Tuesday, 17 December 2019

17th december 2019 current affairs EENADU TELUGU

✍  కరెంట్ అఫైర్స్ 17 డిసెంబర్ 2019 Tuesday ✍

  Daily Current affairs prepared from Eenadu, The Hindu newspaper and from online current affair websites, Wikipedia etc..

 జాతీయ వార్తలు

పౌరాగ్రహం. దేశవ్యాప్తంగా విస్తరించిన ఆందోళనలు. రోడ్లపైకి వచ్చిన వర్సిటీల విద్యార్థులు :


i. పౌరసత్వ సవరణ చట్టాన్ని, దానిపై ఉద్యమిస్తున్న దిల్లీలోని జామియా మిలియా ఇస్లామియా (జేఎంఐ) విద్యార్థులపై పోలీసుల లాఠీఛార్జిని నిరసిస్తూ చేపట్టిన కార్యక్రమాలతో దేశమంతా హోరెత్తిపోయింది.
ii. కేంద్రం తెచ్చిన కొత్త చట్టానికి వ్యతిరేకంగా పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ కోల్కతా వీధుల్లో భారీ కవాతు నిర్వహించారు. తాను బతికి ఉండగా ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ చట్టాన్ని అంగీకరించబోనని స్పష్టం చేశారు.
iii. లఖ్నవూ, ముంబయి, వారణాసి, గువాహటి, కోల్కతా, అలీగఢ్లలోని పలు విశ్వవిద్యాలయాల విద్యార్థులు వీధులకెక్కారు. సాధారణంగా ఆందోళనలకు దూరంగా ఉండే కాన్పుర్, మద్రాస్, బొంబాయి ఐ.ఐ.టి.ల విద్యార్థులు కూడా ఈసారి పాలుపంచుకున్నారు. ముంబయిలోని ‘టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్’ (టీఐఎస్ఎస్) విద్యార్థులు సయితం గళమెత్తారు.
iv. వివాదాస్పద పౌరసత్వ సవరణ చట్టంపై దేశవ్యాప్తంగా పలు విశ్వవిద్యాలయాలు, విద్యాసంస్థల్లో ఆందోళనలు మిన్నంటాయి. అప్రజాస్వామికమైన ర్యాలీలు తగవంటూ బెంగాల్ గవర్నర్ జగ్దీప్ ధంకడ్ హితవు పలికారు.
CABకు  అనుకూలంగా  పార్టీలు:
v. ఏఐడీఎంకే(తమిళనాడు), వైకాపా, తెదేపా(ఆంధ్రప్రదేశ్), బిజూ జనతాదళ్(ఒడిశా), జేడీయూ(బిహార్), మిజో నేషనల్ ఫ్రంట్(మిజోరం)
CABకు వ్యతిరేకంగా  పార్టీలు :
vi. డీఎంకే(తమిళనాడు), తెరాస(తెలంగాణ), జేడీఎస్(కర్ణాటక), ఝార్ఖండ్ ముక్తీ మోర్చా(ఝార్ఖండ్),  తృణమూల్ కాంగ్రెస్ (పశ్చిమ బెంగాల్), ఏఐడీయూఎఫ్(అసోం), మిజో నేషనల్ ఫ్రంట్(మిజోరం).
CABకు భాజపా మిత్రపక్షం వ్యతిరేకపు పార్టీలు :
vii. అసోం గణ పరిషద్(అసోం), ఎన్పీపీ(మేఘాలయ), సిక్కిం క్రాంతికారీ మోర్చా(సిక్కిం), ఐపీఎఫ్టీ(త్రిపుర).

