✍ కరెంట్ అఫైర్స్ 12 డిసెంబర్ 2019 Thursday ✍
జాతీయ వార్తలు
ఆశ్రయం కోరి వచ్చేవారు మన పౌరులే. పొరుగుదేశాల మైనార్టీలకు పౌరసత్వం. బిల్లుకు పార్లమెంట్ ఆమోదం :
i. కేంద్రంలోని ఎన్డీయే సర్కారు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న పౌరసత్వ సవరణ బిల్లుకు రాజ్యసభ ఆమోదం తెలిపింది.
ii. లోక్సభ ఆమోదం పొందిన ఈ బిల్లుకు పెద్దల సభ 125-99 ఓట్ల తేడాతో పచ్చజెండా చూపించింది. ఎన్డీయేతో పాటు వైకాపా, తెదేపా, అన్నాడీఎంకే, బిజూ జనతాదళ్ పార్టీలు బిల్లుకు మద్దతు పలికాయి.
iii. పీడనకు గురై శరణార్థులుగా వచ్చిన ముస్లిమేతరులకు పౌరసత్వమిచ్చి రక్షణ కల్పించడమే తమ ఉద్దేశమని, అంతమాత్రాన ముస్లింలకు ఎలాంటి వేధింపులు ఉండబోవని ప్రభుత్వం తేల్చిచెప్పింది.
iv. పీడనకు గురై... అఫ్గానిస్థాన్, బంగ్లాదేశ్, పాకిస్థాన్ల నుంచి శరణార్థులుగా వచ్చిన మైనార్టీలకు విద్య, ఉద్యోగం, జీవనోపాధి హక్కు కల్పించడమే ప్రతిపాదిత చట్టం ఉద్దేశమని అమిత్షా వివరించారు.
v. పౌరసత్వ సవరణపై అపోహల్ని తొలగించాలని, ప్రయోజనాలను ప్రజలకు వివరించాలని భాజపా ఎంపీలకు ప్రధాని మోదీ సూచించారు. ఈ నెల 25న జరిగే సుపరిపాలన దినోత్సవాన్ని దీనికి వేదికగా చేసుకోవాలని చెప్పారు.
బిల్లుకు నిరసనగా ఐపీఎస్ అధికారి రాజీనామా :
vi. పౌరసత్వ సవరణ బిల్లు మన రాజ్యాంగానికి, మతపరమైన బహుళత్వానికి విరుద్ధంగా ఉందని, దానికి నిరసనగా రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నానని మహారాష్ట్ర క్యాడర్ ఐపీఎస్ అధికారి అబ్దుర్ రెహ్మాన్ తెలిపారు. ముంబయిలో ఆయన ప్రత్యేక ఐజీగా ఉన్నారు.
LS passes Bill to set up unified authority for financial services :
i. The Lok Sabha passed the International Financial Services Centres (IFSC) Authority Bill, 2019 which provides for the establishment of an authority to develop and regulate the financial services market.
ii. Refuting claims that the IFSC could become a tax haven, the Finance Minister Nirmala Sitharaman said, “Tax holiday is given only for 10 years in the IFSC.”
iii. On the question of the crisis-ridden IL&FS in GIFT City, Ms. Sitharaman said the Gujarat government wanted to take over the stake in the IFSC. The Gujarat government has already appointed a new CEO replacing the IL&FS nominee.
iv. The International Financial Services Centres Authority Bill, 2019, was introduced in the Lok Sabha after withdrawal from the Rajya Sabha.
తెలంగాణ వార్తలు
దుమ్ముగూడెం బ్యారేజికి పచ్చజెండా @అమ్మగారిపల్లి, అశ్వాపురం మండలం,భద్రాద్రి కొత్తగూడెం జిల్లా :
i. గోదావరిలో అత్యధిక నీటిని నిల్వ చేసే దుమ్ముగూడెం బ్యారేజీ నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. రూ.3482 కోట్లతో 37 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో చేపట్టదలచిన ఈ బ్యారేజీ నిర్మాణానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
ii. ఇక్కడి నుంచే 70 టీఎంసీలకు పైగా వినియోగ అంచనాతో సీతారామ ఎత్తిపోతల పథకాన్ని తెలంగాణ ప్రభుత్వం చేపట్టింది. గోదావరిలో ఇప్పటివరకు 1985-86లో అత్యధికంగా వరద వచ్చింది.
