అధ్యాయం 3
వ్యవసాయం, అనుబంధ కార్యకలాపాలు
-----------------------------------------------------------------------------
తెలంగాణలో ప్రధాన వృత్తి వ్యవసాయం. రాష్ట్ర జనాభాలో
సగం కంటే ఎక్కువ మందికి వ్యవసాయమే జీవనోపాధి.
2015-16 (ముందస్తు అంచనాలు) సంవత్సరంలో ప్రస్తుత ధరల వద్ద గ్రాస్ వ్యాలూ యాడెడ్
(GVA)లో వ్యవసాయం, అనుబంధ రంగాల వాటా 14%.
2011-12లో ఇది 16.1%. 2015-16లో ప్రస్తుత ధరల
వద్ద వ్యవసాయం, అనుబంధ రంగాలు -1.1% ప్రతికూల వృద్ధి నమోదు చేయనున్నాయి. కరువు కారణంగా
వ్యవసాయ పంటలు దారుణంగా దెబ్బతిన్నాయి. ప్రస్తుత ధరల వద్ద వ్యవసాయ పంటల -13.3% ప్రతికూల
వృద్ధి నమోదు చేస్తాయని అంచనా.
2015-15 సంవత్సరం వ్యవసాయానికి గడ్డుకాలమని చెప్పాలి.
వరుసగా రెండో ఏడాది కూడా వర్షాభావ పరిస్థితి నెలకొనడంతో రాష్ట్రంలో తీవ్ర కరువు ఏర్పడింది.
ఆహార ధాన్యాల సాగు బాగా తగ్గింది. 2014-15లో 26.13 లక్షల హెక్టార్లలో సాగు చేస్తే
2015-16లో ఇది 20.46 లక్షల హెక్టార్లకు తగ్గింది.
I.
వ్యవసాయ ఉత్పత్తి, విస్తీర్ణం, దిగుబడి: 2014-15లో
తెలంగాణలో నికర సాగుభూమి (NCA) 43.8 లక్షల హెక్టార్లుకాగా మొత్తం సాగు భూమి (GCA)
53.2 లక్షల హెక్టార్లు. మొత్తం సాగుభూమిలో దాదాపు 58% అంటే 30.7 లక్షల హెక్టార్లలో
ఆహార పంటలు, 42%లో అంటే 22.5లక్షల హెక్టార్లలో ఆహారేతర పంటలు సాగుచేస్తున్నారు. వరి,
మొక్కజొన్న, జొన్న, సజ్జలు, పప్పుదినుసులు రాష్ట్రంలో పండించే ప్రధాన ఆహారపంటలు. ఆహారేతర
పంటల్లో పత్తి సాగురాష్ట్రంలోని మొత్తం సాగుభూమిలో 32 శాతం వరకు ఉంటుంది.
2014-15లో 26.1 లక్షల హెక్టార్లలో ఆహార పంటలు
(వరి, గోధుమ, తృణధాన్యాలు, పప్పులు) పండించినగా 72.2 లక్షల టన్నుల ఉత్పత్తి జరిగింది.
2014-15లో 14.2లక్షల హెక్టార్లలో వరి పండించగా 45.5 లక్షల టన్నుల దిగుబడి వచ్చింది.
2014-15లో 4.1 లక్షల హెక్టార్లలో పప్పు దినుసులు సాగు చేయగా 2.6 లక్షల టన్నుల ఉత్పత్తి
వచ్చింది. 2014-15లో పండించిన పంటల్లో తృణధాన్యాల
వాటా 15%, నూనె గింజల వాటా 9%.
2015-16
విస్తీర్ణం, ఉత్పత్తి
2015-16 సంవత్సరంలో తృణధాన్యాలు, జొన్నలు, పప్పు
దినుసులు సహ మొత్తం ఆహార ధాన్యాల ఉత్పత్తి 49.35 లక్షల టన్నులు ఉంటుందని అంచనా. అంతకు
ముందు సంవత్సరం ఇది 72.2 లక్షల టన్నులు. రాష్ట్ర
ప్రజల ముఖ్య ఆహారమైన వరి సాగు క్షీణించడం మొత్తం
ఆహార పంటల ఉత్పత్తిని తగ్గించింది. ఈ ఏడాది వరి దిగుబడి 30 లక్షల టన్నులు ఉంటుందని
అంచనా. గతేడాది ఇది 45.5 లక్షల టన్నులు.
పప్పు దినుసుల ఉత్ప్తతి ఈ సంవత్సరం 2.5 లక్షల
టన్నులు ఉంటుందని అంచనా. గతేడాది ఇది 2.6 లక్షల టన్నులు. నూనెగింజల దిగుబడి గతేడాది
7.22 లక్షల టన్నులు కాగా ఈసారి అది 4.73 లక్షల టన్నులకు తగ్గనుంది. టేబుల్ 3.1లో
2014-15, 2015-16 సంవత్సరాలకు సంబంధించి ఆహార, ఆహారేతర పంటల సాగు, దిగుబడి వివరాలు
చూడవచ్చు.
----------------------------------------------------------------------------------------------------------------------------
పంట
సాగు ఉత్పత్తి దిగుబడి
(లక్షల హెక్టార్లు) (లక్షల టన్నులు) (కేజీ/హెక్టారు)
2014-15
2015-16* % పెరుగుదల2014-15
2015-16* % పెరుగుదల 2014-15
2015-16%*పెరుగుదల
-----------------------------------------------------------------------------------------------------------------------------
వరి
14.15 9.51 -33 45.45
29.79 -34 3211
3132 -2
మొక్కజొన్న 6.92 5.56 -20 23.08 16.19 -30
3338 2912 -13
జొన్నలు 22.05 15.91
-28 69.55 46.85
-33 3155
2945 -7
పప్పు దినుసులు 4.08 4.55 12 2.63
2.5 -5
644 549 -15
ఆహార ధాన్యాలు 26.13 20.46 -22 72.18
49.35
-32 2763 2412
-13
వేరుశనగ 1.55 1.18 -24
2.95 1.82
-38 1907 1542 -19
సోయాబీన్ 2.43 2.44 0 2.62 2.55 -3 1081
1045 -3
నూనె గింజలు 5
4.36 -13 7.22 4.73 -34 1442 1085
-25
చెరుకు 0.38 0.58
53 33.43 27.93 -16 87654 79795 -9
పత్తి** 16.93 17.78
5 35.83 36.08
1 360
345 -4
రెండో ముందస్తు అంచనా*
రబీ మరింత దారుణంగా కనిపిస్తోంది.
సాధారణంగా 10.08 లక్షల హెక్టార్లలో సాగుచేస్తే ఈసారి అది 5.32 లక్షల హెక్టార్లకు తగ్గింది.
అంటే 47% లోటు. ప్రతికూల వాతావరణ పరిస్థితుల
ప్రభావం వరిపై ఎక్కువ కనిపిస్తోంది.
జిల్లాలవారీగా విశ్లేషణ:
తెలంగాణలోని పది జిల్లాల్లో 2014-15లో అత్యధిక
సాగు భూమి 9.78 లక్షల హెక్టార్లతో మహబూబ్ నగర్ జిల్లా ముందుస్థానంలో ఉంది.
7.3 లక్షల హెక్టార్లతో నల్గగొండ, 7 లక్షల హెక్టార్లతో కరీంనగర్్ జిల్లాలు ఆ
తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.
నిజామాబాద్, కరీంనగర్,
మెదక్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాల్లో మొత్తం సాగు భూమిలో ఆహారధాన్యాలు, జొన్నలు,
పప్పు దినుసులు పంటలు 50 శాతానికిపైగా సాగవుతాయి. నల్లగొండ జిల్లాల్లో మొత్తం సాగు
భూమిలో 44 శాతం, కరీంనగర్ జిల్లాలో 40 శాతం వరి సాగుచేస్తున్నాు. 2.10 లక్షల హెక్టార్లలో
తృణధాన్యాలు పండిస్తూ మహబూబ్ నగర్ జిల్లా మొదటి స్థానంలో, 5.46 లక్షల టన్నుల తృణధాన్యాలు
పండిస్తూ ఉత్పత్తిపరంగా కరీంనగర్ జిల్లా ముందుస్థానంలో ఉన్నాయి. 3.1 చిత్రంలో జిల్లాలవారీగా ఆహారధాన్యాల సాగు వివరాలు
చూడవచ్చు. వరంగల్, కరీంనగర్, నల్లగొండ, ఆదిలాబాద్, మహబూబ్ నగర్ జిల్లాల్లో పండించే
ఆహారేతర పంటల్లో పత్తి ప్రధానమైనది.
