Thursday, 26 December 2019

✍ కరెంట్ అఫైర్స్ 20 డిసెంబర్ 2019 Friday ✍ eenadunews

✍  కరెంట్ అఫైర్స్ 20 డిసెంబర్ 2019 Friday ✍

  Daily Current affairs prepared from Eenadu, The Hindu newspaper and from online current affair websites, Wikipedia etc..

  జాతీయ వార్తలు

భారత్కు కోర్టు ఖర్చులు చెల్లించండి.  నిజాం నిధుల కేసులో పాకిస్థాన్కు బ్రిటన్ హైకోర్టు ఆదేశం :

   
i. హైదరాబాద్ నిజాం లండన్లోని ఒక బ్యాంకులో దేశ విభజన సమయంలో డిపాజిట్ చేసిన నిధులపై దశాబ్దాలపాటు నలిగిన వివాదాన్ని పరిష్కరించి భారత్కు అనుకూలంగా తీర్పు ఇచ్చిన బ్రిటన్ హైకోర్టు, ఈ వ్యాజ్యంలో భారత్కు అనుకూలంగా మరో తీర్పు ఇచ్చింది.
ii. ఈ వ్యాజ్యానికి సంబంధించి కోర్టు ఖర్చుల్లో 65శాతం మేర చెల్లించాలని పాకిస్థాన్ను ఆదేశించింది. అంటే భారత్కు సుమారు రూ.25.78కోట్లు పాకిస్థాన్ చెల్లించాల్సి ఉంటుంది. ఇదే నిష్పత్తిలో నిజాం వారసులకు కూడా చెల్లించాలి.
iii. నిజాంకు చెందిన దాదాపు 35మిలియన్ పౌండ్లు లండన్లోని న్యాట్ వెస్ట్ బ్యాంక్లో మూలుగుతున్నాయి. వీటిపై తమకు హక్కు కల్పించాలని పాకిస్థాన్ దావా వేసింది. అయితే నిజాం వారసులు ప్రిన్స్ ముఖరమ్ ఝా తదితరులు భారత్తో చేయి కలిపి పాకిస్థాన్కు వ్యతిరేకంగా వ్యాజ్యం నడిపారు.

కేంద్ర ప్రభుత్వ కొత్త పథకాలు

అటల్ ఇన్నోవేషన్ మిషన్ :


i. పాఠశాల విద్యార్థుల్లో సైన్స్పై ఆసక్తి పెంచి, పరిశోధనల వైపు ఆకర్షించే లక్ష్యంతో 2016లో కేంద్రం అటల్ ఇన్నోవేషన్ మిషన్(AIM) పేరిట పథకాన్ని ప్రవేశపెట్టింది.
ii. అందులో భాగంగా ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్ ఉన్నత పాఠశాలల్లోని 6-10 తరగతుల విద్యార్థులు ప్రయోగాలు చేస్తూ నేర్చుకునేందుకు వాటిని నెలకొల్పుతున్నారు. అయిదేళ్లలో కేంద్రమే అందుకు రూ.20లక్షలు మంజూరు చేస్తుంది.
iii. సైన్స్ కిట్లు, త్రీడీ ప్రింటర్లు, ప్రయోగశాలలకు అవసరమైన పరికరాల కొనుగోలుతో పాటు సహాయకుడి వేతనం, నిర్వహణకు వాటిని మంజూరుచేస్తారు. ఈ పథకాన్ని నీతిఅయోగ్ పర్యవేక్షిస్తుంది

తెలంగాణ వార్తలు

తెలంగాణ లోకాయుక్తగా జస్టిస్ చింతపట్టి వెంకటరాములు. మానవహక్కుల కమిషన్ ఛైర్మన్గా జస్టిస్ గుండా చంద్రయ్య :


