Thursday, 30 January 2020

26TH JANUARY 2020 CURRENT AFFAIRS EENADU NEWS

పద్మ  పురస్కారాలు

తెలుగు రాష్ట్రాల నుంచి మరో నలుగురికి పద్మశ్రీ పురస్కారాలు
తెలంగాణ నుంచి చింతల వెంకటరెడ్డి, విజయసారథి శ్రీభాష్యం
ఆంధ్ర నుంచి యడ్ల గోపాలరావు, దళవాయి చలపతిరావు..
తెలంగాణ నుంచి చింతల వెంకటరెడ్డి, విజయసారథి శ్రీభాష్యం
దివంగత నేతలు ఫెర్నాండెజ్‌, సుష్మ, జైట్లీలకు పద్మ విభూషణ్‌
25hyd-main4b_6.jpg
పద్మ విభూషణ్‌...
1 .జార్జ్‌ ఫెర్నాండెజ్‌ (మరణానంతరం)
2 .అరుణ్‌ జైట్లీ (మరణానంతరం)
3. అనిరుధ్‌ జగన్నాథ్‌ జీసీఎస్‌కే-మారిషస్‌
4. ఎం.సి.మేరీ కోమ్‌- మణిపుర్‌
5. ఛన్నులాల్‌ మిశ్ర-ఉత్తరప్రదేశ్‌
6. సుష్మాస్వరాజ్‌-దిల్లీ (మరణానంతరం)
7. విశ్వేశ తీర్థ స్వామిజీ- కర్ణాటక (మరణానంతరం)
25hyd-main4c_4.jpg
పద్మభూషణ్‌
1. ముంతాజ్‌ అలీ-కేరళ
2. సయ్యద్‌ మౌజీమ్‌ అలీ-బంగ్లాదేశ్‌ (మరణానంతరం)
3. ముజాఫర్‌ హుస్సేన్‌ బేగ్‌-జమ్ముకశ్మీర్‌
4. అజోయ్‌ చక్రవర్తి-పశ్చిమబెంగాల్‌
5. మనోజ్‌ దాస్‌-పుదుచ్చేరి
6. బాలకృష్ణ దోషి-గుజరాత్‌
7. కృష్ణమ్మాళ్‌ జగన్నాథన్‌-తమిళనాడు
8. ఎస్‌.సి.జమీర్‌-నాగాలాండ్‌
9. అనిల్‌ ప్రకాష్‌ జోషి-ఉత్తరాఖండ్‌
10 .సెరింగ్‌ లాండోల్‌-లద్దాఖ్‌
11. ఆనంద్‌ మహీంద్రా-మహారాష్ట్ర
12. ఎన్‌.ఆర్‌.మాధవ మీనన్‌-కేరళ (మరణానంతరం)
13. మనోహర్‌ పారికర్‌-గోవా (మరణానంతరం)
14. జగదీష్‌ సేథ్‌-యూఎస్‌ఏ
15. పి.వి.సింధు-తెలంగాణ
16. వేణు శ్రీనివాసన్‌-తమిళనాడు
25hyd-main4a_9.jpg
పద్మశ్రీ (118)
1. గురు షాషాధ]ర్‌ ఆచార్య-ఝార్ఖండ్‌
2. డాక్టర్‌ యోగి అరోన్‌-ఉత్తరాఖండ్‌
3 .జై ప్రకాష్‌ అగర్వాల్‌-దిల్లీ
4. జగదీశ్‌ లాల్‌ అహూజా-పంజాబ్‌
5. ఖాజీ మౌసమ్‌ అఖ్తర్‌-పశ్చిమ బెంగాల్‌
6. గ్లోరియా అరేరియా- బ్రెజిల్‌
7. ఖాన్‌ జహీర్‌ఖాన్‌ భక్తియార్‌ఖాన్‌-మహారాష్ట్ర
8. డాక్టర్‌ పద్మావతి బంధోపాధ్యాయ-ఉత్తరప్రదేశ్‌
9. డాక్టర్‌ సుషోవన్‌ బెనర్జీ-పశ్చిమ బెంగాల్‌
10. డాక్టర్‌ దిగంబర్‌ బెహరా-చŸండీగఢ్‌
11. డాక్టర్‌ దమయంతి బెశ్రా-ఒడిశా
12. పవార్‌ పొపట్‌రావు భగూజి-మహారాష్ట్ర
13. హిమ్మతరాం భంభు-రాజస్థాన్‌
14. సంజీవ్‌ బిక్చందాని-ఉత్తరప్రదేశ్‌
15. గఫూర్‌బాయ్‌ ఎం.బిలాఖియా-గుజరాత్‌
