Saturday, 4 January 2020

✍ కరెంట్ అఫైర్స్ 2 జనవరి 2020 Thursday ✍ news eenadu

✍  కరెంట్ అఫైర్స్ 2 జనవరి 2020 Thursday ✍

  Daily Current affairs prepared from Eenadu, The Hindu newspaper and from online current affair websites, Wikipedia etc..

తెలంగాణ వార్తలు

నిరక్షరాస్యులపై త్వరలో సర్వే.  ‘ఈచ్ వన్..టీచ్ వన్’ కార్యక్రమంలో భాగంగా నిర్వహణ :


  దేశంలో 2011 జనాభా లెక్కల ప్రకారం జాతీయ సగటు అక్షరాస్యత 72.99 శాతం. తెలంగాణ రాష్ట్రంలో అది 66.54 శాతమే. అంటే ఇంకా ఆరున్నర శాతం తక్కువ.
  తెలంగాణ కంటే వెనుకబడిన రాష్ట్రాలు ఝార్ఖండ్, రాజస్థాన్, అరుణాచల్ప్రదేశ్, బిహార్ మాత్రమే. కేంద్రపాలిత ప్రాంతాలనూ కలిపితే రాష్ట్రం 32వ స్థానంలో నిలిచింది.
  2011 జనాభా లెక్కల ప్రకారం తెలంగాణలో 1.04 కోట్ల మంది నిరక్షరాస్యులున్నారు. వారిలో 15-49 మధ్య వయసు ఉన్న నిరక్షరాస్యులు 60 లక్షల మంది. ఇటీవల జాతీయ నమూనా సర్వే(ఎన్ఎస్ఎస్) నివేదిక ప్రకారం రాష్ట్రంలో  అక్షరాస్యత 72.80 శాతమే ఉన్నట్లు తేలింది. అందుకే ఇప్పటివరకు చేసిన కార్యక్రమాలకు భిన్నంగా ఈచ్ వన్-టీచ్ వన్కు శ్రీకారం చుట్టాలని సీఎం ఆదేశించారు.

ఓయూ ఇంజినీరింగ్ కళాశాలలో కృత్రిమ మేధ కేంద్రం ఏర్పాటుకు రంగం సిద్ధం :


i. కృత్రిమ మేధ కేంద్రం ఏర్పాటుకు ఉస్మానియా విశ్వవిద్యాలయం సమాయత్తమైంది. మరో నెల రోజుల్లోనే దీనికి శ్రీకారం చుట్టనుంది. దీనివల్ల విద్యార్థులు, ఆచార్యులు, పరిశ్రమలు కలిసి పరిశోధనలు చేయడం ద్వారా సమాజం ఎదుర్కొంటున్న పలు సమస్యల పరిష్కారానికి అవకాశం ఉంటుందని ఓయూ అధికారులు పేర్కొన్నారు.
ii. మనిషి పరిష్కరించలేని సమస్యలను కృత్రిమ మేధ సాంకేతికతతో పరిష్కరించవచ్చని నిపుణులు చెబుతున్నారు. కేంద్ర మానవ వనరుల శాఖ ప్రవేశపెట్టిన రాష్ట్రీయ ఉచ్ఛతార్ శిక్షా అభియాన్(రూసా) కింద ఆరు నెలల క్రితం రూ.107 కోట్లు మంజూరయ్యాయి. ఓయూ ఇంజినీరింగ్ కళాశాలలోని టెక్నాలజీ డెవలప్మెంట్ సెంటర్లో దీన్ని ఏర్పాటు చేయనున్నారు.

అంతర్జాతీయ వార్తలు

Palau becomes 1st nation to ban ‘reef toxic’ sun cream :


o పగడాలు మరియు సముద్ర జీవితాలకు హాని కలిగించే సన్ క్రీంను నిషేధించిన మొదటి దేశంగా పసిఫిక్ దేశం పలావు మారింది. అతినీలలోహిత కాంతిని గ్రహించే ఆక్సిబెంజోన్ మరియు ఆక్టినోక్సేట్ కలిగిన 10 పదార్ధాలలో దేనినైనా సన్ క్రీం నిషేధించడం నిషేధంలో ఉంది.
o పలావు యొక్క రాక్ దీవులలోని ఒక మడుగు యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశం. పలావు సముద్ర జీవితానికి ప్రసిద్ధి చెందింది మరియు ఇది ప్రపంచంలోని ఉత్తమ డైవింగ్ గమ్యస్థానాలలో ఒకటిగా పరిగణించబడుతుంది.

