ఫిబ్రవరి 2020 కరెంట్ అఫైర్స్ తెలుగులో part 1
త్రికోణాకృతిలోపార్లమెంట్
- నూతన పార్లమెంట్ భవనం2024నాటికీ12000కోట్లచేసెంట్రల్ విస్టా(రాష్ట్రపతిభవన్-ఇండియాగేట్)పూర్తిచేయాలనినిర్ణయించింది.
- గుజరాత్ కుచెందిన HCPడిజైన్ ప్లానింగ్ మేనేజిమెంట్ సంస్థనిర్మిచనుంది
- 1931లోబ్రిటిష్ఆర్కిటెక్చర్సర్ఎడ్విన్ ల్యుటిఎన్స్
- మరియుటెక్ట్ బేకర్ దీనినినిర్మించారు.
- ప్రస్తుతముదీనినిబిమల్ పటేల్(పద్మశ్రీఅవార్డుగ్రహీత)లోక్ సభలో900మందిరాజ్యసభలో450 మందికుర్చునేటట్లునిర్మించనున్నారు.
W.H.Oక్యాన్సర్ నివేదిక
- ప్రపంచఆరోగ్యసంస్థనివేదిక ప్రకారం భారత్ లో 11.6లక్షల మంది క్యాన్సర్ వ్యాధిగ్రస్తులు ఉన్నట్లు తెలిపింది
- . 2018నివేదిక ప్రకారం బారత్ లో పురుషుల కంటె మహిళలో ఎక్కువవున్నట్లు తెలిపింది
- మహిళలో9లక్షలమంది,పురుషుల్లో7లక్షల మందికిక్యాన్సర్ఉన్నట్లుతెలిపింది
- . మహిళలో ఎక్కువగా గర్బశయముఖ క్యాన్సర(97వేలు)
- . పురుషులలో ఎక్కువగా నోటి క్యాన్సర్(92వేలు) అని నివేదిక తెలిపింది .
- 7,84,800మంది క్యాన్సర్ తో మృతిచెందారు .
- ప్రపంచములోఅధికక్యాన్సర్ కేసులుఆస్ట్రేలియాలోగలవు
- .భారత్లోఅధికకేసులు కేరళలోగలవు.
- అతితక్కువకేసులు బీహార్ లోగలవు
- .భారత్ లోటాటామెమోరియల్ ముంబాయిప్రముఖక్యాన్సర్ హాస్పిటల్
బుర్రకథ పితామహుడి శతజయంతి
- ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 5న బుర్రకథ పితామహుడు షేక్
- నాజర్ జయంతి నిర్వహిస్తారు .గుంటూరు జిల్లా పొన్నేకల్లు గ్రామం లో 1920ఫిబ్రవరి 5నజన్మించారు ఇతని తొలి నాటకము వీరనారీటాన్యా .
- పల్నాటి యుద్ధం ,బొబ్బిలి యుద్ధం ,మా భూమి నాటకం కు ప్రజలకు శిక్షణనిచ్చాడు . పుట్టిలు ,అగ్గిరాముడు ,చిత్రాల్లో బుర్రకథను ప్రదర్శించాడు .
- ఇతనిఆత్మకథ పింజారి . 1981లో ఆంధ్ర నాటక కళాపరిషత్ ఉత్తమ కళాకారుడి అవార్డు ,1986లో పద్మశ్రీ అవార్డు లభించింది .
- 1997లో మృతిచెందారు.
కార్టూన్ ఫెస్టివల్-2020
- కార్టూన్ ఫెస్టివల్-2020ని ఈ నెల ఎనిమిదిన హైదరాబాద్‌లోని ద పార్క్ హోటల్‌లో నిర్వహించనున్నట్టు కార్టూన్‌వాచ్ మంత్లీ ఎడిటర్ త్రయంబక్ శర్మ తెలిపారు.
