Monday, 16 November 2015

తెలంగాణలో టీచరు పోస్టు ఖాళీల వివరాలు

తెలంగాణలో టీచరు పోస్టు ఖాళీల వివరాలు

తెలంగాణలోని వివిధ ప్రభుత పాఠశాలల్లో 10 వేలకు పైచిలుకు టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి.  ఇటీవల నిర్వహించిన రేషనలైజేషన్ తర్వాత వివిధ పాఠశాలల్లో ఉన్న ఖాళీలపై స్పష్టత వచ్చింది.  విద్యా హక్కు చట్టం ప్రకారం ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల భర్తీ కచ్చితంగా చేపట్టాలి.  ప్రభుత్వ పాఠశాలల్లో దాదాపు 17500 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నప్పటికీ రేషనలైజేషన్ లో భాగంగా పాఠశాలల కుదింపు ఇతర చర్యల తర్వాత ఈ సంఖ్య 10 వేలకు తగ్గింది.  మహబూబ్ నగర్ జిల్లాలో అత్యధికంగా 2,024 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 

జిల్లాలవారీగా ఉపాధ్యాయ ఖాళీల వివరాలు

ఆదిలాబాద్      1818
నిజామాబాద్       944
కరీంనగర్           666
మెదక్              1257
హైదరాబాద్        763
రంగారెడ్డి           1442
మహబూబ్ నగర్  2024
నల్లగొండ               689
వరంగల్               634
ఖమ్మం                724
--------------------------
మొత్తం            10,961
---------------------------

టెట్ ఫలితాలు ఫిబ్రవరి 12న రానున్నాయి.  ఆ వెంటనే డిఎస్సీ నోటిఫికేషన్ రావచ్చు. 

No comments:

Human Body

 మానవ శరీరం గురించి మనం మానవ శరీరాన్ని మైక్రోస్కోపిక్ స్థాయిలో "విచ్ఛిన్నం" చేస్తే, కణం దాని అత్యంత ప్రాథమిక యూనిట్‌గా ఉంటుంది. సగ...