✍ కరెంట్ అఫైర్స్ 22 డిసెంబర్ 2019 Sunday ✍
Daily Current affairs prepared from Eenadu, The Hindu newspaper and from online current affair websites, Wikipedia etc..జాతీయ వార్తలు
ఇక జాతీయ జనాభా పట్టిక. ప్రజల వేలి ముద్రల సేకరణ. అందరికీ గుర్తింపు కార్డులు :
i. పౌరసత్వ సవరణ చట్టం తీసుకొచ్చిన మోదీ ప్రభుత్వం వచ్చే వారం మరో కీలక నిర్ణయం తీసుకోనుంది. దేశవ్యాప్తంగా జాతీయ జనాభా పట్టిక (నేషనల్ పాపులేషన్ రిజిస్టర్ - NPR) రూపకల్పనకు అనుమతి ఇవ్వనుంది. ఒకసారి ఎన్పీసీ తయారైన తరువాత దాని ఆధారంగా జాతీయ పౌర పట్టిక (నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్-ఎన్ఆర్సీ)ని రూపొందించనుంది.
ii. దేశవ్యాప్తంగా జాతీయ జనాభా పట్టిక (NPR) తయారీకి రూ.3,941 కోట్లు కేటాయించాలని కేంద్ర హోం శాఖ కోరుతోంది. దేశంలోని నిజమైన పౌరుల వివరాలు సేకరించడమే ఎన్పీఆర్ లక్ష్యం. ప్రజలందరి వేలి ముద్రలు సేకరించడం, అందరికీ పౌరసత్వ గుర్తింపు కార్డులు ఇవ్వడం ఈ ప్రక్రియ లక్ష్యం.
iii. ఎన్పీఆర్ను తాజా సమాచారంతో సవరించినట్టు రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా (ఆర్జీఐ) ధ్రువీకరించిన తరువాతే ఎన్ఆర్సీపై నోటిఫికేషన్ ఇస్తారు.
iv. ఆర్జీఐ జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం అసోం మినహా మొత్తం దేశమంతటా జనాభా పట్టికను రూపొందిస్తారు. 2020 ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి సెప్టెంబరు 30 వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుంది. జనాభా లెక్కలను మునుపటిలాగానే గ్రామ, జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో సేకరిస్తారు.
v. పౌరసత్వ చట్టం సవరణలపై ఆందోళనలు జరుగుతున్న దృష్ట్యా జనాభా పట్టిక రూపకల్పన కార్యక్రమాలను నిలిపివేస్తున్నట్టు కేరళ, పశ్చిమ బెంగాల్ సీఎంలు ప్రకటించారు. అయితే ఇలాంటి అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు లేదని కేంద్ర హోం శాఖ అధికారులు స్పష్టం చేస్తున్నారు.
vi. తాజాగా ఆమోదించిన పౌరసత్వ సవరణ చట్టం కింద బంగ్లాదేశ్, అఫ్గానిస్థాన్, పాకిస్థాన్లకు చెందిన మైనార్టీలకు పౌరసత్వం కల్పించే అధికారాన్ని జిల్లా కలెక్టర్లకు ఇవ్వకూడదని కేంద్ర హోం శాఖ భావిస్తోంది.
తెలంగాణ వార్తలు
Unicef award to Kamareddy dist :
i. నీటి పారిశుధ్యం మరియు పరిశుభ్రత రంగాలలో స్వచ్ఛ భారత్ మిషన్ను సమర్థవంతంగా అమలు చేసినందుకు కామారెడ్డి జిల్లా ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ పిల్లల మరియు విద్యా నిధి (యునిసెఫ్) -2019 అవార్డును పొందింది.
ii. వ్యక్తిగత శానిటరీ మరుగుదొడ్లు, స్వచ్ దర్పాన్ వాల్ పెయింటింగ్స్, స్వచ్ సర్వేక్షన్, స్వచ్ఛ సుందర్ షౌచలే మరియు ఇతర కార్యకలాపాల నిర్మాణంలో జిల్లా దేశంలో ముందంజలో ఉంది.
