Sunday, 13 October 2019

9th october 2019 telugu current affairs


                         కరెంట్ అఫైర్స్ 9 అక్టోబరు 2019 Wednesday
తెలంగాణ వార్తలు
కొత్త జిల్లాలు ఏర్పడి దసరాకు మూడేళ్లు. ఎక్కడా నిర్మాణం పూర్తికాని సమీకృత భవనాలు :
i.       రాష్ట్రంలో 2016 దసరా రోజున 21 కొత్త జిల్లాలను, ఏడాది మరో రెండు జిల్లాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. పరిపాలన వికేంద్రీకరణ బాగున్నా కార్యాలయాల భవనాలు, కొత్తగా సిబ్బంది నియామకాలు లేక ఇబ్బందులు తప్పడం లేదు.
ii.      కలెక్టరేట్తోపాటు అన్ని జిల్లా కార్యాలయాలు ఒకేచోట అందుబాటులో ఉండేలా సమీకృత భవనాల నిర్మాణానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. పాత జిల్లాల్లో భవన వసతి లేని వాటితో కలిపి 26 జిల్లాల్లో సమీకృత భవనాల నిర్మాణాలకు రూ.843 కోట్లు విడుదల చేసింది.
iii.    నిర్మాణాలు ప్రారంభమైనా నేటికి ఒక్కచోటా పూర్తికాలేదు. అద్దె భవనాలు, ఇతర శాఖలకు చెందిన భవనాల్లో కలెక్టరేట్లు, జిల్లా శాఖల కార్యాలయాలు కొనసాగుతున్నాయి