16. బాబ్‌ బ్లాక్‌మెన్‌-యూకే
17. ఇందిరా పి.పి.బోరా-అసోం
18. మదన్‌ సింగ్‌ చౌహాన్‌-ఛత్తీస్‌గఢ్‌
19. ఉషా చౌమర్‌-రాజస్థాన్‌
20. లిల్‌ బహుదూర్‌ ఛత్రీ-అసోం
21. లలిత, సరోజ చిదంబరం (ద్వయం)-తమిళనాడు
22. డాక్టర్‌ వజిరా చిత్రసేన-శ్రీలంక
23. డాక్టర్‌ పురుషోత్తం దధీచ్‌-మధ్యప్రదేశ్‌
24. ఉత్సవ్‌ చరణ్‌దాస్‌-ఒడిశా
25. ప్రొఫెసర్‌ ఇందిరా దసనాయకే-శ్రీలంక (మరణానంతరం)
26. హెచ్‌.ఎం.దేశాయ్‌-గుజరాత్‌
27. మనోహర్‌ దేవ్‌దాస్‌-తమిళనాడు
28. వోనిమ్‌ బెంబెం దేవి-మణిపూర్‌
29. లియా దిస్కిన్‌-బ్రెజిల్‌
30. ఎం.పి.గణేష్‌-కర్ణాటక
31. డాక్టర్‌ బెంగళూర్‌ గంగాధర్‌-కర్ణాటక
32. డాక్టర్‌ రమణ్‌ గంగాకేద్కర్‌-మహారాష్ట్ర
33. బారీ గార్డినర్‌- యూకే
34. చవాంగ్‌ మోతుప్‌ గోబా-లద్దాఖ్‌
35. భరత్‌ గోయెంకా-కర్ణాటక
36. యడ్ల గోపాలరావు-ఆంధ్రప్రదేశ్‌
37. మిత్రభాను గౌంటియా-ఒడిశా
38. తులసి గౌడ-కర్ణాటక
39. సుజోయ్‌ కె.గుహ-బిహార్‌
40. హరేకళ హజబ్బా-కర్ణాటక
41. ఇనాముల్‌ హఖ్‌-బంగ్లాదేశ్‌
42. మధు మన్సూరి హస్ముఖ్‌-ఝార్ఖండ్‌
43. అబ్దుల్‌ జబ్బార్‌-మధ్యప్రదేశ్‌ (మరణానంతరం)
44. బిమల్‌ కుమార్‌ జైన్‌-బిహార్‌
45. మీనాక్షి జైన్‌-దిల్లీ
46 .నేమ్‌నాథ్‌ జైన్‌-మధ్యప్రదేశ్‌
47. శాంతి జైన్‌-కళలు-బిహార్‌
48. సుధీర్‌ జైన్‌-గుజరాత్‌
49. బెణిచంద్ర జమాతియా-త్రిపుర
50. కె.వి.సంపత్‌కుమార్‌, విదూషి జయలక్ష్మి కె.ఎస్‌. (ద్వయం)-కర్ణాటక
51. కరణ్‌ జోహార్‌-మహారాష్ట్ర
52. డాక్టర్‌ లీలా జోషి-మధ్యప్రదేశ్‌
53. డాక్టర్‌ సరితా జోషి-మహారాష్ట్ర
54. సి.కమ్లోవా-మిజోరాం
55. డాక్టర్‌ రవి కణ్నన్‌-అసోం
56. ఏక్తా కపూర్‌-మహారాష్ట్ర
57. యాజ్ధి నౌషిర్వాన్‌ కరాంజియా-గుజరాత్‌
58. డాక్టర్‌ నరిందర్‌ నాథ్‌ ఖన్నా-ఉత్తరప్రదేశ్‌
59. నవీన్‌ ఖన్నా-దిల్లీ
60. ఎస్‌.పి.కొఠారి-యూఎస్‌ఏ
61. వి.కె.మునుస్వామి కృష్ణపఖ్తర్‌-పుదుచ్చేరి
62. ఎం.కె.కుంజోల్‌-కేరళ
63. మన్మోహన్‌ మహాపాత్ర-ఒడిశా (మరణానంతరం)
64. ఉస్తాద్‌ అన్వర్‌ ఖాన్‌ మగ్నియార్‌-రాజస్థాన్‌
65. కట్టుంగల్‌ సుబ్రమణ్యిన్‌ మణిలాల్‌-కేరళ
66. మున్నా మాస్టర్‌-రాజస్థాన్‌
67. ప్రొఫెసర్‌ అభిరాజ్‌ రాజేందర్‌ మిశ్రా-హిమాచల్‌ ప్రదేశ్‌
68. బిణాపాణి మొహంతి- ఒడిశా