- ‘కార్టూన్ వాచ్' కార్టూన్లు మాత్రమే పబ్లిష్ అయ్యే మాగజైన్
- గతంలో కార్టూన్ ఫెస్టివల్‌ను ఢిల్లీ, ముంబై, రాయ్‌పూర్, పుణె, చెన్నైలో నిర్వహించారు ఈ ఏడాది హైదరాబాద్‌లో నిర్వహించనున్నారు .
- ఫెస్టివల్‌లో 2019 సంవత్సరానికిగాను లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డులను సీనియర్ కార్టూనిస్ట్ దివంగత మోహన్, సీనియర్ కార్టూనిస్టులు జయదేవ్ బాబు, ఎంఎస్ రామకృష్ణకుప్రకటించారు .
- 2020కి లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డును నమస్తే తెలంగాణ కార్టూనిస్ట్ మృత్యుంజయ్, సాక్షి కార్టూనిస్ట్ శంకర్, నవతెలంగాణ కార్టూనిస్ట్ నర్సింకు ప్రకటించబడినవి.
అమెరికాలో భారత సంతతి మహిళకు అరుదైన అవకాశం
- అమెరికాలో భారత సంతతి మహిళకు అరుదైన అవకాశం దక్కింది
- న్యూజెర్సీ సెనేటర్ కోరి బుకర్స్ వద్ద మాజీ అగ్ర సహాయకురాలిగా పనిచేసిన ఇండియన్-అమెరికన్ సబ్రినా సింగ్‌ను డెమొక్రాటిక్ అభ్యర్థి మైఖేల్ బ్లూమ్‌బెర్గ్స్ అధ్యక్ష ఎన్నికల ప్రచారానికి జాతీయ ప్రతినిధిగా నియమించారు.
- గతంలో డెమొక్రాటిక్ నేషనల్ కమిటీ(డీఎన్‌సీ) ప్రతినిధిగా కూడా పని చేసింది.
ఆస్ట్రేలియా ఓపెన్‌విన్నర్ సెర్బియాస్టార్
- ఆస్ట్రేలియా ఓపెన్‌లో డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగి అత్యధిక సార్లు ఈ టైటిల్ గెలిచిన సెర్బియా స్టార్ నొవాక్ జొకోవిచ్
- . గ్రాండ్ స్లామ్ టోర్నీల్లో మూడుసార్లు మాత్రమే ఫైనల్‌కు చేరిన ఆస్ట్రియా సంచలనం డొమనిక్ థీమ్
- పురుషుల ఫైనల్ పోరులో జొకోవిచ్ 6-4, 4-6, 2-6, 6-3, 6-4 తేడాతో థీమ్‌పై గెలిచి టైటిల్‌ను సాధించాడు.
- ఇది జొకోవిచ్ ఎనిమిదో ఆస్ట్రేలియా ఓపెన్ టైటిల్ కాగా, ఈ టోర్నీలో థీమ్‌కు ఇదే తొలి ఫైనల్
ఆస్ట్రేలియన్ ఓపెన్ మహిళల సింగిల్స్ విజేత కెనిన్
- అమెరికా యువతార సోఫియా కెనిన్ ఆస్ట్రేలియన్ ఓపెన్ మహిళల సింగిల్స్ చాంపియన్‌గా అవతరించింది.
- ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌లో ఫిబ్రవరి 1న జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో 14వ సీడ్, ప్రపంచ 15వ ర్యాంకర్ సోఫియా కెనిన్ 4-6, 6-2, 6-2తో ప్రపంచ మాజీ నంబర్‌వన్ గార్బిన్ ముగురుజా (స్పెయిన్)పై విజయం సాధించింది.
- దీంతో కెనిన్ తన కెరీర్‌లో తొలిసారి గ్రాండ్‌స్లామ్ టైటిల్ గెలుచుకున్నట్లయింది. విజేత కెనిన్‌కు 41 లక్షల 20 వేల ఆస్ట్రేలియన్ డాలర్లు (రూ. 19 కోట్ల 71 లక్షలు)... రన్నరప్ ముగురుజాకు 20 లక్షల 65 వేల ఆస్ట్రేలియన్ డాలర్లు (రూ. 9 కోట్ల 88 లక్షలు) ప్రైజ్‌మనీగా లభించాయి.