Umaro Cissoko Embalo wins Guinea-Bissau presidential election :


Umaro Cissoko Embalo has won the Guinea-Bissau‘s presidential election. According to the National Electoral Commission of Guinea-Bissau, Umaro won the presidential election with 53.55% of votes.
He will replace the incumbent President Jose Mario Vaz.

సైన్స్ అండ్ టెక్నాలజీ 

2021లో చంద్రయాన్-3. గగన్యాన్ కోసం వాయుసేన నుంచి నలుగురి ఎంపిక. రష్యాలో వారికి శిక్షణ :


  చంద్రయాన్-3లో ల్యాండర్, రోవర్, ప్రొపల్షన్ వ్యవస్థ ఉంటాయని శివన్ తెలిపారు. చంద్రయాన్-2 ఆర్బిటర్ ఏడేళ్లపాటు పనిచేస్తుందని, కొత్త ప్రాజెక్టుకూ దాని సేవలు వినియోగించుకుంటామని చెప్పారు.
  చంద్రయాన్-3 ప్రాజెక్టు మొత్తం వ్యయం రూ.615 కోట్లుగా ఉంటుందని అంచనా వేశారు. వేగ నియంత్రణలో వైఫల్యం కారణంగా చంద్రయాన్-2లోని విక్రమ్ ల్యాండర్ జాబిల్లిపై విజయవంతంగా దిగలేకపోయిందని పేర్కొన్నారు.
  విక్రమ్ జాడను గుర్తించడంలో కీలక పాత్ర పోషించిన చెన్నైకి చెందిన ఇంజినీర్ షణ్ముగ సుబ్రమణ్యన్ను శివన్ అభినందించారు. 2020లో మొత్తం 25 మిషన్లను చేపట్టేందుకు ఇస్రో ప్రణాళికలు సిద్ధం చేసినట్లు తెలిపారు.
  ‘చంద్రయాన్-3’తోపాటే ప్రతిష్ఠాత్మక గగన్యాన్ ప్రాజెక్టు పనులనూ ఏకకాలంలో పూర్తిచేస్తున్నట్లు శివన్ చెప్పారు. గగన్యాన్ కోసం వాయుసేనకు చెందిన నలుగురు పురుషులను ఎంపిక చేశామని, రష్యాలో ఈ నెల 3వ వారం నుంచి వారికి శిక్షణ ప్రారంభమవుతుందని తెలిపారు.
  ప్రత్యేక జీపీఎస్ వ్యవస్థతో కూడిన ‘ఇండియన్ రీజనల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ (నావిక్)ను ఈ ఏడాదే ఆవిష్కరిస్తామని చెప్పారు.
  తమిళనాడులోని తూత్తుకుడిలో అంతరిక్ష ప్రయోగ కేంద్రం ఏర్పాటు కోసం 2,300 ఎకరాల భూ సేకరణ పనులు వేగంగా సాగుతున్నాయని శివన్ వెల్లడించారు. తక్కువ వ్యయంతో రూపొందించే బుల్లి ఉపగ్రహ వాహక నౌకలను తొలి దశలో అక్కడి నుంచి ప్రయోగిస్తామని, తర్వాత భారీ వాహకనౌకల ప్రయోగాలకూ విస్తరిస్తామని తెలిపారు.

ఆర్థిక అంశాలు

“MANI” to help visually challenged to identify currency notes :


The Reserve Bank of India (RBI) has launched a mobile app “Mobile Aided Note Identifier (MANI)”. The visually challenged people can identify the denomination of a currency note by using the mobile app “MANI”.
The application also works offline once installed. The application scans the currency notes using the camera of the mobile phone and also gives audio output in Hindi and English. The app does not authenticate a note as either genuine or counterfeit.

