Saturday, 4 January 2020

✍ కరెంట్ అఫైర్స్ 4 జనవరి 2020 Saturday ✍ news



✍  కరెంట్ అఫైర్స్ 4 జనవరి 2020 Saturday ✍

https://play.google.com/store/apps/details?id=com.news.jaaga

  Daily Current affairs prepared from Eenadu, The Hindu newspaper and from online current affair websites, Wikipedia etc..

తెలంగాణ వార్తలు

ఉద్యమ స్ఫూర్తి.. అక్షర కీర్తి..  ‘ఈచ్ వన్... టీచ్ వన్’కు అందరి సహకారం అవసరం :


i. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన 2011 జనాభా లెక్కల ప్రకారం... తెలంగాణలో 1.04 కోట్ల మంది నిరక్షరాస్యులున్నారు. 66.46% అక్షరాస్యతతో అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలతో పోలిస్తే 32వ స్థానంలో నిలిచింది.
ii. ప్రపంచసగటు(86%)కు ఇది ఎంతో దూరం. యూనిసెఫ్ నిబంధనల ప్రకారం 6-14 సంవత్సరాల లోపు పిల్లల్లో ఒక్కరు కూడా నిరక్షరాస్యులు ఉండొద్దు. కానీ... తెలంగాణలో 20% మంది ఇంకా బడికి దూరంగా ఉండటం ఆందోళన కలిగిస్తోంది.
iii. ఇటీవలి జాతీయ నమూనా సర్వే సైతం మన అక్షరాస్యత అంచనా 73% మాత్రమేనంటూ వెల్లడించడం గమనార్హం. ముఖ్యంగా ఎస్సీల్లో 49.50%, ఎస్టీల్లో 58.90% మాత్రమే చదువుకున్న వారుండటం కలవరపరుస్తోంది. సమస్య పరిష్కారానికి 50-70, ఆపైన వయసున్న వారిని దృష్టిలో ఉంచుకుని ప్రణాళికలకు రూపకల్పన చేయాల్సి ఉంది.
iv. కేంద్ర ప్రభుత్వం 1988లో జాతీయ అక్షరాస్యత ఉద్యమాన్ని ప్రారంభించింది. ఈక్రమంలో 1991-2001 మధ్య ఉమ్మడి రాష్ట్రంలోనూ అక్షరాస్యత కార్యక్రమాలను ఉద్ధృతంగా అమలు చేశారు. కలెక్టర్లకు బాధ్యత అప్పగించి వయోజన విద్యపై నిరంతర అనుశీలన చేయడంతో ఏడాదికి సగటున 1.6 శాతం చొప్పున ఆ దశాబ్దం మొత్తంగా 16 శాతం అక్షరాస్యత పెరిగింది.
v. కేరళ అక్షరాస్యతలో దేశంలోనే ముందుంది. 2011లో 93.91% నమోదైనా... ఇంకా 18 లక్షల మంది నిరక్షరాస్యులను గుర్తించారు. వారి కోసం ‘అక్షర లక్ష్యం’ పథకానికి రూపకల్పన చేశారు.
vi. అక్షరాస్యతలో మనకంటే వెనకుండే మధ్యప్రదేశ్ ప్రాథమిక విద్యపై గురిపెట్టడంతో 2011లో నాలుగు మెట్లుపైకి చేరుకుంది. చత్తీస్గఢ్ సైతం వయోజన విద్య(15, ఆపై వయసు)పై దృష్టి కేంద్రీకరించి అక్షరాస్యత శాతాన్ని బాగా పెంచుకుంటోంది.

ఆంధ్రప్రదేశ్ వార్తలు

పాలనా కేంద్రం విశాఖే. అమరావతి నిర్మాణం అసాధ్యం. అక్కడ అసెంబ్లీ, హైకోర్టు బెంచి ఉంటే చాలు. న్యాయ సంబంధిత విభాగాలన్నీ కర్నూలులో : నివేదిక ఇచ్చిన బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్