viii. అసోం గణ పరిషద్(అసోం) ఎన్డీయేలో భాగస్వామి. పౌరసత్వ సవరణ బిల్లు(క్యాబ్) లోక్సభలో ఆమోదం పొందడంతో ఈ ఏడాది జనవరిలో ఎన్డీయే నుంచి బయటికొచ్చింది. 16వ లోక్సభ రద్దయ్యాక ఆ బిల్లు మురిగిపోవడంతో తిరిగి భాజపాతో చేతులు కలిపింది. ఇటీవల పార్లమెంటులో క్యాబ్కు మద్దతిచ్చింది. రాష్ట్రంలో నిరసనలు తీవ్రమవడంతో రూటు మార్చుకుంది.
ix. పౌరసత్వ సవరణ చట్టం ఏ ఒక్కరి భారత జాతీయతను లాక్కోదు. అఫ్గానిస్థాన్, పాకిస్థాన్, బంగ్లాదేశ్లలో మత పీడనకు గురై భారత్కు శరణార్థులుగా వచ్చిన హిందువులు, బౌద్ధులు, సిక్కులు, జైన్లు, పార్సీలు, క్రైస్తవులకు భారత జాతీయతను ప్రసాదిస్తుందని అమిత్ షా పేర్కొన్నారు.

లోక్సభ సభ్యుల సంఖ్య పెంచాలి : మాజీ రాష్ట్రపతి ప్రణబ్ సూచనలు


i. లోక్సభ సభ్యుల సంఖ్యను ప్రస్తుతమున్న 543 నుంచి వెయ్యికి పెంచాల్సిన అవసరం ఉందని మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పేర్కొన్నారు. అందుకు అనుగుణంగా రాజ్యసభలోనూ బలం పెరగాలన్నారు.
ii. రాష్ట్రాల అసెంబ్లీల సభ్యుల సంఖ్యనూ పెంచాలని సూచించారు. ఎన్నికైన ప్రజాప్రతినిధుల సంఖ్య.. ఓటర్ల సంఖ్యకు అనుగుణంగా లేదని అభిప్రాయపడ్డారు.
iii. 1977లో చివరిసారిగా లోక్సభ సభ్యుల సంఖ్యను సవరించారని ప్రణబ్ చెప్పారు. 1971 నాటి జనాభా లెక్కల ఆధారంగా ఆ కసరత్తు చేశారని, అప్పట్లో జనాభా 55 కోట్లు మాత్రమేనని తెలిపారు. ఆ తర్వాత ఈ జనాభా రెట్టింపు కన్నా ఎక్కువగా పెరిగిందన్నారు.
iv. ప్రస్తుతం 16-18 లక్షల మందికి ఒక లోక్సభ సభ్యుడు ఉంటున్నారని పేర్కొన్నారు. అంతమందికి ఆయన ఎలా చేరువ కాగలరని ప్రశ్నించారు. బ్రిటిష్ పార్లమెంటులో 650 మంది సభ్యులు ఉన్నారని, కెనడాలో 443 ఎంపీలు ఉన్నారని గుర్తుచేశారు.
v. లోక్సభకు, రాష్ట్రాల అసెంబ్లీలకు ఏకకాలంలో జమిలి ఎన్నికలు నిర్వహించాలన్న ప్రతిపాదనపై ప్రణబ్ అనుమానాలు వ్యక్తంచేశారు. రాజ్యాంగ సవరణల ద్వారా ఒక్కసారి ఆ ఎన్నికలను నిర్వహించే వీలుండొచ్చని అయితే భవిష్యత్లో ప్రభుత్వాలు అవిశ్వాస తీర్మానాలతో పడిపోవన్న పూచీకత్తు ఏదీ లేదన్నారు.

FASTags becomes mandatory for all vehicles from 15th December 2019 :


i. టోల్ సేకరణ కోసం ఫాస్ట్ ట్యాగ్లు లేదా ప్రీపెయిడ్ రీఛార్జిబుల్ ట్యాగ్లు 15 డిసెంబర్ 2019 నుండి అన్ని వాహనాలకు తప్పనిసరి అయ్యాయి. ఫాస్ట్యాగ్లు లేదా ప్రీపెయిడ్ రీఛార్జిబుల్ ట్యాగ్లు టోల్ను స్వయంచాలకంగా చెల్లించడానికి అనుమతిస్తుంది.
ii. ప్రభుత్వం నేషనల్ ఎలక్ట్రానిక్ టోల్ కలెక్షన్ సిస్టమ్ను ప్రారంభించింది, ఇది ఇంధనం మరియు సమయాన్ని ఆదా చేయడానికి, కాలుష్యాన్ని అరికట్టడానికి మరియు ట్రాఫిక్ యొక్క అతుకులు కదలికను నిర్ధారించడానికి ఫాస్ట్ ట్యాగ్ ద్వారా వినియోగదారు రుసుము వసూలు చేయడానికి అందిస్తుంది.
iii. ఫాస్ట్ ట్యాగ్ సహాయంతో, డ్రైవర్లు పన్ను చెల్లించడానికి టోల్ ప్లాజాల వద్ద తమ వాహనాలను ఆపాల్సిన అవసరం లేదు. కదిలే వాహనం నుండి ప్రత్యక్ష టోల్ చెల్లింపులను ప్రారంభించడానికి ఫాస్ట్ ట్యాగ్ రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ టెక్నాలజీని ఉపయోగిస్తుంది.

