కాకతీయులు పార్ట్ 2
గణపతిదేవుడు (క్రీ.శ. 1199-1262): -
- ఈ రాజుకు సంబంధించిన తొలి శాసనం 1199 డిసెంబరు 26 నాటి మంథేన శాసనం. ఇది గణపతి దేవుని పాలనాకాలాన్ని తెలుపుతుంది. ఈ శాసనంలో ఇతడిని సకల దేశ ప్రతిష్టాపనాచార్య అని కీర్తించింది
- గణపతిదేవుడు కాకతీయ పాలకుల్లో గొప్పవాడు. ఇతని రాజ్యము కంచి వరకు విస్తరించింది.
- ఇతడు దీర్ఘకాలం 63 సంత్సరాలు పాలించినాడు.
- గణపతిదేవుడు దేవగిరి యాదవుల దగ్గర బందీగా ఉన్న కాలంలో కాకతీయ రాజ్యంలో అలజడి చెలరేగి సామంతులు తిరుగుబాటు చేసినారు
- కాకతీయ సేనాని రేచర్లరుద్రుడు కాకతీయ రాజ్యాన్ని ఆ విపత్తు నుండి రక్షించి రాజ్యాన్ని గణపతిదేవునికి అప్పగించాడు
- అందువల్ల రేచెర్ల రుద్రుడు 'కాకతీయరాజ్య భార దౌరేయుడుగా 'కాకతిరాజ్య సముర్ధుడుగా' కీర్తింపబడినాడు
- బలమైన రాజకీయ కారణాల వల్ల యాదవరాజలు గణపతిదేవుడిని కారాగారము నుండి విడుదల చేసినారు .
- గణపతి దేవుడు రాజ్య విస్తరణలో బాగంగా తీరాంద్రం పైకి వెళ్ళినాడు.
- దివి సీమను జయించి నందుకు గాను తన సేనాని ముత్యాల చౌండ రాయనికి గణపతిదేవుడు 'ద్వీపీలుంటాక దివిచూరకార బిరుదులను ఇచ్చి గౌరవించినట్లు పెండెకల్లు శాసనము తెలిపింది
- దివిసీమ పాలకుడైన పిన్నచోడి కుమార్తెలైన నారమ, పేరమ లను వివాహాం చేసుకుని, వారి సోదరుడైన జాయపను తన సైన్యంలో గజ సాహిణిగా నియమించినాడు.
- గణపతి దేవునికి అతని భార్య అయిన సోమలదేవికి ఇద్దరు కుమార్తెలున్నారు
- గణపాంబ భర్త కోట బేతరాజు (ధరణికోట పాలకుడు)
- రుద్రాంబ భర్త వీరభద్రుడు (నిడుదవోలు చాళుక్యరాజు)
గణపతి దేవుని బిరుదులు:-
- ఆంధ్రాధీశుడు
- క్రీడావినోద
- చోడకటక చూరకార,
- సకలదేశ ప్రతిష్టాపనాచార్య,
- పృధ్వీశ్వర
- చోదకటకటా చూరకార
- మహామండలేశ్వర
- సమధిగత పంచమహాశబ్ధ
- గణపతి దేవుడు విదేశీ వర్తకులకు అభయమిస్తూ మోటుపల్లి అభయశాసనం క్రీ.శ. 1244లో వేయించారు
- మోటుపల్లిని దేశీయ కొండ పట్టణం అనేవారు.
- అభయశాసనం ను అమలు చేయుటకు సిద్ధయ్యదేవుడిని నియమించినాడు.
- గణపతిదేవుడు తన రాజధానిని హనుమకొండ నుండి ఓరుగల్లుకు 1254లో మార్చినాడు.
- రుద్రదేవుని కాలంలో ప్రారంభమైన ఓరుగల్లు కోట నిర్మాణము గణపతి దేవుని కాలంలో పూర్తయింది
- ఓరుగల్లు కోటలో రాతికోటను, మట్టికోటను రెండింటిని కట్టించాడు. కోటకు 77 బురుజులుండేవి
- ఒక్కొక్క బురుజు ఒక్కొక్క సామంత నాయకుని రక్షణలో ఉండేది.
- ఓరుగల్లు కోటకు నాలుగు వైపుల నాలుగు శిలానిర్మితాలు నిర్మించాడు.
