✍ కరెంట్ అఫైర్స్ 16 డిసెంబర్ 2019 Monday ✍
prepared by D RAJESH student
జాతీయ వార్తలు
మోదీ సర్కారు ఎజెండాలో మరో 4 కీలక అంశాలు.. NRC, ఉమ్మడి పౌర స్మృతి, జమిలి ఎన్నికలు, జనాభా నియంత్రణ :
i. మోదీ ప్రభుత్వం 370 అధికరణం రద్దు, ముమ్మారు తలాక్ రద్దు తర్వాత తాజాగా పౌరసత్వం సవరణ చట్టాన్ని తీసుకొచ్చింది. రాజ్యసభలో తగిన సంఖ్యాబలం లేనప్పటికీ వీటిపై నిర్ణయాలు తీసుకోగలగడం గమనార్హం.
ii. భాజపా వర్గాల సమాచారం ప్రకారం తొలుత ఎన్ఆర్సీపై ప్రభుత్వం దృష్టి సారించనుంది. ఇందుకు పార్లమెంటులో ఎలాంటి చట్టం చేయాల్సిన అవసరం లేదు. మంత్రివర్గంలో చర్చించి ఉత్తర్వులు ఇస్తే సరిపోతుంది.
iii. అన్ని మతాల వారికీ ఉమ్మడి పౌర స్మృతి (యూనిఫార్మ్ సివిల్ కోడ్-UCC)ని రూపొందించాలన్నది ప్రభుత్వం ముందున్న మరో ప్రాధాన్య అంశం. దీనిపై జైనులు, పార్శీల వంటి మైనార్టీల నుంచి అభ్యంతరాలు వస్తున్న నేపథ్యంలో ముందుగా వారి విశ్వాసాన్ని పొందే ప్రయత్నాలు చేయనుంది.
iv. జమిలి ఎన్నికల నిర్వహణకు రాజ్యాంగాన్ని సవరించాల్సి ఉండడంతో ఈ లక్ష్య సాధనకు ఎక్కువ సమయం తీసుకునే అవకాశం ఉంది. తొలుత ప్రతిపక్షాల అనుమానాలు తీర్చి వారి మద్దతు పొందాల్సి ఉంది.
v. జనాభా నియంత్రణకూ ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇవ్వనుంది. వనరుల లభ్యత తగ్గుతున్న దృష్ట్యా జనాభాను అదుపు చేయాల్సి ఉందని, ఇది ఏ ఒక్క మతానికో చేపట్టే కార్యక్రమం కాదంటూ ప్రతిపక్షాలకు నచ్చజెప్పనుంది.
ఐటీబీపీ జవాన్ల కోసం పెళ్లి సంబంధాల పోర్టల్ :
i. పారామిలటరీ దళమైన ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీసు (ఐటీబీపీ) తన సిబ్బంది సంక్షేమం కోసం నూతన ప్రయోగాన్ని ప్రారంభించింది. వారి కోసం ‘పెళ్లి సంబంధాల’ పోర్టల్ను ప్రారంభించింది.
ii. దళంలో పనిచేసే స్త్రీ, పురుష ఉద్యోగులకు అందులోనే తగిన సంబంధాలను చూడడం ఈ పోర్టల్ ప్రత్యేకత. దళంలోని వారే భాగస్వాములైతే బాగుంటుందన్న భావన సిబ్బందిలో ఉంది.
iii. దీన్ని గమనించిన ఐటీబీపీ డైరెక్టర్ జనరల్ ఎస్.ఎస్.దేశ్వాల్ పెళ్లి సంబంధాల పోర్టల్ను రూపొందించాలని దళానికి చెందిన ఐటీ విభాగాన్ని ఆదేశించారు. ఇందులో బ్రహ్మచారులకే కాకుండా, విడాకులు తీసుకున్నవారు, భాగస్వామిని కోల్పోయిన వారికి కూడా చోటు కల్పించారు.