- తాజా విజయంతో సెరెనా (2002లో) తర్వాత పిన్న వయస్సులో గ్రాండ్‌స్లామ్ టైటిల్ నెగ్గిన అమెరికా క్రీడాకారిణిగా కెనిన్ గుర్తింపు పొందింది.
- 2008 తర్వాత ఆస్ట్రేలియన్ ఓపెన్ నెగ్గిన పిన్న వయస్కురాలిగా కూడా కెనిన్ ఘనత వహించింది. 2008లో షరపోవా 20 ఏళ్ల ప్రాయంలో ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్ నెగ్గింది.
హెచ్‌ఏఎల్ సీఈఓగా అమితాబ్ భట్
- ప్రభుత్వ రంగ రక్షణ సంస్థ హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్(హెచ్‌ఏఎల్) చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ (సీఈఓ)గా అమితాబ్ భట్ ఫిబ్రవరి 3న బాధ్యతలు చేపట్టారు.
- ఇంతకుముందు సంస్థకు చెందిన లైట్ యుటిలిటీ హెలికాప్టర్ (ఎల్‌యూహెచ్) ప్రాజెక్ట్‌కు ఎగ్జిక్యూటీవ్ డెరైక్టర్‌గా అమితాబ్ సేవలందించారు.
- రక్షణ రంగానికి కామోవ్ కేఏ- 226టీ హెలికాప్టర్లను అందించడం కోసం కంపెనీ ఏర్పాటు చేసిన జాయింట్ వెంచర్ ఇండో రష్యన్ హెలికాప్టర్స్ లిమిటెడ్‌కు ఈయన డెరైక్టర్‌గా కొనసాగుతున్నారు.
- సంస్థతో 32 ఏళ్ల అనుబంధం ఉన్న అమితాబ్ హాయంలోనే ఓఎన్‌జీసీ, జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా, జార్ఖండ్ ప్రభుత్వానికి హెలికాప్టర్లను అందించడంతో పాటు నేపాల్, మారిషస్ వంటి దేశాలకు ఎగుమతులు జరిగినట్లు హెచ్‌ఏఎల్ వెల్లడించింది.
నిజామాబాద్‌లో సుగంధ ద్రవ్యాల బోర్డు ఏర్పాటు
- తెలంగాణలోని నిజామాబాద్‌లో సుగంధ ద్రవ్యాల బోర్డు ప్రాంతీయ కార్యాలయం, ఎక్స్‌టెన్షన్ సెంటర్ (స్పైసెస్ బోర్డు రీజినల్ సెంటర్ కమ్ ఎక్స్‌టెన్షన్ సెంటర్) ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఫిబ్రవరి 4న వెల్లడించారు.
- నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ చుట్టుపక్కల ప్రాంతాల్లో ప్రభుత్వ కార్యక్రమాలను బలోపేతం చేసేందుకు వీలుగా ఈ సెంటర్ పనిచేస్తుందని పేర్కొన్నారు.
- ‘డిప్యూటీ డెరైక్టర్ స్థాయి అధికారి దీనికి నేతృత్వం వహిస్తారు. రెండేళ్లలో ఈ ప్రాంతం నుంచి ఎగుమతులు, ఉత్పత్తులు, నాణ్యత గణనీయంగా పెరుగుతుందని ఆశిస్తున్నాం.
- పసుపు, మిర్చిపై ప్రత్యేక దృష్టి పెట్టడం ద్వారా ఈ ప్రాంతం స్పైసెస్ హబ్‌గా మారుతుంది. తెలంగాణలో సుగంధ ద్రవ్యాల పంటల ప్రగతికి ఈ నిర్ణయం దోహదపడుతుంది’ అని మంత్రి వివరించారు.