i. తెలంగాణ లోకాయుక్తగా హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ చింతపట్టి వెంకటరాములు, ఉపలోకాయుక్తగా విశ్రాంత జిల్లా, సెషన్స్ న్యాయమూర్తి, రాష్ట్ర న్యాయశాఖ మాజీ కార్యదర్శి వొలిమినేని నిరంజన్రావులు నియమితులయ్యారు.
ii. మానవ హక్కుల కమిషన్ ఛైర్మన్గా హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ గుండా చంద్రయ్య, సభ్యులుగా విశ్రాంత జిల్లా, సెషన్స్ న్యాయమూర్తి నడిపల్లి ఆనందరావు (జ్యుడిషియల్), మహమ్మద్ ఇర్ఫాన్ మొయినుద్దీన్ (నాన్ జ్యుడిషియల్) నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
iii. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో వీరి పేర్లను ఖరారు చేశారు. సీఎం కేసీఆర్తో పాటు శాసనసభలో ప్రతిపక్ష ప్రతినిధిగా మజ్లిస్ శాసనసభ్యుడు ఖాద్రి, మండలి విపక్ష నేత జాఫ్రీ, శాసనసభాపతి పోచారం శ్రీనివాస్రెడ్డి, మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డిలతో కూడిన కమిటీ సమావేశమై లోకాయుక్త, ఉపలోకాయుక్తలను ఎంపిక చేసింది.
iv. వీరితో పాటు అదనంగా హోంమంత్రి మహమూద్అలీతో కూడిన కమిటీ మానవహక్కుల సంఘం ఛైర్మన్, సభ్యులను ఎంపిక చేసింది. లోకాయుక్త, ఉపలోకాయుక్తలు అయిదేళ్ల పాటు, మానవహక్కుల సంఘం చైర్మన్, సభ్యులు మూడేళ్లపాటు పదవుల్లో ఉంటారు.
లోకాయుక్త జస్టిస్ సీవీ రాములు :
v. 1949 ఫిబ్రవరి 20న నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం ఆచన్పల్లి గ్రామంలో జన్మించారు. 1978లో ఔరంగాబాద్లోని మరఠ్వాడా విశ్వవిద్యాలయంలో ఎల్ఎల్బీ ఉత్తీర్ణులయ్యారు.
vi. 2004 జూన్ 24న హైకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు. 2011 ఫిబ్రవరి 19న పదవీ విరమణ పొందారు.
మానవ హక్కుల సంఘం ఛైర్మన్ జస్టిస్ జి.చంద్రయ్య :
vii. 1954 మే 10న ఆదిలాబాద్ జిల్లా జన్నారం మండలం తిమ్మాపూర్ గ్రామంలో వ్యవసాయ కుటుంబంలో జన్మించారు. ఆదిలాబాద్లో డిగ్రీ వరకు చదివిన ఆయన ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎల్ఎల్బీ, ఎంఏ (రాజనీతి శాస్త్రం), ఎల్ఎల్ఎం చేశారు.
viii. హైకోర్టు న్యాయవాదిగా, 1983లో రాష్ట్ర వినియోగదారుల వివాదాల కమిషన్ ఛైర్మన్గా బాధ్యతలు చేపట్టారు. 1991 నుంచి 95 వరకు ప్రభుత్వ న్యాయవాదిగా పనిచేశారు.
ix. 2005 మే 26న హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు. 2006 ఫిబ్రవరి 20న హైకోర్టు శాశ్వత న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2016 మేలో పదవీ విరమణ పొందారు.

తెలంగాణలో 36 ఫాస్ట్ట్రాక్ కోర్టులు. హైకోర్టు చొరవతో ప్రభుత్వం కీలక నిర్ణయం :


i. తెలంగాణ హైకోర్టు చొరవతో రాష్ట్రప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మహిళలపై అత్యాచారాలు, చిన్నారులపై లైంగిక వేధింపులకు సంబంధించిన కేసుల్లో సత్వర విచారణకు రాష్ట్రవ్యాప్తంగా 36 ఫాస్ట్ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది.
ii. ఈ ఏడాది జులై 25న సుమోటో వ్యాజ్యం విచారణ సందర్భంగా ఫాస్ట్ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయాలంటూ సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఆ ఆదేశాల మేరకు ఆగస్టు 5న అన్ని రాష్ట్రాల హైకోర్టులకు కేంద్ర న్యాయశాఖ లేఖలు రాసింది.

