Thursday, 26 December 2019

✍ కరెంట్ అఫైర్స్ 19 డిసెంబర్ 2019 Thursday eenadu

✍  కరెంట్ అఫైర్స్ 19 డిసెంబర్ 2019 Thursday ✍

  Daily Current affairs prepared from Eenadu, The Hindu newspaper and from online current affair websites, Wikipedia etc..

జాతీయ వార్తలు

PMGSY మూడో దశ ప్రారంభం :


i. ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన (పీఎంజీఎస్వై)మూడో దశను కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ ప్రారంభించారు. దిల్లీలో నిర్వహించిన పీఎంజీఎస్వై కార్యశాలలో ఆయన దీనికి లాంఛనంగా శ్రీకారం చుట్టారు.
ii. గ్రామీణ ఆవాసప్రాంతాల నుంచి వ్యవసాయ మార్కెట్యార్డులు, ఉన్నత పాఠశాలలు, ఆసుపత్రులను కలుపుతూ 1.25 లక్షల కిలోమీటర్ల పొడవైన రహదారులు నిర్మించాలన్నది ఈ పథకం లక్ష్యం.
iii. ఇందుకోసం మొత్తం రూ.80,250 కోట్లు ఖర్చు చేయనున్నారు. ఇందులో కేంద్రం రూ.53,800 కోట్లు సమకూర్చుతుంది. మిగిలింది రాష్ట్రాలు మ్యాచింగ్ గ్రాంట్గా సమకూర్చాల్సి ఉంటుంది. పథకం కాలపరిమితి 2019-20 నుంచి 2024-25 వరకు ఉంటుంది.

Govt approves Rs 436 cr outlay for skilling 4 lakh persons :


i. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, బ్లాక్చెయిన్, సైబర్ సెక్యూరిటీ వంటి భవిష్యత్ ప్రాంతాల్లో 4 లక్షల మంది నిపుణులను నైపుణ్యం కోసం 436 కోట్ల రూపాయల వ్యయాన్ని ప్రభుత్వం ప్రకటించింది.
ii. "ఫ్యూచర్ స్కిల్స్ ప్రైమ్" కార్యక్రమాన్ని సమాచార సాంకేతిక (IT) మంత్రిత్వ శాఖ మరియు పరిశ్రమ సంస్థ నాస్కామ్ సంయుక్తంగా రూపొందిస్తాయి మరియు డిజిటల్ ప్రతిభకు ఇండియా స్టాక్ గా చొరవను ఉంచడానికి ప్రయత్నిస్తాయి. ఈ కార్యక్రమం ఉపాధిని పెంచుతుంది.

తెలంగాణ వార్తలు

వన్యప్రాణి మండలి బోర్డు ఏర్పాటు. ఛైర్మన్గా ముఖ్యమంత్రి :


i. రాష్ట్ర వన్యప్రాణి మండలి బోర్డును ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ బోర్డుకు ముఖ్యమంత్రి ఛైర్మన్గా వ్యవహరిస్తారు. అటవీశాఖ మంత్రి వైస్ ఛైర్మన్గా, అటవీశాఖలో పీసీసీఎఫ్, చీఫ్ వైల్డ్ లైఫ్ వార్డెన్ సభ్య కార్యదర్శిగా ఉంటారు.
ii. ముగ్గురు ఎమ్మెల్యేలు సహా.. వన్యప్రాణుల సంరక్షణకు కృషి చేస్తున్న స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, పర్యావరణ వేత్తలు, వివిధ శాఖల అధికారులు సహా 28 మందిని ఈ కమిటీలో సభ్యులుగా నియమించారు.
iii. వన్యప్రాణి మండలి బోర్డులో ఎమ్మెల్యేలు కోనేరు కోనప్ప, మర్రి జనార్దన్రెడ్డి, వనమా వెంకటేశ్వరరావుకు, అదేవిధంగా ఆసిఫాబాద్ జిల్లా పరిషత్ ఛైర్పర్సన్ కోవ లక్ష్మికి చోటు లభించింది. ఈ మండలి పదవీకాలం మూడేళ్లు.