69. డాక్టర్‌ అరుణోదయ్‌ మోండల్‌-పశ్చిమబెంగాల్‌,
70. డాక్టర్‌ ప్రిత్‌వింద్రా ముఖర్జీ-ఫ్రాన్స్‌
71. సత్యనారాయణ్‌ ముందయూర్‌-(అరుణాచల్‌ ప్రదేశ్‌)
72. మణిలాల్‌ నాగ్‌-పశ్చిమబెంగాల్‌
73. ఎన్‌.చంద్రశేఖరన్‌ నాయర్‌-కేరళ
74. డాక్టర్‌ తెట్సు నకమురా-అఫ్గానిస్థాన్‌ (మరణానంతరం)
75. శివ్‌ దత్త్‌ నిర్మోహి-జమ్మూ-కశ్మీర్‌
76. పు లాల్‌బియాకత్సంగ -మిజోరం
77. ముజిక్కల్‌ పంకజాక్షి-కేరళ
78. డాక్టర్‌ ప్రశాంత కుమార్‌ పట్నాయక్‌-యూఎస్‌ఏ
79. జోగేంద్రనాథ్‌-అసోం
80. రహిబాయ్‌ సోమా పొపెరే-మహారాష్ట్ర
81. యోగేష్‌ ప్రవీణ్‌-ఉత్తర్‌ప్రదేశ్‌
82. జితు రాయ్‌-ఉత్తర్‌ప్రదేశ్‌
83. తరుణ్‌దీప్‌ రాయ్‌-సిక్కిం
84. ఎస్‌.రామకృష్ణన్‌-తమిళనాడు
85. రాణి రాంపాల్‌-హరియాణా
86. కంగనా రనౌత్‌-మహారాష్ట్ర
87. దళవాయి చలపతిరావు-ఆంధ్రప్రదేశ్‌
88. షాబుద్దీన్‌ రాథోడ్‌-గుజరాత్‌
89. కళ్యాణ్‌ సింగ్‌ రావత్‌-ఉత్తరాఖండ్‌
90. చింతల వెంకటరెడ్డి-తెలంగాణ
91. శాంతిరాయ్‌-బిహార్‌
92. రాధామోహన్‌, సబర్మతి (ద్వయం)-ఒడిశా
93. భతకృష్ణ సాహు-ఒడిశా
94. ట్రినిటి సాయూ-మేఘాలయ
95. అద్నాన్‌ సమీ-మహారాష్ట్ర
96. విజయ్‌శంకేశ్వర్‌-కర్ణాటక
97. డాక్టర్‌ కుశాల్‌ కన్వర్‌ శర్మ-అసోం
98. సయ్యద్‌ మహబూబ్‌ షా ఖాద్రీ అలియాస్‌ సయ్యద్‌ బాయ్‌-మహారాష్ట్ర
99. మహ్మద్‌ షరీఫ్‌-ఉత్తర్‌ప్రదేశ్‌
100. శ్యామ్‌ సుందర్‌ శర్మ-బిహార్‌
101. డాక్టర్‌ గుర్‌దీప్‌ సింగ్‌-గుజరాత్‌
102. రాంజీ సింగ్‌-బిహార్‌
103. వశిష్ట నారాయణ్‌ సింగ్‌-బిహార్‌ (మరణానంతరం)
104. దయా ప్రకాశ్‌ సిన్హా-ఉత్తరప్రదేశ్‌
105. డాక్టర్‌ షండ్ర దేశసౌజా-మహారాష్ట్ర
106. విజయసారథి శ్రీభాష్యం -తెలంగాణ
107.కె.ఎస్‌.మహబూబ్‌, షేక్‌ మహబూబ్‌ సుబానీ (ద్వయం)-తమిళనాడు
108. జావేద్‌ అహ్మద్‌ తఖ్‌-జమ్మూ-కశ్మీర్‌
109. ప్రదీప్‌ తాళప్పిల్‌-తమిళనాడు
110. యెషే డోర్జీ థోంగ్చి-అరుణాచల్‌ ప్రదేశ్‌
111. రాబర్ట్‌ తుర్‌మన్‌- యూఎస్‌ఏ
112. అగుష్‌ ఇంద్ర ఉదయానా -ఇండోనేషియా
113. హరీష్‌ చంద్ర వర్మ- ఉత్తర్‌ప్రదేశ్‌
114. సుందరం వర్మ-రాజస్థాన్‌
115. రమేష్‌ టేక్‌చంద్‌ వాద్వాని-యూఎస్‌ఏ
116. సురేష్‌ వాడ్కర్‌-మహారాష్ట్ర
117. ప్రేమ్‌ వత్స- కెనడా
118. నారాయణన్‌ జె.జోషి కరయాల్‌-గుజరాత్‌



