Sunday, 10 March 2019

చైనాలో భారత్‌ మూడో ఐటీ కారిడార్‌

భారత్‌, చైనా కంపెనీలు భాగస్వామ్యాలు కుదుర్చుకోవడం సులభతరం చేసేందుకు వీలుగా చైనాలో భారత్‌ మూడో ఐటీ కారిడార్‌ను ప్రారంభించింది. ఐటీ కారిడార్‌ అభివృద్ధికి జియాంగ్జు ప్రావిన్స్‌లోని సుగ్జూ నగరంతో ఐటీ పరిశ్రమ సంఘం నాస్‌కామ్‌ ఒప్పందం కుదుర్చుకుంది. ఇటీవల దూసుకుపోతున్న చైనా ఐటీ విపణి నుంచి అవకాశాలు అందిపుచ్చుకునేందుకు ఇటువంటి కారిడార్‌లనే దాలియన్‌, గుయాంగ్‌ నగరాల్లో నాస్‌కామ్‌ ఇప్పటికే ప్రారంభించింది. చైనాలో ఇటువంటి చర్యల ద్వారా 300కు పైగా కంపెనీలు అవకాశాలు దక్కించుకున్నాయి. దాలియన్‌, గుయాంగ్‌ ఐటీ కారిడార్‌ల ద్వారా భారత ఐటీ కంపెనీలు వరుసగా 4.6 మిలియన్‌ డాలర్లు, 8.9 మిలియన్‌ డాలర్ల చొప్పున ఆర్డర్లు పొందాయి. 

అయోధ్యపై సంప్రదింపుల కోసం ముగ్గురు ప్రముఖులను నియమించిన సుప్రీంకోర్టు

  • అయోధ్యలోని రామ జన్మభూమి- బాబ్రీ మసీదు వివాదంలో కీలక ఘట్టం చోటు చేసుకుంది. ఈ సమస్యను పరిష్కరించడానికి ముగ్గురు మధ్యవర్తులను నియమిస్తూ సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది.
  • సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ ఫకీర్‌ మహ్మద్‌ ఇబ్రహీం ఖలీఫుల్లా అధ్యక్షతన ఆధ్యాత్మిక గురువు శ్రీశ్రీ రవిశంకర్‌, సీనియర్‌ న్యాయవాది శ్రీరాం పంచు సభ్యులుగా ఈ మధ్యవర్తిత్వ మండలి ఏర్పాటయింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గొగొయి, జస్టిస్‌ ఎస్‌.ఎ.బోబ్డే, జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌, జస్టిస్‌ అశోక్‌ భూషణ్‌, జస్టిస్‌ ఎస్‌.ఎ.నజీర్‌లతో కూడిన అయిదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఆదేశాలు ఇచ్చింది.
  • మధ్యవర్తుల మండలిని నియమించడానికి చట్టప్రకారం ఎలాంటి అడ్డంకులు లేవని స్పష్టం చేసింది.
  • తొలి ఫిర్యాదుదారుడు  ఎం.సిద్ధిక్‌ 
  • సమస్య పరిష్కారానికి మధ్యవర్తిత్వం ఉండాలని 2017 మార్చి 21న సుప్రీంకోర్టు సూచించింది. 

