Thursday, 26 December 2019

కరెంట్ అఫైర్స్ 25 డిసెంబర్ 2019 Wednesday eenadunews

      కరెంట్ అఫైర్స్ 25 డిసెంబర్ 2019 Wednesday  eenadunews  

 జాతీయ వార్తలు

జాతీయ జనాభా పట్టికకు రూ.3,941 కోట్లతో కసరత్తు. జనగణనకు రూ.8754 కోట్లు. కేంద్ర కేబినెట్ ఆమోదం. త్రిదళాధిపతి నియామకానికీ పచ్చజెండా :


i. జాతీయ పౌర పట్టిక (NRC)పై దేశవ్యాప్తంగా తీవ్ర చర్చ జరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మరో భారీ కసరత్తుకు శ్రీకారం చుట్టింది. జాతీయ జనాభా పట్టిక (NPR)లో మార్పులు చేర్పులు చేయాలని నిర్ణయించింది.
ii. దీంతోపాటు 2021 జనాభా లెక్కల సేకరణకు రూ.12,700 కోట్లను కేటాయిస్తూ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇందులో జనగణనకు రూ.8,754.23 కోట్లు, ఎన్పీఆర్కు రూ.3,941.35 కోట్లను ఇవ్వాలని నిర్ణయించింది.
iii. జనాభా లెక్కల సేకరణ-2021లోని మొదటి దశతో పాటు ఎన్పీఆర్ను చేపడతామని కేంద్ర మంత్రి ప్రకాశ్ జావడేకర్ తెలిపారు. అయితే ఎన్ఆర్సీకి దీనితో సంబంధం లేదన్నారు. ఎన్పీఆర్ను అప్డేట్ చేసే సమయంలో ప్రజల నుంచి ఎలాంటి పత్రాన్ని కానీ బయోమెట్రిక్ డేటాను కానీ కోరబోమని చెప్పారు.
iv. ఎన్పీఆర్ ఉద్దేశం దేశంలోని ప్రతి నివాసితుడికి సంబంధించి సమగ్ర గుర్తింపు డేటాబేస్ను తయారుచేయడమని, అందులో బయోమెట్రిక్ వివరాలూ ఉంటాయని ‘రిజిస్ట్రార్ జనరల్ అండ్ సెన్సస్ కమిషనర్’ అధికారిక వెబ్సైట్ పేర్కొనడం గమనార్హం.
v. 2010లో యూపీయే హయాంలో ఎన్పీఆర్ కసరత్తు మొదలయిందని జావడేకర్ చెప్పారు. సదరు పట్టికలో నమోదు చేసుకున్నవారికి కార్డులను పంపీణీ చేశారని తెలిపారు.

త్రివిధ దళాలకు ఉమ్మడి అధిపతి :


i. సైన్యం, నౌకాదళం, వాయుసేనకు కలిపి త్రివిధ దళాధిపతి పదవి (చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్-CDS)ని కొత్తగా సృష్టించడానికి భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ ఆమోదం తెలిపింది.
ii. మూడు దళాల పక్షాన ప్రధాన మంత్రికి, రక్షణ మంత్రికి ఈ అధికారే ఏకైక సలహాదారుగా ఉంటారు. కీలక రక్షణ, వ్యూహాత్మక అంశాలపై సలహాలిస్తారు. రక్షణ మంత్రిత్వశాఖలో సీడీఎస్ అధ్యక్షతన సైనిక వ్యవహారాల శాఖ ఏర్పాటవుతుందని జావడేకర్ తెలిపారు.
iii. ఆ శాఖకు సీడీఎస్ కార్యదర్శిగా ఉంటారని చెప్పారు. ఆ అధికారికి ‘ఫోర్ స్టార్ జనరల్’ హోదా ఉంటుందని వివరించారు.
iv. 1999లో కార్గిల్ యుద్ధం అనంతరం దేశ భద్రతా వ్యవస్థలో లోపాలను గమనించేందుకు ఏర్పాటైన అత్యున్నత స్థాయి కమిటీ ఈ పదవి ఏర్పాటును సిఫార్సు చేసింది.2012లో నరేశ్ చంద్ర నేతృత్వంలోని టాస్క్ఫోర్స్ కూడా ఇదే సూచన చేసింది.
v. సీడీఎస్ పదవిని చేపట్టే అధికారి తన పదవీ విరమణ అనంతరం ఏ ప్రభుత్వ పదవినీ చేపట్టరాదు. అనుమతి లేకుండా ప్రైవేటు ఉద్యోగాల్లో చేరకూడదు.

రైల్వేబోర్డు పునర్వ్యవస్థీకరణకు పచ్చజెండా :

i. రైల్వేబోర్డు పునర్వ్యవస్థీకరణకు కేంద్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ఛైర్మన్తో కలిసి బోర్డులో ఇకపై 8 మందికి బదులు ఐదుగురే ఉంటారు. ఆపరేషన్స్, వ్యాపారాభివృద్ధి, మానవ వనరులు, మౌలిక సదుపాయాలు-ఆర్థిక వ్యవహారాలకు ఒక్కో సభ్యుడు ఉంటారు.
ii. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో స్వదేశ్ దర్శన్ పథకం కింద అదనంగా రూ.1854.67 కోట్లు కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. 2015లో ప్రారంభమైన ఈ పథకం కింద దేశంలో కోస్తా సర్క్యూట్ సహా 15 పర్యాటక సర్క్యూట్లను అభివృద్ధి చేయనున్నారు.

జాతీయ జనాభా పట్టిక (NPR) :

i. ఎన్పీఆర్ అనేది దేశంలోని సాధారణ నివాసితుల జాబితా. పౌరసత్వ చట్టం-1955, ‘పౌరసత్వ (పౌరుల నమోదు, జాతీయ గుర్తింపు కార్డుల మంజూరు) నిబంధనలు-2003’ కింద గ్రామ, జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో దాన్ని సిద్ధం చేస్తారు. దేశంలోని సాధారణ నివాసితులందరూ ఇందులో నమోదు చేసుకోవడం తప్పనిసరి.
 
ii. దేశంలోని సాధారణ నివాసితులందరి సమగ్ర గుర్తింపు వివరాల(డేటాబేస్)ను తయారుచేయడం ఎన్పీఆర్ ఉద్దేశం. ఇందులో జనాభా సమాచారంతోపాటు బయోమెట్రిక్ వివరాలు ఉంటాయి.
iii. 2011 జనాభా లెక్కల ప్రక్రియలో భాగంగా 2010లోనే ఎన్పీఆర్ కోసం డేటాను సేకరించారు. 2015లో ఇంటింటి సర్వే ద్వారా దాన్ని అప్డేట్ చేశారు.
iv. ఎన్పీఆర్ డేటా ప్రజలకు బహిరంగంగా అందుబాటులో ఉండదు. అవసరమైన వ్యక్తులు పాస్వర్డ్ రక్షిత ప్రోటోకాల్ విధానాల్లో సమాచారాన్ని పొందవచ్చు. దేశ అంతర్గత భద్రతను మెరుగుపర్చేలా, సంక్షేమ పథకాల ప్రయోజనాలు వాస్తవ లబ్ధిదారులకు చేరేలా ఈ డేటాను ఉపయోగించుకుంటామని ప్రభుత్వం చెబుతోంది.
v. ఎన్పీఆర్, జన గణన వేర్వేరు. జన గణనను ప్రతి పదేళ్లకోసారి చేపడతారు. అక్షరాస్యత, పట్టణీకరణ, మతాలు, జనన మరణాలు, వలసల వంటి విస్తృత వివరాలు అందులో ఉంటాయి.
vi. పౌరసత్వ నిబంధనలు-2003’లోని 3వ నిబంధనలో ఉన్న 4వ ఉప నిబంధనకు అనుగుణంగా ఎన్పీఆర్ను అప్డేట్ చేస్తామని నోటిఫికేషన్లో ప్రభుత్వం పేర్కొంది. నిబంధన-3 భారత పౌరుల జాతీయ పట్టిక(ఎన్ఆర్ఐసీ)కు సంబంధించినది.

2024 కల్లా ఆకాశవాణిని పునర్వ్యవస్థీకరిస్తాం : జావడేకర్

i. డిజిటల్ రేడియోని 2024 కల్లా ప్రవేశపెట్టి ఆకాశవాణిని పునర్వ్యవస్థీకరిస్తామని కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి ప్రకాశ్ జావడేకర్ చెప్పారు.

తెలంగాణ వార్తలు

 పురపాలక ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల నియమావళి :


i. ఎన్నికలు జరుగుతున్న పురపాలకసంఘాలు, నగరపాలక సంస్థల పరిధిలో మాత్రమే కోడ్ అమల్లో ఉంటుందని, ఎన్నికలు జరగని పురపాలికలు, మున్సిపాలిటీలతో పాటు గ్రామీణ ప్రాంతాలకు కోడ్ వర్తించదని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ వి.నాగిరెడ్డి వెల్లడించారు.
ii. నగరపాలక సంస్థల్లో అభ్యర్థుల ఎన్నికల వ్యయం రూ. 1.5 లక్షలు. పురపాలక సంస్థల్లో ఎన్నికల వ్యయ పరిమితి లక్ష రూపాయలు.
iii. పురపాలక సంఘాల్లో వార్డు సభ్యుడిగా పోటీ చేసే వారు ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులైతే రూ. 1,250 ఇతరులు రూ. 2,500 డిపాజిట్ చెల్లించాల్సి ఉంటుంది.
iv. నగరపాలక సంస్థల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులు రూ. 2,500, ఇతరులు రూ.5000 డిపాజిట్ చెల్లించాలి.

2020 కృత్రిమ మేధ(AI) సంవత్సరం : KTR


i. సమాచార సాంకేతికలో విప్లవాత్మకమైనదిగా గుర్తింపు పొందిన కృత్రిమ మేధ(AI - ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్)కు ప్రత్యేక విధానం అమలు చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. వచ్చే దశాబ్దాన్ని ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో స్వాగతం పలకనుంది.
ii. రాష్ట్ర పరిశ్రమలు, ఐటీశాఖల మంత్రి కేటీఆర్ వచ్చే నెల రెండో తేదీన హైదరాబాద్లో జరిగే కార్యక్రమంలో కేంద్ర ప్రభుత్వ ప్రముఖులు, నిపుణుల సమక్షంలో 2020ని కృత్రిమ మేధ సంవత్సరంగా అధికారికంగా ప్రకటించనున్నారు. అదే రోజు ప్రోత్సాహక విధానాన్ని విడుదల చేయనున్నారు.
iii. అభివృద్ధి చెందుతున్న సాంకేతికతల అమలులో తెలంగాణ అగ్రస్థానంలో ఉంది. రోబోటిక్స్, డేటా అనలిటిక్స్, మెషిన్ లెర్నింగ్, డ్రోన్, బ్లాక్చైన్ సాంకేతికతలను వివిధ రంగాల్లో అమలు చేస్తోంది.
iv. కృత్రిమ మేధ, బిగ్ డేటా అనలిటిక్స్లు ఇప్పుడు సాంకేతిక రంగాల్లో అగ్రస్థానంలో ఉన్నాయి. వీటి ద్వారా 2021 నాటికి భారతదేశంలో 8 లక్షల ఉద్యోగాలు వస్తాయని అంచనా. నాస్కామ్ ద్వారా దీనిని అవలంభిస్తారు.

ఇతర రాష్ట్రాలు / కేంద్ర పాలిత ప్రాంతాల వార్తలు

రోహ్తంగ్కు వాజ్పేయీ పేరు :


i. హిమాచల్ప్రదేశ్లోని అత్యంత వ్యూహాత్మక సొరంగ మార్గంగా పరిగణించే రోహ్తంగ్కు  ప్రభుత్వం దివంగత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయీ పేరు పెట్టనుంది. ఆయన జయంతి (December 25)ని పురస్కరించుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు రక్షణ మంత్రిత్వశాఖ ప్రకటించింది.
ii. వాజ్పేయీ ప్రధానిగా ఉన్నప్పుడు 2000 సంవత్సరం జూన్ మూడోతేదీన రోహ్తంగ్ మార్గం నిర్మాణానికి నిర్ణయం తీసుకున్నారు.

29న సీఎంగా హేమంత్ సోరెన్ ప్రమాణస్వీకారం :


i. ఝార్ఖండ్ ముఖ్యమంత్రిగా హేమంత్ సోరెన్ ఈ నెల 29న ప్రమాణస్వీకారం చేయనున్నారు. ప్రభుత్వం ఏర్పాటుకు తనను ఆహ్వానించాల్సిందిగా గవర్నర్ను కలిసి కోరారు.

Defence News

మిగ్-27కు వీడ్కోలు పలకనున్న IAF :


i. భారత వైమానిక దళంలో(ఐఏఎఫ్)ని శక్తిమంతమైన మిగ్-27 యుద్ధవిమానం ఇక చరిత్రగా మిగిలిపోనుంది. 1999 నాటి కార్గిల్ యుద్ధంలో తన సత్తా చాటిన ఈ లోహ విహంగాలకు వాయుసేన శుక్రవారం వీడ్కోలు పలకనుంది.
ii. ఆ రోజున జోధ్పుర్ వైమానిక స్థావరం నుంచి ఏడు మిగ్-27లు చివరిసారిగా గగనవిహారం చేస్తాయి. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఈ యుద్ధవిమానాల ప్రస్థానానికి ముగింపు పడుతుంది. ప్రస్తుతం ఏ దేశంలోనూ ఇవి వినియోగంలో లేవు. భారత వైమానిక దళంలో దీన్ని ‘బహుదుర్’గా వ్యవహరిస్తారు.

ఆర్థిక అంశాలు

ఏప్రిల్ 1కి విలీనం పూర్తి. ఒక్కటి కానున్న ఆంధ్రా బ్యాంకు, యూబీఐ, కార్పొరేషన్ బ్యాంకు :

i. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (యూబీఐ) లో ఆంధ్రా బ్యాంకు, కార్పొరేషన్ బ్యాంకుల విలీన ప్రక్రియ వచ్చే ఏడాది ఏప్రిల్ 1 తేదీ నాటికి పూర్తి కానుందని తెలుస్తోంది. ఈ విలీనం తర్వాత యూనియన్ బ్యాంక్ దేశంలో ఐదో అతిపెద్ద బ్యాంకుగా నిలుస్తుంది.
ii. అదనపు మూలధన నిధుల సమీకరణకు, రాని బాకీల భారాన్ని తగ్గించుకునేందుకు అవకాశం కలుగుతుందని బ్యాంకింగ్ వర్గాలు పేర్కొంటున్నాయి.
iii. 2018-19 ఆర్థిక సంవత్సరానికి ఆంధ్రా బ్యాంకుకు గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణా కేంద్రాల (ఆర్ఎస్ఈటీఐ) విభాగంలో ఉత్తమ పనితీరు సాధించిన బ్యాంకుగా అవార్డుకు ఎంపికైంది.

Persons in news

Uber co-founder Kalanick to leave company’s board :


i. Travis Kalanick, the co-founder of Uber, will resign from the board next week, the company announced. He was ousted as the CEO in 2017 with the company mired in numerous lawsuits.

Reports/Ranks/Records

ముకేశ్కు కలిసొచ్చిన 2019.ఏడాదిలో రూ.1.20 లక్షల కోట్లు పెరిగిన సంపద :


i. భారత శ్రీమంతుడు, ఆసియాలోనే ధనవంతుడు ముకేశ్ అంబానీ మరోసారి తనకు పోటీలేదని నిరూపించారు. 2019లో ఈయన సంపద ఏకంగా 17 బిలియన్ డాలర్లు (దాదాపు రూ.1.20 లక్షల కోట్లు) పెరిగింది. ఆసియాలో ఇదే అత్యధికం.
ii. బ్లూమ్బర్గ్ బిలియనీర్ల సూచీ ప్రకారం.. డిసెంబరు 23కు ముకేశ్ నికర సంపద దాదాపు 61 బిలియన్ డాలర్లు (దాదాపు రూ.4.27 లక్షల కోట్లు). ఇదే సమయంలో అలీబాబా గ్రూప్ వ్యవస్థాపకుడు జాక్ మా సంపద 11.3 బిలియన్ డాలర్లు పెరగ్గా, అమెజాన్ అధిపతి జెఫ్ బెజోస్ ఆస్తి 13.2 బిలియన్ డాలర్లు తగ్గింది.
iii. ప్రారంభించిన మూడేళ్లలోపే జియో.. భారత్లో అగ్రగామి టెలికాం సంస్థగా అవతరించి సత్తా చాటింది. వచ్చే మూడేళ్లలో కొత్త వ్యాపారాలు రిలయన్స్ ఆదాయంలో 50% సమకూర్చనున్నాయి.

ముఖ్యమైన రోజులు

25 December : Good Governance Day (India) / సుపరిపాలన దినం (భారతదేశం)


i. అటల్ బిహారీ వాజ్పేయి జన్మదినం సందర్భంగా డిసెంబర్ 25 న భారతదేశంలో సుపరిపాలన దినోత్సవం జరుపుకుంటారు, అతని సమాధి 'సాదియావ్ అటల్' దేశానికి అంకితం చేయబడింది.
ii. కవి, మానవతావాది, రాజనీతిజ్ఞుడు మరియు గొప్ప నాయకుడిగా అతని వ్యక్తిత్వాన్ని ప్రతిబింబిస్తుంది. అతను ఆగస్టు 16, 2018 న తన 93వ ఏట మరణించాడు.
iii. భారత ప్రజలలో పాలనలో జవాబుదారీతనం గురించి అవగాహన పెంచడానికి మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయికి నివాళి అర్పించడానికి 2014 లో సుపరిపాలన దినోత్సవాన్ని ఏర్పాటు చేశారు.

25 December - Christmas Day


i. దేవుని కుమారుడైన యేసుక్రీస్తు జన్మదినం సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 25 న క్రిస్మస్ రోజును జరుపుకుంటారు. క్రిస్మస్ ఏసుక్రీస్తు జననానికి గుర్తుగా, ప్రధానంగా డిసెంబరు 25న ప్రపంచవ్యాప్తంగా వందల కోట్ల మంది ప్రజలు జరుపుకునే మతపరమైన, సాంస్కృతిక పండుగ.
ii. క్రీస్తు ఏ నెలలో, ఏ తేదీన జన్మించాడన్న విషయం తెలియకపోయినా, నాలుగవ శతాబ్ది మధ్యభాగం నాటికల్లా పశ్చిమ క్రైస్తవ చర్చి క్రిస్మస్ ను డిసెంబరు 25 నాటికి నిర్వహించడం సాగించింది, ఇదే తేదీని తర్వాత తూర్పు క్రైస్తవం కూడా స్వీకరించింది. ప్రస్తుత కాలంలో క్రైస్తవుల్లో అత్యధికులు గ్రెగోరియన్ కేలండర్లోని డిసెంబరు నెల 25వ తేదీన నిర్వహించుకుంటున్నారు.