గోల్డెన్ గర్ల్ బాక్సింగ్‌లో భారత్‌కు ఆరు స్వర్ణాలు
- స్వీడన్‌లోని బోరస్‌లో 2020, జనవరి 31 నుంచి ఫిబ్రవరి 2 వరకు జరిగిన గోల్డెన్ గర్ల్ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో భారత యువ మహిళా బాక్సర్లు ఆరు స్వర్ణ పతకాలతో సహా మొత్తం 14 పతకాలను సాధించారు.
- ఓవరాల్ చాంపియన్‌షిప్ ట్రోఫీని సొంతం చేసుకున్నారు. జూనియర్ విభాగంలో ఐదు పసిడి పతకాలు, మూడు రజతాలు, ఒక కాంస్య పతకం సాధించగా... యూత్ విభాగంలో ఒక స్వర్ణం, నాలుగు కాంస్య పతకాలను గెలుచుకున్నారు.
- ప్రాచీకి బెస్ట్ బాక్సర్ అవార్డు
- జూనియర్ టీమ్‌కు ప్రాతినిధ్యం వహించిన ప్రాచీ (50 కేజీలు) ‘బెస్ట్ బాక్సర్’ అవార్డును కై వసం చేసుకుంది. ఆమెతో పాటు నివేదిత (48 కేజీలు), ఎథోయ్‌బి చాను వాంజమ్ (54 కేజీలు), లశు యాదవ్ (66 కేజీలు), మహి (80 కేజీలు) బంగారు పతకాలను గెల్చుకోగా... యూత్ విభాగంలో ముస్కాన్ (54 కేజీలు) స్వర్ణాన్ని సాధించింది. జూనియర్ విభాగంలో జాన్వీ (46 కేజీలు), రూడీ లాల్‌మింగ్ మువాని (66 కేజీలు), తనిష్కా (80 కేజీలు) రజతాలు... దియా(60 కేజీలు) కాంస్యం సాధించింది.
మహారాష్ట్రలో రూ.65వేల కోట్లతో పోర్టు నిర్మాణం
- మహారాష్ట్రలో రూ.65వేల కోట్లతో భారీ పోర్టు నిర్మాణానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది.
- ప్రధానమంత్రి నరేంద్రమోదీ అధ్యక్షతన ఫిబ్రవరి 5న సమావేశమైన మంత్రివర్గం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ముంబైలోని జవహర్‌లాల్ నెహ్రూ పోర్ట్ ట్రస్ట్ (జేఎన్‌పీటీ)కి 97 కిలోమీటర్ల దూరంలోని వధావన్ వద్ద ఈ భారీ పోర్టు నిర్మాణం చేపడతారు.
- ప్రైవేటు భాగస్వామ్యంతో (ల్యాండ్ లార్డ్ మోడల్‌లో) అభివృద్ధి చేసే ఈ ప్రాజెక్టుకు రూ.65,544.54 కోట్లు వ్యయం అవుతుందని అంచనా.
కేంద్ర కేబినెట్ మరికొన్ని నిర్ణయాలు
- ఎయిరిండియా అనుబంధ సంస్థ అలయన్స్ ఎయిర్ ద్వారా భారత్-శ్రీలంకల మధ్య విమాన సర్వీసులు నడపడానికి ఆమోదం.
- సూరత్, భోపాల్, భాగల్పుర్, అగర్తల, రాయచూర్ ట్రిపుల్ ఐటీ (పీపీపీ)లకు జాతీయ ప్రాధాన్య సంస్థల హోదా కల్పించాలని నిర్ణయం.
- పీఎంసీ బ్యాంక్ తరహా సంక్షోభం మరోసారి తలెత్తకుండా డిపాజిట్‌దారుల ప్రయోజనాల పరిరక్షణ, సహకార బ్యాంకులను మరింత పటిష్టం చేసే దిశగా బ్యాంకింగ్ నియంత్రణ చట్టానికి సవరణకు ఆమోదం.