స్టార్టప్స్‌ సమీకరించిన 700 కోట్లు‌

  • వెంచర్‌ క్యాపిటల్‌ ఫండ్స్‌, ప్రైవేటు ఈక్విటీ రూపంలో ప్రముఖ ఈ- కామర్స్‌, కన్‌జ్యూమర్‌‌ ఇంటర్నెట్‌ కంపెనీస్‌ 2018లో రూ. 700 కోట్లను సమీకరించినట్లు ఓ సర్వేలో తేలింది.
  • వీటిలో అత్యధికంగా ఓయో, స్విగ్గీ, బిజూస్‌, పేటీఎం మాల్‌, పిన్‌ ల్యాబ్స్‌, జొమాటో, ఉడాన్‌, పాలసీ బజార్‌, క్యూర్‌ఫిట్‌ల వాటా రూ.460 కోట్లుగా ఉండటం గమనార్హం. ట్రావెల్‌, హాస్పిటాలిటీ, పేమెంట్స్‌ అండ్‌ వ్యాలెట్స్‌, ఫిన్‌టెక్‌, వైద్య రంగం, ఈ-కామర్స్‌, కన్‌జ్యూమర్‌ ఇంటర్నెట్‌ సెగ్మెంట్లలో నిర్వహించిన సర్వేలో ఈ వివరాలు వెల్లడయ్యాయి. అంతేకాకుండా ఈ-కామర్స్‌ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌ను రూ.1600 కోట్లతో వాల్‌మార్ట్‌ కొనుగోలు చేయడం,  పేటీఎం, బిగ్‌బాస్కెట్‌లో చైనాకు చెందిన ఈ-కామర్స్‌ దిగ్గజం ఆలీబాబా, మరో సంస్థ నాస్పర్స్‌.. బిజూస్‌, స్విగ్గీలో పెట్టుబడులు పెట్టడం కూడా స్టార్టప్‌లకు కలిసొచ్చింది.

‘లింక్డ్ఇన్’ ప్రభావిత వ్యక్తుల్లో భారతీయ యువతి

  • ప్రపంచంలోనే అతి పిన్న వయస్సులో బోయింగ్ 777 విమానాన్ని నడపబోతున్న భారతీయ యువతి అన్నీ దివ్య.. ప్రముఖ ప్రొఫెషెనల్‌ నెట్‌వర్క్‌ ‘లింక్డ్ఇన్’ ప్రపంచ ప్రభావితుల ఎక్స్‌క్లూజివ్‌ లీగ్‌లో చేరారు.
  • భారత్, ప్రపంచ దేశాలకు చెందిన దాదాపు 500 వరకు నాయకులు ఈ ప్రభావితుల జాబితాలో ఉన్నారు. వీరిలో ముఖ్యంగా నరేంద్ర మోదీ, బిల్ గేట్స్, ప్రియాంక చోప్రా, సచిన్ తెందుల్కర్‌‌, కిరణ్‌ ముజుందర్‌ షా లాంటి ప్రముఖులున్నారు.
  • ‘‘పురుష ఆధిక్యం ఉన్న పైలట్ వృత్తిని ఎంచుకున్న దివ్యకు ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయి? వాటిని అధిగమించి ఎలా విజేతగా నిలిచింది?
  •  లింక్డ్‌ఇన్‌లో ప్రభావవంతురాలుగా చేరుతున్న ఆమెకు  మేము స్వాగతం పలుకుతున్నాం’’ అని లింక్డ్ఇన్‌ భారత అధిపతి మహేష్‌ నారయణ్‌ అన్నారు.

Friday, 8 March 2019

అంతర్జాతీయ మహిళా దినోత్సవం

ఐటీబీపీ 53వ బెటాలియన్ ప్రారంభం

ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లా కలికిరి సమీపంలో ఏర్పాటైన ఐటీబీపీ (ఇండో టిబెటెన్ బార్డర్ పోలీస్) 53వ బెటాలియన్ కేంద్రాన్ని కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ మార్చి 6న న్యూఢిల్లీలోని సీజీవో కాంప్లెక్స్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు.
Current Affairsఅలాగే దేశంలోని వివిధ ప్రాంతాల్లో రూ.1,095 కోట్లతో నిర్మించిన బీఎస్‌ఎఫ్, సీఎఫ్‌ఎస్‌ఎల్, సీఐఎస్‌ఎఫ్, సీఆర్‌పీఎఫ్, ఢిల్లీ పోలీస్, ఐటీబీపీ, ఎల్‌పీఏఐ, ఎన్‌డిఆర్‌ఎఫ్, ఎస్‌ఎస్‌బి కేంద్రాలను కూడా ఆయన ప్రారంభించారు. దేశ రక్షణలో పారామిలటరీ బలగాల సేవలు చిరస్మరణీయమని ఈ సందర్భంగా ఆయన అన్నారు.

