Thursday, 5 March 2020

telangana history kakatiyas jithender reddy part 1

      కాకతీయులు (క్రీ.శ. 1000-1323 ) kakatiyas  పార్ట్ 1

ముఖ్యాంశాలు:


google.com,pub-6883760693832813,DIRECT,f08c47fec0942fa0
  • వంశస్థాపకుడు   :  కాకర్య గుండ్యన
  • రాజ్య స్థాపకుడు : మొదటి బేతరాజు
  • స్వతంత్ర్యరాజ్య స్థాపకుడు : రుద్రదేవుడు (మొదటి ప్రతాపరుద్రుడు)
  • రాజధానులు  :   అనుమకొండ, ఓరుగల్లు
  • గొప్పవాడు :        గణపతి దేవుడు
  • తొలి స్త్రీ పాలకురాలు : రుద్రమదేవి
  • చివరి పాలకుడు : రెండవ ప్రతాపరుద్రుడు
  • రాజలాంచనము   : వరాహం
  • రాజ భాష  :  సంస్కృతము
  • కాకతీయరాజులు : శూద్రులు
  • కాకతీయుల తొలిప్రస్తావన  : దానర్ణవుని మాగల్లు శాసణంలో 
  • సైన్యంలో నాయంకర పద్దతి  :  రుద్రమదేవి ప్రవేశపెట్టింది
  • శాతవాహానుల అనంతరం తెలుగు మాట్లాడే ప్రాంతాలన్నింటిని ఒకే పరిపాలనలోకి  ఘనత కాకతీయులకు దక్కింది
  • కాకతీయుల కాలంలో తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధిని సాదించింది.

ఆధారాలు:

శిలాశాసనాలు:

  • మొదటి ప్రోలరాజు  :    పిల్లల మట్టి శాసనం.
  • గణపతి దేవుడు       :    మోటుపల్లి శాసనం
  • .రేచెర్ల రుద్రుడు      :     పాలంపేట శాసనం
  • రుద్రదేవుడు            :   వేయిస్తంభాల గుడి శాసనం
  • గణపతి దేవుడు       :     జమలాపురం శాసనం (1202)
  • రుద్రమదేవి             :    మల్కాపురం శాసనం

తామ్ర శాసనాలు:

దాణార్ణవుడు ( తూర్పు చాళుక్యరాజు)    : మాగల్లు శాసనం
.గణపతి దేవుడు                                       : కరీంనగర్ తామ్ర శాసనం
.రుద్రమదేవి                                             :   అలపాడు శాసనం
ప్రతాపరుద్రుడు                                       : ఖండవల్లి శాసనం
రుద్రదేవుడు                                             : వేయిస్తంభాల గుడి శాసనం

వివిద సంస్కృత గ్రంథాలు:

  • రుద్రదేవుడు        :  నీతిసారం
  • జాయప                : నృత్య రత్నావళి
  • శ్రీనాదుడు           : పల్నాటి వీర చరిత్ర
  • కాసె సర్వప్ప        :  సిద్ధేశ్వర చరిత్ర