పురాతన వాహనాలకు ప్రత్యేక నంబరు ప్లేట్ల జారీ :
i. 50 ఏళ్ల క్రితం నాటి పురాతన వాహనాల(వింటేజ్ వాహనాలు)కు ప్రత్యేక నంబరు ప్లేట్లను ఇచ్చేందుకు కేంద్ర రోడ్డురవాణా, రహదారుల మంత్రిత్వశాఖ సిద్ధమవుతోంది. ఈ మేరకు ఓ ముసాయిదా నోటిఫికేషన్ సిద్ధం చేసింది.
ii. ఇక నుంచీ పురాతన వాహనాలకు ఇచ్చే ప్రత్యేక నంబరు ప్లేట్లపై ‘‘VA’’(వింటేజ్) అనే అక్షరాలతో రిజిస్ట్రేషన్ సంఖ్య మొదలవుతుంది. సదరు నంబరు ప్లేట్లు కలిగిన వాహనాలను కాలం చెల్లినవిగా పరిగణించకుండా మినహాయింపు లభిస్తుంది.’
iii. అపురూపమైన పురాతన కాలం నాటి కార్లు, ఇతర వాహనాలను ఎంత డబ్బైనా పోసి సొంతం చేసుకునే వారికి ఇది ఉపయోగపడనున్నది.
తెలంగాణ వార్తలు
దేశంలోనే మొట్టమొదటి జాతీయ ఆకృతి కేంద్రం హైదరాబాద్లో ఏర్పాటు :
i. దేశంలోనే మొట్టమొదటి జాతీయ ఆకృతి కేంద్రాన్ని (NDC - నేషనల్ డిజైన్ సెంటర్) హైదరాబాద్లో ఏర్పాటు చేయించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. గచ్చిబౌలిలో 30 ఎకరాల్లో ప్రపంచ స్థాయి కేంద్రంగా దీన్ని స్థాపించేందుకు వీలుగా సమగ్ర ప్రాజెక్టు నివేదిక రూపొందించి కేంద్రానికి సమర్పించింది.
ii. ప్రస్తుతం దేశంలో జాతీయ ఆకృతి సంస్థ(NID)లు 6 ఉన్నాయి. గతంలో కేంద్రం హైదరాబాద్కు NIDని మంజూరు చేసింది. 2013లో అప్పటి కేంద్ర మంత్రి ఆనంద్శర్మ దీనికి శంకుస్థాపన చేశారు.
iii. 2014లో ఉమ్మడి రాష్ట్ర విభజన తర్వాత NIDడీని విజయవాడకు తరలించారు. దాని స్థానంలో మరో సంస్థ తెలంగాణకు మంజూరు కాలేదు.
iv. NIDలో కేవలం కోర్సులే అందుబాటులో ఉంటాయి. అదే NDC పరిధి విస్తృతంగా ఉంటుంది. NDC కోసం సమగ్ర ప్రాజెక్టు ప్రణాళికను రూపొందించి.. కేంద్ర పరిశ్రమలు, అంతర్గత వాణిజ్య ప్రోత్సాహక శాఖ (DPIIC) సంయుక్త కార్యదర్శికి సమర్పించింది.
తేలని వివాదం .. విద్యుత్ ఉద్యోగుల పంపకాలపై ముగిసిన జస్టిస్ ధర్మాధికారి కమిటీ విచారణ :
i. తెలుగు రాష్ట్రాల మధ్య విద్యుత్ సంస్థల ఉద్యోగుల పంపకాలపై వివాదం తేలలేదు. ఈ అంశంపై గత రెండు రోజులుగా విచారణ జరిపిన జస్టిస్ ధర్మాధికారి కమిటీ తుది ఆదేశాలేమీ ఇవ్వకుండానే ముగించింది.
ii. వారంలోగా తుది నివేదికను సుప్రీంకోర్టుకు, రెండు రాష్ట్రాలకు ఇస్తామని కమిటీ స్పష్టం చేసింది.
‘ఉమెన్ ఇంటర్నేషనల్ మాస్టర్’ హోదాను అందుకున్న తొలి తెలంగాణ మహిళ సహజశ్రీ :
i. చదరంగంలో ‘ఉమెన్ ఇంటర్నేషనల్ మాస్టర్’ పోటీలకు అర్హత సాధించి.. ఈ ఘనత వహించిన తెలంగాణ తొలి తేజంగా సహజశ్రీ గుర్తింపు పొందింది.
ii. తాజాగా విమెన్ ఇంటర్నేషనల్ మాస్టర్ పోటీకి అర్హత పొందింది. ఇటీవలే ‘చెక్ ఓపెన్-2019’లో చక్కటి ప్రతిభ కనబరిచింది. ఇద్దరు గ్రాండ్ మాస్టర్లు, నలుగురు ఇంటర్నేషనల్ మాస్టర్లు, ముగ్గురు విమెన్ ఫెడ్ మాస్టర్లతో తలపడి ‘విమెన్ ఇంటర్నేషనల్ మాస్టర్ నార్మ్’ సాధించింది. తెలంగాణ నుంచి ఈ హోదాను అందుకున్న తొలి మహిళగా పేరొందింది.
