేరుతో ప్రభుత్వం
బృహత్ పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకాన్ని ప్రశంసించిన భారత ప్రభుత్వాన్ని మిగతా రాష్ట్రాలను
అమలు చేయాలని సూచించింది. ప్రజల భాగస్వామ్యంతో గ్రామీణ అభివృద్ధనే విషయంపై ప్రభుత్వం
దృష్టి సారించింది. 73వ రాజ్యాంగ సవరణ స్ఫూర్తిగా అనుగుణంగా పంచాయతీల సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం గ్రామజ్యోతి పథకాన్ని తీర్చిదిద్దింది.
గ్రామీణ పేద కుటుంబాల జీవనప్రమాణాల మెరుగుదలకు ఐదు కీలకాంశాల దృష్టి పెడుతూ తెలంగాణ
పల్లె ప్రగతిని తీసుకువచ్చింది.
సమాజంలో అణిచివేతకు గురయ్యే ముసలివాళ్లు, వికలాంగులు,
ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు, వితంతవులు, అశక్తులైన నేత కార్మికులు, కల్లు గీత కార్మికులకు
(32.18 లక్షలు) ప్రభుత్వం అసరా పెన్షన్లు అందిస్తూ వారిని సంరక్షిస్తోంది. బీడీ కార్మికులకు (3.53 లక్షలు) ప్రతీ నెలా ఆర్థిక
సాయమందిస్తోంది. గౌరవప్రదమైన జీవితం గడిపేందుకు ఈ కుటుంబాలకు ఈ పథఖాలు ఎంతో అండగా నిలుస్తున్నాయి.
పేదలు గౌరవప్రదమైన జీవితం గడపాలని లక్ష్యంగా పెట్టుకున్న
ప్రభుత్వం గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఇళ్లు లేని పేదల కోసం గతంలో ఉన్న సింగల్ రూమ్
విధానానికి స్వస్తి పలికి డబుల్ బెడ్ రూమ్
పథకాన్ని ప్రారంభించింది. ఈ కొత్త పథకం కింద నిర్మించే ఇళ్లలో డబుల్ బెడ్ రూమ్, కిచెన్,
హాల్, రెండు బాత్ కమ్ టాయిలెట్లు ఉంటాయి. పేదలు గౌరవప్రదమైన జీవితం గడిపేందుకు ఈ తరహా
పథకం ప్రారంభించడం దేశంలోనే ప్రప్రథమం.
కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలు తెలంగాణ ప్రభుత్వం
ప్రారంభించిన అత్యంత ప్రసిద్ధి చెందిన విజయవంతమైన బృహత్ పథఖాలు. ఈ పథకం ద్వారా ఆర్థికంగా
వెనుకబడిన ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ కుటుంబాలకు చెందిన అమ్మాయిల వివాహం సందర్భంగా ఆ కుటుంబాలు
ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయి ఇబ్బంది పడకుండా చూసేందుకు ప్రభుత్వం రూ.51,000 అందిస్తోంది. ఎస్సీ, ఎస్టీల్లో
ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సాహించేందుకు టీ-ప్రైడ్ పేరుతో పథకాన్ని ప్రభుత్వం
ప్రారంభించింది. పేద వ్యవసాయ కుటుంబాలు, షెడ్యూల్డ్ కులాలకు చెందిన వారికి జీవనోపాధి
అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం భూమి కొనుగోలు పథకానికి శ్రీకారం చుట్టింది.
దృక్పథం
తెలంగాణలో ఆర్థిక ప్రగతి పునరుద్ధరణకు వ్యాపార వాతావరణానికి
అనుకూలమైన భౌతిక మౌలిక వసతులు కల్పించేందుకు తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి అనేక సాహాసోపేతమైన
చర్యలు తీసుకుంటోంది. ఈ చర్యల వలన అతి స్వల్ప కాలంలోనే ఆర్థిక వ్యవస్థ మెరుగుపడి అధిక
వృద్ధి మార్గంలోకి వచ్చినా వ్యవసాయ రంగంలో చోటుచేసుకుంటున్న ఒడిదొడుకులు ఆందోళన కలిగిస్తున్నాయి.
సమిష్టి అభివృద్ధికి వ్యవసాయ రంగం పునరుద్ధరణ అత్యవశ్యకమని
భావిస్తున్న ప్రభుత్వం వ్యవసాయంపై ఆధారపడిన వారికి దాన్ని లాభసాటిగా మల్చేందుకు అనేక పథకాలు ప్రవేశపెడుతోంది. రాష్ట్రంలో ఏర్పడిన కరువు
దుష్ప్రభావం రైతులపై పడకుండా చూసేందుకు తక్షణ కార్యాచరణ ప్రణాళికను అమలు చేస్తోంది.
సమాజంలోని అణగారిన వర్గాలు, అణిచివేతకు గురయ్యే వారి ఆర్థిక, సామాజిక స్థితిగతులు మెరుగుపరిచేందుకు
ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెడుతోంది.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత వెలువరించిన “సామాజిక-ఆర్థిక
దృక్పథం- 2016, మూడోది. గడిచిన 21నెలలుగా ప్రభుత్వం చేపడుతున్న వివిధ పథకాలు, చర్యలు,
వాటి అమలు ఏ స్థాయిలో ఉన్నది ఇది వివరిస్తుంది. ఈ నివేదిక నాలుగు భాగాల సమాహారం. సెక్షన్–I
– తెలంగాణ పునరావిష్కరణ, భవిష్యత్తుకు దారి, స్థూల ఆర్థిక పరిణామాలు, సెక్షన్ –II – రంగాలవారీగా వ్యవసాయం, పరిశ్రమ, సేవారంగాల
విశ్లేషణ, సెక్షన్ –III – మానవ అభివృద్ధి సూచి, ఎండిజీ స్థాయి, అభివృద్ధి లక్ష్యాలు,
సెక్షన్ –IV – తెలంగాణ రాష్ట్ర గణాంక చిత్రం.
వెయ్యి స్థంభాల గుడి, వరంగల్
అధ్యాయం -2 స్థూల ఆర్థిక పరిణామాలు, ప్రగతి మార్గం
1,12,077 చదరపు కిలోమీటర్లు భూభాగం, 2011 జనాభా లెక్కల
ప్రకారం 3.5 కోట్ల జనాభాతో- జనాభా, వైశాల్యపరంగా భారత్ లో తెలంగాణ 12వ రాష్ట్రంగా ఉంది.
ఉత్తరాన మహారాష్ట్రా, ఛత్తీస్ గఢ్, పశ్చిమాన కర్ణాటక, దక్షిణం, తూర్పు, ఈశాన్య దిక్కుల్లో ఆంధ్రప్రదేశ్ – తెలంగాణ సరిహద్దులు. దక్కన్ పీఠభూమిలోవ్యూహాత్మకంగా కొలువుదీరిన రాష్ట్రం దేశం నడిమధ్యలో ఉంది.
