Thursday, 12 November 2015

పోలీసు ఉద్యోగ వివరాలు

పోలీసు ఉద్యోగాల భర్తీ కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు శుభవార్త.  దాదాపు 7,450 పై చిలుకు పోలీసు ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పిన ప్రభుత్వం ఆ దిశగా చర్యలు ప్రారంభించింది. పోలీసు శాఖలో తొలి విడతలో మొత్తం 2904 ఉద్యోగాలు భర్తీ చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. తెలంగాణ స్పెషల్ పోలీసులో  2379 ఉద్యోగాలు, తెలంగాణ రాష్ట్ర స్పెషల్ పోలీసు శాఖలో 90 రిజర్వ్ సబ్ ఇన్స్ పెక్టర్ పోస్టులు, సివిల్ సబ్ ఇన్స్ పెక్టర్ పోస్టులు 101, స్పెషల్ ఆర్మడ్ రిజర్వ్ లో 2 సబ్ ఇన్స్ పెక్టర్, పోలీసు కమ్యూనికేషన్ శాఖలో 332 కానిస్టేబుల్ ఉద్యోగాలను భర్తీకి తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉద్యోగాలన్నీ డైరెక్ట్ రిక్రూట్ మెంట్ విధానంలో భర్తీ చేస్తారు. రాష్ట్ర స్థాయి పోలీసు నియామక బోర్డు ఈ ఉద్యోగాల భర్తీ చేపడుతుంది. ఉద్యోగాల భర్తీకి తక్షణం చర్యలు చేపట్టాలని తెలంగాణ ప్రభుత్వం పోలీసు నియామక బోర్డును ఆదేశించింది.

ఈ నియామకాల కోసం ప్రభుత్వం జి.ఓ.156ను నవంబర్ 12, 2015న విడుదల చేసింది. 

ఉద్యోగాలకు సిద్ధమవుతున్న అభ్యర్థులు ఇక కఠిన శ్రమకు సిద్ధంకండి. ఉద్యోగం కొట్టండి. 
yours king publications

No comments:

Human Body

 మానవ శరీరం గురించి మనం మానవ శరీరాన్ని మైక్రోస్కోపిక్ స్థాయిలో "విచ్ఛిన్నం" చేస్తే, కణం దాని అత్యంత ప్రాథమిక యూనిట్‌గా ఉంటుంది. సగ...