క్విక్ రివ్యూ :ఏమిటి : ఐటీబీపీ 53వ బెటాలియన్ ప్రారంభం
ఎప్పుడు : మార్చి 6
ఎవరు : కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్
ఎక్కడ : కలికిరి, చిత్తూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్

టీఎస్ ఎంసెట్-2019 నోటిఫికేషన్ విడుదల

 ఇంజనీరింగ్, అగ్రికల్చర్ డిగ్రీ, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే తెలంగాణ ఎంసెట్-2019 నోటిఫికేషన్ విడుదలైంది.
Education Newsమార్చి 6 నుంచి ఏప్రిల్ 5 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తారు. మార్చి 2న జేఎన్టీయూహెచ్‌లో జరిగిన ఎంసెట్ కమిటీ సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ తుమ్మల పాపిరెడ్డి వివరాలను వెల్లడించారు. మే 3 నుంచి ఆన్‌లైన్‌లో ఎంసెట్ నిర్వహిస్తున్నామని, ఇందుకోసం టీఎస్‌టీఎస్, టీసీఎస్ సహకారం తీసుకుంటున్నట్లు చెప్పారు. విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. తెలుగు రాష్ట్రాల్లో 18 పరీక్ష జోన్లుగా విభజించి 54 పరీక్షా కేంద్రాల్లో ఎంసెట్ నిర్వహిస్తున్నామని, తెలంగాణలో 15 జోన్లు, ఆంధ్రప్రదేశ్‌లో 3 జోన్లు ఉన్నాయన్నారు. విద్యార్థులు గంట ముందే పరీక్షా కేంద్రానికి హాజరు కావాలని, ఒక్క నిమిషం ఆలస్యమైనా కేంద్రంలోకి అనుమతించబోమని స్పష్టం చేశారు. విద్యార్థుల సౌకర్యార్థం ఆన్‌లైన్‌లో మాక్ టెస్ట్‌కు అవకాశం కల్పించామని, ఇందుకు సెట్ వెబ్‌సైట్ చూడాలన్నారు. ఆన్‌లైన్ దరఖాస్తులు, విద్యార్థుల సంఖ్య ఆధారంగా పరీక్షా కేంద్రాలను ఖరారు చేస్తామని పాపిరెడ్డి చెప్పారు. లోక్‌సభ ఎన్నికలకు ఇబ్బంది కలగకుండా పరీక్షలు నిర్వహిస్తామని, ప్రస్తుతం ప్రకటించిన పరీక్షల తేదీల్లో ఎన్నికల తేదీలు ఉంటే వాటిని మార్చే అవకాశం ఉంటుందన్నారు. గతేడాది 2.40 లక్షల దరఖాస్తులు వచ్చాయని, ఈసారి మరో 10 వేల వరకు పెరిగే అవకాశం ఉందన్నారు. కార్యక్రమంలో జేఎన్‌టీయూ వీసీ వేణుగోపాల్‌రెడ్డి, కన్వీనర్ యాదయ్య తదితరులు పాల్గొన్నారు. 

 ఎంసెట్ షెడ్యూల్... ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం: 06-03-2019 
దరఖాస్తుల స్వీకరణ గడువు: 05-04-2019 
దరఖాస్తులో తప్పుల సవరణ: 06-04-2019నుంచి 09-04-2019 రూ. 
500 అపరాధ రుసుముతో గడువు:11-04-2019 రూ. 1000 
అపరాధ రుసుముతో గడువు:17-04-2019 
ఆన్‌లైన్‌లో హాల్‌టికెట్లు జనరేట్ అయ్యే తేదీ:18-04-2019 
హాల్‌టికెట్ల డౌన్‌లోడ్ ప్రారంభం తేదీ: 20-04-2019 
హాల్‌టికెట్ల డౌడ్‌లోడ్‌కు చివరి తేదీ: 01-05-2019 
రూ.5,000 అపరాధ రుసుముతో దరఖాస్తు సమర్పణ గడువు: 24-04-2019 
రూ. 10,000 అపరాధ రుసుముతో దరఖాస్తు సమర్పణ గడువు: 28-04-2019 
పరీక్ష తేదీలు:ఇంజనీరింగ్ స్ట్రీమ్‌ మే 3, 4, 6 
అగ్రికల్చర్, ఫార్మసీ : మే 8, 9 