Defence News
భారత్చేతికి తొలి రఫేల్యుద్ధ విమానం :
i.       భారత వైమానికదళం అమ్ముల పొదిలో మరో అస్త్రం చేరింది. ఫ్రాన్స్రూపొందించిన రఫేల్యుద్ధవిమానం భారత్చేతికి అందింది. ఫ్రాన్స్లోని బోర్డియాక్స్లో డసోల్ట్ఏవియేషన్‌  కర్మాగారంలో రక్షణమంత్రి రాజ్నాథ్సింగ్‌  రఫేల్యుద్ధవిమానాన్ని అధికారికంగా స్వీకరించారు
ii.       భారత్కు మొత్తం 36 విమానాలు అందనుండగా ఇది తొలి విమానం. రఫేల్భారత్చేతికి అందిన ఈరోజు భారత వైమానిక దళానికి చరిత్రాత్మకమైన దినమని (October 8) రాజ్నాథ్అన్నారు. అనంతరం ఫ్రాన్స్అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్మాక్రన్తో రక్షణమంత్రి రాజ్నాథ్సింగ్భేటీ అయ్యారు.
అవార్డులు
భౌతిక శాస్త్రంలో ముగ్గురికి నోబెల్‌ :
i.       భౌతిక శాస్త్రంలో ముగ్గురికి నోబెల్పురస్కారం వరించింది. మేరకు పురస్కార కమిటీ ప్రకటించింది. 2019గాను జేమ్స్పీబెల్స్‌, మైకెల్మేయర్‌, డైడియర్క్యూలోజ్లకు  పురస్కారాన్ని సంయుక్తంగా అందజేయనున్నట్లు ప్రకటించారు.
ii.      భౌతిక విశ్వసృష్టిలో సైద్ధాంతిక ఆవిష్కరణలతో పాటు సూర్యుడిని పోలిఉండే నక్షత్రం చుట్టూ తిరిగే గ్రహం కనుగొన్నందున వారికి  అరుదైన గౌరవం దక్కింది
iii.    పురస్కారం వరించినవారిలో మైకెల్మేయర్‌, డైడియర్క్యూలోజ్స్విట్జర్లాండ్కు చెందినవారు కాగా.. జేమ్స్పీబుల్స్కెనడియన్అమెరికన్‌.
iv.    బహుమతి కమిటీలు ప్రస్తుతం 2019 నోబెల్ బహుమతి గ్రహీతలను మరియు ఇతర రంగాలకు గ్రహీతలను ఎంపిక చేయడానికి జాగ్రత్తగా మరియు స్వతంత్రంగా పనిచేస్తున్నాయి: కెమిస్ట్రీ, సాహిత్యం, శాంతి బహుమతి మరియు ఆల్ఫ్రెడ్ నోబెల్ జ్ఞాపకార్థం స్వెరిజెస్ రిక్స్బ్యాంక్ ఆర్థిక శాస్త్రాలలో బహుమతి.
v.     పైన పేర్కొన్న బహుమతుల గ్రహీతను 2019 అక్టోబర్ 9 నుండి 14 మధ్య షెడ్యూల్ ప్రకారం ప్రకటిస్తారు.
Art and Culture
విజయదశమి విశిష్టత :
i.          ప్రతి ఏడాదీ ఆశ్వీయుజ మాసంలోని శుక్లపక్షంలో దశమీ తిథినాడు సాయం సంధ్యాకాలంలోవిజయంఅనే పేరు గల ముహూర్తం సంభవిస్తుందని, అది సకలార్థసాధకమని శాస్త్రగ్రంథాలు చెబుతున్నాయి.
ii.       మంగళకరమైన సమయంలో శమీవృక్షాన్ని (జమ్మిచెట్టును) పూజిస్తే జీవితంలో అన్నీ విజయాలే కలుగుతాయని సంప్రదాయం చెబుతోంది.
iii.     శమీవృక్షాన్నే ఎందుకు పూజించాలనే సందేహానికి శాస్త్రగ్రంథాలు సమాధానం చెప్పాయి. జమ్మిచెట్టు పాపాలను దూరం చేస్తుంది. శత్రువులను తరిమికొడుతుంది
iv.     శమీవృక్షం విజయాలకు కారణం కావడం వల్లవిజయదశమిగొప్ప పండుగగా రూపొందింది. ప్రాచీనకాలం నుంచి ప్రజాపాలకులైన రాజులకు విజయయాత్రా ముహూర్తంగా పవిత్రదినం పూజలను అందుకొంటున్నది. పూర్వం రాజులు వర్షకాలం ముగిసిన తరవాత శరత్కాలం ప్రారంభంలో విజయయాత్రలు చేసేవారు. శుభముహూర్తమే విజయదశమి.ఆశ్వీయుజ శుక్లపాడ్యమి నుంచి నవమి వరకు గల తొమ్మిది దినాలు శక్తిపూజకు ఎంతో ముఖ్యమైనవి.నవరాత్రదీక్షతో తొమ్మిది రోజులు శక్తిని పూజించిన దీక్షాపరులు, విజయదశమినాడు దీక్షను ముగిస్తారు.
v.       ముగింపు సూచనగా గ్రామం పొలిమేరలు దాటి వెళ్లి, విజయసంకేతం అయిన పాలపిట్టను దర్శించి, జమ్మిచెట్టును పూజించడం పరిపాటి. పూజించిన జమ్మిఆకులను పవిత్రంగా భావించి, బంధుమిత్రులకు, ఆత్మీయులకు ఇచ్చి వారి శుభాకాంక్షలను, ఆశీస్సులను అందుకొంటారు.
vi.     విజయదశమినిదసరాఅనీ పిలుస్తారు. దశవిధాలైన పాపాలను హరించేది కనుకదశహరాఅనే పేరు వచ్చిందని, కాలక్రమంలోదసరాఅని వాడుకలోకి వచ్చిందని పెద్దలు అంటారు. దసరా నాడు రావణకుంభకర్ణుల బొమ్మలను కాల్చివేస్తూరావణదహనంఅని, ‘రామలీలఅని పెద్దయెత్తున ఉత్సవాలు నిర్వహిస్తారు.