రాష్ట్రం జనాభాలో ఎక్కువ మంది గ్రామీణ ప్రాంతాల్లోనే
ఉంటున్నారు. 61.12 శాతం మంది గ్రామీణ ప్రాంతాల్లో,
మిగిలిన 38.88 శాతం మంది పట్టణ ప్రాంతాల్లోనివసిస్తున్నారు. 2011 జనాభా లెక్కల ప్రకారం
రాష్ట్ర స్త్రీ:పురుష నిష్పత్తి 988.
2001-2011 దశాబ్దంలో జాతీయ జనాభా వృద్ధి రేటు 17.7 శాతమైతే ఇది తెలంగాణలో
13.58 శాతంగా ఉంది. పట్టణ ప్రాంతాల్లో జనాభా పెరుగుదల అధికంగా ఉంది. దేశంలో వేగంగా
పట్టణీకరణ చెందుతున్న రాష్ట్రంలో తెలంగాణ కూడా ఒకటి. 2001-11 మధ్య కాలంలో రాష్ట్రంలో పట్టణ జనాభా
38.12 శాతంగా పెరుగుదల నమోదు చేసింది. అంతకు ముందు దశాబ్దంలో ఇది 25.13 శాతమే.
2001-11 మధ్యకాలంలో గ్రామీణ ప్రాంత జనాభా కేవలం 2.13 శాతం పెరుగుదల నమోదు చేసింది.
మొత్తం పట్టణ జనాభాలో దాదాపు 30 శాతం మంది రాజధాని హైదరాబాద్ లోనే నివసిస్తున్నారు.
I. తెలంగాణ రాష్ట్ర స్థూల దేశీయోత్పత్తి
రాష్ట్ర ప్రజల జీవన ప్రమాణాల మెరుగుదలకు, పేదరిక నిర్మూలనకు
ఆర్థిక అభివృద్ధి తప్పనిసరి. రాష్ట్ర సమగ్రాభివృద్ధికి
ఆర్థిక వృద్ధి ఎంత ముఖ్యమో నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు అరవింద్ పనగడియా చక్కగా చెప్పారు.
“ ఆర్థిక ప్రగతి ప్రజలను లాభదాయకమైన ఉపాధి అవకాశాల్లోకి
లాక్కువచ్చి కొనుగోలు శక్తిని వారికి చేతికి అందిస్తుంది. ఇది పేదరికాన్ని తగ్గించడమే
కాదు ప్రభుత్వం అందించే విద్య, ఆరోగ్యం వంటి వసతులకు వారిని దగ్గర చేస్తుంది. వృద్ధి
బాగున్నప్పడే పేదరిక నిర్మూలన, విద్య, ఆరోగ్యం,
ఇతర సామాజిక సేవలపై ప్రభుత్వం ఎక్కువ ఖర్చు చేయగలుగుతుంది.”
ఓ రాష్ట్ర అభివృద్ధికి కొలిచేందుకు రాష్ట్ర ఆదాయం
లేదా రాష్ట్ర స్థూల దేశీయోత్పత్తి ముఖ్యమైన సూచి. ఆర్థిక వృద్ధిలో చోటుచేసుకుంటున్న
మార్పులు, దాని దిశను ఈ అంచనాలు వెల్లడిస్తాయి.
ఆర్థిక ప్రగతి ద్వారా కచ్చితంగా మానవ/సామాజిక అభివృద్ధి సాధిస్తామని చెప్పలేం.
ఇది సాధించేందుకు విద్య, ఆరోగ్యం, సాంఘిక సంక్షేమ పథకాలకు ప్రభుత్వం
కేటాయించే నిధులు కీలక పాత్ర పోషిస్తాయి. తెలంగాణ ఆర్థిక వ్యవస్థ, రాష్ట్రంలో ఉపాధి
అవకాశాల స్వరూపం, ద్రవ్యోల్బణం, పబ్లిక్ ఫైనాన్స్ సంబంధించిన అంశాలను ఈ అధ్యాయాలు వివరిస్తాయి.
మూల సంవత్సరంగా 2011-12: స్థూల రాష్ట్ర దేశీయోత్పత్తి అంచనాలు వేసేందుకు
కేంద్ర గణంకాలు, పథకాల అమలు మంత్రిత్వశాఖకు చెందిన కేంద్ర గణాంక కార్యాలయంతో సమానంగా 2011-12 సంవత్సరాన్ని మూల సంవత్సరంగా తెలంగాణ ప్రభుత్వం
నిర్ణయించింది. వాస్తవ ఆర్థిక వ్యవస్థ పనితీరు పరిశీలించేందుకు మూల సంవత్సర ధరలకనుగుణంగా
స్థూల ఆర్థిక గణాంక అంచనాలు రూపొందించారు. ప్రస్తుత ధరల అంచనాలను ప్రస్తుత ధరలను, మూల
సంవత్సర ధరలను స్థిర ధరలను పేర్కొనడం జరిగింది. స్థిర ధరలతో అంచనాలను వాస్తవ అంశాలను
పోల్చడం ద్వారా నిజమైన ప్రగతి కొలవవచ్చు.
బాక్స్ 2.1 జీడీపీ గణాంకాల కోసం మూల సంవత్సరాన్ని
2004-05 నుంచి 2011-12 కు మార్చడం.
స్థూల దేశీయోత్పత్తిని అంచనా వేసేందుకు మూల సంవత్సరాన్ని
2004-05 నుంచి 2011-12కు మార్చే క్రమంలో భారత ప్రభుత్వంలోని గణాంకాలు, పథకాల అమలు మంత్రిత్వశాఖ
అనేక మార్పులు చేసింది. మదింపునకు సంబంధించి విధానంలో మార్పులు, కొత్త, తాజా సమాచారం
కోసం కొత్త ఆధారాలు జతచేయడం, సరికొత్త వర్గీకరణ విధానాలను అందులో చేర్చింది. భారీ మార్పుల్లో
భాగంగా వీటిని చేర్చారు.