i. జీఎన్ రావు కమిటీ నివేదిక తరహాలోనే బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ నివేదిక సాగింది. అమరావతిలో రాజధాని నిర్మాణం అసాధ్యమని బీసీజీ చెప్పింది. రూ.1.10 లక్షల కోట్ల పెట్టుబడి పెట్టి.. 10-15 ఏళ్ల తర్వాత ఎకరం రూ.20 కోట్లకు విక్రయిస్తే గానీ అది జరిగే పని కాదని చెప్పింది.
ii. మొత్తానికి అమరావతిని నామమాత్రం చేసింది. న్యాయ సంబంధిత కార్యాలయాలన్నీ కర్నూలు కేంద్రంగా ఉండాలని ప్రతిపాదించింది. రాష్ట్రాన్ని ఆరు ప్రాంతాలుగా విభజించి శాఖాధిపతుల కార్యాలయాలకు అనుబంధంగా శాటిలైట్ కమిషనరేట్లు ఉండాలని సూచించింది.
iii. రాష్ట్రంలో ఒక పక్కగా ఉన్న విశాఖను సీమవాసులు ఎలా చేరుకుంటారన్న విమర్శలకు.. అసలు సచివాలయానికి సందర్శకులు రావాల్సిన అవసరాన్నే తగ్గించాలని పరిష్కారం సూచించింది. విశాఖలోనే పూర్తిస్థాయి రాజధాని ఏర్పాటు చేయడం మంచిదని సూచించింది.
iv. సచివాలయం, ప్రభుత్వ విభాగాలు, ముఖ్యమంత్రి, గవర్నర్ క్యాంపు కార్యాలయాలు, అత్యవసర సమావేశాల కోసం శాసనసభ, హైకోర్టు బెంచ్ వంటివన్నీ విశాఖపట్నంలో ఏర్పాటు చేయాలంది.
v. మన దేశంలోను ఏడు రాష్ట్రాల్లో రాజధాని ఒక చోట, హైకోర్టు మరో చోట ఉన్నాయని తెలిపింది. కర్ణాటక, మహారాష్ట్ర, హిమాచల్ప్రదేశ్ల్లో శాసనసభ సమావేశాలు రెండు చోట్ల జరుగుతున్నాయని ప్రస్తావించింది. 1972 నుంచి 2013 వరకు ప్రపంచవ్యాప్తంగా 32 గ్రీన్ఫీల్డ్ నగరాల్ని నిర్మిస్తే చైనాలోని షెంజెన్, మన దేశంలోని నవీముంబయి మాత్రమే విజయవంతమయ్యాయి.
vi. బోస్టన్ కన్సల్టింగ్ గ్రూపు (బీసీజీ)ను 1963లో స్థాపించారు. బ్రూస్ హెండర్సన్ దీని వ్యవస్థాపకుడు. అమెరికాలోని బోస్టన్ కేంద్రంగా ఈ సంస్థ పనిచేస్తోంది.

Andhra Pradesh Govt. appoints two ‘Disha Special Officers’ :


i. The Andhra Pradesh government-appointed Indian Administrative Service (IAS) official Dr Kritika Shukla and Indian Police Service (IPS) official M Deepika, as Special Officers for implementing the Andhra Pradesh Disha Act 2019.
ii. The Act is intended for speedy trial and faster execution in cases of sexual offences against women in the state.
iii. To ensure a speedy trial, the state will set up exclusive special courts in all the 13 districts to deal with cases of offences against women and children including rape, acid attacks, stalking, voyeurism, social media harassment of women, sexual harassment and all cases under POCSO Act.

ఇతర రాష్ట్రాలు / కేంద్ర పాలిత ప్రాంతాల వార్తలు

Kerala became 1st State to pass resolution against CAA :

 
Kerala became the 1st state in the country to pass a resolution against the Citizenship Amendment Act.
The resolution was moved by Kerala’s Chief Minister Pinarayee Vijayan and was seconded by the Leader of Opposition Ramesh Chennithala.
Several other chief ministers of West Bengal, Punjab, Maharashtra, Rajasthan, Delhi have also announced for not implementing CAA in their states.

Gujarat CM unveils world’s 2nd tallest statue of Sardar Vallabhbhai Patel :


i. గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ ప్రపంచంలోని 2 వ ఎత్తైన సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహాన్ని అహ్మదాబాద్‌లో ఆవిష్కరించారు. 70 వేల కిలోగ్రాముల బరువు, 50 అడుగుల పొడవైన కాంస్య విగ్రహాన్ని అహ్మదాబాద్‌లోని వైష్ణోదేవి సర్కిల్‌కు సమీపంలో ఉన్న సర్దార్థం క్యాంపస్‌లో ఆవిష్కరించారు.
ii. సర్దార్ పటేల్ విగ్రహాన్ని పద్మ భూషణ్ రామ్ వి. సుతార్ రూపొందించారు, అదే శిల్పి 'స్టాట్యూ ఆఫ్ యూనిటీ' ను రూపొందించారు.

‘Cyber Safe Women’ initiative launched by Maharashtra Govt :


i. Maharashtra Government has launched a ‘Cyber Safe Women’ initiative under which awareness camps will be held across all the districts of the state regarding cyber safety.
ii. The initiative will help in educating women about how the web is used by anti-social elements and child predators to commit various types of crimes.

