ఇండోనేసియాలో భారీ భూకంపం సంభవించింది. యందేనా ఐలాండ్‌లోని సోంలకీ సముద్ర తీరం వద్ద సంభవించిన ఈ భూకంపం తీవ్రత రిక్టర్ స్కెల్ పైన 7.5గా నమోదైంది. ఆదివారం రాత్రి 10.05 గంటల సమయంలో ఇది సంభవించినట్లు . ఇండోనేసియా ప్రభుత్వం తెలిపింది ఇండోనేసియా ప్రభుత్వ వివరాల ప్రకారం యాంబన్ దక్షిణాన 321కిలోమీటర్ల దూరంలో బండా సముద్ర తీరం వద్ద భూమికి 214కి.మీ లోపల భూకంప కేంద్రం ఉన్నట్లు గుర్తించారు. 30క్షణాల కంటే ఎక్కువగా ఈ ప్రకంపనలు వచ్చాయి. దీంతో ప్రజలందరూ ఒక్కసారిగా ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. అక్కడ సునామీ సంభవించే అవకాశం కూడా ఉందని ప్రభుత్వం తెలిపింది.
Tuesday, 25 June 2019
ప్రపంచకప్‌లో తాహిర్ సరికొత్త రికార్డు
ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికా స్పిన్ బౌలర్ ఇమ్రాన్ తాహిర్ నూతన రికార్డు సృష్టించాడు. ప్రతిష్ఠాత్మక లార్డ్స్ మైదానంలో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో తాహిర్ రెండు వికెట్లు తీయడంతో దక్షిణాఫ్రికా జట్టు తరఫున ఐసీసీ ప్రపంచకప్‌ల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు. ప్రపంచకప్ టోర్నీల్లో మొత్తం 40 వికెట్లు తీశాడు . అంతకుముందు అలెన్ డొనాల్డ్ 39 వికెట్లు తీసి 2003 ప్రపంచకప్ తర్వాత రిటైర్డయ్యాడు. దీంతో అతడి రికార్డుని తాహిర్ అధిగమించాడు.
ప్రత్యేకహోదా ఏ రాష్ట్రానికీ ఇచ్ఛేది లేదు: కేంద్రం
లోక్‌సభలో బిహార్‌కు చెందిన జేడీ (యూ) ఎంపీ కౌసలేంద్ర కుమార్ అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లిఖిత పూర్వకంగా సమాధానమిచ్చారు అందులో ఏ రాష్ట్రానికీ ప్రత్యేకహోదా ఇచ్చే అంశం పరిశీలనలో లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇప్పటివరకు ఏపీ, తెలంగాణ, బిహార్, ఝార్ఖండ్, చత్తీస్‌గఢ్, ఒడిశా, రాజస్థాన్ రాష్ట్రాలు ప్రత్యేకహోదా కోసం విజ్ఞప్తి చేశాయని ఆమె తెలిపారు .
ఏపీకి ప్రత్యేకహోదా ఇవ్వాలంటూ భాజపా మినహా దాదాపు అన్ని రాజకీయ పార్టీలు కోరుతున్నా ఇటీవల దిల్లీలో జరిగిన నీతి ఆయోగ్ సమావేశంలోనూ ఈ అంశాన్ని ప్రధాని మోదీ, కేంద్ర మంత్రుల దృష్టికి సి ఎం జగన్ మోహన్ రెడ్డి తీసుకెళ్లినా ప్రయోజనం కనిపించడం లేదు
Sunday, 9 June 2019
థెరెసా రాజీనామా
అధికార కన్జర్వేటివ్ పార్టీ (టోరీ) నాయకురాలిగా బ్రిటన్ ప్రధాని థెరెసా మే శుక్రవారం రాజీనామా చేశారు. తదుపరి వ్యక్తి బాధ్యతలు చేపట్టే వరకు ప్రధాని పదవిలో కొనసాగనున్నారు. బ్రెగ్జిట్ వ్యవహారంలో తన విధానాలకు మద్దతు లభించకపోవడంతో ప్రధాని పదవికి రాజీనామా చేస్తానని ఆమె గత నెల 23నే ప్రకటించడం గమనార్హం. అందులో భాగంగా తొలుత కన్జర్వేటివ్ పార్టీ నాయకురాలి పదవికి రాజీనామా చేశారు.