నిస్వార్థ సేవకు పద్మయోగం
సాధికారతకు ప్రతీక
ఉషా చౌమర్‌ (53)
రంగం: సామాజిక సేవ (పారిశుద్ధ్యం)
రాష్ట్రం: రాజస్థాన్‌
ప్రత్యేకత: ఒకప్పుడు నిస్సహాయురాలైన ఈ దళిత మహిళ... సంకల్ప బలానికి, సాధికారతకు నేడు ప్రతీక. అసంఖ్యాకుల గొంతు. ఏడేళ్ల వయసులో పారిశుద్ధ్య కార్మికురాలిగా జీవనం ప్రారంభించి ఎన్నో ఛీత్కారాలను, అంటరానితనాన్ని ఎదుర్కొన్నారు. నయీ దిశ స్వచ్ఛంద సంస్థ ఆమెను చేరదీసింది. ఇప్పుడు అదే సంస్థ ఆధ్వర్యంలోని ‘సులభ్‌ ఇంటర్నేషనల్‌ సోషల్‌ సర్వీస్‌ ఆర్గనైజేషన్‌’కు ఉషా అధ్యక్షురాలు. చేతులతో మలమూత్రాల ఎత్తివేతకు వ్యతిరేకంగా ఆమె పోరాడుతున్నారు.
గజ వైద్యుడు
కుశాల్‌ కొన్వర్‌ శర్మ(60)
·        రంగం: పశు వైద్యం
రాష్ట్రం: అసోం
ప్రత్యేకత: గువాహటిలోని పశువైద్య కళాశాల సర్జరీ-రేడియాలజీ విభాగం అధిపతిగా పనిచేస్తున్న శర్మ గత 30 ఏళ్లలో ఒక్క వారాంతపు సెలవు కూడా తీసుకోలేదు.
·        ఎందుకంటే జీవితాన్ని ఏనుగుల చికిత్సకే అంకితం చేశారు మరి. ఏనుగులకు దూరం నుంచి మత్తు మందు ఇచ్చే విధానాన్ని ఆవిష్కరించారు.
·         20 సార్లు ఏనుగులు దాడి చేయగా ప్రాణాపాయ పరిస్థితులు ఎదురయ్యాయి. అయినా సేవల్లో వెనుకడుగు వేయలేదు.
దివ్యాంగుల పెన్నిధి
ఎస్‌.రామకృష్ణన్‌ (65)
·        రంగం: సామాజికసేవా రంగం (దివ్యాంగుల సంక్షేమం)
రాష్ట్రం: తమిళనాడు
ప్రత్యేకత:20 ఏళ్ల వయసున్నప్పుడు నౌకాదళంలో విన్యాసాలు చేస్తుండగా ప్రమాదానికి గురయ్యారు.
·        మెడ కిందిభాగం అచేతనంగా మారినా వెరవలేదు. అమర్‌ సేవా సంఘాన్ని స్థాపించి, నాలుగు  దశాబ్దాల్లో 14,000 మందికిపైగా దివ్యాంగుల అభ్యున్నతికి కృషి చేస్తూ వచ్చారు.
·        వారికి విద్య, వృత్తిశిక్షణ, ఉపాధి, పునరావాసం, వైద్య సదుపాయాలు కల్పిస్తున్నారు. మానసిక వైకల్యంతో బాధపడుతున్న చిన్నారులకు డేకేర్‌ సెంటర్‌నూ నిర్వహిస్తున్నారు.
సుందర్‌బన్‌ ధన్వంతరి
అరుణోదయ్‌ మోండల్‌ (66)
·        రంగం: వైద్యం
రాష్ట్రం: పశ్చిమ బెంగాల్‌
ప్రత్యేకత: మారుమూల సుందర్‌బన్‌ గ్రామాల్లో దారిద్య్ర రేఖకు దిగువన ఉండే పేదలకు వైద్యం చేసేందుకు ప్రతి వారాంతంలో ఆరుగంటలు ప్రయాణించి మరీ వెళ్లే అపరధన్వంతరి.
·        ప్రతి వారాంతంలో 250 మంది రోగులకు వైద్యం. కంటి జబ్బుల నుంచి థైరాయిడ్‌ సమస్య దాకా ఎన్నో రుగ్మతలకు చికిత్స. ‘సుజన్‌ సుందర్‌బన్‌’ పేరుతో ఉచిత వైద్యశాల నిర్వహణ.
·         నిరుపేద దళిత కుటుంబం నుంచి వచ్చిన ఆయన చదువుకునేందుకు నానా పాట్లు పడ్డారు. ట్యూషన్లు చెప్పి తన చదువుకు ఫీజులు కట్టుకున్నారు
తరువు నేస్తం
సుందరం వర్మ (68)
·        రంగం: సామాజికసేవ (పర్యావరణ పరిరక్షణ)
రాష్ట్రం: రాజస్థాన్‌
ప్రత్యేకత: షెకావతిలోని మెట్ట ప్రాంతాలను అడవులుగా మార్చారు.
·        50,000 చెట్లను పెంచారు.
·         వాన నీటిని, మురుగునీటిని ఒడిసి పట్టి... లీటరు నీటితోనే చెట్టు ఎదిగే సాంకేతిక విధానాన్ని పాటించారు.
·        ఆరు నర్సరీలు స్థాపించి 1,50,000 మొక్కలు పంచారు. స్థానిక పంటలను పరిరక్షించి జీవ వైవిధ్యాన్ని కాపాడారు
విత్తన మాతృమూర్తి
రహీబాయి సొమా పొపెరే (56)