గణతంత్ర వేడుకలకు రెండోసారి తెలంగాణ శకటం :


i. బతుకమ్మ...బోనాలు..మేడారం జాతర..వేయి స్తంభాల గుడి నమూనాలు... పల్లెవాసుల బొమ్మలతో వచ్చే నెల 26న దిల్లీలో జరగనున్న గణతంత్ర వేడుకల్లో తెలంగాణ శకటం కనువిందు చేయనుంది.
ii. తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్ర శకటం ప్రదర్శనకు ఎంపిక కావడం ఇది రెండోసారి. గతంలో 2015 జనవరి 26న దిల్లీలో జరిగిన గణతంత్ర వేడుకల సందర్భంగా ప్రదర్శనలో తొలిసారిగా తెలంగాణ శకటం పాల్గొంది.

రాష్ట్రానికి ఐదు జాతీయస్థాయి అవార్డులు :


i. ఉపాధి హామీ పథకంలో భాగంగా మిషన్ వాటర్ కన్జర్వేషన్ అమలు చేయడంలో రెండోస్థానం దక్కించుకోగా, ఉపాధిహామీ అమలులో కూలీల సగటు పనిదినాలు ఎక్కువ కల్పించి నిర్దేశిత లక్ష్యాలు చేరుకొని రాజన్నసిరిసిల్ల, సిద్దిపేట జిల్లాలు జాతీయ స్థాయిలో నాలుగు, ఐదు స్థానాల్లో నిలిచాయి.
ii. ఉపాధి హామీ పథకంతో అభివృద్ధి చెందిన గ్రామాల విభాగంలో వికారాబాద్ జిల్లా నవాబుపేట మండలం లింగంపల్లికి అవార్డు లభించింది.
iii. శ్యామాప్రసాద్ ముఖర్జీ రూర్బన్ మిషన్ కార్యక్రమంలో భాగంగా జియో-స్పేషియల్ ప్లానింగ్ను రూర్బన్ క్లస్టర్స్లో పూర్తిచేసినందుకు దక్కిన పురస్కారాన్ని కమిషనర్ రఘునందనరావు, జాయింట్ కమిషనర్ జి.వీరారెడ్డి, జీఐఎస్ రూర్బన్ ఎస్ఈటీ పి.రవీందర్లు అందుకున్నారు.

ఫలక్నుమాలో 6 కోట్లతో ఫుట్బాల్ మైదానం :


i. ఘనచరిత్ర కలిగిన హైదరాబాద్ ఫుట్బాల్కు పూర్వ వైభవం తెచ్చే లక్ష్యంతో హైదరాబాద్ నగర పాలక సంస్థ (జీహెచ్ఎంసీ) కీలక ముందడుగు వేసింది.
ii. రూ.6 కోట్ల వ్యయంతో నగరంలో కొత్తగా ఫుట్బాల్ మైదానం నిర్మించేందుకు జీహెచ్ఎంసీ నడుం బిగించింది. ఇందుకు ఫలక్నుమా కళాశాల ప్రాంగణాన్ని వేదికగా ఎంచుకుంది.
iii. ఫలక్నుమా కళాశాలలోని ఖాళీ స్థలంలో రూ.6 కోట్ల వ్యయంతో ఫుట్బాల్ మైదానాన్ని తీర్చిదిద్దేందుకు జీహెచ్ఎంసీ స్థాయీ సంఘం తీర్మానాన్ని ఆమోదించింది.

ఇతర రాష్ట్రాలు / కేంద్ర పాలిత ప్రాంతాల వార్తలు

జనవరి 26న దాద్రానగర్ హవేలీ,దమణ్దీవుల ఆవిర్భావ దినోత్సవం :


i. కేంద్రపాలిత ప్రాంతాలుగా ఉన్న దాద్రానగర్ హవేలీ, దమణ్దీవులను విలీనం చేస్తూ కేంద్ర ప్రభుత్వం చేసిన చట్టం 2020 జనవరి 26 నుంచి అమలులోకి రానుంది.
ii. ఈ కొత్త కేంద్రపాలిత ప్రాంత ఆవిర్భావ దినోత్సవాన్ని జనవరి 26న నిర్వహించుకోవాలని ఆదేశిస్తూ కేంద్రహోంశాఖ ఉత్తర్వులు జారీచేసింది. ఈ విలీనంతో కేంద్రపాలిత ప్రాంతాల సంఖ్య 9 నుంచి 8కి తగ్గుతుంది.

