Monday, 16 November 2015

టీచర్స్ ఎలిజిబిలిటి టెస్ట్

                                                              TET


డిఎస్సీకి అర్హతగా పరిగణించే టీచర్స్ ఎలిజిబిలిటి టెస్ట్ TET కు సమయం ఆసన్నమైంది. తెలంగాణ ఏర్పడిన తర్వాత నిర్వహిస్తున్న తొలి టెట్ ఇది.  వచ్చే ఏడాది జనవరి 24, ఆదివారం నిర్వహించే ఈ పరీక్షకు సంబంధించిన నోటిఫికేషన్ నవంబర్  16న విడుదల కానుంది.  ఈ నెల 19 నుంచి వచ్చే నెల 10 వరకు  దరఖాస్తులు స్వీకరిస్తారు.  డిసెంబర్ 9 వరకు ఫీజు చెల్లించవచ్చు. పరీక్ష ఫీజు రూ.200.00.   ఒక పేపర్ రాసినా, రెండు పేపర్లు రాసిన రెండొందల రూపాయల ఫీజు చెల్లించాలి.  దరఖాస్తులు, బుక్ లెట్, ఫీజు చెల్లింపుల కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా వెబ్ సైట్ tstet.cgg.gov.in  ఏర్పాటు చేసింది.  డీఎస్సీలో టెట్ మార్కులకు 20 శాతం వెయిటేజ్ ఉంది. 

రాష్ట్రం ఉమ్మడిగా ఉన్నప్పడు నాలుగుసార్లు టెట్ నిర్వహించారు. త్వరలోనే డీఎస్సీ నిర్వహించే యోచనలో ఉన్న ప్రభుత్వం ఆ దిశలో భాగంగా ఇప్పుడు టెట్ నిర్వహిస్తోంది. 

ఈ పరీక్షకు తెలంగాణ రాష్ట్రంలోని పాఠ్యపుస్తకాల్లోని మార్పుల ఆధారంగానే టెట్ సిలబస్ ఉంటుంది. 

టెట్ కు సంబంధించిన పూర్తి వివరాలు

16-11-2015 నోటిఫికేషన్ జారీ
18-11-2015 నుంచి 09-12-2015  టీఎస్ ఆన్ లైన్ లేదా పేమేంట్ గేట్ వే ద్వారా ఫీజు చెల్లింపు
18-11-2015 టెట్ బుక్ లెట్ డౌన్ లోడ్
19-11-2015 నుంచి 10-12-2015 ఆన్ లైన్ లో ఆప్లికేషన్  సబ్మిషన్
18-11-2015 నుంచి 24-1-2015 వరకు హెల్ప్ డెస్క్ వర్కింగ్
23-11-2015 నుంచి 10-12-2015 వరకు ఆన్ లైన్ దరఖాస్తులకు సంబంధించిన ఫిర్యాదుల స్వీకరణ
30-12-2015 పరీక్ష కేంద్రాల ఖరారు
04-01-2016 నుంచి హాల్  టికెట్ల డౌన్ లోడింగ్
24-01-2016 టెట్ ఎగ్జామ్
12-02-2016 రిజల్స్ట్

24-01-2016 ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పేపర్ -1
  (ఎస్ జిబిటి పోస్టులకు అర్హులైన డిఎడ్ అభ్యర్థులకు)

పేపర్ -2 మధ్యాహ్నం  2.30 గంటలకు నుంచి సాయంత్రం 5 గంటలకు 
(స్కూల్ అసిస్టెంట్,పండిట్ పోస్టులకు అర్హులైన బీ.ఎడ్, పండిట్ అభ్యర్థులకు)

No comments:

Human Body

 మానవ శరీరం గురించి మనం మానవ శరీరాన్ని మైక్రోస్కోపిక్ స్థాయిలో "విచ్ఛిన్నం" చేస్తే, కణం దాని అత్యంత ప్రాథమిక యూనిట్‌గా ఉంటుంది. సగ...