సులభంగా, పారదర్శకంగా రుణ సేవలు.  సత్ఫలితాలు ఇచ్చిన ‘మా స్త్రీ నిధి’ యాప్.  నేడు యాప్ను ఆవిష్కరించనున్న  మంత్రి ఎర్రబెల్లి :


i. మహిళలకు వడ్డీ లేని రుణాలు అందించే స్త్రీ నిధి సంస్థ సులభంగా, పారదర్శకంగా సేవలు అందించేందుకు సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. రుణం తీసుకున్న సభ్యులు తిరిగి చెల్లించేందుకు, ఎంత కట్టాల్సి ఉందో చూసుకునేందుకు, డబ్బులు నేరుగా అర్హులకు అందించేందుకు, ఏ అవసరానికి ఎంత మొత్తం రుణం ఇస్తారో తెలుసుకునేందుకు.. ‘మా స్త్రీ నిధి’ యాప్ను అందుబాటులోకి తీసుకొస్తుంది.
ii. రాష్ట్రంలో మొత్తం 3.19 మండల/పట్ణణ సమాఖ్యలున్నాయి. వీటిలో 2 లక్షల సమాఖ్యలకు స్మార్ట్ఫోన్లు ఉన్నాయి. సంఘంలోని సభ్యుల్లో ఏ ఇద్దరికి స్మార్ట్ఫోన్ ఉన్నా మిగిలిన సభ్యులు సైతం యాప్ ద్వారా సేవలను వాడుకోవచ్చు.

ఆంధ్రప్రదేశ్ వార్తలు

2430 జీవోను ఉపసంహరించుకోండి. ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించిన ప్రెస్ కౌన్సిల్ :


i. మీడియాపై ఆంక్షలు విధించేలా జారీ చేసిన 2430 జీవోను వెంటనే ఉపసంహరించుకోవాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆదేశించింది.
ii. జీవో జారీపై కౌన్సిల్ ఛైర్మన్ జస్టిస్ సీకే ప్రసాద్ అధ్యక్షతన ఉత్తర్ప్రదేశ్లోని అలహాబాద్లో విచారణ జరిగింది.
iii. తప్పుడు వార్తలపై చర్యలు తీసుకోవడానికి ప్రత్యేక చట్టం తీసుకురావాల్సిన అవసరం లేదని, దీనివల్ల వార్త మంచిదా? చెడ్డదా? అని చూడకుండా ఎడాపెడా కేసులు పెట్టే ప్రమాదం ఉందని ఆందోళన వెలిబుచ్చారు. పాత్రికేయుల్ని భయభ్రాంతులకు గురిచేసేలా జీవో ఉందంటూ గతంలో జయలలిత ప్రభుత్వ హయాంలో కేసుల నమోదును ఉదహరించారు.

ఆర్థిక అంశాలు

నిమిషానికో విమాన సర్వీస్. దేశీయంగా ఇండిగో ఘనత :


i. రోజుకు 1500 విమాన సర్వీసులు నిర్వహిస్తున్న తొలి దేశీయ విమానయాన సంస్థగా ఇండిగో ఘనత దక్కించుకుంది. 2018 డిసెంబరులో రోజుకు 1000 సర్వీసులు నిర్వహించగా, ప్రస్తుత నెలలో సర్వీసుల సంఖ్య 1500కు చేరినట్లు సంస్థ వెల్లడించింది.
ii. సగటున నిమిషానికో విమాన సర్వీసు తమది బయలుదేరుతోందని ఇండిగో ముఖ్య కార్యనిర్వహణాధికారి రోనోజాయ్ దత్తా తెలిపారు.

RBI waives NEFT, RTGS transfer charges for savings account holders from Jan 1 :


i. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బిఐ) పొదుపు ఖాతాదారులకు NEFT, RTGS బదిలీ ఛార్జీలను మాఫీ చేసింది. ఆర్టీజీఎస్, నెఫ్ట్ ద్వారా ఆన్లైన్ చెల్లింపులన్నీ పొదుపు ఖాతాదారులకు ఉచితంగా చేయమని ఆర్బిఐ ఒక ఉత్తర్వులో బ్యాంకులకు సూచించింది.
ii. కొత్త నియమం జనవరి 1, 2020 నుండి అమలులోకి వస్తుంది.