Chennai Corporation launches India’s first waste exchange platform :


i. చెన్నై కార్పొరేషన్, తమిళనాడు భారతదేశపు మొట్టమొదటి వ్యర్థ మార్పిడి వేదికను “మద్రాస్ వేస్ట్ ఎక్స్ఛేంజ్” (www.madraswasteexchange.com) ను ప్రారంభించింది.
ii. ఇది మొదటి మూడు నెలలు పైలట్ ప్రాతిపదికన నడుస్తుంది. పబ్లిక్ మరియు వ్యర్థ రీసైక్లర్ల నుండి వచ్చిన ప్రతిస్పందన ఆధారంగా, మరిన్ని ఫీచర్లు వెబ్‌సైట్‌లో చేర్చబడతాయి.
iii. వెబ్ పోర్టల్ మరియు అప్లికేషన్ రెండింటినీ కలిగి ఉన్న మద్రాస్ వేస్ట్ ఎక్స్ఛేంజ్, స్మార్ట్ సిటీ మిషన్ ద్వారా కేంద్ర గృహనిర్మాణ మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ మద్దతుతో భావించబడింది.

Odisha Govt. launches ‘Jalsathi’ programme :


i. ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ రాష్ట్రంలోని అన్ని గృహాలకు సురక్షితమైన తాగునీరు సరఫరా చేసేలా ‘జల్ సతి’ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఒడిశా సీఎం ‘జల్ సతి’ యాప్‌ను కూడా విడుదల చేశారు.
ii. ఈ కార్యక్రమాన్ని అమలు చేయడానికి వాటర్ కార్పొరేషన్ ఆఫ్ ఒడిశా (WATCO) భువనేశ్వర్‌లోని మహిళా సమాఖ్యలతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. జల్సతి చొరవ పైపుల నీటి కనెక్షన్ల ద్వారా వినియోగదారులకు స్వచ్ఛమైన తాగునీటి సరఫరాను నిర్ధారించడం.

అంతర్జాతీయ వార్తలు

డొనాల్డ్ ట్రంప్ అభిశంసన. ఆమోదించిన అమెరికా దిగువసభ :


i. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ను ప్రతినిధుల సభ అభిశంసించింది. అధికారం దుర్వినియోగం చేయడం, కాంగ్రెస్ వ్యవహారాలకు ఆటంకం కలిగించడం అన్న అభియోగాలపై ఆయనపై అభిశంసన తీర్మానాన్ని ఆమోదించింది.
ii. అధికార దుర్వినియోగం చేశారన్న ఆరోపణకు మద్దతుగా 230 మంది ఓటు వేయగా, వ్యతిరేకంగా 197 మంది ఓటు వేశారు. కాంగ్రెస్కు ఆటంకం కలిగించారన్న ఆరోపణకు అనుకూలంగా 229 మంది, వ్యతిరేకిస్తూ 198 మంది ఓటు వేశారు. ప్రతిపక్ష డెమోక్రటిక్ సభ్యులు ఈ అభిశంసన తీర్మానాన్ని ప్రవేశపెట్టారు.
iii. అమెరికా మాజీ ఉపాధ్యక్షుడు, డెమోక్రటిక్ పార్టీ నాయకుడు జో బిడెన్పై అవినీతి కేసులు పెట్టేలా ఉక్రెయిన్ దేశ అధ్యక్షుడు వ్లోదిమిర్ జెలెనెస్కీపై  ట్రంప్ ఒత్తిడి తెచ్చారన్నది ప్రధాన ఆరోపణ.
iv. దిగువ సభ అభిశంసనకు గురయిన అధ్యక్షుల్లో ట్రంప్ మూడోవారు. 1868లో అండ్రూ జాన్సన్, 1998లో బిల్ క్లింటన్లపై అభిశంసన తీర్మానాలు నెగ్గాయి. సెనేట్లలో వీగిపోయాయి. 243 ఏళ్ల అమెరికా చరిత్రలో ఏ ఒక్క అధ్యక్షుడు కూడా అభిశంసన ద్వారా పదవిని కోల్పోలేదు. 1974లో మాత్రం అభిశంసన తీర్మానం చర్చకు రాకమునుపే అధ్యక్షుడు రిచర్డ్ నిక్సన్ పదవికి రాజీనామా చేశారు.
v. సెనేట్లో అభిశంసన తీర్మానం  నెగ్గితే.. ట్రంప్ను దోషిగా  ప్రకటిస్తారు. ఆయన పదవి  నుంచి వైదొలగాల్సి ఉంటుంది. అధ్యక్షుడు తప్పు చేశారని ప్రకటించడానికి మూడింట రెండొంతుల మెజారిటీ (67 ఓట్లు) అవసరం. సెనేట్లో రిపబ్లికన్లదే మెజార్టీ. కాబట్టి ట్రంప్నకు వచ్చే ఇబ్బంది ఏమీ లేదు.
అభిశంసన వెనుక నాన్సీ పెలోసి :