అటల్ బిహారీ వాజపేయి 95వ జయంతి  : 1924 డిసెంబర్ 25

i. అటల్ బిహారీ వాజపేయి (1924 డిసెంబర్ 25 - 2018 ఆగస్టు 16) మధ్య ప్రదేశ్ లోని గ్వాలియర్లో జన్మించిన అటల్ బిహారీ వాజ్పేయి భారతీయ జనతా పార్టీ తరపున ప్రధాన మంత్రి పదవిని పొందిన నాయకుడు. ఈయన బ్రహ్మచారి.

ii. ఇతను మొదటిసారిగా రెండవ లోక్సభకు ఎన్నికయ్యాడు. మధ్యలో 3వ, 9వ లోక్సభలకు తప్పించి 14వ లోక్ సభ ముగిసేవరకు పార్లమెంటుకు ప్రాతినిధ్యం వహించాడు. ఆయన రెండుసార్లు రాజ్యసభకు కూడా ఎన్నికయ్యాడు.
iii. 1968 నుండి 1973 వరకు జనసంఘ్ పార్టీకి అధ్యక్షుడిగా పనిచేసి, 1980 నుండి 1986 వరకు భారతీయ జనతా పార్టీకి వ్యవస్థాపక అధ్యక్షుడిగా పనిచేశాడు.
iv. 1996లో తొలిసారిగా ప్రధానమంత్రి పదవి యోగం లభించినా అది 13 రోజులకే పరిమితమైంది. 1998లో రెండో పర్యాయం ప్రధానమంత్రి పదవి పొంది 13 మాసాలు పాలించాడు. 1999లో 13వ లోక్సభ ఎన్నికల అనంతరం మరోసారి ప్రధానమంత్రి పదవి చేపట్టి 2004 వరకు పదవిలో ఉన్నాడు. అలుపెరుగని ఈ రాజకీయ నాయకుడికి 1994లో ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డు లభించింది. మొదటి కాంగ్రేసేతర ప్రభుత్వమైన మొరార్జీ దేశాయ్ మంత్రివర్గంలో విదేశీ వ్యవహారాల శాఖను నిర్వహించాడు. అనారోగ్య కారణాల వల్ల క్రియాశీల రాజకీయాలనుండి తప్పుకున్నాడు.
v. ఆయన దేశానికి చేసిన విశేష సేవలకు గాను భారత ప్రభుత్వం మార్చి 12, 2015లో భారతరత్న పురస్కారాన్ని ప్రకటించింది. ఆయన పుట్టినరోజు అయిన డిసెంబర్ 25ను సుపరిపాలనా దినంగా భారత ప్రభుత్వం ప్రకటించింది.
vi. 2015 మార్చి 27 న రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, వాజపేయికి దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న ప్రదానం చేసాడు. అనారోగ్యంతో పూర్తిగా మంచంపై ఉన్న వాజపేయికి భారత రత్న ప్రదానం చేయడానికి స్వయంగా రాష్ట్రపతే వాజపేయి నివాసానికి తరలి వెళ్ళాడు.
vii. 1977 సార్వత్రిక ఎన్నికలలో జనతా పార్టీ విజయం తరువాత ఆయన మొరార్జీ దేశాయ్ మంత్రివర్గంలో విదేశీ వ్యవహారాల శాఖ మంత్రిగా పనిచేశాడు. విదేశీ వ్యవహారాల మంత్రిగా ఆయన ఐక్యరాజ్యసమితి యొక్క సర్వప్రతినిధి సభలో హిందీలో ప్రసంగించిన మొట్టమొదటి వ్యక్తిగా నిలిచాడు.
viii. వాజపేయి, జనసంఘ్, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ల నుండి వచ్చిన తన సహచరులను, ముఖ్యంగా దీర్ఘకాల స్నేహితులైన ఎల్.కె.అద్వానీ, భైరాన్ సింగ్ షెకావత్ లను కలుపుకొని 1980 లో భారతీయ జనతా పార్టీని ఏర్పరచి, మొట్టమొదటి అధ్యక్షునిగా పనిచేసాడు.
ix. వాజపేయి 1996 నుండి 2004 ల మధ్య మూడు పర్యాయాలు ప్రధానమంత్రిగా బాధ్యతలు నిర్వహించాడు. మే 1996లో వాజపేయి భారత 10వ ప్రధానమంత్రి అయ్యాడు. కానీ బి.జె.పి ఇతర పార్టీల మద్దతును కూడగట్టుకొవటంలో విఫలమై, వాజపాయి ప్రభుత్వం సభలో ఆధిక్యతను నిరూపించుకోలేకపోయింది. పార్లమెంటులో మెజారిటీ పొందలేమని స్పష్టమైన వెంటనే, 13 రోజుల అనంతరం వాజపేయి తన పదవికి రాజీనామా చేశాడు.
x. 1996 నుండి 1998 ల మధ్యన రెండు యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వాలు పడిపోయిన తరువాత, లోక్సభ రద్దై, మధ్యంతర ఎన్నికలు జరిగాయి. 1998 లో జరిగిన సార్వత్రిక ఎన్నికలలో బి.జె.పి అన్ని పార్టీల కంటే అత్యధిక స్థానాలను కైవసం చేసుకుంది. ఈ ప్రభుత్వం 13 నెలల కాలం అనగా 1999 మధ్య వరకు కొనసాగింది. సంకీర్ణ ప్రభుత్వంలో భాగస్వామైన, జయలలిత నాయకత్వంలోని ఆలిండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కళగం (ఏ.ఐ.ఏ.డి.ఎం.కె) పార్టీ మద్దతు ఉపసంహరించిన కారణంగా ఈ ప్రభుత్వం మెజారిటీని కోల్పోయింది. 1999 ఏప్రిల్ 17 లో జరిగిన విశ్వాస పరీక్షలో ఒక ఓటుతో ఓడిపోయింది.
xi. 1974 లో తొలిసారిగా "ప్రోఖ్రాన్-I" అణుపరీక్ష జరిపిన భారతదేశం, మళ్ళీ 24 సంవత్సరాల తరువాత, 1998 మే నెలలో భారతదేశం రాజస్థాన్ లోని పోఖ్రాన్ ఎడారిలో ఐదు భూగర్భ అణు పరీక్షలను నిర్వహించింది. ఈ పరీక్షను "ప్రోఖ్రాన్-II"గా వ్యవహరిస్తారు. వాజపేయి ప్రభుత్వం యేర్పడిన నెలరోజులలోనే ఈ పరీక్షలు జరిగినవి.
xii. 1988 చివరలో, 1999 మొదట్లో వాజపేయి పాకిస్తాన్తో శాంతి కోసం పూర్తిస్థాయి దౌత్యచర్యలు ప్రారంభించాడు. దీని ఫలితంగా ఢిల్లీ-లాహోర్ బస్సును 1999 ఫిబ్రవరిలో ప్రారంభమైంది. కార్గిల్ యుద్ధం, భారత్ పాకిస్తాన్ మధ్య మే - జూలై 1999 లో కాశ్మీర్ లోని కార్గిల్ జిల్లాలోను, మరికొన్ని సరిహద్దుల వద్దనూ జరిగింది. ఈ యుద్ధానికి కారణం పాకిస్తాన్ సైనికులు, కాశ్మీరీ తీవ్రవాదులు ఎల్.ఒ.సి (వాస్తవాధీన రేఖ) దాటి భారతదేశంలోకి చొరబడడం.
xiii. కార్గిల్ పరిణామాల తరువాత జరిగిన 1999 సార్వత్రిక ఎన్నికలలో భారతీయ జనతా పార్టీతో కూడిన ఎన్.డి.ఏ కూటమి లోక్సభ 303 స్థానాలు గెలిచి, భారత పార్లమెంటులో స్థిరమైన మెజారిటీని పొందింది. వాజపేయి 1999 అక్టోబరు 13 న మూడవసారి ప్రధానమంత్రి పీఠాన్ని అధిష్టించాడు.

అవార్డులు :

xiv. 1992 పద్మవిభూషణ్, 1994 లోకమాన్య తిలక్ పురస్కారం, 1994 ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డు, 1994, భారతరత్న గోవింద్ వల్లభ్పంత్ అవార్డు, 2014 భారతరత్న.
రచనలు :
xv. శక్తి సే శాంతి (1999), కుఛ్ లేఖ్ కుఛ్ భాషణ్ (1996), నేషనల్ ఇంటిగ్రేషన్ (1961), డైనమిక్ ఆఫ్ ఎన్ ఓపెన్ సొసైటీ (1977), బాక్ టు స్క్వైర్ వన్ (1998), డిసైసివ్ డేస్ (1999).

మదన్ మోహన్ మాలవ్యా 158వ జయంతి : డిసెంబర్ 25, 1861

 
i. మదన్ మోహన్ మాలవ్యా (డిసెంబర్ 25, 1861 - నవంబరు 12, 1946) భారతీయ విద్యావేత్త మరియు రాజకీయవేత్త. భారతీయ స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొన్న సమరయోధుడు. ఆయన గౌరవంగా "పండిట్ మదన్ మోహన్ మాలవీయ"గా కూడా పిలువబడుతున్నారు. ఆయన "మహాత్మా"గా కూడా గౌవరింపబడ్డాడు.
ii. మాలవ్యా బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం వ్యవస్థాపకుడు. ఈయన వారణాసిలో ఈ విశ్వవిద్యాలయాన్ని 1915 లో స్థాపించాడు. ఇది ఆసియాలోనే అతిపెద్ద రెసిడెన్షియల్ విశ్వవిద్యాలయం మరియు ప్రపంచంలోనే పెద్ద విశ్వవిద్యాలయం. ఇందులో 12,000 లకు పైగా విద్యార్థులు కళలు,విజ్ఞానశాస్త్రము, ఇంజనీరింగ్ మరియు టెక్నాలజీ లలో విద్యనభ్యసిస్తున్నారు. మాలవ్యా ఆ విశ్వవిద్యాలయానికి వైస్ ఛాన్సలర్ గా 1919 నుండి 1938 వరకు పనిచేశారు.
iii. మాలవ్యా భారత జాతీయ కాంగ్రెస్ కు అధ్యక్షునిగా నాలుగు సార్లు (1909 & 1913,1919,1932) పనిచేశారు. ఆయన 1934లో కాంగ్రెస్ ను విడిచిపెట్టారు. ఆయన హిందూ మహాసభలో ముఖ్యమైన నాయకునిగా కూడా ఉన్నారు. మాలవ్యా "భారతీయ స్కౌట్స్ మరియు గైడ్సు"కు ఒక వ్యవస్థాపకుడు.
iv. ఆయన 1909 లో అలహాబాదు నుండి వెలువడుతున్న ఆంగ్ల పత్రిక లీడర్ పత్రికను స్థాపించారు. ఆయన 1924 నుండి 1946 వరకు హిందూస్థాన్ టైమ్స్ చైర్మన్ గా ఉన్నారు. ఆయన సేవలు 1936 లో హిందీ ఎడిషన్ ప్రారంభానికి ఉపయోగపడ్డాయి.
v. మాలవ్యా భారతదేశంలోని ప్రతిష్ఠాత్మక అవార్డు అయిన భారతరత్నకు డిసెంబర్ 24,2014 న ఎంపికైనారు. ఈ అవార్డును ఆయన 125 వ జన్మదినం ముందుగా పొందారు. మాలవ్య 1861, డిసెంబర్ 25న అలహాబాదులో ఒక నిష్టులైన హిందూ కుటుంబములో జన్మించారు.
vi. బ్రిటిష్ రాజ్యంలో భారత భవిష్యత్తును నిర్థారించడానికి ఏర్పాటైన సైమన్ కమీషన్ను వ్యతిరేకించడానికి లాలా లజపతి రాయ్, జవహర్ లాల్ నెహ్రూ ఇంకా ఇతర స్వాతంత్ర్య సమరయోధులతో కలిశాడు. 1931లో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో మహాత్మా గాంధీతో కలిసి కాంగ్రేసు పార్టీకి ప్రాతినిధ్యం వహించాడు. 1922-23 లో హిందు మహాసభ అధ్యక్షుడుగా చేశారు
vii. "సత్యమేవ జయతే" అనే నినాదాన్ని వ్యాపింపచేసాడు. అతడు గొప్ప విద్యావేత్త, కర్మయోగి, భగవద్గీతను పాటించెను. సమకాలిక నాయకుల వలే కులమత భేదములను పోగొట్టడానికి ప్రయత్నించాడు.

జ్ఞాని జైల్ సింగ్ 25వ వర్ధంతి : 1994 డిసెంబరు 25


i. జ్ఞాని జైల్ సింగ్ పంజాబ్ రాష్ట్రంలోని ఫరీద్ కోట్ జిల్లాలో "సంధవాన్" అనే గ్రామంలో 1916 మే 5 న జన్మించాడు. జైల్ సింగ్ తండ్రి సర్దార్ కిషన్ సింగ్ మంచి దేశభక్తుడు. జైల్ సింగ్ సిక్కుమతానికి సంబంధించి చేసిన కృషి వలన "జ్ఞాని" అని గౌరవించబడ్డాడు.
ii. 1956 లో రాజ్యసభ సభ్యుడయ్యాడు. 1962 లో పంజాబ్ మంత్రివర్గంలో పనిచేసాడు. 1972 మార్చిలో పంజాబ్ లెజిస్లేచర్ పార్టీ నాయకుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకోబడి, పంజాబ్ ముఖ్యమంత్రిగా ఐదు సంవత్సరాల పరిపాలన సాగించాడు.
iii. 1980 జనవరి లో జరిగిన ఎన్నికలలో హోషియాపూర్ నియోజకవర్గం నుండి లోక్ సభకు గెలిచి హోమ్ శాఖామంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించాడు. 15.07.1982 న రాష్ట్రపతిగా ఎన్నుకోబడ్డాడు. అదేనెల 25 వ తేదీన పదవీ బాధ్యతలు స్వీకరించాడు.
iv. అతని అధ్యక్ష పదవిని ఆపరేషన్ బ్లూ స్టార్, ఇందిరా గాంధీ హత్య మరియు 1984 సిక్కు వ్యతిరేక అల్లర్లు గుర్తించాయి.  అతను 1994 లో కారు ప్రమాదం తరువాత గాయాలతో మరణించాడు.

మహమ్మద్ అలీ జిన్నా 143వ జయంతి : 1876 డిసెంబరు 25 (Quiad-e-Azam day in Pakistan)

 
i. మహమ్మద్ అలీ జిన్నా (1876 డిసెంబరు 25 – 1948 సెప్టెంబరు 11), 20వ శతాబ్దానికి చెందిన రాజకీయనాయకుడు, భారత్ను విభజించి పాకిస్తాన్ ను ఏర్పాటుచేసిన నాయకుడు.
ii. ఇతడు షియా ముస్లిం. ముస్లిం లీగ్ నకు అధ్యక్షుడిగా ఉన్నాడు. ఇతడికి పాకిస్తాన్ లో, కాయద్ ఎ ఆజం మరియు జాతి పిత Baba-e-Qaum అని పిలుస్తారు.
iii. జిన్నా భారత జాతీయ కాంగ్రెస్ లో ప్రధానపాత్ర పోషించేవాడు, 1916 లక్నో ఒప్పందంలోనూ ముస్లింలీగ్ ను హిందూ-ముస్లింల ఐక్యత కొరకునూ పాటుపడ్డాడు. అంతేగాక అఖిలభారత హోంరూల్ లీగ్ లోనూ క్రియాశీలకంగా ఉన్నాడు.
iv. ఇతను రాజ్యాంగ సంస్కరణ ప్రణాళిక-పద్నాలుగు సూత్రాలు తయారుచేశాడు, దీని ప్రకారం ముస్లింల హక్కులు సంరక్షింపబడుతాయి. ముస్లింలీగ్ లోని అభిప్రాయభేదాలవలన ఈ ప్రతిపాదన సఫలం కాలేదు. దీనివలన జిన్నా దీర్ఘకాలం కొరకు లండన్ వెళ్ళిపోయాడు.
v. అనేక ముస్లిం నాయకులు, జిన్నాను బుజ్జగించి, 1934లో మరలా భారత్ను రప్పించుటలో సఫలీకృతులయ్యారు. భారత్ వచ్చిన జిన్నా ముస్లింలీగ్ ను ప్రక్షాళణా కార్యక్రమం చేపట్టాడు. లాహోర్ తీర్మానం ద్వారా తన "దేశ విభజన" కావాలి ముస్లింల కొరకు ప్రత్యేక దేశం కావాలి అనే పట్టును సాధించుకున్నాడు.
vi. 1946లో జరిగిన ఎన్నికలలో ముస్లింలీగ్ అనేక సీట్లను గెలుచుకున్నది. జిన్నా నేరు కార్యాచరణ ఉద్యమం చేపట్టాడు, ఈ ఉద్యమం ద్వారా పాకిస్తాన్ స్వాతంత్ర్యం పొందుటకు మార్గం సుగమమయింది. ఆంగ్లేయుల విభజించు-పాలించు సూత్రాన్ని అమలు పరచుటలో జిన్నా ఒక పావుగా మారాడు.
vii. ఇందుకు విరుద్దంగా కాంగ్రెస్ కార్యకర్తలు ప్రజాందోళనలకు దిగారు, దక్షిణాసియాలో హింస ప్రజ్వరిల్లినది. దేశాన్ని పాలించుటకు, కాంగ్రెస్-ముస్లింలీగ్ లు ఏకం కాలేదు, కనీసం ఏక సూత్రముపైనా రాలేదు. ఇదే అదనుగా బ్రిటిష్ ప్రభుత్వం భారత్-పాకిస్తాన్ లకు స్వతంత్రాన్ని ప్రకటించింది. స్వాతంత్ర్యం పొందిన ఇరుదేశాలలో కాందిశీకులు ఇరువైపులా ఎక్కువయ్యారు, వీరి గృహసౌకర్యాలను కల్పించడంలో తన సాధారణ పాత్రను అమలులో పెట్టాడు.

 క్రీడలు

టెస్టులకు కోహ్లి, వన్డేలకు ధోని. క్రికెట్ ఆస్ట్రేలియా దశాబ్దపు జట్లకు కెప్టెన్లుగా ఎంపిక :


i. 2010-2019 మధ్య దశాబ్ద కాలానికి క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) ప్రకటించిన అత్యుత్తమ టెస్టు, వన్డే జట్లకు కెప్టెన్లుగా విరాట్ కోహ్లి, మహేంద్రసింగ్ ధోని ఎంపికయ్యారు.
ii. గత పదేళ్లలో అత్యధిక టెస్టు విజయాలందుకున్న ప్రపంచ కెప్టెన్ కోహ్లీనే. భారత టెస్టు చరిత్రలోనే అత్యంత విజయవంతమైన కెప్టెన్గానూ అతను నిలిచాడు.
iii. ఈ రెండు జట్లలోనూ పాకిస్థాన్, వెస్టిండీస్ ఆటగాళ్లెవ్వరికీ చోటు దక్కకపోవడం గమనార్హం.

విరాట్ నం.1, బౌలర్ల ర్యాంకింగ్స్లో పాట్ కమ్మిన్స్  @ICC టెస్టు ర్యాంకింగ్స్ :



i. టీమ్ ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లి నంబర్వన్ టెస్టు బ్యాట్స్మన్గా ఈ ఏడాదిని ముగిస్తున్నాడు. తాజా ర్యాంకింగ్స్లో 928 పాయింట్లతో అతడు అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్నాడు. రెండో స్థానంలో ఉన్న స్టీవ్ స్మిత్ (911) కంటే అతడు 17 పాయింట్లతో ఆధిక్యతతో ఉన్నాడు.
ii. కేన్ విలియమ్సన్ (864) మూడో స్థానంలో ఉన్నాడు. పుజారా నాలుగో స్థానాన్ని నిలబెట్టుకోగా.. రహానె ఓ ర్యాంకును కోల్పోయి ఏడో స్థానానికి పడిపోయాడు.
iii. బౌలర్ల ర్యాంకింగ్స్లో బుమ్రా ఆరో స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. ఈ జాబితాలో ఆస్ట్రేలియా బౌలర్ పాట్ కమ్మిన్స్ అగ్రస్థానంలో ఉన్నారు.
iv. టెస్ట్ ఆల్ రౌండర్లలో రవీంద్ర జడేజా 2 వ స్థానంలో నిలిచాడు. వెస్టిండీస్ జాసన్ హోల్డర్ మొదటి స్థానంలో ఉన్నాడు.
v. ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్లో భారత్ 360 పాయింట్లతో మొదటి స్థానంలో కొనసాగుతోంది. ఆస్ట్రేలియా (216) రెండో స్థానంలో, పాకిస్థాన్ (80) మూడో స్థానంలో ఉన్నాయి.
 >>>>>>>>>>>>>>>>  End of the day  <<<<<<<<<<<<<<<<
   

✍ కరెంట్ అఫైర్స్ 24 డిసెంబర్ 2019 Tuesday ✍ eenadunews

✍  కరెంట్ అఫైర్స్ 24 డిసెంబర్ 2019 Tuesday ✍ eenadunews

  Daily Current affairs prepared from Eenadu, The Hindu newspaper and from online current affair websites, Wikipedia etc..

జాతీయ వార్తలు

Urban India declared Open defecation free :

 
i. స్వచ్ఛ భారత్ మిషన్-అర్బన్ అర్బన్ ఇండియా ఓపెన్ మలవిసర్జన రహితంగా సృష్టించే లక్ష్యాన్ని సాధించింది. 35 రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాల పట్టణ ప్రాంతాలు ODF గా మారాయి. మొత్తం మీద, 4,372లో 4,320 నగరాలు తమను ODF గా ప్రకటించాయి, వీటిలో 4,167 నగరాలు థర్డ్ పార్టీ ధృవీకరణ ద్వారా ధృవీకరించబడ్డాయి.
ii. 5.08 లక్షల సీట్ల మిషన్ లక్ష్యానికి వ్యతిరేకంగా 59 లక్షలు, 5.89 లక్షల ప్రభుత్వ మరుగుదొడ్లు మిషన్ లక్ష్యానికి వ్యతిరేకంగా దాదాపు 65.81 లక్షల వ్యక్తిగత గృహ మరుగుదొడ్ల నిర్మాణం ద్వారా ఇది సాధించబడింది.
iii. Minister of State (Independent Charge) of the Ministry of Housing and Urban Affairs - Hardeep Singh Puri.

తెలంగాణ వార్తలు

రాష్ట్రంలో పురపాలక ఎన్నికల నగారా :


i. మొత్తం 120 పురపాలక సంఘాలు, 10 నగరపాలక సంస్థలకు జనవరి 22వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) కమిషనర్ వి.నాగిరెడ్డి పురపాలక ఎన్నికల షెడ్యూలును ప్రకటించారు.
ii. రాష్ట్రంలో పురపాలక సంఘాలు, నగరపాలక సంస్థల పాలకవర్గాల గడువు ఈ ఏడాది జులై 2వతేదీన ముగియడంతో ఆ మర్నాటి నుంచి ప్రత్యేక అధికారుల పాలన అమల్లోకి వచ్చింది. బ్యాలెట్ ద్వారా పురపాలక ఎన్నికలు జరగనున్నాయి.

Hyderabad rated ODF++ for second time in a row :

i. కేంద్ర ప్రభుత్వం స్వచ్ సర్వక్షన్ -2019 రేటింగ్స్లో వరుసగా రెండోసారి హైదరాబాద్కు ఓడిఎఫ్ ++ (ఓపెన్ మలవిసర్జన రహిత) ర్యాంకు లభించినట్లు GHMC తెలిపింది. పరిశుభ్రత సర్వేలో భాగమైన మొత్తం 4,273 మునిసిపాలిటీలలో హైదరాబాద్ 35వ స్థానంలో నిలిచింది.
ii. మెట్రోలలో ముంబై, బెంగళూరు, చెన్నై మరియు కోల్కతా తరువాత హైదరాబాద్ ఐదవ స్థానంలో ఉంది. పారిశుద్ధ్య కార్మికుల భద్రతా ప్రమాణాలను మెరుగుపరిచేందుకు చేసిన కృషికి నగరానికి కేంద్రం నుంచి ₹10 లక్షల నగదు బహుమతి లభించింది..

