Friday, 13 December 2019

current affairs telugu eenadu 13th december 2019

✍  కరెంట్ అఫైర్స్ 13 డిసెంబర్ 2019 Friday ✍

జాతీయ వార్తలు

పౌరసత్వ సవరణ బిల్లు-2019కు రాష్ట్రపతి ఆమోదం :



i. పౌరసత్వ సవరణ బిల్లు-2019కు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఆమోదం తెలిపారు. లోక్సభలో, రాజ్యసభలో ఈ బిల్లు ఆమోదం పొందిన విషయం తెలిసిందే.
ii. పాకిస్థాన్, బంగ్లాదేశ్, అఫ్గానిస్థాన్ల నుంచి శరణార్థులుగా వచ్చిన ముస్లిమేతరులకు భారతదేశ పౌరసత్వం కల్పించడం ఈ బిల్లు ఉద్దేశం. రాష్ట్రపతి ఆమోదంతో ఇది ఇప్పుడు చట్టంగా మారింది.
చట్టసభల్లో ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్ల పొడిగింపు. ఆంగ్లో-ఇండియన్లకు ఉపసంహరణ :
i. లోక్సభ, రాష్ట్ర అసెంబ్లీల్లో ఎస్సీ/ఎస్టీలకు కల్పించిన రిజర్వేషన్లను మరో పదేళ్ల పాటు పొడిగించడానికి తీసుకొచ్చిన బిల్లును రాజ్యసభ ఏకగ్రీవంగా ఆమోదించింది. ఈ బిల్లుకు లోక్సభ ఇప్పటికే అంగీకారం తెలిపింది.
ii. ఇంతవరకు ఆంగ్లో-ఇండియన్లకు రిజర్వేషన్లు ఉండగా, వాటిని మాత్రం పొడిగించలేదు.

సైన్స్ అండ్ టెక్నాలజీ 

ISRO begins preparations for setting up 3rd rocket launchpad in Kulashekhrapattinam in the Thuthukudi district of TN :


i. భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) తమిళనాడులోని తుత్తుకుడి జిల్లాలోని కులాశేఖ్రాపట్టినం చిన్న తీర కుగ్రామంలో 3వ రాకెట్ లాంచ్ప్యాడ్ ఏర్పాటుకు సన్నాహక పనులను ప్రారంభించింది.
ii. ప్రస్తుతం, భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) కు ఆంధ్రప్రదేశ్ లోని శ్రీహరికోట వద్ద రెండు లాంచ్ ప్యాడ్ లు ఉన్నాయి. దేశీయ మరియు అంతర్జాతీయ కస్టమర్ల కోసం భారతదేశం నుండి ఉపగ్రహ ప్రయోగాల సంఖ్య పెరిగిన ఫలితంగా అదనపు లాంచ్ ప్యాడ్ల కోసం డిమాండ్ పెరిగింది.

ఆర్థిక అంశాలు

Xiaomi launches service “Mi Credit” in India for Android phones :

 
i. Xiaomi has formally launched its lending platform “Mi Credit” in India for Android phones. According to platform “Mi Credit” individuals can avail up to Rs 1 lakh loan. The company is planning to introduce more financial products in India. The company has been operating Mi Credit platform on a pilot basis.
ii. Xiaomi has roped in Aditya Birla Finance Ltd, Money View, EarlySalary, Zestmoney and CreditVidya as the current lending partners for Mi Credit service. Mi Credit app will come pre-loaded on all MIUI phones, and can be downloaded from Google Play Store.

       Appointments

IOC ఛైర్మన్గా శ్రీకాంత్ మాధవ్ వైద్య :


i. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ) నూతన ఛైర్మన్గా శ్రీకాంత్ మాధవ్ వైద్య (56) నియమితులవ్వనున్నారు. ప్రస్తుతం ఈయన ఐఓసీ డైరెక్టర్గా (రిఫైనరీస్) కొనసాగుతున్నారు. శ్రీకాంత్ ఐఓసీ బోర్డులో గత అక్టోబరులో చేరారు.
ii. ప్రస్తుతం కొనసాగుతున్న ఛైర్మన్ సంజీవ్ సింగ్ 2020 జూన్ 30న పదవీ విరమణ చేయబోతున్నారు. ఆయన స్థానంలోనే శ్రీకాంత్ బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈయన 2023 ఆగస్టు వరకు ఛైర్మన్ పదవిలో కొనసాగే అవకాశం ఉంది.