తెలంగాణ వార్తలు

రాష్ట్రంలో ఓటర్లు 2.98 కోట్లు :


i. రాష్ట్రంలో ఓటర్ల ముసాయిదా జాబితా వెల్లడైంది. దీని ప్రకారం ఓటర్ల సంఖ్య 2,98,64,689గా లెక్కతేలింది. ఈ జాబితా ఆధారంగా 2020 జనవరి ఒకటో తేదీ నాటికి 18 ఏళ్లు నిండిన యువతీయువకులు, ఇతర ప్రజలు ఓటర్లుగా పేర్లు నమోదు చేసుకునేందుకు ప్రత్యేక సవరణ షెడ్యూలును తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారి రజత్కుమార్ ప్రకటించారు.

ఇతర రాష్ట్రాలు / కేంద్ర పాలిత ప్రాంతాల వార్తలు

ఉన్నావ్ కేసులో ఎమ్మెల్యే సెంగార్ దోషి. దిల్లీ జిల్లా కోర్టు తీర్పు :


i. దేశవ్యాప్తంగా సంచలనం కలిగించిన ఉన్నావ్ అత్యాచారం కేసులో ఎమ్మెల్యే కులదీప్ సింగ్ సెంగార్ (53) దోషి అని దిల్లీ జిల్లా జడ్జి తీర్పు ఇచ్చారు.
ii. ఉత్తర్ప్రదేశ్లోని బంగర్మవూ నియోజకవర్గం ఎమ్మెల్యే అయిన సెంగార్ భాజపా తరఫున ఎన్నికకాగా, గత ఆగస్టులో ఆయన పార్టీ నుంచి బహిష్కృతులయ్యారు. ఆయన ఆ నియోజకవర్గం నుంచి నాలుగు సార్లు విజయం సాధించారు.
iii. ఉద్యోగం కావాలంటూ వెళ్లిన 17 ఏళ్ల మైనర్ బాలికపై 2017 జూన్ 4 భాజపా ఎమ్మెల్యే కులదీప్ సింగ్ సెంగార్ అత్యాచారం చేసినట్టు ఆరోపణ వచ్చింది. 2018 ఏప్రిల్ 3న బాధితురాలి తండ్రిపై కొందరు వ్యక్తులుదాడి చేయడంతో పాటు, అక్రమంగా ఆయుధాలు కలిగి ఉన్నాడన్న ఆరోపణలపై తప్పుడు కేసులో ఇరికించారు.
iv. సెంగార్పై కేసులు నమోదు చేయకపోవడంతో ఏప్రిల్ 8న ఆమె, కుటుంబ సభ్యులతో లఖ్నవూ వెళ్లి ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నివాసం ముందు ఆత్మహత్యకు ప్రయత్నించింది. మరుసటి రోజునే పోలీసు కస్టడీలో ఉన్న బాధితురాలి తండ్రి మరణించాడు.
v. చివరకు ఏప్రిల్ 13న సెంగార్ను అరెస్టు చేశారు. జులై 28న విచారణ నిమిత్తం బాధితురాలు కారులో కోర్టుకు వెళ్తుండగా, నంబరులేని లారీ దాన్ని ఢీకొంది. కారులో ప్రయాణిస్తున్న బాధితురాలికి బంధువులైన ఇద్దరు మహిళలు మృతి చెందగా, న్యాయవాది తీవ్రంగా గాయపడ్డారు.
vi. తనకు బెదిరింపులు వస్తున్నాయని అప్పటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగొయికి బాధితురాలు లేఖ రాశారు. దాంతో కేసులను లఖ్నవూ నుంచి దిల్లీ కోర్టుకు బదిలీ చేస్తూ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