·        రంగం: వ్యవసాయం
రాష్ట్రం: మహారాష్ట్ర
ప్రత్యేకత: అహ్మద్‌నగర్‌ జిల్లాకు చెందిన అక్షరం ముక్క తెలియని గిరిజన మహిళా రైతు.
·        ‘విత్తన మాతృమూర్తి’గా సీఎస్‌ఐఆర్‌ పురస్కారం అందుకున్న అన్నదాత.
·        గిరిజన ప్రాంతంలో విభిన్న వరి రకాలు,  కూరగాయల సాగుద్వారా యాభై ఎకరాల భూమిని పరిరక్షించిన వ్యవసాయ ప్రేమికురాలు.
·        విత్తన నిధి వ్యవస్థాపకురాలు. వందలాది రకాల విత్తనాలను సంప్రదాయ గిరిజన పద్ధతుల్లో భద్రపరుస్తున్న పంటల తల్లి.
·        నీటి సంరక్షణ విధానాల రూపకల్పనతో బంజరును బంగరు భూమిగా మార్చిన రైతు. దిగుబడులను 30శాతం పెరిగేలా చూసిన ధాన్యలక్ష్మి.
ఆస్తులు అమ్ముకున్న ‘ఆరోగ్య బాబా’
జగదీశ్‌ లాల్‌ అహూజా(84)
రంగం: సామాజిక సేవ (సేవలు)
రాష్ట్రం: పంజాబ్‌
ప్రత్యేకత: వైద్యం కోసం నగరాలకు వచ్చే వారికి ఎవరి అండా లేకపోతే ఎంత కష్టం? ఆ లోటు తీర్చుతున్నారు... చండీగఢ్‌కు చెందిన అహుజా. 1980 నుంచి పీజీఐఎంఈఆర్‌ ఆసుపత్రి వద్ద రోజుకు కనీసం రెండువేల మంది పేదలకు ఉచితంగా ఆహారం అందజేస్తున్నారు. దుప్పట్లు, దుస్తులతో పాటు అవసరమైతే ధన సహాయమూ చేస్తున్నారు. ఇందుకు కోట్లాది రూపాయల ఆస్తులు అమ్మారు. పెషావర్‌లో జన్మించిన ఆయన దేశ విభజన అనంతరం ఇక్కడికి వచ్చి స్థిరపడ్డారు. కోట్లు గడించినా దాన్ని తిరిగి ప్రజలకే ఇస్తున్నారు.
చెట్టులో చెట్టునై..
తులసి గౌడ(72)
రంగం: సామాజిక సేవ (పర్యావరణం)
రాష్ట్రం: కర్ణాటక
ప్రత్యేకత: తులసి... పేరుకు తగ్గట్టుగానే చెట్టుల్లోనే జీవిస్తోంది. హలక్కి గిరిజన తెగకు చెందిన అమెకు అక్షరం ముక్క రాదు. అయితేనేం అడవుల్లోని ప్రతి జాతి మొక్క సమాచారమూ తెలుసు. అందుకే ‘అడవుల విజ్ఞాన సర్వస్వం’ అని అందరూ పిలుస్తుంటారు. తనకు తెలిసిన విషయాలను తరువాతి తరానికి అందిస్తుండడం ఆమె గొప్పతనం. గత 60 ఏళ్లుగా వేలాది మొక్కలు నాటి వాటిని చెట్లుగా పెంచి పోషిస్తోంది.
వైద్య నారాయణుడు
రవి కణ్నన్‌(55)
రంగం: వైద్యం (కేన్సర్‌ నిపుణుడు)
రాష్ట్రం: అసోం
ప్రత్యేకత: చెన్నైకు చెందిన కేన్సర్‌ శస్త్రచికిత్స నిపుణుడు. ఉద్యోగాన్ని విడిచిపెట్టి 2007లో కుటుంబంతో సహా అసోంలోని బరాక్‌ లోయకు వలస వెళ్లారు. 70,000 మంది రోగులకు ఉచితంగా వైద్యంతో పాటు వసతి, ఆహారం, ఉపాధి కల్పించారు. గ్రామీణ కేన్సర్‌ వైద్య కేంద్రాలను పూర్తిస్థాయి ఆసుపత్రులుగా, పరిశోధన కేంద్రాలుగా మార్చారు. శాటిలైట్‌ క్లినిక్‌, ఇంటికి వెళ్లి వైద్యం అందించడం వంటి విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారు.
‘ఆ నలుగురూ’.. ఈ ఒక్కడే
మహమ్మద్‌ షరీఫ్‌(80)
రంగం: సామాజిక సేవ (అంత్యక్రియలు)
రాష్ట్రం: ఉత్తర్‌ప్రదేశ్‌
ప్రత్యేకత: అంతిమయాత్ర రోజున నలుగురు వ్యక్తులు ఉండాలంటారు. మరి నా అంటూ లేనివారికి నేనున్నానంటున్నారు.. ఫైజాబాద్‌కు చెందిన మహ్మమ్మద్‌ షరీఫ్‌. గత 25 ఏళ్లలో కనీసం 25వేల అనాథ శవాలకు అంతిమ సంస్కారాలు చేయించారు. ఇందులో హిందూ, ముస్లిం అన్న తేడాను చూపరు. కానీ వారి సంప్రదాయాలను పాటించడాన్ని మరిచిపోరు. ఇంతకూ ఆయన ఓ సైకిల్‌ మెకానిక్‌. పూట గడవడమే కష్టం.