  • కాకతీయుల వంశోత్పత్తిని గూర్చి వారి వర్ణాన్ని గురించి చరిత్రకారులలో భిన్నాభిప్రాయాలున్నాయి
  • కాకతీయుల గూర్చి మొట్ట మొదటి ప్రస్తావన తూర్పు చాళుక్యరాజు దానార్ణవుని మాగల్లు శాసనం (కీ॥శ॥950 లో ఉంది
  • ఈ శాసనంలో 'కాకర్త్య' గుండన అనే దండనాయకుని ప్రార్ధన మీద దానార్ణవుడు 'దొమ్మన శర్మ' అనే బ్రాహ్మణునికి నతవాడి విషయంలోని మాంగల్లు గ్రామాన్ని దానం చేసి నట్లుగా చెప్పబడింది
  • కాకతీయులు దుర్జయ వంశం వారని, వీరి మూలపురుషుడు వెన్నరాజని మైలమ(గణపతిదేవుని సోదరి) తన బయ్యారం చెరువు శాసనంలో పేర్కొన్నది
  • వినుకొండ వల్ల బామాత్యుని క్రీడాభిరామంలో కాకతమ్మను పూజించడం వల్ల వీరు కాకతీయులైనారని పేర్కొన్నాడు
  • దుర్గాదేవికి 'కాకతి' అనే పేరుండేదని, ఆమెను ఆరాధించడం వల్లనే బేతరాజు వంశీయులు కాకతీయులైనారని విధ్యానాదుడు పేర్కొన్నాడు
  • మొదటి బేతరాజుకు 'కాకతీపురనాధ' అతని కుమారునికి ‘కాకతి వల్లభ' అనే బిరుదులు ఉండటంవల్ల కాకతి పురాధీశ్వరులే ' కాకతీయులు' అనే మరో వాదముంది
  • ప్రతాప రుద్రీయ గ్రంథంలో కాకతీయులది సూర్య, చంద్ర వంశాలను మించిన వంశం అని చెప్పారు
  • అంటే వీరు ఈ రెండు వంశాలకు చెందిన క్షత్రియులు కారు కాబట్టి వీరు శూద్రులు అని భావించవచ్చును
  •  కాకతీయులు రాష్ట్రకూట రాజుల కొలువులో చాలాకాలం సైన్యాధిపతులు గా ఉండేవారు .
  • క్రీస్తుశకం 1158 లో కాకతీయ రుద్రదేవుడు వచ్చేంత వరకు పాలించిన కాకతీయులు రాష్ట్రకూటులు కళ్యాణి చాళుక్యులకు సామంతులుగా ఉన్నారు.

తొలి కాకతీయులు 

 మొదటి బేతరాజు 

  • ఇతడు కాకర్త్య గుండ్యన కుమారుడు ఇతడు విరియాల ఎర్ర సేనాని సహకారంతో రాజ్యానికి వచ్చినాడు అని  గూడూరు శాసనం, సిద్దేశ్వర చరిత్ర తెలుపుతున్నాయి.
  •  భేతరాజు రాష్ట్రకూటుల  సార్వభౌమత్వాన్ని వదిలివేసి కళ్యాణి చాళుక్యుల కు సామంతుడు గా ఉన్నాడు . 
  •  ఇతని కాలం నుండి కాకతీయులు స్వాతంత్య్ర ము ప్రకటించుకొనేంతవరకు కళ్యాణి చాళుక్యుల సామంతులుగా ఉన్నారు. 
  • . ఇతని రాజ్యం కొరవి సీమ నుండి  నేటి కరీంనగర్ జిల్లాలోని శనిగరం వరకు వ్యాపించింది.
  • బేతరాజు మంత్రి నారయ్య శనిగరం లోని యుద్ధంమల్ల జైన ఆలయాన్ని పునరుద్ధరించి కానుకలిచ్చి అక్కడ 1051 లో శనిగరం శాసనం వేయించినాడు.
  • బేతరాజు కు కాకతి పురాదినాద అనే బిరుదు ఉండేది తన సార్వభౌముడైన కళ్యాణి చాళుక్యుల తో కలిసి చోళుల పై విజయం సాధించి చోడ క్షమ పాల చ ప్రమాదనా అని ప్రశంసింపబడినాడు .


మొదటి ప్రోలరాజు క్రీస్తుశకం 1052 నుండి 1076 వరకు 

  • ఇతడు మొదటి బేతరాజు కుమారుడు .
  • కాజీపేట పిల్లలమర్రి వేలంపేట శాసనాలు ఇతని రాజకీయ విజయాలను ఘనకార్యాలను పేర్కొంటున్నాయి.
  •  ఇతడు తన సార్వభౌముడైన మొదటి సోమేశ్వరుని దండ యాత్రలో పాల్గొని సమధి గత పంచమహా శబ్ద బిరుదును పొందినాడు. 
  • ఇతని ధైర్యానికి మెచ్చి  సోమేశ్వరుడు ఇతనికి హనుమకొండ విషయాన్ని వంశపారంపర్య హక్కులతో ఇచ్చి సామంత ప్రభువుగా గుర్తించాడు.
  • అనుమకొండ కాకతీయుల రాజధాని అయింది. 
  • ఇతడు చాళుక్య రాజ్య చిహ్నామైన వరాహముద్రను, కొన్ని నాణేలు ముద్రించుకోవడానికి అనుమతిని పొందినాడు.
  • గరుఢ లాంచనంతో బాటు చాళుక్య సామంత ప్రతిపత్తిని సూచించే వరాహలాంచనం కూడా ఉపయోగించడం ఇతని కాలంలోనే ప్రారంభమయింది
  • ప్రోలరాజుకు 'అరిగజకేసరి' అనే బిరుదుండేది. ఈ బిరుదు నామంతోనే చెరువును తవ్వించి దానికి 'కేసరి తటాక. అని పేరు పెట్టినాడు. ఇంకా కేసముద్రం చెరువును నిర్మించినాడు.
  • ప్రోలరాజు   లకులీశ్వర ఆగమ పండితుడైన రామేశ్వరుని శిష్యుడు . 
  • శివారాధకుడు గురువునకు వైజనంపల్లిని శివపురముగా మార్చి దానమిచ్చినాడు.