  అంతర్జాతీయ వార్తలు

Nuad Thai massage included in UNESCO heritage list :

 
i. థాయిలాండ్ యొక్క ప్రసిద్ధ 2000 సంవత్సరాల మసాజ్, నువాడ్ థాయ్ యునెస్కో (ఐక్యరాజ్యసమితి విద్యా, శాస్త్రీయ మరియు సాంస్కృతిక సంస్థ) ప్రతిష్టాత్మక వారసత్వ జాబితాలో చేర్చబడింది.
ii. నువాడ్ థాయ్ అనేది మసాజ్ యొక్క తీవ్రమైన రూపం, దీనిలో బొటనవేలు, మోచేయి, మోకాలు మరియు పాదాల సహాయంతో శరీరాన్ని బాగా లాగి తిప్పవచ్చు.
iii. థాయ్ మసాజ్ భారతదేశంలో ఉద్భవించి 2500 సంవత్సరాల క్రితం థాయ్‌లాండ్‌కు తరతరాలుగా దాని రహస్యాలను తీసుకువెళ్ళిన వైద్యులు మరియు సన్యాసులు తీసుకొచ్చారు.
iv. యునెస్కో ఏర్పాటు : 4 నవంబర్ 1946; ప్రధాన కార్యాలయం : పారిస్, ఫ్రాన్స్; యునెస్కో డైరెక్టర్ జనరల్ : ఆడ్రీ అజౌలే.

సైన్స్ అండ్ టెక్నాలజీ

NASA will launch rover “Mars 2020” in 2020 :


i. నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ (నాసా) 2020 లో రోవర్ ‘మార్స్ 2020’ ను విడుదల చేస్తుంది. కాలిఫోర్నియాలోని పసాదేనాలోని నాసా యొక్క జెట్ ప్రొపల్షన్ లాబొరేటరీ ఈ రోవర్ను నిర్మించి, నిర్వహించింది. “మార్స్ 2020” పురాతన డెల్టా యొక్క ప్రదేశమైన ‘జెజెరో క్రేటర్’ నీటి ఆకారంలో ఉన్న ప్రకృతి దృశ్యాన్ని అన్వేషిస్తుంది.
ii. నాసా ప్రధాన కార్యాలయం : వాషింగ్టన్ డి.సి. స్థాపించబడింది : జూలై 29,1958.

Defence News

కొత్త సైన్యాధిపతిగా మనోజ్ ముకుంద్ :


i. భారత తదుపరి సైన్యాధ్యక్షుడిగా లెఫ్టినెంట్ జనరల్ మనోజ్ ముకుంద్ నరవాణే ఎంపికైనట్లు అధికార వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం ఆయన సైనిక ఉపాధ్యక్షుడిగా ఉన్నారు.
ii. సీనియార్టీ ప్రాతిపదికన ఈ ఎంపిక జరిగినట్లు వివరించాయి. ప్రస్తుత సైన్యాధిపతి జనరల్ బిపిన్ రావత్ ఈనెల 31న పదవీ విరమణ పొందనున్నారు. ఆ తర్వాత ఆయన దేశ తొలి త్రివిధ దళాధిపతిగా నియమితులయ్యే అవకాశం ఉంది.
iii. ప్రతిష్ఠాత్మకమైన నేషనల్ డిఫెన్స్ అకాడమీ, ఇండియన్ మిలటరీ అకాడమీల్లో శిక్షణ అనంతరం నరవాణే 1980 జూన్లో సైన్యంలో చేరారు. 37 ఏళ్ల సైనిక ప్రస్థానంలో ఆయన అనేక పదవుల్లో పనిచేశారు.
iv. జమ్మూ-కశ్మీర్లో ఉగ్రవాదంపై పోరు జరిపిన రాష్ట్రీయ రైఫిల్స్ బెటాలియన్కు నాయకత్వం వహించారు. ఈశాన్య రాష్ట్రాల్లో వేర్పాటువాద అణచివేత విధుల్లో పాలుపంచుకున్నారు. శ్రీలంకకు వెళ్లిన భారత శాంతిసేనలోనూ సభ్యుడిగా ఉన్నారు.
v. మయన్మార్లోని భారత రాయబార కార్యాలయంలో మూడేళ్ల పాటు ‘డిఫెన్స్ అటాచీ’ పదవిలో కొనసాగారు. సైనిక ఉపాధ్యక్ష పదవికి ముందు ఆయన సైన్యంలోని తూర్పు విభాగానికి నాయకత్వం వహించారు. చైనాతో ఉన్న 4వేల కిలోమీటర్ల సరిహద్దు ఈ విభాగం పరిధిలోకి వస్తుంది.