డబ్ల్యూఈఎఫ్ 50వ వార్షిక సదస్సు ముగింపు
·        స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జనవరి 21న ప్రారంభమైన ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్ల్యూఈఎఫ్) 50వ వార్షిక సదస్సు జనవరి 24న ముగిసింది.
·        వేటు సహకారం అన్నది ఎంతో కీలకమైనదిగా అభివర్ణించారు.అంతర్జాతీయంగా సమ్మిళిత, స్థిరమైన వృద్ధి కోసం ఓఈసీడీతో కలసి పనిచేస్తామని ప్రకటించారు.
·        2030కి లక్ష కోట్ల చెట్ల సంరక్షణ, పెంపకం లక్ష్యానికి సహకరిస్తామని, నాలుగో పారిశ్రామిక విప్లవానికి వీలుగా పునఃనైపుణ్య శిక్షణ తదితర కార్యక్రమాలను ప్రకటించారు.

డబ్ల్యూఈఎఫ్ 50వ వార్షిక సదస్సు థీమ్ : Stakeholders for a Cohesive and Sustainable World (సమైక్య మరియు సుస్థిర ప్రపంచానికి వాటాదారులు)

మందగమనం తాత్కాలికమే: ఐఎంఎఫ్
·        సదస్సు ముగింపు కార్యక్రమంలో అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) చీఫ్ క్రిస్టలినా జార్జీవా మాట్లాడుతూ.. భారత్‌లో వృద్ధి మందగమనం తాత్కాలికమేనని, ఇకపై వృద్ధి పుంజుకుంటుందని అన్నారు.
·        2019 అక్టోబర్‌లో ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై అంచనాలు ప్రకటించినప్పటితో పోలిస్తే 2020 జనవరిలో మెరుగైన పరిస్థితులు కనిపిస్తున్నాయన్నారు.

