కరెంట్ అఫైర్స్ 15 అక్టోబరు 2019 Tuesday
తెలంగాణ వార్తలు
పర్యాటక కేంద్రంగా బస్వాపూర్ : మంత్రి శ్రీనివాస్గౌడ్
i. యాదాద్రి ఆలయ సమీపంలోని బస్వాపూర్ రిజర్వాయర్ వద్ద కేటాయించిన 90 ఎకరాలను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అధికారులను ఆదేశించారు.
ii. శామీర్‌పేట్ చెరువు పరిసరాలను ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో అంతర్జాతీయ స్థాయి పర్యాటక కేంద్రంగా మార్చాలన్నారు. హుస్సేన్సాగర్, గండిపేట, బద్వేలు ప్రాంతాల్లో నూతన ప్రాజెక్టులు రూపొందించాలని సూచించారు.
పంచాయతీ ట్రైబ్యునల్లో ముగ్గురు సభ్యులు :
i. రాష్ట్ర గ్రామపంచాయతీ ట్రైబ్యునల్లో ముగ్గురు సభ్యులను ప్రభుత్వం నియమించింది. నూతన పంచాయతీరాజ్ చట్టం కింద ప్రభుత్వం ఈ ట్రైబ్యునల్ను ఏర్పాటు చేసింది.
ii. సీఎం కేసీఆర్ నిర్ణయం మేరకు..మహబూబ్‌నగర్ జిల్లా పరిషత్ మాజీ అధ్యక్షుడు బండారు భాస్కర్, రంగారెడ్డి జిల్లాకు చెందిన సీనియర్ న్యాయవాది పి. గోవర్ధన్రెడ్డి, వరంగల్ గ్రామీణ జిల్లా నెక్కొండ మండల మాజీ అధ్యక్షుడు గటిక అజయ్ కుమార్‌లను సభ్యులుగా నియమించింది. ఈ ముగ్గురూ తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు.
ఇతర
రాష్ట్రాలు / కేంద్ర పాలిత ప్రాంతాల వార్తలు
ఏపీలో రైతుకు మరింత ‘భరోసా’ :
i.
ఆంధ్రప్రదేశ్లో రైతు కుటుంబాలకు మరింత భరోసా కల్పించాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రైతు భరోసా పథకానికి గతంలో ప్రకటించిన మొత్తానికి రూ.1,000 కలిపి ఏడాదికి రూ.13,500 చొప్పున ఇవ్వబోతోంది.
ii.
ఈ మొత్తాన్ని 3 విడతలుగా రైతు ఖాతాల్లో జమ చేయనుంది. ఈ పథకానికి ‘వైఎస్సార్ రైతు భరోసా- పీఎం కిసాన్’ అని నామకరణం చేశారు. పీఎం- కిసాన్ కింద 3 విడతల్లో కేంద్రం అందించే రూ.6 వేలకు రాష్ట్ర ప్రభుత్వం రూ.7,500 కలిపి ఇస్తుంది. కౌలు రైతులకు రాష్ట్రమే రూ.13,500 జమ చేయనుంది.
Appointments
తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్‌గా గౌరవ్ ఉప్పల్ బాధ్యతలు :
i.
దిల్లీ తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్‌గా నియమితులైన డాక్టర్ గౌరవ్ ఉప్పల్ బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు ఆర్సీగా ఉన్న వేదాంతం గిరి ఆయనకు బాధ్యతలు అప్పజెప్పారు.
ii.
గౌరవ్ ఉప్పల్ మాట్లాడుతూ.. తన అభ్యర్థన మేరకు ప్రభుత్వం దిల్లీకి బదిలీ చేసిందన్నారు. కేంద్రంలోని వివిధ శాఖల్లో రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అంశాలను ఎప్పటికప్పుడు అనుశీలన చేస్తానని తెలిపారు.
Persons
in news
తిరువనంతపురం జిల్లా సబ్కలెక్టర్గా ప్రాంజల్ పాటిల్. అంధురాలైన తొలి మహిళా ఐఏఎస్గా రికార్డు :
i.
కనులు లేవని ఆమె కలతపడలేదు... మనసునే నేత్రంగా మలచుకుని పట్టుదలతో చదువుకుని ఐఏఎస్ అధికారి అయ్యారు. తిరువనంతపురం జిల్లా సబ్కలెక్టరుగా బాధ్యతలు స్వీకరించారు. దృష్టిలోపం ఉన్న తొలి మహిళా ఐఏఎస్గా ప్రత్యేకత సాధించారు. ఆమే... ప్రాంజల్పాటిల్.
ii.