తెలంగాణ పంట సాగులో మార్పులు
రాష్ట్రంలో పండించే ఆహార
పంటల్లో, ఆహార ధాన్యాలు, తృణధాన్యాలు, పప్పుదినుసులు ప్రధానమైనవి. 1980 ల్లో మొత్తం
సాగు భూమిలో మూడో వంతు ఆహార పంటలే సాగయ్యేవని
పరిశోధనలు తెలుపుతున్నాయి. 1980 తర్వాత పంటల
సాగులో మార్పు చోటుచేసుకొని ఎక్కువ భూమిలో ఆహారేతర పంటలు సాగుచేస్తున్నారు.
2001-02లో మొత్తం సాగుభూమి
48 లక్షల హెక్టార్లలో దాదాపు 71 శాతం భూమిలో
ఆహార పంటలు సాగు చేయగా 29 శాతం భూమిలో ఆహారేతర పంటలు పండించారు. 2014-15 కు వచ్చేసరికి
ఆహార పంటల సాగు 58శాతానికి ఆహారేతర పంటల సాగు 42 శాతానికి పెరిగింది.
2001-02లో ఆహార పంటలు
సాగు చేసిన భూమి 33.98 లక్షల హెక్టార్లు, 2014-15లో ఇది 30.68 లక్షల హెక్టార్లకు తగ్గింది.
(చిత్రం 3.2) పంటల సాగు విధానంలో మార్పు వచ్చిన విషయం దీన్ని బట్టి స్పష్టమవుతోంది.
భూవినియోగ విధానం
భౌగోళికంగా
తెలంగాణ 112.08 లక్షల హెక్టార్లు ఉంటుంది. ఇందులో 39శాతం భూమి వ్యవసాయ అవసరాల కోసం
వినియోగిస్తుండగా 23 శాతం భూమి అటవీ భూమి. వ్యవసాయేతర అవసరాల కోసం వినియోగిస్తున్న భూమి 8 శాతముంటుంది.
3.3 చిత్రంలో భూ వినియోగానికి సంబంధించిన వివరాలు
చూడవచ్చు.
తెలంగాణ వ్యవసాయ వాతావరణ మండళ్లు
వర్షపాతం,
భూమి తీరు, వాతావరణం వంటి వాతావరణం పరిస్థితులను
బట్టి తెలంగాణ రాష్ట్రాన్ని నాలుగు వ్యవసాయ వాతావరణ మండళ్లుగా విభజించారు. (i) ఉత్తర
తెలంగాణ (ii) మధ్య తెలంగాణ (iii) దక్షిణ తెలంగాణ (iv) కొండ, గిరిజనప్రాంత మండలి
1.ఉత్తర తెలంగాణ మండలి
ఆదిలాబాద్,
కరీంనగర్, నిజామాబాద్ జిల్లాల్లో విస్తరించి ఉన్న ఈ జోన్ పరిధిలోకి 35.5 చదరపు కిలోమీటర్ల భూభాగం ఉంది. సగటు వార్షిక వర్షపాతం 900 మిల్లీమీటర్ల నుంచి
1150 మిల్లీమీటర్లు వరకు ఉండే ఈ ప్రాంతంలో
వర్షాలకు ఆధారం నైరుతీ రుతుపవనలే. కనిష్ట, గరిష్ఠ ఉష్ణోగ్రతలు 21౦C నుంచి
25oC, 32o -37oC వరకు ఉంటాయి. ఈ జోన్ పరిధిలోకి
ఉండే భూభాగం ఎక్కువ మటుకు ఎర్రనేలలే. చెలక, ఎర్రఇసుక, ఎర్రమట్టి, నల్లమట్టి నేలలతో
కూడిన ఈ ప్రాంతంలో వరి, మొక్కజొన్న, సోయాబీన్, పత్తి, శనగ, పసుపు ప్రధాన పంటలు.
2.మధ్య తెలంగాణ మండలి
మెదక్, వరంగల్, ఖమ్మం జిల్లాలతో కూడిన ఈ మండలిలో వార్షిక సగటు వర్షపాతం 800 మి.మీ
– 1150 మి.మీ.గా ఉంటుంది. దాదాపు 30.6 చదరపు
కిలోమీటర్ల పరిధిలో ఈ జోన్ విస్తరించి ఉంది. కనిష్ట,
గరిష్ఠ ఉష్ణోగ్రతలు 21౦C నుంచి 25oC, 22o
-37oC వరకు ఉంటాయి. ఈ జోన్ పరిధిలోకి ఉండే భూభాగం ఎక్కువ మటుకు ఎర్రనేలలే. చెలక, ఎర్రఇసుక,
ఎర్రమట్టి, నల్లమట్టి నేలలతో కూడిన ఈ ప్రాంతంలో వరి, మొక్కజొన్న, సోయాబీన్, పత్తి,
శనగ, మామిడి, మిర్చి ప్రధాన పంటలు.
3.దక్షిణ తెలంగాణ మండలి
రంగారెడ్డి, హైదరాబాద్, మహబూబ్ నగర్, నల్లగొండ జిల్లాలతో కూడిన ఈ జోన్ 39.3 చదరపు
కిలోమీటర్ల పరిధిలో విస్తరించి ఉంది. వార్షిక సగటు వర్షపాతం 600 మి.మీ – 780 మి.మీ.గా
ఉంటుంది, నైరుతి రుతుపవనాలు విస్తరించి ఉన్న సమయంలో
కనిష్ట, గరిష్ఠ ఉష్ణోగ్రతలు 22౦C నుంచి 23oC, 28o -34oC వరకు ఉంటాయి. ఎర్రమట్టి, చెలక భూములు
ఎక్కువ. పత్తి, వరి, కంది, మొక్కజొన్న, శనగ ఇక్కడ పండే ప్రధాన పంటలు.
4. కొండ, గిరిజన ప్రాంత జోన్
ఆదిలాబాద్,
ఖమ్మం జిల్లాల్లోని ఉత్తర, తూర్పు సరిహద్దుల్లో
విస్తరించి ఉన్న ఈ జోన్ పరిధి 4.66 చదరపు కిలోమీటర్లు. ఈ ప్రాంతంలో గిరిజన జనాభా ఎక్కువ. వార్షిక సగటు వర్షపాతం 1400 మి.మీ.గా ఉంటుంది.
ఎర్రనేలలు, ఎర్ర ఇసుక నేలలు, బంక మట్టి, అక్కడక్కడా ఒండ్రు నేలలు కూడా ఈ ప్రాంతంలో
ఉన్నాయి. నైరుతి రుతుపవనాలు విస్తరించి ఉన్న సమయంలో కనిష్ట,
గరిష్ఠ ఉష్ణోగ్రతలు 13౦C నుంచి 27oC, 29o
-34oC వరకు ఉంటాయి. మిర్చి, వరి, పత్తి, ఉద్యాన పంటలు ఇక్కడ ఎక్కువ పండుతాయి.
III. వర్షపాతం
దేశ సగటు
వర్షపాతం 1083తో పోల్చితే తెలంగాణలో సాధారణ వర్షపాతం 905.3 మి.మీ. మొత్తం వర్షంలో
80 శాతానికి జూన్ – సెప్టెంబర్ వచ్చే నైరుతీ రుతుపవనాలే ఆధారం. 2014-15, 2015-16 రెండేళ్లుగా
వర్షపాతం బాగా తగ్గింది. 2014-15లో నైరుతీపవనాల
ద్వారా కురిసిన వర్షం 494.7 మి.మీ. సాధారణంగా
కురవాల్సిన వర్షం 713.6 మి.మీ. అంటే దాదాపు 31% లోటు. ఒక్క మహబూబ్ నగర్ జిల్లా మినహా
రాష్ట్రంలోని తొమ్మిది జిల్లాల్లోనూ వర్షపాతం తక్కువ నమోదైంది. 2015-16లోనూ ఇదే తీరు
కనిపించింది. జూన్ సెప్టెంబర్ మధ్య కాలంలో నైరుతీ రుతుపవనాల ద్వారా సాధారణంగా 713.6
మి.మీ. వర్షం కురవాల్సి ఉంటే కురిసింది 611.2 మి.మీ. అంటే 14 శాతం లోటు. (చిత్రం 3.5)
నోట్: 2015-16 వర్షపాతం
జనవరి 2016 వరకు తీసుకున్న లెక్కలు.