vii.       దుష్టసంహారం ద్వారా ధర్మాన్ని నిలపడమే ఉత్సవాల్లోని పరమార్థంగా కనిపిస్తుంది. ప్రాకృతికంగా పరిశీలించినప్పుడు శరదృతువు ప్రసన్నతకు నిలయంగా కనిపిస్తుంది. అప్పటిదాకా వర్షాలతో చిత్తడి చిత్తడిగా మారిన నేలలన్నీ శరదృతువు ప్రారంభంలో వర్షాలు ఆగిపోవడం వల్ల ఎండిపోయి నిర్మలం అవుతాయి. జలాశయాలన్నీ నిండుకుండలను తలపిస్తాయి.
కర్రల సమరం @ దేవరగట్టు, కర్నూలు జిల్లా :
i.          కర్రల సమరానికి కర్నూలు జిల్లా దేవరగట్టు పరిసర గ్రామాల ప్రజలు సమాయత్తమవుతున్నారు. ఏటా దసరా పర్వదినం నాడు ఉత్సవ విగ్రహాల కోసం 11 గ్రామాల ప్రజలు రణరంగమే సృష్టిస్తారు
ii.       దేవరగట్టు కొండలో వెలసిన మాళ మల్లేశ్వర స్వామి కల్యాణోత్సవం సందర్భంగా కర్రల యుద్ధం జరగడం ఆనవాయితీగా వస్తోంది. దీనినిబన్నీఉత్సవంగానూ పిలుస్తారు.
iii.      కొంతమంది కర్రలు, మరికొందరు దీవిటీలు చేతపట్టి అర్ధరాత్రి వేళ కొండల మధ్య నుంచి దేవేరుల విగ్రహాలతో కల్యాణోత్సవానికి బయలుదేరుతారు.
iv.       సందర్భంగా ఉత్సవ విగ్రహాలను దక్కించుకునేందుకు పలు గ్రామాల ప్రజలు పోటీ పడతారు. ఆయా గ్రామాల ప్రజలు వర్గాలుగా విడిపోయి కర్రలతో పరస్పరం తలపడతారు. రక్తం చిందినా లెక్కచేయకుండా తమ భక్తి ప్రపత్తులను చాటుకుంటారు.
v.         కర్రల సమరాన్ని తిలకించేందుకు కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ తదితర ప్రాంతాల నుంచి ఔత్సాహికులు తరలివస్తారు. సంప్రదాయంపై పోలీసులు ఎన్ని ఆంక్షలు విధించినా ఆచారం పేరిట ఏటా రక్తపాతం సాగుతూనేఉంది
మైసూరులో వైభవంగా దసరా ఉత్సవాలు :
i.           మైసూరు రాజవంశస్థులు యదువీర్కృష్ణదత్త చామరాజ ఒడయార్సంప్రదాయబద్ధంగా శమీ వృక్షానికి పూజలు నిర్వహించారు. సాయంత్రం జరిగే జంబూ సవారీ కోసం గజరాజుల్ని నిర్వహకులు అందంగా అలంకరించారు
ii.       మైసూరు ఉత్సవాల సందడి దసరాకి నెల ముందు నుంచే ప్రారంభమవుతుంది. ఉత్సవాలను కర్ణాటక ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తుంది. మైసూరుకు చెందిన రాజ కుటుంబం 400 సంవత్సరాల క్రితం ప్రారంభించిన వేడుకలు ఈరోజుకీ అంతే ఉత్సాహంతో, అంతే భక్తి శ్రద్ధలతో జరుగుతూ వుండటం విశేషం.
iii.      మైసూరులో 1610 సంవత్సరం నుంచి దసరా వేడుకలు జరుపుతున్నారని చరిత్ర చెబుతోంది. వడయార్ రాజ వంశం వేడుకలను ప్రారంభించింది. అంతకుముందు శ్రీరంగపట్నం రాజధానిగా పరిపాలన చేసిన వడయార్ వంశీకులు 1610లో తమ రాజధానిని మైసూరుకు మార్చారు.
iv.     అప్పటి నుంచి దసరా వేడుకలు వైభవంగా జరుగుతున్నాయిస్వాతంత్ర్యం వచ్చిన తర్వాత మైసూరు రాజ్యాన్ని భారతదేశంలో విలీనం చేశారు. అయినా ఉత్సవాలను మాత్రం సంప్రదాయబద్ధంగా కొనసాగిస్తూనే ఉన్నారు.
v.       ఉత్సవాల్లో గజరాజులపై జంబూ సవారీ కీలక ఘట్టం. స్వర్ణ అంబారీ కట్టిన ఏనుగుతోపాటు అందంగా ముస్తాబు చేసిన మరికొన్ని ఏనుగులు వేడుకల్లో పాల్గొంటాయి. దీన్ని తిలకించేందుకు దేశ విదేశాల నుంచి లక్షలాదిమంది భక్తులు మైసూరుకు తరలి వస్తుంటారు.
ముఖ్యమైన రోజులు
9 October - World Post Day or World Post Office Day
i.       ప్రతి సంవత్సరం ప్రజలు మరియు వ్యాపారాలకు తపాలా రంగం పాత్ర గురించి ప్రజలలో అవగాహన పెంచడానికి ప్రతి సంవత్సరం అక్టోబర్ 9న ప్రపంచ తపాలా దినోత్సవం లేదా ప్రపంచ తపాలా కార్యాలయ దినోత్సవాన్ని జరుపుకుంటారు.
ii.      1874 లో, యూనివర్సల్ పోస్టల్ యూనియన్ స్విట్జర్లాండ్‌లోని బెర్న్‌లో స్థాపించబడింది మరియు దాని వార్షికోత్సవాన్ని 1969 లో జపాన్‌లోని టోక్యోలో యూనివర్సల్ పోస్టల్ యూనియన్ కాంగ్రెస్ ప్రపంచ పోస్టల్ డేగా ప్రకటించింది.



No comments:

Human Body

 మానవ శరీరం గురించి మనం మానవ శరీరాన్ని మైక్రోస్కోపిక్ స్థాయిలో "విచ్ఛిన్నం" చేస్తే, కణం దాని అత్యంత ప్రాథమిక యూనిట్‌గా ఉంటుంది. సగ...