vi. ప్రపంచాన్నే శాసించే వ్యక్తి అమెరికా అధ్యక్షుడు.. అలాంటి వ్యక్తినే ఓ 79 ఏళ్ల మహిళ అల్లాడించింది. ఆందోళనకు గురిచేసింది. ఆమే నాన్సీ పెలోసి.. ట్రంప్ అభిశంసన తీర్మానంలో కీలక పాత్ర పోషించిన అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్.
vii. 2007లో ప్రతినిధుల సభ తొలి మహిళా స్పీకర్గా నాన్సీ పెలోసి ఎన్నికై చరిత్ర సృష్టించింది. ఒక మహిళ స్పీకరుగా ఎన్నికవ్వడం అమెరికా చరిత్రలో అదే తొలిసారి. 2019లో నాన్సీ రెండోసారి ఆ పదవి చేపట్టింది.

43 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత క్యూబాకు మళ్లీ ప్రధాని :


i. క్యూబా చరిత్రలో సరికొత్త అధ్యాయం ప్రారంభం కాబోతోంది. 43 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఆ దేశానికి తిరిగి ప్రధానమంత్రి రాబోతున్నారు.
ii. ఈ వారాంతంలో జరిగే పార్లమెంటరీ సమావేశాల్లో దేశాధ్యక్షుడు మిగేల్ డియాజ్-కానెల్ ప్రధాని అభ్యర్థిని నామినేట్ చేస్తారు. ఆయన నామినేషన్ను జాతీయ అసెంబ్లీ ఆమోదించాల్సి ఉంటుంది.
iii. ఆపై మాజీ అధ్యక్షుడు రౌల్ క్యాస్ట్రో నేతృత్వంలోని శక్తిమంతమైన కమ్యూనిస్టు పార్టీ ఆమోదం కూడా లభిస్తే.. ప్రధాని నియామక ప్రక్రియ పూర్తవుతుంది.
iv. చివరగా ఫిడెల్ క్యాస్ట్రో క్యూబా ప్రధానమంత్రిగా పనిచేశారు. 1976లో ఆయన అధ్యక్ష బాధ్యతలు చేపట్టారు. అదే ఏడాది ప్రధాని పదవి రద్దయింది.

ఆర్థిక అంశాలు

HDFC Bank crosses $100 billion market capitalisation :

 
i. మార్కెట్ క్యాపిటలైజేషన్‌లో 100 బిలియన్ డాలర్లను దాటిన 3 వ భారతీయ సంస్థగా హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ నిలిచింది. హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, 140.74 బిలియన్ డాలర్ల మార్కెట్ క్యాప్ ఉన్న రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ మరియు 114.60 బిలియన్ డాలర్ల మార్కెట్ క్యాప్ ఉన్న టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టిసిఎస్) లీగ్‌లో చేరింది.
ii. ఈ విజయంతో, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ ఇప్పుడు ప్రపంచంలోనే అత్యంత విలువైన కంపెనీల జాబితాలో 110 వ స్థానంలో ఉంది. 100 బిలియన్ డాలర్లకు పైగా మార్కెట్ క్యాప్ ఉన్న ప్రపంచంలోని అత్యంత విలువైన బ్యాంకులు మరియు ఆర్థిక సంస్థలలో, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ 26వ స్థానంలో ఉంది.