ఆంధ్రప్రదేశ్ వార్తలు

Andhra Pradesh committed to Kadapa steel plant : Jagan


i. Laying the foundation for the three million tonne per annum Kadapa Steel Plant (KSP) at Sunnapurallapalle village in Jammalamadugu mandal of Kadapa district on December 23, Andhra Pradesh Chief Minister Y.S. Jagan Mohan Reddy promised to shoulder the responsibility of completing it even if big private companies did not come forward to invest in the project estimated to cost ₹15,000 crore.
ii. The steel plant, which was incorporated as A.P. High Grade Steels Limited, is one of the major promises made at the time of bifurcation of the unified State of Andhra Pradesh.
iii. Mr. Reddy said the most important step of sourcing iron ore had already been taken in the form of the MoU signed with the National Mineral Development Corporation (NMDC) a few days ago.
iv. The State allotted about 3,275 acres in Sunnapurallapalle and Peddanandaluru villages for the plant.

ఇతర రాష్ట్రాలు / కేంద్ర పాలిత ప్రాంతాల వార్తలు

ఝార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో జేఎంఎం - కాంగ్రెస్ కూటమి జయకేతనం. కూటమి నేతగా హేమంత్ సోరెన్ :


i. అధికార భాజపాకి ఝార్ఖండ్లో ఎదురుదెబ్బ తగిలింది. ఝార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం)- కాంగ్రెస్- ఆర్జేడీ కూటమి అధికారాన్ని కైవశం చేసుకుంది. కూటమి నేతగా హేమంత్ సోరెన్ రెండోసారి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠించనున్నారు. 81 స్థానాలున్న శాసనసభ ఓట్ల లెక్కింపు పూర్తయింది.
ii. ప్రభుత్వ ఏర్పాటుకు 41 స్థానాలు అవసరం కాగా జేఎంఎం 30 చోట్ల, కాంగ్రెస్ 16 స్థానాల్లో, ఆర్జేడీ ఒక స్థానంలో గెలవడంతో ఆ కూటమికి 47 స్థానాలు లభించినట్లయింది. ఒంటరిగా పోటీ చేసిన భాజపా 25 స్థానాలకే పరిమితమయింది. మిగిలిన 9 సీట్లు ఇతర పార్టీలకు దక్కాయి.
iii. సార్వత్రిక ఎన్నికల తర్వాత మూడు రాష్ట్రాల్లో ఎన్నికలు జరగ్గా రెండు చోట్ల భాజపా గెలవలేకపోయింది. గత ఏడాది భాజపా రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలను కోల్పోగా ఇటీవల మహారాష్ట్ర, ఇప్పుడు ఝార్ఖండ్ చేజారిపోయాయి. దేశంలో ఇప్పుడు ఏడు రాష్ట్రాల్లో కాంగ్రెస్ సొంతంగానో, సంకీర్ణ భాగస్వామిగానో అధికారంలో ఉన్నట్లయింది.
iv. ఈ రాష్ట్రానికి మూడుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన, రాష్ట్ర రాజకీయాల్లో ‘గురూజీ’గా గుర్తింపు పొందిన శిబూ సోరెన్కు హేమంత్ రెండో కుమారుడు. తెలంగాణ ఉద్యమానికి హేమంత్, ఆయన తండ్రి శిబూసోరెన్ మద్దతుగా నిలిచారని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గుర్తు చేసుకున్నారు.
v. ఓటమిని అంగీకరిస్తూ ముఖ్యమంత్రి రఘుబర్దాస్ రాజీనామా చేశారు. ఈ మేరకు లేఖను గవర్నర్ ద్రౌపది ముర్ముకు అందజేశారు.

Uddhav, Jagan rule out NRC exercise in their States :


i. రాష్ట్రంలో పౌరసత్వం (సవరణ) చట్టం (CAA), నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ (NRC) అమలు చేయబోమని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే ముస్లిం సమాజానికి చెందిన ప్రతినిధులకు హామీ ఇచ్చారు.
ii. కడపలో బహిరంగ సభలో ప్రసంగిస్తూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి కూడా ఎన్ఆర్సి యొక్క ప్రతిపాదిత అమలుకు రాష్ట్ర ప్రభుత్వం మద్దతు ఇవ్వదని పేర్కొంది. దీనితో ఆంధ్రప్రదేశ్ ఎన్‌ఆర్‌సిని వ్యతిరేకించడం లేదా తిరస్కరించిన 11వ రాష్ట్రం అయ్యింది.

‘Oxygen Parlour’ at Nashik Railway Station to combat air pollution :


i. నగరాల్లో పెరుగుతున్న వాయు కాలుష్యాన్ని ఎదుర్కోవటానికి ఒక ప్రత్యేకమైన ప్రయత్నంలో, ప్రయాణికులకు స్వచ్ఛమైన గాలిని పీల్చే అనుభవాన్ని అందించడానికి నాసిక్ రైల్వే స్టేషన్ వద్ద ‘ఆక్సిజన్ పార్లర్’ ప్రారంభించబడింది. భారతీయ రైల్వే సహకారంతో ఐరో గార్డ్ ప్రయత్నాలతో ఈ చొరవ వస్తుంది.
ii. ఆక్సిజన్ పార్లర్ యొక్క భావన నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ (నాసా) సిఫారసుపై ఆధారపడి ఉంటుంది. ఇక్కడ సుమారు 1500 మొక్కలు ఉన్నాయి, కాబట్టి, ఈ మొక్కలు రైల్వే స్టేషన్ వద్ద గాలిలోని కాలుష్యాన్ని ప్రత్యక్షంగా మరియు సమర్థవంతంగా తగ్గించగలవు మరియు ప్రజలకు స్వచ్ఛమైన గాలిని పీల్చుకోవడానికి వీలు కల్పిస్తాయి.

Rajasthan government starts its first Janta Clinic :


i. రాజస్థాన్ ముఖ్యమంత్రి జైపూర్ లోని మాల్వియా నగర్ ప్రాంతంలో తన మొదటి “జంత క్లినిక్” ను ప్రారంభించారు. మురికివాడల్లో నివసించే ప్రజలకు ఉచిత ప్రాధమిక ఆరోగ్య సంరక్షణను అందించడానికి ఈ క్లినిక్ తెరవబడింది.
ii. మొదటి దశలో, జైపూర్‌లో 12 జనతా క్లినిక్‌లు ప్రారంభించబడతాయి, ఇక్కడ ప్రజలకు ఉచిత మందులు మరియు కొన్ని సందర్భాల్లో ఉచిత వైద్య పరీక్షలు లభిస్తాయి.
అంతర్జాతీయ వార్తలు
రుణాలు చెల్లించే పరిస్థితిలో లేమన్న అర్జెంటీనా అధ్యక్షుడు అల్బెర్టో ఫెర్నాండెజ్ :
i. అర్జెంటీనా రుణాలు చెల్లించే పరిస్థితిలో లేదని ఆ దేశ అధ్యక్షుడు అల్బెర్టో ఫెర్నాండెజ్ ప్రకటించారు. ఈ నెల పదో తేదీనే బాధ్యతలు చేపట్టిన ఆయన రుణదాతలు అందరికీ బకాయిలు చెల్లిస్తామని తొలుత తెలిపారు.
ii. 18 నెలలుగా ఆర్థిక సంక్షోభం కొనసాగుతుండడంతో పరిస్థితులను చక్కదిద్దడానికి ‘ఆర్థిక అత్యవసర పరిస్థితి’ని ప్రకటించారు.

ఖషోగ్గీ హత్య కేసులో అయిదుగురికి మరణశిక్ష :


i. ‘వాషింగ్టన్ పోస్ట్’ కాలమిస్టు జమాల్ ఖషోగ్గీ హత్యలో నేరుగా సంబంధం ఉన్న అయిదుగురికి సంబంధిత న్యాయస్థానం మరణశిక్ష విధించింది. మరో ముగ్గురికి జైలు శిక్ష విధించినట్లు సౌదీకి చెందిన ఓ టీవీ ఛానల్ తెలిపింది. మరో ఇద్దరిని మాత్రం సరైన సాక్ష్యాలు లేని కారణంగా నిర్దోషులుగా ప్రకటించింది.
ii. ఇస్తాంబుల్లోని సౌదీ కాన్సులేట్ వద్ద 2018 అక్టోబరులో ఖషోగ్గీ హత్యకు గురయ్యారు. సౌదీ ఏజెంట్ల ముఠా ఒకటి ఈ హత్యకు పాల్పడింది.
iii. ఖషోగ్గీ హత్యానంతరం సౌదీ యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్పై అంతర్జాతీయ స్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి.

Emergency protocols activated in the Galapagos Islands after fuel spill :


i. ఈక్వెడార్ గాలాపాగోస్ దీవులలో అత్యవసర ప్రోటోకాల్లను సక్రియం చేసింది. గాలాపాగోస్ దీవులలో ఇంధన చిందటం యొక్క పర్యావరణ ప్రభావాన్ని కలిగి ఉండటానికి అత్యవసర ప్రోటోకాల్ సక్రియం చేయబడింది.
ii. 600 గ్యాలన్ల డీజిల్ ఇంధనంతో కూడిన బార్జ్ మునిగిపోయిన తరువాత ఈ చర్య తీసుకున్నారు. శాన్ క్రిస్టోబల్ ద్వీపంలోని ఓడరేవులో బార్జ్లోకి కంటైనర్ను లోడ్ చేస్తున్నప్పుడు క్రేన్ కూలిపోవడంతో ఈ ప్రమాదం జరిగింది. పడిపోతున్న కంటైనర్ ఓడను అస్థిరపరిచింది, తద్వారా అది మునిగిపోతుంది.
iii. గాలాపాగోస్ ద్వీపసమూహం యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశం మరియు గ్రహం మీద అత్యంత పెళుసైన పర్యావరణ వ్యవస్థలలో ఒకటి.

సైన్స్ అండ్ టెక్నాలజీ

WHO 1st time approved Biosimilar of “Trastuzumab” for breast cancer treatment :


i. The World Health Organization (WHO) announced that for the 1st time it had approved a “biosimilar” medicine of Trastuzumab named “Ontruzant” to make cheaper breast cancer treatment at an affordable rate to women globally.
ii. The medicine is derived from living sources rather than chemicals. The biosimilar medicine of the Trastuzumab drug was supplied by Samsung Bioepis co Ltd.
iii. WHO Headquarters: Geneva, Switzerland, Director general: Tedros Adhanom.
Prez Kovind releases mobile app of Red Cross Society of India :

i. అధ్యక్షుడు రామ్ నాథ్ కోవింద్ హైదరాబాద్లోని రెడ్క్రాస్ సొసైటీ ఆఫ్ ఇండియా మొబైల్ యాప్ను విడుదల చేశారు. ఈ అనువర్తనాన్ని తెలంగాణ సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ మూడు నెలల్లోపు అభివృద్ధి చేసింది, మొబైల్ అనువర్తనం అన్ని భాషలలో అందుబాటులో ఉంటుంది.
ii. మొబైల్ అనువర్తనాన్ని ప్రారంభించడంతో బ్లడ్ బ్యాంక్ మరియు రెడ్ క్రాస్ సభ్యత్వానికి ప్రాప్యత సులభం అవుతుందని డెవలపర్లు తెలియజేశారు.

Defence News

Army officer Maj. Anoop Mishra awarded for developing bulletproof jacket :


i. 2014లో, కాశ్మీర్ లోయలో పనిచేస్తున్నప్పుడు మేజర్ అనూప్ మిశ్రాకు బుల్లెట్ తగిలింది. అదృష్టవశాత్తూ, బుల్లెట్ అతని కవచ పలకను తాకింది, కాని అతను లోతైన గాయం ఎదుర్కొన్నాడు.
ii. స్నిపర్ రైఫిల్స్తో సహా వివిధ మందుగుండు సామగ్రి నుండి రక్షణ కల్పించగల సర్వత్రా బుల్లెట్ప్రూఫ్ జాకెట్ను స్వదేశీగా అభివృద్ధి చేసినందుకు ఆర్మీ డిజైన్ బ్యూరో (ADB) ఎక్సలెన్స్ అవార్డుతో ఆర్మీ చీఫ్ జనరల్ బిపిన్ రావత్ ఆయనను సత్కరించారు.
iii. ఈ ప్రాజెక్ట్ జూన్ 2017 లో మంజూరు చేయబడింది మరియు ప్రారంభంలో లెవల్ IIIA సాఫ్ట్ బాడీ కవచం సూట్ యొక్క రూపకల్పన మరియు అభివృద్ధి మంజూరు చేయబడింది మరియు తరువాత లెవల్ IV హార్డ్ కవచం ప్యానెల్ ఇన్సర్ట్లను చేర్చడానికి సవరించబడింది.
iv. పరిశ్రమ మరియు విద్యాసంస్థలతో సంబంధాలు పెట్టుకోవడానికి మరియు ఆర్మీ కోసం స్వదేశీ పరిష్కారాలను అభివృద్ధి చేయడానికి ADB ను ఏర్పాటు చేశారు.

ఒప్పందాలు

Wipro partners Nasscom to train 10,000 students on emerging technologies :


i. అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీలపై విద్యార్థులకు శిక్షణ ఇవ్వడానికి విప్రో నాస్కామ్తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఈ కార్యక్రమం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, సైబర్ సెక్యూరిటీ వంటి టెక్నాలజీలపై శిక్షణ ఇవ్వనుంది.
ii. విప్రో యొక్క కార్పొరేట్ సామాజిక బాధ్యత కార్యక్రమం “టాలెంట్ నెక్స్ట్” లో భాగంగా భారతదేశంలోని ఇంజనీరింగ్ కళాశాలల నుండి 10,000 మంది విద్యార్థులకు విప్రో శిక్షణ ఇస్తుంది.
iii. విద్యార్థులకు శిక్షణ ఇవ్వడానికి అధ్యాపకులు మరియు విద్యా నాయకులను సిద్ధం చేయడం ద్వారా ఇంజనీరింగ్ విద్య యొక్క నాణ్యతను మెరుగుపరచడం టాలెంట్ నెక్స్ట్ లక్ష్యం. ఈ కార్యక్రమం ఇప్పుడు నాస్కామ్ ప్లాట్ఫామ్ అయిన ఫ్యూచర్ స్కిల్స్ ద్వారా నేరుగా విద్యార్థులకు విస్తరించబడుతుంది.
iv. "ఫ్యూచర్ స్కిల్స్" పరిశ్రమ-అకాడెమియా నైపుణ్యం అంతరాన్ని తగ్గిస్తుంది మరియు విద్యార్థులకు కొత్త-వయస్సు సాంకేతికతలను నేర్చుకోవడంలో సహాయపడుతుంది.

Bank of Baroda partners with Gujarat govt to provide MSME loans :


i. మైక్రో, స్మాల్, మీడియం ఎంటర్ప్రైజెస్ (MSME) రంగంలో రుణాల ప్రవాహాన్ని సులభతరం చేయడానికి బ్యాంక్ ఆఫ్ బరోడా గుజరాత్ ప్రభుత్వంతో ఒక అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది.
ii. ఒప్పందం ప్రకారం, గుజరాత్ సింగిల్ విండో క్లియరెన్స్ యాక్ట్ 2017 & 2019 అక్టోబర్ 24 నాటి ఆర్డినెన్స్ నంబర్ 1 ప్రకారం గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్టులు, స్టార్టప్లు, మహిళా పారిశ్రామికవేత్తలు మరియు వెనుకబడిన ప్రాంతాల పారిశ్రామికవేత్తలకు క్రెడిట్ MSMEకి ఇవ్వబడుతుంది.

       Appointments

తెలంగాణ తొలి లోకాయుక్తగా జస్టిస్ చింతపట్టి వెంకటరాములు ప్రమాణస్వీకారం :


i. తెలంగాణ తొలి లోకాయుక్తగా హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ చింతపట్టి వెంకటరాములు, ఉపలోకాయుక్తగా విశ్రాంత జిల్లా జడ్జి వొలిమినేని నిరంజన్రావు రాజ్భవన్లో ప్రమాణస్వీకారం చేశారు.
ii. గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ వారితో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి కేసీఆర్, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్ హాజరయ్యారు.

తెలంగాణ SHRC తొలి ఛైర్మన్గా జస్టిస్ చంద్రయ్య బాధ్యతల స్వీకారం :


i. తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్(ఎస్హెచ్ఆర్సీ) తొలి ఛైర్మన్గా జస్టిస్ జి.చంద్రయ్య బాధ్యతలు స్వీకరించారు.
ii. జ్యుడీషియల్ సభ్యుడిగా విశ్రాంత జిల్లా జడ్జి ఆనందరావు, నాన్ జ్యుడీషియల్ సభ్యుడిగా మహ్మద్ ఇర్ఫాన్ మొయినుద్దీన్ బాధ్యతలు చేపట్టారు. దాదాపు మూడేళ్ల తర్వాత పూర్తిస్థాయిలో కమిషన్ కొలువుదీరింది.
iii. హైదరాబాద్లోని నిలోఫర్ ఆసుపత్రిలో చిన్నారులపై ఔషధ ప్రయోగాలు జరుగుతున్నాయని.. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపించి నిజాలు నిగ్గు తేల్చాలంటూ న్యాయవాది రాపోలు భాస్కర్ ఎస్హెచ్చార్సీ ఛైర్మన్కు ఫిర్యాదు చేశారు. జస్టిస్ చంద్రయ్య అందుకున్న తొలి ఫిర్యాదు ఇది.

విదేశీ వ్యవహారాల శాఖ నూతన కార్యదర్శిగా హర్ష్వర్ధన్ :


i. భారత విదేశీ వ్యవహారాలశాఖ నూతన కార్యదర్శిగా హర్ష్ వర్ధన్ శ్రింగ్లా నియమితులయ్యారు. శ్రింగ్లా ప్రస్తుతం అమెరికాలో భారత రాయబారిగా ఉన్నారు.
ii. 1984 ఐఎఫ్ఎస్ అధికారుల బ్యాచ్కు చెందిన  శ్రింగ్లా జనవరి 29వ తేదీన నూతన బాధ్యతలు స్వీకరిస్తారు. ప్రస్తుతం ఇదే బాధ్యతలు నిర్వర్తిస్తున్న విజయ్ కేశవ్ గోఖలే రెండేళ్ల పదవీకాలం జనవరి 28వ తేదీతో ముగుస్తుంది.

ఫిక్కీ అధ్యక్షురాలిగా సంగీతారెడ్డి :


i. అపోలో హాస్పిటల్స్ జాయింట్ ఎండీ సంగీతారెడ్డి ఫిక్కీ (FICCI -ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ) అధ్యక్షురాలిగా ఎంపికయ్యారు.
ii. ఇప్పటి వరకూ అధ్యక్ష పదవిలో హెచ్ఎస్ఐఎల్ సీఎండీ సందీప్ సోమానీ ఉన్నారు. ఆయన స్థానంలో సంగీతా రెడ్డి  బాధ్యతలు చేపట్టారు. ఆమె ఒక ఏడాది కాలం పాటు ఈ పదవిలో ఉంటారు.
అసోచామ్ కొత్త అధ్యక్షుడిగా నిరంజన్ హీరానందానీ :
i. అసోచామ్ కొత్త అధ్యక్షుడిగా హీరానందానీ గ్రూపు మేనేజింగ్ డైరెక్టర్ (ఎండీ) నిరంజన్ హీరానందానీ నియమితులయ్యారు.
ii. ఇప్పటికే ఈ సమాఖ్యకు అధ్యక్షుడిగా కొనసాగుతున్న వెల్స్పన్ గ్రూపు ఛైర్మన్ బాలక్రిష్ణన్ గోయెంకా స్థానాన్ని ఆయన భర్తీ చేశారు.

బోయింగ్ కొత్త సీఈఓ చైర్ డేవిడ్ :

i. విమాన తయారీ సంస్థ బోయింగ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్, ప్రెసిడెంట్గా బోర్డ్ ఛైర్మన్ చైర్ డేవిడ్ కాల్హోన్ నియమితులయ్యారు.
ii. 737 మ్యాక్స్ సంక్షోభం నుంచి బయట పడేందుకు చీఫ్ ఎగ్జిక్యూటివ్ పదవి నుంచి డెన్నిస్ ములెన్బర్గ్ను తొలగించినట్లు సంస్థ ప్రకటించింది.
iii. ములెన్బర్గ్ తన బాధ్యతల నుంచి ఇప్పుడే తప్పుకుంటున్నా, కాల్హోన్ మాత్రం 2020 జనవరి 13న బాధ్యతలు చేపడతారు. ఈ మధ్యకాలంలో ముఖ్య ఆర్థిక అధికారి గ్రెగ్ స్మిత్ తాత్కాలిక సీఈఓగా వ్యవహరిస్తారు.