యథాతథంగా కీలక పాలసీ వడ్డీ రేట్లు |
కీలక పాలసీ వడ్డీ రేట్లు అయిన రెపో రేటు, రివర్స్ రెపో రేటును రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) యథాతథంగా కొనసాగించింది.
ఆర్‌బీఐ ఎంపీసీ సమావేశం-ముఖ్యాంశాలు
- వడ్డీ రేట్ల యథాతథ స్థితికి ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ ఆధ్వర్యంలోని ఎంపీసీ కమిటీ ఏకగ్రీవంగా (ఆరుగురు సభ్యులు) ఓటు వేసింది. గత భేటీలోనూ (2019 డిసెంబర్) రేట్లలో ఎటువంటి మార్పులు చేయలేదు.
- దీంతో ఆర్‌బీఐ రెపో రేటు 5.15 శాతం, రివర్స్ రెపో రేటు 4.9 శాతంగానే కొనసాగనున్నాయి.
- ద్రవ్యలోటును జీడీపీలో 3.3 శాతానికి పరిమితం చేయాలన్న లక్ష్యాన్ని ప్రభుత్వం బడ్జెట్లో 3.8 శాతానికి సవరించగా, దీనివల్ల మార్కెట్ నుంచి ప్రభుత్వ రుణ సమీకరణ పెరగదని ఆర్‌బీఐ పేర్కొంది.
- తదుపరి ఆర్‌బీఐ విధాన ప్రకటన ఏప్రిల్ 3న ఉంటుంది.
విజయవాడలో ఎక్స్‌లెన్స్ ఇన్ ఎడ్యుకేషన్ సదస్సు
- ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడలో ఫిబ్రవరి 5న ది హిందూ గ్రూపు ‘ఎక్స్‌లెన్స్ ఇన్ ఎడ్యుకేషన్’ సదస్సును నిర్వహించింది.
- ఈ సదస్సులో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, ది హిందూ గ్రూపు చైర్మన్ ఎన్ రామ్ పాల్గొన్నారు. ఈ సదస్సులో ముఖ్యమంత్రి ప్రసంగిస్తూ.. ఇంగ్లిష్ మీడియంలో విద్యాబోధన ఇవాళ అవసరమే కానీ విలాసం కాదని అన్నారు.
- రాబోయే ప్రపంచానికి అనుగుణంగా విద్యార్థులను తయారు చేయాలంటే ఇంగ్లిష్ మీడియం కావాల్సిన అవసరం ఉందన్నారు. విద్యా వ్యవస్థలో సమూలమైన మార్పును తెచ్చేందుకు నాడు- నేడు, పౌష్టికాహారం, అమ్మ ఒడి, ఇంగ్లీషు మీడియం కార్యక్రమాలు చేపట్టామని వివరించారు.
అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి ట్రస్ట్
అయోధ్యలో రామ మందిర నిర్మాణ పర్యవేక్షణకు ఒక స్వతంత్ర సంస్థ(ట్రస్ట్) ఏర్పాటైంది. అత్యద్భుతంగా మందిర నిర్మాణం జరిపేందుకు ‘శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర’ పేరుతో ట్రస్ట్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు ఫిబ్రవరి 5న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లోక్‌సభలో ప్రకటించారు.
మందిర నిర్మాణానికి ట్రస్ట్‌ను ఏర్పాటు చేయాలని ‘అయోధ్య’ తీర్పులో సుప్రీంకోర్టు కేంద్రాన్ని ఆదేశించిన విషయం తెలిసిందే. 3 నెలల్లోగా ట్రస్ట్‌ను ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించగా, ఆ గడువు 2020, ఫిబ్రవరి 9తో ముగియనున్న నేపథ్యంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది.