అంతర్జాతీయ వార్తలు

డ్రోన్ దాడితో ఇరాన్ అగ్రశ్రేణి జనరల్ను చంపేసిన అమెరికా. బాగ్దాద్ విమానాశ్రయంలో ఘటన :

 
i. పశ్చిమాసియాలో యుద్ధమేఘాలు కమ్ముకొన్నాయి. కొన్నాళ్లుగా ఉప్పూ నిప్పుగా ఉన్న అమెరికా, ఇరాన్ల మధ్య ఒక్కసారిగా అగ్గి రాజుకుంది. ఇరాక్లో అమెరికా చేపట్టిన డ్రోన్ దాడిలో ఇరాన్ సైన్యంలోని రివల్యూషనరీ గార్డ్స్కు శక్తిమంతమైన కమాండర్గా ఉన్న జనరల్ ఖాసిం సులేమానీ (62) చనిపోయారు.
ii. విదేశాల్లోని తమ సిబ్బందిని రక్షించడానికే ఈ చర్యను చేపట్టామని అమెరికా రక్షణశాఖ ప్రధాన కార్యాలయం పెంటగాన్ పేర్కొంది. సులేమానీ, ఇరాన్ మద్దతున్న ఇరాక్ పారామిలటరీ దళం ‘హషీద్ అల్ షాబీ’కి చెందిన అధికారులు బాగ్దాద్ అంతర్జాతీయ విమానాశ్రయం లోపలి నుంచి బయటకు వచ్చినప్పుడు దాడి జరిగింది.
iii. ఇరాన్ అగ్ర నాయకుడు అయతుల్లా అలీ ఖమైనీ తర్వాత దేశంలో రెండో శక్తిమంతమైన వ్యక్తిగా జనరల్ సులేమానీకి పేరుంది. పశ్చిమాసియాలో ఇరాన్ సైనిక కార్యకలాపాలను ఈయన పర్యవేక్షించేవారు.
iv. సులేమానీ ఇరాన్లో జాతి హీరోగా మన్ననలందుకున్నారు. సులేమానీ హత్య అంతర్జాతీయ ముడి చమురు ధరలపై పెను ప్రభావం చూపింది.
v. ఇరాక్ ప్రధానమంత్రి - అదెల్ అబ్దెల్ మహదీ

ఆర్థిక అంశాలు

కృష్ణపట్నం పోర్ట్లో అదానీ పోర్ట్స్కు 75% వాటా :


i. అదానీ గ్రూపు సంస్థ అయిన అదానీ పోర్ట్స్ అండ్ ఎస్ఈజడ్ లిమిటెడ్, ఆంధ్రప్రదేశ్లోని కృష్ణపట్నం పోర్ట్ కంపెనీలో 75 శాతం వాటా సొంతం చేసుకోనుంది. ఈ విషయాన్ని బాంబే స్టాక్ ఎక్స్ఛేంజీ (బీఎస్ఈ) కి అదానీ పోర్ట్స్ వెల్లడించింది.

సదస్సులు

107వ భారత సైన్స్ కాంగ్రెస్ సమావేశాల ప్రారంభం @ University of Agricultural Sciences, Bangalore :


i. Focal Theme – “Science & Technology : Rural Development”
ii. బెంగళూరులోని గాంధీ కృషి విజ్ఞాన కేంద్రం (జీకేవీకే)లో ప్రధాని నరేంద్ర మోదీ భారత సైన్స్ కాంగ్రెస్ 107వ సమావేశాలను ప్రారంభించారు. ప్రపంచ ఆవిష్కరణల సూచీలో భారత్కు 52వ స్థానం లభించినందుకు శాస్త్రవేత్తలను ఆయన అభినందించారు.

28th World Book Fair to focus on Gandhi as writer :


i. The theme for World Book Fair 2020 - ‘Gandhi: The Writers’ Writer.
ii. The annual New Delhi World Book Fair, in its 28th edition, will focus on how Mahatma Gandhi influenced generations of writers through his writings.
iii. The fair, organised by the National Book Trust (NBT) in association with ITPO, will be inaugurated by Union Human Resource Development (HRD) Minister Ramesh Pokhriyal Nishank.
iv. Commemorating the 150th birth anniversary of Gandhi, the theme pavilion, inspired by Sabarmati Ashram, uses hand-spun materials as wall-cladding.
v. Besides an exclusive exhibition of 500 books on and by Gandhi in different languages, it will also host 30-panel discussions, book launches and performances related to the theme.
ఒప్పందాలు
GOI signed MoU with Flipkart under DAY-NULM scheme :
i. Government of India signed MoU with Flipkart for selling the products made by women self-help groups under Deendayal Antyodaya Yojana-National Urban Livelihoods Mission (DAY-NULM) on the e-commerce platform.
ii. Under the Deendayal Antyodaya Yojana-National Urban Livelihoods Mission (DAY-NULM), self-help groups consisting of 44 lakh women have been working across the country, a move aimed at making women financially independent.