Reports/Ranks/Records

South has higher prevalence of mental disorders : study


i. Tamil Nadu, Kerala, Telangana, Karnataka and Andhra Pradesh account for a higher prevalence of mental disorders that manifest primarily during adulthood in depression and anxiety, according to the first comprehensive estimates of disease burden attributable to mental health from 1990 prepared by the India State-Level Disease Burden Initiative and published in the Lancet Psychiatry.
ii. The study finds that roughly one in seven Indians, or 197 million persons, suffered from mental disorders of varying severity in 2017.
iii. Importantly, the contribution of mental disorders to the disability adjusted life year (DALY) — the sum of total years of life lost and years lived with disability — has doubled between 1990 and 2017 increasing from 2.5% to 4.7%.
iv. Prevalence of depressive disorders was highest in Tamil Nadu (top), Kerala, Goa, Telangana in the high SDI (socio-demographic index) State group and Andhra Pradesh in the middle SDI State group.
v. Similarly, anxiety disorders were found to be more common in Kerala in the high SDI State group and Andhra Pradesh in the middle SDI State group.

India world’s 3rd largest producer of Scientific Articles :


i. సైన్స్ మరియు ఇంజనీరింగ్ వ్యాసాల యొక్క ప్రపంచంలో మూడవ అతిపెద్ద ప్రచురణకర్తగా భారతదేశం అవతరించింది, తాజా యుఎస్ నివేదిక ప్రకారం. 2008 లో, భారతదేశం 48,998 సైన్స్ మరియు ఇంజనీరింగ్ కథనాలను ప్రచురించింది.
ii. యుఎస్ నేషనల్ సైన్స్ ఫౌండేషన్ (NSF) సంకలనం చేసిన గణాంకాల ప్రకారం, శాస్త్రీయ వ్యాసాలలో మొత్తం ప్రపంచ ప్రచురణలలో 20.67 శాతం చైనా అగ్రస్థానంలో ఉంది, యుఎస్ తరువాత 16.54 శాతంగా ఉంది.

అవార్డులు

Writer Anand bags Ezhuthachan Award :


i. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ 2019 సంవత్సరానికి ఎజుతాచన్ అవార్డును రచయిత ఆనంద్ (పి. సచిదానందన్) కు తిరువనంతపురంలో అందజేశారు. ఈ అవార్డు విలువ ₹ 5 లక్షలు.
ii. రచయిత ఆల్కూటమ్, మారనాసర్టిఫికేట్, మారుభూమికల్ ఉందకున్నతు వంటి నవలలు రాశారు.

Malayali boy Aditya bags top bravery award :


i. Aditya K. of Kozhikode, Kerala has become the first child from the State to bag the Bharat Award for bravery. The most prestigious of the National Bravery Awards, given away by the Indian Council for Child Welfare.
ii. The Bharat Award has gone to Aditya for rescued 20 people from a bus carrying members of the Calicut University Pensioners’ Forum and their families when it caught fire coming down a steep mountain road.

BOOKS

‘Turbulence and Triumph: The Modi Years’ – By Rahul Agarwal and Bharathi S Pradhan


i. భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు న్యూ ఢిల్లీలో ‘Turbulence and Triumph: The Modi Years’ (అల్లకల్లోలం మరియు విజయం: మోడీ ఇయర్స్) అనే పుస్తకాన్ని విడుదల చేశారు. ఈ పుస్తకాన్ని రాహుల్ అగర్వాల్ మరియు భారతి ఎస్ ప్రధాన్ సంయుక్తంగా రచించారు మరియు ఓం బుక్స్ ఇంటర్నేషనల్ ప్రచురించింది.
ii. ఈ పుస్తకం ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోడీ గుజరాత్ యువకుడిగా ఉన్నప్పటి నుండి భారత ప్రధాని అయ్యే వరకు జీవిత ప్రయాణం గురించి తెలుపుతుంది.

కమిటీలు

మోదీ అధ్యక్షతన పెట్టుబడుల కమిటీ భేటీ :

i. ఆర్థిక వ్యవస్థను తిరిగి వృద్ధి పథంలో పరుగులు పెట్టించాలని ప్రభుత్వం భావిస్తున్న వేళ ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ‘పెట్టుబడులు, వృద్ధి అంశాల కేబినెట్ కమిటీ(CCIG)’ తొలిసారిగా భేటీ అయింది.
ii. ఈ సమావేశానికి కమిటీ సభ్యులైన అమిత్ షా, నితిన్ గడ్కరీ, నిర్మలా సీతారామన్, పీయూష్ గోయెల్ హాజరయ్యారు.

సినిమా వార్తలు

66వ జాతీయ చలనచిత్ర అవార్డులు ప్రదానం :


i. దిల్లీలో 66వ జాతీయ చలన చిత్ర పురస్కారాలను ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అందజేశారు. చలనచిత్ర స్నేహపూర్వక రాష్ట్రంగా అవార్డు అందుకొన్న ఉత్తరాఖండ్ రాష్ట్రానికి ఉపరాష్ట్రపతి ప్రత్యేక అభినందనలు తెలిపారు.
ii. ఉత్తమ నటి - కీర్తి సురేష్ (మహానటి)

iii. ఉత్తమ చిత్రం - గుజరాత్కు చెందిన ‘హెల్లరో’
iv. ఉత్తమ నటుడు - ఆయుష్మాన్ ఖురానా (అంధాధున్), విక్కీ కౌషల్(ఉరి: ది సర్జికల్ స్ట్రైక్)

v. ఉత్తమ సంగీత దర్శకుడిగా - సంజయ్ లీలా భన్సాలీ (పద్మావత్)
vi. ఉత్తమ సామాజికచిత్రం - ప్యాడ్మ్యాన్
vii. ఉత్తమ స్క్రీన్ప్లే రచయితగా - రాహుల్ రవీంద్రన్ (చిలసౌ)
viii. ఉత్తమ తెలుగు చిత్రం – మహానటి
ix. ఉత్తమ ఆడియోగ్రాఫర్ - ఎం.ఆర్.రాజాకృష్ణన్ (రంగస్థలం)
x. అమితాబ్కు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ‘దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు’ను ఈనెల 29న అందజేస్తారు.

ముఖ్యమైన రోజులు

24 December - National Consumer Rights Day (జాతీయ వినియోగదారుల హక్కుల దినోత్సవం)

 
i. జాతీయ వినియోగదారుల హక్కుల దినోత్సవాన్ని ఏటా డిసెంబర్ 24 న దేశవ్యాప్తంగా ఒక నిర్దిష్ట ఇతివృత్తంతో పాటిస్తారు. కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్, 1986 ఈ రోజున అధ్యక్షుడి అంగీకారం పొందింది.
ii. దేశంలో వినియోగదారుల ఉద్యమంలో ఇది చారిత్రాత్మక మైలురాయిగా పరిగణించబడుతుందనడంలో సందేహం లేదు. ఈ రోజు వినియోగదారుల హక్కులు మరియు బాధ్యతల గురించి అవగాహన కల్పిస్తుంది.
iii. ప్రతి సంవత్సరం మార్చి 15ను ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవంగా జరుపుకుంటారు.

క్రీడలు

క్రికెట్కు దక్షిణాఫ్రికా ఫాస్ట్బౌలర్ ఫిలాండర్ వీడ్కోలు :


i. దక్షిణాఫ్రికా ఫాస్ట్బౌలర్ వెర్నన్ ఫిలాండర్ అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు చెప్పనున్నాడు.
ii. 60 టెస్టులాడి 216 వికెట్లు పడగొట్టిన ఫిలాండర్.. 30 వన్డేల్లో 41, ఏడు టీ20ల్లో 4 వికెట్లు తీశాడు. అతను తన తొలి ఏడు టెస్టుల్లోనే 51 వికెట్లు తీసి సత్తా చాటాడు.

బ్యాటింగ్ ర్యాంకింగ్స్లో కోహ్లి. బౌలింగ్లో బుమ్రా. ఆల్రౌండర్లలో బెన్ స్టోక్స్. జట్టులో ఇంగ్లాండ్ అగ్రస్థానం @ ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్


i. ఈ ఏడాది ఐసీసీ వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్ను భారత స్టార్లు విరాట్ కోహ్లి, రోహిత్శర్మ టాప్-2 స్థానాలతో ముగించారు. కోహ్లి (887 పాయింట్లు) అగ్రస్థానం సాధించగా.. రోహిత్ (873 పాయింట్లు) రెండో ర్యాంకులో నిలిచాడు.
ii. ఈ సీజన్లో ఏడాది అన్ని ఫార్మాట్లలో కలిసి 2455 పరుగులతో ప్రపంచ నంబర్వన్గా నిలవగా.. అతనితోపాటు పోటాపోటీగా ఆడిన రోహిత్ 10 సెంచరీలు సహా 2442 పరుగులతో రెండో స్థానం సాధించాడు.
iii. రోహిత్ వన్డేల్లో ఈ ఏడాది అత్యధిక పరుగుల వీరుడిగా నిలిచినప్పటికీ.. ర్యాంకుల్లో మాత్రం కోహ్లి వెనుకే నిలిచాడు. ఒక ఏడాదిలో ఓపెనర్గా అత్యధిక పరుగులు చేసిన శ్రీలంక స్టార్ సనత్ జయసూర్య (2387 పరుగులు) రికార్డును కూడా రోహిత్ బద్దలు కొట్టిన సంగతి తెలిసిందే.
iv. వన్డే బౌలింగ్ ర్యాంకింగ్స్లో బుమ్రా అగ్రస్థానంలో కొనసాగుతుండటం విశేషం. ట్రెంట్ బౌల్ట్ (న్యూజిలాండ్), ముజీబ్ రెహ్మాన్ (అఫ్గానిస్థాన్) తర్వాతి రెండు స్థానాల్లో ఉన్నారు.
v. ఆల్రౌండర్ల జాబితాలో బెన్ స్టోక్స్ (ఇంగ్లాండ్) నంబర్వన్ ర్యాంకులో కొనసాగుతుండగా.. టాప్-10లో భారత ఆటగాళ్లెవ్వరూ లేరు. జట్టు ర్యాంకింగ్స్లో ఇంగ్లాండ్ (125 పాయింట్లు), భారత్ (123) తొలి రెండు స్థానాల్లో కొనసాగుతున్నాయి.

Nadal and Barty named 2019 ITF World Champions :


i. 2019లో సింగిల్స్లో ఆష్లీ బార్టీ మరియు రాఫెల్ నాదల్ ఇంటర్నేషనల్ టెన్నిస్ ఫెడరేషన్ (ITF) ప్రపంచ ఛాంపియన్లుగా ఎంపికయ్యారు.
ii. ఈ అవార్డులు 2020 జూన్ 2న పారిస్లో జరిగే ఐటిఎఫ్ ప్రపంచ ఛాంపియన్లలో ఇవ్వబడతాయి.
>>>>>>>>>>>>>>>>  End of the day  <<<<<<<<<<<<<<<<


కరెంట్ అఫైర్స్ 23 డిసెంబర్ 2019 Monday

    కరెంట్ అఫైర్స్ 23 డిసెంబర్ 2019 Monday   eenadunews 

  Daily Current affairs prepared from Eenadu, The Hindu newspaper and from online current affair websites, Wikipedia etc..

జాతీయ వార్తలు

India constructs Girls’ Hostel for Nepal Armed Police Force :


i. నేపాల్ లోని కీర్తిపూర్ లోని నేపాల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్ స్కూల్ కోసం భారత ప్రభుత్వం బాలికల హాస్టల్ ను నిర్మించింది. డిప్యూటీ చీఫ్ ఆఫ్ మిషన్, భారత రాయబార కార్యాలయం, డాక్టర్ అజయ్ కుమార్ హాస్టల్ భవనాన్ని ప్రారంభించారు.
ii. నేపాల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్ (NPF) స్కూల్ అనేది నేపాల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్ యొక్క ఎపిఎఫ్ వెల్ఫేర్ సర్వీస్ సెంటర్ ఆధ్వర్యంలో సృష్టించబడిన ఒక విద్యాసంస్థ.
iii. ఈ పాఠశాల 2005 లో స్థాపించబడింది మరియు ఇందులో 21 శాతం బాలికలు ఉన్నారు. భారత ప్రభుత్వం 40.42 మిలియన్ల నేపాలీ రూపాయిల సహాయంతో నిర్మించిన కొత్త మౌలిక సదుపాయాలు రెండు అంతస్థుల ఈ బాలికల హాస్టల్ లో 32 గదులు ఉన్నాయి.

తెలంగాణ వార్తలు

కొమురవెల్లి మల్లికార్జునస్వామి ఆలయం @సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మండలం :


i. సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మండల కేంద్రంలోని ఇంద్రకీలాద్రి కొండపై వెలసిన మల్లికార్జునస్వామి (మల్లన్న) కల్యాణం అత్యంత వైభవంగా జరిగింది. ఏటా మార్గశిర మాసం చివరి ఆదివారం మల్లన్న కల్యాణోత్సవం నిర్వహిస్తుంటారు.
ii. ఉదయం స్వామికి బలిజ మేడలమ్మ, గొల్ల కేతమ్మను ఇచ్చి అర్చకులు వివాహం జరిపించారు. వరుడి తరఫున పడిగన్నగారి వంశస్థులు, వధువు తరఫున మహదేవుని వంశస్థులు కల్యాణ క్రతువులో పాల్గొన్నారు.

సైన్స్ అండ్ టెక్నాలజీ

భూమి లోలోతుల్లో మంచు పొర. ఇనుము కణాలతో ఏర్పడినట్లు తేల్చిన అధ్యయనం :


i. భూగోళంలో అత్యంత లోతున ఉండే ‘ఇన్నర్ కోర్’ను ఆవరించి ఓ మంచు పొర ఉందని తాజా అధ్యయనమొకటి గుర్తించింది. సూక్ష్మ ఇనుము కణాలతో ఆ మంచు పొర రూపుదిద్దుకుందని వెల్లడించింది.
ii. భూమి పొరల్లో భూకంప తరంగాలు ప్రవహించినప్పుడు వెలువడే సంకేతాలను అమెరికాలోని టెక్సాస్ విశ్వవిద్యాలయం పరిశోధకులు విశ్లేషించారు.
iii. న్నర్ కోర్ను ఆవరించి మంచు పొర ఉందని ఈ పరిశీలనల ఆధారంగా తేల్చారు. ఔటర్ కోర్లో ద్రవీభవించిన ఇనుము ఇన్నర్ కోర్పై పడిందని.. ఫలితంగా దాదాపు 200 మైళ్ల మందంతో ‘ఇనుము మంచు పొర’  అవతరించిందని వివరించారు.

Defence News

‘ఆపరేషన్ డాల్ఫిన్ నోస్’ @ విశాఖపట్నంలోని కీలక సమాచారాన్ని శత్రు దేశం పాకిస్థాన్కు చేరవేత :


i. ‘ఆపరేషన్ డాల్ఫిన్ నోస్’ దేశవ్యాప్తంగా రక్షణ వర్గాల్లో కలకలం సృష్టిస్తోంది. భారత నౌకాదళానికి చెందిన ఏడుగురు సిబ్బందిని ఈ ఆపరేషన్ ద్వారా పోలీసులు అరెస్టు చేశారు. తూర్పుతీర నావికాదళ కేంద్ర స్థావరమైన విశాఖపట్నంలోని కీలక సమాచారాన్ని శత్రు దేశం పాకిస్థాన్కు వారు చేరవేసినట్లు గుర్తించారు.
ii. పలువురు నావికా దళ అధికారులను హనీట్రాప్ చేయడం ద్వారా మన దేశ సైనిక రహస్యాలను పాకిస్తాన్ నిఘా అధికారులు తెలుసుకున్న అంశంలో మరిన్ని అంశాలు వెల్లడయ్యాయి. గూఢచర్యంపై కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాలు కూపీ లాగుతున్నాయి. నావికాదళ సమాచారంతో పాటు హవాలా ద్వారా నగదు చేతులు మారినట్టు నిఘా వర్గాలకు కీలక ఆధారాలు లభించాయి. పాక్ నిఘా సంస్థ ఐఎస్ఐ హనీట్రాప్ ఉచ్చులో ఇంకా ఎవరెవరు పడ్డారన్నదానిపై ఆరా తీస్తున్నారు.
iii. వాస్తవానికి తూర్పుతీర నౌకాదళం పాక్ వైపు ఉండదు. ముంబయి, కేరళ, గుజరాత్ తీరప్రాంతాలు ఆ దేశానికి దగ్గరగా ఉంటాయి.
iv. అణ్వస్త్ర సామర్థ్యమున్న అరిహంత్ జలాంతర్గామి స్థావరం విశాఖే. భారత అణు త్రిశూల(న్యూక్లియర్ ట్రైడ్) శక్తిలో అది కీలక భాగం. తొలిసారి దేశీయంగా నిర్మిస్తున్న విమాన వాహక నౌక ‘ఐఎన్ఎస్ విక్రాంత్’ను వైజాగ్లోనే నిలిపి ఉంచనున్నారు. హిందూస్థాన్ షిప్యార్డ్ భారత నౌకాదళానికి చెందిన పలు కీలక నౌకలను ఇక్కడే తయారుచేస్తోంది. ఎన్ఎస్టీఎల్ వంటి పరిశోధన కేంద్రాలు, ప్రయోగశాలలు విశాఖలో ఉన్నాయి.
v. ఇటీవల చైనాకు చెందిన పరిశోధన నౌక ఒకటి అండమాన్ నికోబార్ వద్ద భారత జలాల్లోకి చొచ్చుకొచ్చింది. 1965 భారత్-పాక్ యుద్ధ సమయంలో పాకిస్థాన్కు చెందిన పీఎన్ఎస్ ఘాజీ జలాంతర్గామి భారత విమాన వాహక నౌక ఐఎన్ఎస్ విక్రాంత్ను వెతుక్కుంటూ వైజాగ్ తీరానికి చేరింది.

Persons in news

Actor Parineeti Chopra not expelled from ‘Beti Bachao’ drive :



i. హర్యానాలో ‘బేటి బచావో బేటీ పడావో’ ప్రచారం మరియు ఈ ప్రచారంతో ఆమె అనుబంధం రెండేళ్ల క్రితం గడువు ముగిసినందున నటి పరిణీతి చోప్రా తొలగించబడలేదు అని  ప్రతినిధి తెలిపారు.
ii. పౌరసత్వం (సవరణ) చట్టానికి వ్యతిరేకంగా నిరసన తెలిపిన విద్యార్థులపై పోలీసుల అణిచివేతపై విమర్శలు రావడంతో శ్రీమతి చోప్రాను ప్రచారం నుండి తొలగించినట్లు వార్తలు వచ్చాయి.
బేటి బచావో బేటీ పడావో :

iii. ప్రధాని నరేంద్రమోడీ ద్వారా 2015 జనవరి 22న బేటి బచావో బేటీ పడావో యోజన ప్రారంభించబడింది. ఈ పథకం వారిని రక్షించడానికి సహాయం చేస్తుంది మరియు వారు ఉన్నత విద్యను పొందవచ్చు.
iv. బాలికల ఉన్నత విద్య కోసం ప్రభుత్వం ఆర్థిక సహాయం అందిస్తుంది. ఈ పథకం కింద బాలికలు ఉన్నత విద్య పొందుతున్నారు. బాలికల వివాహం కోసం ప్రభుత్వం ఆర్థిక సహాయం అందిస్తోంది. ఈ పథకం యొక్క పెద్ద ప్రయోజనం అమ్మాయిలు మరియు అబ్బాయిల మధ్య వివక్షతను తగ్గించింది.BBBP పథకం కోసం దరఖాస్తు చేసుకోవటానికి వయసు పరిమితి 10 సంవత్సరాల వయస్సు గల ఏ అమ్మాయి ఐనా వారు బేటి బచావో బేటి పడావో యోజన కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

అవార్డులు

Ashokan Marayur received the Kerala Sahithya Academy’s Kanakasree award 2019 :


i. ఈ సంవత్సరం కేరళ సాహిత్య అకాడమీ యొక్క కనకశ్రీ అవార్డును 2017లో ప్రచరింపబడిన ‘పచవీడు’, ముత్తువన్ మాండలికాన్ని రక్షించడంలో అశోకన్ మరయూర్ చేసిన కృషికి రాష్ట్ర గుర్తింపు లభించింది.
ii. ముత్తువన్ మాండలికంలో 30 మరియు మలయాళంలో 100 కి పైగా కవితలు ఉన్నాయి. అన్ని కవితలు అడవిలో లోతుగా నివసించే సమాజ జీవితానికి దగ్గరి సంబంధం కలిగి ఉంటాయి. లిపి (వర్ణమాల) లేని ముత్తువన్ భాష మలయాళం మరియు తమిళంతో దగ్గరి సంబంధం ఉంది.
iii. ‘తీనా’ సంప్రదాయం తన కవితలకు ప్రేరణగా నిలిచిందని ఆయన అన్నారు. మొదటిసారిగా గిరిజన శాఖ నుండి వచ్చిన నిధులను ‘పచవీడు’ ముద్రణ కోసం ఉపయోగించారు.

Indian Archaeologist Padma Bhushan awardee Nagaswamy honoured in Bangladesh :


i. ప్రముఖ పురావస్తు శాస్త్రవేత్త ఆర్.నాగస్వామిని బంగ్లాదేశ్ ఢాకాలో జరిగిన సిల్వర్ జూబ్లీ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆఫ్ ఆర్ట్లో సత్కరించబడ్డారు. అతను భారతీయ చరిత్రకారుడు, పురావస్తు శాస్త్రవేత్త మరియు ఎపిగ్రాఫిస్ట్.
ii. తమిళనాడు పురావస్తు శాఖ వ్యవస్థాపక-డైరెక్టర్గా పనిచేశారు. 2018లో ఆయనకు భారతదేశపు మూడవ అత్యున్నత పౌర పురస్కారం పద్మ భూషణ్ లభించింది.