టేబుల్ 3.2:
01-06-2015 నుంచి 30-09-2015 వరకు జిల్లాల వారీగా వర్షపాతం వివరాలు
వర్షపాతం
లోటు
2014-15, 2015-16 సంవత్సరాల్లో వర్షపాత లోటు రాష్ట్రంలో కరువుకు కారణమైంది. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ ముఖ్యంగా వ్యవసాయ రంగంపై
దీని ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. వర్షపాత వివరాలు విశ్లేషిస్తే రాష్ట్రంలోని 9
మండలాల్లో 60 శాతానికి కంటే ఎక్కువ లోటు, 45 శాతం మండలాల్లో 20 శాతం కంటే ఎక్కువ వర్షపాత
లోటు కనిపిస్తోంది. జిల్లాలవారీగా చూస్తే నిజామాబాద్, మెదక్ జిల్లాల్లోని అనేక మండలాల్లో
అతి తక్కువ వర్షపాతం నమోదైంది. (టేబుల్
3.2)
ప్రతికూల
వాతావరణ పరిస్థితులు
కరువు మండలాలను గుర్తించేందుకు
రాష్ట్ర ప్రభుత్వం ఓ కమిటీని ఏర్పాటు చేసింది. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలతో పాటు
వర్షపాత లోటు, పంట దిగుబడిలో తరుగుదల, విస్తీర్ణం
తదితర అంశాలను పరిగణనలోకి తీసుకున్న కమిటీ
2015 ఖరీఫ్ సీజన్ కు రాష్ట్రంలో 231 మండలాలను కరువు మండలాలుగా గుర్తించాలని
సిఫార్సు చేసింది. జిల్లావారీగా కరువు మండలాలకు
సంబంధించిన వివరాలు టేబుల్ 3.3లో చూడవచ్చు.
టేబుల్ నం 3.3: జిల్లాలవారీగా
కరువుబారిన పడిన మండలాలు
క్రమసంఖ్య జిల్లాలు మండలాల సంఖ్య
1 మహబూబ్
నగర్ 64
2 మెదక్ 46
3 నిజామబాద్ 36
4 రంగారెడ్డి
33
5 నల్గోండ 22
6 కరీంనగర్ 19
7 వరంగల్ 11
మొత్తం: 231
కరువును
ఎదుర్కొనేందుకు కార్యాచరణ ప్రణాళిక
1. రాష్ట్రంలో కరువు ప్రభావాన్ని కనిష్టస్థాయికి తెచ్చేందుకు ప్రభుత్వం
కార్యాచరణ ప్రణాళిక రూపొందించింది. ఈ ప్రణాళికను
అమలు చేసేందుకు రూ.2515.03 కోట్ల రూపాయలు సహాయంగా అందించాలని కేంద్ర ప్రభుత్వానికి
విజ్ఞప్తి చేసింది. దీనికి ప్రతిగా భారత ప్రభుత్వం ఏర్పాటు చేసిన అత్యున్నత స్థాయి
కమిటీ కరువు సాయంగా తెలంగాణకు జాతీయ విపత్తు సహాయ నిధి నుంచి రూ.791 కోట్లు కేటాయించింది.
2. కరువు ప్రభావిత రైతులకు ప్రభుత్వం ఇన్ పుట్ సబ్సిడీ
పంపిణీ చేయాలని ప్రతిపాదించింది. పంట నష్టం అంచనా వేసి అర్హులైన రైతులకు ఇన్ పుట్ సబ్సిడీ
అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రెవెన్యూ, వ్యవసాయ శాఖ అధికారులతో సంయుక్త కమిటీ ఏర్పాటు
చేసింది. ఈ కమిటీ పంట నష్టాన్ని అంచనా వేసి అర్హుల జాబితా రూపొందిస్తుంది. భారత ప్రభుత్వ
మార్గదర్శకాల ప్రకారం రాష్ట్రంలో 20.9 లక్షల మంది రైతులకు ఇన్ పుట్ సబ్సిడీ కింద రూ.863
కోట్లు అవసరమని అంచనా.
3. కరువు కారణంగా ఐదు జిల్లాల్లో పండ్ల తోటలు, కూరగాయలు తదితర ఉద్యాన పంటలకు బాగా
నష్టపోయాయి. మిగతా పంటలతో పోల్చితే ఉద్యాన
పంటలకు నీటి అవసరమై తక్కువే అయినప్పటికీ నీరు అందుబాటులో లేకపోవడంతో పళ్ల చెట్ల దిగుబడి
బాగా తగ్గింది. దాదాపు 33శాతం అంటే 6830 హెక్టార్ల పంట కరువు కారణంగా నష్టపోయింది. నష్టపోయిన చిన్న,
సన్నకారు రైతులు 7,136 మందికి ఇన్ పుట్ సబ్సిడీ కింద రూ.9.65 కోట్లు అందించాలని ప్రతిపాదించడమైనది.
4. కరువు కారణంగా
పశుగ్రాసానికి తీవ్ర కొరత ఏర్పడి పశువుల్లో పోషకాహార లోపం తలెత్తింది. పశు మరణాలు నిరోధించేందుకు
వాటి కారణంగా దిగుబడి నష్టాలు రాకుండా నివారించేందుకు పశుగ్రాసం, ఫీడ్, సమగ్ర ఆరోగ్య
రక్షణ అందుబాటులో తెచ్చారు. కరువు బారిన పడిన 231 మండలాల్లో పశుశిబిరాలు నిర్వహించాలని
ప్రతిపాదించడమైనది. ప్రభావిత పశువులకు గ్రాసం, ఫీడ్, పోషకాహారం తో పాటు తాగు నీరు ఈ
శిబిరాల్లో అందించనున్నారు. వరిగడ్డి, మొక్కజొన్న, కంది గడ్డి సమృద్ధిగా ఉన్న ప్రాంతాల
నుంచి కరువు పీడిత ప్రాంతాలకు వాటిని తరలించేందుకు రవాణా ఖర్చుల కోసం రూ.2.4 కోట్లు
అందిచాలని ప్రతిపాదించడమైనది.
5. నీటి లభ్యత తగ్గిపోవడంతో దాదాపు 2 లక్షల మంది మత్స్యకారులకు
జీవనోపాధి లేకుండా పోయింది. కరువు బారిన పడిన మత్స్యకారులకు ఆర్థిక సాయంతో పాటు వలలు
అందించాలని ప్రతిపాదించడమైనది.
6. కరువు ప్రభావిత మండలాల్లో పునరావస ఉపాధి కింద మహాత్మ
గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం కింద అదనంగా 50 రోజుల పనిదినాలు కల్పించాలని భారత ప్రభుత్వం
ఆదేశించింది.
IV. తెలంగాణలో
భూకమతాల యాజమాన్య సరళి
వ్యవసాయానికి భూమి ప్రధాన ఆధారం. 2010-11లో తెలంగాణలో సగటు భూకమతాలు 1.12 హెక్టార్లు (2.8 ఎకరాలు). జాతీయ
సగటు 1.16 హెక్టార్లు. జనాభా పెరుగుదల భూకమతాలపై ఒత్తిడి పెంచడంతో కమతాల సంఖ్య కుదించుకుపోతోంది.
టేబుల్ 3.4, లో చూపిన విధంగా తెలంగాణ రాష్ట్రంలో 2010-11లో చిన్న, సన్నకారు రైతుల భూకమతాలు
వాటా 86 శాతంగా ఉంది. మొత్తం భూమిలో వారి 55 శాతం మాత్రమే. రాష్ట్రంలో 2 నుంచి 10 హెక్టార్ల భూకమతాలతో కూడిన మధ్య తరహా
వాటా 14 శాతం. మొత్తం భూమిలో వారి వాటా 40.5 శాతం. జిల్లాలవారీగా భూకమతాలను విశ్లేషిస్తే
నిజామాబాద్, కరీంనగర్, మెదక్ జిల్లాలో ఒక హెక్టారు
కంటే తక్కువే కనిపిస్తోంది.
