Tuesday, 25 June 2019

శాశ్వత నివాస పథకం

 సంపన్నులైన విదేశీయులను ఆకర్షించాలని  సౌదీ అరేబియా ప్రభుత్వం ఒక  సరికొత్త  పథకాన్ని ప్రకటించింది. దాని పేరు శాశ్వత నివాస అనుమతి పతకం ..ఇంధనేతర ఆదాయాన్ని పెంచుకోవాలనే ఉద్దేశ్యంతో   ఈ పథకాన్ని ప్రకటించినట్లు భావిస్తున్నారు. కొత్త పథకంలో భాగంగా సుమారు రూ.21 కోట్లు (8 లక్షల రియాళ్లు లేదా 2.13 లక్షల అమెరికా డాలర్లు) చెల్లిస్తే సౌదీలో శాశ్వత నివాస అనుమతి పొందగలరని సౌదీ ప్రభుత్వం తెలిపింది . రూ.27 లక్షలు (లక్ష రియాళ్లు లేదా 27వేల అమెరికా డాలర్లు) చెల్లిస్తే ఒక  సంవత్సరం ఉండేందుకు అనుమతి లభిస్తుంది. తర్వాత పునరుద్ధరించుకోవాల్సి ఉంటుంది. సౌదీ ప్రాయోజకులు లేని విదేశీయులకు, సౌదీలో వ్యాపారం చేసుకోవాలనుకునేవారికి, ఆ దేశంలో స్థిరాస్తులు కొనడంతో పాటు.. బంధువులకు ప్రాయోజిత వీసాలు సమకూర్చుకోవడానికి ఈ పథకం ఉపయోగపడుతుందని  భావిస్తున్నారు.

No comments:

ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ 2025: పూర్తి విజేతల జాబితా, ముఖ్యాంశాలు & ముఖ్య క్షణాలు

  Category Winner(s) Film Best Film – Laapataa Ladies Best Director Kiran Rao Laapataa Ladies Best Actor in Leading Role (Male) Abhishek Bac...