ఆంధ్రప్రదేశ్ వార్తలు
Jagan launches scheme for handloom weavers ‘Nethanna Nestham’ :
i. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి అనంతపురం జిల్లాలోని ధర్మవరం వద్ద ‘నేతన్న నేస్తం’ను ప్రారంభించారు. ప్రస్తుతం మగ్గం నడుపుతున్న ప్రతి చేనేత చేనేత కుటుంబానికి ప్రతి సంవత్సరం, 24,000 సహాయాన్ని విస్తరించాలని ఈ పథకం లక్ష్యంగా పెట్టుకుంది.
ii. ఈ పథకం రాష్ట్రవ్యాప్తంగా సుమారు 85,000 కుటుంబాలకు ఐదేళ్లపాటు ఆర్థిక సహాయం అందించాలని యోచిస్తోంది. నిర్ణీత కాలంముగిసే సమయానికి ఒక కుటుంబానికి లభించే మొత్తం ₹ 1.2 లక్షలు.
ఇతర రాష్ట్రాలు / కేంద్ర పాలిత ప్రాంతాల వార్తలు
రైతులకు రూ.2 లక్షల వరకు రుణమాఫీ : మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే
i. వ్యవసాయదారుల సంక్షేమం కోసం మహారాష్ట్రలో రైతులందరికీ రూ.2లక్షల వరకు రుణమాఫీ చేయనున్నట్లు ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే శనివారం నాగ్పుర్లో ప్రకటించారు.ii. రైతులను రుణ విముక్తుల్ని చేసేందుకు ‘మహాత్మా జ్యోతిరావు ఫులే షేత్కారీ రుణమాఫీ యోజన-2019’ను అమలు చేయనున్నట్లు వెల్లడించారు.
అంతర్జాతీయ వార్తలు
అంతరిక్ష పోరుకు అమెరికా ప్రత్యేక దళం. లాంఛనంగా ‘స్పేస్ ఫోర్స్’ ఏర్పాటు. నేషనల్ డిఫెన్స్ ఆథరైజేషన్ యాక్ట్పై ట్రంప్ సంతకం :
i. అంతరిక్షంలో ఆధిపత్యం చాటుకోవడానికి అమెరికా ముందడుగు వేసింది. రష్యా, చైనాల నుంచి ఎదురవుతున్న ‘స్పేస్ వార్’ సవాళ్లను దీటుగా ఎదుర్కొనేందుకు... అంతరిక్ష దళాన్ని (స్పేస్ ఫోర్స్) ఏర్పాటు చేసింది.
ii. ఇందుకు సంబంధించి కాంగ్రెస్ ఆమోదించి పంపిన నేషనల్ డిఫెన్స్ ఆథరైజేషన్ యాక్ట్ (ఎన్డీఏఏ)-2020 బిల్లుపై అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ శనివారం సంతకం చేశారు. 1947లో అమెరికా వైమానిక దళం అంకురించగా, దాని ఆధ్వర్యంలో మరో ప్రత్యేక విభాగం ఏర్పడటం ఇదే తొలిసారి.
iii. పొరుగు దేశాల కార్యకలాపాలు, రహస్యాలపై నిఘా ఉంచే ఉపగ్రహాలను పలు దేశాలు అంతరిక్షంలోకి పంపుతున్నాయి. ఈ క్రమంలోనే చైనా, రష్యాలు ఉపగ్రహాలను నాశనం చేయగల క్షిపణులను అభివృద్ధి చేయడం అమెరికాకు మింగుడు పడటంలేదు. అంతరిక్షంలో ఎలాగైనా తన ఆధిపత్యాన్ని చాటుకునే లక్ష్యంతో అమెరికా ఈ స్పేస్ ఫోర్స్ ఆలోచన చేసింది.
Cuba names Manuel Marrero Cruz to be first PM since 1976 :
i. Cuban President Miguel Diaz-Canel named Tourism Minister Manuel Marrero Cruz as the country’s first Prime Minister since 1976, under a new Constitution.
ii. Manuel Marrero Cruz, 56, whose nomination was ratified by the National Assembly, is a former functionary of the military-run Gaviota tourism corporation.
ఆర్థిక అంశాలు
బ్యాంకు ఖాతా కోసం మత ప్రస్తావన అవసరం లేదు : ఆర్థిక శాఖ స్పష్టీకరణ
i. బ్యాంకులో ఖాతా ప్రారంభించడానికి ఖాతాదార్లు తమ మతం వివరాలను ఇవ్వాల్సిన అవసరం లేదని కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి రాజీవ్ కుమార్ స్పష్టం చేశారు.ii. ఖాతాదార్ల సమాచారంలో మత వివరాలను కూడా అడుగుతారంటూ వదంతులు వ్యాపించిన నేపథ్యంలో ఈ వివరణ ఇచ్చారు.