సినిమా వార్తలు

యాసిడ్ దాడి బాధితురాలు లక్ష్మీ అగర్వాల్ జీవితకథతో దీపిక పదుకొనె ‘ఛపాక్’ చిత్రం :



i. యాసిడ్ దాడి బాధితురాలు లక్ష్మీ అగర్వాల్ జీవితకథతో తెరకెక్కుతున్న చిత్రం ‘ఛపాక్’. ఇందులో ప్రధాన పాత్రలో దీపిక పదుకొనె, విక్రాంత్ మాస్సే నటించారు.
ii. మేఘనా గుల్జార్ దర్శకత్వం వహించబోయే భారతీయ హిందీ భాషా నాటక చిత్రం ‘ఛపాక్’ ఫాక్స్ స్టార్ స్టూడియోస్ సహకారంతో ఆమెతో పాటు దీపికా పదుకొనే నిర్మించారు.
లక్ష్మీ అగర్వాల్ :
iii. 2005 లో 15 ఏళ్ళ వయసులో లక్ష్మీ అగర్వాల్ (జననం 1 జూన్ 1990), నదీమ్ ఖాన్ (గుడ్డు) అనే 32 ఏళ్ల వ్యక్తి  దిల్లిలోని ఓ బస్టాప్లో బస్సు కోసం ఎదురు చూస్తుండగా ఓ వ్యక్తి తనను పెళ్లి చేసుకోలేదున్న ఒకే ఒక్క కారణంతో ఆమెపై యాసిడ్ పోసి పరారయ్యాడు. ఈ దాడి జరిగిన తర్వాత సుప్రీంకోర్టులో యాసిడ్ బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది.
iv. ఒక వ్యక్తి కారణంగా చితికిపోయిన ఓ మహిళ జీవిత కథ ఆధారంగా తెరకెక్కబోతున్న ఈ మూవీకి దీపికా నిర్మాతగా వ్యవహరించడానికి ముందుకొచ్చింది.. ఈ సినిమా ఒక మహిళ ఆశ, ఆశయాలకు అనుగుణంగా సాగే కథ.
v. ఆమె యాసిడ్ హింస మరియు యాసిడ్ అమ్మకాలకు వ్యతిరేకంగా ప్రచారం చేసిన స్టాప్ సేల్ యాసిడ్ వ్యవస్థాపకురాలు. లక్ష్మీ ఈ ప్రచారాన్ని #StopSaleAcid తో ప్రారంభించింది, ఇది దేశవ్యాప్తంగా మద్దతును పొందింది.
vi. స్టాప్ సేల్ యాసిడ్ కోసం ఆమె ఇటీవల అంతర్జాతీయ మహిళా సాధికారత అవార్డు 2019 ను IWES, మహిళా మరియు శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ, తాగునీరు మరియు పారిశుద్ధ్య మంత్రిత్వ శాఖ మరియు యునిసెఫ్ నుండి అందుకుంది.
vii. ఆమె భారతదేశంలో యాసిడ్ దాడుల నుండి బయటపడినవారికి సహాయపడటానికి అంకితం చేయబడిన NGO చన్వ్ ఫౌండేషన్ యొక్క మాజీ డైరెక్టర్. యుఎస్ ప్రథమ మహిళ మిచెల్ ఒబామా చేత 2014 అంతర్జాతీయ మహిళా ధైర్యం అవార్డును లక్ష్మీ అందుకున్నారు. ఆమె NDTV ఇండియన్ ఆఫ్ ది ఇయర్గా కూడా ఎంపికైంది.

మరణాలు

Sahitya Akademi winner Nanjundan found dead :


i. ప్రముఖ అనువాదకుడు, సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత జి. నంజుందన్ (58) ఆయన నివాసంలో శవమై కనిపించారు. డాక్టర్ నంజుందన్ నాలుగు రోజుల క్రితం గుండెపోటుతో మరణించాడని పోలీసులు అనుమానిస్తున్నారు.
ii. కన్నడ నుండి తమిళం వరకు డజనుకు పైగా పుస్తకాలను అనువదించినందుకు గుర్తింపు పొందాడు మరియు లెక్చరర్‌గా పనిచేస్తున్నాడు.

ముఖ్యమైన రోజులు

23 డిసెంబర్ : కిసాన్ దివాస్ / జాతీయ రైతు దినోత్సవం


i. మాజీ ప్రధాని చౌదరి చరణ్ సింగ్ జయంతి సందర్భంగా కిసాన్ దివాస్ లేదా భారతదేశంలో రైతు దినోత్సవం లేదా జాతీయ రైతు దినోత్సవం డిసెంబర్ 23 న దేశవ్యాప్తంగా జరుపుకుంటారు.
ii. ఈ రోజున వ్యవసాయం మరియు ప్రజలకు విద్య మరియు జ్ఞానాన్ని అందించడానికి దాని ప్రాముఖ్యతపై వివిధ కార్యక్రమాలు, సెమినార్లు, విధులు మరియు పోటీలు నిర్వహిస్తారు.
iii. రైతు సంస్కరణల కోసం వివిధ బిల్లులను రూపొందించడం మరియు అమలు చేయడం ద్వారా చౌదరి చరణ్ సింగ్ భారత వ్యవసాయ రంగంలో కీలక పాత్ర పోషించారు.
iv. సమాజానికి రైతులు అందించే కృషి యొక్క ప్రాముఖ్యతను మరియు ఒక దేశం యొక్క మొత్తం ఆర్థిక మరియు సామాజిక అభివృద్ధిని అర్థం చేసుకోవడానికి దేశ పౌరులలో అవగాహన పెంచడానికి ఈ రోజు జరుపుకుంటారు.
v. జాతీయ రైతు దినోత్సవాన్ని జరుపుకోవడం ద్వారా, రైతులకు వివిధ కార్యకలాపాలను నిర్వహించడం ద్వారా దేశవ్యాప్తంగా రైతులను ప్రోత్సహించడం కూడా ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది, విజేతలకు బహుమతులు అందజేస్తారు.

చరణ్ సింగ్ 117వ జయంతి : 1902 డిసెంబరు 23


i. చౌదరి చరణ్ సింగ్ (1902 డిసెంబరు 23 - 1987 మే 29) భారతదేశానికి 5వ ప్రధానమంత్రిగా 1979 జూలై 28 నుండి 1980 జనవరి 14 వరకు తన సేవలనందించాడు. చరిత్రకారులు, ప్రజలు తరచూ అతనిని 'భారతదేశపు రైతుల విజేత' గా గుర్తించారు
ii. చరణ్ సింగ్ 1902లో ఉత్తర ప్రదేశ్ రాష్ట్రము, మీరట్ జిల్లాలోని నూర్పూర్ గ్రామంలోని జాట్ కులంలో జన్మించాడు. బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో రెండు సార్లు జైలు పాలయ్యాడు. భారత స్వాతంత్ర్యానికి ముందు అతను 1937 లో యునైటెడ్ ప్రొవిన్సెస్ శాసనసభలో సభ్యునిగా ఉన్నాడు.
iii. 1950లలో ఉత్తరప్రదేశ్ లోని అప్పటి ముఖ్యమంత్రి పండిట్ గోవింద్ వల్లబ్ పంత్ పర్యవేక్షణలో భారతదేశంలో ఏ రాష్ట్రంలోనూ జరగని అత్యంత విప్లవాత్మక భూ సంస్కరణల చట్టాలను రూపొందించడంలోను, వాటిని ఆమోదించడంలోనూ చరణ్ సింగ్ మంచి గుర్తింపు పొందాడు. మొదట పార్లమెంటరీ సెక్రటరీ గాను, తరువాత భూసంస్కరణలకు బాధ్యత వహించే రెవెన్యూ మంత్రిగాను అతను ఈ కార్యాలను సాధించాడు.
iv. 1959లో భారతదేశంలో తిరుగులేని నాయకుడు, భారత ప్రధానమంత్రి పండిట్ జవహర్ లాల్  నెహ్రూ సామ్యవాద, సముదాయవాద భూ విధానాలను నాగపూర్ లో జరిగిన కాంగ్రెస్ సెషన్ లో బహిరంగంగా వ్యతిరేకించడం ద్వారా అందరి దృష్టిని ఆకర్షించాడు.
v. చరణ్ సింగ్ 1967 ఏప్రిల్ 1న కాంగ్రెస్ నుండి వైదొలగి, ప్రతిపక్ష పార్టీలోనికి చేరాడు. అపుడు ఉత్తర ప్రదేశ్ లో మొదటి కాంగ్రెసేతతర ముఖ్యమంత్రి అయ్యాడు. జనతా కూటమిలో ప్రధాన భాగమైన భారతీయ లోక్దళ్ పార్టీ నాయకునిగా, అతను 1977 లో జయప్రకాష్ నారాయణ్ ప్రధానమంత్రిగా మొరార్జీ దేశాయ్ ను  ఎంపిక చేసాడు.
vi. 1977 లోక్సభ ఎన్నికల్లో, జనతా పార్టీతో కలసి ఎన్నికలలో పాల్గొనడానికి కొద్ది నెలల ముందు వరకు, అతను 1974 నుండి ఒంటరిగానే పోరాడుతూ ఉన్నాడు. రాజ్ నారాయణ చేసిన కృషి కారణంగా ఆయన 1979 లో ప్రధాని అయ్యాడు. రాజ్ నారాయణ్ జనతా పార్టీ (సెక్యులర్) ఛైర్మన్గా, చరణ్ సింగ్ ను ప్రధానమంత్రిగా నియమించాడు.
vii. ఉత్తరప్రదేశ్ లో 1967 లో ఆయన ముఖ్యమంత్రిగా ఉండడానికి కూడా అతను సహాయం చేసాడు. అయితే, "ఇందిరా గాంధీ కాంగ్రెస్ పార్టీ" ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకున్నప్పుడు కేవలం 24 వారాల తరువాత ఆయన పదవికి రాజీనామా చేశాడు.
viii. 1979 జూలై 28 నుండి 1980 జనవరి 14 వరకు చరణ్ సింగ్ భారతదేశ 5వ ప్రధానమంత్రిగా పనిచేశాడు. ప్రధానమంత్రి కంటే ముందు ఈయన ఉప ప్రధానమంత్రిగా కూడా పనిచేశాడు. చరణ్ సింగ్ ప్రధానిగా ఉన్న కాలములో లోక్సభ ఎన్నడూ సమావేశం కాలేదు.
ix. లోక్ సభ సమావేశం ప్రారంభమవుతుందనగా, ముందురోజు ఈయన ప్రభుత్వానికి మద్దతునిచ్చిన కాంగ్రెసు పార్టీ మద్దతు ఉపసంహరించుకోవడంతో భారతీయ లోక్దళ్ ప్రభుత్వం కూలిపోయింది. చరణ్ సింగ్ పదవికి రాజీనామా చేశాడు. 6 నెలల అనంతరం లోక్సభకు మళ్ళీ ఎన్నికలు జరిగాయి. చరణ్ సింగ్ 1987 లో తన మరణం వరకు లోక్దళ్ పార్టీకి నాయకత్వం వహిస్తూ ప్రతిపక్షంలో ఉన్నాడు.
x. 1937లో తన 34వ యేట ఉత్తర ప్రదేశ్ శాసనసభకు ఛత్రౌలి నియోజకవర్గం నుండి ఎన్నికయ్యాడు. ఆ నియోజక వర్గానికి 1946, 1952, 1962 , 1967 లలో ప్రాతినిధ్యం వహించాడు. 1938 లో అతను అసెంబ్లీలో వ్యవసాయ ఉత్పత్తుల మార్కెట్ బిల్లును ప్రవేశపెట్టాడు. ఇది 1938 మార్చి 31న హిందూస్థాన్ టైమ్స్ పత్రికలో ప్రచురితమైనది.
xi. వ్యాపారులు, రైతుల ప్రయోజనాలను కాపాడడానికి ఈ బిల్లు ఉద్దేశించబడింది. భారతదేశంలో చాలా రాష్ట్రాలచే ఈ బిల్లు తరువాత ఆమోదించబడింది. 1940 లో పంజాబ్ ఈ బిల్లును ఆమోదించిన మొదటి రాష్ట్రం అయినది.
xii. 946లో గోవింద వల్లభ్ పంత్ మంత్రివర్గములో పార్లమెంటరీ కార్యదర్శియై రెవిన్యూ, ఆరోగ్య, సాంఘిక పరిశుభ్రత, న్యాయ, సమాచర శాఖలలో పనిచేశాడు. 1951 జూన్ లో రాష్ట్రములో కేబినెట్ మంత్రిగా నియమితుడై న్యాయ, సమాచార శాఖ మంత్రిగా ఆ తరువాత 1952లో డా.సంపూర్ణానంద్ మంత్రివర్గములో రెవిన్యూ, వ్యవసాయ శాఖా మంత్రిగా పనిచేశాడు. 1959 ఏప్రిల్ లో మంత్రి పదవికి రాజీనామా చేశాడు.
xiii. చరణ్సింగ్ 1960లో హోమ్, వ్యవసాయశాఖా మంత్రిగా, 1962-63లో వ్యవసాయ , అటవీ శాఖా మంత్రిగా పనిచేశాడు. 1965లో వ్యవసాయ శాఖను విడిచి 1966లో స్థానిక స్వయంపరిపాలనా శాఖకు మంత్రిగా బాధ్యతలు స్వీకరించాడు.
xiv. 1967లో చరణ్ సింగ్ కాంగ్రెస్ పార్టీని విడిచిపెట్టి భారతీయ క్రాంతి దళ్ పార్టీని స్థాపించాడు. 1967లో రాజ్నారాయణ్, రామ్ మనోహర్ లోహియాల మద్దతుతో అతను ఉత్తర ప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యాడు. కాంగ్రెసు పార్టీ చీలిక తర్వాత, 1970 ఫిబ్రవరిలో కాంగ్రెసు మద్దతుతో ఉత్తర ప్రదేశ్ రాష్ట్రానికి రెండవసారి ముఖ్యమంత్రయ్యాడు. కానీ 1970 అక్టోబరు 2 న కేంద్రం ఈయన ప్రభుత్వాన్ని రద్దుచేసి రాష్ట్రములో రాష్ట్రపతి పాలన విధించింది. ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా చరణ్సింగ్ భూసంస్కరణలు చేపట్టాడు. 1960 లాండ్ హోల్డింగ్ చట్టాన్ని తీసుకుని వచ్చాడు.
xv. 1975 లో ఇందిరాగాంధీచే జైలుకు పంపబడ్డాడు. ఆమె అత్యవసర పరిస్థితి (ఎమర్జెన్సీ) విధించి రాజకీయ ప్రత్యర్థులను జైలుకు పంపించింది. 1977 సార్వత్రిక ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది. ప్రత్యర్థి పార్టీకి చౌదరి చరణ్ సింగ్ సీనియర్ నాయకునిగా పదవిలోకి వచ్చాడు. అతను మొరార్జీ దేశాయి ప్రధానమంత్రిగా ఉన్న జనతా పార్టీ ప్రభుత్వంలో ఉప ప్రధానమంత్రిగా, హోం మంత్రిగా పనిచేసాడు.
xvi. రైతు బంధుగా పేరుతెచ్చుకున్న చరణ్ సింగ్ సమాధిని కిసాన్ ఘాట్ అని పిలుస్తారు. అతని జన్మదినం డిసెంబరు 23 న కిసాన్ దివస్ (జాతీయ రైతు దినోత్సవం) గా భారతదేశంలో జరుపుతారు.అతని మూడవ వర్థంతి (1990, మే 29) సందర్భంగా భారత ప్రభుత్వం అతని చిత్రంతో తపాలా బిళ్లను విడుదలచేసింది.
xvii. ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని లక్నో నగరంలో ఉన్న అమృత్ సర్ విమానాశ్రయానికి " చౌదరి చరణ్ సింగ్ అంతర్జాతీయ విమానాశ్రయం"గా నామకరణం చేసారు. మీరట్ లోని విశ్వవిద్యాలయానికి "చౌధురి చరణ్ సింగ్ విశ్వవిద్యాలయం"గా పేరు పెట్టారు. ఎటావా జిల్లాలోని కళాశాలకు " చౌదరి చరణ్ సింగ్ పోస్టు గ్రాడ్యుయేట్ కళాశాల"గా నామకరణం చేసారు.

