Saturday, 4 January 2020

✍ కరెంట్ అఫైర్స్ 3 జనవరి 2020 Friday ✍ news

✍  కరెంట్ అఫైర్స్ 3 జనవరి 2020 Friday ✍


  Daily Current affairs prepared from Eenadu, The Hindu newspaper and from online current affair websites, Wikipedia etc..

జాతీయ వార్తలు

ఐదు ‘యువ శాస్త్రవేత్తల ప్రయోగశాల’లను జాతికి అంకితం చేసిన  నరేంద్ర మోదీ :


ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ డీఆర్డీవోకు చెందిన ఐదు ‘యువ శాస్త్రవేత్తల ప్రయోగశాల’లను జాతికి అంకితం చేశారు. ఇవి బెంగళూరు, హైదరాబాద్, చెన్నై, కోల్కతా, ముంబయిలో ఏర్పాటవుతాయి.
రక్షణ శాఖలో త్రివిధ దళాధిపతి (సీడీఎస్) పదవిని కొత్తగా సృష్టించిన విషయాన్ని ప్రధాని ప్రస్తావించారు. దీనివల్ల పెను మార్పులు జరుగుతాయన్నారు. దాని ప్రభావం డీఆర్డీవోపైనా ఉంటుందని చెప్పారు.

హైదరాబాద్లో డీఆర్డీవో మరో ప్రయోగశాల :


భవిష్యత్తు దేశ రక్షణ అవసరాలపై అధునాతన పరిశోధనలు చేయడానికి రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ(డీఆర్డీవో) యువ శాస్త్రవేత్తలతో హైదరాబాద్లో కొత్తగా ఒక ప్రయోగశాల ఏర్పాటు చేసింది.
నగర శివారు బాలాపూర్లోని రీసెర్చ్ సెంటర్ ఇమారత్(RCI) మార్గంలో ఉన్న దేవతల గుట్టలో స్థాపించారు. డిఫెన్స్ మెటలర్జికల్ రీసెర్చ్ ల్యాబొరేటరీ(DMRL)కి చెందిన అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్(ఏటీసీ) ఇదివరకు ఇక్కడ ఉండేది. దీని స్థానంలో ప్రధాని మోదీ ఆలోచనల నుంచి వచ్చిన ప్రతిష్ఠాత్మక యువ శాస్త్రవేత్తల ప్రయోగశాలను ఏర్పాటు చేశారు. దేశవ్యాప్తంగా ఏర్పాటు చేసిన ఐదు ల్యాబ్లలో ఇదొకటి.
డీఎంఆర్ఎల్లో శాస్త్రవేత్తగా పనిచేస్తున్న రామకృష్ణన్ రాఘవన్ హైదరాబాద్ ప్రయోగశాలకు డైరెక్టర్గా నియమితులయ్యారు. స్మార్ట్ మెటీరియల్స్పై ఇక్కడ పరిశోధనలు చేయనున్నారు.
ఆర్సీఐకి చెందిన శాస్త్రవేత్త.. ఖమ్మంకు చెందిన పర్వతనేని శివప్రసాద్ కోల్కతాలో ఏర్పాటు చేసిన యువ శాస్త్రవేత్తల ప్రయోగశాలకు డైరెక్టర్గా నియమితులయ్యారు.
రక్షణ రంగంలో యువశాస్త్రవేత్తలు పరిశోధనలు చేసే అంశాలు : కృత్రిమ మేధ, క్వాంటమ్ టెక్నాలజీ, కాగ్నిటివ్ టెక్నాలజీస్, అసిమెట్రిక్ టెక్నాలజీ, స్మార్ట్ మెటీరియల్స్.
రైలు సమాచారమంతా 139 లోనే.  182 మినహా మిగతా నంబర్లు రద్దు :
  139 నుంచి 12 భారతీయ భాషల్లో సేవలు అందనున్నాయి. అన్ని రకాల ఫోన్ల ద్వారా ఈ సేవల్ని పొందవచ్చు. అత్యవసర సేవలకు 182 మాత్రం కొనసాగుతుంది.