Exercise Surya Kiran-XIV held in Nepal :


i. నేపాల్లోని రూపేందేహి జిల్లా సాలిజండిలో “సూర్య కిరణ్- XIV” సంయుక్త సైనిక శిక్షణా వ్యాయామం జరిగింది. భారతదేశం మరియు నేపాల్ సైన్యాల మధ్య ఈ వ్యాయామం జరిగింది.
ii. ఉమ్మడి శిక్షణ వ్యాయామం అడవి మరియు పర్వత భూభాగాల్లోని ప్రతివాద తిరుగుబాటు కార్యకలాపాలపై ఆధారపడింది మరియు ప్రకృతి మరియు మానవుడు చేసిన విపత్తుల యొక్క ప్రతిస్పందన విధానాలను కూడా అభ్యసించింది.

 సదస్సులు

భారత్-అమెరికా రక్షణ సంబంధాల సదస్సు – 2019 Dec 18,19 @ హైదరాబాద్

i. రక్షణ వ్యవహారాల హబ్గా రూపుదిద్దుకుంటున్న హైదరాబాద్లో దేశంలోనే తొలిసారిగా భారత్-అమెరికా రక్షణ సంబంధాల సదస్సు  జరగనుంది.
ii. భారత్-పసిఫిక్ కోణంలో రక్షణ రంగ సంబంధాలు స్పష్టంగా, నిక్కచ్చిగా ఉండాలన్నది ఇరు దేశాల ఉద్దేశం. ఇరుదేశాల భాగస్వాములు తమ రక్షణ వనరులను, సహాయ సహకారాలను ఇచ్చిపుచ్చుకునేలా సహకరించడం సదస్సు ప్రధాన లక్ష్యం. సైనిక పాటవాలతోపాటు, శాస్త్రవేత్తల పరిశోధనల్లోని పురోగతిని ఇచ్చిపుచ్చుకోవడమూ జరుగుతుంది.
iii. భారత్లో అమెరికా రక్షణ వ్యవహారాల చీఫ్ - డేనియల్ ఫిలియన్
5th EAC meeting of 15th Finance Commission held in New Delhi :
i. 15వ ఆర్థిక కమిషన్ యొక్క ఆర్థిక సలహా మండలి (EAC) యొక్క 5వ సమావేశం న్యూఢిల్లీలో జరిగింది. సమావేశంలో, నిజమైన వృద్ధి, ద్రవ్యోల్బణం, కొనసాగుతున్న నిర్మాణాత్మక సంస్కరణలు, జిఎస్‌టితో సహా పన్ను ఆదాయం, ద్రవ్య బాధ్యత మరియు బడ్జెట్ నిర్వహణ చట్టం మరియు ఆర్థిక పారదర్శకతకు సంబంధించిన స్థూల అంచనాలు చర్చించబడ్డాయి.
ii. అంతేకాకుండా, 2020-21 నివేదికను సమర్పించడం మరియు 2021-26 కాలానికి నివేదికను రూపొందించడానికి సంబంధించిన కమిషన్ యొక్క తదుపరి చర్యల గురించి సలహా మండలికి తెలియజేయబడింది.
iii. 15వ ఆర్థిక కమిషన్ ఛైర్మన్ : ఎన్‌కె సింగ్

     Appointments

R N Ravi to hold additional charge as governor of  Meghalaya :

 
i. నాగాలాండ్ గవర్నర్ ఆర్ ఎన్ రవికి మేఘాలయ అదనపు బాధ్యతలు అప్పగించారు. మేఘాలయ గవర్నర్ తథాగత రాయ్ సెలవుల నేపథ్యంలో భారత రాష్ట్రపతి ఈ నిర్ణయం తీసుకున్నారు.