          Appointments

తొలి త్రిదళాధిపతి(CDS)గా జనరల్ బిపిన్ రావత్ బాధ్యతల స్వీకరణ :


  దేశ తొలి సీడీఎస్గా జనరల్ బిపిన్ రావత్ January 1న బాధ్యతలు చేపట్టారు. సైన్యం, నౌకాదళం, వాయుసేనల మధ్య సమన్వయాన్ని పెంపొందించి.. వాటిని ఓ బృందంలా పనిచేయించడమే తన ప్రధాన లక్ష్యమని తెలిపారు.
28వ సైన్యాధిపతిగా జనరల్ ఎం.ఎం.నరవాణే బాధ్యతలు :

  ఉత్తర దిక్కులోని చైనా సరిహద్దుపై ఇక దృష్టి సారించాల్సి ఉందని సైన్యాధిపతి జనరల్ ఎం.ఎం.నరవాణే పునరుద్ఘాటించారు. 28వ సైన్యాధిపతిగా బాధ్యతలు చేపట్టిన ఆయనకు లాంఛనంగా సైనిక వందనం సమర్పించారు.
  ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ పాకిస్థాన్ సరిహద్దుపైనే ఇంతవరకు దృష్టి కేంద్రీకరించామని, ఇకపై చైనా సరిహద్దుపైనా శ్రద్ధ పెట్టాల్సి ఉందని తెలిపారు.

Reports/Ranks/Records

 జాతీయ కృత్రిమ గర్భధారణ కార్యక్రమం అమలులో తెలంగాణ దేశంలోనే అగ్రస్థానం :
i. పశువులకు కృత్రిమ గర్భధారణ ద్వారా మేలు జాతి పశుసంతతిని వృద్ధి చేసి, పాల ఉత్పత్తిని పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం గత సెప్టెంబరులో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించింది.
ii. దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన 600 జిల్లాల్లో రోజుకు 25వేల చొప్పున ఆర్నెల్ల కాలంలో కోటి బర్రెలు, ఆవులకు కృత్రిమ గర్భధారణ చేయాలనేది లక్ష్యం.. కాగా 9,73,128 పశువులకు ఆ ప్రక్రియ పూర్తిచేశారు.
iii. ఇందులో తెలంగాణ 1,41,165తో అగ్రస్థానంలో ఉండగా, మధ్యప్రదేశ్ 1,02,273, గుజరాత్ 93,461, ఉత్తర్ప్రదేశ్ 79,217, తమిళనాడు 63,765తో తొలి ఐదు స్థానాల్లో నిలిచాయి. బిహార్, కర్ణాటక, ఒడిశా, ఆంధ్రప్రదేశ్ మినహా మిగిలిన రాష్ట్రాలేవీ 50వేల మార్కు దాటలేదు.
iv. తెలంగాణలోని 32 జిల్లాల్లో కార్యక్రమం అమలవుతోంది. జిల్లాకు 100 గ్రామాలనేది నిబంధన కాగా, హైదరాబాద్ మినహా మిగతా జిల్లాల్లోని కొన్ని గ్రామాలను ఎంపిక చేసి అమలు చేస్తున్నారు.

ముఖ్యమైన రోజులు

2020 as the ‘Year of nurse and midwife’ : WHO


The Executive Board, designated the year 2020 as the “Year of the Nurse and midwife”, in honor of the 200th birth anniversary of Florence Nightingale. This proposal will now be presented to Member States of the 72nd World Health Assembly for consideration and endorsement.
The year 2020 is significant for WHO in the context of nursing and midwifery strengthening for Universal Health Coverage. WHO is leading the development of the first-ever State of the World’s Nursing report which will be launched in 2020, prior to the 73rd World Health Assembly.
The report will describe the nursing workforce in WHO Member States, providing an assessment of “fitness for purpose” relative to GPW13 targets. WHO is also a partner on The State of the World’s Midwifery 2020 report, which will also be launched around the same time.
The NursingNow! Campaign, a three-year effort (2018-2020) to improve health globally by raising the status of nursing will culminate in 2020 by supporting country-level dissemination and policy dialogue around the State of the World’s Nursing report.
Nurses and midwives are essential to the achievement for universal heath coverage. The campaign and the two technical reports are particularly important given that nurses and midwives constitute more than 50% of the health workforce in many countries, and also more than 50% of the shortfall in the global health workforce to 2030.
Strengthening nursing will have the additional benefits of promoting gender equity (SDG5), contributing to economic development (SDG8) and supporting other Sustainable Development Goals.