కాలాపానీపై  కయ్యం ఎందుకు ? @భారత్-నేపాల్ సరిహద్దు :


కాలాపానీ.. ఈ పేరు చెప్పగానే అందరికీ అండమాన్లో జైలే గుర్తుకొస్తుంది. కానీ భారత్-నేపాల్ సరిహద్దులో మరో కాలాపానీ ఉంది. ఆ ప్రాంతం ఇప్పుడు రెండు దేశాల మధ్య చిచ్చు రాజేస్తోంది. భారతదేశం గత నవంబరులో విడుదలచేసిన సరిహద్దు మ్యాప్పై నేపాల్ అభ్యంతరాలు వ్యక్తంచేస్తోంది.
జమ్ము-కశ్మీర్ పునర్వ్యవస్థీకరణ తర్వాత విడుదల చేసిన ఈ మ్యాప్లో- నేపాల్లో అంతర్భాగంగా ఉన్న కాలాపానీ, లింపియధుర, లిపులేక్ ప్రాంతాలను కూడా భారత్ తన భూభాగాలుగా చూపిందని ఆరోపిస్తోంది.
ఇది భారత్-నేపాల్-టిబెట్ (చైనా) ముక్కోణ ప్రాంతాని (ట్రై జంక్షన్)కి సమీపంలో ఉంది. 35 చ.కి.మీ.ల ప్రాంతం. తమ దేశంలోని దర్చులా జిల్లాలో ఉన్న కాలాపానీని భారతదేశం ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని పిథోరాగఢ్ జిల్లాలో భాగంగా చూపిందని నేపాల్ ఆరోపిస్తోంది.
ఆంగ్లో-నేపాల్ యుద్ధం తర్వాత- 1816లో ఇరు దేశాలూ సుగౌలీ ఒప్పందంపై సంతకం చేశాయి. కాలాపానీ ప్రాంతం గుండా ప్రవహించే మహాకాళి నదిని నేపాల్కు పశ్చిమ సరిహద్దుగా గుర్తించారు. ఒప్పందం ప్రకారం డార్జిలింగ్ సహా కొన్ని నేపాలీ ప్రాంతాలను ఈస్ట్ ఇండియా కంపెనీకి దఖలుపరిచారు.
నది ఎండిపోవడంతో క్రమంగా అంతర్ధానమైన ధోలవీరా. తొలిసారిగా గుర్తించిన భారత పరిశోధకులు :

హరప్పా నాగరికతకు సంబంధించిన అద్భుత నగరాల్లో ధోలవీరా ఒకటి. గుజరాత్లోని రణ్ ఆఫ్ కచ్ ప్రాంతంలో బయటపడ్డ ఈ నగరానికి సంబంధించి తాజాగా పరిశోధకులు ఆసక్తికర విషయాన్ని కనుగొన్నారు.
ఇతిహాసాల్లో పేర్కొన్న సరస్వతీ నదిని తలపించే ఓ నది రణ్ ఆఫ్ కచ్లో ఒకప్పుడు ప్రవహించేందని గుర్తించారు. హిమాలయాల్లోని మంచు అందులోని నీటికి ఆధారమని తెలిపారు.
పర్యావరణంలో ప్రతికూల మార్పుల కారణంగా దాదాపు 4 వేల ఏళ్ల క్రితం భయంకర కరవు సంభవించి నది పూర్తిగా ఎండిపోయిందని వివరించారు. ఫలితంగా కాలక్రమంలో నగరమూ అంతరించిపోయిందని పేర్కొన్నారు.
తాజా పరిశోధనలో ఐఐటీ ఖరగ్పుర్, ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా(ఏఎస్ఐ), దక్కన్ కాలేజ్ పీజీఆర్ఐ-పుణె, ఫిజికల్ రీసెర్చ్ లేబొరేటరీ(పీఆర్ఎల్), గుజరాత్ సాంస్కృతిక విభాగం పరిశోధకులు పాలుపంచుకున్నారు.

ఇతర రాష్ట్రాలు / కేంద్ర పాలిత ప్రాంతాల వార్తలు

UPSRTC launched ‘Damini’ helpline service for women :


  మహిళా ప్రయాణికుల భద్రతను పరిగణనలోకి తీసుకుని యుపిఎస్‌ఆర్‌టిసి (ఉత్తర ప్రదేశ్ స్టేట్ రోడ్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్) ‘డామిని’ హెల్ప్‌లైన్ సేవలను ప్రారంభించింది. ‘నిర్భయ యోజన’ పొడిగింపుగా ఈ హెల్ప్‌లైన్ కోసం “81142-77777” అనే ప్రత్యేక నెంబర్ ఏర్పాటు చేసింది.
  ఈ హెల్ప్‌లైన్‌ను ఉపయోగించడం ద్వారా మహిళా ప్రయాణీకులు హెల్ప్‌లైన్ నంబర్‌కు కాల్ చేయడం ద్వారా మరియు వాట్సాప్ సేవను ఉపయోగించడం ద్వారా తమ ఫిర్యాదులను నమోదు చేయవచ్చు.