గోయల్ కీలక భేటీలు
కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ డబ్ల్యూఈఎఫ్ సదస్సు సందర్భంగా జనవరి 24న పలు కీలక నేతలతో చర్చలు జరిపారు.
·        సమగ్రాభివృద్ధి, పారదర్శకత దిశగా సంస్కరణలకు భారత్ సిద్ధంగా ఉందని డబ్ల్యూటీవో చీఫ్ రాబర్టో అజవేదోతో చెప్పారు.
·         ఈయూ వాణిజ్య కమిషనర్ ఫిల్ హోగన్, ప్రముఖ ఆర్థికవేత్త మేఖేల్ స్పెన్స్, బ్లాక్‌స్టోన్ గ్రూపు చైర్మన్ ష్వార్జ్‌మాన్, ఏబీబీ చైర్మన్ పీటర్ వోసర్ తదితరులతోనూ గోయల్ చర్చించారు.

ఢిల్లీలో ఐటీఏటీ వ్యవస్థాపక దినోత్సవం


·        దేశ రాజధాని న్యూఢిల్లీలో జనవరి 24న ఇన్‌కమ్ ట్యాక్స్ అప్పిలేట్ ట్రిబ్యునల్ (ఐటీఏటీ) 79వ వ్యవస్థాపక దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు.
·        ఈ కార్యక్రమానికి భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ శరద్ అరవింద్ బాబ్డే హాజరై మాట్లాడారు. పన్ను వివాదాలకు వేగంగా పరిష్కారం చూపించాలని, అలా చేస్తే అది పన్ను చెల్లింపుదారులకు ప్రోత్సాహకంగా మారుతుందని జస్టిస్ బాబ్డే అన్నారు.
·         పన్నుల ఎగవేతను తోటి పౌరులకు చేసే సామాజిక అన్యాయంగా పేర్కొన్నారు. అదే విధంగా ఏకపక్షమైన, అధిక పన్ను విధింపు అన్నది ప్రభుత్వం ద్వారా సామాజిక అన్యాయానికి దారితీస్తుందన్నారు.
·         పరోక్ష పన్నులకు సంబంధించి సుప్రీంకోర్టు, హైకోర్టులు, సీఈఎస్‌టీఏటీలోని పెండింగ్ కేసుల్లో 61%(1.05 లక్షల కేసులకు) గత రెండేళ్ల కాలంలో తగ్గించామని చెప్పారు. ఐటీఏటీను 1941, జనవరి 25న స్థాపించారు.

