Wednesday, 26 June 2019

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అప్పు 2 లక్షల 49వేల కోట్లు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అప్పు 2018-19 ఆర్థిక సంవత్సరం నాటికి రూ.2,49,435 కోట్లుగా ఉందని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. రాజ్యసభలో జూన్ 25న కాంగ్రెస్ ఎంపీ కేవీపీ రామచంద్రరావు అడిగిన ప్రశ్నకు ఆమె ఈ మేరకు సమాధానం ఇచ్చారు. 2015 మార్చి నాటికి రూ.1,48,743 కోట్లున్న అప్పు 67 శాతం పెరుగుదలతో 2018-19 బడ్జెట్ అంచనాల నాటికి రూ.2,49,435 కోట్లకు చేరిందని నిర్మలా పేర్కొన్నారు. ఇందులో రెండు రాష్ట్రాల మధ్య విభజించని అప్పు రూ.23,438 కోట్లు కూడా కలిసి ఉంది. ఆంధ్రప్రదేశ్‌కు ద్రవ్య బాధ్యత, విత్త నిర్వహణ (ఎఫ్‌ఆర్‌బీఎం) పరిధిని మించి 2016-17లో ఉదయ్ స్కీమ్ ద్వారా రూ.8,256 కోట్లు అప్పు తెచ్చుకునేందుకు అనుమతి ఇచ్చినట్టు కేంద్రమంత్రి నిర్మలా తెలిపారు. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం-2014 కింద మూడేళ్లలో ఏపీకి రూ.7,891 కోట్ల నిధులు విడుదల చేసినట్టు వెల్లడించారు. 

No comments:

ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ 2025: పూర్తి విజేతల జాబితా, ముఖ్యాంశాలు & ముఖ్య క్షణాలు

  Category Winner(s) Film Best Film – Laapataa Ladies Best Director Kiran Rao Laapataa Ladies Best Actor in Leading Role (Male) Abhishek Bac...