Persons in news

‘రియాన్ కజీ’ వయసు 8.. సంపాదన 2.6 కోట్ల డాలర్లు :


i. రియాన్ కజీ యూట్యూబ్ ద్వారా అత్యధికంగా ఆర్జనాపరుడిగా ‘ఫోర్బ్స్’ పేర్కొంది. అసలు పేరు రియన్ గువాన్. 2019లో అతడు 2.6 కోట్ల డాలర్లు సంపాదించాడని ఫోర్బ్స్’  తెలిపింది.
ii. రియాన్ మూడేళ్ల వయసులో ఉన్నప్పుడు అతడి తల్లిదండ్రులు ‘రియన్స్ వరల్డ్’ అనే ఛానల్ను ప్రారంభించారు. తొలుత ఇది ‘రియాన్స్ టాయ్స్రివ్యూ’ పేరుతో నడిచేది. అందులో ఈ చిన్నారి వివిధ రకాల బొమ్మల పెట్టెలను తెరిచి, వాటితో ఆడుకునే వీడియోలు ఉన్నాయి.
iii. మొత్తం మీద 2015లో ఇది ప్రారంభమైనప్పటి నుంచి 350 కోట్ల మందికిపైగా ఈ ఛానల్ను వీక్షించారు. ఇటీవల ఈ ఛానల్ పేరును ‘రియార్స్ వరల్డ్’గా మార్చారు. రియాన్ వయసుతోపాటు ఈ ఛానల్లోని అంశాలు మార్పు చెందుతున్నాయి.

2019 ‘టిక్టాక్ ఇండియా క్వీన్’గా జాక్విలీన్ ఫెర్నాండజ్ :



i. టిక్టాక్ వీడియోలో కనిపించి 2019 ‘టిక్టాక్ ఇండియా క్వీన్’గా అవతరించింది బాలీవుడ్ నటి జాక్విలీన్ ఫెర్నాండజ్. తాజాగా టిక్టాక్ రైవైండ్ 2019 ప్రచారంలో భాగంగా మొదటి యాభై కంటెంట్ వీడియోల జాబితా విడుదల చేసింది.
ii. అందులో బాలీవుడ్ నటి జాక్విలీన్ అత్యధిక ఫాలోవర్స్తో మొదటి స్థానం సంపాదించింది. 2019 ఇండియా టిక్టాక్ క్వీన్గా అవతరించింది. జాక్విలిన్ 9.5 మిలియన్ల ఫాలోవర్లతో బాలీవుడ్లో అగ్రస్థానంలో నిలవగా, ఆ తరువాత రితేష్ దేశ్ముఖ్ (6.8 మిలియన్స్) కపిల్ శర్మ (2.2 మిలియ్న్స్), మాధురీ దీక్షిత్(1.2 మిలియన్స్)లు అత్యధక మంది ఫాలోవర్లు కలిగి ఉన్నారు.

Reports/Ranks/Records

‘ఫోర్బ్స్’ ప్రముఖుల్లో అగ్ర స్థానాన విరాట్ కోహ్లి :



i. భారత్లో 2019కి సంబంధించి అత్యధిక ఆర్జన ఉన్న వందమంది సెలబ్రిటీల జాబితాను ‘ఫోర్బ్స్ ఇండియా’ విడుదల చేసింది. ఇందులో భారత క్రికెట్ కెప్టెన్ విరాట్ కోహ్లి అగ్రస్థానంలో ఉన్నారు.
ii. తర్వాతి స్థానాలను బాలీవుడ్ నటులు అక్షయ్కుమార్, సల్మాన్ఖాన్ దక్కించుకున్నారు.