ఆంధ్రప్రదేశ్ వార్తలు
‘ఆంధ్రప్రదేశ్ దిశ యాక్ట్’.అత్యాచారానికి పాల్పడితే ఉరే. 14 రోజుల్లో విచారణ :
i. మహిళలు, చిన్నారులపై అత్యాచారం వంటి క్రూర నేరాలకు పాల్పడిన వారికి ఉరిశిక్ష విధించేలా రాష్ట్ర ప్రభుత్వం ‘ఆంధ్రప్రదేశ్ దిశ యాక్ట్’ పేరుతో రాష్ట్ర కొత్త చట్టం తీసుకురానుంది. అలాంటి కేసుల్లో 21 రోజుల్లోనే తీర్పు చెప్పేలా నిబంధన పొందుపరుస్తోంది.
ii. ఆంధ్రప్రదేశ్ క్రిమినల్ లా (సవరణ) చట్టంతో పాటు (దీన్నే ఏపీ దిశ యాక్ట్గా వ్యవహరించనున్నారు), మహిళలు, పిల్లలపై తీవ్రమైన నేరాల విచారణకు ప్రత్యేక కోర్టుల ఏర్పాటు చట్టాలను కొత్తగా తేవాలని సచివాలయంలో ముఖ్యమంత్రి జగన్ అధ్యక్షతన జరిగిన మంత్రిమండలి సమావేశంలో నిర్ణయించారు.
అంతర్జాతీయ వార్తలు
Bougainville To Become World's Newest Nation :
i. మరో కొత్త దేశం ఆవిర్భవించబోతోంది. దీని పేరు ‘బొగాన్విల్’. పపువా న్యూ గినియా నుంచి ఈ దక్షిణ పసిఫిక్ ప్రాంతం స్వాతంత్య్ర సాధన దిశగా నిర్వహించిన రిఫరెండంలో ఘనవిజయం సాధించిందంటూ సంబంధిత కమిషన్ చైర్మన్ బెర్టీ అహ్రెన్ ప్రకటించారు.
ii. దీంతో ప్రజలంతా ఆనందంలో మునిగిపోయారు. అయితే, పపువా న్యూగినియా పార్లమెంటు ఇందుకు ఆమోదముద్ర వేయాల్సి ఉంది. బొగాన్విల్ జనాభా దాదాపు 3లక్షలు.
World’s First commercial electric plane takes flight in Canada :
i. The world’s first fully-electric commercial aircraft took its inaugural test flight, taking off from the Canadian city of Vancouver.
ii. Greg McDougall, founder and chief executive of Harbour Air, a British Columbia-based charter airline.
సైన్స్ అండ్ టెక్నాలజీ
పీఎస్ఎల్వీ-సీ48 ప్రయోగం విజయవంతం. 10 ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశపెట్టిన రాకెట్. అయిదేళ్లు సేవలందించనున్న రీశాట్-2బీఆర్1. పీఎస్ఎల్వీ సిరీస్లో ఇది 50వ ప్రయోగం :
i. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) పీఎస్ఎల్వీ-సీ48 రాకెట్ ద్వారా 10 ఉపగ్రహాలను కక్ష్యలో విజయవంతంగా ప్రవేశపెట్టింది. ఇస్రో నమ్మినబంటు పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్(పీఎస్ఎల్వీ) సిరీస్లో ఇది 50వ ప్రయోగం కావడం గమనార్హం.