పరీక్ష సమయం: మార్నింగ్ సెషన్: ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు.
ఆఫ్టర్‌నూన్ సెషన్: మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు 

రిజిస్ట్రేషన్ ఫీజు :
కేటగిరీ
ఫీజు వివరాలు
ఇంజనీరింగ్
ఎస్సీ, ఎస్టీలకు రూ. 400, ఇతరులకు రూ. 800
అగ్రికల్చర్, ఫార్మసీ
ఎస్సీ, ఎస్టీలకు రూ. 400, ఇతరులకు రూ. 800
రెండు కేటగిరీలకు
ఎస్సీ, ఎస్టీలకు రూ. 800, ఇతరులకు రూ. 1,600

హైదరాబాద్‌లో డీబీఐఎల్ (DBS) తొలి బ్యాంక్ ప్రారంభం

హైదరాబాద్‌లో డీబీఎస్ బ్యాంక్ ఇండియా లిమిటెడ్ (డీబీఐఎల్)తొలి బ్యాంక్‌ మార్చి 5న ప్రారంభ‌మైంది.
Current Affairsఈ సందర్భంగా డీబీఐఎల్ సీఈఓ సురోజిత్ షోమీ మాట్లాడుతూ... డెవలప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ సింగపూర్ (డీబీఎస్) గ్రూప్ సాంకేతికత, అభివృద్ధి అంతా హైదరాబాద్ కేంద్రంగా జరుగుతుందని తెలిపారు. ఇక్కడి నుంచే మన దేశంతో పాటూ చైనా, తైవాన్, హాంగ్‌కాంగ్‌లకు సేవలు అందిస్తామని పేర్కొన్నారు.

25 సంవత్సరాల క్రితం ముంబైలో తొలి బ్రాంచ్ ప్రారంభించిన డీబీఎస్ బ్యాంక్ 2015లో పూర్తి సొంత అనుబంధ సంస్థ (డబ్ల్యూఓఎస్) కోసం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ)కి దరఖాస్తు చేసుకుంది. 2019, మార్చి 1న ఆర్‌బీఐ అనుమతినిచ్చింది. దీంతో ప్రస్తుతం దేశంలోని 12 డీబీఎస్ బ్రాంచీలు కూడా డీబీఐఎల్‌లోకి మారాయి. ఇప్పటివరకు డీబీఎస్‌కు 18 దేశాల్లో 280 బ్రాంచీలు, 1200 ఏటీఎం సెంటర్లున్నాయి. ప్రస్తుతం మన దేశంలో 45 విదేశీ బ్యాంక్‌లున్నాయి. విదేశీ బ్యాంక్ నుంచి డబ్యూఓఎస్ బ్యాంక్‌గా మారిన తొలి బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ మారిషస్. ఇది 2018, డిసెంబర్‌లో ఆర్‌బీఐ అనుమతి పొందింది.

క్విక్ రివ్యూ :ఏమిటి : డీబీఐఎల్ తొలి బ్యాంక్ ప్రారంభం 
ఎప్పుడు : మార్చి 5
ఎక్కడ : హైదరాబాద్

ప్రపంచ కుబేరుల్లో ముకేశ్ అంబానీకి 13వ స్థానం

ప్రపంచ కుబేరుల్లో రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ 13వ స్థానంలో నిలిచారు.
Current Affairsఈ మేరకు ‘ప్రపంచ బిలియనీర్ల జాబితా-2019’ను ఫోర్బ్స్ మ్యాగజైన్ మార్చి 5న విడుదల చేసింది. 2018లో 40.1 బిలియన్ డాలర్ల సంపదతో 19వ స్థానంలో ఉన్న ముకేశ్ 2019లో 50 బిలియన్ డాలర్ల సంపదతో 13వ స్థానం దక్కించుకున్నారు. ఈ జాబితాలో మొత్తం 106 మంది భారతీయులకు చోటు లభించింది. ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడిగా మరోసారి అమెజాన్ చీఫ్ జెఫ్ బెజోస్ నిలిచారు.