అశోక్ లేలాండ్ ఎండీగా విపిన్ సొంధి :


i. హిందూజా గ్రూప్ సంస్థ అశోక్ లేలాండ్ ముఖ్య కార్యనిర్వహణాధికారి (సీఈఓ), మేనేజింగ్ డైరెక్టర్ (ఎండీ)గా విపిన్ సొంధి నియమితులయ్యారు. 2018 నవంబరులో వినోద్ కె.దాసరి రాజీనామా చేసినప్పటి నుంచి ఈ పదవి ఖాళీగా ఉంది.
ii. అశోక్ లేలాండ్ ఛైర్మన్ ధీరజ్ హిందూజా ఇప్పటివరకు సీఈఓ, ఎండీ అదనపు బాధ్యతలు వహించారు.

Persons in news

ఎనిమిదేళ్లకే ఐరాసకెక్కింది.. మణిపూర్ పర్యావరణ కార్యకర్త లిసిప్రియ కంజుగం :


i. మా భవిష్యత్తును కోల్పోవడం ఎన్నికల్లో ... స్టాక్ మార్కెట్లో సంఖ్యలు తగ్గిపోవడంలాంటిది కాదు. మీరు కన్నబిడ్డలం మేం. మమ్మల్ని ఎటువంటి ప్రపంచంలో పెంచాలో మీరే నిర్ణయించండి. భారత ప్రభుత్వానికి నేను చేసే డిమాండ్లు మూడు. ‘జీరో కార్బన్ విడుదలకు వాతావరణ చట్టం తీసుకురావాలి, ‘వాతావరణ మార్పులు’ పేరుతో పాఠ్యాంశాలు చేర్చాలి, ప్రతి విద్యార్థి ఏటా మొక్కలను నాటేలా ప్రోత్సహిస్తూ, పెంచిన వృక్షాల ఆధారంగా డిగ్రీ ఇవ్వాలి’.
ii. భూగోళ పరిస్థితిని మెరుగుపరచడమే నా జీవితధ్యేయం. భవిష్యత్తులో అంతరిక్ష శాస్త్రవేత్తనవుతా. ఎందుకంటే... త్వరలో మనం నివసించే ఈ భూమి అంతరించనుంది. ఆ తరువాత మనం జీవించడానికి స్థలం కనుక్కోవడం కోసమే. చంద్రుడు, మార్స్ గ్రహాలపైకి రాకెట్ను పంపి, అక్కడ జీవించడం వీలవుతుందా లేదా అని తెలుసుకుంటా...
iii. ఈ మాటలన్నది ఎవరోకాదు, ఏడేళ్లప్పుడే పర్యావరణ కార్యకర్తగా మారిన మణిపూర్కు చెందిన అతిచిన్న వయస్కురాలు ఎనిమిదేళ్ల లిసిప్రియ కంజుగం.
iv. వాతావరణాన్ని మార్చే చట్టాన్ని తెమ్మంటూ గతేడాది పార్లమెంటు ఎదుట పోరాటం చేసింది. దిల్లీలో ‘ఇండియా గేట్ వద్ద ‘గ్రేట్ అక్టోబరు మార్చ్’పేరుతో వేలాదిమంది మద్దతుదారులను కలుపుకొని ఏడు రోజులపాటు మార్చ్ చేసింది. విపత్తు నిర్వహణపై మన దేశం తరఫున ప్రతినిధిగా జెనీవాలో జరిగిన ఐక్యరాజ్యసమితి సమావేశాల్లో ప్రసంగించింది.
v. ప్రస్తుతం ‘ఇంటర్నేషనల్ యూత్ కమిటీలో ఛైల్డ్ డిజాస్టర్ రిస్క్ రిడక్షన్’కు న్యాయవాదిగా ఉంది. ఇప్పటికే ‘వరల్డ్ చిల్డ్రన్స్ పీస్ ప్రైజ్’, ‘ద ఇండియా పీస్ ప్రైజ్’, ‘డాక్టర్ ఏపీజె అబ్దుల్ కలాం చిల్డ్రన్స్ అవార్డు’లను అందుకుంది.
vi. లిసిప్రియను పర్యావరణ కార్యకర్తగా ప్రపంచమంతా పేరొందిన గ్రేటా తంబర్గ్తో పోల్చడం విశేషం. ఈమెను ‘గ్రేటా ఆఫ్ ద గ్లోబల్ సౌత్’గా పిలుస్తున్నారు.