సదస్సులు

107వ  ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ సదస్సు : University of Agricultural Sciences, Bangalore 3-7th January, 2020


Focal Theme – “Science & Technology : Rural Development”
At last year’s ISC at Lovely University, Jalandhar, G. Nageswara Rao, the then vice-chancellor of Andhra University, asserted that the Kauravas of the Mahabharata were born of the stem-cell technology and test-tube baby science, and that Rama and Ravana had fought with ‘guided missiles.’
The Kolkata-based ISCA has been the organiser of the congress since 1914, and is funded by the Union Department of Science and Technology.
Prime Minister Narendra Modi is slated to inaugurate the congress, which is scheduled to take place between January 3-7, at the Gandhi Krishi Vignana Kendra (University of Agricultural Sciences) in Bengaluru on January 3.
The theme for the congress this year is ‘science and technology: rural development’. To emphasise it, the function, which draws young scholars in droves, will include a Farmer’s Science Congress, providing a platform for innovative farmers.
The farmer’s congress will also discuss agrarian distress and strategies to mitigate and navigate the impact of climate change on agriculture, among other pressing issues.

         Appointments

NMC ఛైర్మన్గా సురేశ్ చంద్రశర్మ నియామకం :

జాతీయ వైద్య కమిషన్ (ఎన్ఎంసీ) ఛైర్మన్గా ప్రొఫెసర్ సురేశ్ చంద్ర శర్మ నియమితులయ్యారు. ఎన్ఎంసీ ఛైర్మన్ పదవిలో మూడేళ్లు లేదా ఆయనకు 70ఏళ్లు వచ్చేవరకూ కొనసాగుతారు.

Reports/Ranks/Records

Madhya Pradesh more tiger deaths : 


  Madhya Pradesh, which has the highest number of tigers in the country (526, as per the last census), recorded the most number of cases (31) of tiger deaths.
  This was followed by Maharashtra, which reported 18 deaths. Karnataka, another State with high tiger population, recorded 12 deaths, and Uttarakhand recorded ten deaths.
  For the first time in the past three years, the number of tiger deaths in a year in the country has been less than 100. According to data from the Ministry of Forest Environment and Climate Change (MoEFCC), there were 84 cases of tiger deaths in the country.
  In 2018, the number of tiger deaths recorded was 100. The last tiger census report, released in July 2019, had placed the number of tigers in India at 2,967, up by a third when compared with the numbers reported in 2014.

అవార్డులు

Piyuus Jaiswal honoured with Global Bihar Excellence Awards 2019 :


i. Piyuus Jaiswal was awarded the Global Bihar Excellence Award 2019. This award was presented by Rajya Sabha MP and Padma Shri Awardee Dr CP Thakur and Bihar Women Commission president Dilmani Devi in Patna to promote women empowerment.
ii. Piyuus Jaiswal was recently awarded the humanitarian award with the Global Peace Excellence Humanitarian Award 2019 on the occasion of International Human Day.
iii. The award was given to recognise and felicitated Piyuus Jaiswal’s contribution towards social welfare, women empowerment and introducing new talent in the field of arts and culture.

Art and Culture 

Stage set for flamingo festival :


i. ఎస్ఆర్ఎస్పి నెల్లూరు జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో శుక్రవారం నుంచి వార్షిక మూడు రోజుల ఫ్లెమింగో ఉత్సవానికి వేదిక సిద్ధమైంది. భారీ వర్షాలకు ఫ్లెమింగోలతో సహా వలస పక్షులు సుందరమైన పులికాట్ సరస్సు వద్ద పెద్ద సంఖ్యలో వచ్చాయి.
ii. పర్యావరణ మంత్రి బలినేని శ్రీనివాస రెడ్డి ఈ పండుగను అధికారికంగా ప్రారంభిస్తారు మరియు పొరుగున ఉన్న ఒడిశాలోని చిల్కా సరస్సు తరువాత దేశంలో అతిపెద్ద ఉప్పునీటి పర్యావరణ వ్యవస్థ అయిన సరస్సు వద్ద వృక్షజాలం మరియు జంతుజాలంపై విద్యా పోస్టర్లను విడుదల చేస్తారు.
iii. గ్రే పెలికాన్లు, ఓపెన్-బిల్ కొంగలు, లిటిల్ కార్మోరెంట్స్ కొరకు సురక్షితమైన స్వర్గధామమైన నెలపట్టులో కూడా పక్షులను చూడటానికి బైనాక్యులర్లు ఏర్పాటు చేయబడ్డాయి. పండుగలో భాగంగా వృక్షజాలం మరియు జంతుజాలంపై విద్యా చిత్రాలు కూడా ప్రదర్శించబడతాయని తెలిపారు.