మహారాష్ట్రలోని ఉల్హాస్నగర్కు చెందిన ప్రాంజల్ ఆరేళ్ల వయసులో దృష్టిని కోల్పోయారు. ముంబయిలోని కమలామెహతా దాదర్ అంధుల పాఠశాలలో చదువుకున్నారు. తర్వాత సెయింట్ జేవియర్స్ నుంచి పొలిటికల్ సైన్స్‌లో డిగ్రీ చేశారు. దిల్లీలోని జేఎన్యు నుంచి ఇంర్నేషనల్ రిలేషన్స్‌లో పీజీ చేశారు.
iii.
2016లో యూపీఎస్ పరీక్ష రాసి 773వ ర్యాంకు తెచ్చుకున్నారు. మరుసటి ఏడాది మరింత పట్టుదలగా చదువుకుని 124వ ర్యాంకు సాధించారు. శిక్షణ కాలంలో ఆమె ఎర్నాకులం అసిస్టెంట్ కలెక్టరుగా పనిచేశారు.
Reports/Ranks/Records
50 నగరాలకు భూకంప ముప్పు. ట్రిపుల్ఐటీ హైదరాబాద్ ఆధ్వర్యంలో ఈడీఆర్‌ఐ నివేదిక :
i.
దేశవ్యాప్తంగా విజయవాడ సహా 50 నగరాలు, ఒక జిల్లా అధిక భూకంప ముప్పు కలిగిన మండలాల్లో ఉన్నట్టు అధ్యయనంలో గుర్తించారు.
ii.
ఈ తీవ్రతను అధిగమించేందుకు ట్రిపుల్ఐటీ హైదరాబాద్, నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ(ఎన్డీఎంఏ), భారత ప్రభుత్వం సంయుక్తంగా భూకంప ప్రభావిత ప్రాంతాల సూచిక(ఎర్త్‌క్వేక్ డిజాస్టర్ రిస్క్ ఇండెక్స్) నివేదికను ప్రచురించాయి.
iii.
ప్రభావిత ప్రాంతాల్లోని జనసాంద్రత, గృహనిర్మాణం, నగరాల పరిస్థితి ఆధారంగా ప్రయోగాత్మకంగా అధ్యయనం చేపట్టారు. ట్రిపుల్ఐటీ హైదరాబాద్లోని ఎర్త్‌క్వేక్ ఇంజనీరింగ్ రీసెర్చ్ సెంటర్(ఈఆర్సీసీ) విభాగ అధిపతి ప్రొఫెసర్ ప్రదీప్ రామనచర్ల సారథ్యంలో పరిశోధక విద్యార్థులు మూడేళ్లపాటు శ్రమించి నివేదికను రూపొందించారు.
iv.
అధిక భూకంప మండలంలో ఆంధ్రప్రదేశ్లోని విజయవాడతో పాటు..దిల్లీ, కోల్కతా, చెన్నై, పుణె, ముంబై, అహ్మదాబాద్, సిలిగురి, డార్జిలింగ్, చండీగఢ్ తదితర నగరాలు ఉన్నట్లు పేర్కొన్నారు.
దానశీలి శివ్
చక్రవర్తి. దాతృత్వంలో హెచ్‌సీఎల్ టెక్ అధినేత నెం.1. మూడో స్థానంలో ముకేశ్ :
i. దేశంలోని అత్యంత దానశీలుడిగా హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ ఛైర్మన్ శివ్ నాడార్ అగ్రస్థానంలో నిలిచారు. అత్యంత శ్రీమంతుడిగా వెలుగొందుతున్న రిలయన్స్ ముకేశ్ అంబానీకి జాబితాలో మూడో స్థానం లభించడం గమనార్హం.
ii. దాతృత్వ కార్యకలాపాలకు 21 బిలియన్ డాలర్లు ప్రకటించిన విప్రో వ్యవస్థాపకుడు అజీమ్ ప్రేమ్‌జీ రెండో స్థానం పొందారు. 2019 సంవత్సరానికి ఎడెల్‌గివ్ ఫౌండేషన్, హ్యూరన్ ఇండియాలు సంయుక్తంగా ఈ జాబితాను రూపొందించాయి.
iii. జాబితాలో అత్యధికం ముంబయి (31 మంది) నుంచి ఉండగా.. ఆ తర్వాతి స్థానాల్లో దిల్లీ (16 మంది), బెంగళూరు (11 మంది) ఉన్నాయి.