అవార్డులు

Portugal sets up Gandhi prize. The first edition will be dedicated to animal welfare :


i. రాష్ట్రపతి భవన్లో అధ్యక్షుడు రామ్ నాథ్ కోవింద్ అధ్యక్షతన జరిగిన మహాత్మా గాంధీ 150వ జన్మదినోత్సవం కోసం జాతీయ కమిటీ రెండవ సమావేశంలో పాల్గొన్నప్పుడు పోర్చుగీస్ ప్రధాన మంత్రి ఆంటోనియో కోస్టా గాంధీ పౌరసత్వ విద్య బహుమతిని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు.
ii. ఈ కమిటీలో భాగమైన ఏకైక విదేశాంగ ప్రధానమంత్రి కోస్టా, గాంధీ ఆదర్శాలను ప్రోత్సహించడానికి పోర్చుగల్ బహుమతిని ప్రారంభిస్తారని కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ప్రకటన తెలిపింది.
iii. ప్రతి సంవత్సరం, బహుమతి గాంధీ ఆలోచనలు, సూక్తులు ప్రేరణ పొందుతుందని, బహుమతి యొక్క మొదటి ఎడిషన్ జంతు సంక్షేమానికి అంకితం చేయబడుతుందని ఆయన అన్నారు. గాంధీ "ఒక దేశం యొక్క గొప్పతనాన్ని దాని జంతువులతో వ్యవహరించే విధానం ద్వారా నిర్ణయించవచ్చు" అని అన్నారు.
iv. ఈ కమిటీలో గాంధీవాసులే కాకుండా ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు, ప్రధాని నరేంద్ర  మోడీ, ఆయన మంత్రివర్గ సహచరులు, ముఖ్యమంత్రులు ఉన్నారు.

ముఖ్యమైన రోజులు

International Human Solidarity Day : 20 December


i. అంతర్జాతీయ మానవ సాలిడారిటీ దినోత్సవం డిసెంబర్ 20 న ప్రపంచవ్యాప్తంగా నిర్వహించబడుతుంది. జనరల్ అసెంబ్లీ, 22 డిసెంబర్ 2005న, 60/209 తీర్మానం ద్వారా సంఘీభావాన్ని ప్రాథమిక మరియు సార్వత్రిక విలువలలో ఒకటిగా గుర్తించింది.
ii. అంతర్జాతీయ మానవ సంఘీభావ దినం వైవిధ్యంలో మన ఐక్యతను జరుపుకునే రోజు; అంతర్జాతీయ ఒప్పందాలకు తమ కట్టుబాట్లను గౌరవించాలని ప్రభుత్వాలను గుర్తుచేసే రోజు; సంఘీభావం యొక్క ప్రాముఖ్యతపై ప్రజల్లో అవగాహన పెంచే రోజు; పేదరిక నిర్మూలనతో సహా సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధనకు సంఘీభావాన్ని ప్రోత్సహించే మార్గాలపై చర్చను ప్రోత్సహించే రోజు; పేదరిక నిర్మూలనకు కొత్త కార్యక్రమాలను ప్రోత్సహించే చర్య దినం.
iii. మానవ సాలిడారిటీ అనేది ప్రపంచాన్ని ఏకం చేసే విలువ. ప్రపంచవ్యాప్తంగా బిలియన్ల మంది ఉన్నారు, కానీ ప్రతి వ్యక్తి తన ప్రకృతి, భాష, మతం, సంఘంలలో చాలా వైవిధ్యంగా ఉంటారు. అన్ని వైవిధ్యాలతో ఉన్నప్పటికీ, సవాళ్లను ఎదుర్కొన్నప్పుడు ప్రజలు విపరీతమైన ఐక్యతను చూపించారు. ఈ ఐక్యతను ప్రోత్సహించడానికి, ఏటా మానవ సాలిడారిటీ దినోత్సవం జరుపుకుంటారు.