స్కిల్‌ఇండియా-2019 అవార్డు
తెలంగాణలోని నేషనల్ అకాడమి ఆఫ్ కన్‌స్ట్రక్షన్ (న్యాక్)ను జాతీయస్థాయి అవార్డు లభించింది . ఉపాధి కల్పనలో దేశంలోనే నంబర్‌వన్‌గా నిలిచినందుకు స్కిల్‌ఇండియా-2019 అవార్డును కైవసం చేసుకొన్నది. జార్ఖండ్‌లోని రాంచిలో ది అసోసియేటెడ్ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఇన్ ఇండి యా (అసోచామ్) ఆధ్వర్యంలో జరిగిన అవా ర్డు ల ప్రదానోత్సవంలో ఆ రాష్ట్ర పౌరసరఫరాలశాఖ మంత్రి సరయురాయ్, రవాణా, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి సీపీ సింగ్ చేతులమీదుగా న్యాక్ డైరెక్టర్ జనరల్ కే భిక్షపతి అవార్డు అందుకొన్నారు. శిక్షణతోపాటు 100 శాతం ప్లేస్‌మెంట్‌ను న్యాక్ ద్వారా అందించి నిర్మాణరంగానికి ఊతం ఇచ్చినట్టు న్యాక్ తెలిపింది. రెండేండ్లలో 7,016 మంది నిరుద్యోగ యువతకు నిర్మాణరంగంలో నైపుణ్య శిక్షణ, 965 మంది బీటెక్ సివిల్ ఇంజినీరింగ్ విద్యార్థులకు ఫినిషింగ్ స్కూల్ విభాగంలో శిక్షణ, 133 మంది పీజీ విద్యార్ధులకు నైపుణ్య శిక్షణతో వివిధ నిర్మాణరంగ సంస్థల్లో న్యాక్ ఉపాధిని కల్పించినట్టు పేర్కొన్నది.
ఏపీ మంత్రులకు శాఖల కేటాయింపు
ఏపీ మంత్రులకు శాఖల కేటాయింపు
ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా మంత్రి పదవులు చేపట్టిన 25 మందికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శాఖలు కేటాయించారు. దీనికి గవర్నర్ నరసింహన్ ఆమోదముద్ర వేశారు. ఐదుగురు మంత్రులకు డిప్యూటీ సీఎం హోదా కల్పించారు. ఆళ్ల నాని, అంజాద్ భాషా, నారాయణస్వామి, పిల్లి సుభాష్‌చంద్రబోస్, పుష్పశ్రీవాణిలకు ఉప ముఖ్యమంత్రి హోదా లభించింది. ఈ మేరకు శనివారం సాయంత్రం అధికారిక ఉత్తర్వులు వెలువడ్డాయి.
1. ధర్మాన కృష్ణదాస్- రోడ్లు, భవనాలు
2. బొత్స సత్యనారాయణ- మున్సిపల్, అర్బన్ డెవలప్‌మెంట్
3. పాముల పుష్పశ్రీవాణి- గిరిజన సంక్షేమ శాఖ (డిప్యూటీ సీఎం)
4. అవంతి శ్రీనివాస్- టూరిజం
5. కురసాల కన్నబాబు- వ్యవసాయం
6. పిల్లి సుభాష్‌చంద్రబోస్- రెవెన్యూ, రిజిస్ట్రేషన్, స్టాంపులు (డిప్యూటీ సీఎం)
7. పినిపే విశ్వపరూప్- సాంఘిక సంక్షేమం
8. ఆళ్ల నాని- వైద్య, ఆరోగ్యం (డిప్యూటీ సీఎం)
9. చెరుకువాడ శ్రీరంగనాథరాజు- గృహ నిర్మాణం
10. తానేటి వనిత- మహిళా సంక్షేమం
11. కొడాలి నాని- పౌర సరఫరా, వినియోగదారుల శాఖ
12. పేర్ని నాని- రవాణా, సమాచార శాఖ
13. వెల్లంపల్లి శ్రీనివాస్- దేవాదాయ
14. మేకతోటి సుచరిత- హోం, విపత్తు నిర్వహణ
15. మోపిదేవి వెంకటరమణ- పశు సంవర్థకం, మత్స్య, మార్కెటింగ్
16. బాలినేని శ్రీనివాస్‌రెడ్డి- అటవీ, పర్యావరణం, సైన్స్ అండ్ టెక్నాలజీ
17. ఆదిమూలపు సురేశ్- విద్యా శాఖ
18. అనిల్‌కుమార్ యాదవ్- ఇరిగేషన్
19. మేకపాటి గౌతమ్‌రెడ్డి- పరిశ్రమలు, వాణిజ్యం
20. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి- పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గనులు
21. కళత్తూరు నారాయణస్వామి- ఎక్సైజ్ (డిప్యూటీ సీఎం)
22. బుగ్గన రాజేంద్రనాథ్- ఆర్థిక, ప్రణాళిక, అసెంబ్లీ వ్యవహరాలు
23. గుమ్మునూరు జయరామ్- కార్మిక, ఉపాధి శిక్షణ
24. షేక్ అంజాద్ బాషా - మైనార్టీ సంక్షేమం (డిప్యూటీ సీఎం)
25. మాలగుండ్ల శంకర్ నారాయణ- బీసీ welfare
రోహిణి కమిషన్
వెనుకబడిన వర్గాల్లో (ఓబీసీల్లో) సామాజికంగా అభివృద్ధి చెందిన లేక ఇంకా వెనుకబాటులో ఉన్న కులాలను గుర్తించేందుకు రోహిణి కమిషన్ వాటిని ఏ,బీ,సీ,డీలుగా విభజించే అవకాశం కనిపిస్తున్నది. కేంద్ర జాబితాలోని బీసీలలో ఉప కులాలను వర్గీకరించేందుకు ఏర్పాటైన రోహిణి కమిషన్ ఆయా వర్గాల నుంచి నిరసనలను లేదా అభినందనలను ఎదుర్కోకుండా ఉండేందుకు ఈ మార్గాన్ని ఎంచుకున్నట్టు తెలుస్తున్నది. రిజర్వేషన్లలో సింహభాగాన్ని పొందుతున్న కొన్ని కులాల కారణంగా మరింత వెనుకబాటుకు గురవుతున్న ఇతర బీసీ కులాలను గుర్తించి, వారికి కోటాను నిర్దేశించడమే రోహిణి కమిషన్ లక్ష్యం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఓబీసీలను ఏ, బీ, సీ, డీ, ఈగాను కర్ణాటకలో 1, 2ఏ, 2బీ, 3ఏ, 3బీగా విభజించారు. ఉప కులాలను వర్గీకరించే విషయంలో రోహిణి కమిషన్ ఇదే విధానాన్ని అనుసరించవచ్చు
2019 FIFA మహిళల ప్రపంచ కప్ ఫ్రాన్స్ లో
2019 FIFA మహిళల ప్రపంచ కప్ ఫ్రాన్స్ లో మొదలవుతుంది
2019 FIFA మహిళల ప్రపంచ కప్ యొక్క 8 వ ఎడిషన్, మహిళల జాతీయ జట్లతో పోటీపడుతున్న క్వార్డిన్నియల్ ఇంటర్నేషనల్ ఫుట్ బాల్ ఛాంపియన్ షిప్ 7 జూన్ మరియు 7 జూలై 2019 మధ్య జరుగుతుంది ఈ ఛాంపియన్ షిప్ ఫ్రాన్స్ లోని తొమ్మిది నగరాల్లో జరుగుతుంది. మార్చి 2015 లో, ఫ్రాన్స్ ఈ కార్యక్రమంలో పాల్గొనే హక్కును గెలుచుకుంది, తొలిసారి ఈ టోర్నమెంట్లో ఆతిథ్యమిచ్ఛే మూడవ ఐరోపా దేశం అవుతుంది.
ఆరవ సారి గ్రామీ-విజేత సంగీతకారుడు డాక్టర్ జాన్ మరణం
డాక్టర్ జాన్ అని పిలవబడే ఆరు-సార్లు గ్రామీ-విజేత సంగీతకారుడు మాల్కోమ్ జాన్ రెబెన్నాక్ 77 సంవత్సరాల వయస్సులో మరణించాడు. గాయకుడు-పాటల రచయిత ఐన జాన్ గుండెపోటుతో బాధపడ్డాడు. అతను 1950 వ దశకంలో పియానిస్ట్ గా తన వృత్తిని ప్రారంభించాడు మరియు 1968 లో అతని మొట్టమొదటి ఆల్బమ్ విడుదల తర్వాత ప్రజాదరణ పొందాడు.
Monday, 3 June 2019
Subscribe to:
Posts (Atom)
భారత్ ఫ్యూచర్ సిటీని గ్లోబల్ అర్బన్ హబ్‌గా అభివృద్ధి చేయడానికి యుఎఇ-తెలంగాణ భాగస్వామ్యం
భారత్ ఫ్యూచర్ సిటీని గ్లోబల్ అర్బన్ హబ్‌గా అభివృద్ధి చేయడానికి యుఎఇ-తెలంగాణ భాగస్వామ్యం వరల్డ్ ఎకనామిక్ ఫోరం 2026లో, భారతదేశపు మొట్టమొదటి న...