(i) కార్పొరేట్ రంగానికి సంబంధించిన సమగ్ర సమాచారం
కోసం కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ దగ్గర వివిధ కంపెనీలు సమర్పించే వార్షిక ఖాతాల
వివరాలు చేర్చడం (ii) స్థానిక సంస్థల కార్యకలాపాలకు సంబంధించిన విస్తృత భాగస్వామ్యం (iii) అన్ ఇన్ కార్పొరేటేడ్ ఎంటర్ ప్రైజ్ సర్వే
(2010-11), ఎంప్లాయ్ మెంట్- అన్ ఎంప్లాయ్ మెంట్
సర్వే (2011-12) వంటి ఎన్ ఎస్ ఎస్ సర్వేలను జత చేయడం
రంగాలవారీగా చేసిన మార్పులు:
1. వ్యవసాయం, అడవులు, మత్స్య పరిశ్రమ: (i) పంటలు,
- పశు ఉత్పత్తులను వర్గీకరించడం. (ii) 2010-11 వ్యవసాయ జనాభా లెక్కలు, 2012 పశుగణన
లెక్కలను పరిగణనలోకి తీసుకోవడం (iii) మాంసం, పశవులకు సంబంధించిన వివిధ ఉప ఉత్పత్తుల
దిగుబడి ధరల సవరణ
2. గనుల తవ్వకం ఉత్పత్తి: (i) నిర్మాణంలో రంగంలో వాడకాన్ని
బట్టి ఇసుక తవ్వకాలు, అదనపు విలువను పరోక్ష పద్ధతిలో అంచనా వేయడం (ii) మైనింగ్ కార్యకలాపాలు,
అనుబంధ పనులకు సంబంధించి MCA 21 డేటాబేస్ ఆధారం చేసుకోవడం
3. విద్యుత్, గ్యాస్, నీటి సరఫరా, ఇతర అవసరమైన సేవలు: మురుగు,
వృధా నీటి నిర్వహణ, రీసైక్లింగ్, పునర్ అవసర కార్యకలాపాలను విద్యుత్, గ్యాస్,
నీటి సరఫరా పరిధిలోకి చేర్చడం
4. నిర్మాణం: (i) నిర్మాణ రంగానికి సంబంధించిన సెంట్రల్
బిల్డింగ్ రీసెర్స్ ఇనిస్టిట్యూట్, రూర్కీ అందించే సమాచార అధ్యయనం (ii) NSS ఆల్ ఇండియా డెట్ ఇన్వెస్ట్ మెంట్ సర్వే 2013 ఫలితాలను పరిగణనలోకి
తీసుకోవడం
5. ఆర్థికేతర సేవలు: (i)సీపీఐ-ఎఎల్/ఆర్ ఎల్/ఐడబ్యూ
స్థానంలో వినియోగదారుల ధరల సూచీలు- గ్రామీణ, పట్టణ, ఉమ్మడిని ఉపయోగించడం (ii) సేవా
రంగం వృద్ధిని తెలుసుకునేందుకు సేవా పన్నును ఉపయోగించడం
6. ఆర్థిక సేవలు: (i) ఆర్థిక రంగానికి సంబంధించిన
సమగ్ర కవరేజ్ కోసం స్టాక్ బ్రోకర్లు, స్టాక్ ఎక్స్ ఛేంజ్ లు, అసెట్ మేనేజ్ మెంట్ కంపెనీలు,
మ్యూచువల్ ఫండ్స్, పెన్షన్ ఫండ్స్ ఖాతాలు, సెబీ, పిఎఫ్ ఆర్ డీఏ, ఐఆర్ డీఏ వంటి నియంత్రణ
సంస్థల సమాచార సేకరణ
ఆధారం: కేంద్ర గణంకాలు, పథకాల అమలు మంత్రిత్వశాఖ ప్రెస్
నోట్
30-01-2015
కొత్త లెక్కల ప్రకారం రంగాల వారీ అంచనాలను స్థిర ధరల
దగ్గర గ్రాస్ వాల్యూ యాడెడ్ గా (GVA), మార్కెట్ ధరల వద్ద GSDPని ఇక GSDP గా పేర్కొనడం
జరిగింది. ఉత్పత్తి పన్నులు, ఉత్పాదక సబ్సిడీలను సరిచేస్తూ GVA అంచనాలను రూపొందించడం
జరిగింది. ఉత్పత్తి పన్నులు, ఉత్పాదక రాయితీలతో కూడినది ప్రాథమిక ధర. మార్కెట్ ధర నిర్ణయించేటప్పడు
ఉత్పత్తి పన్నుల నుంచి ఉత్పాదక సబ్సిడీలు తొలగిస్తారు. సూక్ష్మంగా చెప్పాలంటే మార్కెట్ ధర అంటే ఉత్పాదక
పన్నులు, ఉత్పత్తి పన్ను నుంచి ఉత్పాదక సబ్సిడీ, ఉత్పత్తి సబ్సిడీ తీసివేసి వినియోగదారుడికి
లభించేది.
2015-16 GSDP అంచనా
2015-16 (ముందస్తు అంచనాలు) GSDP అంచనాలను తెలంగాణ
ప్రభుత్వం విడుదల చేసింది. 2015-16లో ప్రస్తుత ధరల ప్రకారం రూ.5.83 లక్షల కోట్లుగా
ఉన్న తెలంగాణ GSDP 11.7శాతం పెరుగుదల నమోదు
చేస్తుందని అంచనా. స్థిర ధరలు (2011-12) ప్రకారం రూ.4.69 లక్షల కోట్లు, గతేడాదితో పోల్చితే
9.2 శాతం ఎక్కువ పెరగవచ్చు. GSDP, ప్రస్తుత, స్థిర ధరల వద్ద వృద్ధి రేట్లును దిగువ టేబుల్ లో చూడవచ్చు.
టేబుల్ 2.1: ప్రస్తుత, స్థిర ధరల (2011-12) వద్ద తెలంగాణ
రాష్ట్ర GSDP
Table
2.1: GSDP of Telangana State at Current and Constant (2011-12) Prices
Year
ent
Prices Constant (2011-12) Prices
GSDP
(Rs. crore) Growth (%) GSDP (Rs. crore) Growth (%)
2011-12 (SRE)
3,61,701 - 3,61,701 -
2012-13 (SRE) 4,04,105
11.7 3,70,432 2.4
2013-14 (SRE)
4,60,172 13.9 3,94,248 6.4
2014-15 (FRE) 5,22,001
13.4 4,29,001 8.8
2015-16 (AE) 5,83,117 11.7 4,68,656
9.2
రాష్ట్ర
ఆర్థిక వ్యవస్థ పనితీరు: భారత ఆర్థికవ్యవస్థలో
2015-16లో తెలంగాణ వాటా దాదాపు 4.1%. మొత్తం
భారతదేశ వృద్ధి, తెలంగాణ GSDPని పోల్చితే 2012-13లో తెలంగాణ 2.41 శాతంగా వృద్ధి నమోదు
చేసింది. మొత్తం భారత వృద్ధి రేటు 5.62 శాతంతో పోల్చితే ఇది చాలా తక్కువ. 2013-14 నుంచి తెలంగాణ వృద్ధి రేటు పుంజుకుంది.
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత
రాష్ట్ర ఆర్థిక వృద్ధి పెరుగుదలకు ప్రభుత్వం తీసుకుంటున్న క్రియాశీల చర్యల ఫలితమే
ఇదని చెప్పవచ్చు.