ప్రపంచ బిలియనీర్ల జాబితా-2019 
స్థానం
పేరు
కంపెనీ
1
జెఫ్ బెజోస్
అమెజాన్
13
ముకేశ్ అంబానీ
రిలయన్స్ ఇండస్ట్రీస్
36
అజిమ్ ప్రేమ్‌జీ
విప్రో
82
శివ్ నాడార్
హెచ్‌సీఎల్ కో-ఫౌండర్
91
లక్ష్మీ మిట్టల్
ఆర్సెలర్ లక్ష్మీ మిట్టల్
114
ఉదయ్ కోటక్
కోటక్ మహీంద్రా బ్యాంక్
122
కుమార మంగళం బిర్లా
ఆదిత్య బిర్లా గ్రూప్
167
గౌతమ్ అదానీ
అదానీ గ్రూప్
244
సునీల్ మిట్టల్
భారతీ ఎయిర్‌టెల్
365
ఆచార్య బాల్‌కృష్ణ
పతంజలి ఆయుర్వేద
436
అజయ్ పిరమల్
పిరమల్ ఎంటర్‌ప్రెజైస్
617
కిరణ్ మజుందార్ షా
బయోకాన్
962
ఎన్.ఆర్. నారాయణ మూర్తి
ఇన్ఫోసిస్
1349
అనిల్ అంబానీ
ఆర్‌కామ్
క్విక్ రివ్యూ :ఏమిటి : ప్రపంచ కుబేరుల్లో ముకేశ్ అంబానీకి 13వ స్థానం 
ఎప్పుడు : మార్చి 5
ఎవరు : ఫోర్బ్స్ మ్యాగజైన్

35,277 ఉద్యోగాల భర్తీకి రైల్వే నోటిఫికేషన్

భారతీయ రైల్వే....వివిధ బోర్డుల పరిధిలోని 35,277 నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీ (ఎన్‌టీపీసీ) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
Education Newsఇంటర్, డిగ్రీతో ఆయా పోస్టులకు దరఖాస్తు చేసుకొని.. రెండు దశల్లో జరిగే పరీక్షలో ప్రతిభచూపడం ద్వారా రైల్వే కొలువు సొంతం చేసుకోవచ్చు. ప్రారంభం నుంచి ఆకర్షణీయ వేతనంతో ఉజ్వల కెరీర్‌కు బాటలు వేసుకోవచ్చు. రైల్వే ఉద్యోగాలకు దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైన నేపథ్యంలో పోస్టుల వివరాలు, అర్హతలు, ఎంపిక ప్రక్రియ, సిలబస్ విశ్లేషణ..

పోస్టుల వివరాలు..
నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీస్ (ఎన్‌టీపీసీ) మొత్తం పోస్టులు: 35,277

అండర్ గ్రాడ్యుయేట్ పోస్టుల సంఖ్య: 10,628
పోస్టు పేరు
ఖాళీలు
జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్
4319
అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్
760
జూనియర్ టైమ్ కీపర్
17
ట్రైన్స్ క్లర్క్
592
కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్
4940
 
గ్రాడ్యుయేట్ పోస్టుల సంఖ్య: 24649
పోస్టు పేరు
ఖాళీలు
ట్రాఫిక్ అసిస్టెంట్
88
గూడ్స్ గార్డ్
5748
సీనియర్ కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్
5638
సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్
2873
జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్
3164
సీనియర్ టైమ్ కీపర్
14
కమర్షియల్ అప్రెంటీస్
259
స్టేషన్ మాస్టర్
6865
అర్హతలు :
  • అండర్ గ్రాడ్యుయేట్ పోస్టులకు కనీస విద్యార్హత ఇంటర్ లేదా తత్సమానం. వయసు 01.07.2019 నాటికి 18-30 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ/ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, పీడబ్ల్యూడీలకు 10 ఏళ్ల వయో సడలింపు ఉంది.
  • గ్రాయుయేట్ పోస్టులకు కనీస విద్యార్హత ఏదైనా డిగ్రీ. వయసు 01.07.2019 నాటికి 18-33 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ/ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, పీడబ్ల్యూడీలకు 10 ఏళ్ల వయో సడలింపు ఉంది.