Eight West African nations rename common currency to Eco :
i. Eight West African countries have agreed to change the name of their common currency to Eco and severed their earlier currency CFA Franc’s links to former colonial ruler France.
ii. Benin, Burkina Faso, Guinea-Bissau, Ivory Coast, Mali, Niger, Senegal and Togo currently use the currency. All the countries are former French colonies with the exception of Guinea-Bissau.
iii. The CFA franc, created in 1945, was seen by many as a sign of French interference in its former African colonies even after the countries became independent.
Appointments
Additional Solicitor General Surya Karan Reddy assumes charge for southern zone :
i. హైదరాబాద్ ప్రధాన కార్యాలయంతో దక్షిణ మండలానికి అదనపు సొలిసిటర్ జనరల్గా నియమితులైన సీనియర్ న్యాయవాది టి. సూర్య కరణ్ రెడ్డి తెలంగాణ హైకోర్టు ప్రాంగణంలోని తన కార్యాలయానికి బాధ్యతలు స్వీకరించారు.
ii. అతను మూడేళ్లపాటు ఈ పదవిలో ఉంటాడు.
అవార్డులు
ఫిల్మ్ఫేర్ అవార్డుల ప్రదానోత్సవం @చెన్నై :
i. దక్షిణాది చిత్రపరిశ్రమలో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావించే ఫిల్మ్ఫేర్ అవార్డుల ప్రదానోత్సవం అట్టహాసంగా జరిగింది.ii. చెన్నైలోని జవహర్లాల్ నెహ్రు ఇండోర్ స్టేడియంలో నిర్వహించిన ఈ వేడుకకు సినీతారలు తరలివచ్చారు.
iii. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ సినీ పరిశ్రమలలో 2018 సంవత్సరానికిగాను ప్రేక్షకుల మన్ననలు అందుకున్న చిత్రాలతోపాటు నటీనటులు, టెక్నీషియన్స్కు ఫిల్మ్ఫేర్ అవార్డులను అందించారు. ఈ ఏడాది తెలుగులో ఉత్తమ చిత్రంగా మహానటి, కన్నడలో కేజీఎఫ్ అవార్డులు అందుకున్నాయి.
iv. అలాగే ఉత్తమ నటుడిగా తెలుగులో రామ్ చరణ్(రంగస్థలం), తమిళంలో ధనుష్(వడ చెన్నై), విజయ్ సేతుపతి(96) అవార్డులను అందుకున్నారు.
ఫిల్మ్ఫేర్ విజేతలు (తెలుగు) :
v. ఉత్తమ చిత్రం : మహానటి
vi. ఉత్తమ కథానాయకుడు : రామ్ చరణ్ (రంగస్థలం)
vii. ఉత్తమ కథానాయకుడు (విమర్శకుల) : దుల్కర్ సల్మాన్(మహానటి)
viii. ఉత్తమ నటి : కీర్తి సురేశ్ (మహానటి)
ix. ఉత్తమ సంగీత దర్శకుడు : దేవిశ్రీ ప్రసాద్ (రంగస్థలం)
x. ఉత్తమ సహాయ నటుడు: జగపతిబాబు (అరవింద సమేత)
xi. ఉత్తమ సహాయ నటి : అనసూయ (రంగస్థలం)
xii. ఉత్తమ నటి (విమర్శకుల) : రష్మిక (గీత గోవిందం)
మరణాలు
పేదల వెలుగురేఖ ఫజల్ హసన్ కన్నుమూత :
i. బంగ్లాదేశ్ రూరల్ అడ్వాన్స్మెంట్ కమిటీ (బీఆర్ఏసీ-బ్రాక్) వ్యవస్థాపకుడు ఫజల్ హసన్ అబెద్ కన్నుమూసినట్లు ఆ సంస్థ తెలిపింది. ప్రపంచంలోనే అతిపెద్ద స్వచ్ఛంద సంస్థల్లో ఒకటిగా బ్రాక్ వినుతికెక్కింది.