ఆంధ్రప్రదేశ్ వార్తలు
ఈ నెల 27 నుంచి విజయవాడలో తెలుగు రచయితల మహాసభలు :
i. విజయవాడలోని సిద్ధార్థ కళాశాల ప్రాంగణంలో ఈ నెల 27, 28, 29 తేదీల్లో 4వ ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు జరగనున్నాయి. సభలకు హాజరయ్యేందుకు దేశవిదేశాల నుంచి 1500 మంది వరకు సాహితీవేత్తలు, భాషా సాంకేతిక నిపుణులు పేర్లు నమోదు చేసుకున్నారు.
ii. ప్రపంచ తెలుగు రచయితల సంఘం ఆధ్వర్యంలో నాలుగేళ్లకోసారి ఈ మహాసభలను నిర్వహిస్తున్నారు. ‘మాతృభాషను కాపాడుకుందాం- స్వాభిమానం చాటుకుందాం’ నినాదంతో ఈ ఏడాది సభలను నిర్వహిస్తున్నారు.
iii. 2019ని అంతర్జాతీయ మాతృభాషల పరిరక్షణ సంవత్సరంగా ఐక్యరాజ్యసమితి ప్రకటించినందున తెలుగు నేలపై ఉన్న అన్ని మాతృభాషల పరిరక్షణ, అభివృద్ధి, ఆధునికీకరణ లక్ష్యంగా మహాసభల కార్యాచరణను రూపొందిస్తున్నారు.
ఇతర రాష్ట్రాలు / కేంద్ర పాలిత ప్రాంతాల వార్తలు
WDO to launch World Design Protopolis in Bengaluru :
i. The World Design Organization is all set to launch its new global programme World Design Protopolis in Bengaluru. It is aimed at implementing holistic progress in megacities across the world and thus making them sustainable.
ii. The project also aims to measure the progress of the city, attract investments and solve problems so that the city becomes a better place for citizens.
iii. The International Council of Societies of Industrial Design was founded in 1957 from a group of international organizations focused on industrial design. It was renamed the World Design Organization in January 2017.
సైన్స్ అండ్ టెక్నాలజీ
Google Earth covers 98 percent of entire population :
i. Search engine giant Google has revealed that it’s powerful mapping service, Google Earth now covers more than 98 per cent of the world, and has captured 10 million miles of Street View imagery, a distance that could circle the globe more than 400 times.
ii. Google Earth, the software that lets you browse the globe with 3D representation, right from the comfort of your couch, offers 6 million square miles of high definition satellite images, covering more than 98 per cent of the entire population.
సదస్సులు
79వ చట్టసభల అధ్యక్షుల సదస్సు – డెహ్రాడూన్
i. అఖిల భారత చట్టసభల అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, సభాపతులు, ఉప సభాపతులు, శాసనమండలి కార్యదర్శుల 79వ సదస్సు ఈ నెల 17 నుంచి 20 వరకు ఉత్తరాఖండ్ రాజధాని దేహ్రాదూన్లో జరగనుంది.ii. తెలంగాణ నుంచి శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి, శాసన సభాపతి పోచారం శ్రీనివాస్రెడ్డి, ఉపసభాపతి పద్మారావు, కార్యదర్శి వి.నర్సింహాచార్యులు హాజరుకానున్నారు.
iii. నాలుగు రోజుల సదస్సులో రాజ్యాంగంలోని పదో షెడ్యూలు-సభాపతుల పాత్ర, దేశంలోని అన్ని చట్ట సభల్లో ఒకే రకమైన పార్లమెంటరీ నిబంధనల రూపకల్పన, చట్ట సభలు సామాన్య ప్రజలకు చేరువయ్యే మార్గాలు, సమస్యలు-సవాళ్లు, అమర్యాదకర పదాల తొలగింపు తదితర అంశాలపై చర్చించనున్నారు.
