Monday, 16 November 2015

ssc person can get govt job in telangana

పదో తరగతేకి ప్రభుత్వ ఉద్యోగం

పదో తరగతి దానికి సమానమైన విద్యార్హత,  ఐటీఐ, ఇంటర్మీడియట్ దానికి సమానమైన విద్యార్హతలతో కూడిన ఉద్యోగాల భర్తీకి తెలంగాణ ప్రభుత్వం కొత్త పరీక్ష విధానాన్ని ఆమోదించింది.  ప్రత్యక్ష పద్ధతిలోనే ఈ ఉద్యోగాలకు నియామకాలు చేపట్టాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది. 15,522 ఖాళీలను కూడా ప్రభుత్వం గుర్తించింది.

ఈ శ్రేణిలో  బిల్ కలెక్టర్, ఎక్సైజ్ కానిస్టేబుల్,  ట్రాన్స్ పోర్టు కానిస్టేబుల్, రెండో గ్రేడ్ టెక్నిషియన్ ఉద్యోగాలు ఇందులో ఉన్నాయి.  పదో తరగతి, ఐటిఐ, ఇంటర్మీడియట్ విద్యార్హత ఆధారంగా వీటి నియామకాలు చేపడతారు. 

తెలంగాణ పబ్లిక్ సర్వీసు కమిషన్ ఈ ఉద్యోగాల భర్తీకి చర్యలు చేపడుతుంది. ఈ ఉద్యోగాల పరీక్ష విధానాన్ని మార్చాలని పబ్లిక్ సర్వీసు కమిషన్ చేసిన విజ్ఞప్తిని ప్రభుత్వం ఆమోదించింది. 

పదో  తరగతి, దానికి సమానమైన విద్యార్హతతో కూడిన పరీక్షలో ఇక జనరల్ నాలెడ్జ్  ప్రశ్నలు 150 ఉంటాయి. వీటికి గరిష్ట మార్కులు 150, 150 నిమిషాల్లో ఈ ప్రశ్నలకు సమాధానాలు రాయాల్సి ఉంటుంది.

ఇంటర్మీడియట్, దానికి సమానమైన విద్యార్హత కూడిన పరీక్షలకు జనరల్ నాలెడ్జ్ తో పాటు సెక్రటేరియల్ ఎబిలిటీస్ కూడా ఉంటుంది.  150 ప్రశ్నల్లో 75 జనరల్ నాలెడ్జ్, 75 ప్రశ్నలు సెక్రటెరియల్ ఎబిలిటీస్ కు సంబంధించినవి ఉంటాయి.  వీటికి 150 మార్కులు, వీటిని 150 నిమిషాల్లో రాయాల్సి ఉంటుంది.

ఇక ఐటీఐ, దానికి సమానమైన విద్యార్హతలున్న పరీక్షలో కూడా 150 ప్రశ్నలుంటాయి. ఇందులో జనరల్ నాలెడ్జ్ ప్రశ్నలు, సంబంధిత సబ్జెక్టుకు  సంబంధించిన ప్రశ్నలు ఉంటాయి. 75 ప్రశ్నలు జనరల్ నాలెడ్జ్, 75 ప్రశ్నలు సంబధిత సబ్జెక్టుకు సంబంధించినవి ఉంటాయి.  వీటికి 150 మార్కులు, వీటిని 150 నిమిషాల్లో పూర్తి చేయాల్సి ఉంటుంది. 

No comments:

Human Body

 మానవ శరీరం గురించి మనం మానవ శరీరాన్ని మైక్రోస్కోపిక్ స్థాయిలో "విచ్ఛిన్నం" చేస్తే, కణం దాని అత్యంత ప్రాథమిక యూనిట్‌గా ఉంటుంది. సగ...