చిత్రం
2.1: స్థిర ధరల వద్ద దేశ-తెలంగాణ వృద్ధి రేట్ల పోలిక
రంగాలవారీగా
వృద్ధి సరళి
ఆర్థిక వ్యవస్థను ప్రాథమిక, తయారీ,
సేవ అనే మూడు రంగాలుగా స్థూలంగా వర్గీకరించవచ్చు. పంటలు, పశుసంపద, అడవులు, కలప, మత్స్య,
మైనింగ్, క్వారీయింగ్ లు ప్రాథమిక రంగంలో భాగం. రెండోదైన తయారీలోకి తయారీ రంగం, విద్యుత్,
గ్యాస్, నీటి సరఫరా, ఇతర అవసరమైన సేవలు, నిర్మాణం రంగాలుంటాయి. వ్యాపారం, మరమ్మతు సేవలు,
హోటళ్లు, రెస్టారెంట్లు, రైల్వే, రోడ్లు, జల, వాయువులతో కూడిన రవాణా రంగం, రవాణా రంగానికి
అనుబంధమైన సేవలు, గిడ్డంగుల వ్యవస్థ, సమాచారం, ప్రసారాలకు సంబంధించిన సమాచార సేవలు,
ఆర్థిక సేవలు, రియల్ ఎస్టేట్, నివాస, వాణిజ్య సేవల యాజమాన్యం, ప్రజాపాలన ఇతర సేవలు
సేవ రంగంలో భాగం. ప్రాథమిక ధరల వద్ద రంగాలవారీగా GVAను దిగువ టేబుల్ లో చూడవచ్చు.
Table
2.2 : రంగాలవారీగా వృద్ధి
రేటుSl.
No.
Item
2012-13 (SRE) 2013-14 (SRE) 2014-15 (FRE) 2015-16 (AE)
Sl.no
|
Item
|
2012-13(SRE)
|
2013-14(SRE)
|
2014-15(FRE)
|
2015-16(AE)
|
1
|
వ్యవసాయం,ఆడవులు, మత్స్య పరిశ్రమ
|
8.8
|
2.1
|
-5.3
|
-4.5
|
1.1
|
వ్యవసాయం
|
9.8
|
1.7
|
-14.2
|
-18.2
|
1.2
|
పశుసంపద
|
8.0
|
2.3
|
8.2
|
12.2
|
1.3
|
ఆడవులు, కలప
|
-0.6
|
-2.5
|
1.4
|
-2.7
|
1.4
|
మత్స్య పరిశ్రమ, రొయ్యల పెంపకం
|
10.4
|
14.4
|
8.5
|
17.8
|
2
|
గనుల, క్వారీయింగ్
|
4.1
|
-4.3
|
21.7
|
6.9
|
|
ప్రాధమిక రంగం
|
7.9
|
0.9
|
-0.4
|
-1.9
|
3
|
తయారీ
|
-14.7
|
5.3
|
5.8
|
9.5
|
4
|
విధ్యుత్, గ్యాస్, నీటి సరఫరా
|
-31.9
|
35.9
|
-14.7
|
8.4
|
5
|
నిర్మాణాలు
|
1.8
|
-3.5
|
4.9
|
6.2
|
|
ద్వితీయ శ్రేణి
|
-12.2
|
4.8
|
3.8
|
8.6
|
6
|
వ్యాపారాలు, వాణిజ్యం
, మరమ్మత్తులు, హోటళ్లు,రెస్టరెంట్లు
|
5.7
|
14.1
|
11.9
|
9.5
|
7
|
రవాణా, గిడ్డంగులు, సమాచార, ప్రసార
శాఖకు సంబంధించిన సేవలు
|
8.5
|
5.3
|
8.8
|
9.2
|
8
|
ఆర్దిక వ్యవహారాలు
|
8.9
|
4.6
|
8.8
|
9.6
|
9
|
రియల్ ఎస్టేట్, నివాస, వృత్తిసేవల
యాజమాన్యం
|
12.8
|
9.5
|
11.4
|
12.5
|
10
|
ప్రజాపాలన
|
1.9
|
5.4
|
35.7
|
7.6
|
11
|
ఇతర కార్యకలపాలు
|
1.1
|
8.8
|
8.2
|
14.6
|
|
సేవా రంగం
|
7.7
|
8.9
|
11.8
|
11.0
|
|
ప్రాథమిక సేవల ప్రకారం మొత్తం
జీఎస్ వీఏ
|
2.3
|
6.2
|
7.5
|
8.1
|
No.
Item3
(SRE)
2013-14
(SRE)
2014-
(FRE15-16
(AE)
రంగాలవారీగా
విశ్లేషణను చూసినట్టైతే 2015-16 (ముందస్తు అంచనాలు)లో సేవా రంగం 11% శాతం పెరుగుదలను
నమోదు చేయనుంది. అదే ద్వితీయ రంగం అంటే తయారీ రంగం 8.6% పెరుగుదలను నమోదు చేయనుంది.
ప్రాథమిక రంగంలో మాత్రం 1.9% ప్రతికూల వృద్ధి నమోదు కానుంది. గడిచిన రెండేళ్లుగా రాష్ట్రంలో
నెలకొన్న ప్రతికూల వాతావరణం కారణంగా పంటల రంగం
ప్రతికూల వృద్ధి రేటు నమోదు చేసింది. లేని పక్షంలో GSDP వృద్ధి అంచనాలు 9.2% కంటే మెరుగ్గా ఉండేవి. ప్రతికూల పరిస్థితుల కారణంగా వ్యవసాయం రంగం 18.2% ప్రతికూల వృద్ధి నమోదు చేసింది.
పశుసంపద (12.2%), మత్స్యపరిశ్రమ (17.8%), మైనింగ్,
క్వారీయింగ్ (6.9%) వృద్ధి నమోదు చేయడంతో ప్రాథమిక రంగం కాస్త నిలదొక్కుకోగలిగింది.
టేబుల్
2.3 స్థిర ధరల వద్ద రంగాల వారీగా GVAలో వాటా
టేబుల్
2.3 పేజీ నెంబర్ 13.