ii. 1971లో బంగ్లాదేశ్ యుద్ధం సమయంలో ఉద్యోగాన్ని వీడారు. లండన్లోని ఇంటిని అమ్మేసి యుద్ధం ముగిసిన అనంతరం 36 ఏళ్ల వయసులో బ్రాక్ని స్థాపించారు. తొలుత బంగ్లాదేశ్లోకి శరణార్థులుగా వచ్చిన లక్షలాది మందికి సేవలు అందించారు. అనంతరం ఆరోగ్య సంరక్షణ, సూక్ష్మరుణాలు, వ్యవసాయం, విద్య తదితర రంగాల్లోకి విస్తరించారు.
iii. సుమారు 15 కోట్ల మందిని పేదరికం నుంచి బ్రాక్ బయట పడేసినట్లు ప్రపంచ ఆహార బహుమతి ప్రదానోత్సవం సందర్భంగా ఎంపిక కమిటీ కొనియాడింది.
ముఖ్యమైన రోజులు
National Mathematics Day (జాతీయ గణిత దినోత్సవం) : 22 December
i. పురాణ గణిత శాస్త్రజ్ఞుడు శ్రీనివాస రామానుజన్ జన్మదినం మరియు ఆధునిక గణిత శాస్త్ర అభివృద్ధిలో ఆయన చేసిన కృషికి గుర్తుగా ప్రతి సంవత్సరం డిసెంబర్ 22 న జాతీయ గణిత దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఈ సంవత్సరం దేశం తన 132వ జన్మ వార్షికోత్సవాన్ని జరుపుకుంటుంది.
ii. రామానుజన్ 20వ శతాబ్దపు గణితాన్ని మార్చిన మరియు పున:రూపకల్పన చేసిన ఆలోచనల సంపదను కలిగినవాడు. ఈ ఆలోచనలు 21 వ శతాబ్దపు గణితాన్ని ఆకృతి చేస్తూనే ఉన్నాయి. జాతీయ గణిత దినోత్సవం జరుపుకోవడం వెనుక ప్రధాన లక్ష్యం ప్రజలకు అవగాహన కలిగించడం.
శ్రీనివాస రామానుజన్ 132వ జయంతి : డిసెంబర్ 22, 1887
i. శ్రీనివాస రామానుజన్ అయ్యంగార్ (డిసెంబర్ 22, 1887—ఏప్రిల్ 26, 1920) భారతదేశానికి చెందిన గణిత శాస్త్రవేత్త. 20వ శతాబ్దంలో ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన గొప్ప గణిత మేధావులలో ఒకరు. ఇతడికి పది సంవత్సరాల వయసులోనే గణితశాస్త్రంతో అనుభందం ఏర్పడింది.
ii. చిన్న వయసులోనే గణితం పట్ల ప్రకృతి సిద్ధమైన ప్రతిభ కనపరిచేవాడు. ఆ వయసులోనే ఎస్ ఎల్ లోనీ త్రికోణమితి మీద రాసిన పుస్తకాలను వంటపట్టించుకున్నాడు. పదమూడు సంవత్సరాలు నిండే సరికల్లా ఆ పుస్తకాన్ని ఔపోసన పట్టడమే కాకుండా తన సొంతంగా సిద్ధాంతాలు కూడా రూపొందించడం ప్రారంభించాడు.
iii. రామానుజన్ డిసెంబర్ 22, 1887 నాడు తమిళనాడు రాష్ట్రం లోని ఈరోడ్ పట్టణములో జన్మించాడు. రామానుజన్ స్వరాష్ట్రమైన తమిళనాడు, ఆ రాష్ట్ర వాసిగా ఆయన సాధించిన విజయాలకు గుర్తుగా ఆయన జన్మదినమైన డిసెంబర్ 22ను రాష్ట్ర సాంకేతిక దినోత్సవంగా ప్రకటించింది.
iv. భారత ప్రభుత్వం 1962 వ సంవత్సరంలో ఆయన 75వ జన్మదినం నాడు, సంఖ్యా శాస్త్రంలో ఆయన చేసిన విశేష కృషిని కొనియాడుతూ స్మారక తపాలా బిళ్ళను విడుదల చేసింది. 2012లో అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ రామానుజన్ పుట్టినరోజును జాతీయ గణిత దినోత్సవంగా ప్రకటించారు. 125వ జయంతి సందర్భంగా 2014ను భారత ప్రభుత్వం జాతీయ గణితశాస్త్ర సంవత్సరంగా ప్రకటించింది.