vii. స్వీడన్ యొక్క గ్రెటా థన్బెర్గ్ను 2019 సంవత్సరానికి టైమ్ మ్యాగజైన్ పర్సన్ ఆఫ్ ది ఇయర్గా ఎంపిక చేశారు. వాతావరణ మార్పులపై పోరాడటానికి ప్రపంచ ఉద్యమాన్ని ప్రేరేపించిన స్వీడన్ పాఠశాల విద్యార్థి గ్రేటా థన్బెర్గ్ “#FridaysForFuture” తో ప్రాచుర్యం పొందారు.

Reports/Ranks/Records

Nirmala Sitharaman 34th among world’s 100 most powerful women, German Chancellor Angela Merkel on top : Forbes


i. ‘ది వరల్డ్స్ 100 మోస్ట్ పవర్ఫుల్ ఉమెన్’ లో ఫోర్బ్స్ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 34వ స్థానంలో నిలిచింది. HCL కార్పొరేషన్ సీఈఓ, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రోష్ని నాదర్ మల్హోత్రా, బయోకాన్ వ్యవస్థాపకురాలు కిరణ్ మజుందార్ షా మరో ఇద్దరు భారతీయులు కూడా పై జాబితాలో ఉన్నారు.
ii. ఫోర్బ్స్ 2019 జాబితాలో ‘ది వరల్డ్స్ 100 మోస్ట్ పవర్ఫుల్ ఉమెన్’ జాబితాలో జర్మన్ ఛాన్సలర్ ఏంజెలా మెర్కెల్ అగ్రస్థానంలో నిలిచారు. యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ ప్రెసిడెంట్ క్రిస్టిన్ లగార్డ్ 2వ స్థానంలో, యుఎస్ ప్రతినిధుల సభ స్పీకర్ నాన్సీ పెలోసి 3వ స్థానంలో ఉన్నారు. ఈ జాబితాలో బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా కూడా 29వ స్థానంలో ఉన్నారు.

అవార్డులు

Rani Rampal, Saurabh Chaudhary Win Top Honours at FICCI India Sports Awards :


i. Indian women’s hockey team captain Rani Rampal and ace pistol shooter Saurabh Chaudhary won the Sports Person of the Year awards at the FICCI India Sports Awards 2019.
ii. The FICCI India Sports Awards are an attempt by FICCI to acknowledge and recognise the contribution of sportspersons and various stakeholders who deliver excellent results throughout the year.
iii. Rani played a crucial role in India’s qualification for the 2020 Tokyo Olympics, scoring the winning goal in the two-legged qualifier against the US in November.
iv. Saurabh, on the other hand, is touted as India’s biggest hope for a medal in shooting in Tokyo. He won gold at the 2018 Asian Games and has since won a number of individual and team honours at shooting World Cups.
v. FICCI India Sports Awards 2019 has been awarded to Railway Sports Promotion Board under the category of Best Company Promoting Sports.

Art and Culture 

National Tribal Dance Festival to be held in Raipur :


i. National Tribal Dance Festival will be held in Chhattisgarh’s capital Raipur from December 27 to 29. In the event, international folk artists from 23 states and six other countries are expected to take part and portray their respective tribal folk culture.
ii. Nearly 1,400 artists belonging to 151 art troupes from 23 states and guest artists from six countries including Sri Lanka, Belarus, Uganda and Bangladesh will participate in the three-day programme.

కమిటీలు

దిశ నిందితుల ఎన్కౌంటర్పై త్రిసభ్య సంఘం. విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ సిర్పుర్కర్ నేతృత్వంలో ఏర్పాటు :


