Friday, 2 August 2019

రవీష్‌కుమార్‌

ఆసియా నోబెల్‌గా అభివర్ణించే ప్రతిష్ఠాత్మక పురస్కారం రామన్‌ మెగసెసె అవార్డు 2019 సంవత్సరానికి గానూ భారత్‌కు చెందిన ప్రముఖ జర్నలిస్టు రవీష్‌కుమార్‌ ఎంపికయ్యారు. ఈ ఏడాది ఈ అవార్డు మొత్తం ఐదుగురికి లభించింది. అందులో రవీష్‌కుమార్ ఒకరు. ఫిలిప్పీన్స్‌ రాజధాని మనీలాలో సెప్టెంబరు 9న ఈ పురస్కారాన్ని ప్రదానం చేయనున్నారు.ఎన్డీటీవీలో ప్రసారమయ్యే రవీష్‌ కుమార్‌ కార్యక్రమం ‘ప్రైమ్‌ టైమ్‌ షో’ ఎంతో ప్రజాదరణ పొందింది. నిస్సహాయుల గళాన్ని చాటిచెప్పడానికి రవీష్‌కుమార్‌ జర్నలిజాన్ని ఉపయోగించుకుంటున్నారని రామన్‌ మెగసెసె అవార్డు ఫౌండేషన్‌ అభిప్రాయపడింది. అలాగే ‘‘నైతికత, నిబద్ధతతో అత్యున్నత ప్రమాణాలతో తన వృత్తిని నిర్వహించడం; స్వాతంత్ర్యం, నిజం, సమగ్రత కోసం నైతిక ధైర్యంతో పోరాడడం; స్వరం లేని నిస్సహాయుల గళంగా మారడం; ప్రజాస్వామ్య లక్ష్యాల్ని చేరుకోవడం కోసం ఆయన సూత్రప్రాయమైన నమ్మకం’’ లాంటి లక్షణాలకు గుర్తింపుగా ఈ అవార్డును రవీష్‌ కుమార్‌కు ప్రదానం చేస్తున్నట్లు ఫౌండేషన్‌ పేర్కొంది. ఈ అవార్డును ఫిలిప్పీన్స్ మాజీ అధ్యక్షుడు రామన్ మెగసెసె జ్ఞాపకార్థం 1957లో ఏర్పాటు చేశారు. దీన్ని ఆసియా నోబెల్‌గా అభివర్ణిస్తారు. ప్రతి సంవత్సరం రామన్ మెగసెసె ఫౌండేషన్.. ప్రభుత్వ సేవలు, ప్రజా సేవ, సామాజిక నాయకత్వం, జర్నలిజం, సాహిత్యం, సృజనాత్మకత, ప్రపంచ శాంతి, అత్యుత్తమ నాయకత్వ లక్షణాలు లాంటి అంశాల్లో ప్రతిభ చూపించేవారికి ఈ అవార్డును ప్రదానం చేస్తారు.

No comments:

Human Body

 మానవ శరీరం గురించి మనం మానవ శరీరాన్ని మైక్రోస్కోపిక్ స్థాయిలో "విచ్ఛిన్నం" చేస్తే, కణం దాని అత్యంత ప్రాథమిక యూనిట్‌గా ఉంటుంది. సగ...