సదస్సులు

“Environmental Sustainability and Economic Development” Summit held in Delhi :


i. ఢిల్లీలో “పర్యావరణ సుస్థిరత మరియు ఆర్థిక అభివృద్ధి” పై సమ్మిట్ జరిగింది. కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రి ప్రకాష్ జావేద్కర్ ఓజోన్ పొర క్షీణించడం మరియు CFCలు మరియు HFCల ఉద్గారాల గురించి ఆందోళన వ్యక్తం చేశారు.
ii. కనీస ఉష్ణోగ్రతను నియంత్రించడానికి మరియు ఉద్గారాలపై తనిఖీ చేయడానికి సమావేశాన్ని పిలవడానికి ఆవశ్యకత ఉందని ఆయన పేర్కొన్నారు.

ఒప్పందాలు

India and US sign defence tech transfer pact during 2+2 dialogue :


i. India and the US have signed an agreement to facilitate the transfer of defence technology. During a 2+2 dialogue held at Washington DC the top foreign affairs and defence leaders on growing strategic relations between the worlds largest and most powerful democracies.
ii. India and the US have a common vision of a free, seamless and peaceful Indo-Pacific region. India has bought weapons worth more than $15 billion from the United States over the past decade as it seeks to replace its Russian-origin military and is in talks for helicopters, armed drones and a bigger Indian plan for local production of combat planes together worth billions of dollars.

GoI signs $250 Mn loan with ADB to expand energy efficiency investments :


i. ఎనర్జీ ఎఫిషియెన్సీ సర్వీసెస్ లిమిటెడ్ (ఇఇఎస్ఎల్) కోసం భారత ప్రభుత్వం మరియు ఆసియా అభివృద్ధి బ్యాంక్ (ఎడిబి) 250 మిలియన్ డాలర్ల రుణంపై సంతకం చేశాయి.
ii. వ్యవసాయం, నివాస మరియు సంస్థాగత వినియోగదారులకు ప్రయోజనం చేకూర్చే భారతదేశంలో ఇంధన సామర్థ్య పెట్టుబడులను విస్తరించాలని ఈ రుణం లక్ష్యంగా పెట్టుకుంది.
iii. ఇంధన సామర్థ్యాన్ని ప్రోత్సహించడానికి మరియు ఆర్థిక వ్యవస్థ యొక్క శక్తి తీవ్రతను తగ్గించడానికి ప్రభుత్వ కట్టుబాట్లను తీర్చడానికి భారత ప్రభుత్వ లక్ష్యం కోసం ఈ ప్రాజెక్ట్ దోహదపడుతుందని భావిస్తున్నారు.
iv. స్మార్ట్ మీటర్లు, పంపిణీ చేయబడిన సౌర కాంతివిపీడన వ్యవస్థలు మరియు ఎలక్ట్రిక్ వాహనాలతో సహా అర్హత కలిగిన రాష్ట్రాల్లో శక్తి-సమర్థవంతమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రవేశపెట్టడం విద్యుత్ నెట్వర్క్ నష్టాలను తగ్గించడానికి మరియు గ్రీన్హౌస్ వాయు ఉద్గారాలను తగ్గించడానికి సహాయపడుతుంది.

ఫియట్ క్రిస్లర్, ప్యూజియో విలీనం. ప్రపంచంలో 4వ అతిపెద్ద వాహన సంస్థ ఆవిర్భావం :


i. ప్రపంచంలోనే నాలుగో అతిపెద్ద వాహన సంస్థ ఆవిర్భావానికి రంగం సిద్ధమైంది. దిగ్గజ వాహన సంస్థలు ఫియట్ క్రిస్లర్, పీఎస్ఏ ప్యూజియో 50 బిలియన్ డాలర్లు (దాదాపు రూ.3.5 లక్షల కోట్లు) విలీన ఒప్పందం కుదుర్చుకున్నాయి.
ii. ఈ ఒప్పందం ద్వారా ప్రపంచంలో నాలుగో అతిపెద్ద వాహన సంస్థ ఆవిర్భవించనుంది. విలీనం 50:50 నిష్పత్తిలో జరగనుంది.
iii. కొత్తగా ఏర్పడనున్న సంస్థకు పీఎస్ఏ సీఈఓ కార్లో టవారెస్ నేతృత్వం వహిస్తారు. ఇక ఫియట్ క్రిస్లర్ ఛైర్మన్ జాన్ ఎల్కాన్ ఛైర్మన్గా వ్యవహరిస్తారు. ఫియట్ క్రిస్లర్ సీఈఓ మైక్ మాన్లే కొనసాగనున్నారు.