- గణపతిదేవునికి గల 'రాయగజకేసరి' బిరుదు అతని నాణిల పైన కన్పిస్తున్నది, ధాన్యము కొలతకు సంబందించిన కేసరిపుట్ట గణపతి దేవుని పేరున వ్యాపించింది కేసరి మాడలు మరియు కేసరి పుట్టు నాడు వ్యాప్తిలో ఉండేవి.
- ఓరుగల్లు కోటలోని స్వయంబుదేవుని గుడికి ఎదురుగా గుండు వంటి కోట కలదు దీనిని ఏకశిల అని, తెలుగులో ఒంటి కొండ అని వ్యవహరిస్తారు. ఆందువల్ల ఈ సగరాన్ని ఏకశిలానగరమని, ఓరుగల్లు నగరమని పెర్కొంటారు
- గంగయసాహిణీ ప్రతిభను గుర్తించిన గణపతిదేవుడు అతనిని బాహత్తర నియోగాధిపతి (72 నియోగాల పర్యవేక్షకుడుగా తన ఆస్థానంలో నియమించినట్లు క్రీ॥శ 1250 నాటి త్రిపురాంతకం శాసనం వివరిస్తుంది
- గంగయ సాహిణీ నల్లగొండ దగ్గర ఉన్న పానుగల్లు నుండి కడపజిల్లా వల్లూరు వరకు గల రాజ్యానికి అధికారిగా నియమించబడినాడు
గణపతిదేవుని కాలం నాటి అధికారులు:-
- గంగయ సాహిణి : అశ్వదళాధికారి
- జాయపసేనాని : గజదళాధిపతి
- రేచెర్ల రుద్రుడు : సైన్యాధిపతి
- గణపతిదేవుడు వ్యవసాయానికి నీటిపారుదల సౌకర్యాలు కల్పిస్తూ నూతన తటాకాలు (చెరువులు) నిర్మించినాడు
చెరువులు:
- రామప్పచెరువు
- పాకాల చెరువు,
- లకనవరం చెరువు,
- బయ్యారం చెరువు (మైలాంబ)
- చౌడ సముద్రం
- ఈ చెరువును మల్యాల చౌడ సేనాని నిర్మించినాడు
- గణపతి దేవుని గజసాహిణి అయిన జాయపసేనాని గొప్ప కవి. ఆయన 'నృత్యరత్నావళి' గీతరత్నావళి 'వాద్యరత్నావళి అనే గ్రంథాలను రచించాడు.
- జాయప రచించిన 'నృత్యరత్నావళి' నాటి భారతదేశ నాట్యశాస్త్ర గ్రంథాలలో ఉత్తమమైనది
- గణపతిదేవుని శివదీక్షా గురువు గోళకీమఠానికి చెందిన విశ్వేశ్వర శంభూ అను ప్రసిద్ద శైవాచార్యుడు
- ఆయన దగ్గర గణపతిదేవుడు శివదీక్షను పొందినాడు. విశ్వేశ్వర శివుడు శ్రీశైలం, పుష్పగిరి, మల్కాపురం, ద్రాక్షారామం , కాళేశ్వరం మొదలైన ప్రాంతాలలో గొళ కీ మఠాలు స్థాపించినాడు
- విశ్వేశ్వర శివునికి గణపతి దేవుడు కాండ్రకోట గ్రామాన్ని దానంగా ఇచ్చినాడు
- గణపతిదేవుని సేనాని అయిన రేచెర్ల రుద్రుడు పాలంపేటలో 'రామప్పదేవాలయాన్ని క్రీ॥|శ॥ 1213లో నిర్మించినాడు
- గణపతిదేవుడు సహస్ర లింగాలయమును రాజధానిలో నిర్మించినాడు.
- జటావర్మ సుందర పాండ్యుడు కీ.శ. 1262లో నెల్లూరు దగ్గర జరిగిన ముత్తుకూరు యుద్ధంలో కాకతీయులను ఓడించినాడు
- ముత్తుకూరు యుద్ధంలో మినహాయిస్తే గణపతి దేవుడు పరాజయం తెలియని గొప్ప చక్రవర్తి
- గణపతి దేవునికి పుత్ర సంతానం లేనందున తన రెండో కుమార్తె అయిన రుద్రమకు పురుషోచిత విధ్యలు నేర్పి తనకు వారసురాలుగా నిర్ణయించినాడు.