టేబుల్ నం 3.4:
2010-11లో తెలంగాణ భూకమతాల వర్గీకరణ శాతాలవారీగా
సీ.నెం. జిల్లా
సన్నకారు (ఒక హెక్టారు
లోపు) నెంబర్ % విస్తీర్ణం %
చిన్న రైతు (1-2 హెక్టార్లు)
) నెంబర్ % విస్తీర్ణం %
మధ్యతరహా (2-10 హెక్టార్లు)
) నెంబర్ % విస్తీర్ణం %
భారీ తరహా (10 హెక్టార్లుకు
పైబడి) ) నెంబర్ % విస్తీర్ణం %
సగటు భూకమతం (సైజు హెక్టార్లలో)
1 అదిలాబాద్ 48.9 16.9 27.7 28.3 22.1 50.1 0.4 4.8 1.40
2 నిజామాబాద్ 67.5 33.9 23.8 36.1 8.6 28.5 0.1 1.5 0.92
3 కరీంనగర్ 67.5 30.9 21.9 31.8 10.5 34.7 0.2 2.6 0.96
4 మెదక్ 67.9 29.9 21.7 31.3 10.0 34.4 0.3 4.4 0.97
5 హైదరాబాద్ 0.0 0.0 0.0 0.0 0.0 0.0 0.0 0.0 0.00
6 రంగారెడ్డి 58.3 23.5 25.7 29.4 15.6 42.0 0.4 5.1 1.22
7 మహబుబ్ నగర్57.9 22.0 25.4 29.5 16.3 44.0 0,4 4.5 1.23
8 నల్గోండ 58.8 23.1 25.3 29.9 15.6 43.4 0,3 3.6 1.19
9 వరంగల్ 67.1 28.6 21.4 29.7 11.2 37.0 0.3 4.7 0.01
10 ఖమ్మం 62.2 25.6 22.6 27.6 14.9 42.6 0.3 4.3 1.14
మొత్తం: 62.0 25.3 23.9 30.2 13.9 40.9 0.3 4.0 1.12
Source: Statistical Abstract of Telangana-2015, DES, Government of
Telangana
జాతీయస్థాయితో పోల్చితే
తెలంగాణలో భూకమతాల యాజమాన్యాలు సమానంగా విస్తరించి ఉన్నాయి. జాతీయస్థాయిలో చిన్న భూకమతాలు
చిన్న, సన్నకారు రైతుల దగ్గర 85 శాతం ఉన్నప్పటికీ మొత్తం భూమిలో వారి వాటా 44 శాతం మాత్రమే.
తెలంగాణలో ఇది 86 శాతం. మొత్తం భూమిలో వారి
వాటు 55శాతం. (చిత్రం 3.6)
చిత్రం 3.6: 2010-11లో
తెలంగాణలో భూకమతాల పంపిణీ శాతాలవారీగా
వ్యవసాయ పరపతి:
వ్యవసాయ
అభివృద్ధి వ్యూహంలో పరపతి ప్రధాన భూమిక పోషిస్తుంది.
2015-16లో తెలంగాణలోని వాణిజ్య బ్యాంకుల మొత్తం రుణప్రణాళిక రూ.72,119 కోట్లలో వ్యవసాయ,
అనుబంధ రంగాల కార్యాకలాపాలకిచ్చే రుణాలకు కేటాయించిన
మొత్తం రూ.30,995 కోట్లు. మొత్తం రుణ ప్రణాళికలో ఇది 42%. గతేడాదితో పోల్చితే ఇది
14% ఎక్కువ. పంట రుణాల కింద 32%, టర్మ్ లోన్స్ కోసం 7%, అనుబంధ రంగాల కార్యాకలాపాల కోసం 3% (చిత్రం
3.7)
Source: Annual Credit Plan of Telangana 2015-16, State Level Bankers’
Committee (SLBC)
పంట ఉత్పాదక రుణాల కోసం
2015-16లో కేటాయించిన మొత్తం రూ.23,209 కోట్లు, 2014-15లో ఇది రూ.18,718కోట్లు. వ్యవసాయ టర్మ్ రుణాలు, అనుబంధ రంగాల కార్యకలాపాల
కోసం 2015-16లో రూ.7785.87 కోట్లు కేటాయించాలని ప్రతిపాదించడమైనది.
Source: Annual Credit Plan of Telangana 2015-16, State Level Bankers’
Committee (SLBC)
2014-15లో రూ.48,247 కోట్లు ప్రాధాన్యత రంగానికి కేటాయించాలని లక్ష్యంగా
నిర్ణయిస్తే 19 శాతం అధికంగా రూ.40,547 కోట్లు
పంపిణీ చేయడం జరిగింది. వ్యవసాయ రంగానికి (పంట రుణాలు, వ్యవసాయ టర్మ్ లోన్స్, అనుబంధ రంగాలు)
రూ.27,234 కోట్లు కేటాయించాలని లక్ష్యంగా నిర్ణయించగా రూ.27,276 కోట్లు అదే సంవత్సరంలో
పంపిణీ చేయడం జరిగింది. ప్రాధాన్యేతర రంగానికి
రూ.22,501 కోట్లు కేటాయించాలని లక్ష్యంగా నిర్దేశించుకోగా దాదాపు 290 శాతం అధికంగా
అంటే రూ.65,304 కోట్ల పంపిణీ చేయడం గమనార్హం. (టేబుల్ 3.5)
అఖిల భారత రుణాలు, పెట్టుబడుల
సర్వేపై ఎన్ ఎస్ ఎస్ నివేదిక: తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన కీలక అంశాలు
70వ విడత జాతీయ శాంపిల్
సర్వే (NSS) “అఖిల భారత రుణాలు, పెట్టుబడుల సర్వే” (జనవరి 2013-డిసెంబర్ 2013 మధ్య
సమాచార సేకరణ) తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి
రుణవిధానం, ఆస్తి యాజమాన్యం, అప్పులు, మూలధనం, మొదలగు అంశాలకు సంబంధించి స్పష్టమైన
విశ్లేషణను ఈ సర్వే అందించింది. నివేదికలోని
కొన్ని ముఖ్య అంశాలు:
·
తెలంగాణవాసుల్లో వ్యవసాయ, వ్యవసాయేతరుల సగటు ఆస్తి విలువ రూ.13.9 లక్షలు, రూ.3.8 లక్షలుగా
ఉంది. జాతీయ స్థాయిలో ఇది రూ.28.7 లక్షలు, 6.7 లక్షలు.
·
తెలంగాణలోని గ్రామీణ ప్రాంతవాసుల సగటు ఆస్తి విలువ
రూ.6.38 లక్షలు, పట్టణ ప్రాంతాల్లో రూ.18.45 లక్షలు. అంటే దాదాపు 2.9 రెట్లు ఎక్కువ.
గ్రామీణ, పట్టణ ప్రాంత జనాభా మధ్య వ్యత్యాసాన్ని ఇది స్పష్టం చేస్తోంది.
·
తెలంగాణ గ్రామీణ ప్రాంతవాసుల అప్పులు జాతీయ సగటు
కంటే రెట్టింపు ఉన్నాయి. తెలంగాణలోని గ్రామీణ ప్రాంతవాసుల్లో దాదాపు 59% మంది అప్పుల్లో
కూరుకుపోయి ఉన్నారు. జాతీయ స్థాయిలో ఇది 31శాతం.
·
మిగతా వృత్తిదారులతో పోల్చితే వ్యవసాయదారుల్లో
అప్పు ఎక్కువ ఉంది. తెలంగాణలోని రైతుల్లో 74% మంది అప్పులున్న వాళ్లే.
·
అప్పు:ఆస్తి నిష్పత్తి గ్రామీణ, పట్టణప్రాంతాల్లో
7.95%, 8.58%. జాతీయ స్థాయిలో ఇది 3.23%, 3.7%.