ఫలితం లేకుండానే ముగిసిన వాతావరణ సదస్సు @ COP 25 మాడ్రిడ్ 2019 Dec 2-15 :
i. ఐక్యరాజ్య సమితి (ఐరాస) ఆధ్వర్యంలో సుదీర్ఘంగా జరిగిన వాతావరణ చర్చలు ఎలాంటి ఫలితాన్ని ఇవ్వకుండానే ముగిశాయి. కార్బన మార్కెట్లపై ప్రపంచ దేశాలు ఒక అంగీకారానికి రాలేకపోయాయి.
ii. 2015 నాటి పారిస్ ఒప్పందంలో పేర్కొన్న లక్ష్యాలకు అనుగుణంగా మరింత పటిష్ఠంగా గ్రీన్ హౌస్ వాయు ఉద్గారాలను తగ్గించుకునే అంశంపై చర్చించడానికి ఈ నెల 2 నుంచి స్పెయిన్లోని మాడ్రిడ్లో ‘కాప్-25’ పేరుతో ఈ సదస్సు జరిగింది.
- Persons in news
‘స్వర్ణలత మహాపాత్రో’ బుద్ధవనంలో స్వర్ణశిల్పి :
i. ఒడిశాకు చెందిన స్వర్ణలత మహాపాత్రో. తథాగతుడి జీవిత చరిత్రను సాంతం తెలిపే శిల్పకళతో రూపొందిన బుద్ధవనం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇందులోని ప్రతి శిల్పం అపురూపమే. వాటి తయారీ వెనుక కృషి చేసిన శిల్పుల్లో ఈమె ఒకరు.
‘బుద్ధవనం’ ప్రాజెక్టు :
ii. నల్గొండ జిల్లా నాగార్జునసాగర్లో ‘బుద్ధవనం’ ప్రాజెక్టు 274 ఎకరాల్లో ప్రాణం పోసుకుంటోంది. ఇది ఆసియా ఖండంలోనే అతిపెద్ద ప్రాజెక్టు. జాతీయ స్థాయిలో పేరుప్రఖ్యాతలున్న శిల్పి హరిప్రసాద్, ఆయన కుమారుడు హర్షవర్ధన్, స్వర్ణలత మహాపాత్రో ఈ ముగ్గురి కృషి ఫలితమే ‘బుద్ధవనం’.
iii. 2012లో ఊపిరి పోసుకున్న ఈ ప్రాజెక్టు పనులు ప్రస్తుతం 90శాతం పూర్తయ్యాయి.
విశాఖపట్నంలో బౌద్ధస్తూపం :
iv. ఈమె విశాఖపట్నంలోని లుంబిని పార్కులో పదిహేను అడుగుల ధ్యానముద్రలో ఉన్న ఏకశిలా బుద్ధుడి స్తూపాన్ని రూపొందించారు. దీనికి ఎనిమిది నెలల సమయం పట్టింది.
BOOKS
‘పిట్టవాలిన చెట్టు’-By వర్ధెల్లి వెంకటేశ్వర్లు
i. రాష్ట్రంలో రాబోయే రోజుల్లో ప్రజలు కరవును చూడరని ఆర్థిక మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం కొత్తగూడెంలో జరిగిన ‘పిట్టవాలిన చెట్టు’ పుస్తకావిష్కరణ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు.
ii. పిట్ట వాలిన చెట్టు పుస్తక రచయిత వర్ధెల్లి వెంకటేశ్వర్లును మంత్రి అభినందించారు. పల్లెల్లో చెరువులకు జలకళ సంతరించుకుందని.. భూగర్భజలాలు పెరిగి బోర్లు, బావులు పూర్తిగా నిండాయన్నారు.
ముఖ్యమైన రోజులు
Vijay Diwas : 16 December
1971 యుద్ధంలో పాకిస్థాన్పై భారతదేశం సాధించిన విజయాన్ని జ్ఞాపకార్థం దేశం డిసెంబర్ 16 ను విజయ్ దివాస్గా జరుపుకుంటుంది.
డిసెంబర్ 3న ప్రారంభమైన 1971 నాటి ఇండో-పాకిస్తాన్ యుద్ధం 13 రోజులు కొనసాగి అధికారికంగా డిసెంబర్ 16 తో ముగిసింది, తరువాత పాకిస్తాన్ భారతదేశానికి లొంగిపోయింది.
1971 లో ఈ రోజున, పాకిస్తాన్ దళాల చీఫ్ జనరల్ AA ఖాన్ నియాజీతో పాటు 93 వేల మంది సైనికులు భారత సైన్యం మరియు ముక్తి బాహినిలతో కూడిన మిత్రరాజ్యాల దళాలకు బేషరతుగా లొంగిపోయారు. యుద్ధం ముగిసిన తరువాత తూర్పు పాకిస్తాన్ బంగ్లాదేశ్ లోకి విడిపోయింది.