- రుద్రమదేవి రుద్రదేవ మహారాజు పేరిట సింహాసన మధిష్టించింది.
- బిరుదులు
- రాయగజకేసరి
- రుద్ర మహారాజు
- రుద్రమదేవికి వ్యతిరేకంగా ఆమె సవతి సోదరులైన హరిహర మురారి దేవులు తిరుగు బాటు చేసారని ప్రతాప చరిత్ర పేర్కొన్నది.
- రుద్రమదేవి తెలంగాణను పాలించిన మొట్ట మొదటి స్త్రీ పాలకురాలు
- రుద్రమదేవి తన మద్దతు దారులైన కాయస్తనాయకులు, ప్రాసాదాదిత్యుని సహాయంతో వారి తిరుగు బాటును అణచి వేసింది
- ప్రసాదాదిత్యునికి 'కాకతీయ రాజ్యస్థాపనా చార్య' రాయపితా మహాంక అనే బిరుదులు లభించాయని వెలుగోటి వారి వంశావళి అనే తెలుగు చారిత్రక గ్రంథం పేర్కొన్నది
- దేవగిరి యాదవ మహాదేవుడు ఓరుగల్లు పై దండెత్తి రాగా రుద్రమదేవి. అతడిని ఓడించి దేవగిరి వరకు తరిమింది. బీదర్ కోటను స్వాదీనం చేసుకుని అక్కడ శాసనం వేసింది (బీదర్ శాసనం)
- దేవగిరి మహాదేవుడు రుద్రమదేవితో సంధిచేసుకుని పెద్ద ఎత్తున ధనాన్ని స్వాదీనం చేసినట్లు ప్రతాప చరిత్ర తెలుపుతుంది
- దేవగిరి యాదవుల నాణేలు తెలంగాణలోను ,కృష్ణాజిల్లా రాచపట్నంలోను లభించాయి.
- రుద్రమదేవి బీదర్ శాసనం యాదవుల (సెవణుల) దండయాత్ర గురించి వివరించింది.
- దేవగిరి యాదవుల పై విజయం సాధించిన సందర్భంలో రుద్రమదేవి 'రాయగజకేసరి' బిరుదును ధరించింది.
- స్వయాంబు దేవాలయానికి రంగ మండపాన్ని నిర్మించింది
- రాజ్య దక్షిణ బాగంలో తిరుగుబాటు చేసిన కాయస్త అంబదేవుడిని అణచడానికి రుద్రమదేవి ఆమె సేనాధిపతి మల్లికార్జున నాయకుడు త్రిపురాంతకానికి వెళ్ళారు
- అక్కడ జరిగిన యుద్ధంలో రుద్రమదేవి, ఆమె సైన్యాధిపతి మరణించినట్లు ఇటీవల లభించిన చందుపట్ల (నలగొండ జిల్లా ) శాసనం (క్రీ. శ. 1289, నవంబరు 27) ద్వారా తెలుస్తుంది
- చందుపట్ల శాసనాన్ని కాకతీయ సైనికుడు అయిన పువ్వుల ముమ్మడి వేయించినాడు. రుద్రమదేవి సైన్యంలో నాయంకర విధానాన్ని ప్రవేశ పెట్టింది
- ఓరుగల్లు కోటకు మరమ్మత్తులు చేయించి రాతి కోటకు లోపలి వైపున మెట్లు కట్టించింది
- రుద్రమదేవి పాలనాకాలంలో వెనీస్ (ఇటలీ) యాత్రికుడైన మార్కోపోలో కాకతీయ రాజ్యాన్ని దర్శించినాడు. ఆయన మోటుపల్లి ఓడరేవును దర్శించి వాణిజ్యం పరిశ్రమలు మరియు పరిపాలన గూర్చి వివరించినాడు.