వ్యవసాయ
రుణమాఫీ పథకం
రాష్ట్రంలోని రైతులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య రుణాలు. జాతీయ శాంపిల్ సర్వే (NSS) “అఖిల భారత రుణాలు,
పెట్టుబడుల సర్వే” నివేదిక ప్రకారం రాష్ట్రంలోని రైతుల్లో 74 శాతం మంది అప్పుల్లో కూరుకుపోయారు.
(బాక్స్ 3.1). రైతులకు భారంగా మారిన అప్పుల
నుంచి విముక్తి కల్పించేందుకు తెలంగాణ ప్రభుత్వం
రుణమాఫీ పథకం ద్వారా రుణాలను మాఫీ చేసింది.
ఈ పథకంలో భాగంగా
31-03-2014 నాటి వరకు వాణిజ్య బ్యాంకులు, సహకార పరపతి సంఘాలు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల
నుంచి రైతులు తీసుకున్న స్వల్పకాలిక పంట రుణాలు ( బంగారు తాకట్టు పెట్టిన తీసుకున్న
పంట రుణాలు సహ) ఉన్న రుణాలను ఈ పథకం కింద అర్హులను ప్రకటించింది. 31-08-2014 నాటికి
ఉన్న వడ్డీతో సహా కలిపి రుణమాఫీకి అర్హమైన మొత్తం రూ.1 లక్ష గా నిర్ణయించారు. ఈ మాఫీ
నాలుగు విడతల్లో అమలవుతంది.
Table
3.7: District wise number of benefi ciaries and amount released under Crop Loan
Waiver Scheme
టేబుల్ నం 3.7: జిల్లావారీగా
రైతురుణమాఫీ పథకం కింద అర్హులైన వారి సంఖ్య విడుదల చేసిన మొత్తం
(రూ.కోట్లలో)
సీ.నెం. జిల్లా
రైతుల సంఖ్య
మొదటి సంవత్సరం జమైన
మొత్తం (2014-15)
రెండో సంవత్సరం జమైన
మొత్తం (2015-16)
రెండు విడతల్లో జమైన
మొత్తం
1 అదిలాబాద్ 3, 15,026 365.5 365.5 731.1
2 కరీంనగర్ 3, 73,267 415.6 415.6 831.3
ఖమ్మం 3,
58,040 409.1 409.1 818.3
మహబుబ్ నగర్ 5, 98,990 673.9 673.9 1,347.8
మెదక్ 3,
96,191 483.2 483.2 966.3
నల్గోండ 4,
96,629 587.9 587.9 1,175.7
నిజామాబాద్ 3, 79,520 393.4 393.4 786.8
రంగారెడ్డి 2,
08,425 251.2 251.2 502.4
వరంగల్ 4, 03,856 460.2 460.2 920.3
మొత్తం 35, 29,944 4,040.0 4,040.0 8,080
రుణమాఫీ పథకం కింద మొత్తంగా 35.30 లక్షల మంది రైతులు ప్రయోజనం
పొందుతున్నారు. జిల్లాలవారీగా విశ్లేషించినట్టైతే 5.99 లక్షల మంది రైతులతో మహబూబ్ నగర్ జిల్లా అతి
పెద్ద లబ్దిదారుగా నిలిచింది. ఆ తర్వాతి స్థానాల్లో నల్లగొండ (4.97 లక్షల మంది రైతులు),
వరంగల్ (4.04 లక్షల మంది రైతులు) నిలిచాయి. రెండు విడతల్లో మొత్తం రూ.8,080 కోట్లు విడుదల చేశారు.
ఎంపిక చేసిన బ్యాంకుల్లో రైతు రుణమాఫీ పథకం అమలును పరిశీలించేందుకు జిల్లా
కలెక్టర్ల పర్యవేక్షణలో ఆడిట్ టీమ్ ను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. జిల్లా కలెక్టర్లు ఆ నివేదికను ఆర్థిక శాఖకు సమర్పించారు.
రైతు రుణమాఫీ పథకం కింద బోగస్ రైతులు లబ్ది పొందకుండా చూసేందుకు వారిని గుర్తించి ఏరివేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటోంది.
సాగునీరు
అందుతున్న భూమి
వ్యవసాయ ఉత్పాదకతలో సాగునీటికి ప్రధాన పాత్ర. 2014-15లో రాష్ట్రంలో సాగునీరు అందుకున్న భూమి
25.29 లక్షల హెక్టార్లు. అంతకు ముందు సంవత్సరం అది 31.54 లక్షల హెక్టార్లు. అంటే
-20 శాతం ప్రతికూల వృద్ధి. అదే సమయంలో సాగునీరు
అందుకున్న నికర భూమి 2013-14 లో 22.8 లక్షల హెక్టార్లు ఉంటే అది 2014-15లో 17.26 లక్షల
హెక్టార్లకు తగ్గింది. వనరులపరంగా చూస్తే రాష్ట్రంలో సాగుకు ప్రధాన ఆధారం బావులే. 2014-15లో దాదాపు 82% నికర సాగు భూమి బావుల కిందే
సాగైంది. కాలువ ద్వారా సాగైన భూమి 10 శాతం,
చెరువుల ద్వారా సాగైన భూమి 4 శాతం.
చిత్రం 3.8: వనరుల ఆధారంగా సాగవుతున్న
భూమి (మూడింటి సగటు)
చిత్రం 3.8ని చూసినట్టైతే గడిచిన 60 ఏళ్లలో తెలంగాణలో సాగునీటి
వాడకం విధానంలో స్పష్టమైన మార్పు వచ్చినట్టు కనిపిస్తోంది. చెరువులు, కాలువల ద్వారా
సాగు తగ్గుతోంది. 1985-86 నుంచి బావుల ద్వారా
సాగు పుంజుకున్నట్టు కనిపిస్తోంది. 1955-56లో 16 శాతంగా ఉన్న బావినీటి సాగు
1985-86కు వచ్చేసరికి 37 శాతానికి, 2014-15 నాటికి 84శాతానికి పెరిగింది. 1956-57లో
బావులు, కాలువల సాగుతో పోల్చితే చెరువుల ద్వారా సాగు మూడు రెట్లు ఎక్కువ. కాలక్రమంలో
ఇది బాగా తగ్గిపోయింది. 1956-57లో చెరువుల ద్వారా సాగైన భూమి వాటా 65 శాతమైతే
1985-86లో ఇది 28 శాతానికి తగ్గింది. 2012-13 నాటికి ఇది మరింత క్షీణించి 10 శాతానికి
చేరింది. కాకతీయుల కాలంలో తవ్వించిన చెరువుల పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేశారన్నది
ఇది స్పష్టం చేస్తోంది. బావులపై అతిగా ఆధారపడటం
వల్ల అది భూగర్భజలాలపై ప్రతికూల ప్రభావం చూపుతోంది. ఈ పరిస్థితుల్లో చెరువు,
కాలువలను సాగునీటి వనరులుగా చేయాల్సిన అవసరముంది. ఇందులో భాగంగానే ప్రభుత్వం మిషన్ కాకతీయ చేపట్టి
చెరువుల పునరుద్ధరణ కార్యక్రమం చేపట్టింది.
కాలువల సాగును ప్రోత్సాహించేందుకు కాలువను పునర్ నిర్మించేందుకు బడ్జెట్లో ఇతోధికంగా
కేటాయింపులు చేసింది.
మొత్తం,
నికర సాగు భూమి
2013-14లో
31.54 లక్షల హెక్టార్లు మొత్తం సాగునీటి పరిధిలోకి వస్తే 2014-15లో ఇది
19.82 శాతం తగ్గి 25.29 లక్షల హెక్టార్లకు పరిమితమైంది. నికర సాగు భూమి 2013-14లో
22.80 లక్షల హెక్టార్లు ఉంటే 17.26
లక్షల హెక్టార్లుక తగ్గింది. (చిత్రం 3.9)
చిత్రం 3.9: 2007-09
నుంచి 2015-16 వరకు మొత్తం, నికర సాగు భూమి వివరాలు (ఖరీఫ్)
సాగునీటి
లభ్యత
సాగునీటి వనరులకు సంబంధించి
సాగునీటి లభ్యత (మొత్తం సాగు భూమి:నికర సాగు భూమి) వివరాలు టేబుల్ 3.9లో చూడవచ్చు.