అవార్డులు
అభిజిత్ బెనర్జీ, ఆయన అర్ధాంగి ఎస్తేర్ డుఫ్లోకు, మరో ఆర్థికవేత్త క్రెమర్కూ ఆర్థిక నోబెల్ :
i. పేదరికపు విషకోరల నుంచి ప్రపంచానికి విముక్తి కల్పించేలా అద్భుత పరిష్కారాలను సూచించిన ప్రవాస భారత ఆర్థిక దిగ్గజం అభిజిత్ వినాయక్ బెనర్జీని ప్రతిష్ఠాత్మక నోబెల్ పురస్కారం వరించింది. ఆయన భార్య ఎస్తేర్ డుఫ్లోతో పాటు, మరో ఆర్థికవేత్త మైఖెల్ క్రెమర్నూ 2019 సంవత్సరానికి ఈ అవార్డుకు సంయుక్తంగా ఎంపిక చేసినట్లు స్వీడిష్ రాయల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ప్రకటించింది.
ii. క్షేత్రస్థాయిలో పేదల స్థితిగతులు ఎలా ఉన్నాయి? వారికి కనీస జీవన ప్రమాణాలు ఎందుకు అందడం లేదు వంటి ప్రశ్నలు వేసుకుని వాటికి పరిష్కార మార్గాలను అన్వేషించాలన్నదే అమెరికాలో ఉంటున్న ఈ ముగ్గురి సిద్ధాంతం.
iii. భారత దేశంలో చదువుల్లో వెనుకబడిన 50 లక్షల మంది విద్యార్థులకు ట్యూషన్లు చెప్పించడం, వివిధ దేశాల్లో భారీ రాయితీతో ఆరోగ్య పథకాలు అమలు చేయడం వీరి ప్రయోగాల ఫలితమే.
iv. పేదరిక నిర్మూలనకు అభిజిత్ దంపతులు ఒక ప్రయోగశాలను ఏర్పాటు చేశారు. ‘‘కొందరికి ఎందుకు తినడానికి తిండి లేదు? మరికొందరు టెలివిజన్ ఎందుకు కొనుక్కోలేకపోతున్నారు. పేద పిల్లలు బడులకు వెళ్తున్నా ఎందుకు నేర్చుకోలేకపోతున్నారు. ఎక్కువ మంది సంతానం ఉండడమే పేదరికానికి కారణమా? ప్రపంచంలో పేదరికాన్ని నిర్మూలించాలంటే ఇలాంటి ప్రశ్నలకు సమాధానాలు అవసరం’’ అన్నది వీరు నమ్మిన సిద్ధాంతం.
v. ఇందులో భాగంగా 2003 అభిజిత్, డుఫ్లో దంపతులిద్దరూ సెంధిల్ ములియనాథన్తో కలిసి ఎం.ఐ.టి.లో అబ్దుల్ లతీఫ్ జమీల్ పావర్టీ యాక్షన్ ల్యాబ్ (జె-పాల్)ను నెలకొల్పారు. వారు రచించిన ‘పూర్ ఎకనామిక్స్’ (పేదల ఆర్థిక శాస్త్రం) పుస్తకానికి విశేష ఆదరణతో పాటు, పురస్కారాలు లభించాయి. ఇది 17 భాషల్లో అనువాదమయింది. ఈ కృషిలో భాగంగా అభిజిత్ రెండు డాక్యుమెంటరీ చిత్రాలకు కూడా దర్శకత్వం వహించారు.
vi. నోబెల్ పురస్కారం కింద అభిజత్(58), ఎస్తేర్(46), క్రెమర్(54)లకు తొమ్మిది మిలియన్ క్రోనార్లు (సుమారు రూ.6.43 కోట్లు) నగదు, బంగారు పతకం, డిప్లొమాను అకాడమీ బహూకరించనుంది. ఈ నగదును ముగ్గురు సమానంగా పంచుకుంటారు.
vii. ఆర్థికశాస్త్ర విభాగంలో నోబెల్కు ఎంపికైన రెండో మహిళగా డుఫ్లో గుర్తింపు పొందారు. ఇదే విభాగంలో పురస్కారాన్ని అందుకోనున్న పిన్న వయస్కురాలు ఆమె కావడం విశేషం. అమర్త్యసేన్ అనంతరం ఆర్థిక శాస్త్రంలో నోబెల్ పొందిన రెండో ప్రవాస భారతీయుడు అభిజిత్.