BOOKS

‘Good Economics for Hard Times’ – By Abhijit Banerjee, Esther Duflo

 
i. The winners of the Nobel Prize show how economics, when done right, can help us solve the thorniest social and political problems of our day. Figuring out how to deal with today's critical economic problems is perhaps the great challenge of our time.
ii. Immigration and inequality, globalization and technological disruption, slowing growth and accelerating climate change--these are sources of great anxiety across the world, from New Delhi and Dakar to Paris and Washington, DC.
iii. In this revolutionary book, renowned MIT economists Abhijit V. Banerjee and Esther Duflo take on this challenge, building on cutting-edge research in economics explained with lucidity and grace.
iv. Original, provocative, and urgent, Good Economics for Hard Times makes a persuasive case for an intelligent interventionism and a society built on compassion and respect.

ముఖ్యమైన రోజులు

World Braille Day: 4 January


i. ప్రపంచ బ్రెయిలీ దినోత్సవాన్ని ఏటా జనవరి 4 న జరుపుకుంటారు. 2019 నుండి జరుపుకునే ప్రపంచ బ్రెయిలీ దినోత్సవం, అంధ మరియు పాక్షిక దృష్టిగల వ్యక్తుల కోసం మానవ హక్కుల యొక్క పూర్తి సాక్షాత్కారంలో కమ్యూనికేషన్ సాధనంగా బ్రెయిలీ యొక్క ప్రాముఖ్యతపై అవగాహన పెంచుతుంది.
ii. దృశ్య వైకల్యం ఉన్నవారికి - బ్రెయిలీ యొక్క ఆవిష్కర్త లూయిస్ బ్రెయిలీ జన్మదినాన్ని గుర్తుచేసుకుంటూ ఈ రోజు గుర్తించబడింది. లూయిస్ బ్రెయిలీ 1809 జనవరి 4 న ఉత్తర ఫ్రాన్స్లోని కూప్వ్రే పట్టణంలో జన్మించాడు.

క్రీడలు

రోహిత్ పేరుతో క్రికెట్ స్టేడియం :


i. భారత స్టార్ క్రికెటర్ రోహిత్ శర్మ పేరుతో హైదరాబాద్ శివార్లలో క్రికెట్ స్టేడియం నిర్మితం కానుంది. రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం కన్హ గ్రామ పంచాయతీలోని శ్రీ రామచంద్ర మిషన్ ఆశ్రమంలో ఈ స్టేడియానికి శంకుస్థాపన చేశారు.
ii. ఆశ్రమ అభ్యాసీలతో పాటు ప్రతిభావంతులందరికీ ఈ స్టేడియం అందుబాటులో ఉంటుందన్నారు. రోహిత్ శర్మ మాట్లాడుతూ.. రామచంద్ర మిషన్కు తన సహచర క్రికెటర్లను తీసుకురావాలనుకుంటున్నట్లు చెప్పాడు.

Manav Thakkar becomes world no.1 in ITTF rankings :


i. అండర్ -21 పురుషుల సింగిల్స్ విభాగంలో తాజా అంతర్జాతీయ టేబుల్ టెన్నిస్ ఫెడరేషన్ (ఐటిటిఎఫ్) ర్యాంకింగ్స్లో భారత ప్యాడ్లర్ మానవ్ ఠక్కర్ ప్రపంచ నంబర్ 1 అయ్యాడు. దీంతో హర్మీత్ దేశాయ్, జి సత్యన్, సౌమ్యజిత్ ఘోష్ తర్వాత ఈ ఘనత సాధించిన నాల్గవ భారతీయుడిగా తక్కర్ నిలిచాడు.
ii. కెనడాలోని మార్క్హామ్లో జరిగిన ఐటిటిఎఫ్ ఛాలెంజ్ ప్లస్ బెనెమాక్స్-కన్య నార్త్ అమెరికన్ ఓపెన్లో అండర్ -21 పురుషుల సింగిల్స్ టైటిల్ను కైవసం చేసుకున్న తర్వాత మానవ్ ఠక్కర్ అగ్రస్థానం సాధించాడు.
iii. అతను ఫిబ్రవరి 2018 లో అండర్ -18 విభాగంలో ప్రపంచ నంబర్ 1 గా నిలిచాడు. జకార్తాలో జరిగిన 2018 ఆసియా క్రీడలలో కాంస్య పతకం సాధించిన భారత పురుషుల జట్టులో అతను ఒకడు.
>>>>>>>>>>>>>>>>  End of the day  <<<<<<<<<<<<<<<<
     

No comments:

Human Body

 మానవ శరీరం గురించి మనం మానవ శరీరాన్ని మైక్రోస్కోపిక్ స్థాయిలో "విచ్ఛిన్నం" చేస్తే, కణం దాని అత్యంత ప్రాథమిక యూనిట్‌గా ఉంటుంది. సగ...