ఆక్స్‌ఫర్డ్ డిక్షనరీలో 26 నూతన భారతీయ పదాలు

·        ఆక్స్‌ఫర్డ్ నిఘంటువు తాజా ముద్రణలో 26 కొత్త భారతీయ ఆంగ్ల పదాలు స్థానం సంపాదించాయి.
·        వీటిలో తరుచూ వాడుకలో ఉండే ఆధార్, చావల్, డబ్బా, హర్తాళ్, షాదీ మొదలగు పదాలు ఉన్నాయి.
·         జనవరి 24న విడుదలైన తాజా(10వ) ఎడిషన్‌లో భారతీయ పదాలు సహా ఫేక్ న్యూస్, మైక్రోప్లాస్టిక్ లాంటి 1,000కి పైగా కొత్త పదాలను చేర్చినట్టు ఆక్స్‌ఫర్డ్ యూనివర్శిటీ(ఓయూపీ) ప్రెస్ తెలిపింది.
·         26 కొత్త భారతీయ పదాల్లో 22 పదాలను డిక్షనరీలో ప్రచురించామని, మిగతా నాలుగు పదాలు డిజిటల్ వర్షన్‌లో ఉన్నాయని వివరించింది.
·         తాజా ఎడిషన్‌లో వినియోగదారుల సహయార్థం వెబ్‌సైట్, యాప్ లాంటి ఆన్‌లైన్ సేవలనూ కల్పిస్తున్నట్టు వెల్లడించింది. 

చైనాలో భారత గణతంత్ర వేడుకలు రద్దు

చైనాలో ప్రాణాంతక కరోనా వైరస్ రోజురోజుకీ విజృంభిస్తోన్న నేపథ్యంలో చైనాలో భారత రాయబార కార్యాలయం 2020 భారత గణతంత్ర వేడుకల్ని రద్దు చేసింది.
·        బహిరంగ ప్రదేశాల్లో ప్రజలు గుమిగూడటం, సభలు, సమావేశాలపై చైనా ప్రభుత్వం నిషేధం విధించడంతో జనవరి 24న ఈ నిర్ణయం తీసుకుంది.

కొత్త సంవత్సర వేడుకలకి దూరం
చైనాలో జనవరి 25న కొత్త సంవత్సరం ప్రవేశిస్తోంది.
·        ఏటా వసంత రుతువుకి స్వాగతం పలుకుతూ పెద్ద ఎత్తున ఉత్సవాలు జరుపుతారు. కానీ, కరోనా వైరస్ కారణంగా ప్రజలెవరూ ఈ వేడుకల్ని జరుపుకోవడం లేదు. ప్రభుత్వం కూడా అధికారిక ఉత్సవాల్ని రద్దు చేసింది.

26కి చేరిన మృతుల సంఖ్య
చైనాలో కరోనా వైరస్ సోకి మృతి చెందిన వారి సంఖ్య జనవరి 24న నాటికి 26కి చేరుకుంది. తాజాగా మరో 880 మంది ఈ వైరస్‌తో న్యుమోనియా బారినపడ్డారు.

10 రోజుల్లో ఆస్పత్రి నిర్మాణం
కరోనా వైరస్ సోకిన వారికి చికిత్సచేసేందుకు ప్రత్యేకంగా వెయి్య పడకల ఆస్పత్రిని వుహాన్‌లో నిర్మిస్తున్నట్టు చైనా ప్రభుత్వం ప్రకటించింది. కేవలం 10 రోజుల్లో ప్రీ ఫాబ్రికేటెడ్ విధానంలో దీని నిర్మాణం పూర్తయ్యేలా నిరంతరాయంగా పనులు చేయిస్తున్నారు. దాదాపు 3 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో 1,000 పడకలు కలిగిన ఆస్పత్రిని నిర్మించనున్నారు.
Pls send us your feedback  TO  7842225979 via whats app


No comments:

భారత్ ఫ్యూచర్ సిటీని గ్లోబల్ అర్బన్ హబ్‌గా అభివృద్ధి చేయడానికి యుఎఇ-తెలంగాణ భాగస్వామ్యం

 భారత్ ఫ్యూచర్ సిటీని గ్లోబల్ అర్బన్ హబ్‌గా అభివృద్ధి చేయడానికి యుఎఇ-తెలంగాణ భాగస్వామ్యం వరల్డ్ ఎకనామిక్ ఫోరం 2026లో, భారతదేశపు మొట్టమొదటి న...