చిత్రం
2.2: స్థిర ధరల వద్ద రంగాల వారీగా 2015-16లో
GVAలో వాటా
GVAలో రంగాలవారీగా రంగాలవారీగా GVAలో వారీగా వాటా
స్థూల
వాటా
స్థూలరంగాలవారీగా
వర్గీకరణను పరిశీలిస్తే మొత్తం రాష్ట్ర
GVAలో సేవా రంగం వాటా 60.5 శాతంగా ఉంది. 22.5 శాతం వాటాతో ద్వితీయ రంగం, 17 శాతంతో
ప్రాథమిక రంగం ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఇక సూక్ష్మస్థాయిలో వివిధ రంగాలను పరిశీలిస్తే
రియల్ ఎస్టేట్ రంగం, ఆవాస, వాణిజ్య సముదాయాల యాజమాన్యం వాటా మొత్తం రాష్ట్ర GVAలో
20.1శాతంగా ఉంది. ఆ తర్వాతి స్థానాల్లో ఉత్పాదక రంగం (15.1%), వ్యవసాయం, అనుబంధరంగాలు
(12.9%), వ్యాపారం, రిపేర్లు, హోటళ్లు, రెస్టారెంట్లు (13%)గా ఉన్నాయి. వివిధ రంగాల
వారీగా వాటాను 2.3 టేబుల్ లోనూ, 2.2 చిత్రంలోనూ గమనివంచవచ్చు.
రంగాలవారీగా
వృద్ధి రేటు పోకడలు: రంగాలవారీగా వృద్ధి రేటు పోకడలను గమనిస్తే
2012-13 నుంచి 2015-16 మధ్యకాలంలో ప్రాథమిక రంగం వృద్ధిలో తరుగుదల కనిపిస్తోంది. పంటల
ఉత్పత్తి తగ్గడానికి ప్రతికూల వృద్ధి రేటుకు కారణంగా భావించవచ్చు. 2012-13లో ద్వితీయ
రంగం -12.2% ప్రతికూల వృద్ధి రేటు నమోదు చేసింది. 2013-14 లో పుంజుకొని 4.8%గా,2015-16లో
8.6% వృద్ధి రేటును నమోదు చేసింది. రాష్ట్ర GVAలో ప్రధాన వాటాదారు సేవారంగం.
2012-13లో 7.7% వృద్ధి రేటు నమోదు చేయగా
2014-15లో ఇది 11.8 శాతానికి పెరిగింది. 2015-16 ముందస్తు అంచనాల ప్రకారం సేవారంగం
11% పెరుగుదల నమోదు చేయవచ్చు.
జిల్లావారీగా
తలసరి ఆదాయం 2014-15: ప్రస్తుత ధరల వద్ద 201-4-15 సమాచారాన్ని ఉపయోగించి జిల్లావారీగా తలసరి
ఆదాయ గణన చేయడం జరిగింది. 2014-15లో రాష్ట్ర తలసరి ఆదాయం రూ.1.29 లక్షలు. జిల్లాలవారీగా
చూస్తే రూ.2.94 లక్షలతో హైదరాబాద్ జిల్లా అగ్రస్థానంలో ఉంది. ఆ తర్వాత రంగారెడ్డి,
మెదక్ జిల్లాలు నిలిచాయి. అతి తక్కువ తలసరి ఆదాయం రూ.76,921తో ఆదిలాబాద్ చిట్టచివరి
స్థానంలో నిలిచింది. దానికంటే ముందు స్థానాలు నిజామాబాద్, మహబూబ్ నగర్, వరంగల్ జిల్లాలవి.
II. తెలంగాణలో ఉపాధి అవకాశాల సరళి
ఆర్థిక
వ్యవస్థలో చోటుచేసుకున్న మార్పుల ప్రభావం ఉపాధిరంగంపై కూడా ప్రభావం చూపింది. గత కొంత
కాలంగా ప్రాథమిక రంగం నుంచి ద్వితీయ రంగానికి, అక్కడి నుంచి సేవారంగానికి ఉపాధి అవకాశాలు
మారుతున్నాయి. ఉత్పాదకత, ఉపాధి అవకాశాలు రెండింటిలోనూ ఈ మార్పు కనిపిస్తోంది. అయితే
రంగాలవారీ ఫలితాలంతా వేగంగా ఉపాధి రంగంలో మార్పులు చోటుచేసుకోవడం లేదు.
వ్యవసాయ
రంగంలో ఉపాధి అవకాశాలు సన్నగిల్లుతుండటం GSDPలో వ్యవసాయ రంగం వాటాను తగ్గిస్తోంది.
2011-12 ధరల ప్రకారం వ్యవసాయం, అనుబంధ రంగాల కార్యకలాపాల వాటా GVAలో 12.9% కాగా దానిపై ఆధారపడిన జనం 55.6 శాతం. GVAలో సేవా రంగం వాటా 60.5% కాగా అది
26.6% మందికి మాత్రమే ఉపాధి కల్పిస్తోంది. GVA లో 26.7% వాటాదారుగా ఉన్న పారిశ్రామిక
రంగం 17.8% జనాభాకు ఉపాధి కల్పిస్తోంది. (చిత్రం
2.5). ఉపాధి అవకాశాలపరంగా పట్టణ ప్రాంతాల్లో
ఎంతో వైవిధ్యం కనిపిస్తున్నా గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికీ వ్యవసాయంపైనే పెద్ద సంఖ్యలో
జనం ఆధారపడుతున్నారు.
నిరుద్యోగ
రేటు: నిరుద్యోగ రేటు 15 ఏళ్లు పైబడిన వయస్సు
వారీలో 2.7శాతంగా ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో నిరుద్యోగ రేటు 1.1% కాగా పట్టణప్రాంతాల్లో
ఇది 6.6%. గ్రామీణ ప్రాంతాల్లో కంటే పట్టణ ప్రాంతాల్లో నిరుద్యోగం ఎక్కువుందని అర్థమవుతోంది.
(టేబుల్ 2.4)
15-29
ఏళ్లు వయస్కుల్లో నిరుద్యోగుల సంఖ్య 7.7 శాతంగా ఉండటం గమనర్హం. (గ్రామీణ ప్రాంతాల్లో
3.8%, పట్టణ ప్రాంతాల్లో 17.2%). పట్టణ ప్రాంతాల్లో నిరుద్యోగ యువకుల సంఖ్య ఎక్కువుండటం
ప్రస్తుత పరిస్థితుల్లో ఆందోళన కలిగించే అంశం.
టేబుల్
2.4: తెలంగాణలో పనిచేస్తున్న వారి సంఖ్య, నిరుద్యోగ రేటు 2013-14
వివరణ
|
గ్రామీణం
|
పట్టణం
|
మొత్తం
|
కూలీల
భాగస్వామ్య రేటు
|
75.7
|
51.8
|
66.8
|
కార్మికుల
భాగస్వామ్య రేటు
|
74.8
|
48.4
|
65
|
నిరుద్యోగ
రేటు
|
1.1
|
6.6
|
2.7
|
ఆధారం:
2013-14లో తెలంగాణలో జిల్లాలవారీ ఉద్యోగ, నిరుద్యోగ పరిస్థితి, లేబర్ బ్యూరో, భారత
ప్రభుత్వ కార్మిక, ఉపాధి కల్పన మంత్రిత్వశాఖ, చండీగఢ్.