P.V. నరసింహారావు 15 వ వర్ధంతి  : డిసెంబర్ 23, 2004


i. పాములపర్తి వేంకట నరసింహారావు (జూన్ 28, 1921 - డిసెంబర్ 23, 2004) భారతదేశ ప్రధానమంత్రి పదవిని అధిష్టించిన మొదటి దాక్షిణాత్యుడు, ఒకేఒక్క తెలుగువాడు. పీవీ గా ప్రసిద్ధుడైన ఆయన బహుభాషావేత్త, రచయిత. భారత ఆర్ధిక వ్యవస్థలో విప్లవాత్మకమైన సంస్కరణలకు బీజంవేసి, కుంటుతున్న వ్యవస్థను తిరిగి పట్టాలెక్కించిన ఘనత సొంతం చేసుకున్న వ్యక్తి.
ii. 1957 లో శాసనసభ్యుడిగా రాజకీయజీవితం ఆరంభించిన పివి రాష్ట్రమంత్రిగా, ముఖ్యమంత్రి గానే కాకుండా కేంద్ర రాజకీయాలలో కూడా ప్రవేశించి ప్రధానమంత్రి పదవిని చేపట్టాడు. కాంగ్రెస్ నేతృత్వంలో తగిన సంఖ్యాబలం లేని మైనారిటీ ప్రభుత్వాన్ని పూర్తికాలం పాటు నడిపించడం అతని ఘనకార్యం.
iii. తెలంగాణ లోని వరంగల్ జిల్లా, నర్సంపేట మండలం లక్నేపల్లి గ్రామంలో 1921 జూన్ 28 న రుక్నాబాయి, సీతారామరావు దంపతులకు పీవీ జన్మించాడు. వరంగల్లు జిల్లాలోనే ప్రాథమిక విద్య మొదలుపెట్టాడు. తరువాత కరీంనగర్ జిల్లా భీమదేవరపల్లి మండలం వంగర గ్రామానికి చెందిన పాములపర్తి రంగారావు, రుక్మిణమ్మలు ఆయనను దత్తత తీసుకోవడంతో అప్పటినుండి పాములపర్తి వేంకట నరసింహారావు అయ్యాడు.
iv. 1938 లోనే హైదరాబాదు రాష్ట్ర కాంగ్రెసు పార్టీలో చేరి నిజాము ప్రభుత్వ నిషేధాన్ని ధిక్కరిస్తూ వందేమాతరం గేయాన్ని పాడాడు. దీంతో తాను చదువుకుంటున్న ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి ఆయనను బహిష్కరించారు. దాంతో ఓ మిత్రుడి సాయంతో నాగపూరు విశ్వవిద్యాలయంలో చేరి నాగపూరులో ఆ మిత్రుడి ఇంట్లోనే ఉంటూ 1940 నుండి 1944 వరకు LLB చదివాడు.
v. బూర్గుల శిష్యుడిగా కాంగ్రెసు పార్టీలో చేరి అప్పటి యువ కాంగ్రెసు నాయకులు మర్రి చెన్నారెడ్డి, శంకరరావు చవాన్, వీరేంద్ర పాటిల్ లతో కలిసి పనిచేసాడు. 1951లో అఖిల భారత కాంగ్రెసు కమిటీలో సభ్యుడిగా స్థానం పొందాడు. నరసింహారావు తన రాజకీయ జీవితాన్ని జర్నలిస్టుగా ప్రారంభించి, కాకతీయ పత్రిక నడిపి అందులో జయ అనే మారుపేరుతో 1950 ప్రాంతాలలో వ్రాసేవాడు. బహుభాషలు నేర్చి ప్రయోగించాడు.
vi. 1957 లో మంథని నియోజక వర్గం నుండి శాసనసభకు ఎన్నికవడం ద్వారా పీవీ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రస్థాయి పదవీ రాజకీయాల్లోకి అడుగుపెట్టాడు. ఇదే నియోజకవర్గం నుండి వరుసగా నాలుగు సార్లు శాసన సభ్యునిగా ఎన్నికయ్యాడు. 1962 లో మొదటిసారి మంత్రి అయ్యాడు. 1962 నుండి 1964 వరకు న్యాయ, సమాచార శాఖ మంత్రి గాను, 1964 నుండి 67 వరకు న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి, 1967 లో వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి, 1968-71 కాలంలో న్యాయ, సమాచార శాఖ మంత్రి పదవులు నిర్వహించాడు.
vii. వివాదాల జోలికి పోని ఆయన వ్యక్తిత్వం, పార్టీలోని ఏ గ్రూపుకూ చెందని ఆయన రాజకీయ నేపథ్యం ఆయనకు 1971 సెప్టెంబర్ 30 న ముఖ్యమంత్రి పదవిని సాధించిపెట్టాయి. పీఠం ఎక్కీ ఎక్కగానే పార్టీలో అసమ్మతి తలెత్తింది. ఈ విషయమై అధిష్టానంతో చర్చించేందుకు ఢిల్లీ, హైదరాబాదుల మధ్య తిరగడంతోటే సరిపోయేది. తాను ముఖ్యమంత్రిగా ఉండగా భూసంస్కరణలను అమలుపరచేందుకు చర్యలు తీసుకున్నాడు.. ఇందువలన భూస్వామ్య వర్గాలు తిరగబడ్డాయి.
viii. పట్టణ భూ గరిష్ఠ పరిమితి చట్టం తెచ్చింది కూడా పీవీయే. 1972 లో పీవీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు శాసనసభ ఎన్నికలలో 70% వెనుకబడిన వారికిచ్చి చరిత్ర సృష్టించాడు. పీవీని తెలంగాణా నాయకుల పక్షపాతిగా ఆంధ్ర, రాయలసీమ నాయకులు ఆరోపించారు. ఉద్యమంలో భాగంగా ఆ ప్రాంత మంత్రులలో చాలామంది రాజీనామా చేసారు.
ix. రాజీనామా చేసిన మంత్రుల స్థానంలో 1973 జనవరి 8న కొత్త మంత్రులను తీసుకుని పీవీ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ చేసాడు.అయితే పార్టీ అధిష్టానం ఆలోచన పూర్తిగా భిన్నంగా ఉంది. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ జరిగిన మరునాడే కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాన్ని రద్దు చేసి, శాసనసభను సుప్తచేతనావస్థలో ఉంచి, రాష్ట్రపతి పాలనను విధించింది.
x. మొదటిసారిగా లోక్సభకు హన్మకొండ స్థానం నుండి ఎన్నికయ్యాడు. రెండోసారి మళ్ళీ హన్మకొండ నుండే లోక్సభకు ఎన్నికయ్యాడు. మూడోసారి ఎనిమిదో లోక్సభకు మహారాష్ట్ర లోని రాంటెక్ నుండి ఎన్నికయ్యాడు. మళ్ళీ రాంటెక్ నుండే తొమ్మిదో లోక్సభకు ఎన్నికయ్యాడు. నంద్యాల లోక్సభ నియోజకవర్గానికి 1991లో జరిగిన ఉప ఎన్నికలో ఎన్నికై పదో లోక్సభలో అడుగుపెట్టాడు.
xi. 1980- 1989 మధ్య కాలంలో కేంద్రంలో హోంశాఖ, విదేశవ్యవహారాల శాఖ, మానవ వనరుల అభివృద్ధి శాఖ లను వివిధ సమయాల్లో నిర్వహించాడు. 1983 అలీన దేశాల శిఖరాగ్ర సమావేశంలో స్పానిష్ లో మాట్లాడి క్యూబా అధ్యక్షుడు ఫీడెల్ కాస్ట్రోను అబ్బురపరచాడు.
xii. పీవీ జాతీయ విజ్ఞాన కేంద్రం ప్రారంభోత్సవంలో ప్రసంగిస్తూ (1992) ప్రధానమంత్రి పదవి అనుకోకుండా వరించింది. 1991 సార్వత్రిక ఎన్నికలలో పోటీ చెయ్యకుండా, దాదాపుగా రాజకీయ సన్యాసం తీసుకున్నాడు. ఆ సమయంలో రాజీవ్ గాంధీ హత్య కారణంగా కాంగ్రెసు పార్టీకి నాయకుడు లేకుండా పోయాడు. ఆ సమయంలో తనకంటూ ప్రత్యేక గ్రూపు లేని పీవీ అందరికీ ఆమోదయోగ్యుడుగా కనపడ్డాడు.
xiii. ఆంధ్ర ప్రదేశ్ లోని నంద్యాల లోక్సభ నియోజకవర్గం నుండి గంగుల ప్రతాపరెడ్డిచే రాజీనామా చేయించి, అక్కడి ఉప ఎన్నికలో గెలిచి, పీవీ లోక్సభలో అడుగుపెట్టాడు. సాటి తెలుగువాడు ప్రధాని ఆవుతున్నాడని నంద్యాల పార్లమెంట్ సీటుకు జరిగిన ఉప ఎన్నికలలో ఎన్.టి.రామారావు ఆయనపై తెలుగు దేశం అభ్యర్థిని పోటీలో పెట్టలేదు.
xiv. ఐదు సంవత్సరాల పరిపాలనా కాలాన్ని పూర్తి చేసుకున్న ప్రధానమంత్రుల్లో నెహ్రూ, గాంధీ కుటుంబంబాల బయటి మొదటి వ్యక్తి, పీవీయే. మైనారిటీ ప్రభుత్వానికి నేతృత్వం వహిస్తూ కూడా, ఇది సాధించడం ఆయన రాజనీతికి, చాకచక్యానికి నిదర్శనం. అందుకే ఆయన్ని అపర చాణక్యుడు అని అన్నారు.
xv. దివాలా తీసే స్థాయికి చేరుకున్న ఆర్థికవ్యవస్థకు పునరుజ్జీవం కల్పించేందుకు, సంస్కరణలకు బీజం వేసాడు. తన ఆర్థికమంత్రి, మన్మోహన్ సింగ్కు స్వేచ్ఛనిచ్చి, సంస్కరణలకు ఊతమిచ్చాడు. పీవీని ఆర్థిక సంస్కరణల పితామహుడిగా పేర్కొంటారు.
xvi. పంజాబు తీవ్రవాదాన్ని విజయవంతంగా అణచివేసిన ఘనత పీవీ ప్రభుత్వానిదే. కాశ్మీరు తీవ్రవాదులు ప్రముఖులను అపహరించినపుడు వారి డిమాండ్లకు లొంగకుండా ప్రముఖులను విడిపించిన ఘనత కూడా పీవీదే. ఇజ్రాయిల్తో దౌత్య సంబంధాలు, తీవ్రవాదానికి పాకిస్తాను ఇస్తున్న ప్రోత్సాహాన్ని బయటపెట్టి ప్రపంచదేశాల్లో చర్చకు పెట్టడం, ఆగ్నేయాసియా దేశాలతో సంబంధాలు పెంచుకోవడం, చైనా, ఇరానులతో సంబంధాలు పెంచుకోవడం వంటివి విదేశీ సంబంధాల్లో పీవీ ప్రభుత్వం సాధించిన అనేక విజయాల్లో కొన్ని.
xvii. 1998లో వాజపేయి ప్రభుత్వం జరిపిన అణుపరీక్షల కార్యక్రమాన్ని మొదలుపెట్టింది పీవీ ప్రభుత్వమే. ఆయన కాలంలోనే బాంబు తయారయింది. 1992 డిసెంబర్ 6 న అయోధ్యలో బాబరీ మసీదును కూలగొట్టిన సంఘటన ఆయన ఐదేళ్ళ పాలన లోనూ జరిగిన అత్యంత పెద్ద సంఘటన. దాన్ని కాపాడలేక పోవడం ఆయన వైఫల్యాల్లో అతిపెద్దది.
xviii. పార్లమెంటులో మెజారిటీ సాధనకై జార్ఖండ్ ముక్తి మోర్చా సభ్యులకు లంచాలు ఇచ్చాడనే ఆరోపణ. నేరస్తుడిగా కోర్టుచే నిర్ధారించబడిన మొట్టమొదటి మాజీ ప్రధానమంత్రి, పీవీ. అయితే ఢిల్లీ హైకోర్టు ఈ కేసును కొట్టివేసింది.
xix. సెయింట్ కిట్స్ ఫోర్జరీ కేసు: 1989 లో బోఫోర్స్ అవినీతిపై రాజీవ్ గాంధీతో విభేదించి, ప్రభుత్వం నుండి, పార్టీ నుండి బయటకు వచ్చేసిన వి.పి.సింగ్ను అప్రదిష్ట పాల్జేసేందుకు, కుమారుడు అజేయ సింగ్ ను ఇరికించేందుకు ఫోర్జరీ సంతకాలతో సెయింట్ కిట్స్ ద్వీపంలో ఒక బ్యాంకులో ఎక్కౌంటు తెరిచిన కేసది.
xx. లఖుభాయి పాఠక్ కేసు : లఖుభాయి పాఠక్ అనే పచ్చళ్ళ వ్యాపారి ప్రభుత్వంతో ఏదో ఒప్పందాలు కుదుర్చుకొనేందుకై పీవీకి సన్నిహితుడైన చంద్రస్వామికి డబ్బిచ్చానని ఆరోపించాడు.
xxi. ఈ మూడూ కాక స్టాక్ మార్కెట్ కుంభకోణం నిందితుడు హర్షద్ మెహతా తాను సూట్కేసుల్తో పీవీకి డబ్బిచ్చానని ఆరోపించాడు. అయితే అవి నిరాధారాలని తేలింది.
xxii. ఆయన రచనల్లో ప్రఖ్యాతి చెందినది ఇన్సైడర్ అనే ఆయన ఆత్మకథ. లోపలిమనిషిగా ఇది తెలుగులోకి అనువాదమయింది. నరసింహారావు బహుభాషాకోవిదుడు. ఇంగ్లీషు, హిందీయే కాక అనేక దక్షిణాది భాషలు, మొత్తం 17 భాషలు వచ్చు.
    రచనలు :
xxiii. సహస్రఫణ్ : విశ్వనాథ సత్యనారాయణ వ్రాసిన వేయిపడగలు కు హిందీ అనువాదం. ఈ పుస్తకానికై పీవీకి కేంద్ర సాహిత్య అకాడమీ బహుమతి వచ్చింది.
xxiv. అబల జీవితం : పన్ లక్షత్ కోన్ ఘతో అనే మరాఠీ పుస్తకానికి తెలుగు అనువాదం.
xxv. ఇన్సైడర్ : ఆయన రచించిన ఆత్మకథాత్మక నవల. దీనిలోని ఘట్టాలకు పీవీ ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిపోయేంతవరకూ ఆయన జీవితఘట్టాలకు చాలా చాలా పోలిక ఉంది. తెలుగులోకి లోపలి మనిషి గా అనువాదం అయింది. ప్రముఖ రచయిత్రి "జయ ప్రభ" కవిత్వాన్ని ఆంగ్లంలోకి అనువదించాడు. తెలంగాణా సాయుధ పోరాట నేపథ్యంలో "గొల్ల రామవ్వ" కథ విజయ కలంపేరుతో కాకతీయ పత్రికలో 1949లో ప్రచురితమైంది.
xxvi. భారత మాజీ ప్రధానులందరి ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు న్యూఢిల్లీలో జరగడం, వారికి అక్కడ ఒక స్మృతి చిహ్నం ఏర్పాటుచేయడం సాధారణంగా జరిగేది. కానీ అప్పటి కాంగ్రెస్ అధ్యక్షురాలు, యూపీఏ సమన్వయకర్త సోనియాగాంధీకి ఇష్టం లేకపోవడంతో అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి పీవీ నరసింహారావు కుటుంబసభ్యులను ఢిల్లీలో కాకుండా పీవీ అంత్యక్రియలు హైదరాబాద్లో జరగడానికి ఒప్పించారు.
xxvii. పీవీ నర్సింహారావు స్మృత్యర్ధం హైదరాబాదులో భారతదేశంలోనే అతిపెద్ద ఫ్లై ఓవర్ కు పీవీ నర్సింహారావు ఎక్స్ప్రెస్ వే అని పేరుపెట్టారు. ఇది 19.10.2009న ప్రారంభం అయ్యింది. మెహదీపట్నం నుంచి ఆరాంఘర్ వరకు నిర్మించారు. శంషాబాద్ విమానాశ్రయం ప్రయాణీకులను దృష్టిలో ఉంచుకొని దీనిని నిర్మించారు.
xxviii. పీవీ జీవితచరిత్ర పై ‘హాఫ్ లయన్’ అనే పుస్తకం వినయ్ సీతాపతి రాశాడు. ఇది 2016లో విడుదలైంది.

క్రీడలు

2019లో అన్ని ఫార్మాట్లలో కలిపి ఓపెనర్గా రోహిత్ రికార్డు  :

i. ఈ ఏడాది అన్ని ఫార్మాట్లలో కలిపి ఓపెనర్గా రోహిత్ చేసిన పరుగులు. 22 ఏళ్ల కిందట శ్రీలంక మాజీ ఆటగాడు సనత్ జయసూర్య (2387 పరుగులు 1997లో) నెలకొల్పిన రికార్డును అతడు తిరగరాశాడు.
ii. ఈ ఏడాది అన్ని ఫార్మాట్లలో కలిసి కోహ్లి 2455 పరుగులు చేశాడు. రెండో స్థానంలో రోహిత్ (2442) ఉన్నాడు. ఆ తర్వాత పాకిస్థాన్ ఆటగాడు బాబర్ అజామ్ (2082) నిలిచాడు. అయితే వన్డేల్లో మాత్రం రోహిత్ (1490)దే అగ్రస్థానం.
 >>>>>>>>>>>>>>>>  End of the day  <<<<<<<<<<<<<<<<

 

✍ కరెంట్ అఫైర్స్ 22 డిసెంబర్ 2019 Sunday ✍ eenadu news

✍  కరెంట్ అఫైర్స్ 22 డిసెంబర్ 2019 Sunday ✍

  Daily Current affairs prepared from Eenadu, The Hindu newspaper and from online current affair websites, Wikipedia etc..

జాతీయ వార్తలు

ఇక జాతీయ జనాభా పట్టిక. ప్రజల వేలి ముద్రల సేకరణ. అందరికీ గుర్తింపు కార్డులు :

 
i. పౌరసత్వ సవరణ చట్టం తీసుకొచ్చిన మోదీ ప్రభుత్వం వచ్చే వారం మరో కీలక నిర్ణయం తీసుకోనుంది. దేశవ్యాప్తంగా జాతీయ జనాభా పట్టిక (నేషనల్ పాపులేషన్ రిజిస్టర్ - NPR) రూపకల్పనకు అనుమతి ఇవ్వనుంది. ఒకసారి ఎన్పీసీ తయారైన తరువాత దాని ఆధారంగా జాతీయ పౌర పట్టిక (నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్-ఎన్ఆర్సీ)ని రూపొందించనుంది.
ii. దేశవ్యాప్తంగా జాతీయ జనాభా పట్టిక (NPR) తయారీకి రూ.3,941 కోట్లు కేటాయించాలని కేంద్ర హోం శాఖ కోరుతోంది. దేశంలోని నిజమైన పౌరుల వివరాలు సేకరించడమే ఎన్పీఆర్ లక్ష్యం. ప్రజలందరి వేలి ముద్రలు సేకరించడం, అందరికీ పౌరసత్వ గుర్తింపు కార్డులు ఇవ్వడం ఈ ప్రక్రియ లక్ష్యం.
iii. ఎన్పీఆర్ను తాజా సమాచారంతో సవరించినట్టు రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా (ఆర్జీఐ) ధ్రువీకరించిన తరువాతే ఎన్ఆర్సీపై నోటిఫికేషన్ ఇస్తారు.
iv. ఆర్జీఐ జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం అసోం మినహా మొత్తం దేశమంతటా జనాభా పట్టికను రూపొందిస్తారు. 2020 ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి సెప్టెంబరు 30 వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుంది. జనాభా లెక్కలను మునుపటిలాగానే గ్రామ, జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో సేకరిస్తారు.
v. పౌరసత్వ చట్టం సవరణలపై ఆందోళనలు జరుగుతున్న దృష్ట్యా జనాభా పట్టిక రూపకల్పన కార్యక్రమాలను నిలిపివేస్తున్నట్టు కేరళ, పశ్చిమ బెంగాల్ సీఎంలు ప్రకటించారు. అయితే ఇలాంటి అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు లేదని కేంద్ర హోం శాఖ అధికారులు స్పష్టం చేస్తున్నారు.
vi. తాజాగా ఆమోదించిన పౌరసత్వ సవరణ చట్టం కింద బంగ్లాదేశ్, అఫ్గానిస్థాన్, పాకిస్థాన్లకు చెందిన మైనార్టీలకు పౌరసత్వం కల్పించే అధికారాన్ని జిల్లా కలెక్టర్లకు ఇవ్వకూడదని కేంద్ర హోం శాఖ భావిస్తోంది.

తెలంగాణ వార్తలు

Unicef award to Kamareddy dist :


i. నీటి పారిశుధ్యం మరియు పరిశుభ్రత రంగాలలో స్వచ్ఛ భారత్ మిషన్ను సమర్థవంతంగా అమలు చేసినందుకు కామారెడ్డి జిల్లా ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ పిల్లల మరియు విద్యా నిధి (యునిసెఫ్) -2019 అవార్డును పొందింది.
ii. వ్యక్తిగత శానిటరీ మరుగుదొడ్లు, స్వచ్ దర్పాన్ వాల్ పెయింటింగ్స్, స్వచ్ సర్వేక్షన్, స్వచ్ఛ సుందర్ షౌచలే మరియు ఇతర కార్యకలాపాల నిర్మాణంలో జిల్లా దేశంలో ముందంజలో ఉంది.

ఆంధ్రప్రదేశ్ వార్తలు

Jagan launches scheme for handloom weavers ‘Nethanna Nestham’ :


i. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి అనంతపురం జిల్లాలోని ధర్మవరం వద్ద ‘నేతన్న నేస్తం’ను ప్రారంభించారు. ప్రస్తుతం మగ్గం నడుపుతున్న ప్రతి చేనేత చేనేత కుటుంబానికి ప్రతి సంవత్సరం, 24,000 సహాయాన్ని విస్తరించాలని ఈ పథకం లక్ష్యంగా పెట్టుకుంది.
ii. ఈ పథకం రాష్ట్రవ్యాప్తంగా సుమారు 85,000 కుటుంబాలకు ఐదేళ్లపాటు ఆర్థిక సహాయం అందించాలని యోచిస్తోంది. నిర్ణీత కాలంముగిసే సమయానికి ఒక కుటుంబానికి లభించే మొత్తం ₹ 1.2 లక్షలు.

ఇతర రాష్ట్రాలు / కేంద్ర పాలిత ప్రాంతాల వార్తలు

రైతులకు రూ.2 లక్షల వరకు రుణమాఫీ : మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే

i. వ్యవసాయదారుల సంక్షేమం కోసం మహారాష్ట్రలో రైతులందరికీ రూ.2లక్షల వరకు రుణమాఫీ చేయనున్నట్లు ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే శనివారం నాగ్పుర్లో ప్రకటించారు.
ii. రైతులను రుణ విముక్తుల్ని చేసేందుకు ‘మహాత్మా జ్యోతిరావు ఫులే షేత్కారీ రుణమాఫీ యోజన-2019’ను అమలు చేయనున్నట్లు వెల్లడించారు.

అంతర్జాతీయ వార్తలు

అంతరిక్ష పోరుకు అమెరికా ప్రత్యేక దళం. లాంఛనంగా ‘స్పేస్ ఫోర్స్’ ఏర్పాటు. నేషనల్ డిఫెన్స్ ఆథరైజేషన్ యాక్ట్పై ట్రంప్ సంతకం :


i. అంతరిక్షంలో ఆధిపత్యం చాటుకోవడానికి అమెరికా ముందడుగు వేసింది. రష్యా, చైనాల నుంచి ఎదురవుతున్న ‘స్పేస్ వార్’ సవాళ్లను దీటుగా ఎదుర్కొనేందుకు... అంతరిక్ష దళాన్ని (స్పేస్ ఫోర్స్) ఏర్పాటు చేసింది.
ii. ఇందుకు సంబంధించి కాంగ్రెస్ ఆమోదించి పంపిన నేషనల్ డిఫెన్స్ ఆథరైజేషన్ యాక్ట్ (ఎన్డీఏఏ)-2020 బిల్లుపై అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ శనివారం సంతకం చేశారు. 1947లో అమెరికా వైమానిక దళం అంకురించగా, దాని ఆధ్వర్యంలో మరో ప్రత్యేక విభాగం ఏర్పడటం ఇదే తొలిసారి.
iii. పొరుగు దేశాల కార్యకలాపాలు, రహస్యాలపై నిఘా ఉంచే ఉపగ్రహాలను పలు దేశాలు అంతరిక్షంలోకి పంపుతున్నాయి. ఈ క్రమంలోనే చైనా, రష్యాలు ఉపగ్రహాలను నాశనం చేయగల క్షిపణులను అభివృద్ధి చేయడం అమెరికాకు మింగుడు పడటంలేదు. అంతరిక్షంలో ఎలాగైనా తన ఆధిపత్యాన్ని చాటుకునే లక్ష్యంతో అమెరికా ఈ స్పేస్ ఫోర్స్ ఆలోచన చేసింది.

Cuba names Manuel Marrero Cruz to be first PM since 1976 :


i. Cuban President Miguel Diaz-Canel named Tourism Minister Manuel Marrero Cruz as the country’s first Prime Minister since 1976, under a new Constitution.
ii. Manuel Marrero Cruz, 56, whose nomination was ratified by the National Assembly, is a former functionary of the military-run Gaviota tourism corporation.

ఆర్థిక అంశాలు

బ్యాంకు ఖాతా కోసం మత ప్రస్తావన అవసరం లేదు : ఆర్థిక శాఖ స్పష్టీకరణ

i. బ్యాంకులో ఖాతా ప్రారంభించడానికి ఖాతాదార్లు తమ మతం వివరాలను ఇవ్వాల్సిన అవసరం లేదని కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి రాజీవ్ కుమార్ స్పష్టం చేశారు.
ii. ఖాతాదార్ల సమాచారంలో మత వివరాలను కూడా అడుగుతారంటూ వదంతులు వ్యాపించిన నేపథ్యంలో ఈ వివరణ ఇచ్చారు.