ఇతని బిరుదులు:

  • కాకతీ వల్లభ
  • అరిగజ కేసరి
  • సమదిగత పంచ మహాశబ్ద

రెండో బేతరాజు (క్రీ. శ. 1076-1108); -

  • ఇతడు మొదటి ప్రోల రాజు కుమారుడు

ఇతని బిరుదులు:

  • త్రిభువనమల్ల
  • మహామండలేశ్వర
  • విక్రమచక్రి
  • చలమర్తిగండ

  • ఇతడు తన సార్వబౌముడైన కళ్యాణి చాలుక్య ఆరో విక్రమాదిత్యుని దండయాత్రలో పాల్గొని, అతడి అభిమానాన్ని పొంది, సబ్బీ మండలంలో (కరీంనగర్) 1000 గ్రామాలు, ముదిగొండ రాజ్యంలో కొంత భాగం బహుమానం పొందినాడు
  • ఇతని మంత్రి వైజదండనాధుడు గొప్ప రాజనీతి పరుడు.
  • రెండో బేతరాజు కాలాముఖ శైవాచార్యుడు అయిన రామేశ్వర పండితుని నుంచి శైవదీక్ష పొంది గురుదక్షిణగా అనుమకొండలో శివపుర మనే భాగాన్ని, అందులో బేతేశ్వరాలయాన్ని నిర్మించినాడు
  • కాకతీయులు 'చలమర్తిగండ' బిరుదు ధరించడం ఇతని కాలం నుండే ప్రారంభమైంది.

దుర్గరాజు (క్రీ. శ. 1108-1116):

  • ఇతడు రెండవ బేతరాజు జేష్ట కుమారుడు అని కాజీపేట శాసనం ద్వారా తెలుస్తుంది.
  • ఇతనికి 'త్రిభువనమల్ల', 'చలమర్తిగండ' అనే బిరుదులుండేవి
  • ఇతడు కాజీపేట శాసనం వేయించినాడు.
  • రెండో బేతరాజు అనుమకొండలో బేతేళ్వరాలయాన్ని నిర్మించగా, దుర్గరాజు ఈ ఆలయాన్ని కాలముఖాచార్యుడైన రామేశ్వర పండితుని పరంగా దానం చేసినట్లు కాజీపేట శాసనం వివరిస్తుంది

రెండో ప్రోలరాజు (క్రీ.శ. 1116-1157)-

  • దుర్గరాజు అనంతరం సింహాసన మధిష్టించినాడు. ప్రోలరాజుకు 'మహామండలేశ్వర' బిరుదు ఉండేది.
  • మొదటి కాకతీయులలో ప్రోలరాజు- 2 సుప్రసిద్ధుడు
  • ప్రోలరాజు రాజకీయ విజయాలను హనుమకొండ శాసనం వివరిస్తుంది.
  • 1139లో కళ్యాణి చాళుక్య రాజు మూడో సోవమేశ్వరుడు మరణించిన తరువాత రెండో ప్రోలరాజు రాజ్య విస్తరణకు పూనుకున్నాడు.
  • తెలంగాణ, తీరాంధ్రంలోని కొన్ని ప్రాంతాలను రెండో ప్రోలరాజు ఆక్రమించినాడు.