కూలీల
భాగస్వామ్య రేటు: భారత ప్రభుత్వ కార్మిక, ఉపాధి కల్పన మంత్రిత్వశాఖకు చెందిన లేబర్
బ్యూరో రూపొందించిన తెలంగాణలో జిల్లాలవారీ ఉద్యోగ, నిరుద్యోగ పరిస్థితి, నివేదిక ప్రకారం
2013-14లో తెలంగాణలో పనిచేసే వయసులో ఉన్న వారిలో 66.8 శాతం మంది 2013-14లో పనిచేస్తుండటమో,
లేదా పని కోసం వెదుక్కుంటున్నారు. ఇంకో మాటలో చెప్పాలంటే ఉపాధిలో భాగస్వాములవుతున్న
కూలీలు 66.8 శాతంగా ఉన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో కూలీల భాగస్వామ్య రేటు 75.7 శాతంగా,
పట్టణ ప్రాంతాల్లో 51.8 శాతంగా ఉంది.
కార్మికుల
భాగస్వామ్య రేటు: కార్మికుల భాగస్వామ్య రేటు
65 శాతంగా ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో ఇది ఎక్కువగా
ఉంది (74.8%). పట్టణ ప్రాంతాల్లో ఇది
48.4%
ఉపాధి
పొందుతున్న తీరు: మొత్తం పనిచేసే వారిలో 45.8% మంది స్వయం ఉపాధి పొందుతున్నారు.
35.4 శాతం మంది తాత్కాలిక కూలీలుగా, 16.1 శాతం మంది వేతనం/జీతం అందుకుంటున్నారు.
2.7 శాతం మంది కాంట్రాక్టు కార్మికులుగా పనిచేస్తున్నారు. ప్రాంతాలవారీగా విశ్లేషించినట్టైతే
గ్రామీణ ప్రాంతాల్లో అత్యధికంగా 48.8 శాతం
మంది స్వయం ఉపాధిలో ఉన్నారు. పట్టణ ప్రాంతాల్లో మెజార్టీ శ్రామిక శక్తి వేతనాలు, జీతాలు
పొందుతున్నారు. (చిత్రం 2.6)
చిత్రం
2.6: 2013-14లో 15 ఏళ్లు, ఆ పైబడిన శ్రామికుల విశ్లేషణ
జిల్లాలవారీగా
ఉపాధి అవకాశాల పరిస్థితి: జిల్లాలవారీగా 15 ఏళ్ల వయస్సు పైబడిన వారి ఉపాధి అవకాశాలను విశ్లేషిస్తే 74.4 శాతంతో కరీంనగర్ జిల్లా కూలీల భాగస్వామ్య రేటులో
అగ్రస్థానంలో ఉంది. 73.9 శాతంతో ఆ తర్వాతి స్థానంలో మహబూబ్ నగర్ జిల్లా ఉంది. 48.8 శాతంతో హైదరాబాద్ జిల్లా అట్టడుగున ఉంది.
65.6 శాతంతో వరంగల్ జిల్లా ఉంది. పట్టణ ప్రాంతాల్లో కూలీల భాగస్వామ్య రేటు గ్రామీణ
ప్రాంతాలకంటే తక్కువుంది. జిల్లాలవారీగా నిరుద్యోగితను పరిశీలిస్తే పట్టణ ప్రాంతాల్లో
ఇది చాలా ఎక్కువుంది. మిగతా అన్ని జిల్లాలతో పోల్చితే హైదరాబాద్ జిల్లాలో నిరుద్యోగ
రేటు అత్యధికంగా ఉంది.
III. ద్రవ్యోల్బణ ధోరణి
టోకు
ధరల సూచి (WPI), వినియోగదారుల ధరల సూచి (CPI) అనుగుణంగా భారత్ లో ద్రవ్యోల్బణాన్ని
లెక్కిస్తారు. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి), వినియోగదారుల ధరల సూచి సమాచారం
2011-12 నుంచి 2015-16 వరకు అందుబాటులో ఉంది. ), వినియోగదారుల ధరల సూచి ప్రకారం తెలంగాణలో
ద్రవ్యోల్బణం దేశంలో మిగతా ప్రాంతాలతో సమానంగా ఉంది. (చిత్రం 2.7)
2012-13,
2013-14 సంవత్సరాల్లో ద్రవ్యోల్బణం అత్యధికంగా కనిపించింది. ఆ తర్వాతి సంవత్సరాల నుంచి
అది తరుగుదల చూపిస్తోంది. 2015-16లో వినియోగదారుల ధరల సూచీ 4.3కు తగ్గి వినియోగదారులకు
ఊరట కల్పించింది.
ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థ
ఆర్థిక
వృద్ధికి ప్రభుత్వ పెట్టుబడులు ఇంజిన్ వంటివి. ప్రజాశ్రేయస్సు కోసం మౌలిక సదుపాయలు,
విద్య, ఆరోగ్యం, నైపుణ్య శ్రామిక శక్తి, స్వచ్ఛ పర్యావరణం, రోగ ముక్త సమాజం వంటి వివిధ
పథకాలు/ప్రణాళికలపై ప్రభుత్వం జరిపే వ్యయమిది. ప్రజాశ్రేయస్సు కోసం ప్రభుత్వం జరిపే
వ్యయం, ప్రైవేట్ పెట్టుబడులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. అభివృద్ధిని కాంక్షించే వాళ్లంతా
ఆర్థిక వృద్ధి కోసం విద్య, ఆరోగ్యం, మౌలిక
సదుపాయాల కల్పనను ప్రభుత్వం భారీగా పెట్టుబడులు పెట్టాలని సూచిస్తుంటారు. అభివృద్ధిలో
చోటుచేసుకుంటున్న ఈ వ్యత్యాసాన్ని భర్తీ చేసేందుకు రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి ప్రభుత్వం
కృషి చేస్తోంది.
V. కేంద్ర రాష్ట్ర ఆర్థిక సంబంధాల్లో
కొత్త ప్రగతి
రాష్ట్ర
ప్రభుత్వంపై ప్రభావం చూపే రెండు ముఖ్య పరిణామాలు ఈ మధ్య కాలంలో కేంద్ర రాష్ట్ర ఆర్థిక
సంబంధాల్లో చోటుచేసుకున్నాయి. అవి (i)14వ ఆర్థిక సంఘం కింద అత్యధిక పన్నుల సంక్రమణ (ii) ముఖ్యమంత్రుల కమిటీ సిఫార్సులకనుగుణంగా కేంద్ర
ప్రభుత్వ ప్రాయోజిత పథకాల పునర్ నిర్మాణం.
రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై ఈ రెండు పరిణామాలు చూపే ప్రభావానికి సంబంధించిన సంక్షిప్త
విశ్లేషణను తెలుసుకుందాం.
A.14వ
ఆర్థిక సంఘం
రాజ్యాంగంలో
280వ అధికరణం ప్రకారం 14వ ఆర్థిక సంఘం – కేంద్ర ప్రభుత్వ పన్నుల్లో రాష్ట్రాల వాటాను
నిట్టనిలువునా, కేటాయింపులు అడ్డంగా చేస్తూ సిఫార్సులు చేసింది. 2015-2020 మధ్య కాలంలో
ఈ సిఫార్సులు అమల్లోకి రానున్నాయి.
14వ ఆర్థిక
సంఘం సిఫార్సుల ప్రకారం కేంద్ర ప్రభుత్వ పన్ను వసూళ్లలో రాష్ట్రానికి 42శాతం వాటా రానుంది.
13వ ఆర్థిక సంఘం సిఫార్సు చేసిన 32% శాతంతో పోల్చితే ఇది చాలా ఎక్కువ. ఆ లెక్కన భారీగా
నిధులు కేంద్రం నుంచి రాష్ట్రానికి సంక్రమించబోతున్నాయి. రాష్ట్రాలు కేంద్రంపై ఆధారపడటాన్ని
తగ్గించుకోవాలనే సిద్ధాంతంతో పన్నుల వాటాను పెంచుతూ 14వ ఆర్థిక సంఘం సిఫార్సులు చేసింది.
1971 నాటి జనాభా, ఆ తర్వాత నుంచి జనాభాపరంగా
చోటుచేసుకుంటున్న మార్పులు, ఆర్థిక అంతరాలు, అటవీ విస్తీర్ణం, వైశాల్యం వంటి
అనేక అంశాలు పరిగణనలోకి తీసుకొని 14వ ఆర్థిక సంఘం కేటాయింపులు చేసింది. చిత్రం 2.5లో
ఎంపికకు తీసుకున్న ప్రమాణాలు, వాటికిచ్చిన వెయిటేజ్ ను గమనించవచ్చు.
టేబుల్ 2.5: రాష్ట్ర వాటా నిర్దారణకు అనుసరించిన ప్రమాణాలు ఇచ్చిన వెయిటేజీ
ప్రమాణాలు
|
భారం (%)
|
జనాభా
|
17.5
|
జనాభా మార్పులు
|
10
|
ఆదాయ అంతరం
|
50
|
ప్రదేశం
|
15
|
అటవీ విస్తీర్ణం
|
7.5
|
మొత్తం
|
100
|
కేటాయింపులకు
అనుసరించిన ప్రమాణాల ప్రకారం మొత్తం పన్నుల్లో తెలంగాణకు 2.44 శాతం దక్కనుంది. రాష్ట్రాలవారీగా
కేంద్ర పన్నుల నుంచి వచ్చే వాటాను 2.6 చిత్రం వివరిస్తుంది.
టేబుల్
2.6 కేంద్రపన్నుల్లో రాష్ట్రాల వారీగా వాటా
క్రమసంఖ్య
|
రాష్ట్రం
|
రాష్ట్రవాటా
|
1
|
ఉత్తరప్రదేశ్
|
17.96
|
2
|
బీహార్
|
9.67
|
౩
|
మధ్యప్రదేశ్
|
7.55
|
4
|
వెస్ట బెంగాల్
|
7.32
|
5
|
మహారాష్ట్ర
|
5.52
|
6
|
రాజస్థాన్
|
5.50
|
7
|
కర్ణాటక
|
4.71
|
8
|
ఒడిస్సా
|
4.64
|
9
|
ఆంధ్రప్రదేశ్
|
4.31
|
10
|
తమిళనాడు
|
4.02
|
11
|
అస్సాం
|
3.31
|
12
|
జార్ఖండ్
|
3.14
|
13
|
గుజారత్
|
3.08
|
14
|
ఛత్తీస్ గఢ్
|
3.08
|
15
|
కేరళ
|
2.50
|
16
|
తెలంగాణ
|
2.44
|
17
|
జమ్ముకాశ్మీర్
|
1.85
|
18
|
పంజాబ్
|
1.58
|
19
|
అరుణచల్ ప్రదేశ్
|
1.37
|
20
|
హార్యానా
|
1.08
|
21
|
ఉత్తరఖండ్
|
1.05
|
22
|
హీమచల్ ప్రదేశ్
|
0.71
|
23
|
మేగాలయ్
|
0.64
|
24
|
త్రిపుర
|
0.64
|
25
|
మణిపూర్
|
0.62
|
26
|
నాగాలాండ్
|
0.50
|
27
|
మీజోరం
|
0.46
|
28
|
గోవా
|
0.38
|
29
|
సిక్కిం
|
0.37
|
|
మొత్తం అన్ని రాష్ట్రాలు
|
100
|
14వ ఆర్థిక
సంఘం సిఫార్సులకనుగుణంగా కేంద్ర పన్నుల్లో వాటా 32 నుంచి 42 శాతానికి పెరిగినా తెలంగాణకు
పెద్దగా ప్రయోజనం లేకుండా పోయింది. అంతర్రాష్ట్ర పన్నులకు సంబంధించి 2014-15లో
2.893 శాతంగా ఉన్న వాటాను 2015-2020 మధ్య కాలానికి 14వ ఆర్థిక సంఘం 2.44 శాతానికి తగ్గించింది.
2015-16 నుంచి ప్రణాళిక పద్దుల బదిలీలోనూ కోత పడుతోంది. అంతర్రాష్ట పన్నుల వాటాలో
0.456 శాతం కోత కారణంగా 2015-16లో రాష్ట్రానికి రూ.2,389 కోట్ల తగ్గనున్నాయి. పన్నుల
వాటా బదిలీ 32 నుంచి 42 శాతానికి పెరిగినా
అది మిగిలిన రాష్ట్రాల సగటుతో పోల్చితే అది చాలా తక్కువ. 2015-16 తలసరి ఆదాయ ప్రాతిపాదికన జాతీయ సగటు రూ.1,564తో పోల్చితే రాష్ట్రానికి దక్కేది
రూ.858 మాత్రమే.
తెలంగాణకు
పన్నుల్లో వాటా తగ్గడానికి ప్రధాన కారణాలు (i) రాష్ట్ర వాటాకు నిర్ణయించిన ప్రమాణాల్లో
50% వెయిటేజ్ తలసరి ఆదాయానికి ఇవ్వడం (ii) జాతీయ సగటు కంటే తెలంగాణ తలసరి ఆదాయం చాలా
అధికంగా ఉండటం. కేటాయింపుల్లో కోత కారణంగా రాష్ట్రానికి నిధుల కొరత తీవ్రమైంది.