Former PM Abdelmadjid Tebboune elected as the President of Algeria :


i. అల్జీరియా మాజీ ప్రధాని అబ్దుల్మద్జిద్ టెబ్బౌన్ అల్జీరియా అధ్యక్షుడిగా అబ్దుల్కదర్ బెన్సాలా తరువాత ఎన్నికయ్యారు.
ii. అధ్యక్షుడు అబ్దేలాజిజ్ బౌటెఫ్లికా పాలనలో మే 2017 నుండి ఆగస్టు 2017 వరకు ఆయన ప్రధానిగా పనిచేశారు.

Reports/Ranks/Records

అతిపెద్ద దేశీయ కంపెనీగా రిలయన్స్ అవతరణ.  రెండో స్థానానికి IOC @ఫార్చ్యూన్ ఇండియా 500 జాబితా


i. గత ఆర్థిక సంవత్సరం (2018-19)లో రూ.5.81 లక్షల కోట్ల ఆదాయంతో భారత్లో ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్ఐఎల్) అతిపెద్ద కంపెనీగా అవతరించింది.
ii. ఫార్చ్యూన్ ఇండియా 500 జాబితా ప్రకారం.. పదేళ్ల పాటు అగ్రస్థానంలో ఉన్న ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ)ను వెనక్కి నెట్టింది. ఈ ఘనత సాధించిన తొలి ప్రైవేట్ రంగ సంస్థగా నిలిచింది.
iii. ప్రభుత్వ రంగానికి చెందిన ONGC, SBI, BPCLలు గతేడాదితో పోలిస్తే ఎటువంటి మార్పు లేకుండా వరుసగా 3, 4, 6వ స్థానాల్లో నిలిచాయి.

అవార్డులు

Amitabha Bagchi wins 2019 DSC Prize for South Asian Literature :

i. The 8th edition of the IME Nepal Literature Festival, held from December 13-16 at , concluded with the announcement of the winner of DSC Prize for South Asian Literature 2019.
ii. The $25,000 award went to Amitabha Bagchi for his 2018 novel, Half the Night is Gone. It was presented by Pradeep Gawali, Minister of Foreign Affairs, Nepal, in the presence of Surina Narula, founder of the DSC Prize.
iii. The DSC Prize, instituted in 2010, awards fiction from the South Asian region, which includes Afghanistan, Bangladesh, Bhutan, India, the Maldives, Myanmar, Nepal, Pakistan and Sri Lanka, as well as from the diaspora.

Stokes is BBC Sports Personality of the Year :


i. ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ బిబిసి స్పోర్ట్స్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ గా ఎంపికయ్యాడు. స్టోక్స్ 2005 లో ఆండ్రూ ఫ్లింటాఫ్ తరువాత బహుమతి గెలుచుకున్న మొదటి క్రికెటర్.
ii. ప్రజా ఓటులో, ఫార్ములా వన్ డ్రైవర్ లూయిస్ హామిల్టన్ రెండవ స్థానంలో, స్ప్రింటర్ దినా అషర్-స్మిత్ మూడవ స్థానంలో ఉన్నారు.
iii. ఆరుసార్లు ఫార్ములావన్ ప్రపంచ చాంపియన్ లూయిస్ హామిల్టన్ రెండో స్థానంలో నిలిచాడు. ఈ అవార్డు అందుకున్న ఐదో క్రికెటర్గా 28 ఏండ్ల స్టోక్స్ నిలిచాడు. గతంలో జిమ్ లేకర్ (1956), డేవిడ్ స్టీలే (1975), ఇయాన్ బోథమ్ (1981), ఫ్లింటాఫ్ (2005)కు ఈ అవార్డు దక్కింది.

Art and Culture

Madhya Pradesh CM to inaugurate International Film Festival in Khajuraho :

i. The Chief Minister of Madhya Pradesh Kamal Nath will inaugurate the International Film Festival in Shilpkala village of Khajuraho.
ii. The International Khajuraho Film Festival is being organized by the Prayas Sanstha in collaboration with the State Government.
iii. Events like interaction with film stars, film making workshop, mobile film making workshop, plays, programmes for promoting local art and culture, herbal forest fair, animal fair etc. are also organized during the Film Festival.