‘Lai Haraoba’ ritualistic festival begins in Tripura :


  త్రిపుర, లై హరొబాలో, మణిపురి మైటీ కమ్యూనిటీలు గమనించిన ఒక కర్మ పండుగ అగర్తాలాలో ప్రారంభమైంది. 5 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాన్ని సమాచార, సాంస్కృతిక వ్యవహారాల శాఖ, త్రిపుర ప్రభుత్వం, పుతిబా లై హరొబా కమిటీ, అగర్తాల పుతిబా వెల్ఫేర్ & కల్చరల్ సొసైటీ సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి.
  లై హరొబాను మౌఖిక సాహిత్యం, సంగీతం, నృత్యం మరియు ఆచారాల ద్వారా జరుపుకుంటారు. ఈ ఉత్సవంలో పాల్గొనడానికి మణిపూర్ నుండి ఒక సాంస్కృతిక బృందం కూడా వచ్చింది. పండుగ సందర్భంగా మణిపురి మార్షల్ ఆర్ట్స్, జానపద సంగీతం మరియు జానపద నృత్యాలతో సహా వివిధ సాంస్కృతిక మరియు సాంప్రదాయ సంగీత స్కిట్లను వారు ప్రదర్శించనున్నారు.

BOOKS

‘జర్నీ త్రూ టర్బులెంట్ టైమ్స్’ - హెచ్.జె.దొర


  మాజీ డీజీపీ హెచ్.జె.దొర రచించిన తన ఆత్మకథ ‘జర్నీ త్రూ టర్బులెంట్ టైమ్స్’ పుస్తకాన్ని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు ప్రగతి భవన్లో ఆవిష్కరించారు.
సినిమా వార్తలు
1971 భారత్-పాక్ యుద్ధం నేపథ్యంలో అజయ్దేవగణ్ చిత్రం ‘భుజ్: ది ప్రైడ్ఆఫ్ ఇండియా’ :

  అజయ్దేవగణ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘భుజ్: ది ప్రైడ్ఆఫ్ ఇండియా’. సంజయ్దత్, రానా, సోనాక్షి సిన్హా కీలక పాత్రధారులు. 1971లో జరిగిన భారత్- పాక్ యుద్ధం నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది.
  యుద్ధ సమమంలో గుజరాత్లోని భుజ్ విమానాశ్రయం రన్వేని  బాంబులతో పేల్చేస్తుంది పాకిస్తాన్ సైన్యం. దీంతో అక్కడ భారత్ యుద్ధ విమనాలు దిగడం కష్టమవుతుంది.
  ఇలాంటి పరిస్థితుల్లో భుజ్ విమానాశ్రమ బాధ్యుడు ఐఏఎఫ్ స్క్వాడ్రన్ లీడర్ విజయ్ కర్నిక్ తన అధికార బృందంతో పాటు స్థానికంగా ఉండే 300 మహిళల సాయంతో దాన్ని పునరుద్ధరిస్తాడు. విజయ్ కర్నిక్ పాత్రలోనే అజయ్దేవ్గణ్ నటిస్తున్నారు.

మరణాలు

Devi Prasad Tripathi passes away :


  Devi Prasad Tripathi, general secretary of the Nationalist Congress Party (NCP), passed away. Widely renowned for his erudition and oratory,
  Tripathi, 70, was the party Rajya Sabha member from 2012 to 2016. Tripathi was born in Sultanpur, Uttar Pradesh, and grew up in Howrah and was educated at the Allahabad University and the Jawaharlal Nehru University where he became the president of the JNU Students Union (JNUSU) during the Emergency.
  He began his political career as an adviser to Rajiv Gandhi in 1983. He became a founding member of the NCP alongside Sharad Pawar and P.A. Sangma because of differences with the Congress leadership in 1999.

