Sunday, 9 June 2019

రోహిణి కమిషన్

వెనుకబడిన వర్గాల్లో (ఓబీసీల్లో) సామాజికంగా అభివృద్ధి చెందిన లేక ఇంకా వెనుకబాటులో ఉన్న కులాలను గుర్తించేందుకు రోహిణి కమిషన్ వాటిని ఏ,బీ,సీ,డీలుగా విభజించే అవకాశం కనిపిస్తున్నది. కేంద్ర జాబితాలోని బీసీలలో ఉప కులాలను వర్గీకరించేందుకు ఏర్పాటైన రోహిణి కమిషన్ ఆయా వర్గాల నుంచి నిరసనలను లేదా అభినందనలను ఎదుర్కోకుండా ఉండేందుకు ఈ మార్గాన్ని ఎంచుకున్నట్టు తెలుస్తున్నది. రిజర్వేషన్లలో సింహభాగాన్ని పొందుతున్న కొన్ని కులాల కారణంగా మరింత వెనుకబాటుకు గురవుతున్న ఇతర బీసీ కులాలను గుర్తించి, వారికి కోటాను నిర్దేశించడమే రోహిణి కమిషన్ లక్ష్యం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఓబీసీలను ఏ, బీ, సీ, డీ, ఈగాను కర్ణాటకలో 1, 2ఏ, 2బీ, 3ఏ, 3బీగా విభజించారు. ఉప కులాలను వర్గీకరించే విషయంలో రోహిణి కమిషన్ ఇదే విధానాన్ని అనుసరించవచ్చు

No comments:

bio mechanics in sports

భౌతిక విద్యలో బయోమెకానిక్స్ అనేది మానవ కదలికను నియంత్రించే యాంత్రిక సూత్రాల అధ్యయనం మరియు శారీరక కార్యకలాపాల సమయంలో శరీరం శక్తులతో ఎలా సంకర్...