       Appointments

జాతీయ పోలీసు అకాడమీ డైరెక్టర్గా అతుల్ :


i. జాతీయ పోలీసు అకాడమీ డైరెక్టర్గా అతుల్ కార్వల్ నియమితులయ్యారు. ఈ మేరకు హోంశాఖ ప్రతిపాదనకు కేంద్ర మంత్రిమండలి ఆపాయింట్మెంట్స్ కమిటీ  ఆమోదం తెలిపింది.
ii. గుజరాత్ క్యాడర్కు చెందిన 1988 బ్యాచ్ ఐపీఎస్ అధికారి అయిన అతుల్ ప్రస్తుతం సీఆర్పీఎఫ్ అదనపు డైరెక్టర్ జనరల్గా ఉన్నారు. ఇంతవరకు పోలీసు అకాడమీ డైరెక్టర్గా ఉన్న అభయ్ ఒడిశా డీజీపీగా వెళ్లడంతో ఆయన స్థానంలో అతుల్ నియమితులయ్యారు.
iii. వాస్తవంగా పోలీసు అకాడమీ డైరెక్టర్గా డీజీ హోదా అధికారిని నియమిస్తారు. ఈ పోస్టును అదనపు డీజీ స్థాయికి తగ్గించి అతుల్ను నియమించారు.

టాటా సన్స్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్గా మిస్త్రీ :



i. సైరస్మిస్త్రీకి అతిపెద్ద విజయం దక్కింది. దాదాపు మూడేళ్ల న్యాయపోరాటంలో గెలుపు వరించింది. టాటా సన్స్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్గా తిరిగి నియమించాల్సిందేనంటూ నేషనల్ కంపెనీ లా అప్పీలేట్ ట్రైబ్యునల్(ఎన్సీఎల్ఏటీ) తేల్చి చెప్పింది.
ii. అదే సమయంలో ప్రస్తుతం అధిపతిగా ఉన్న ఎన్ చంద్రశేఖరన్ నియామకం చట్టబద్ధం కాదని కూడా స్పష్టం చేసింది. టాటా సన్స్ను పబ్లిక్ సంస్థ నుంచి ప్రైవేటు కంపెనీగా మార్చుతూ కింది కోర్టు ఇచ్చిన ఆదేశాలను సైతం ఎన్సీఎల్ఏటీ పక్కన పెట్టింది.
iii. టాటా సన్స్లో 18.4 శాతం వాటా ఉన్న మిస్త్రీ.. తన తొలగింపు విషయంలో ఉదాసీనంగా ఉండలేకపోయారు. తొలగింపును సవాలు చేస్తూ నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్(ఎన్సీఎల్టీ)కు వెళ్లారు.

iv. అక్టోబరు 24, 2016: టాటా సన్స్ ఛైర్మన్ పదవి నుంచి సైరస్ మిస్త్రీని తొలగించారు. రతన్ టాటాను తాత్కాలిక ఛైర్మన్గా ప్రకటించారు.
v. ఫిబ్రవరి 6, 2017:  టాటా గ్రూప్  హోల్డింగ్ సంస్థ అయిన టాటా సన్స్ బోర్డు నుంచి కూడా మిస్త్రీని డైరెక్టర్ హోదా నుంచి తొలగించారు.

Sridhar Patra appointed NALCO CMD :


i. నేషనల్ అల్యూమినియం కంపెనీ లిమిటెడ్ (నాల్కో) చైర్మన్-కమ్-మేనేజింగ్ డైరెక్టర్గా శ్రీధర్ పత్రాను నియమించారు. అతను ప్రస్తుతం నాల్కోలో డైరెక్టర్ (ఫైనాన్స్) లో ఉన్నాడు.
ii. అక్టోబర్ 31, 2024 వరకు ఆయన నాల్కో సిఎండిగా నియమితులయ్యారు. తపన్ కుమార్ చంద్ స్థానంలో శ్రీధర్ పాట్రా వచ్చారు.