ఠాగూర్ నుంచి బెనర్జీ వరకు..
viii. నోబెల్ పురస్కారం పొందిన భారతీయుల జాబితాలో అభిజిత్ బెనర్జీ చేరి, దేశవాసులు గర్వపడేలా చేశారు. రవీంద్రనాథ్ ఠాగూర్ ప్రారంభమైన నోబుల్ గ్రహీతల ప్రస్థానంలో మరో మైలు రాయిగా నిలిచారు.
ix. ఇంతవరకు నోబెల్ను పొందిన భారతీయుల వివరాలను పరిశీలిస్తే...
1)
రవీంద్రనాథ్ ఠాగూర్ (1913)- సాహిత్యం
2) సి.వి.రామన్ (1930)- భౌతిక శాస్త్రం
3) హరగోబింద్ ఖొరానా (1968)- వైద్యం
4) మదర్ థెరిసా (1979)- శాంతి
5) సుబ్రమణ్యన్ చంద్రశేఖర్ (1983)- భౌతిక శాస్త్రం
6) అమర్త్య సేన్ (1998)- ఆర్థిక శాస్త్రం
7) వెంకటరామన్ రామకృష్ణన్ (2009)- రసాయన శాస్త్రం
8) కైలాస్ సత్యార్థి (2014)- శాంతి
9) అభిజిత్ బెనర్జీ (2019)- ఆర్థిక శాస్త్రం
ముఖ్యమైన రోజులు
అబ్దుల్ కలాం 88వ జయంతి : అక్టోబర్ 15
i. ఏ.పి.జె. అబ్దుల్ కలామ్ అని ప్రముఖంగా పిలవబడే డాక్టర్ అవుల్ పకీర్
జైనులబ్ధీన్ అబ్దుల్ కలామ్ (అక్టోబర్ 15, 1931 - జులై 27, 2015 ), భారత దేశపు ప్రముఖ
క్షిపణి శాస్త్రవేత్త మరియు 11వ భారత రాష్ట్రపతి.
ii. తమిళనాడు లోని రామేశ్వరంలో పుట్టి పెరిగారు. తిరుచిరాపల్లి లోని
సెయింట్ జోసెఫ్ కళాశాలలో భౌతిక శాస్త్రం అభ్యసించారు. చెన్నై లోని మద్రాస్ ఇన్స్టిట్యూట్
అఫ్ టెక్నాలజీ నుంచి ఏరోస్పేస్ ఇంజనీరింగ్ పట్టాపొందారు.
iii. భారత రాష్ట్రపతి పదవికి ముందు, డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్
ఆర్గనైజేషన్ (DRDO) మరియు ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో) తో ఒక ఏరోస్పేస్
ఇంజనీర్ పనిచేశారు. భారతదేశం యొక్క మిస్సైల్ మాన్ పిలవబడే కలాం ముఖ్యంగా బాలిస్టిక్
క్షిపణి మరియు వాహన ప్రయోగ టెక్నాలజీ అభివృద్ధికి కృషిచేశారు.
iv. 1998లో భారతదేశ పోఖ్రాన్-II అణు పరీక్షలలో కీలకమైన, సంస్థాగత, సాంకేతిక
మరియు రాజకీయ పాత్ర పోషించారు. 2002 అద్యక్షఎన్నికలలో భారతీయ జనతా పార్టీ ద్వారా అభ్యర్థిగా
ప్రతిపాదించబడగా, ప్రతిపక్ష కాంగ్రేస్ మద్దతు తెలిపింది. ఎన్నికలలో వామపక్షాలు బలపరిచిన
లక్ష్మీ సెహగల్ పై గెలిచారు.
v. కలాం తన పుస్తకం ఇండియా 2020 లో 2020 నాటికి భారతదేశాన్ని ఒక అభివృద్ధి
చెందిన దేశంగా మార్చడానికి అభివృద్ధి ప్రణాళికలు సూచించారు. భారతదేశం యొక్క అత్యున్నత
పౌర పురస్కారమైన భారత రత్న సహా అనేక ప్రతిష్ఠాత్మక అవార్డులను అందుకున్నారు.