Eight West African nations rename common currency to Eco :


i. Eight West African countries have agreed to change the name of their common currency to Eco and severed their earlier currency CFA Franc’s links to former colonial ruler France.
ii. Benin, Burkina Faso, Guinea-Bissau, Ivory Coast, Mali, Niger, Senegal and Togo currently use the currency. All the countries are former French colonies with the exception of Guinea-Bissau.
iii. The CFA franc, created in 1945, was seen by many as a sign of French interference in its former African colonies even after the countries became independent.

         Appointments

Additional Solicitor General Surya Karan Reddy assumes charge  for southern zone :

   
i. హైదరాబాద్ ప్రధాన కార్యాలయంతో దక్షిణ మండలానికి అదనపు సొలిసిటర్ జనరల్గా నియమితులైన సీనియర్ న్యాయవాది టి. సూర్య కరణ్ రెడ్డి తెలంగాణ హైకోర్టు ప్రాంగణంలోని తన కార్యాలయానికి బాధ్యతలు స్వీకరించారు.
ii. అతను మూడేళ్లపాటు ఈ పదవిలో ఉంటాడు.

అవార్డులు

ఫిల్మ్ఫేర్ అవార్డుల ప్రదానోత్సవం @చెన్నై :

i. దక్షిణాది చిత్రపరిశ్రమలో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావించే ఫిల్మ్ఫేర్ అవార్డుల ప్రదానోత్సవం అట్టహాసంగా జరిగింది.
 
ii. చెన్నైలోని జవహర్లాల్ నెహ్రు ఇండోర్ స్టేడియంలో నిర్వహించిన ఈ వేడుకకు సినీతారలు తరలివచ్చారు.
iii. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ సినీ పరిశ్రమలలో 2018 సంవత్సరానికిగాను ప్రేక్షకుల మన్ననలు అందుకున్న చిత్రాలతోపాటు నటీనటులు, టెక్నీషియన్స్కు ఫిల్మ్ఫేర్ అవార్డులను అందించారు. ఈ ఏడాది తెలుగులో ఉత్తమ చిత్రంగా మహానటి, కన్నడలో కేజీఎఫ్ అవార్డులు అందుకున్నాయి.
iv. అలాగే ఉత్తమ నటుడిగా తెలుగులో రామ్ చరణ్(రంగస్థలం), తమిళంలో ధనుష్(వడ చెన్నై), విజయ్ సేతుపతి(96) అవార్డులను అందుకున్నారు.
ఫిల్మ్ఫేర్ విజేతలు (తెలుగు) :
v. ఉత్తమ చిత్రం :  మహానటి
vi. ఉత్తమ కథానాయకుడు : రామ్ చరణ్  (రంగస్థలం)

vii. ఉత్తమ కథానాయకుడు (విమర్శకుల) : దుల్కర్ సల్మాన్(మహానటి)
viii. ఉత్తమ నటి : కీర్తి సురేశ్  (మహానటి)

ix. ఉత్తమ సంగీత దర్శకుడు : దేవిశ్రీ ప్రసాద్ (రంగస్థలం)
x. ఉత్తమ సహాయ నటుడు: జగపతిబాబు (అరవింద సమేత)
xi. ఉత్తమ సహాయ నటి : అనసూయ (రంగస్థలం)
xii. ఉత్తమ నటి (విమర్శకుల) : రష్మిక (గీత గోవిందం)

మరణాలు

పేదల వెలుగురేఖ ఫజల్ హసన్ కన్నుమూత :


i. బంగ్లాదేశ్ రూరల్ అడ్వాన్స్మెంట్ కమిటీ (బీఆర్ఏసీ-బ్రాక్) వ్యవస్థాపకుడు ఫజల్ హసన్ అబెద్ కన్నుమూసినట్లు ఆ సంస్థ తెలిపింది. ప్రపంచంలోనే అతిపెద్ద స్వచ్ఛంద సంస్థల్లో ఒకటిగా బ్రాక్ వినుతికెక్కింది.
ii. 1971లో బంగ్లాదేశ్ యుద్ధం సమయంలో ఉద్యోగాన్ని వీడారు. లండన్లోని ఇంటిని అమ్మేసి యుద్ధం ముగిసిన అనంతరం 36 ఏళ్ల వయసులో బ్రాక్ని స్థాపించారు. తొలుత బంగ్లాదేశ్లోకి శరణార్థులుగా వచ్చిన లక్షలాది మందికి సేవలు అందించారు. అనంతరం ఆరోగ్య సంరక్షణ, సూక్ష్మరుణాలు, వ్యవసాయం, విద్య తదితర రంగాల్లోకి విస్తరించారు.
iii. సుమారు 15 కోట్ల మందిని పేదరికం నుంచి బ్రాక్ బయట పడేసినట్లు ప్రపంచ ఆహార బహుమతి ప్రదానోత్సవం సందర్భంగా ఎంపిక కమిటీ కొనియాడింది.

ముఖ్యమైన రోజులు

National Mathematics Day (జాతీయ గణిత దినోత్సవం) : 22 December


i. పురాణ గణిత శాస్త్రజ్ఞుడు శ్రీనివాస రామానుజన్ జన్మదినం మరియు ఆధునిక గణిత శాస్త్ర అభివృద్ధిలో ఆయన చేసిన కృషికి గుర్తుగా ప్రతి సంవత్సరం డిసెంబర్ 22 న జాతీయ గణిత దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఈ సంవత్సరం దేశం తన 132వ జన్మ వార్షికోత్సవాన్ని జరుపుకుంటుంది.
ii. రామానుజన్ 20వ శతాబ్దపు గణితాన్ని మార్చిన మరియు పున:రూపకల్పన చేసిన ఆలోచనల సంపదను కలిగినవాడు. ఈ ఆలోచనలు 21 వ శతాబ్దపు గణితాన్ని ఆకృతి చేస్తూనే ఉన్నాయి. జాతీయ గణిత దినోత్సవం జరుపుకోవడం వెనుక ప్రధాన లక్ష్యం ప్రజలకు అవగాహన కలిగించడం.
శ్రీనివాస రామానుజన్ 132వ జయంతి  : డిసెంబర్ 22, 1887

i. శ్రీనివాస రామానుజన్ అయ్యంగార్ (డిసెంబర్ 22, 1887—ఏప్రిల్ 26, 1920) భారతదేశానికి చెందిన గణిత శాస్త్రవేత్త. 20వ శతాబ్దంలో ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన గొప్ప గణిత మేధావులలో ఒకరు. ఇతడికి పది సంవత్సరాల వయసులోనే గణితశాస్త్రంతో అనుభందం ఏర్పడింది.
ii. చిన్న వయసులోనే గణితం పట్ల ప్రకృతి సిద్ధమైన ప్రతిభ కనపరిచేవాడు. ఆ వయసులోనే ఎస్ ఎల్ లోనీ త్రికోణమితి మీద రాసిన పుస్తకాలను వంటపట్టించుకున్నాడు. పదమూడు సంవత్సరాలు నిండే సరికల్లా ఆ పుస్తకాన్ని ఔపోసన పట్టడమే కాకుండా తన సొంతంగా సిద్ధాంతాలు కూడా రూపొందించడం ప్రారంభించాడు.
iii. రామానుజన్ డిసెంబర్ 22, 1887 నాడు తమిళనాడు రాష్ట్రం లోని ఈరోడ్ పట్టణములో జన్మించాడు. రామానుజన్ స్వరాష్ట్రమైన తమిళనాడు, ఆ రాష్ట్ర వాసిగా ఆయన సాధించిన విజయాలకు గుర్తుగా ఆయన జన్మదినమైన డిసెంబర్ 22ను రాష్ట్ర సాంకేతిక దినోత్సవంగా ప్రకటించింది.
iv. భారత ప్రభుత్వం 1962 వ సంవత్సరంలో ఆయన 75వ జన్మదినం నాడు, సంఖ్యా శాస్త్రంలో ఆయన చేసిన విశేష కృషిని కొనియాడుతూ స్మారక తపాలా బిళ్ళను విడుదల చేసింది. 2012లో అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ రామానుజన్ పుట్టినరోజును జాతీయ గణిత దినోత్సవంగా ప్రకటించారు. 125వ జయంతి సందర్భంగా 2014ను భారత ప్రభుత్వం జాతీయ గణితశాస్త్ర సంవత్సరంగా ప్రకటించింది.
v. ఫెలో ఆఫ్ ద ట్రినిటీ కాలేజి గౌరవం పొందిన తొలి భారతీయుడిగానూ, ఫెలో ఆఫ్ ద రాయల్ సొసైటీ గౌరవం పొందిన రెండవ భారతీయుడిగానూ ఆయన చరిత్రకెక్కారు. బ్రిటన్ నుంచి 1919 మార్చిలో భారతదేశానికి తిరిగి వచ్చారు.
vi. రామానుజన్ ‘ఆయిలర్’ సూత్రాలు, త్రికోణమితికి చెందిన అనేక సమస్యలను సులువుగా సాధించి చూపేవారు. మనదేశ గొప్పదనాన్ని ప్రపంచానికి చాటిన చెప్పిన రామానుజన్ అనారోగ్యంతో తన 33వ ఏట 1926, ఏప్రిల్ 26 న కన్నుమూశారు.
vii. 1729 సంఖ్యను రామానుజన్ సంఖ్యగా పిలుస్తారు. తీవ్రమైన అనారోగ్యంతో హాస్పిటల్లో ఉన్నప్పుడు కూడా హార్డీతో 1729 సంఖ్య యొక్క ప్రత్యేకతను తెలియజెప్పి ఆయన్ను ఆశ్చర్యచకితుణ్ణి చేశారు. ఎందుకంటే రెండు విధాలుగా రెండు ఘనముల మొత్తముగా వ్రాయబడే సంఖ్యాసమితిలో అతి చిన్నసంఖ్య అని తెల్పారు. (1729 = 1^3 + 12^3 = 9^3 + 10^3).
viii. కానీ శ్రీనివాసన్ రామానుజన్ మరణానంతరం అంతటి ప్రతిభ గల గణితశాస్త్ర వేత్తలను భారతదేశం తయారు చేసులేకపోవడం దురదృష్టకరం. మానవ నాగరికత చరిత్రకు గణితాన్ని పరిచయం చేసిన ఆర్యభట్ట, భాస్కరుడు.... ఆ తదనంతరం రామానుజన్ వంటి గణిత మేథావుల పరంపర ఆ తరువాత కొనసాగలేదు. భవిష్యత్తులోనైనా ఈ లోటును నేటి విద్యార్థి లోకం భర్తీ చేయగలదని భావిద్దాం..

క్రీడలు

జెరెమీ రికార్డుల జోరు @ ఖతార్ అంతర్జాతీయ కప్

 
i. భారత యువ వెయిట్లిఫ్టర్ జెరెమీ లాల్రినుంగ రికార్డుల మోత మోగించాడు. ఖతార్ అంతర్జాతీయ కప్ వెయిట్లిఫ్టింగ్ టోర్నీ పురుషుల 67 కేజీల విభాగంలో రజతం గెలిచిన అతను రికార్డుల దుమ్ము దులిపాడు.
ii. 17 ఏళ్ల జెరెమీ 306 కేజీల (స్నాచ్లో 140, క్లీన్ అండ్ జర్క్లో 166 కిలోలు) బరువులెత్తి రెండో స్థానంలో నిలవడంతో పాటు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో కలిపి మొత్తం 27 కొత్త రికార్డులు సృష్టించాడు.

ICC continues partnership with UNICEF for Women’s World T20 :


i. The International Cricket Council (ICC) has announced that it has extended its partnership with UNICEF through to the Women’s T20 World Cup 2020 with the focus on empowering women and girls through cricket.
ii. The partnership and public donations continue to bring positive change to children through the programs in cricket playing nations focused on empowering women and girls in cricket.
iii. The money raised during the Women’s World T20 will go to similar projects in cricket playing nations, including an innovative program to promote girls” participation in cricket in Sri Lanka and build peace in communities.
iv. The ICC and UNICEF partnership commenced in 2015, as part of the ICC”s global community outreach program ”Cricket 4 Good”. During the Men’s 50-over World Cup held in England and Wales earlier this summer, UNICEF raised $180,000 as part of ‘One Day 4 Children’ and this money will go directly to fund a girls’ cricket project in Afghanistan.

>>>>>>>>>>>>>>>>  End of the day  <<<<<<<<<<<<<<<<
 

✍ కరెంట్ అఫైర్స్ 21 డిసెంబర్ 2019 Saturday ✍ eenadunews

✍  కరెంట్ అఫైర్స్ 21 డిసెంబర్ 2019 Saturday ✍

తెలంగాణ వార్తలు

అటకెక్కిన బాలికా ఆరోగ్య రక్ష. 5.90 లక్షల మంది విద్యార్థినుల ఎదురుచూపులు :


i. బాలికా ఆరోగ్య రక్ష పేరిట రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థినుల కోసం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఆరోగ్య, పరిశుభ్రత కిట్ల పథకం ఈ ఏడాది అటకెక్కింది.
ii. ప్రభుత్వ విద్యాసంస్థలైన ఉన్నత, మోడల్ పాఠశాలలు, కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలు(కేజీబీవీ), తెలంగాణ రెసిడెన్షియల్ విద్యాసంస్థల్లో బాలికలకు కిట్లు సరఫరా చేసే పథకాన్ని 2018-19 విద్యా సంవత్సరంలో పాఠశాల విద్యాశాఖ ప్రారంభించింది.
iii. ఉద్దేశం : బాలికలకు హైజీన్ కిట్లు అందించడం.
iv. అందులో ఉండే వస్తువులు : 13 రకాలు. స్నానపు సబ్బు, కొబ్బరి నూనె, శానిటరీ నాప్కిన్లు, షాంపూ, దువ్వెన, టూత్ బ్రష్, టూత్ పేస్టు, టంగ్ క్లీనర్, పౌడర్, రిబ్బన్లు, బొట్టు బిళ్లలు, తల పిన్నులు, దుస్తులు ఉతికే సబ్బు.
v. ఎన్ని సార్లు : ఏడాదిలో నాలుగు సార్లు (కిట్ ఖరీదు రూ.421)
vi. లక్ష్యం : విద్యాపరంగా బాలికలను ప్రోత్సహించడం, హాజరు పెంచడం.
vii. ఎవరికిస్తారు : సర్కారు బడుల్లోని ఏడు నుంచి 12వ తరగతి వరకు చదివే బాలికలకు.
viii. మొత్తం బాలికలు : సుమారు 5.90 లక్షలు; వ్యయం : ఏటా రూ.100కోట్లు.

ఆంధ్రప్రదేశ్ వార్తలు

3 రాజధానులు.. 4 కమిషనరేట్లు.. అమరావతి, విశాఖలలో హైకోర్టు బెంచిలు. శాసన రాజధానిగా అమరావతి, కార్యనిర్వాహక రాజధాని విశాఖ, న్యాయ రాజధానిగా కర్నూలు : ప్రభుత్వానికి జీఎన్ రావు ఆధ్వర్యంలోని నిపుణుల కమిటీ నివేదిక


i. లెజిస్లేటివ్ (శాసన) రాజధానిగా అమరావతిలో అసెంబ్లీ, ఎగ్జిక్యూటివ్ (కార్యనిర్వాహక) రాజధానిగా విశాఖపట్నంలో సచివాలయం, జ్యుడిషియల్ (న్యాయ) రాజధానిగా కర్నూలులో హైకోర్టు ఏర్పాటుచేయాలని ఆంధ్రప్రదేశ్ సమగ్రాభివృద్ధిపై నిపుణుల కమిటీ నివేదిక సిఫారసు చేసింది.
ii. వాటితోపాటు.. విశాఖలో శాసనసభ వేసవికాల సమావేశాలు నిర్వహించాలని, అక్కడే సీఎం క్యాంపు కార్యాలయం, హైకోర్టు బెంచి ఉండాలంది. అమరావతిలోనూ హైకోర్టు బెంచి ఏర్పాటుచేయాలని సూచించింది.
iii. పరిపాలన సౌలభ్యం కోసం రాష్ట్రంలోని 13 జిల్లాలను నాలుగు ప్రాంతాలుగా విభజించాలి.
iv. కర్ణాటక తరహాలో ప్రాంతీయ కమిషనరేట్లు ఏర్పాటుచేసి అక్కడినుంచి పాలన సాగించాలి.
4 కమిషనరేట్లు :
v. ఉత్తర కోస్తా : శ్రీకాకుళం, విజయ నగరం, విశాఖపట్నం
vi. మధ్య కోస్తా : తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా
vii. దక్షిణ కోస్తా : గుంటూరు, ప్రకాశం, నెల్లూరు
viii. రాయలసీమ : కర్నూలు, కడప, అనంతపురం, చిత్తూరు

ix. విశాఖపట్నం మెట్రోపాలిటన్ రీజియన్ : ఇక్కడ సచివాలయం, సీఎం క్యాంపు కార్యాలయం, హైకోర్టు బెంచితో పాటు వేసవికాల సమావేశాల కోసం అసెంబ్లీ భవనం ఏర్పాటు చేయాలి.

x. అమరావతి-మంగళగిరి కాంప్లెక్సు : చట్టసభలు, హైకోర్టు బెంచి, గవర్నర్, మంత్రుల బంగ్లాలు ఉంటాయి. మంగళగిరి,  నాగార్జున విశ్వవిద్యాలయం, ఏపీఎస్పీ బెటాలియన్ భూముల్లో శాశ్వత భవనాల నిర్మాణం చేపట్టాలి. కొత్తగా భూమి సేకరించాల్సిన అవసరం లేదు.

xi. కర్నూలు : శ్రీబాగ్ ఒప్పందంతో పాటు ప్రజల ఆకాంక్ష మేరకు కర్నూలులో హైకోర్టు, అనుబంధ కోర్టులు ఏర్పాటు చేయాలి.
xii. ఆంధ్రప్రదేశ్ సమగ్రాభివృద్ధిపై విశ్రాంత ఐఏఎస్ అధికారి జీఎన్రావు ఆధ్వర్యంలోని నిపుణుల కమిటీ ముఖ్యమంత్రి జగన్తో సమావేశమై తుది నివేదిక సమర్పించింది.

ఇతర రాష్ట్రాలు / కేంద్ర పాలిత ప్రాంతాల వార్తలు

Meghalaya Assembly to pass resolution to bring state under ILP :


i. మేఘాలయ అసెంబ్లీ 1873లో బెంగాల్ ఈస్టర్న్ ఫ్రాంటియర్ రెగ్యులేషన్ కింద రాష్ట్రంలో ఇన్నర్ లైన్ పర్మిట్‌ను అమలు చేయాలని విజ్ఞప్తి చేస్తూ ఒక తీర్మానాన్ని ఆమోదించింది. డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని తీర్మానాన్ని ఆమోదించాలనే ఏకైక ఉద్దేశ్యంతో ఒకరోజు ప్రత్యేక సమావేశాన్ని ILP అమలు కోసం రాష్ట్రంలోని స్వదేశీ నివాసితులు నిర్వహించారు.
ii. ఇన్నర్ లైన్ పర్మిట్ (ILP) అనేది ఒక భారతీయ పౌరుడు పరిమిత కాలానికి రక్షిత ప్రాంతంలోకి లోపలికి ప్రయాణించడానికి అనుమతించడానికి భారత ప్రభుత్వం జారీ చేసిన అధికారిక ప్రయాణ పత్రం.
iii. రక్షిత రాష్ట్రంలోకి ప్రవేశించడానికి అనుమతి పొందడం ఆ రాష్ట్రాల వెలుపల ఉన్న భారతీయ పౌరులకు విధి. భారతదేశం యొక్క అంతర్జాతీయ సరిహద్దుకు సమీపంలో ఉన్న కొన్ని ప్రాంతాలకు కదలికలను నియంత్రించడానికి ప్రభుత్వం చేసిన ప్రయత్నం ఈ పత్రం.

అంతర్జాతీయ వార్తలు

పురాతన శిలాజ అడవి అడ్రస్ మార్పు. కైరోలో వెలుగు చూసిన 38.6 కోట్ల క్రితం నాటి చెట్ల ఆనవాళ్లు :


i. భూమిపై అత్యంత పురాతన శిలాజ అడవి ఎక్కడుంది? ఈ ప్రశ్నకు ఇప్పటివరకు శాస్త్రవేత్తలు చెప్తున్న సమాధానం.. ‘అమెరికాలోని న్యూయార్క్ రాష్ట్రంలో ఉన్న గిల్బావో’. ఇప్పుడు ఆ జవాబు మారింది.
ii. ప్రపంచంలోకెల్లా అత్యంత పురాతన శిలాజ అడవి గిల్బావోలో కాకుండా అక్కడికి 40 కిలోమీటర్ల దూరంలోని కైరో(న్యూయార్క్)లో ఉందని శాస్త్రవేత్తలు గుర్తించారు.