ii. మనదేశానికి చెందిన రాడార్ ఇమేజింగ్ ఎర్త్ అబ్జర్వేషన్ (రీశాట్-2బీఆర్1) ఉపగ్రహంతోపాటు విదేశాలకు చెందిన 9 ఉపగ్రహాలను నిర్ణీత కక్ష్యల్లో ప్రవేశపెట్టింది. ఇందులో అమెరికాకు చెందిన 4, ఇజ్రాయెల్, ఇటలీ, జపాన్లకు చెందిన ఒక్కో ఉపగ్రహం ఉన్నాయి.
iii. రీశాట్-2బీఆర్1 బరువు 628 కిలోలు. ఇది వ్యవసాయం, అటవీ, విపత్తు నిర్వహణ వంటి రంగాల్లో సేవలందించనుంది. దీని జీవితకాలం ఐదేళ్లు. తాజా ప్రయోగం షార్ నుంచి జరిగిన 75వది.
ఆర్థిక అంశాలు
వృద్ధిరేటు 5.1 శాతమే : ADB
i. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత వృద్ధిరేటు 5.1 శాతానికి పరిమితం అవుతుందని ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ (ఏడీబీ) తాజాగా అంచనా వేసింది.
ii. ఉద్యోగ నియామకాలు, గ్రామీణ ప్రాంతాల్లో ఒత్తిడి, సాగు బాగా లేకపోవడం, రుణలభ్యత తక్కువగా ఉండటం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని, వృద్ధిరేటు అంచనాను తాజాగా 5.1 శాతానికి కుదించింది.
iii. అయితే ప్రభుత్వ ప్రోత్సాహక విధానాల వల్ల వచ్చే ఆర్థిక సంవత్సరంలో వృద్ధిరేటు 6.5 శాతానికి చేరుతుందని ఏడీబీ అంచనా వేసింది. 2020లో భారత వృద్ధిరేటు 7.2 శాతం ఉంటుందని బ్యాంక్ గతంలో అంచనా వేసింది.
Appointments
Smith is CSA director :
i. Former captain Graeme Smith was appointed as Cricket South Africa’s (CSA) interim director.
ii. CSA’s acting CEO Jacques Faul said Smith will remain in the post until the Indian Premier League (IPL) next year.
Pepsico appoints Salman Khan as Pepsi’s new brand ambassador :
i. పెప్సికో తన ప్రధాన పెప్సి బ్రాండ్ కార్బోనేటేడ్ పానీయం యొక్క కొత్త బ్రాండ్ అంబాసిడర్గా నటుడు సల్మాన్ ఖాన్ను నియమించింది. సాల్మాన్ ఖాన్ రాబోయే చిత్రం “దబాంగ్ -3” పై బ్రాండ్ పెప్సి 2020 సమ్మర్ క్యాంపెయిన్ను రూపొందించనుంది. పెప్సికో ఇండియా కొత్త అసోసియేషన్ను ప్రభావితం చేయడానికి ప్రచారాన్ని ప్రారంభించనుంది.
ii. సల్మాన్ ఖాన్ మూడు సంవత్సరాల క్రితం పెప్సికో యొక్క ఉత్పత్తి “థమ్స్ ప్” కు ప్రాతినిధ్యం వహించాడు.
PUMA signs Sunil Chhetri as brand ambassador :
i. భారత పురుషుల ఫుట్బాల్ జట్టు కెప్టెన్ సునీల్ ఛెత్రి పుమాతో 3 సంవత్సరాల ఒప్పందం కుదుర్చుకున్నాడు. పోర్చుగల్ యొక్క క్రిస్టియానో రొనాల్డో తరువాత బెంగళూరు ఎఫ్సి కెప్టెన్ ప్రస్తుతం అంతర్జాతీయ ఫుట్బాల్లో అత్యధిక గోల్ సాధించిన రెండవ స్థానంలో ఉన్నాడు.
ii. అతను అత్యధికంగా క్యాప్ చేసిన భారత ఆటగాడు మరియు భారత జట్టుకు ఆల్ టైమ్ టాప్ గోల్ స్కోరర్ కూడా. అతను ఆరుసార్లు AIFF ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ గా ఎంపికయ్యాడు. ఆయనకు 2011 లో అర్జున అవార్డు, 2019 లో పద్మశ్రీ అవార్డు కూడా అందజేశారు.