Reports/Ranks/Records

సంపద సృష్టిలో రిలయన్స్ అగ్రస్థానం : మోతీలాల్ ఓస్వాల్ నివేదిక

i. ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్ఐఎల్)కు రికార్డులు కొత్తేమీ కాదు. తాజాగా మరో ఘనతను తన ఖాతాలో వేసుకుంది. అదేమిటంటే సంపద సృష్టిలో అగ్రస్థానం.

ii. 2014-19 వరకు అంటే ఐదేళ్ల కాలంలో రూ.5.6 లక్షల కోట్ల సంపదను సృష్టించింది. 2019 సంవత్సరానికి గాను వార్షిక సంపద సృష్టిపై మోతీలాల్ ఓస్వాల్ రూపొందించిన నివేదిక ఈ విషయాలను వెల్లడించింది.
iii. అత్యధికంగా సంపద సృష్టించిన తొలి 10 కంపెనీల్లోను, అత్యంత వేగంగా సంపదను సృష్టించిన తొలి 10 కంపెనీల్లోనూ ఉన్న ఒకే ఒక్క పేరు బజాజ్ ఫైనాన్స్.
iv. 2014-19 మధ్య కాలంలో భారత్లో అత్యధికంగా సంపదను సృష్టించిన రంగంగా వరుసగా మూడో ఏడాది ఆర్థిక రంగానికే అగ్రతాంబూలం దక్కింది. ప్రైవేట్ బ్యాంకులు, బ్యాంకిగేతర ఆర్థిక రంగ సంస్థలు గణనీయంగా సంపదను సృష్టించడమే ఇందుకు కారణమవుతోంది.
v. సంపద సృష్టిలో ప్రభుత్వ రంగ సంస్థలు వెనకబడే ఉన్నాయి. అత్యుత్తమ- 100 సంపద సృష్టి కంపెనీల్లో కేవలం 9 పీఎస్యూలకు మాత్రమే చోటు దక్కింది.
అవార్డులు

బండి నారాయణస్వామికి కేంద్రసాహితీ పురస్కారం. ‘శప్తభూమి’ నవలకు గుర్తింపు :


i. అనంతపురం సాహితీవేత్త బండి నారాయణస్వామి రచించిన నవల ‘శప్తభూమి’కి 2019వ సంవత్సరానికిగాను కేంద్రసాహిత్య అకాడమీ పురస్కారం దక్కింది.
ii. రాయలసీమ వెనుకబాటుతనం, రైతుల అగచాట్లు, రాష్ట్ర విభజన ఉద్యమం నేపథ్యంగా ఈ రచన సాగుతుంది. 2017లో తానా నవలల పోటీలో ఉత్తమ బహుమతి సాధించింది.

‘కుది ఎసరు’కు కేంద్ర సాహిత్య పురస్కారం :


i. కన్నడ రచయిత్రి, పాత్రికేయురాలు డాక్టర్ విజయ రచించిన కృతి ‘కుది ఎసరు’కు కేంద్ర సాహిత్య పురస్కారం లభించింది. డాక్టర్ విజయ తన ఆత్మకథకు ఇచ్చిన అక్షర రూపం ‘కుది ఎసరు’.
ii. విజయ అనేక కన్నడ మాస, వారపత్రికలకు సంపాదకులుగా వ్యవహరించారు. నాటకం, విమర్శ రంగాల్లోనూ తన ప్రతిభను చాటారు.

శశిథరూర్ ఆంగ్ల రచనకు అవార్డు :



i. రాజకీయనాయకుడు, రచయిత శశిథరూర్కు ఈ ఏడాది(2019)కి గాను ప్రతిష్ఠాత్మక సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది. శశిథరూర్ ఆంగ్లంలో రాసిన ‘యెన్ ఎరా ఆఫ్ డార్క్నెస్’కు కాల్పనిక సాహిత్యం విభాగంలో ఈ అవార్డును ప్రకటించారు.
ii. ఫిబ్రవరి 25న నిర్వహించే కార్యక్రమంలో విజేతలకు రూ.లక్ష నగదుతో పాటు తామ్రపత్రం బహుకరిస్తారు.
iii. కవితల విభాగంలో ప్రముఖ రచయిత నంద్కిశోర్ ఆచార్య(హిందీ), పెన్న మధుసూధన్(సంస్కృతం), అనురాధా పాటిల్(మరాఠీ), వి మధుసూదనన్  నాయర్(మలయాళం)సహా ఏడుగురు ఈ పురస్కారానికి ఎంపికయ్యారు.
iv. స్వీయ జీవిత చరిత్ర విభాగంలో విజయ(కన్నడ), జీవితచరిత్రల కేటగిరీలో షఫే కిద్వాయ్(ఉర్దూ)లకు అవార్డులు లభించాయి.