మందిర విషయమై మోదీ మాట్లాడుతూ... రామ మందిర అభివృద్ధి కోసం ఒక విసృ్తత పథకాన్ని సిద్ధం చేశామన్నారు. అయోధ్యలోని వివాదాస్పద స్థలం సహా మొత్తం 67.703 ఎకరాలను ఈ ట్రస్ట్‌కు బదిలీ చేస్తామన్నారు. అన్ని వర్గాల అభివృద్ధి లక్ష్యంగా ‘సబ్ కా సాథ్.. సబ్ కా వికాస్’ మార్గంలో తన ప్రభుత్వం పయనిస్తోందన్నారు.
15 మంది ట్రస్టీలు..
రామ మందిర నిర్మాణం కోసం ఏర్పాటైన ట్రస్ట్‌లో 15 మంది సభ్యులుంటారని, వారిలో ఒకరు దళిత వర్గానికి చెందినవారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించారు. ఈ ట్రస్ట్ స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకుంటుందన్నారు. అయితే, ట్రస్టీల పేర్లను ఇంకా ప్రభుత్వం ప్రకటించలేదు. ‘శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర’ ప్రధాన కార్యాలయం ఢిల్లీలోని గ్రేటర్ కైలాశ్ ప్రాంతంలో ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర హోంశాఖ ప్రకటించింది.
సున్నీ వక్ఫ్ బోర్డ్‌కు ఐదెకరాలు
మసీదు నిర్మాణం కోసం అయోధ్య జిల్లాలో సున్నీ వక్ఫ్ బోర్డ్‌కు ఐదెకరాల స్థలాన్ని కేటాయిస్తూ యూపీ సర్కార్ నిర్ణయించింది. సున్నీ వక్ఫ్ బోర్డ్‌కు మసీదు నిర్మాణం కోసం ఐదెకరాల స్థలాన్ని కేటాయించాలని అయోధ్య తీర్పులో సుప్రీంకోర్టు ఆదేశించడం తెల్సిందే. అయోధ్య నుంచి 18 కి.మీల దూరంలో లక్నో హైవేపై ఈ స్థలాన్ని కేటాయించినట్లు యూపీ ప్రభుత్వం తెలిపింది.
లక్నోలో 11వ డిఫెక్స్‌పో ప్రారంభం
ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో ఫిబ్రవరి 5న ప్రధాని నరేంద్ర మోదీ ఈ డిఫెక్స్‌పోను ప్రారంభించారు. అనంతరం మోదీ మాట్లాడుతూ... రానున్న ఐదేళ్లలో భారత్ నుంచి 500 కోట్ల డాలర్ల(రూ. 35.6 వేల కోట్లు) విలువైన మిలటరీ ఉత్పత్తులను ఎగుమతి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా భారత్‌లో తయారీ యూనిట్లను ప్రారంభించాలని ప్రపంచంలోని ప్రముఖ రక్షణ పరికరాల తయారీ సంస్థలను కోరారు. ఏ దేశాన్నో లక్ష్యంగా చేసుకుని భారత్ తన సైనిక శక్తిని పెంపొందించుకోవాలనుకోవడం లేదని స్పష్టం చేశారు. శాంతి, సుస్థిరతలను కాపాడే విషయంలో భారత్ నమ్మదగిన భాగస్వామి అన్నారు.
భారత్ రెండేళ్లకు ఒకసారి ఈ ‘డిఫెక్స్‌పో’ను నిర్వహిస్తుంది. ఈ సంవత్సరం జరుగుతోంది 11వ ప్రదర్శన. ఐదు రోజుల పాటు జరిగే 11వ డిఫెక్స్‌పోకు 38 దేశాల రక్షణ మంత్రులు, 172 విదేశీ, 856 స్వదేశీ మిలటరీ ఎక్విప్‌మెంట్ సంస్థల ఉన్నతస్థాయి ప్రతినిధులు హాజరవుతున్నారు.