ముఖ్యమైన రోజులు

Mohammad Hidayatullah Birth Anniversary : 17 December 1905


i. Mohammad Hidayatullah (17 December 1905 – 18 September 1992) was the 11th Chief Justice of India serving from 25 February 1968 to 16 December 1970 and the sixth Vice President of India serving from 31 August 1979 to 30 August 1984.
ii. He had also served as the Acting President of India from 20 July 1969 to 24 August 1969 and from 6 October 1982 to 31 October 1982.
iii. During his term as the Chief Justice of India, the then-President of India, Zakir Husain died suddenly, in harness, on 3 May 1969. Then Vice President of India Mr. V. V. Giri became the acting President.
iv. Later, Giri resigned from both offices as acting President and Vice-President to become a candidate in the 1969 Presidential Election. Hidayatullah then served as the President of India for a short period from 20 July to 24 August.
v. He became the only person to have served in all three offices of Chief Justice of India, President of India, and the Vice President of India.
vi. During his long tenure in the Supreme Court he was a party to a number of landmark judgments including the judgment in Golaknath v. State of Punjab which took the view that the Parliament had no power to cut down the Fundamental Rights by constitutional amendment.
vii. His judgment in the case of Ranjit D. Udeshi dealing with the law of obscenity, displayed a flair for literature and is particularly of note.
viii. In his honor, the Hidayatullah National Law University was established in 2003, in his home town of Raipur, in the state of Chhattisgarh.

భోగరాజు పట్టాభి సీతారామయ్య వర్ధంతి : డిసెంబర్ 17, 1959


i. భోగరాజు పట్టాభి సీతారామయ్య (నవంబర్ 24, 1880 - డిసెంబర్ 17, 1959) (Bhogaraju Pattabhi Sitaramayya) స్వాతంత్ర్య సమరయోధుడు, భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడు, ఆంధ్రా బ్యాంకు వ్యవస్థాపకుడు.
ii. సీతారామయ్య నవంబర్ 24 1880 న మద్రాసు ప్రెసిడెంసి రాష్ట్రములోని కృష్ణా జిల్లా (పశ్చిమ గోదావరి జిల్లా, గుండుగొలను) గ్రామములో జన్మించాడు . భారత జాతీయోద్యమ సమయంలో గాంధీజీ చే ప్రభావితుడై ఉద్యమంలో చేరి అతడికి సన్నిహితుడై కాంగ్రెస్లో ప్రముఖ స్థానం ఆక్రమించాడు.
iii. 1939లో గాంధీజీ అభ్యర్థిగా కాంగ్రెస్ అధ్యక్ష పదవికి పోటీపడి నేతాజీ చేతిలో ఓడిపోయిననూ 1948లో పురుషోత్తమ దాస్ టాండన్ పై విజయం సాధించాడు. ఆ తర్వాత పార్లమెంటు సభ్యుడిగా, మధ్యప్రదేశ్ గవర్నర్ గా పనిచేశాడు.
iv. రాష్ట్రం బయట పనిచేసిననూ తెలుగు భాషపై మమకారం కోల్పోలేదు. తను స్థాపించిన ఆర్థిక సంస్థలలో ఉత్తర ప్రత్యుత్తరాలు తెలుగులోనే జరగాలని సూచించాడు.
v. పట్టాభి సీతారామయ్య ఎన్నో ఆర్థిక సంస్థలను స్థాపించాడు. ఆంధ్రా బ్యాంకు (1923లో స్థాపన), ఆంధ్రా ఇన్స్యూరెన్స్ కంపెనీ, భారత లక్ష్మీ బ్యాంకు, కృష్ణా కో-ఆపరేటివ్ బ్యాంకు మొదలగునవి స్థాపించాడు. ఆంధ్రాబ్యాంకు ద్వారా వ్యవసాయదారులకు రుణాలిచ్చి వ్యవసాయాభివృద్ధికి తోడ్పడినాడు. చిన్న మొత్తంలో డిపాజిట్లు సేకరించి పొదుపును ప్రోత్సహించాడు.
vi. స్వాతంత్ర్యం తరువాత 1948లో కాంగ్రెసు అధ్యక్ష పదవి పోటీలో నెగ్గి పీఠాన్ని అధిష్టించాడు. ఆ తరువాత 1952లో రాజ్యసభ సభ్యునిగా ఎన్నికై పార్లమెంటులో ప్రవేశించాడు. 1952 నుండి 1957 వరకు మధ్య ప్రదేశ్ గవర్నరుగా పనిచేశాడు.
vii. తెలుగు ప్రజలకు ఎంతగానో తోడ్పాటు అందించిన పట్టాభి 1959, డిసెంబర్ 17న స్వర్గస్థుడయ్యాడు.