తెలంగాణ హైకోర్టు ఆవిర్భావ దినోత్సవం – 2019 జనవరి 1


  తెలంగాణ హైకోర్టు న్యాయవాదుల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన తెలంగాణ హైకోర్టు ఆవిర్భావ దినోత్సవంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ ముఖ్యఅతిథిగా ప్రసంగించారు.
  తెలంగాణ హైకోర్టు తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులో ఉన్న హైకోర్టు. 1920, ఏప్రిల్ 20న ఏడవ నిజాం ప్రభువు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ఆధ్వర్యంలో ప్రారంభించబడింది. హైదరాబాదు రాష్ట్రం కోసం ఏర్పాటుచేయబడిన ఈ హైకోర్టు, 1956లో రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం 1956, నవంబర్ 5న ఆంధ్రప్రదేశ్ హైకోర్టుగా మార్చబడింది.
  2014, జూన్ 2న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తరువాత ఉమ్మడి హైకోర్టుగా ఉండి, 2019 జనవరి 1న పూర్తిస్థాయిలో తెలంగాణ హైకోర్టుగా మార్చబడింది.
  బ్రిటిషు ప్రభుత్వం రూపొందించిన అనేక నిబంధనలు హైదరాబాద్ రాష్ట్రంలోకి ప్రవేశించడంతో, 1893నాటికి బ్రిటిష్ పాలిత భారతదేశంలో ఉన్న కోర్టుల మాదిరిగానే హైదరాబాద్ హైకోర్టు ప్రస్తావన వచ్చింది. ప్రారంభంలో హైకోర్టు పత్తర్గట్టిలో ఏర్పాటుచేయబడింది. 1908నాటి హైదరాబాదు వరదలు రావడంతో లాల్బాగ్లో ఉండే అసమన్జా నవాబ్ నివాస గృహాంలోకి హైకోర్టు మార్చబడింది.
  1912లో హైదరాబాద్లో కలరా వ్యాధి రావడంతో పబ్లిక్ గార్డెన్స్ హాల్కు, నాలుగు నెలల తర్వాత చెత్తబజార్లోని సాలార్జంగ్ బహద్దూర్ నివాసానికి తరలించబడింది. అక్కడ స్థలం సరిపోకపోడంతో కొంతకాలం తరువాత సైఫాబాద్లోని సర్తాజ్జంగ్ నవాబ్ ఇంటికి మార్చబడి, ప్రస్తుత భవనం నిర్మించేంతవరకు అక్కడే కొనసాగింది.
  1915, ఏప్రిల్ 15న జైపూర్ ప్రాంతానికి చెందిన ఆర్కిటెక్క్ శంకర్లాల్ రూపకల్పనలో, ఇంజినీర్ మెహర్ అలీఫజల్ పర్యవేక్షణలో హైకోర్టు భవన నిర్మాణం ప్రారంభించబడింది. శంషాబాద్ వద్ద గగన్పహడ్ ప్రాంతంలోని కొండలను తొలిచి ఇండో ఇస్లామిక్ శైలిలో ఎరుపు తెలుపు రంగురాళ్లతో పాతబస్తీలోని మూసి ఒడ్డున 1919, మార్చి 31న భవనం నిర్మాణం పూర్తిచేయబడింది.
  18,22,750 రూపాయలతో తొమ్మిది ఎకరాల్లో నిర్మించిన ఈ భవనాన్ని 1920, ఏప్రిల్ 20న మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ప్రారంభించారు. నిజాం కాలంలో మొదటి ప్రధాన న్యాయమూర్తిగా నవాబ్ ఆలంయార్ జంగ్ విధులు నిర్వర్తించారు.
  1956, నవంబర్ 5న ఆంధ్రప్రదేశ్ హైకోర్టుగా మార్చబడింది. 1958లో మరికొన్ని భవనాల నిర్మాణాలు జరిగాయి. తొమ్మిదిన్నర ఎకరాల ప్రభుత్వ మెటర్నిటీ దవాఖాన స్థలాన్ని హైకోర్టుకు కేటాయించడంతో, అక్కడ ప్రత్యేక బ్లాకు నిర్మాణం చేపట్టబడ్డాయి.
  తెలంగాణ హైకోర్టు ప్రథమ ప్రధాన న్యాయమూర్తిగా 2019, జనవరి 1న రాధాకృష్ణన్ ప్రమాణం స్వీకరించగా, ప్రస్తుతం తాత్కాలిక న్యాయమూర్తిగా ఆర్ఎస్ చౌహాన్ కొనసాగుతున్నారు.