2014-15లో బావుల కింద సాగునీటి లభ్యత
1:50. బావుల కింద సాగు పెరగడంతో నికర సాగు భూమి పెరిగింది.
వనరుల వారీగా సాగు:
2008-09 నుంచి
2014-15 వరకు వనరుల ఆధారంగా సాగుకు సంబంధించిన వివరాలు టేబుల్ 3.8లో చూడవచ్చు. కరువును
ఎదుర్కొనేందుకు గడిచిన రెండేళ్లుగా బావుల కింద నికర సాగు పెరుగుతోంది. 2013-14లో బావుల కింద నికర సాగు 74.83 శాతంగా ఉంటే 2014-15లో ఇది 81.87 శాతానికి
2015-16లో ఇది 86.37
శాతానికి పెరిగింది. ఇదే సమయంలో కాలువల ద్వారా సాగులోనూ పెరుగుదల కనిపించింది.
2012-13లో 5.07 శాతంగా ఉంటే 2013-14లో 12.68 శాతంగా, 2014-15లో ఇది 10.08 శాతానికి
పెరిగింది.
భారత
విత్తనభాండాగారంగా తెలంగాణ
పంట దిగుబడి గణనీణయంగా
పెంచడంలో మిగతా యాజమాన్య పద్ధతులతో పాటు విత్తనానిది కూడా ప్రధాన పాత్ర. ఏడాది పొడవునా
చల్లని, పొడి వాతావరణంతో కూడిన వైవిధ్యభరితమైన వాతావరణ ప్రాంతాలు కలిగి ఉండటం వల్ల
పంటలు పండించడంలోనే కాదు నాణ్యమైన విత్తన ఉత్ప్తతికి తెలంగాణ అనువైన ప్రదేశం. దేశం
నడిబొడ్డున ఉంటూ తూర్పు-పడమర, ఉత్తర దక్షిణాలు కలుపుతూ, చక్కటి రవాణ సదుపాయాలు కలిగిన
హైదరాబాద్ ఉండటం వలన రాష్ట్రాన్ని విత్తన భాండాగారాన్ని
చేసేందుకు అపార అవకాశాలున్నాయి.
సంకర వరి, మొక్కజొన్న,
పత్తి, శనగలు సహ ఏటా దాదాపు 37.42 లక్షల క్వింటాళ్ల రకరకాల విత్తనాలను రాష్ట్రం ఉత్పత్తి చేస్తోంది.
దేశంలో దాదాపు 90-95% సంకర వరి ఉత్పత్తికి సంబంధించి వరంగల్, కరీంనగర్ జిల్లాలో వివిధ
కంపెనీలు విత్తానాలు ఉత్పత్తి చేస్తున్నాయి. దేశంలో సంకర జొన్న, సజ్జకు సంబంధించిన విత్తనాలు
నూటికి నూరు శాతం నిజామాబాద్ జిల్లా సరఫరా చేస్తోంది.
తెలంగాణలో
విత్తన పరిశ్రమకు ఉన్న సానుకూలతలు
·
దేశానికి అవసరమైన విత్తనాల్లో 60
శాతం తెలంగాణ అందిస్తోంది.
·
విత్తన ఉత్పత్తికి తెలంగాణలోని అన్ని
జిల్లాలు అనువైనవి.
·
అన్ని ప్రధాన పంటల విత్తనాల ఉత్పత్తి
·
చల్లని, పొడి వాతావరణ పరిస్థితులు
విత్తన జీవిత కాలం పెంచేందుకు అనుకూలం
·
అందుబాటులో సమర్థవంతమైన, అందుబాటు
ధరల్లో విత్తన శుద్ది కేంద్రాలు, నిల్వ సదుపాయాలు
·
హైదరాబాద్ చుట్టుపక్కల 400 లకు పైగా విత్తన కంపెనీలు పనిచేస్తున్నాయి.
·
విత్తన అభివృద్ధిలో నిమగ్నమైన జాతీయ,
అంతర్జాతీయ సంస్థలు: జాతీయ విత్తన సంస్థ, ఇక్రిశాట్, ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ రైస్
రీసెర్చ్ (IRR), ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఆయిల్ సీడ్ రీసెర్చ్ (IIOR), ఇండియన్ ఇనిస్టిట్యూట్
ఆఫ్ మిల్లెట్ రీసెర్చ్ (IIMR), తెలంగాణ రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ
(TSSDC), తెలంగాణ స్టేట్ సీడ్ సర్టిఫికేషన్ ఏజెన్సీ (TSSCA), రాష్ట్ర వ్యవసాయ వర్సటీ వంటి ఇక్కడున్నాయి.
తెలంగాణలో విత్తనాభివృద్ధి పరిశ్రమకున్న అపార
అవకాశాలను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ఆధునిక
మౌలిక వసతులు, కచ్చితమైన విద్యుత్ సరఫరా, సాగునీటి
అందుబాటు, విత్తన నిల్వ గోదాములు, సామర్థ్య పెంపునకు అవసరమైన అనేక చర్యలు తీసుకుంటోంది.
·
విత్తన ఉత్పత్తి క్లస్టర్ల కోసం ప్రత్యేక
ప్రాంతాల గుర్తింపు
·
విత్తన గ్రామాలను పటిష్టం చేయడం
·
జొన్నలు, నూనె గింజలు, ఆహార ధాన్యాల
పంటల ఉత్పత్తిని విత్తన కంపెనీలు సామాజిక బాధ్యతగా చేపట్టేందుకు ప్రోత్సాహించడం
·
సంప్రదాయేతర ప్రాంతాలను విత్తన పరిశ్రమ దత్తత తీసుకునేలా చూడటం
·
రాష్ట్రంలోని విత్తన క్షేత్రాలను పునరుద్ధరించడం
·
పంట కోత తర్వాత అవసరమయ్యే విత్తన
శుద్ధి, నిల్వ, రవాణా సదుపాయాలు అభివృద్ధి చేసేందుకు మద్దతుగా నిలవడం
·
ఎగుమతులకున్న అదనపు అవకాశాలను శోధించడం
·
విత్తన కార్యక్రమాలను సమన్వయం చేసేందుకు
ప్రత్యేక సెల్ ఏర్పాటు
·
విత్తన ఉత్పత్తి సహకార సంఘాలను అభివృద్దిపరచడం
·
అంతర్జాతీయ విత్తన లోయ/కేంద్రంగా
అభివృద్ధి చేసేందుకు ఉన్న అవకాశాలను శోధించడం
·
విత్తన ఉత్పత్తిలో పబ్లిక్-ప్రైవేట్
భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడం
విశ్వవిద్యాలయాలు, ఇతర ఏజెన్సీలను సమన్వయపరుచుకుంటూ
రానున్న కాలంలో 100 శాతం విత్తన మార్పిడి నిష్పత్తి (SRR) సాధించేందుకు వ్యవసాయ శాఖ
విత్తన ఉత్పత్తి కోసం ఐదేళ్ల ప్రణాళిక రూపొందించింది. విత్తన హారాన్ని పటిష్టం చేసేందుకు
వివిధ
పరిశోధన సంస్థలు, ప్రభుత్వ విభాగాలు, ప్రైవేట్ విత్తన ఉత్పత్తి ఏజెన్సీలను కలుపుకుంటూ
ప్రబుత్వం అన్ని అవసరమైన చర్యలు తీసుకుంటోంది.
విత్తన గ్రామ పథకం
అన్ని పంటలకు అవసరమైన ఆధీకృత/నాణ్యమైన విత్తనాల
ఉత్పత్తి, వాటిని రెట్టింపు చేసి రైతులకు అందుబాటు ధరల్లో దొరికేలా చూడటం విత్తన గ్రామ
పథకం ముఖ్య ఉద్దేశం. రాష్ట్రంలో 536 హెక్టార్లు సాగుభూమిలో 10 విత్తన
క్షేత్రాలున్నాయి. విత్తన గ్రామ పథకం కింద మూల విత్తనాన్ని ఉత్పత్తి చేయడం వీటి ముఖ్య ఉద్దేశం.