ముఖ్యమైన రోజులు

సతీష్ ధావన్ 18వ వర్ధంతి - 2002 జనవరి 3


i. సతీష్ ధావన్ (1920 సెప్టెంబరు 25 – 2002 జనవరి 3) భారతీయ ఏరోస్పేస్ ఇంజనీరు. ఆయన్ను భారత ఎక్స్పెరిమెంటల్ ఫ్లూయిడ్ డైనమిక్స్ కు పితామహుడిగా పరిగణిస్తారు.
ii. శ్రీనగర్ లో  జన్మించిన ధావన్,  భారత్ లోను,  అమెరికా లోనూ తన  విద్యాభ్యాసాన్ని  పూర్తి చేసాడు.  టర్బులెన్స్, బౌండరీ  లేయర్స్ రంగాల్లో ఆయన్ను అత్యున్నత స్థాయి పరిశోధకుల్లో ఒకరిగా  పరిగణిస్తారు. ఈ రంగాల్లో  ఆయన  శక్తి సామర్థ్యాలు  భారత  స్వదేశీ  అంతరిక్ష  కార్యక్రమ అభివృద్ధికి  దోహదపడింది. 1972లో  ఎమ్.జి.కె. మీనన్ తరువాత,  ఇస్రో ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించాడు.
iii. ధావన్ స్పేస్ కమిషను ఛైర్మనుగా, ఇస్రో ఛైర్మనుగా భారత ప్రభుత్వ అంతరిక్ష శాఖలో సెక్రెటరీగా బాధ్యతలు స్వీకరించాడు.  బాధ్యతలు  తీసుకోగానే  అణుశక్తి  కమిషనులో  ఉన్న బ్రహ్మ ప్రకాష్‌ను  తిరువనంతపురంలో  ఉన్న విక్రం సారాభాయ్  అంతరిక్ష  కేంద్రానికి  ఛైర్మనుగా  నియమించాడు.
iv. ఇస్రో శీఘ్రగతిన ఎదగడానికి ఈ చర్య ఎంతో తోడ్పడింది. ఆ తరువాత భారత తొలి ఉపగ్రహ  వాహక  నౌక  ఎస్‌ఎల్‌వి  అభివృద్ధి  కార్యక్రమానికి  అబ్దుల్  కలాంను నాయకుడిగా నియమించాడు.
v. 1975 లో ఎ.పి.జె. అబ్దుల్ కలామ్ నాయకత్వంలో ఎస్‌ఎల్‌వి అభివృద్ధి జరుగుతోంది. దాని మొదటి ప్రయోగం విఫలమైంది. వైఫల్యానికి బాధ్యత వహిస్తూ ఆనాటి పత్రికా సమావేశంలో పాల్గొని వైఫల్యాన్ని స్వీకరించాడు. రెండవ ప్రయోగం విజయవంతమైనపుడు ఆనాటి పత్రికా సమావేశాన్ని అబ్దుల్ కలాం చేత చేయించాడు.
vi. 1951 లో ధావన్ భారత్ శాస్త్ర విజ్ఞాన సంస్థలో ఉపాధ్యాయుడిగా చేరాడు. 1962 దాని డైరెక్టరుగా నియమితుడయ్యాడు. తాను ఇస్రో ఛైర్మనుగా ఉన్నప్పటికీ, బౌండరీ లేయర్ పరిశోధనలో తన శక్తియుక్తులు నియోగించాడు.  ఆయన చేసిన పరిశోధనలను హెర్మన్ ష్లిక్టింగ్, తాను రాసిన బౌండరీ లేయర్ థియరీ పుస్తకంలో వివరించాడు. ధావన్ ఐఐఎస్‌సి లో భారతదేశపు మొట్టమొదటి సూపర్‌సోనిక్ విండ్ టన్నెల్‌ను నిర్మించాడు.
vii. 2002 లో ధావన్ మరణించాక, నెల్లూరు జిల్లా శ్రీహరికోట లోని అంతరిక్ష ప్రయోగ కేంద్రానికి ఆయన పేరుతో సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రంగా పేరు పెట్టారు. లూఢియానా లోని ప్రభుత్వ కళాశాలను ఆయన పేరిట మార్చారు.
viii. పురస్కారాలు :
పద్మ విభూషణ్, 1981
పద్మ భూషణ్, 1971
ఇందిరా గాంధీ జాతీయ సమగ్రతా పురస్కారం, 1999
భారతదేశ మహిళా ఉపాధ్యాయుల దినోత్సవం (సావిత్రిబాయి ఫూలే జననం) : 3 జనవరి