అవార్డులు
‘టైమ్’ ఈ ఏటి మేటిగా గ్రెటాథెన్బెర్గ్ :
i. వాతావరణ మార్పులపై చర్యలను డిమాండ్ చేస్తూ...ప్రపంచదేశాధినేతలనే ‘మీకెంత ధైర్యం’ అంటూ ప్రశ్నించిన పర్యావరణ ఉద్యమకారిణి గ్రెటా థెన్బెర్గ్(16)ను ఈ ఏటిమేటి వ్యక్తిగా టైమ్ మేగజైన్ ప్రకటించింది. 2019వ సంవత్సరానికి గాను ఆమెను ఈ గౌరవానికి ఎంపిక చేసినట్లు ‘టైమ్’ తెలిపింది. ఇప్పటిదాకా ఈ పురస్కారానికి ఎంపికైన అత్యంత పిన్నవయస్కురాలు గ్రెటా థెన్బెర్గ్ అని పేర్కొంది.
ii. మరోవైపు భారత్లోని మణిపుర్కు చెందిన ఎనిమిదేళ్ల బాలిక లిసీప్రియా కంగుజామ్.. బడికెళ్లడం మానేసి మరీ వాతావరణ మార్పులపై యుద్ధానికి సన్నద్ధమైంది. ఇదే విషయాన్ని మాద్రీద్లో జరిగిన సదస్సులో వెల్లడించింది.
Department of Social Justice and Empowerment has started the scheme of National award :
i. సామాజిక న్యాయం మరియు సాధికారత విభాగం (Department of Social Justice and Empowerment) మద్యపాన నివారణ మరియు మాదకద్రవ్యాల దుర్వినియోగ రంగంలో అత్యుత్తమ సేవ చేసినందుకు జాతీయ అవార్డు పథకాన్ని ప్రారంభించింది. మద్యపానం మరియు మాదకద్రవ్యాల నివారణ రంగంలో పనిచేసే సంస్థలు మరియు వ్యక్తులకు ఈ పథకం వర్తిస్తుంది.
ii. 2020 జూన్ 26న మాదకద్రవ్యాల దుర్వినియోగం మరియు అక్రమ రవాణాకు వ్యతిరేకంగా అంతర్జాతీయ దినోత్సవం సందర్భంగా అవార్డు పొందినవారికి జాతీయ అవార్డును ప్రదానం చేస్తారు.
iii. Minister of Social Justice and Empowerment : Thaawar Chand Gehlot.
కమిటీలు
గుజరాత్ అల్లర్లలో మోదీకి క్లీన్చిట్. జస్టిస్ నానావతి కమిషన్ నివేదికలో వెల్లడి :
i. గుజరాత్ అల్లర్లలో అప్పటి ముఖ్యమంత్రి, (ప్రస్తుత ప్రధాని) నరేంద్ర మోదీ ఆధ్వర్యంలోని ప్రభుత్వ ప్రమేయం ఏమీ లేదంటూ జస్టిస్ నానావతి కమిషన్ క్లీన్చిట్ ఇచ్చింది.
ii. అల్లర్లు జరిగిన 12 ఏళ్లకు ఈ కమిషన్ రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక ఇవ్వగా, ఆ తర్వాత అయిదేళ్లకు అసెంబ్లీ ముందుంచారు.
iii. 2002లో జరిగిన అల్లర్లలో వెయ్యి మందికి పైగా ప్రజలు మరణించారు. వీటిపై దర్యాప్తునకు సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ జి.టి.నానావతి, గుజరాత్ హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ కె.జి.షాల ఆధ్వర్యంలో అప్పటి నరేంద్ర మోదీ ప్రభుత్వం కమిషన్ను ఏర్పాటు చేసింది.
iv. గోద్రా రైల్వే స్టేషన్ సమీపంలో సబర్మతి ఎక్స్ప్రెస్కు చెందిన రెండు బోగీలు దహనమై 59 మంది కరసేవకులు మరణించిన అనంతరం గుజరాత్లో అల్లర్లు చెలరేగాయి.