i. దిశపై హత్యాచారానికి ఒడిగట్టిన నిందితుల ఎన్కౌంటర్పై న్యాయ విచారణకు సుప్రీంకోర్టు ఆదేశించింది. సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ వి.ఎస్. సిర్పుర్కర్ నేతృత్వంలో బొంబాయి హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ రేఖా ప్రకాశ్, సీబీఐ మాజీ అధిపతి డి.ఆర్.కార్తికేయన్ సభ్యులుగా న్యాయ విచారణ సంఘాన్ని నియమించింది.
ii. ప్రారంభించిన నాటి నుంచి ఆరు నెలల్లో విచారణ పూర్తి చేయాలని పేర్కొంది. త్రిసభ్య సంఘానికి సీఆర్పీఎఫ్తో భద్రత కల్పించాలని ఆదేశించింది. హైదరాబాద్ కేంద్రంగా కమిటీ పనిచేస్తుందని, వీరికి కావాల్సిన వసతుల్ని తెలంగాణ ప్రభుత్వం సమకూర్చాలని ఆదేశించింది.
iii. మహారాష్ట్రకు చెందిన జస్టిస్ సిర్పుర్కర్ 2007 జనవరి 12న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులై, నాలుగున్నరేళ్లపాటు సేవలందించారు. అంతకంటే ముందు బొంబాయి, మద్రాస్ హైకోర్టుల్లో న్యాయమూర్తిగా, ఉత్తరాఖండ్/ కలకత్తా హైకోర్టుల్లో ప్రధాన న్యాయమూర్తిగా చేశారు. 2000 సంవత్సరంలో సంచలనం సృష్టించిన ఎర్రకోటపై దాడి కేసులో నిందితుడు మహ్మద్ ఆరిఫ్ (పాకిస్థాన్)కు విధించిన ఉరిశిక్షను యావజ్జీవ ఖైదుగా మార్చిన ధర్మాసనంలో జస్టిస్ సిర్పుర్కర్ ఉన్నారు.
iv. కర్ణాటకకు చెందిన జస్టిస్ రేఖా ప్రకాశ్ ముంబయి యూనివర్సిటీ నుంచి న్యాయశాస్త్రంలో పట్టా పుచ్చుకున్నారు. బొంబయి హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు.
v. తమిళనాడులోని కోయంబత్తూర్కు చెందిన డీఆర్ కార్తికేయన్ 1964లో ఐపీఎస్కు ఎంపికయ్యారు. కర్ణాటక క్యాడర్కు నియమితులయ్యారు. 1998లో సీబీఐ అధిపతిగా విధులు నిర్వర్తించారు. మాస్కోలోని భారత రాయబార కార్యాలయం ఫస్ట్ సెక్రటరీగా, జాతీయ మానవ హక్కుల కమిషన్ డైరెక్టర్ జనరల్గా సేవలందించారు.

మరణాలు

బహుముఖ ప్రజ్ఞాశాలి గొల్లపూడి ఇక లేరు :



i. నటుడు, రచయిత, సంపాదకుడు, వ్యాఖ్యాతగా ప్రాచుర్యం పొందిన బహుముఖ ప్రజ్ఞాశాలి గొల్లపూడి మారుతీరావు (80) ఇకలేరు. 1939 ఏప్రిల్ 14న విజయనగరంలో ఆయన జన్మించారు.
ii. ఆకాశవాణి సంస్థలో 20 ఏళ్లు పనిచేసిన గొల్లపూడి.. దుక్కిపాటి మధుసూదనరావు పిలుపుతో ‘డాక్టర్ చక్రవర్తి’ చిత్రానికి స్క్రీన్ప్లే అందించారు. తొలిచిత్రానికే నంది అవార్డు అందుకున్నారు.
iii. 290 చిత్రాల్లో నటుడిగా రాణించారు. ఆరు నంది పురస్కారాలను అందుకున్నారు. ‘కళ్లు’ నాటకానికి ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ పురస్కారం అందుకున్నారు. మరో నాటకం ‘ప్రశ్న’ అఖిల భారత స్థాయిలో గుర్తింపు తెచ్చిపెట్టింది.
iv. 2017లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంచే కళారత్న పురస్కారం, 2002లో తెలుగు విశ్వవిద్యాలయ పురస్కారం, ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ వారి బంగారు పతకంతోపాటు ఎన్నో పురస్కారాలు అందుకున్నారు.