విత్తన పరిశ్రమకు ఎగుమతి అవకాశాలు
దేశీయ మార్కెటే కాదు విత్తన పరిశ్రమకు ఎగుమతి
అవకాశాలు కూడా అపారంగా ఉన్నాయి. (i) 30oN
-30Os రేఖ మధ్య ఉన్న దేశాల్లో మార్కెటింగ్
చేసుకునేందుకు అవకాశాలున్నాయి. (ii) మనలాంటి వాతావరణ పరిస్థితులు, మనలాంటి విధానాలే
ఉన్నా అభివృద్ధి చెందుతున్న ఆఫ్రికా, ఇండోనేషియా, వియత్నాం, బంగ్లాదేశ్ వంటి దేశాలకు ఎగుమతి చేయవచ్చు.
వ్యవసాయ విస్తరణను బలోపేతం చేయడం
వ్యవసాయరంగ అభివృద్ధికి వ్యవసాయ పరిశోధన ఒక చోదక
శక్తి వంటిది. వాటి ఆలోచనలను రైతులకు అందేలా
చూడటం చాలా ముఖ్యం. పరిశోధనా ఫలాలు రైతులకు
అందేలా చూడటం, పరిశోధనా సంస్థలను పటిష్టం చేసేందుకు ఓ బలమైన వ్యవసాయ విస్తరణ వ్యవస్థ
అవసరం.
A strong agricultural extension system, therefore, is the
main vehicle to carry the fruits of research to the farmers and strengthen the
Lab – to – Land process. It assists the farmers to acquire knowledge about the
use of new agricultural technologies and to boost –up the crop productivity.
వ్యవసాయం
సాంకేతిక పరిజ్ఞానంలో వేగంగా చోటుచేసుకుంటున్న
మార్పులను రైతులు తెలుసుకొనేందుకు విస్తరణ సేవలు ఉపకరిస్తాయి. వ్యవసాయ విస్తరణ సేవల్లో భాగంగా వివిధ రకాల పథకాల ద్వారా రైతులకు అవసరమైన
సమాచారం, సాంకేతిక పరిజ్ఞానం తెలుసుకునే వీలు కలుగుతుంది.
(i)మన తెలంగాణ
– మన వ్యవసాయం: హైదరాబాద్ మినహా తెలంగాణలోని
అన్ని జిల్లాల్లో వ్యవసాయదారులు ఉండే మండలాల్లో 2015 ఖరీఫ్ సీజన్ ప్రారంభానికి ముందు
మన తెలంగాణ – మన వ్యవసాయం కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మన తెలంగాణ – మన వ్యవసాయం
పథకం కింద రైతులకు సమగ్ర శిక్షణ, ప్రభుత్వం చేపడుతున్న వివిధ సంక్షేమ పథకాలకు సంబంధించిన
అవగాహన, ఖరీఫ్/రబీ సీజన్ కు సంబంధించిన సరైన ప్రణాళిక రూపొందించుకునేందుకు వ్యవసాయం,
పశుసంవర్థక శాఖ, ఉద్యాన, పట్టు పరిశ్రమకు చెందిన అధికారులతో శిక్షణా కార్యక్రమాలు ఏర్పాటు
చేశారు.
(ii) టీ
& వి వర్క్ షాపులు: ప్రొఫెసర్ జయశంకర్
వ్యవసాయ విశ్వవిద్యాలయం గుర్తించిన పరిశోధనా కేంద్రాల్లో ప్రతీ నెలా ట్రైయినింగ్ అండ్ విజిట్ (T&V) వర్క్ షాపులు క్రమం
తప్పకుండా నిర్వహిస్తున్నారు. ఇందులో వ్యవసాయ శాఖ అధికారులు, వ్యవసాయ విశ్వవిద్యాలయ
శాస్త్రవేత్తలు పంటల ప్రస్తుత స్థితి, సవాళ్లు ఎదుర్కొనేందుకు తీసుకువాల్సిన చర్యలను
ఈ వర్క్ షాపుల్లో చర్చిస్తారు.
(iii) రైతులు, మహిళా
రైతులకు శిక్షణ: SMSRI విధానం, సేంద్రీయ సాగు,
కోత అనంతర సాంకేతిక పరిజ్ఞానం, ఎలుకల నివారణ, డ్రిప్ ఇరిగేషన్, IPM, INK, వ్యవసాయ యాంత్రీకరణ,
నీటి నిర్వహణకు సంబంధించి శిక్షణా కార్యక్రమాల ఏర్పాటు, రైతులకు వాటిపై అవగాహన కల్పించడం
జిల్లాల్లో ఉన్న రైతు శిక్షణా కేంద్రాల బాధ్యత.
మహిళా రైతు సాధికారికత
పథకం కింద మహిళ రైతులకు వారి నైపుణ్యం, పరిజ్ఞానం పెంచుకునేందుకు తగిన శిక్షణా కార్యక్రమాలు
ఏర్పాటు.
(iv) సమగ్ర వ్యవసాయ విధానంపై
రైతులకు శిక్షణ: వ్యవసాయం ఒక్కటే రైతులకు లాభాలను ఇవ్వదు. తమకున్న వనరులు ఉపయోగించుకుంటూ
ఏడాది పొడవునా ఆదాయం పొందేందుకు వ్యవసాయ అనుబంధ కార్యకలాపాలైన పాడి పరిశ్రమ, పూలసాగు,
పట్టు సాగు, చేపల పెంపకం, తేనేటీల పెంపకం, గోబర్ గ్యాస్ ఉత్పత్తే కాదు వైవిధ్యమైన పంటలు
సాగుచేసేలా రైతులకు ప్రోత్సహించేందుకు తొమ్మిది జిల్లాల్లోని వ్యవసాయ శిక్షణా కేంద్రాలు
శిక్షణా కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నాయి. ప్రతీ గ్రామంలోని 50 మంది యువరైతులకు ప్రత్యేక
శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేయాలని కూడా ప్రతిపాదించడమైనది.
పంట
కాలనీల అభివృద్ధికి రైతులకు శిక్షణ: తెలంగాణ రాష్ట్రంలో వరి, మొక్కజొన్న, కంది,
శనగ, వేరుశనగ, సోయాబీన్, ఆముదం, నూనె గింజల ఉత్పాదక పెంచాల్సిన ఆవశ్యకత ఉంది. ఈ పంటల
సాగు మెరుగుపరిచి గరిష్ట ఉత్పత్తి సాధించేందుకు పంట కాలనీలు అభివృద్ధి చేసేందుకు
2015-16లో తొమ్మిది వ్యవసాయ శిక్షణా కేంద్రాల
ద్వారా శిక్షణా కార్యక్రమాలు చేపట్టాలని ప్రతిపాదించడమైనది.
క్లస్టర్ స్థాయిలో 50 మంది రైతులకు రబీలో ఒకటి,
ఖరీఫ్ లో ఒక శిక్షణా కార్యక్రమం ఇవ్వాలని ప్రతిపాదించడమైనది.
(vi) యువ రైతులకు శిక్షణ: తక్కువ ఆదాయం, అప్పులు లభించకపోవడం, సాంకేతిక పరిజ్ఞానం
అందుబాటులో లేకపోవడం, విస్తరణ సేవలు లభించకపోవడం, కూలీల కొరత వంటి రకరకాల సమస్యల కారణంగా
వ్యవసాయం చేసేందుకు ఉత్సాహం చూపడం లేదు. దీనికి ప్రధాన కారణం ఆధునిక వ్యవసాయానికి సంబంధించిన
సమాచార కొరత, అందుబాటులో ఉన్న వనరులను వ్యవసాయదారులు పూర్తిస్తాయిలో వినియోగించుకోలేకపోవడం.
దీన్ని దృష్టిలో
పెట్టుకొని యువతకు వ్యవసాయంపై ఆసక్తి పెంచి, వ్యవసాయం కూడా లాభసాటిదేనని చెప్పేలా తగిన శిక్షణా కార్యక్రమాల రూపకల్పన చేయాల్సిన అవసరముంది.
రైతులు, మహిళా రైతులు, యువరైతులకు అవసరమైన
సమగ్ర శిక్షణ ఇచ్చి వారికి వ్యవసాయంపై మక్కువ కలిగే శిక్షణా కార్యక్రమాలను తొమ్మిది
వ్యవసాయ శిక్షణా కేంద్రాలు ద్వారా చేపట్టాలని ప్రతిపాదించడమైనది. ప్రతీ మండలంలో ప్రతీ
సంవత్సరం ఒక శిక్షణా కార్యక్రమం నిర్వహించాలని ప్రతిపాదించడమైనది.