ముఖ్యమైన రోజులు
International Universal Health Coverage Day : 12 December
i. Theme 2019 : “Keep the promise”ii. అంతర్జాతీయ యూనివర్సల్ హెల్త్ కవరేజ్ డే (UHC డే) డిసెంబర్ 12 న ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటారు. అంతర్జాతీయ యూనివర్సల్ హెల్త్ కవరేజ్ డే బలమైన మరియు స్థితిస్థాపకంగా ఉండే ఆరోగ్య వ్యవస్థల ఆవశ్యకత మరియు బహుళ-వాటాదారుల భాగస్వాములతో సార్వత్రిక ఆరోగ్య కవరేజ్ గురించి అవగాహన పెంచడం.
iii. 2017 లో ఐక్యరాజ్యసమితి 72/138 తీర్మానం ద్వారా డిసెంబర్ 12 ను అంతర్జాతీయ యూనివర్సల్ హెల్త్ కవరేజ్ డేగా ప్రకటించింది.
International Day of Neutrality (అంతర్జాతీయ తటస్థ దినోత్సవం) : 12 December
i. International Day of Neutrality is a United Nations observance held on December 12 each year. It was officially declared by a UN General Assembly resolution adopted in February 2017 and first observed on December 12 of the same year.
ii. In international law, a neutral country is a sovereign state that abstains from all participation in a war between other states and maintains an attitude of impartiality toward the belligerents.
iii. The rights and duties of a neutral country are defined in the Hague Convention of 1907.
K.V. రంగారెడ్డి జయంతి : డిసెంబరు 12, 1890
• కొండా వెంకట రంగారెడ్డి (డిసెంబరు 12, 1890 - జూలై 24, 1970) స్వాతంత్ర్య సమరయోధుడు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర తొలితరం రాజకీయ నాయకుడు. ఈయన పేరు మీదుగానే రంగారెడ్డి జిల్లాకు ఆ పేరు వచ్చింది.
• 1959 నుండి 1962 వరకు దామోదరం సంజీవయ్య ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈయన ఉప ముఖ్యమంత్రిగా పనిచేశాడు. రంగారెడ్డి, నీలం సంజీవరెడ్డి మంత్రివర్గములో కూడా మంత్రి పదవి నిర్వహించాడు.
• రంగారెడ్డి ప్రస్తుత రంగారెడ్డి జిల్లాతెలంగాణరాష్ట్రం లోని మొయినాబాదు మండలం, పెద్దమంగళారం గ్రామంలో 1890, డిసెంబరు 12 న జన్మించాడు.
• రంగారెడ్డి ఆంధ్రమహాసభ కార్యక్రమాలలో చురుకుగా పాల్గొని మహబూబ్ నగర్ జిల్లా షాద్నగర్ లో జరిగిన ఐదవ ఆంధ్రమహాసభకు అధ్యక్షత వహించాడు. ఈయన నిజాం శాసనసభలో, హైదరాబాదు రాష్ట్ర శాసనసభలోనూ, ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర శాసనసభలో ప్రాతినిధ్యం వహించాడు. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో రెండు పర్యాయాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన మర్రి చెన్నారెడ్డి ఈయన మేనల్లుడు.
• 1940 వరకు జిల్లా కోర్టు, హైకోర్టులో న్యాయవాదిగా పనిచేశారు. 1943లో జరిగిన ఏడవ ఆంధ్ర మహాసభకు అధ్యక్షత వహించారు. నిజాం సంస్థానం భారత్లో విలీనం అయిన తర్వాత బూర్గుల మంత్రి వర్గంలో రెవెన్యూ, ఎక్సైజ్, కస్టమ్స్ తదితర శాఖలను నిర్వహించారు.