ముఖ్యమైన రోజులు

Indian Parliament attack : 13 December 2001 

i. 2001 భారత పార్లమెంటు దాడి 13 డిసెంబర్ 2001న న్యూఢిల్లీలో భారత పార్లమెంటుపై జరిగిన ఉగ్రవాద దాడి. నేరస్తులు లష్కర్-ఎ-తైబా (LeT) మరియు జైష్-ఎ-మొహమ్మద్ (JeM), పాకిస్తాన్కు చెందిన రెండు ఉగ్రవాద సంస్థలకు చెందినవారు .
ii. ఈ దాడిలో ఐదుగురు ఉగ్రవాదులు, ఆరుగురు ఢిల్లీ పోలీసు సిబ్బంది, ఇద్దరు పార్లమెంట్ సెక్యూరిటీ సర్వీస్ సిబ్బంది మరియు ఒక తోటమాలి - మొత్తం 14 మంది మరణించారు. భారతదేశం మరియు పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి, ఫలితంగా 2001-02 భారతదేశం-పాకిస్తాన్ ప్రతిష్టంభన ఏర్పడింది.

iii. 2001 డిసెంబరు 13న ఐదుగురు ఉగ్రవాదులు, గృహమంత్రిత్వ శాఖ, పార్లమెంటు గుర్తులు కలిగిన ఒక కారులో, భారత పార్లమెంటులోకి చొరబడ్డారు. అప్పటికి లోక్సభ, రాజ్యసభలు రెండూ కూడా వాయిదా పడి 40 నిముషాలైంది. పార్లమెంటు సభ్యులు, అధికారులు అనేకమంది, ఎల్.కె.అడ్వాణీ, హరీన్ పాఠక్ వంటి మంత్రులూ దాడి సమయనికి పార్లమెంటు భవనంలోనే ఉన్నారని భావిస్తున్నారు.
iv. సాయుధ ఇస్లామిక్ ఉగ్రవాదులు భారత పార్లమెంటు పై దాడి చేసారు. ఈ ఉగ్రవాదులు లష్కర్-ఎ-తోయిబా, జైష్-ఎ-మొహమ్మద్ సంస్థలకు చెందినవారు. భద్రతా దళాలు వీరిని సమర్ధవంతంగా ఎదుర్కొని, దాడిలో పాల్గొన్న మొత్తం ఐదుగురు ఉగ్రవాదుల్నీ హతమార్చారు.
v. ఈ దాడికి కీలక పాత్ర పోషించిన ఉగ్రవాది అఫ్జల్ మహ్మద్కు భారత సుప్రీం కోర్టు ఉరిశిక్షను విధించింది. ఈ దాడితో భారత పాక్ సంబంధాల మధ్య ఉద్రిక్తతలు తీవ్రతరమై, 2001-02 నాటి సైనిక మోహరింపుకు దారితీసింది. 2001 నవంబరులో కాశ్మీరు శాసనసభపై జరిపిన ఇటువంటి దాడిలో ఉగ్రవాదులు 38 మంది ప్రజలను హతమార్చారు.
vi. ఉగ్రవాదులు తమ కారును ఉపరాష్ట్రపతి కృష్ణ కాంత్ కారుకు ఢీకొట్టి ఆపారు. వెంటనే దిగేసి, కాల్పులు మొదలుపెట్టారు. ఉపరాష్ట్రపతి భద్రతా సిబ్బంది ఎదురుకాల్పులు మొదలుపెట్టి, కాంపౌండు తలుపులు మూసేసారు.
vii. సిఆర్పిఎఫ్ కు చెందిన కమలేష్ కుమారి ఉగ్రవాదులను తొలుత గమనించి కేకలు వేసింది. ఉగ్రవాదులు వెంటనే కాల్పులు జరపగా ఆమె అక్కడికక్కడే మరణించింది. ఒక ఉగ్రవాదిపై భద్రతా దళాలు కాల్పులు జరిపినపుడు, అతడు చుట్టుకుని ఉన్న బాంబులు పేలి హతుడయ్యాడు.
viii. 2013 ఫిబ్రవరి 3న అఫ్జల్ గురు క్షమాభిక్ష అభ్యర్ధనను భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తిరస్కరించారు. 2013 ఫిబ్రవరి 9 న అఫ్జల్ గురును తీహార్ జైల్లో ఉరి తీసి, కోర్టు తీర్పును అమలు చేసారు. అతణ్ణి తీహార్ జైల్లోనే అతడి మతవిశ్వాసాల కనుగుణంగా ఖననం చేసారు.
>>>>>>>>>>>>>>>>  End of the day  <<<<<<<<<<<<<<<<

No comments:

Human Body

 మానవ శరీరం గురించి మనం మానవ శరీరాన్ని మైక్రోస్కోపిక్ స్థాయిలో "విచ్ఛిన్నం" చేస్తే, కణం దాని అత్యంత ప్రాథమిక యూనిట్‌గా ఉంటుంది. సగ...