vi. అవుల్ పకీర్ జైనులబ్ధీన్ కలాం తమిళనాడు రాష్ట్రంలోని రామేశ్వరంలో
ఒక తమిళ ముస్లిం కుటుంబంలో 1931, అక్టోబరు 15 న జన్మించారు.
vii. మద్రాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (MIT - చెన్నై) నుండి పట్టా
పొందిన తరువాత 1960 లో, కలాం డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్
(DRDO) యొక్క ఏరోనాటికల్ డెవెలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ శాస్త్రవేత్తగా చేరారు. కలాం
భారత సైన్యం కోసం ఒక చిన్న హెలికాప్టర్ చెయ్యటం ద్వారా తన వృత్తిని ప్రారంభించాడు,
కానీ DRDO లో ఉద్యోగం చేయడంతొ ఆయన సంతృప్తి చెందలేదు.
viii. 1969 లో, భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ లో (ఇస్రో) చేరి, ఇస్రో యొక్క
మొట్టమొదటి స్వదేశీ ఉపగ్రహ ప్రయోగ వాహనం (SLV-III) ప్రయోగానికి డైరెక్టర్ గా పనిచెసి
జూలై 1980 లో ఈ వాహనం రోహిణి ఉపగ్రహాన్ని భూమి దగ్గర కక్ష్యలో విజయవంతంగా చేర్చింది.
ఇస్రోలో పనిచేయడం తన జీవితంలో అతిపెద్ద విజయాల్లో ఒకటిగా పేర్కొన్నారు.
ix. 1970 మరియు 1990 మధ్య కాలంలో, కలాం పోలార్ SLV మరియు SLV-III ప్రాజెక్టుల
అభివృద్ధికి పనిచేశారు. రెండు ప్రాజెక్ట్లు విజయవంతం అయినాయి. 1970 లలో స్థానికంగా
తయారైన SLV రాకెట్ ఉపయోగించి రోహిణి-1 ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి పంపడం ఇస్రో చరిత్రలో
మైలురాయి.
x. జూలై 1992 నుండి డిసెంబరు 1999 మధ్య ప్రధాన మంత్రి శాస్త్రీయ సలహాదారుగా
మరియు డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ ముఖ్యకార్యదర్శిగా వ్యవహరించారు.
ఇదే సమయంలో జరిపిన పోఖ్రాన్లో-II అణు పరీక్షలలో కలాం రాజకీయ మరియు సాంకేతిక పాత్ర నిర్వహించారు.
xi. 1981 పద్మ భూషణ్ ; 1990 పద్మ విభూషణ్ ; 1997 భారతరత్న అందుకున్నారు.
xii. రాష్ట్రపతిగా కూడా సేవలందించిన మహనీయుడు ఏపీజే అబ్దుల్ కలాం జూలై
27, 2015 హఠాన్మరణానికి గురయ్యారు. షిల్లాంగ్‌లోని ఏఐఎంలో సోమవారం విద్యార్థులను ఉద్దేశించి
ప్రసంగిస్తున్న ప్రొఫెసర్ అబ్దుల్ కలాం హఠాత్తుగా ప్రసంగం మధ్యలో కుప్పకూలిపోయారు.
15 October - World Students’ Day
i. A.P.J అబ్దుల్ కలాం జన్మదినం సందర్భంగా ప్రతి సంవత్సరం అక్టోబర్
15 న ప్రపంచ విద్యార్థుల దినోత్సవం జరుపుకుంటారు.
ii. ఈ రోజు అతనిని మరియు సైన్స్
అండ్ టెక్నాలజీ రంగంలో ఆయన చేసిన ప్రయత్నాలను గౌరవిస్తుంది మరియు గౌరవిస్తుంది మరియు
అతని శాస్త్రీయ మరియు రాజకీయ వృత్తిలో అతను పోషించిన గురువు పాత్రను కూడా గౌరవిస్తుంది.
iii. 2010 లో ఐక్యరాజ్యసమితి 15 అక్టోబర్ (అబ్దుల్ కలాం 79 వ జయంతి)న "ప్రపంచ విద్యార్థుల దినోత్సవం" గా ప్రకటించింది.