(vi) ప్రాంతీయ పరిశోధన, వ్యవసాయ విస్తరణ సదస్సులు:
ప్రతీ సంవత్సరం
ఏప్రిల్ నెలలో ప్రాంతీయ పరిశోధన, వ్యవసాయ విస్తరణ సదస్సులు నిర్వహిస్తున్నారు. వివిధ
విశ్వవిద్యాలయాలకు చెందిన పరిశోధనా శాస్త్రవేత్తలు, వ్యవసాయ శాఖ విస్తరణ అధికారులు
ఈ సదస్సులో పాల్గొని వాతావరణ పరిస్థితులకు సంబంధించి తమకెదురైన అనుభవాలు, సరైన పంట
రకాలు, పంటలకు సంబంధించిన సమస్యలు, వచ్చే సీజన్ కు అవసరమైన ప్రణాళికలకు ఈ సదస్సుల్లో
చర్చిస్తారు. ఈ సిఫార్సులను ZREAC అధికారులకు
అందజేసి వచ్చే పంట కాలానికి అవసరమైన చర్యలు చేపడతారు.
ఈ కార్యక్రమాలే
కాకుండా 1000 మంది వ్యవసాయ విస్తరణాధికారులను నియమించాలని కూడా ప్రతిపాదించడమైనది.
వీరు క్షేత్రస్థాయిలో రైతులకు దగ్గరగా ఉంటూ
రాష్ట్రంలో వ్యవసాయ నెట్ వర్క్ బాగా పనిచేసేలా చూస్తారు.
వ్యవసాయ యాంత్రీకరణ
వ్యవసాయ
యాంత్రీకరణ ద్వారా ఉత్పాదక పెరగడమే కాదు సాగు ఖర్చు తగ్గి సకాలంలో రైతు తన వ్యవసాయ
పనులు పూర్తి చేసుకొనే వెసులుబాటు లభిస్తుంది. గ్రామీణ కూలీలు పట్టణాలకు వలస పోతుండటంతో
వ్యవసాయ కూలీల కొరత తీవ్రమవుతోంది. ఈ క్రమంలో
వ్యవసాయ యాంత్రీకరణ
తప్పనసరిగా
మారుతోంది. పొలాల సైజు, రైతు కూలీల ధర, యంత్రాలు,
విద్యుత్ అందుబాటు వ్యవసాయ యాంత్రీకరణను ప్రభావితం చేస్తాయి. రాష్ట్రంలో
భూకమతాల విస్తీర్ణం చిన్నగా ఉండటంతో వ్యవసాయపనులకు ఇప్పటికీ మానవ శక్తి, పశువులు, ట్రాక్టర్ల పైనే
ఆధారపడాల్సిన పరిస్థితి. ఎక్కువ భూమిని సాగు కిందకు తెచ్చేందుకు, యూనిట్ భూమిలో ఉత్పాదకత
పెంచేందుకు ట్రాక్టర్లు, పవర్ టిల్లర్లు, సంప్రదాయేతర ఇంధన వనరుల వాడకంపై దృష్టి పెట్టాల్సిన
అవసరముంది.
జిల్లాల్లో
పండింటే పంటలు, నేల స్థితిగతులు, స్థానిక పరిస్థితులు, అవసరాలను బట్టి వివిధ రకాల వ్యవసాయ
యంత్రాలు, పరికరాలను సబ్సిడీ ధరల్లో అందించేందుకు ప్రభుత్వం చొరవ తీసుకుంటోంది.
రాష్ట్రంలో
వ్యవసాయ యాంత్రీకరణను ప్రోత్సహించేందుకు వ్యవసాయ
యాంత్రీకరణ పథకంలో భాగంగా పశువులు లాగే పరికాలు, ట్రాక్టర్ తో పనిచేసే పరికాలు, అత్యంత
ఖరీదైన యంత్రాలు, మినీ ట్రాక్టర్లు, పంట కోత పరికరాలు, పంట సంరక్షణ పరికరాలు, అంతర్
పంట సాగుకు అవసరమైన HDPE టార్పాలిన్లు, వరి సాగుకు అవసరమయ్యేలా భూమిని సిద్ధం చేసే
కస్టమ్ హైరింగ్ సెంటర్లు, పత్తి, మొక్కజొన్న, వరి కోతకు కోసం CHC, మిని చెరుకు ప్యాకేజీ అందిచేందుకు రాష్ట్ర
ప్రభుత్వం ప్రోత్సాహిస్తోంది. యంత్రం రకాన్ని బట్టి గరిష్టంగా 50 శాతం సబ్సిడీ అందించాలని
ప్రతిపాదించడమైనది. వ్యవసాయంలో ఆధునిక యాంత్రీకరణ చేపట్టేందుకు రాష్ట్రీయ కృషి వికాస్
యోజన, సబ్-మిషన్ ఆన్ ఆగ్రికల్చర్ మెకనైజేషన్
కూడా అమలు చేస్తున్నారు.
వ్యవసాయ
యాంత్రీకరణ విజయగాధలు
కేస్ 1:
పత్తి కోసం కస్టమ్ హైరింగ్ సెంటర్
పత్తి పంటకు
అవసరమైన కార్యకలాపాలను యంత్రాల ద్వారా నిర్వహించేందుకు కస్టమ్ హైరింగ్ సెంటర్ ఏర్పాటు
చేసుకునేందుకు మార్చి 2015లో కరీంనగర్ జిల్లా
కమలాపూర్ మండలం పగిడిపల్లి గ్రామంలో శ్రీ ఆంజనేయ రైతు మిత్ర మండలి ఏర్పాటైంది. సబ్సిడీ ధరకు ట్రాక్టర్, రోటోవేటర్, మల్టీ క్రాప్ ప్లాంటర్, పవర్
వీడర్, బూమ్ స్ప్రేయర్ ను ఈ గ్రూప్ కు సరఫరా చేశారు. తమ పొలాలను సిద్ధం చేసేందుకు ట్రాక్టర్,
రోటోవేటర్ వాడుకొని పగిడిపల్లి రైతులు చాలా సంతోషంగా ఉంటున్నారు. నిర్థారిత ధరలకు ఈ యంత్రాల సేవలను గ్రామంలోని రైతులకందిస్తున్నారు.
ఈ యంత్రాల సాయంతో పత్తి పంటను సకాలంలో వేయగలమనే గ్రామంలోని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. పొలం పనులే కాకుండా
ట్రాక్టర్ ను మిషన్ కాకతీయ పనులకు కూడా వాడుతున్నారు. చెరువులోకి
పూడికను సమీపంలోని రైతుల పొలాలకు తరలించేందుకు
శ్రీ ఆంజనేయ రైతు మిత్ర గ్రూప్ రూ.80 నుంచి
రూ.150 వరకు వసూలు చేస్తోంది.
కేసు
-2: సీడ్ కమ్ ఫెర్టి డ్రిల్
మహబూబ్ నగర్
జిల్లా మగ్దూమ్ పూర్ గ్రామానికి చెందిన నరసింహులు సబ్సిడీ ధర కింద ట్రాక్టర్ ద్వారా
లాగే ఫెర్టికమ్ సీడ్ డ్రిల్ ను కొనుగోలు చేశారు. ఈ యంత్రం ద్వారా పొలంలో నైట్రోజన్,
భాస్వరం, పొటాషియం వంటి ఎరువులను సమానంగా సమస్థాయిలో అవసరమైన లోతు, విత్తన వరుసలో చల్లేందుకు
చాలా ప్రయోజనకరంగా ఉందని నరసింహులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. నాట్లు వేయడం, ఎరువుల వాడకం, కూలీల ఖర్చును ఈ యంత్రం
ద్వారా మిగిలిందని తెలిపాడు. పంట సమానంగా పండి చక్కగా నిలవడంతో ఈసారి దిగుబడి పెరుగుతున్నందని
నరసింహులు నమ్మకం. సంప్రదాయ పద్దతిలో సాగు చేస్తే ఇది సాధ్యం కాదని అంగీకరిస్తున్నాడు.
No comments:
Post a Comment