ప్రోల రాజు నిర్మించిన దేవాలయాలు:

  • స్వయాంభుదేవాలయం (ఓరుగల్లు కోటలో)
  • సిద్దేశ్వర దేవాలయము
  •  పద్మాక్షి దేవాలయము

  • ఓరుగల్లును దుర్భేద్యమైన దుర్గంగా రూపొందించడానికి 2వ ప్రోలరాజు పునాదులు వేసినాడు. ఈ విషయం చింతలూరి  తామ్ర శాసనం ద్వారా తెలుస్తుంది.
  • ఇతని మంత్రియైన బేతనామాత్యుడు జైనమతాభిమాని. బేతన భార్య మైలమ అనుమకొండలో కడలాలయ జైన  బసదిని 1118లో నిర్మించింది
  • ప్రోలరాజు తీరాంధ్రంలో కోట వంశానికి చెందిన చోడయరాజు చేతిలో మరణించినట్లు ద్రాక్షారామ, పిటాపురం శాసనాలు తెలుపుతున్నాయి

రుద్రదేవుడు  (క్రీ.శ. 1158-1196):-

  • రుద్రదేవుడు రెండో ప్రోలరాజు జేష్ట పుత్రుడు
  • హనుమకొండ శాసనము రుద్రదేవుని ఘనవిజయాలను పేర్కొంటున్నది. ఇతడు గణపవరం శాసనం కూడా వేయించినాడు
  • ఇతడు కళ్యాణి చాళుక్యుల నుండి 1163లో స్వాతంత్రాన్ని ప్రకటించుకున్నట్లు హనుమకొండ శాసనం వివరిస్తుంది 
  • హనుమకొండ శాసనాన్ని అచితేంద్రుడు రచించినాడు.
  • రుద్రదేవున్ని మొదటి ప్రతాపరుద్రుడు అని కూడా అంటారు.
  • 1182లో జరిగిన పల్నాటి యుద్దంలో రుద్రదేవుడు నలగామ రాజుకు సైనిక సహాయం చేసినాడు
  • ధరణి కోటను ఆక్రమించిన కోట సేనానికి రుద్రదేవుడు 'కోటగెల్పాట' బిరుదునిచ్చాడు.
  • ఇతడు కొండ పడమటి నాయకులను జయించి త్రిపురాంతకం వరకు తన రాజ్యాన్ని విస్తరింపజేసాడని త్రిపురాంతక శాసనం పేర్కొన్నది
  • రుద్రదేవుడు దేవగిరి యాదవ పాలకుడైన జైత్రపాలునితో జరిగిన యుద్ధంలో మరణించినాడు
  • ఈ విషయం యాదవరాజుల ఆస్థాన కవియైన హేమాద్రి తన చతుర్వర్ణ సార గ్రంథం 'ప్రతఖండం' బాగంలో పేర్కొన్నాడు
  • రుద్రదేవుని రాజధాని ఓరుగల్లు అని 1195 నాటి బెక్కలు శాసనం తెలిపింది.
  • ఓరుగల్లు నగర నిర్మాత రుద్రదేవుడని కొలని గణపతిదేవుని శివ యోగ శాస్త్రం తెలుపుతుంది.
  • రుద్రదేవుడు కవి, కవిపోషకుడు, విధ్యావంతులకు రుద్రదేవుడు కల్పతరువు వంటి వాడని క్రీ.శ. 1195 నాటి పిల్లలమర్రి  నాయరెడ్డి శాసనం తెలుపుతుంది
  • ద్రాక్ష రామ  శాసనము రుద్రదేవుని వినయ విభూణుడని తెలుపుతుంది.
  • రుద్రదేవుడు సంస్కృత బాషలో 'నీతిసారం' అనే గ్రంథం రచించినాడు 
  • ఇతనికి 'విధ్యాభూషణ' అనే బిరుదుండేది.
  • బద్దెన రచించిన 'నీతి శాస్త్రముక్తావళి' ని అనుసరించి రుద్రదేవుడు 'నీతిసారం' అనే గ్రంథాన్ని రచించినట్లు తెలుస్తుంది.
  • రుద్రదేవుని మంత్రి గంగాధరుడు వైష్ణవాభిమాని, స్మార్త బ్రాహ్మణుడు
  • గంగాధరుడు అనుమకొండలో ప్రసన్నకేశవాలయాన్ని, గంగ చియ చెరువును నిర్మించినాడు. ఇతడు బుద్ద దేవాలయాన్ని కూడా నిర్మించినట్లు తెలుస్తుంది.
  • రుద్రదేవుడు అనుమకొండలో రుద్రేశ్వరాలయం (1000స్రంభాల గుడి) అనే త్రికూటాలయం (శివుడు, వాసుదేవుడు..సూర్యుడు)ను క్రీ.శ. 1163లో నిర్మించినాడు.
  • రుద్రేశ్వరాలయ పోషణకు గాను మద్ది చెఱువుల గ్రామాన్ని రుద్రదేవుడు దానంగా ఇచ్చినాడు.
  • తన తండ్రి ప్రోలరాజు మరియు తాను సాధించిన విజయాలను వర్ణిస్తూ ఒక విజయశాసనాన్ని క్రీ.శ. 1163 జనవరి 19న రుద్రదేవుడు వేయించినాడు.
  • రుద్రుడు పానుగంటిని జయించిన చిహ్నంగా అక్కడ తన పేరుతో రుద్రసముద్ర మనే  ఒక చెరువు తవ్వించినాడు
  • రుద్రదేవుని కాలంలోనే జైన, శైవ సంఘర్షణలు ప్రారంభమయినాయి.
  • జైనాచార్యుడైన ఉపమన్యముని రుద్రదేవుని పై అతని సోదరుడు మహాదేవునిచే తిరుగుబాటు చేయించినట్లును రుద్రుదాతనిని క్షమించినట్లుగా స్థానిక చరిత్రలు పేర్కొంటున్నాయి