Bangladesh Liberation War (బంగ్లాదేశ్ విముక్తి యుద్ధం) : 16 December 1971
i. బంగ్లాదేశ్ విమోచన యుద్ధాన్ని పాకిస్తాన్ లో పౌరయుద్ధంగా, అంతర్యుద్ధంగా వ్యవహరిస్తారు. బంగ్లాదేశ్ స్వాతంత్ర్య యుద్ధం లేదా తేలికగా విమోచన యుద్ధంగా వ్యవహరించే పరిణామం బెంగాలీ జాతీయవాద ఉద్యమం, స్వీయ గుర్తింపు ఉద్యమం, 1971 బంగ్లాదేశ్ జాతినిర్మూలన మారణహోమాలకు ఫలితంగా పాకిస్తాన్ కు వ్యతిరేకంగా ప్రారంభించిన తిరుగుబాటు మరియు సాయుధ సంఘర్షణ.
ii. దీని ఫలితంగా బంగ్లాదేశ్ కు స్వాతంత్ర్యం లభించి ప్రత్యేక దేశంగా ఏర్పాటైంది. 1971 మార్చి 25 రాత్రి తూర్పు పాకిస్తాన్ ప్రజలకు వ్యతిరేకంగా పశ్చిమ పాకిస్తాన్ కు చెందిన పాకిస్తానీ సైనికాధికారుల ముఠా ఆపరేషన్ సెర్చ్ లైట్ ప్రారంభించడంతో యుద్ధం మొదలైంది.
iii. జాతీయవాదులైన బెంగాలీ పౌరులు, విద్యార్థులు, మేధావులు, మతపరమైన మైనార్టీలు, సాయుధులను వెతికి వెతికి చంపడం ఇందులో భాగం. సైనిక ముఠా 1970 పాకిస్తాన్ ఎన్నికల ఫలితాలను రద్దుచేసి, ఎన్నికైన ప్రధాని షేక్ ముజిబుర్ రహ్మాన్ ను అరెస్ట్ చేశారు.
iv. 1971 డిసెంబర్ 3న పాకిస్తాన్ ఉత్తర భారతదేశంలో ముందస్తు వైమానిక దాడులను ప్రారంభించడంతో భారతదేశం యుద్ధంలో అడుగుపెట్టింది. ఆపైన ప్రారంభమైన భారత్-పాక్ యుద్ధం ప్రారంభమై రెండు పక్షాలూ తలపడ్డాయి. తూర్పున సాధించిన వైమానిక ఆధిపత్యంతో భారత్, బంగ్లాదేశ్ మిత్రపక్షాలు ముందుకు సాగగా డిసెంబర్ 16, 1971న పాకిస్తాన్ ఢాకాలో లొంగిపోయింది.
v. యుద్ధం దక్షిణాసియాలో రాజకీయ భౌగోళిక చిత్రపటాన్ని మార్చివేసి, ప్రపంచంలోకెల్లా ఏడవ జనసమ్మర్ధమైన దేశంగా బంగ్లాదేశ్ ప్రాదుర్భవించింది. సంక్లిష్టమైన ప్రాంతీయ కూటముల కారణంగా, యుద్ధం అమెరికా, సోవియట్ యూనియన్, చైనాల్లో ఉద్రిక్తతలు రేకెత్తిస్తూ ప్రచ్ఛన్నయుద్ధంలో ప్రధాన ఘట్టం అయింది. 1972లో ఐక్యరాజ్య సమితి సభ్య దేశాల్లో చాలావరకూ బంగ్లాదేశ్ గణతంత్రాన్ని గుర్తించాయి.