v. ఫెలో ఆఫ్ ద ట్రినిటీ కాలేజి గౌరవం పొందిన తొలి భారతీయుడిగానూ, ఫెలో ఆఫ్ ద రాయల్ సొసైటీ గౌరవం పొందిన రెండవ భారతీయుడిగానూ ఆయన చరిత్రకెక్కారు. బ్రిటన్ నుంచి 1919 మార్చిలో భారతదేశానికి తిరిగి వచ్చారు.
vi. రామానుజన్ ‘ఆయిలర్’ సూత్రాలు, త్రికోణమితికి చెందిన అనేక సమస్యలను సులువుగా సాధించి చూపేవారు. మనదేశ గొప్పదనాన్ని ప్రపంచానికి చాటిన చెప్పిన రామానుజన్ అనారోగ్యంతో తన 33వ ఏట 1926, ఏప్రిల్ 26 న కన్నుమూశారు.
vii. 1729 సంఖ్యను రామానుజన్ సంఖ్యగా పిలుస్తారు. తీవ్రమైన అనారోగ్యంతో హాస్పిటల్లో ఉన్నప్పుడు కూడా హార్డీతో 1729 సంఖ్య యొక్క ప్రత్యేకతను తెలియజెప్పి ఆయన్ను ఆశ్చర్యచకితుణ్ణి చేశారు. ఎందుకంటే రెండు విధాలుగా రెండు ఘనముల మొత్తముగా వ్రాయబడే సంఖ్యాసమితిలో అతి చిన్నసంఖ్య అని తెల్పారు. (1729 = 1^3 + 12^3 = 9^3 + 10^3).
viii. కానీ శ్రీనివాసన్ రామానుజన్ మరణానంతరం అంతటి ప్రతిభ గల గణితశాస్త్ర వేత్తలను భారతదేశం తయారు చేసులేకపోవడం దురదృష్టకరం. మానవ నాగరికత చరిత్రకు గణితాన్ని పరిచయం చేసిన ఆర్యభట్ట, భాస్కరుడు.... ఆ తదనంతరం రామానుజన్ వంటి గణిత మేథావుల పరంపర ఆ తరువాత కొనసాగలేదు. భవిష్యత్తులోనైనా ఈ లోటును నేటి విద్యార్థి లోకం భర్తీ చేయగలదని భావిద్దాం..
క్రీడలు
జెరెమీ రికార్డుల జోరు @ ఖతార్ అంతర్జాతీయ కప్
i. భారత యువ వెయిట్లిఫ్టర్ జెరెమీ లాల్రినుంగ రికార్డుల మోత మోగించాడు. ఖతార్ అంతర్జాతీయ కప్ వెయిట్లిఫ్టింగ్ టోర్నీ పురుషుల 67 కేజీల విభాగంలో రజతం గెలిచిన అతను రికార్డుల దుమ్ము దులిపాడు.
ii. 17 ఏళ్ల జెరెమీ 306 కేజీల (స్నాచ్లో 140, క్లీన్ అండ్ జర్క్లో 166 కిలోలు) బరువులెత్తి రెండో స్థానంలో నిలవడంతో పాటు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో కలిపి మొత్తం 27 కొత్త రికార్డులు సృష్టించాడు.
ICC continues partnership with UNICEF for Women’s World T20 :
i. The International Cricket Council (ICC) has announced that it has extended its partnership with UNICEF through to the Women’s T20 World Cup 2020 with the focus on empowering women and girls through cricket.
ii. The partnership and public donations continue to bring positive change to children through the programs in cricket playing nations focused on empowering women and girls in cricket.
iii. The money raised during the Women’s World T20 will go to similar projects in cricket playing nations, including an innovative program to promote girls” participation in cricket in Sri Lanka and build peace in communities.
iv. The ICC and UNICEF partnership commenced in 2015, as part of the ICC”s global community outreach program ”Cricket 4 Good”. During the Men’s 50-over World Cup held in England and Wales earlier this summer, UNICEF raised $180,000 as part of ‘One Day 4 Children’ and this money will go directly to fund a girls’ cricket project in Afghanistan.
>>>>>>>>>>>>>>>> End of the day <<<<<<<<<<<<<<<<
No comments:
Post a Comment