• నాటి ముఖ్యమంత్రి బూర్గులను ఏ కారణం లేకుండానే ముఖ్యమంత్రిగా రాజీనామా చేయాలని కోరినపుడు ఆ నిర్ణయాన్ని కేవీ తీవ్రంగా వ్యతిరేకించారు. అంతేకాకుండా మేం మళ్లీ బూర్గులనే సీఎంగా ఎన్నుకుంటే మేరేం చేస్తారని నిలదీసిన ధీరుడు.
• 1956లో ఆంధ్రప్రదేశ్ అవతరణ తర్వాత కూడా నీలం సంజీవరెడ్డి మంత్రి వర్గంలో హోం శాఖ, రెవెన్యూ శాఖలను నిర్వహించారు. 1960లో నీలం సంజీవరెడ్డి అఖిల భారత కాంగ్రెస్ అధ్యక్షుడిగా వెళ్లగా ఇక్కడ ముఖ్యమంత్రి పదవిని దామోదరం సంజీవయ్యను వరించింది. ఆయన కాలంలో రంగారెడ్డి ఉప ముఖ్యమంత్రిగా పనిచేశారు.
• 1936లో ఆయన శాసనసభకు ఎన్నిక కావడంతో ప్రజలకు సేవ చేసే అవకాశం కలిగింది. సభలో 24 శాసనాలను, కొన్ని సవరణలు ప్రవేశపెట్టారు. అందులో స్త్రీలకు వారసత్వపు హక్కు కలిగజేయడం, వర్ణాంతర వివాహం చేసుకుంటే వారి సంతానం సక్రమ సంతానమని నిరూపణ, బాల్య వివాహ వ్యవస్థ నిర్మూలన, అస్పృశ్యతా నివారణ, జాగీర్ల రద్దు, ఉద్యోగాల నియామకానికి పబ్లిక్ సర్వీసు కమిషన్ ఏర్పాటును తన రెండేళ్ల పదవి కాలంలో చేయగలిగారు.
• 1950లోనే ఆయన తెలంగాణ వాదం వినిపించారు. నిజాం పాలన, ఆ తర్వాత మిలిటరీ గవర్నర్ పాలన, వెల్లోడి పాలనలో మహారాష్ట్రులదే పైచేయి ఉండటాన్ని ఆయన నిరసించారు. హైదరాబాద్ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా బూర్గులను నిలిపి గెలిపించింది కూడా ఈయనే.
• 1970, జూలై 24న రంగారెడ్డి మరణించాడు. ఈయన స్మృత్యర్ధం 1978, ఆగస్టు 15న హైదరాబాదు జిల్లాను విభజించి నూతనంగా ఏర్పడిన జిల్లాకు రంగారెడ్డి జిల్లా అని పేరుపెట్టారు.
క్రీడలు
భారత క్రీడల్లో డోపింగ్ కలకలం. పరీక్షల్లో దొరికిన అగ్రశ్రేణి బాక్సర్ సుమీత్, షూటర్ రవికుమార్ :
i. ఒలింపిక్స్లో పతకాలు సాధించగల అవకాశాలున్న ఇద్దరు అగ్రశ్రేణి క్రీడాకారులు డోప్ పరీక్షల్లో దొరికిపోయారు. బాక్సర్ సుమీత్ సంగ్వాన్తో పాటు షూటర్ రవికుమార్ నిషేధిత ఉత్ప్రేరకాలు వాడినట్లు పరీక్షల్లో తేలింది.
ii. 2017 ఆసియా బాక్సింగ్లో రజతం సాధించడంతో పాటు ఈ ఏడాది జాతీయ ఛాంపియన్గా కూడా నిలిచిన 26 ఏళ్ల సుమీత్.. ఒలింపిక్స్లో కూడా పోటీ పడ్డాడు.
iii. 29 ఏళ్ల రవికుమార్ నిరుడు షూటింగ్ ప్రపంచకప్లో, కామన్వెల్త్ క్రీడల్లో, 2017లో ఆసియా షూటింగ్ కాంస్యాలు నెగ్గాడు.
No comments:
Post a Comment