B. కేంద్ర ప్రాయోజిత పథకాల పునర్
వ్యవస్థీకరణ
రాష్ట్ర
జాబితాలో లేదా ఉమ్మడి జాబితాలో ఉండే అంశాలపై కేంద్ర ప్రభుత్వం రూపొందించిన పథకాలను
రాష్ట్ర ప్రభుత్వాలే అమలు చేస్తుంటాయి. కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకాలకు నిధులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 50:50 నుంచి
90:10 నిష్పత్తిలో పంచుకుంటాయి. పేదరిక నిర్మూలన, విద్యా, ఆరోగ్యం, గ్రామీణ మౌలికవసతులు,
ఆహార భద్రత వంటి కీలకాంశాల్లో అందరికి సమాన అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో కేంద్ర
పథకాలకు రూపకల్పన చేస్తుంది.
కేంద్ర
ప్రభుత్వ పథకాల అమలుపై రాష్ట్రాల్లో ఆందోళన పెరుగుతోంది. (i) కాలక్రమంలో కేంద్ర పథకాలు
ఒక రంగానికి పరిమితమై క్షేత్రస్థాయిలో నిధుల కేటాయింపు సన్నగిల్లుతోంది (ii) కేంద్ర
ప్రభుత్వ పథకాల అమల్లో రాష్ట్రాలు మ్యాచింగ్ గ్రాంట్లు కేటాయించాల్సిన రావడం (iii)
కేంద్ర పథకాలపై వ్యయం విషయంలో కేంద్రం ఇచ్చే మార్గదర్శకాలకు లోబడి వ్యవహరించడం
(iv) ప్రజలందరి ఆలోచనలు ఒకలా ఉండవని, సొంతంగా తమ రాష్ట్ర ప్రయోజనాలకనుగుణంగా తామే పథకాలు
రూపొందించుకుంటామని రాష్ట్రాలు చెప్తుండటం
రాష్ట్రాల
ఆందోళనను గుర్తించిన ప్రణాళిక సంఘం, “ కేంద్ర పథకాల పునర్ వ్యవస్థీకరణకు” ప్రణాళిక
సంఘం సభ్యుడు బి.కె.చతుర్వేది అధ్యక్షతన కమిటీ
ఏర్పాటు చేసింది. కేంద్ర ప్రభుత్వ పథకాలను
రాష్ట్రాలు తమ అవసరాలకనుగుణంగా మార్చుకునే వెసులుబాటు కల్పించాలని కమిటీ సిఫార్సు
చేసింది. 14వ ఆర్థిక సంఘం కూడా కేంద్ర ప్రభుత్వ పథకాలకు నిధుల కేటాయింపు ఫార్మూలా సవరించి
సహకార సమాఖ్య విధానాన్ని బలోపేతం చేసేలా కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకాలు ఉండాలని
సూచించింది.
14వ ఆర్థిక
సంఘం సిఫార్సులను దృష్టిలో పెట్టుకొని “కేంద్ర పథకాల హేతుబద్దీకరణ”కు నీతి ఆయోగ్ మార్చి
2015లో ముఖ్యమంత్రులతో కూడిన సబ్ గ్రూప్ ఏర్పాటు
చేసింది. సబ్ కమిటీ చేసిన ముఖ్యమైన సిఫార్సులు (i) పేదరిక నిర్మూలన, తాగు నీరు, స్వచ్ఛ్
భారత్ మిషన్, గ్రామీణ అనుసంధానత. వ్యవసాయం, సాగునీరు, నదీజలాల సంరక్షణ, మొదలైన కేంద్ర
ప్రభుత్వ ప్రాయోజిక కార్యక్రమాలుగా ఉండాలి (ii) పథకాలను ముఖ్యమైన, ఐచ్ఛికమైనవిగా వర్గీకరించాలి.
ముఖ్యమైన వాటిలో ఉపాధి హామీ పథకం, జాతీయ సామాజిక సహాయ పథకం, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనార్టీల
అభివృద్ధి, మొదలైనవి ఉండాలి. ఈ పథకాలను అన్ని రాష్ట్రాలు తప్పనిసరిగా అమలు చేయాలి.
ఇక ఐచ్ఛిక పథకాలకు సంబంధించి రాష్ట్రాలు అన్నింటిని ఎంచుకోవడం గాని, తమకు అవసరమైన వాటిని
ఎంచుకునే వెసులుబాటు కల్పించాలి. (iii) కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకాలను సంఖ్యను
గరిష్టంగా 30కి తగ్గించాలి. ఐచ్ఛిక పథకాలను ‘ఆంబ్రెల్లా స్కీమ్స్”గా ఉంచి వాటికి సమానం
నిధుల కేటాయింపు జరపాలి. (iv) రాష్ట్రాలు, కేంద్ర మంత్రిత్వశాఖలతో సంప్రదించి అభివృద్ధి
అవసరాలు, జనాభా, ఆయా రంగాల్లో రాష్ట్రానికున్న
సామర్థ్యానికి అనుగుణంగా నిధుల కేటాయింపునకు నీతి ఆయోగ్ ఓ పారదర్శక విధానాన్ని
రూపొందించాలి. (v) ఐచ్ఛిక పథకాలకు కేంద్రం వాటా 50 శాతంగా ఉండాలి. ముఖ్యమైన పథకాలకు
కేటాయింపునకు ప్రస్తుతమున్నవిధానాన్ని కొనసాగించాలి.
(vi) ఫ్లెక్సీ ఫండ్స్- ప్రతీ పథకానికి ప్రతీ ఆర్థిక సంవత్సరంలో 25 శాతం నిధులు కేటాయించాలి.
(vii) కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిక పథకాలకు నిధుల విడుదలను క్రమబద్ధీకరించాలి.
(viii) 2014-15 సంవత్సరంలో అమల్లో ఉన్న ప్రాజెక్టులకు సంబంధించి 31-03-2015 నాటికి
పనులు కేటాయించిన పనులకు ప్రస్తుతమున్న విధానంలోనే వచ్చే రెండేళ్లు నిధులు కేటాయించాలి.
భవిష్యత్ దృక్పథం
ఆర్థిక
సూచీల్లో దేశంలోని మిగతా రాష్ట్రాలతో పోల్చితే తెలంగాణ రాష్ట్రం చక్కటి పనితీరు కనబరుస్తోంది.
తలసరి ఆదాయం, GSDPలో రాష్ట్రం పనితీరు అద్భుతంగా ఉంది. వ్యాపార వాతావరణాన్ని మెరుగుపరిచేందుకు
ప్రభుత్వం రంగాలవారీగా అనేక చర్యలు తీసుకుంటోంది. వివిధ రంగాల్లో పనితీరును ముందు అధ్యాయాల్లో
తెలుసుకుందాం.
No comments:
Post a Comment