క్రీడలు

మాగ్నస్  కార్ల్సన్ @ ప్రపంచ ఛాంపియన్ :


i. ప్రస్తుతం క్లాసికల్, ర్యాపిడ్, బ్లిట్జ్.. ఈ మూడు రకాల చెస్లోనూ  మాగ్నస్  కార్ల్సన్ ప్రపంచ ఛాంపియన్. ఒకే సమయంలో క్లాసికల్, ర్యాపిడ్, బ్లిడ్జ్ మూడు విభాగాల్లోనూ ఛాంపియన్గా నిలవడం అతడికే చెల్లింది.
ii. చెస్లో అత్యున్నతమైన క్లాసికల్ విభాగంలో అతను నాలుగుసార్లు ఛాంపియన్. 2013లో 22 ఏళ్ల వయసులోనే దిగ్గజ క్రీడాకారుడు ఆనంద్ను ఓడించి తొలిసారి ప్రపంచ ఛాంపియన్ అయిన అతను.. తర్వాతి నాలుగేళ్లలో మరో మూడు టైటిళ్లు సొంతం చేసుకున్నాడు. మూడు విభాగాల్లో కలిపి 12 ప్రపంచ టైటిళ్లతో తనకు తానే సాటి అనిపిస్తున్నాడు.
iii. తొమ్మిదేళ్లకే జాతీయ ఛాంపియన్.. 12 ఏళ్లకే గ్రాండ్మాస్టర్.. 19 ఏళ్లకే ప్రపంచ నంబర్వన్.. 22 ఏళ్లకే ప్రపంచ ఛాంపియన్.. చరిత్రలో ఏ క్రీడాకారుడూ అందుకోని ఎలో రేటింగ్.. 12 ప్రపంచ టైటిళ్లు.. ఇలా చెప్పుకుంటూ పోతే కార్ల్సన్ ఘనతలెన్నో!
iv. కార్ల్సన్ సొంత దేశం నార్వేలో చెస్కు ఎప్పట్నుంచో ఆదరణ ఉంది. అయితే దానికి విశేషమైన ఆదరణ తెచ్చి.. ప్రతి కుటుంబంలోనూ చెస్ క్రీడాకారులు తయారయ్యేలా చేసిన ఘతన మాత్రం మాగ్నస్దే.
దశాబ్దపు వన్డే, టీ20 జట్ల కెప్టెన్ ధోని : ESPN cricinfo

  ఈఎస్పీఎన్ క్రిక్ఇన్ఫో దశాబ్దపు (2010-19) వన్డే, టీ20 జట్లకు మహేంద్ర సింగ్ ధోని కెప్టెన్గా ఎంపికయ్యాడు. టెస్టు కెప్టెన్సీ విరాట్ కోహ్లీకి దక్కింది.
  కోహ్లీ కాకుండా భారత్ నుంచి అశ్విన్కు మాత్రమే టెస్టు ఎలెవన్లో స్థానం లభించింది. ఈ దశాబ్దంలో కోహ్లి 54.97 సగటుతో 7202 పరుగులు చేయగా.. అశ్విన్ 362 వికెట్లు పడగొట్టాడు. భారత్ నుంచి ఒక్క కోహ్లి మాత్రమే మూడు ఫార్మాట్లకూ ఎంపికయ్యాడు.
>>>>>>>>>>>>>>>>  End of the day  <<<<<<<<<<<<<<<<

No comments:

Human Body

 మానవ శరీరం గురించి మనం మానవ శరీరాన్ని మైక్రోస్కోపిక్ స్థాయిలో "విచ్ఛిన్నం" చేస్తే, కణం దాని అత్యంత ప్రాథమిక యూనిట్‌గా ఉంటుంది. సగ...