15th October- International Day of Rural Women (గ్రామీణ మహిళల అంతర్జాతీయ
దినోత్సవం)
i. 2019 Theme : Rural Women and Girls Building
Climate Resilience
ii. వ్యవసాయ మరియు గ్రామీణాభివృద్ధిలో, ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్న
దేశాలలో, స్వదేశీ మహిళలతో సహా గ్రామీణ మహిళల పాత్రను ఈ రోజు గుర్తించింది.
iii. SDG - సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ యొక్క దృష్టిని నెరవేర్చడానికి
గ్రామీణ మహిళల పాత్ర ముఖ్యం. పేదరికం మరియు ఆకలిని అంతం చేయడం, మహిళలు మరియు బాలికలను
శక్తివంతం చేయడం, ఆహార భద్రతను సాధించడం అనే 3 ప్రధాన లక్ష్యాలు ప్రపంచ అభివృద్ధి యొక్క
ప్రతి అంశంలో గ్రామీణ మహిళల పాత్రను మెరుగుపరచడం ద్వారా మాత్రమే సాధించవచ్చు.
15 October - World White Cane Day (ప్రపంచ తెల్ల చెరకు దినోత్సవం)
i. ప్రపంచ తెల్ల చెరకు దినోత్సవాన్ని అక్టోబర్ 15న నేషనల్ ఫెడరేషన్
ఆఫ్ ది బ్లైండ్ జరుపుకుంటారు.
ii. అంధుల కోసం తెల్ల చెరకు ఒక పూర్తి మరియు స్వతంత్ర జీవితాన్ని సాధించగల
సామర్థ్యాన్ని ఇచ్చే ఒక ముఖ్యమైన సాధనం. తెల్ల చెరకు సహాయంతో, వారు ఒక ప్రదేశం నుండి
మరొక ప్రదేశానికి స్వేచ్ఛగా మరియు సురక్షితంగా వెళ్ళవచ్చు.
క్రీడలు
బీసీసీఐలో...ఇక దాదాగిరి :
i. 2000లో గంగూలీ కెప్టెన్ కావడం అనూహ్యం. ఎవ్వరూ ఊహించని పరిస్థితుల్లో అతడిని ఆ పదవి వరించింది. అలా అనుకోకుండానే అతడి నాయకత్వ లక్షణాలూ బయటపడ్డాయి.
ii. గాడ్‌ఫాదర్ దాల్మియా అండతో బెంగాల్ క్రికెట్ సంఘం (క్యాబ్)లోకి అడుగు పెట్టాడు. ఆయన మరణానంతరం క్యాబ్ అధ్యక్షుడూ అయ్యాడు. ఇటీవలే మళ్లీ అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. అయితే దాదా ఇంత త్వరగా బీసీసీఐ అధ్యక్షుడవడం అనూహ్యమే.
iii. ఒక మాజీ క్రికెటర్ పూర్తి స్థాయిలో బీసీసీఐ అధ్యక్షుడు కావడం 65 ఏళ్లలో ఇదే తొలిసారి. చివరగా 1954లో విజయనగరం మహారాజు విజయానంద గజపతిరాజు బీసీసీఐ అధ్యక్షుడయ్యాడు. అతను భారత జట్టు మాజీ కెప్టెన్ కూడా.
iv. బీసీసీఐ అధ్యక్షుడు కాబోతున్న నేపథ్యంలో గంగూలీ క్యాబ్ పగ్గాలు వదిలేస్తాడు. దీంతో పాటు దిల్లీ క్యాపిటల్స్ మార్గదర్శి బాధ్యతల నుంచి కూడా తప్పుకుంటాడు. అలాగే క్రికెట్ వ్యాఖ్యానం కూడా వదిలేస్తాడు.
v. గంగూలీ బీసీసీఐ అధ్యక్షుడు కావడం అతడి అభిమానులందరికీ సంతోషాన్నిచ్చే విషయమే కానీ.. అతను పదవిలో ఉండేది పది నెలలే కావడం మాత్రం నిరాశ కలిగించే విషయం.
vi. ఇందుక్కారణం.. లోధా కమిటీ తెచ్చిన ‘తప్పనిసరి విరామం’ నిబంధనే. దీని ప్రకారం బీసీసీఐ, రాష్ట్ర క్రికెట్ సంఘాల్లో ఆరేళ్ల పాటు పదవిలో ఉన్న ఎవరైనా మూడేళ్ల విరామం తీసుకోవాలి. క్రికెట్ పాలన వ్యవహారాలకు దూరంగా ఉండాలి.
vii. గంగూలీ అయిదేళ్లకు పైగా బెంగాల్ క్రికెట్ సంఘం అధ్యక్షుడిగా కొనసాగుతున్నాడు. బీసీసీఐ అధ్యక్షుడిగా పది నెలల పదవీ కాలం పూర్తి కాగానే.. అతను అతను ఆరేళ్ల పరిమితిని దాటేస్తాడు.