BOOKS

Thawarchand Gehlot launches Braille version of ‘Exam Warriors’ book written by PM Modi :


i. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ రాసిన “ఎగ్జామ్ వారియర్స్” పుస్తకం బ్రెయిలీ వెర్షన్‌ను సామాజిక న్యాయం, సాధికారత మంత్రి న్యూ ఢిల్లీలో విడుదల చేశారు. ఇంగ్లీష్ మరియు హిందీ భాషలలో బ్రెయిలీ వెర్షన్‌ను జైపూర్‌లో రాజస్థాన్ నేత్రాహీన్ కళ్యాణ్ సంఘ్ ముద్రించింది.
ii. ఈ పుస్తకంలో యానిమేటెడ్ పిక్చర్ మరియు వివిధ యోగా ఆసనాల యొక్క వివరణాత్మక రూపకల్పన ఉంది, ఇది విద్యార్థులకు చిత్ర గ్రాఫిక్‌లను సులభంగా ఊహించేలా చేస్తుంది.
iii. పరీక్షల సమయంలో మానసిక ఒత్తిడిని ఎదుర్కొనే దృష్టి లోపం ఉన్న విద్యార్థులకు ఈ పుస్తకం తప్పనిసరిగా ప్రయోజనం చేకూరుస్తుంది. ఇది ఈ విద్యార్థుల విశ్వాస స్థాయిని పెంచుతుంది మరియు వివిధ పోటీ పరీక్షలలో విజయం సాధించటానికి సహాయపడుతుంది.

ముఖ్యమైన రోజులు

19 December - Goa's Liberation Day (గోవా విముక్తి దినం)


i. ఏటా డిసెంబర్ 19 న గోవా విముక్తి దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఈ తేదీన 1961 లో, సైన్యం ఆపరేషన్ మరియు విస్తరించిన స్వాతంత్ర్య ఉద్యమం తరువాత గోవా పోర్చుగీస్ ఆధిపత్యం నుండి విడుదల చేయబడింది.
ii. పోర్చుగీస్ పాలన నుండి స్వేచ్ఛ పొందటానికి గోవాకు సహాయం చేసిన భారత సాయుధ దళాల జ్ఞాపకార్థం ఈ రోజు జరుపుకుంటారు.