అస్సాం మాజీ స్పీకర్ ప్రణబ్ కుమార్ గొగోయ్ కన్నుమూశారు
అస్సాం మాజీ శాసనసభ స్పీకర్, సిట్టింగ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే (శాసనసభ సభ్యుడు) ప్రణబ్ కుమార్ గొగోయ్ కన్నుమూశారు. అస్సాం శివసాగర్ నుండి అస్సాం శాసనసభ నుండి వరుసగా 4 సార్లు శాసనసభ్యుడిగా ఎన్నికయ్యారు. 2006-2011 వరకు తరుణ్ గోగోయ్ నేతృత్వంలోని మంత్రివర్గంలో మంత్రిగా, 2011 లో అస్సాం శాసనసభ స్పీకర్‌గా కూడా పనిచేశారు. 2015 లో ప్రణబ్ కుమార్ ‘అస్సామీ’ అనే పదానికి నిర్వచనం తీసుకున్నారు.
అత్యధిక బ్రాండ్ విలువ గల సెలబ్రిటీగా విరాట్
భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లి వరుసగా మూడో ఏడాది భారత్‌లో అత్యధిక బ్రాండ్ విలువ గల సెలబ్రిటీగా నిలిచాడు.
ద డఫ్ అండ్ ఫెల్ప్స్ అనే సంస్థ అధ్యయనం ప్రకారం రూ.1690 కోట్ల బ్రాండ్ విలువతో కోహ్లి అగ్రస్థానంలో ఉన్నాడు. రూ.743 కోట్లతో బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ రెండో స్థానంలో ఉన్నాడు. 2019లో కోహ్లి బ్రాండ్ విలువ 39 శాతం పెరిగింది.
నలుగురు క్రికెటర్లు..
2019 ఏడాదికి సంబంధించి రూపొందించిన ‘అత్యధిక బ్రాండ్ విలువ గల భారత ప్రముఖుల జాబితా’లో టాప్-20లో కోహ్లి సహా నలుగురు క్రికెటర్లు ఉన్నారు. ధోని (రూ.293 కోట్లు) 9వ స్థానంలో, సచిన్ టెండూల్కర్(రూ. 153 కోట్లు) 15వ స్థానంలో, రోహిత్ శర్మ (రూ.163 కోట్లు) 20వ స్థానంలో ఉన్నారు
అమెరికా టెన్నిస్ స్టార్ స్పియర్స్‌పై ఐటీఎఫ్ నిషేధం
డోపింగ్‌లో పట్టుబడినందుకు అమెరికాకు చెందిన మహిళల టెన్నిస్ డబుల్స్ స్టార్ ప్లేయర్ అబిగెయిల్ స్పియర్స్‌పై అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) 22 నెలలపాటు నిషేధం విధించింది.
2019 యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీ సందర్భంగా స్పియర్స్‌కు నిర్వహించిన డోపింగ్ పరీక్షల్లో ఆమె నిషేధిత ఉత్ప్రేరకాలు ప్రాస్టీరోన్, టెస్టోస్టిరాన్ వాడినట్లు తేలింది. డోపింగ్ ఫలితాలు వచ్చిన తేదీ 2019 నవంబర్ 7 నుంచి నిషేధం అమలవుతుందని 2021, ఏడాది సెప్టెంబర్ 6 వరకు కొనసాగుతుందని ఐటీఎఫ్ ఫిబ్రవరి 6న తెలిపింది.
21 డబుల్స్ టైటిల్స్..
స్పియర్స్ తన కెరీర్‌లో 21 డబుల్స్ టైటిల్స్ గెలిచింది. 2017 ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో కొలంబియా ప్లేయర్ యువాన్ సెబాస్టియన్ కబాల్‌తో జతగా స్పియర్స్ మిక్స్‌డ్ డబుల్స్ విభాగంలో విజేతగా నిలిచింది. 2013, 2014 యూఎస్ ఓపెన్ మిక్స్‌డ్ డబుల్స్ విభాగాల ఫైనల్స్‌లో స్పియర్స్ ఓడిపోయి రన్నరప్ ట్రోఫీ సాధించింది.
No comments:
Post a Comment