సావిత్రిబాయి ఫూలే (3 జనవరి 1831 – 10 మార్చి 1897) భారతీయ సంఘ సంస్కర్త, ఉపాధ్యాయిని, రచయిత్రి. ఆమె నిమ్న వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన జ్యోతీరావ్ ఫులే భార్య. కులమత భేదాలకు అతీతంగా సమాజాన్ని ప్రేమించిన ప్రేమస్వరూపిణి.
ఆధునిక విద్య ద్వారానే స్త్రీ విముక్తి సాధ్యపడుతుందని నమ్మిన ఆమె తన భర్తతో కలసి 1848 జనవరి 1న పూణేలో మొట్టమొదటగా బాలికల పాఠశాలను ప్రారంభించింది. కుల వ్యవస్థకు, పితృస్వామ్యానికి వ్యతిరేకంగా, శూద్రుల, అస్పృశ్యుల, మహిళల సకల హక్కుల కోసం పోరాటం చేయటం తమ సామాజిక బాధ్యతగా ఆ దంపతులు విశ్వసించారు. నూతన వ్యవస్థ కోసం, ప్రాణాల్ని సైతం ఫణంగా పెట్టి సమష్టిగా పోరాటం చేసారు.
సమాజంలోని కులతత్వం, పురుషాధిక్యత ధోరణులు కలిగిన చాలామంది పండిత మేధావులందరికీ కూడా ఆమె కేవలం జ్యోతిరావు పూలే భార్యగా మాత్రమే తెలుసు. కానీ ఆమె ఆధునిక భారతదేశంలో మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు. పీడిత ప్రజలు ముఖ్యంగా స్త్రీల విద్యాభివృద్ధికి కృషి చేసిన తొలితరం మహిళా ఉద్యమకారిణి.
ఆమె మహారాష్ట్ర సతారా జిల్లాలో నయాగావ్ అనే గ్రామంలో 1831 జనవరి 3 న ఒక రైతు కుటుంబంలో జన్మించింది. సావిత్రి బాయి కుటుంబానికి తెలంగాణ ప్రాంతంతో బంధుత్వం ఉంది. వీరి బంధువులు నిజామాబాద్ జిల్లా లో బోధన్ నాందేడ్ కొండల్ వాడి ప్రాంతంలో , అదిలాబాద్ చుట్టుపక్కల ఉన్నరు. బోధన్ ప్రాంతపు మున్నూరుకాపులు వీరికి చుట్టాలు. ఆమె తన 9వ యేట 12 యేండ్ల జ్యోతిరావు ఫూలెను 1840లో వివాహమాడింది. నిరక్షరాస్యురాలిగా ఉన్న ఆమెకు భర్త జ్యోతిరావు పూలే మొదటి గురువు.
1897 లో ప్లేగు వ్యాధి, పూణే నగరాన్ని వణికించింది. నగరమంతా ఎడారిగా మారింది. జనమంతా దగ్గర్లోని అడవుల్లోకి పారిపోయారు. అయినా సావిత్రీబాయి పూలే కొడుకు యశ్వంత్ తో కలిసి  వ్యాధిగ్రస్తులకు సేవ చేసారు. చివరికి ఆ ప్లేగు వ్యాధే ఆమెకి సోకి మార్చి 10, 1897 లో మరణించింది.
సావిత్రి బాయి జయంతిని భారతదేశ మహిళా ఉపాధ్యాయుల దినోత్సవంగా జరుపుకుంటున్నాము. 1997లో భారత ప్రభుత్వం సావిత్రిబాయి జ్ఞాపకార్థం తపాలా స్టాంపును విడుదల చేసింది. పూణే విశ్వవిద్యాలయానికి సావిత్రిబాయి పేరు పెట్టారు

క్రీడలు

Lawn bowls & Cycling to be included in 3rd Khelo India Games


  Chief Executive Officer of “Khelo India Games” has announced that “Lawn bowls” and “cycling” will be included in the 3rd edition of Khelo India Games.
  The two games will be included in the event for the first time. The 3rd edition of the tournament will be held in Guwahati, Assam in January 2020. Athletes from all over the country will be coming to Guwahati for the Khelo India Youth Games.
>>>>>>>>>>>>>>>>  End of the day  <<<<<<<<<<<<<<<<


No comments:

Human Body

 మానవ శరీరం గురించి మనం మానవ శరీరాన్ని మైక్రోస్కోపిక్ స్థాయిలో "విచ్ఛిన్నం" చేస్తే, కణం దాని అత్యంత ప్రాథమిక యూనిట్‌గా ఉంటుంది. సగ...