Stories
సకుటుంబ సపరివార నోబెల్ :
i. కొందరి
వైవాహిక జీవితంలో
ప్రేమానుబంధాలతోపాటు నోబెల్
పంటలూ ఉన్నాయి.
మరికొందరేమో తల్లిదండ్రుల
పేరును నిలబెడుతూ
ఈ విశిష్ఠ
పురస్కారాలను సొంతం
చేసుకున్నారు. ఈ
అవార్డు వేటలో
సోదరబంధాన్ని చాటినవారు
ఇంకొందరు. మొత్తంమీద
అవి నోబెల్
కుటుంబాలుగా చరిత్రలో
నిలిచిపోయాయి.
ii. తాజాగా
ఆర్థికశాస్త్రంలో అభిజిత్
బెనర్జీ, ఎస్తేర్
డుఫ్లో దంపతులు
ఈ అవార్డును
గెల్చుకున్న నేపథ్యంలో
అలాంటి అరుదైన
బంధుత్వాలు ఆసక్తికరంగా
మారాయి.
iii. భార్యా భర్తలు జంటగా..
మేరీ, పీయర్ క్యూరీ: 1903 (భౌతిక శాస్త్రం)
ఫ్రెడ్రిక్ జోలియట్, ఐరీన్ జోలియట్-క్యూరీ: 1935 (రసాయన శాస్త్రం)
జెర్టీ, కార్ల్ కోరి: 1947 (వైద్య శాస్త్రం)
మే-బ్రిట్, ఎడ్వర్డ్ ఐ మోసర్: 2014 (వైద్య శాస్త్రం)
iv. వేరువేరు విభాగాల్లో దంపతులు :
గునార్ మిర్డాల్: 1974 (ఆర్థిక శాస్త్రం)
ఆల్వా మిర్డాల్: 1982 (శాంతి)
నోబెల్ కుటుంబం :
v. నోబెల్ బహుమతిని కలిసికట్టుగా గెల్చుకున్న మొదటి జంటగా గుర్తింపు పొందిన మేరీ క్యూరీ, పియర్ క్యూరీల కుటుంబం ఈ బహుమతుల పంటను పండించింది.
vi. 1903లో మేరీ, పీయర్లు భౌతిక శాస్త్రంలో అవార్డును గెల్చుకోగా.. 1911లో రసాయన శాస్త్ర విభాగంలో మేరీ మరోసారి ఈ అత్యున్నత పురస్కారాన్ని దక్కించుకున్నారు.
vii. మేరీ, పియర్ల కుమార్తె ఐరీన్ జోలియట్-క్యూరీ కూడా తల్లిదండ్రుల బాటలో నడుస్తూ 1935లో నోబెల్ను గెల్చుకున్నారు. ఆమె కూడా భర్తతో ఈ పురస్కారాన్ని పంచుకోవడం విశేషం.
viii. మేరీ, పీయర్ల రెండో కుమార్తె ఈవ్ క్యూరీ భర్త హెన్రీ రిచర్డ్సన్ యునిసెఫ్ అధిపతి హోదాలో 1965లో నోబెల్ శాంతి బహుమతిని అందుకున్నారు.
ix. సోదరులు :
జాన్ టిన్బెర్గన్
నికోలస్ టిన్బెర్గన్
x. 1915లో సర్ విలియం హెన్రీ బ్రాగ్ తన కుమారుడు లారెన్స్ బ్రాగ్‌తో కలసి భౌతిక శాస్త్ర నోబెల్ను పంచుకున్నారు.
1909 నుంచి 2019 వరకూ :
xi. మొత్తం నోబెల్ విజేతలు: 950 (923 మంది వ్యక్తులు, 27 సంస్థలు)
xii. అత్యంత యువ విజేత వయసు: 17 (మలాలా యూసఫ్జాయ్)
xiii. పెద్ద వయసు విజేత వయసు: 97 (శాస్త్రవేత్త జాన్ బి గుడ్ఎనఫ్)
xiv. మహిళా విజేతలు: 54
xv. అవార్డులను నిరాకరించినవారు: 6
No comments:
Post a Comment