క్రీడలు

ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్లో విరాట్ కోహ్లి నంబర్వన్  :

i. ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్లో భారత కెప్టెన్ విరాట్ కోహ్లి అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్నాడు. తాజాగా ప్రకటించిన బ్యాట్స్మెన్ జాబితాలో విరాట్ (928 పాయింట్లు) నంబర్వన్ ర్యాంకు సాధించాడు.
ii. పుజారా (791), రహానె (759) నాలుగు, ఆరు ర్యాంకుల్లో నిలిచారు.
iii. ఆల్రౌండర్లలో రవీంద్ర జడేజా రెండో స్థానాన్ని నిలబెట్టుకోగా, ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ టీమ్ ర్యాంకింగ్స్లో భారత్ (360) తిరుగులేని స్థానంలో నిలిచింది. ఆస్ట్రేలియా (216), శ్రీలంక (80) రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి.
iv. ఈ ఏడాది ఆగస్టులో యాషెస్ సిరీస్ సందర్భంగా స్టీవ్ స్మిత్ స్థానంలో కంకషన్ సబ్స్టిట్యూట్గా అరంగేట్రం చేసిన నాటి నుంచి పరుగుల వరద పారిస్తున్న ఆస్ట్రేలియా బ్యాట్స్మన్ లబుషేన్.. అప్పుడే ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్లో అయిదో స్థానానికి చేరుకున్నాడు.

టోక్యో ఒలింపిక్స్ @2020 జులై 24 నుంచి ఆగస్టు 9 :


i. వచ్చే ఏడాది జులై 24 నుంచి ఆగస్టు 9 వరకు జరిగే ఒలింపిక్స్ కోసం టోక్యో తన ప్రధాన స్టేడియాన్ని సిద్ధం చేసేసింది. దాదాపు 68 వేల మంది కూర్చొని ఆటలను వీక్షించే వీలున్న ఈ క్రీడా వేదికను ప్రముఖ జపాన్ రూపశిల్పి కెంగో కుమా డిజైన్ చేశాడు.
ii. ఒలింపిక్స్తో పాటు పారాలింపిక్స్ కూడా ఇక్కడే జరగనున్నాయి. దీని నిర్మాణం 2016 డిసెంబర్లో ఆరంభం కాగా.. మొదట బ్రిటన్ రూపశిల్పి జహా హజీద్ డిజైనింగ్ ఆరంభించాడు.

A record-smashing year for Momota. Wins 11 titles, including the World Championships, Asia Championships and All England Open :


i. No men’s badminton player, not even Malaysia’s Lee Chong Wei or Chinese great Lin Dan, has won as many tournaments in a season.
ii. Kento Momota was banned from badminton for gambling in 2016. Fast forward to 2019 and the Japanese has enjoyed one of the most successful years in the sport’s history.
iii. The 25-year-old capped his remarkable campaign by fighting back from a game down to defeat Indonesia’s Anthony Ginting in the decider at the BWF World Tour Finals in Guangzhou on December 16th.
>>>>>>>>>>>>>>>>  End of the day  <<<<<<<<<<<<<<<<
 

No comments:

Human Body

 మానవ శరీరం గురించి మనం మానవ శరీరాన్ని మైక్రోస్కోపిక్ స్థాయిలో "విచ్ఛిన్నం" చేస్తే, కణం దాని అత్యంత ప్రాథమిక యూనిట్‌గా ఉంటుంది. సగ...