ప్రతిభా పాటిల్ జననం : 1934 డిసెంబరు 19


i. ప్రతిభా పాటిల్ (జ. 1934 డిసెంబరు 19) భారతదేశ 12వ రాష్ట్రపతి. భారత దేశపు మొట్టమొదటి మహిళా రాష్ట్రపతి, మహారాష్ట్ర నుండి రాష్ట్రపతి పదవిని చేపట్టిన తొలి వ్యక్తి.
ii. ఆమె 2007 నుండి 2012 వరకు భారత రాష్ట్రపతిగా బాధ్యతలను నిర్వర్తించింది. ఆమె రాజస్థాన్ గవర్నరుగా 2004 నుండి 2007 వరకు తన సేవలనందించింది.
iii. ప్రతిభా పాటిల్ నారాయణ రావు పాటిల్ కుమార్తె. ఆమె 1934 సంవత్సరము డిసెంబర్ 19వ తేదీన మహారాష్ట్ర రాష్ట్రములోని నందగావ్లో జన్మించింది.
iv. 1962 లో తన 27వ యేట ఆమె మహారాష్ట్ర లోని జల్గాణ్ శాసనసభ నియోజకవర్గానికి శాసనసభ్యురాలిగా ఎన్నికై రాజకీయ జీవితాన్ని ప్రారంభించింది.  తరువాత ఆమె ముక్తాయ్నరగ్ శాసనసభ నియోజక వర్గం నుండి 1967 నుండి 1985 వరకు వరుసగా నాలుగుసార్లు శాసన సభ్యురాలిగా ఎన్నిక అయింది.
v. 1985 నుండి 1990 వరకు పార్లమెంటు సభ్యురాలిగా రాజ్యసభకు ఎన్నిక అయింది. 1991 సార్వత్రిక ఎన్నికలలో ఆమె 10వ లోక్సభకు అమ్రావతి పార్లమెంటు నియోజకవర్గం నుండి గెలుపొందింది. తరువాత ఒక దశాబ్దం కాలంపాటు ఆమె రాజకీయాల్లో పదవీ విరమణ చేసింది.
vi. ఆమె మహారాష్ట్ర శాసన సభలో సభ్యురాలిగా ఉన్న కాలంలో అనేక కేబినెట్ మంత్రి పదవులను చేసింది. ఆమె రాజ్యసభ, లోక్సభలలో అధికార స్థానాలలో కూడా పనిచేసింది. అదనంగా కొన్ని సంవత్సరాల పాటు మహారాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీకి అధ్యక్షురాలిగా, నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ అర్బన్ కో-ఆపరేటివ్ బ్యాంకుకు డైరక్టరుగా, గవర్నమెంటు కౌన్సిల్ ఆఫ్ ద నేషనల్ కో-ఆపరేటివ్ యూనియన్ ఆఫ్ ఇండియాలో సభ్యురాలిగా కూడా తన సేవలనందించింది.
vii. 2004 నవంబరు 8 న ఆమె రాజస్థాన్ రాష్ట్రానికి 24వ గవర్నరుగా నియమిపబడింది.  2004 నుండి 2007లో రాష్ట్రపతిగా ఎన్నికయ్యేవరకు రాజస్థాన్ రాష్ట్రానికి 24వ, తొలి మహిళా గవర్నరుగా పనిచేసింది. అదే సంవత్సరము, కాంగ్రేసు పార్టీ అభ్యర్థిగా ఏద్లాబాద్ నియోజకవర్గము నుండి మహారాష్ట్ర శాసనసభకు ఎన్నికైంది.
viii. 2007 రాష్ట్రపతి ఎన్నికలలో ఆమె ప్రత్యర్థిగా భారతీయ జనతా పార్టీ నుండి వచ్చిన అప్పటి ఉపరాష్ట్రపతి బైరాన్ సింగ్ షెకావత్ ఉన్నాడు. షెకావత్ స్వతంత్ర అభ్యర్థిగా నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (NDA) చే మద్దతు పొందాడు.
ix. ఆమె ప్రతిభా మహిళా సహకారి బ్యాంకును స్థాపించింది. ఆ బ్యాంకు లైసెన్స్ ను భారతీయ రిజర్వు బ్యాంకు రద్దు చేయడం వలన ఫిబ్రవరి 2003 న మూసివేయబడింది.

క్రీడలు

వన్డేల్లో రెండు సార్లు హ్యాట్రిక్ నమోదు చేసిన తొలి భారత బౌలర్గా కుల్దీప్ చరిత్ర :

i. అంతర్జాతీయ క్రికెట్లో వన్డేల్లో రెండు సార్లు హ్యాట్రిక్ నమోదు చేసిన తొలి భారత బౌలర్గా కుల్దీప్ చరిత్ర సృష్టించాడు. 2017లో ఈడెన్గార్డెన్స్లో ఆస్ట్రేలియాతో జరిగిన వన్డేలో అతను తొలిసారిగా హ్యాట్రిక్ తీశాడు.
ii. అత్యధికంగా మలింగ ఖాతాలో మూడు హ్యాట్రిక్లు ఉన్నాయి.

దక్షిణాఫ్రికా బ్యాటింగ్ సలహాదారుగా కలిస్ :


i. ఇప్పటికే క్రికెట్ డైరెక్టర్గా గ్రేమ్ స్మిత్ను.. ప్రధాన కోచ్గా మార్క్ బౌచర్ను నియమించిన క్రికెట్ దక్షిణాఫ్రికా తాజాగా దిగ్గజ ఆల్రౌండర్ జాక్వస్ కలిస్ను దక్షిణాఫ్రికా జట్టు బ్యాటింగ్ సలహాదారుగా, చార్లెస్ లాంగ్వెల్ట్ను బౌలింగ్ సలహాదారుగా నియమించింది.
ii. ఐపీఎల్లో కోల్కతా నైట్రైడర్స్కు ప్రధాన కోచ్గా, బ్యాటింగ్ సలహాదారుగా సేవలు అందించిన అనుభవం కలిస్కి ఉంది.
>>>>>>>>>>>>>>>>  End of the day  <<<<<<<<<<<<<<<<
 

No comments:

Human Body

 మానవ శరీరం గురించి మనం మానవ శరీరాన్ని మైక్రోస్కోపిక్ స్థాయిలో "విచ్ఛిన్నం" చేస్తే, కణం దాని అత్యంత ప్రాథమిక యూనిట్‌గా ఉంటుంది. సగ...