దరఖాస్తు విధానం: సంబంధిత రైల్వేబోర్డు వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు ఫీజు రూ.500, రాయితీ వర్తించే వర్గాలకు రూ.250.
  • నిబంధనల ప్రకారం ఎస్సీ/ఎస్టీ, ఓబీసీ-నాన్ క్రీమీలేయర్, ఈడబ్ల్యూఎస్ (ఎకనామికల్ వీకర్ సెక్షన్స్) తదితర వర్గాలకు రిజర్వేషన్ సౌకర్యం ఉంది.

ఎంపిక విధానం : ఎంపిక ప్రక్రియలో మొత్తం నాలుగు దశలు ఉంటాయి. అవి..
  1. మొదటి దశ కంప్యూటర్ ఆధారిత పరీక్ష (ఫస్ట్ స్టేజ్ సీబీటీ).
  2. రెండో దశ కంప్యూటర్ ఆధారిత పరీక్ష (సెకండ్ స్టేజ్ సీబీటీ).
  3. పోస్టులను బట్టి టైపింగ్ స్కిల్ టెస్ట్/కంప్యూటర్ బేస్డ్ ఆప్టిట్యూడ్ టెస్ట్.
  4. డాక్యుమెంట్ వెరిఫికేషన్/మెడికల్ ఎగ్జామినేషన్.

మొదటి దశ కంప్యూటర్ ఆధారిత పరీక్ష : 
మొదటి దశ కంప్యూటర్ ఆధారిత పరీక్ష మొత్తం 100 మార్కులకు జరుగుతుంది. జనరల్ అవేర్‌నెస్ నుంచి 40 ప్రశ్నలు, మ్యాథమెటిక్స్ నుంచి 30 ప్రశ్నలు, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి 30 ప్రశ్నల చొప్పున ఆబ్జెక్టివ్ తరహాలో మొత్తం 100 ప్రశ్నలు ఉంటాయి. ప్రతి సరైన సమాధానానికి ఒక మార్కు చొప్పున కేటాయించారు. నెగిటివ్ మార్కింగ్ విధానం అమల్లో ఉంది. 

ప్రతి తప్పు సమాధానానికి 1/3 వంతు మార్కుల్లో కోత వేస్తారు. పరీక్ష వ్యవధి 90 నిమిషాలు. మొదటి దశ.. వడపోత పరీక్ష మాత్రమే. ఇందులో అర్హత సాధించిన అభ్యర్థులను రెండో దశ పరీక్షకు అనుమతిస్తారు.

రెండో దశ కంప్యూటర్ ఆధారిత పరీక్ష :
  • తొలిదశ పరీక్షలో అర్హత సాధించిన వారికి రెండో దశ పరీక్ష ఉంటుంది. మొత్తం 120 మార్కులకు పరీక్ష జరుగుతుంది. ఇందులో జనరల్ అవేర్‌నెస్ నుంచి 50 ప్రశ్నలు, మ్యాథమెటిక్స్ నుంచి 35 ప్రశ్నలు, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి 35 ప్రశ్నల చొప్పున ఆబ్జెక్టివ్ తరహాలో మొత్తం 120 ప్రశ్నలు అడుగుతారు. ప్రతి సరైన సమాధానానికి ఒక మార్కు లభిస్తుంది. నెగిటివ్ మార్కింగ్ విధానం అమల్లో ఉంది. ప్రతి తప్పు సమాధానానికి 1/3వంతు మార్కు కోత వేస్తారు.
  • కంప్యూటర్ ఆధారిత పరీక్షలో ఉత్తీర్ణులైన వారికి పోస్టులను బట్టి టైపింగ్ స్కిల్ టెస్ట్/కంప్యూటర్ బేస్డ్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఉంటుంది. డాక్యుమెంట్ వెరిఫికేషన్/మెడికల్ ఎగ్జామినేషన్ ద్వారా తుది ఎంపిక చేస్తారు.