క్రీడలు

కింగ్స్ ఎలెవన్ పంజాబ్ కెప్టెన్ రాహుల్ :


i. ఐపీఎల్ 2020 టోర్నీలో పోటీపడే కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టుకు కేఎల్ రాహుల్ కెప్టెన్గా వ్యవహరించనున్నాడు. గత సీజన్లో కెప్టెన్గా ఉన్న రవిచంద్రన్ అశ్విన్.. దిల్లీ క్యాపిటల్స్కు వెళ్లిపోవడంతో రాహుల్కు బాధ్యతలు అప్పగించాలని పంజాబ్ ఫ్రాంఛైజీ నిర్ణయించింది.
ii. టీమ్ఇండియా మాజీ ఆటగాడు వసీం జాఫర్ కింగ్స్ ఎలెవన్ పంజాబ్ బ్యాటింగ్ కోచ్గా ఎంపికయ్యాడు. ప్రస్తుతం పంజాబ్కు అనిల్ కుంబ్లే ప్రధాన కోచ్గా వ్యవహరిస్తున్నాడు.
iii. సునీల్ జోషి బౌలింగ్ కోచ్గా, జాంటీ రోడ్స్ ఫీల్డింగ్ కోచ్గా ఉన్నారు. 2008 ఐపీఎల్ తొలి సీజన్లో జాఫర్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ప్రాతినిధ్యం వహించాడు.

ఒలింపిక్స్ మేనిఫెస్టో రూ.62 కోట్లు :


i. ఒలింపిక్స్ క్రీడలను ఎలా నిర్వహించాలి అనే వివరాలతో కూడిన ఒలింపిక్ మేనిఫెస్టోకు వేలంలో రికార్డు ధర పలికింది. 1892లో ఒలింపిక్ క్రీడల పితామహుడు పియరీ డీ కోబర్టిన్ తయారు చేసిన 14 పేజీల ఈ లిఖితపూర్వక పత్రం ఏకంగా రూ.62 కోట్లకు అమ్ముడుపోయింది.
ii. క్రీడా వస్తువుల వేలంలో అత్యధిక ధర పలికిన రికార్డు దీనిదే. ఇంతకుముందు బాస్కెట్బాల్ దిగ్గజం బాబ్ రూత్ జెర్సీ రూ.39 కోట్లకు అమ్ముడుపోయింది.

 ఐపీఎల్ చరిత్రలో అత్యధిక ధర పలికిన విదేశీ ఆటగాడిగా బౌలర్ ప్యాట్ కమిన్స్. భారత్ నుంచి అత్యధికంగా పియూష్ చావ్లాకు 6.75 కోట్లు :


i. ఐపీఎల్ 2020 వేలంలో ఆస్ట్రేలియా ఆటగాళ్ల పంట పడింది. ఫ్రాంఛైజీల మధ్య విపరీతమైన పోటీతో ఐపీఎల్ చరిత్రలో అత్యధిక ధర పలికిన విదేశీ ఆటగాడిగా పేస్ బౌలర్ ప్యాట్ కమిన్స్ రికార్డు బద్దలు కొట్టగా.. గ్లెన్ మ్యాక్స్వెల్ కూడా భారీ మొత్తానికి అమ్ముడుపోయాడు.
ii. కళ్లు చెదిరే రీతిలో రూ.15.5 కోట్లకు కమిన్స్ను కోల్కతా చేజిక్కించుకోగా.. రూ.10.75 కోట్లకు మ్యాక్స్వెల్ను కింగ్స్ ఎలెవన్ పంజాబ్ దక్కించుకుంది. ఆసీస్ పరిమిత ఓవర్ల కెప్టెన్ ఫించ్ను బెంగళూరు రూ.4.4 కోట్లకు కొనుక్కుంది.
iii. భారత క్రికెటర్లలో లెగ్స్పిన్నర్ పియూష్ చావ్లా అత్యధిక ధరకు అమ్ముడుపోయాడు. చెన్నై సూపర్కింగ్స్ రూ.6.75 కోట్ల భారీ మొత్తానికి అతణ్ని కొన్నది. నిరుడు రూ.4.2 కోట్లకు పియూష్ను కొన్న కోల్కతా.. ఈసారి వదిలేయడంతో అతడు వేలానికొచ్చాడు.
>>>>>>>>>>>>>>>>  End of the day  <<<<<<<<<<<<<<<<
 

No comments:

bio mechanics in sports

భౌతిక విద్యలో బయోమెకానిక్స్ అనేది మానవ కదలికను నియంత్రించే యాంత్రిక సూత్రాల అధ్యయనం మరియు శారీరక కార్యకలాపాల సమయంలో శరీరం శక్తులతో ఎలా సంకర్...