Afghanistan becomes 1st country to recognize Indian Pharmacopoeia :


i. ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్ యొక్క ప్రజారోగ్య మంత్రిత్వ శాఖ యొక్క నేషనల్ డిపార్ట్మెంట్ ఆఫ్ మెడిసిన్స్ అండ్ హెల్త్ ప్రొడక్ట్స్ చేత ఇండియన్ ఫార్మాకోపోయియా (ఐపి) అధికారికంగా గుర్తించబడింది.
ii. దీనితో వాణిజ్య విభాగం మరియు ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖల ప్రయత్నాలకు అనుగుణంగా ఐపిని గుర్తించిన మొదటి దేశంగా ఆఫ్ఘనిస్తాన్ నిలిచింది.
iii. డ్రగ్స్ అండ్ కాస్మటిక్స్ యాక్ట్, 1940 మరియు రూల్స్ 1945 ప్రకారం ఐపి అధికారికంగా గుర్తించబడిన ప్రమాణాల పుస్తకం. ఇది వారి గుర్తింపు, స్వచ్ఛత మరియు బలం పరంగా భారతదేశంలో తయారు చేయబడిన మరియు విక్రయించే ఔషధాల ప్రమాణాలను నిర్దేశిస్తుంది.
iv. ఔషధ ఉత్పత్తుల నాణ్యతను నిర్ధారించడానికి, చట్టపరమైన మరియు శాస్త్రీయ ప్రమాణాలను ఇండియన్ ఫార్మాకోపోయియా కమిషన్ (ఐపిసి) ఇండియన్ ఫార్మాకోపోయియా (ఐపి) రూపంలో అందిస్తుంది.

సైన్స్ అండ్ టెక్నాలజీ

Ethiopia launched its first space satellite :


i. ఇథియోపియా తన మొట్టమొదటి ఉపగ్రహాన్ని ప్రయోగించింది, ఇది ఆఫ్రికన్ అంతరిక్ష పరిశ్రమకు బ్యానర్ సంవత్సరాన్ని అందించే దేశం యొక్క అంతరిక్ష కార్యక్రమానికి ఒక మైలురాయి.
ii. ఇథియోపియన్ రిమోట్ సెన్సింగ్ శాటిలైట్ (ETRSS) ప్రయోగం చైనాలోని ఒక అంతరిక్ష కేంద్రంలో జరిగింది. ఈ ప్రయోగం ఇథియోపియాను 11 వ ఆఫ్రికన్ దేశంగా చేస్తుంది. 1998 లో ఈజిప్ట్ మొదటిది.
iii. ఇథియోపియా యొక్క ఉపగ్రహం అందించిన డేటా దేశ వ్యవసాయం, అటవీ మరియు మైనింగ్ వనరుల యొక్క పూర్తి చిత్రాన్ని చిత్రించగలదని మరియు వరదలు మరియు ఇతర విపత్తులకు ప్రతిస్పందనలను మెరుగుపరుస్తుందని భావిస్తున్నారు.
iv. ఇథియోపియా రాజధాని : అడిస్ అబాబా; కరెన్సీ : బిర్ర్.

International Astronomical Union names new star ‘Sharjah’ :


i. The International Astronomical Union (IAU) announced the names of the newly discovered stars and planets, where the name “Sharjah” was chosen for a star with “Barjeel” being the name of one of its planets.
ii. International Astronomical Union Headquarters : Paris, France. Founded : 28 July 1919.

ఆర్థిక అంశాలు

RBI to buy and sell govt bonds worth Rs 10,000 crore :

 
i. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) ఏకకాలంలో ప్రత్యేక ఓపెన్ మార్కెట్ ఆపరేషన్ (ఓఎంఓ) కింద రూ .10,000 కోట్ల విలువైన ప్రభుత్వ సెక్యూరిటీలను కొనుగోలు చేసి విక్రయిస్తుంది. ప్రస్తుత లిక్విడిటీ మరియు మార్కెట్ పరిస్థితుల సమీక్ష మరియు అభివృద్ధి చెందుతున్న ఆర్థిక పరిస్థితుల అంచనాపై, రిజర్వ్ బ్యాంక్ 2019 డిసెంబర్ 23న ప్రభుత్వ సెక్యూరిటీల ఏకకాలంలో కొనుగోలు మరియు అమ్మకాలను నిర్వహించాలని నిర్ణయించింది.
ii. ‘6.45 శాతం జీఎస్ 2029’ పరికరం కోసం రూ .10,000 కోట్ల విలువైన ప్రభుత్వ సెక్యూరిటీల కోసం ఈ కొనుగోలు ఉంటుంది. వ్యక్తిగత సెక్యూరిటీల కొనుగోలు / అమ్మకం పరిమాణం నిర్ణయించే హక్కు మరియు మొత్తం మొత్తానికి తక్కువకు బిడ్లు / ఆఫర్లను అంగీకరించే హక్కు రిజర్వ్ బ్యాంకుకు ఉంది.

Google searches for ‘Operation Twist’ surge in India :


i. Google searches for “Operation Twist” surged in India after the central bank announced its version of the U.S. Federal Reserve’s unconventional monetary policy.
ii. Most searches for the term came from Delhi followed by Maharashtra. The central bank will buy long-term bonds, while simultaneously selling short-term government securities in an effort to cheapen long-term borrowing and boost bank lending.
iii. The Reserve Bank of India will buy longer-tenor bonds while selling shorter debt. The concept is similar to Operation Twist used by the Fed in 2011-2012 in an effort to cheapen long-term borrowing and spur bank lending.

ఒప్పందాలు

ADB & India signs $490 Million loan to upgrade roads of Madhya Pradesh :


i. ఆసియా అభివృద్ధి బ్యాంకు (ఎడిబి) మరియు భారత ప్రభుత్వం 490 మిలియన్ల రుణంపై సంతకం చేశాయి. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో 1,600 కిలోమీటర్ల రాష్ట్ర రహదారులు మరియు ప్రధాన జిల్లా రహదారులను అప్గ్రేడ్ చేయడానికి హైబ్రిడ్-యాన్యుటీ మోడల్ (HAM) ద్వారా ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్య (పిపిపి) ప్రాజెక్టు కోసం ఈ రుణం సంతకం చేయబడింది.
ii. HAM అనేది ఇంజనీరింగ్, సేకరణ, నిర్మాణం మరియు బిల్డ్-ఆపరేట్-ట్రాన్స్ఫర్ యొక్క మిశ్రమం. ఇది ప్రైవేటు రంగానికి రూపకల్పన, అమలు మరియు ఆపరేషన్ మరియు నిర్వహణ బాధ్యతలను నిర్వహిస్తుంది, అదే సమయంలో కొన్ని ప్రైవేట్ రంగ ఫైనాన్సింగ్ను ఆకర్షిస్తుంది.
iii. ఆసియా అభివృద్ధి బ్యాంక్ ప్రధాన కార్యాలయం : మనీలా, ఫిలిప్పీన్స్, అధ్యక్షుడు : టేకికో నాకావో

       Appointments

అమెరికా NSF డైరెక్టర్గా భారతీయ అమెరికన్ సేతురామన్ పంచనాథన్ :


i. భారతీయ అమెరికన్ కంప్యూటర్ శాస్త్రవేత్త సేతురామన్ పంచనాథన్ను ప్రతిష్ఠాత్మకమైన జాతీయ సైన్స్ ఫౌండేషన్ (ఎన్ఎస్ఎఫ్) డైరెక్టర్ పదవికి ఎంపికచేస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయం తీసుకున్నారు.

ii. NSF అనేది అమెరికా ప్రభుత్వ సంస్థ. వైద్య రంగంతో సంబంధంలేని సైన్స్, ఇంజినీరింగ్ విభాగాల్లో ప్రాథమిక పరిశోధన, విద్యకు ఎన్ఎస్ఎఫ్ ఊతమిస్తుంది.
iii. సేతురామన్ ప్రస్తుతం ఆరిజోనా స్టేట్ విశ్వవిద్యాలయంలో ముఖ్య పరిశోధనాధికారిగా పనిచేస్తున్నారు. ఆయన 1984లో బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ నుంచి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్లో పట్టా పొందారు. మద్రాస్ ఐఐటీ నుంచి ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్లో పీజీ చేశారు. కెనడాలోని ఒటావా వర్సిటీ నుంచి ఎలక్ట్రికల్ అండ్ కంప్యూటర్ ఇంజినీరింగ్లో పీహెచ్డీ చేశారు.

M&M ఛైర్మన్గా వైదొలగనున్న ఆనంద్ మహీంద్రా. పవన్ గోయెంకాకు ఎండీ, సీఈఓ బాధ్యతలు :


i. మహీంద్రా అండ్ మహీంద్రా (ఎం&ఎం) ఉన్నత యాజమాన్యంలో పలు కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. ఆనంద్ మహీంద్రా ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ బాధ్యతల నుంచి వైదొలగనున్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్ 1 నుంచి బోర్డులో నాన్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్గా మాత్రమే ఆయన ఉండనున్నారు.
ii. సెబీ మార్గదర్శకాలకు అనుగుణంగా మహీంద్రా గ్రూపు ఈ నిర్ణయం తీసుకుంది. అలాగే పవన్ గోయెంకాను మళ్లీ మేనేజింగ్ డైరెక్టరుగా నియమించింది. కొత్తగా ముఖ్య కార్యనిర్వహణాధికారి (సీఈఓ) పదవిని సృష్టించి.. ఆ బాధ్యతలూ గోయెంకాకే అప్పగించనుంది.
iii. గోయెంకా నియామకం వచ్చే ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తుంది. గోయెంకా పదవీ విరమణ చేశాక ఆయన స్థానంలో 2021 ఏప్రిల్ 2న అనీశ్ శా ఎండీ, సీఈఓ పదవిని చేపడతారని కంపెనీ తెలిపింది.
iv. నాన్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ హోదాలో ఆనంద్ మహీంద్రా మార్గదర్శకుడిగా.. ఎండీకి వ్యూహ ప్రణాళిక నష్ట నివారణ, విదేశీ సంబంధాలు లాంటి విషయాల్లో సహకారాలు అందిస్తారని తెలిపింది.
v. దేశీయంగా, అంతర్జాతీయంగా మహీంద్రా గ్రూపు వివిధ రంగాల్లోకి (వాహన, వ్యవసాయం, ఐటీ, ఏరోస్పేస్) అడుగుపెట్టడంలో, పలు కంపెనీలను (రెవా ఎలక్ట్రిక్ కార్ కంపెనీ, సత్యం కంప్యూటర్ సర్వీసెస్, ఏయిరోస్టాఫ్ ఆస్ట్రేలియా, హాలీడే క్లబ్ రిసార్ట్స్) కొనుగోలు చేయడంలో ఆనంద్ మహీంద్రాది కీలక పాత్ర.

నాబార్డు ఛైర్మన్గా భన్వాలా కొనసాగింపు :


i. నాబార్డు ఛైర్మన్గా హర్షకుమార్భన్వాలాను కొనసాగిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈనెల 18వతేదీతో ముగిసిన ఆయన కాలపరిమితిని తదుపరి ఉత్తర్వులు జారీచేసేంతవరకూ కొనసాగించాలని కేంద్ర నియామకాల కేబినెట్ కమిటీ నిర్ణయించింది. ఈమేరకు సిబ్బంది వ్యవహారాలశాఖ ఉత్తర్వులు జారీచేసింది.

Devesh Srivastava appointed GIC chief :


i. దేవేష్ శ్రీవాస్తవను జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఇండియా (GIC Re) లో చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ (MD) గా నియమిపబడ్డాడు.
ii. జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఇండియా స్థాపించబడింది : 22 నవంబర్ 1972. జనరల్ ప్రధాన కార్యాలయం : ముంబై, ఇండియా.

Persons in news

ఉన్నావ్ అత్యాచార కేసులో దోషి సెంగార్కు శిక్ష ఖరారు. చనిపోయేవరకూ జైల్లోనే : దిల్లీ కోర్టు


i. ఉత్తర్ప్రదేశ్లోని ఉన్నావ్ అత్యాచార కేసులో దోషిగా తేలిన భాజపా బహిష్కృత ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సెంగార్  జీవితాంతం జైల్లో  గడపనున్నారు.  బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డ ఆయనను చనిపోయేవరకూ జైల్లోనే ఉంచాలని దిల్లీలోని జిల్లా జడ్జి ధర్మేశ్ శర్మ తీర్పు చెప్పారు. అసాధారణ స్థాయిలో రూ.25 లక్షల జరిమానా కూడా విధించారు.
ii. 2017లో ఈ అత్యాచారం జరిగింది. ఫిర్యాదు చేసినప్పుడు నిందితుడి పేరును రాయడానికి పోలీసులు నిరాకరించడం.. బాధితురాలి తండ్రిని చిత్రహింసలపాల్జేసి చంపేయడం, మరో కేసులో ఆమె బంధువును బెదిరించడం, అనుమానాస్పద పరిస్థితుల్లో బాధితురాలిని ప్రమాదానికి గురిచేయడం వరకూ అనేక దారుణాలు జరిగాయి.
iii. బాధితురాలు మైనర్ కావడంతో సెంగార్పై భారత శిక్షా స్మృతితో పాటు, పోక్సో చట్టం కింద కేసులు నమోదయ్యాయి. భారత శిక్షా స్మృతి (ఐపీసీ)లోని 376 (2) సెక్షన్ కింద ఆయనకు జీవిత ఖైదు విధిస్తున్నట్లు న్యాయమూర్తి చెప్పారు.

Donald Trump becomes 3rd US President to be impeached :


i. డొనాల్డ్ ట్రంప్, చరిత్రలో ప్రతినిధుల సభచే అభిశంసించబడిన మూడవ అమెరికా అధ్యక్షుడిగా అవతరించారు. ట్రంప్ పదవిలో ఉంటారా లేదా అనే విషయాన్ని నిర్ణయించే విచారణను సెనేట్లో ఏర్పాటు చేయడానికి అభిశంసన దారి తీస్తుంది. డొనాల్డ్ ట్రంప్ అధికార దుర్వినియోగానికి పాల్పడినట్లు ప్రతినిధుల సభ అధికారికంగా అభియోగాలు మోపింది.
ii. డెమొక్రాటిక్ నేతృత్వంలోని సభ అభిశంసన యొక్క అధికార వ్యాసాన్ని ఎక్కువగా పార్టీ-లైన్ 230-197 ఓటుపై ఆమోదించింది. అయినప్పటికీ, యునైటెడ్ స్టేట్స్ యొక్క 243 సంవత్సరాల చరిత్రలో ఏ అధ్యక్షుడిని అభిశంసన ద్వారా పదవి నుండి తొలగించలేదు. అమెరికా చరిత్రలో మునుపటి ఇద్దరు అధ్యక్షులను మాత్రమే అభిశంసించారు.
iii. 1998లో సభ అధ్యక్షుడు బిల్ క్లింటన్ను అభిశంసించగా, అధ్యక్షుడు ఆండ్రూ జాన్సన్ను 1868లో అభిశంసించారు.

అవార్డులు

మిస్ అమెరికా 2019 కెమిల్లె స్కైరర్ :



i. అమెరికాలోని యాభై రాష్ట్రాల నుంచి పోటీ పడిన అందగత్తెలను వెనక్కు నెట్టి అందాల కిరీటాన్ని సొంతం చేసుకుంది కెమిల్లె స్కైరర్.
ii. అందాల పోటీల్లో విజేతని నిర్ణయించేందుకు వివిధ దశలుంటాయని తెలుసుగా. అందులో టాలెంట్ రౌండ్ కూడా ఒకటి. ఈ రౌండ్లో చాలామంది పాటలు పాడటం, డ్యాన్స్ చేయడం వంటివి చేస్తారు.
iii. మిస్ అమెరికాతో పాటు, అంతకు ముందు జరిగిన మిస్ వర్జీనియా పోటీల్లోనూ అందాల ప్రదర్శనకు బదులుగా కెమిల్లె హైడ్రోజన్ పెరాక్సైడ్తో స్టేజీమీద చేసిన ఓ ప్రయోగం ప్రేక్షకులను, నిర్వాహకులను ఆకర్షించింది. ఇదే ఆమె మిస్ అమెరికాగా గెలవడానికి దోహదం చేసింది.

ముఖ్యమైన రోజులు

వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి జననం : 1972 డిసెంబరు 21


i. 2014లో తెలంగాణ విడిపోయిన తరువాత, వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి (జగన్) రాష్ట్రానికి రెండవ ముఖ్యమంత్రిగా పదవి చేపట్టాడు. జగన్ 2009 మే లో తొలిసారిగా కడప లోకసభ సభ్యుడుగా గెలిచాడు. జగన్మోహన్ రెడ్డి 1972 డిసెంబరు 21న జమ్మలమడుగు గ్రామము, వైఎస్ఆర్ కడప జిల్లాలో జన్మించారు
ii. రాజశేఖరరెడ్డి అకాలమరణం తర్వాత, భారత జాతీయ కాంగ్రెసుతో విబేధాల కారణంగా పార్టీ నుండి బయటికి వచ్చి యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీని స్థాపించాడు. భారతీ సిమెంట్స్, సాక్షి ప్రసార మాధ్యమం , సండూరు జలవిద్యుత్ కేంద్రము వ్యవస్థాపకుడు.
iii. 2011 మార్చి 11న వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ స్థాపించారు. ఈ పార్టీకి ఆయన తల్లి, వై.యస్.విజయమ్మ గౌరవ అధ్యక్షురాలు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరిస్తూ వారి బాధలను అతి దగ్గరగా తెలుసుకునేందుకు ప్రజాసంకల్పయాత్ర పేరుతో 16-11-2017న ఇడుపలపాయ నుండి 09-01-2019న ఇచ్ఛాపురం వరకు 14 నెలల పాటు రాష్ట్రంలోని 13 జిల్లాలోని 125 నియోజకవర్గాల్లో 3,648 కిలొమీటర్లు పాదయాత్ర చెసి రాష్ట్ర ప్రజలకు దగ్గర అయ్యారు.
iv. 2019 ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో 175 శాసన సభ స్థానాలకుగాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 151 స్థానాలు రికార్డు స్థాయిలో గెలిచి ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు. అంతే కాకుండా 2019 సాధారణ ఎన్నికల్లో ఆయనే ఆంధ్రప్రదేశ్ లో అత్యధిక మెజారిటీ సాధించిన శాసన సభ్యుడు. సుమారు 90000 పైగా మెజార్టీతో గెలవడం ఆయన పట్ల ప్రజలకి ఉన్న విశ్వాశానికి నిదర్శనం.
v. 2012 మే 25న అక్రమాస్తుల అభియోగంపై సిబిఐ చేత అరెస్ట్ చేయబడ్డారు. 16 నెలల పాటు జగన్ చంచల్ గూడ జైలులో ఉన్నారు. 23 సెప్టెంబరు 2013న నాంపల్లిలోని సిబిఐ ప్రత్యేక కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.

క్రీడలు

Barabati Stadium – Cuttack (Odisha) @3rd ODI IND vs WI


i. The Barabati Stadium is an Indian sports stadium located in Cuttack, Odisha. It is established in 1958 with capacity of 45,000.
ii. It is a regular venue for international cricket and is the home ground of Odisha cricket team. The stadium is owned and operated by the Odisha Cricket Association. It is also used for Association Football.
Belgium crowned FIFA Team of the Year :

i. Belgium has been crowned FIFA ‘Team of the Year’ for the second successive time after a record-breaking year for the global ladder. World champions France remains in the second place ahead of Brazil in third.
ii. Besides accumulating the biggest points haul, Qatar has also jumped a year-high 38 places, followed closely by fellow climbers Algeria (up 32 ranks) and Japan (up 22 places).
iii. President of FIFA : Gianni Infantino; Founded : 21 May 1904. Headquarters : Zürich, Switzerland.

Mirabai Chanu wins Gold in 6th Qatar International Cup :


i. దోహాలో జరిగిన 6 వ ఖతార్ అంతర్జాతీయ కప్లో భారత ఖాతాను తెరిచింది. భారత వెయిట్లిఫ్టర్ మీరాబాయి చాను మహిళల 49 కిలోల కేటగిరీ బంగారు పతకాన్ని గెలుచుకుంది.
ii. ఒలింపిక్ క్వాలిఫైయింగ్ ఈవెంట్లో 194 కిలోల ప్రయత్నంతో ఆమె స్వర్ణం సాధించింది, టోక్యో 2020 కట్కు తుది ర్యాంకింగ్లు సాధించినప్పుడు ఈ పాయింట్లు ఉపయోగపడతాయి.
iii. ఖతార్ రాజధాని : దోహా; కరెన్సీ : ఖతారి రియాల్.

Indian men’s football team ranked 108th in latest FIFA rankings :


i. ఫిఫా ర్యాంకింగ్స్లో భారత పురుషుల ఫుట్బాల్ జట్టు 108వ స్థానంలో నిలిచింది. ఏడాది పొడవునా భారత్ 11 స్థానాలను కోల్పోయింది.
ii. మొత్తం 1187 పాయింట్లతో, జపాన్ నేతృత్వంలోని ఆసియా దేశాలలో భారత్ 19 వ స్థానంలో ఉంది. 2018 ప్రపంచ కప్ రన్నరప్ బెల్జియం వరుసగా రెండవ సంవత్సరం టాప్ ర్యాంకుతో నిలిచింది. ప్రపంచ ఛాంపియన్స్ ఫ్రాన్స్ రెండవ స్థానంలో నిలిచింది.
iii. ఫిఫా అధ్యక్షుడు : జియాని ఇన్ఫాంటినో; స్థాపించబడింది : 21 మే 1904. ప్రధాన కార్యాలయం : జ్యూరిచ్, స్విట్జర్లాండ్.
>>>>>>>>>>>>>>>>  End of the day  <<<<<<<<<<<<<<<<
 

Human Body

 మానవ శరీరం గురించి మనం మానవ శరీరాన్ని మైక్రోస్కోపిక్ స్థాయిలో "విచ్ఛిన్నం" చేస్తే, కణం దాని అత్యంత ప్రాథమిక యూనిట్‌గా ఉంటుంది. సగ...