Thursday, 7 March 2019

ఈఎస్‌ఐసీ-హైదరాబాద్లో 133 పోస్టులు

హైదరాబాద్‌లోని ఎంప్లాయిస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఈఎస్‌ఐసీ) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 133 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Jobsఖాళీల వివరాలు: 
  1. స్టెనోగ్రాఫర్-21.
  2. అప్పర్ డివిజన్ క్లర్క్ (యూడీసీ)- 112.

అర్హతలు..

  • స్టెనోగ్రాఫర్: ఇంటర్మీడియట్/తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత. ఇంగ్లిష్/హిందీ స్టెనోగ్రఫీలో నిమిషానికి 80 పదాల వేగం. కంప్యూటర్ పరిజ్ఞానం.
  • యూడీసీ: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ. కంప్యూటర్ పరిజ్ఞానం.

వయసు: 2019, ఏప్రిల్ 15 నాటికి 18-27 ఏళ్ల మధ్యలో ఉండాలి. రిజర్వేషన్ అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

ఎంపిక విధానం : స్టెనోగ్రాఫర్: తొలుత 200 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు. ఇందులో ఇంగ్లిష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రెహెన్షన్; రీజనింగ్ ఎబిలిటీ, జనరల్ అవేర్‌నెస్ నుంచి ప్రశ్నలుంటాయి. తుది జాబితా రూపకల్పనకు ఇందులో సాధించిన మార్కులను పరిగణనలోకి తీసుకుంటారు. రెండో దశలో కంప్యూటర్ స్కిల్ టెస్ట్, స్టెనోగ్రఫీ టెస్ట్ ఉంటాయి. 
యూడీసీ: తొలిదశలో ప్రిలిమినరీ పరీక్ష ఉంటుంది. ఇందులో జనరల్ ఇంటెలిజెన్స్, రీజనింగ్; జనరల్ అవేర్‌నెస్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, ఇంగ్లిష్ కాంప్రెహెన్షన్ విభాగాల నుంచి ప్రశ్నలుంటాయి. ఇందులో అర్హత సాధించిన వారికి 200 మార్కులకు మెయిన్ పరీక్ష నిర్వహిస్తారు. తుది జాబితా రూపకల్పనకు మెయిన్ మార్కులను పరిగణనలోకి తీసుకుంటారు. మూడో దశలో కంప్యూటర్ స్కిల్‌టెస్ట్ ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో.
దరఖాస్తు ఫీజు: ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, ఎక్స్ సర్వీస్‌మెన్, మహిళా అభ్యర్థులకు రూ.250; మిగిలిన వారికి రూ.500.
దరఖాస్తుకు చివరితేదీ: ఏప్రిల్ 15, 2019.
పూర్తి వివరాలకు వెబ్‌సైట్: www.esic.nic.in

No comments:

Human Body

 మానవ శరీరం గురించి మనం మానవ శరీరాన్ని మైక్రోస్కోపిక్ స్థాయిలో "విచ్ఛిన్నం" చేస్తే, కణం దాని అత్యంత ప్రాథమిక యూనిట్‌గా ఉంటుంది. సగ...