సిలబస్ :
  • కంప్యూటర్ ఆధారిత విధానంలో జరిగే స్టేజ్-1, స్టేజ్-2 పరీక్షల్లో ఒకటే సిలబస్ ఉంటుంది. మ్యాథమెటిక్స్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, జనరల్ అవేర్‌నెస్ అంశాల నుంచి ప్రశ్నలు అడుగుతారు.
  • మ్యాథమెటిక్స్: నంబర్ సిస్టమ్, డెసిమల్స్, ఫ్రాక్షన్స్, ఎల్‌సీఎం, హెచ్‌సీఎఫ్, రేషియో అండ్ ప్రపోర్షన్స్, పర్సంటేజెస్, మెన్సురేషన్, టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్, సింపుల్ ఇంటరెస్ట్, కాంపౌండ్ ఇంటరెస్ట్, ప్రాఫిట్ అండ్ లాస్, జామెట్రీ, ట్రిగనోమెట్రీ, ఎలిమెంటరీ స్టాటిస్టిక్స్ తదితర అంశాలు ఉన్నాయి.
  • జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్: అనాలజీస్, కంప్లీషన్ ఆఫ్ నంబర్, ఆల్ఫాబెటికల్ సిరీస్, కోడింగ్ అండ్ డీకోడింగ్, మ్యాథమెటికల్ ఆపరేషన్స్, సిమిలారిటీస్ అండ్ డిఫరెన్సెస్, రిలేషన్‌షిప్స్, అనలిటికల్ రీజనింగ్, జంబ్లింగ్, వెన్ డయాగ్రమ్స్, పజిల్స్, డేటా సఫిషియెన్సీ, స్టేట్‌మెంట్-కన్‌క్లూజన్, స్టేట్‌మెంట్-కోర్స్ ఆఫ్ యాక్షన్, డెసిషన్ మేకింగ్, మ్యాప్స్, ఇంటర్‌ప్రిటేషన్ ఆఫ్ గ్రాఫ్స్ తదితర అంశాలుంటాయి.
  • జనరల్ అవేర్‌నెస్: జాతీయ, అంతర్జాతీయ ప్రాధాన్య వర్తమాన అంశాలు; క్రీడలు; భారతీయ కళలు-సంస్కృతి; ప్రసిద్ధ కట్టడాలు; జనరల్ సైన్స్, లైఫ్ సైన్స్ (పదో తరగతి స్థాయి వరకు); భారతదేశ చరిత్ర, స్వాతంత్య్ర ఉద్యమం; భారతదేశ, ప్రపంచ భౌతిక, సాంఘిక, ఆర్థిక భౌగోళిక అంశాలు; భారత రాజకీయ వ్యవస్థ, రాజ్యాంగం, పరిపాలన; దేశ శాస్త్ర, సాంకేతిక అభివృద్ధి(అంతరిక్ష, అణుకార్యక్రమంతో సహా); ఐక్యరాజ్య సమితి, ఇతర ముఖ్య అంతర్జాతీయ సంస్థలు; పర్యావరణ సమస్యలు; కంప్యూటర్-ప్రాథమిక అంశాలు; భారత రవాణా వ్యవస్థ; భారత ఆర్థిక వ్యవస్థ; ప్రముఖ వ్యక్తులు; ప్రభుత్వ పథకాలు-కార్యక్రమాలు; భారతదేశ వృక్ష, జంతు సంపద; దేశంలోని ముఖ్య సంస్థలు తదితర అంశాలు.
ముఖ్య తేదీలు : ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 01.03.2019.
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 31.03.2019.
కంప్యూటర్ ఆధారిత మొదటి దశ పరీక్ష: జూన్-సెప్టెంబర్ (2019)లో జరిగే అవకాశముంది. 

పూర్తి వివరాలకు వెబ్‌సైట్: www.rrbsecunderabad.nic.in

భారత్ ఫ్యూచర్ సిటీని గ్లోబల్ అర్బన్ హబ్‌గా అభివృద్ధి చేయడానికి యుఎఇ-తెలంగాణ భాగస్వామ్యం

 భారత్ ఫ్యూచర్ సిటీని గ్లోబల్ అర్బన్ హబ్‌గా అభివృద్ధి చేయడానికి యుఎఇ-తెలంగాణ భాగస్వామ్యం వరల్డ్ ఎకనామిక్ ఫోరం 2026లో, భారతదేశపు మొట్టమొదటి న...