ప్రధాని నెహ్రు చేత సాలార్ జంగ్ మ్యూజియం ప్రారంభోత్సవం : 1951 డిసెంబరు 16
i. సాలార్ జంగ్ మ్యూజియం భారతదేశంలో మూడవ అతిపెద్ద సంగ్రహాలయంగా ఉంది. వివిధ నాగరికతలు చెందిన సేకరణలు మరియు 1వ శతాబ్దం చెందిన పురాతన వస్తువులకు భారతదేశంలో ప్రసిద్ధి.
ii. 1951 డిసెంబరు 16 న ఈ సంగ్రహాలయం ప్రజలకొరకు తెరవబడింది. హైదరాబాదుకు చెందిన నిజామ్ పరిపాలకుల "సాలార్ జంగ్ కుటుంబం" ప్రపంచం నలుమూలల నుండి ఎన్నో విలువైన వస్తు సామగ్రి, కళాఖండాలు సేకరించింది.
iii. ఇందులో ఇస్లామీయ కళాఖండాలు, ప్రాచీన ఖురాన్ ప్రతులూ, నగలూ, నగిషీలూ, యుద్ధసామగ్రీ, పర్షియా తివాసీలు మొదలగునవి ఉన్నాయి. ఈ సేకరణలన్నీ దాదాపు మీర్ యూసుఫ్ అలీ ఖాన్ సేకరించినవే, ఇతను సాలార్ జంగ్ IIIగా ప్రసిధ్ధి. కొన్ని సేకరణలు ఇతడి తండ్రియైన "మీర్ లయీఖ్ అలీ ఖాన్ సాలార్ జంగ్ II" మరియు "నవాబ్ మీర్ తురాబ్ అలీ ఖాన్ సాలార్ జంగ్ I"కు చెందినవి.
iv. సాలార్ జంగ్ మ్యూజియం "దార్-ఉల్-షిఫా" వద్ద గల ఒక కళా సంగ్రహాలయము.హైదరాబాదు నగరంలోని మూసీ నది దక్షిణ ఒడ్డున ఉంది. భారతదేశం లోని 3 జాతీయ మ్యూజియం లలో ఇది ఒకటి. ఇందు "ఏనుగు దంతాల కళాకృతులు", "పాలరాతి శిల్పాలు" గలవు.
v. జపాన్, చైనా, బర్మా, నేపాల్, భారతదేశం, పర్షియా, ఈజిప్ట్, ఐరోపా, ఉత్తర అమెరికా దేశాలకు సంబంధించిన శిల్పాలు, చిత్రలేఖనాలు, బొమ్మలు, వస్త్రాలుచేతివ్రాతలు, సెరామిక్స్, లోహ కళాఖండాలు, తివాచీలు, గడియారాలు ఉన్నాయి.
vi. హైదరాబాద్ యొక్క సాలార్ జంగ్ మ్యూజియం ప్రపంచంలోని విభిన్న యూరోపియన్, ఆసియా మరియు దూర ప్రాచ్య దేశాలలో యొక్క కళాత్మక వస్తువుల భాండాగారం. ఈ సేకరణ ప్రముఖంగా సాలార్ జంగ్ III సేకరించారు.
vii. ఈ మ్యూజియం ఉదయం 10:00 నుండి సాయంత్రం 5:00 వరకూ సందర్శకులకొరకు తెరవబడి ఉంటుంది. (శుక్రవారం సెలవు).
క్రీడలు
మొనాకో మహిళల గ్రాండ్ ప్రి చెస్ టోర్నీలో కోనేరు హంపి రజతం :i. తెలుగు గ్రాండ్మాస్టర్ కోనేరు హంపి మరోసారి అంతర్జాతీయ స్థాయిలో మెరిసింది. ఫిడే మొనాకో మహిళల గ్రాండ్ ప్రి చెస్ టోర్నీలో ఆమె రజతం గెలిచింది. చివరి రౌండ్లో ఆమె.. రష్యా క్రీడాకారిణి అలెగ్జాండ్ర గోర్యాచ్కినాపై విజయం సాధించింది.
ii. కోస్తనీక్ స్వర్ణం గెలుచుకుంది. హంపి రెండో స్థానంలో నిలిచింది. మరో తెలుగు గ్రాండ్మాస్టర్ ద్రోణవల్లి హారిక 5.5 పాయింట్లతో ఆరో స్థానానికి పరిమితమైంది.
Pakistan's Abid Ali first to score Test and ODI hundreds on debut :
i. కెరీర్లో తొలి టెస్టు ఆడుతున్న ఓపెనర్ అబిద్ అలీ (109 నాటౌట్; 201 బంతుల్లో 11×4) రావల్పిండిలో శ్రీలంక పై అజేయ సెంచరీ సాధించాడు.
ii. తన తొలి వన్డేలో శతకం సాధించిన అబిద్.. అరంగేట్ర టెస్టులోనూ సెంచరీ చేసి ఈ ఘనత సాధించిన తొలి బ్యాట్స్మన్గా రికార్డు సృష్టించాడు.
No comments:
Post a Comment