  • వైదిక మతంతో వర్ణ ధర్మాలతో శైవానికి పొత్తు కుదిర్చి ప్రచారం చేసిన మల్లికార్జున పండితారాధ్యుడు రుద్రదేవుని సమకాలికుడు

  • దేవగిరి యాదవ రాజైన జైతుగి (జైత్రపాలుని) తో జరిగిన యుద్ధంలో రుద్రదేవుడు మరణించాడు.

మహా దేవుడు (క్రీ. శ. 1196-1199):-

  • రుద్రదేవునికి సంతానం లేనందువల్ల , అతని తమ్ముడు మహాదేవుడు రాజైనాడు.
  • రుద్రదేవుడు రాజ్యాన్ని తన తమ్ముడైన మహాదేవునికి అప్పగించినట్లు రుద్రదేవుని ఖండవల్లి తామ్రశాసనం తెలుపుతుంది.
  • మహాదేవుడు గొప్ప శైవమతాభిమాని అయి దృవేశ్వర పండితుడనే తైవాచార్యుని వల్ల ఆరాధ్యశైవ మతాన్ని స్వీకరించినాడు.
  • మహాదేవుడు తన అన్న మరణానికి కారణమైన జైత్రపాలుని పై ప్రతీకారం తీర్చుకునేందుకు దేవగిరి పై దండయాత్ర చేసినాడు
  • అక్కడ జరిగిన యుద్ధంలో మహాదేవుడు మరణించగా, అతని కుమారుడు గణపతిదేవుడు యాదవులకు బందీగా చిక్కినాడు
  • ఇటీవల లభ్యమైన చింతలూరి తామ్రశాసనం దేవగిరి రాజైన జైతుగి తన కుమార్తె అయిన సోమలదేవిని కాకతి గణపతి దేవునికిచ్చి పెళ్ళి చేసి కాకతీయ రాeజ్యానికి రాజుగా పంపించినట్లు తెలుస్తుంది.
  •  దీనికి వివిద రాజకీయ కారణాలున్నాయి
  • మహాదేవునికి గణపతి తో పాటు మైలాంబిక, కదాంబిక అనే ఇద్దరు కుమార్తెలున్నారు
  • వీరిద్దరిని నతవాడి పాలకుడైనా రుద్రరాజు కిచ్చి పెళ్లి చేసినాడు.
  • యాదవ రాజైన జైతుగి ఓరుగల్లు రాజ్యానికి రాజుగా గణపతి దేవున్ని నియమించినట్లు సింగన వేయించిన బహాల్శా సనం ద్వారా తెలుస్తుంది.

No comments:

Human Body

 మానవ శరీరం గురించి మనం మానవ శరీరాన్ని మైక్రోస్కోపిక్ స్థాయిలో "విచ్ఛిన్నం" చేస్తే, కణం దాని అత్యంత ప్రాథమిక యూనిట్‌గా ఉంటుంది. సగ...