Sunday, 9 June 2019

స్కిల్‌ఇండియా-2019 అవార్డు

తెలంగాణలోని నేషనల్ అకాడమి ఆఫ్ కన్‌స్ట్రక్షన్ (న్యాక్)ను జాతీయస్థాయి అవార్డు లభించింది . ఉపాధి కల్పనలో దేశంలోనే నంబర్‌వన్‌గా నిలిచినందుకు స్కిల్‌ఇండియా-2019 అవార్డును కైవసం చేసుకొన్నది. జార్ఖండ్‌లోని రాంచిలో ది అసోసియేటెడ్ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఇన్ ఇండి యా (అసోచామ్) ఆధ్వర్యంలో జరిగిన అవా ర్డు ల ప్రదానోత్సవంలో ఆ రాష్ట్ర పౌరసరఫరాలశాఖ మంత్రి సరయురాయ్, రవాణా, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి సీపీ సింగ్ చేతులమీదుగా న్యాక్ డైరెక్టర్ జనరల్ కే భిక్షపతి అవార్డు అందుకొన్నారు. శిక్షణతోపాటు 100 శాతం ప్లేస్‌మెంట్‌ను న్యాక్ ద్వారా అందించి నిర్మాణరంగానికి ఊతం ఇచ్చినట్టు న్యాక్ తెలిపింది. రెండేండ్లలో 7,016 మంది నిరుద్యోగ యువతకు నిర్మాణరంగంలో నైపుణ్య శిక్షణ, 965 మంది బీటెక్ సివిల్ ఇంజినీరింగ్ విద్యార్థులకు ఫినిషింగ్ స్కూల్ విభాగంలో శిక్షణ, 133 మంది పీజీ విద్యార్ధులకు నైపుణ్య శిక్షణతో వివిధ నిర్మాణరంగ సంస్థల్లో న్యాక్ ఉపాధిని కల్పించినట్టు పేర్కొన్నది.

No comments:

Human Body

 మానవ శరీరం గురించి మనం మానవ శరీరాన్ని మైక్రోస్కోపిక్ స్థాయిలో "విచ్ఛిన్నం" చేస్తే, కణం దాని అత్యంత ప్రాథమిక యూనిట్‌గా ఉంటుంది. సగ...