రుద్రమదేవి శాసనాలు:
1మలకాపురం శాసనం
2) బీదర్ కోట శాసనం
రుద్రమదేవి కుమారైలు:-
- ముమ్మడమ్మ - భర్త మహాదేవుడు (కాకతీయ వంశం) వీరి పుత్రుడు ప్రతాపరుద్రుడు
- రుద్రమ - భర్త ఎల్లణదేవుడు (యాదవ వంశీయుడు)
- రుయ్యమ - భర్త ఇందులూరి అన్నయ మంత్రి
- రుద్రమదేవి తన పెద్ద కుమారై పుత్రుడైన ప్రతాపరుద్రుని దత్తత స్వీకరించి తనకు వారసునిగా ప్రకటించింది.
ప్రతాపరుద్రుడు (క్రీ.శ.1289-1323):-
- ప్రతాపరుద్రుడు రుద్రమదేవి మనుమడు. ఇతనినే రెండవ ప్రతాపరుద్రుడు అంటారు
- ఇతడు కాకతీయులలో చివరి పాలకుడు.
- ఇతడు కుమార రుద్రుడు, వీరభద్రుడు అనే పేర్లతో రుద్రమదేవి కాలంలోనే రాజ్యవ్యవహారాలను నిర్వహించినాడు
- ప్రతాపరుద్రుడు త్రిపురాంతకం పై దండెత్తి అంబదేవుని ఓడించి, దక్షిణ ప్రాంతాన్ని ఆక్రమించినాడు
- అడవులను పంటపోలాలుగా మార్చి, నీటి పారుదల సౌకర్యాలు కల్పించినాడు
- రాయలసీమ ప్రాంతంలో అనేక నూతన గ్రామాలను ప్రతాపరుద్రుడు నిర్మించినాడు
- ప్రతాపరుద్రుని ఆస్థానంలో మాచల్దేవి అనే పేరిణి నృత్యకారిణి ఉండేది.
- నాయంకర వ్యవస్థను పటిష్ట పరిచి 77 మంది నాయకులను నియమించినాడు
- ఈ నాయకులలో ఎక్కువ మంది వెలమనాయకులు
- ఢిల్లీ పాలకుడు అయిన అల్లా ఉద్దీన్ ఖిల్డీ క్రీ.శ. 1303లో ఓరుగల్లు పైకి తన సైన్యాన్ని పంపించాడు
- ఈ ముస్లిం దండయాత్రను వెలమనాయకుడు అయిన వెన్నడు, పోతుగంటి మైలి నాయకత్వంలో కాకతీయ సైన్యాలు కరీంనగర్ జిల్లా ఉష్ణరపల్లి వద్ద ఎదుర్కొని ఓడించి వెనుకకు మల్లించినట్లు వెలుగోటి వారి వంశావళి పేర్కొన్నది
- క్రీ.శ. 1310లో అల్లాఉద్దీన్ ఖిల్డి సైన్యాదిపతి ఆయిన మాలిక్ కాఫర్ ఓరుగల్లు పై దండయాత్ర చేయగా, ప్రతాపరుద్రుడు లొంగిపోయి, సంధిచేసుకుని కప్పం చెల్లించినాడు
- క్రీ.శ. 1323లో జునాఖాన్ (మహమ్మద్ బీన్ తుఘ్లక్) ఓరుగల్లు పై దండెత్తి ప్రతాపరుద్రుని ఓడించి ఖాదిర్ ఖాన్ ఖ్వాజాహాజీ పర్యవేక్షణలో ఢిల్లీకి బందీగా తీసుకుపోయినారు. ఈ విషయము ఇసామీ, సిరాజ్ అఫీస్ రచనలు తెలుపుతున్నాయి
- కాని మార్గమధ్యంలో నర్మదానది (సోమోద్యవ) తీరంలో ప్రతాపరుద్రుడు ఆత్మహత్యకు పాల్పడినట్లు ప్రోలయనాయకుని విలస శాసనం, రెడ్డిరాణి అని తల్లి కలువ చేరు తామ్ర శాసనం (క్రీ.శ. 1423) తెలుపుతున్నాయి
- దీనితో కాకతీయ సామ్రాజ్యం పతనమయింది.
- కాకతీయ సామ్రాజ్యం డిల్లీ రాజ్యంలో అంతర్భాగమయింది.
- మహమ్మద్ బీన్ తుగ్లక్ ఓరుగల్లుకు సుల్తాన్పూర్ అని పేరు పెట్టినాడు
No comments:
Post a Comment