✍ కరెంట్ అఫైర్స్ 26 సెప్టెంబరు 2019 Thursday ✍
జాతీయ వార్తలు
గవర్నర్ల కురు ‘క్షేత్ర’ పర్యటన :
⦁ వ్యవసాయం, దాని అనుబంధ రంగాలపై రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఏర్పాటు చేసిన గవర్నర్ల ఉపసంఘం సభ్యులు హరియాణాలోని కురుక్షేత్రంలో గల వ్యవసాయ క్షేత్రాలను సందర్శించారు.
⦁ గుజరాత్ గవర్నర్ ఆచార్య దేవ్‌వ్రత్ ఉపసంఘానికి అధ్యక్షులు కాగా తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌తో పాటు ఏపీ, మహారాష్ట్ర, హరియాణా, మధ్యప్రదేశ్‌ల గవర్నర్లు బిశ్వభూషణ్ హరిచందన్, భగత్ సింగ్ కోష్యారి, సత్యదేవ్ నారాయణ్ ఆర్య, లాల్జీ టాండన్‌లు సభ్యులు.
⦁ వీరంతా అక్కడి పంటపొలాల్లో సేంద్రియ వ్యవసాయం, సేంద్రియ ఎరువుల వాడకం, పురుగుమందుల వాడకాన్ని తగ్గించడం, నివారించడం వంటి అంశాలను పరిశీలించారు.
⦁ నవంబర్ మొదటి వారంలో వ్యవసాయరంగంపై సమగ్ర నివేదికను రాష్ట్రపతికి అందజేస్తారు.
PM Modi Inaugurates Gandhi Solar Park at UN Headquarters :
⦁ ఐరాస ప్రధాన కార్యాలయంలో 50 కిలోవాట్ల ‘గాంధీ సోలార్ పార్క్’ ను ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు.
⦁ యుఎన్ ప్రధాన కార్యాలయంలో జరిగిన "సమకాలీన ప్రపంచంలో మహాత్మా గాంధీ యొక్క చిత్యం" కార్యక్రమంలో మోడీ మరియు ఇతర నాయకులు మహాత్మా గాంధీ స్మారక తపాలా బిళ్ళను విడుదల చేశారు.
⦁ నేటి ప్రపంచంలో గాంధేయ ఆలోచనలు మరియు విలువల యొక్క చిత్యాన్ని నొక్కిచెప్పే మహాత్మా గాంధీ 150 వ జన్మదినోత్సవాన్ని జరుపుకోవడానికి ఈ కార్యక్రమం నిర్వహించబడింది.
తెలంగాణ వార్తలు
సంగారెడ్డి మహిళలకు ఐక్యరాజ్యసమితి అవార్డు :
⦁ అమెరికాలోని న్యూయార్క్‌లో ఐక్యరాజ్యసమితి ప్రాంగణంలో బుధవారం నిర్వహించిన కార్యక్రమంలో సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ ప్రాంతంలోని డీడీఎస్ మహిళలు ఈక్వేటరి పురస్కారాన్ని అందుకున్నారు.
⦁ ఆర్థిక ఎదుగుదల, పర్యావరణ పరిరక్షణ, పోషక విలువల పెంపు, చిరుధాన్యాల పంటల సాగు తదితర అంశాలపై రెండున్నర దశాబ్దాలుగా చేసిన కృషికిగాను డక్కన్ డెవలప్‌మెంట్ సంస్థ(డీడీఎస్)ను ఐక్యరాజ్యసమితి ఈక్వేటరి అవార్డుకు ఎంపిక చేసింది.
తెలంగాణకు మూడు జాతీయ అవార్డులు :
⦁ తెలంగాణ ప్రభుత్వం మూడు జాతీయ పురస్కారాలను దక్కించుకుంది. ప్రభుత్వం అందించే నీటి వినియోగాన్ని పెంచడంలో జాతీయ జల మిషన్ ఈ అవార్డులు ప్రకటించింది.
⦁ సాగునీటి వనరుల సమాచార వ్యవస్థలో తెలంగాణ నీటి వనరుల సమాచార వ్యవస్థ (టీడబ్ల్యూఆర్‌ఐఎస్)కు తొలిస్థానం దక్కగా కమిషనర్ మల్సూర్ కేంద్రమంత్రి చేతులమీదుగా అవార్డు, నగదు బహుమతి అందుకున్నారు.
⦁ తెలంగాణ గ్రామీణ నీటి సరఫరా, పారిశుద్ధ్య విభాగాల్లో మిషన్ భగీరథకు దక్కిన అవార్డును అధికారులు అందుకొన్నారు.
⦁ భూగర్భజలాలు పెంచినందుకు మూడోస్థానం దక్కగా రాష్ట్ర భూగర్భజలాల విభాగం అధికారులు అవార్డు అందుకొన్నారు.
⦁ కేంద్ర జల్‌శక్తి మంత్రి – గజేంద్ర సింగ్ షెకావత్, సహాయమంత్రి - రతన్‌లాల్ కటారియా
⦁ మంత్రిత్వశాఖ కార్యదర్శి - యూపీ సింగ్, జాతీయ జల మిషన్ డైరెక్టర్ - అశోక్‌కుమా
ఇతర రాష్ట్రాలు / కేంద్ర పాలిత ప్రాంతాల వార్తలు
Ponung Doming becomes Arunachal’s first woman Lieutenant Colonel :
⦁ ఆర్మీ ఆఫీసర్ పోనుంగ్ డోమింగ్ అరుణాచల్ ప్రదేశ్ నుండి భారత సైన్యంలో లెఫ్టినెంట్ కల్నల్ హోదాకు ఎదిగిన మొదటి మహిళా అధికారి.
⦁ ఆమె 2008 లో ఇండియన్ ఆర్మీలో లెఫ్టినెంట్‌గా నియమించబడింది. ఆమె 2013 లో మేజర్‌గా పదోన్నతి పొందింది.
⦁ ప్రస్తుతం ఆమె మహారాష్ట్రలోని పూణేలో పోస్ట్ చేయబడింది. ఆమె సివిల్ ఇంజనీరింగ్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. ఆమె 2014 లో కాంగోలో UN శాంతి పరిరక్షక దళానికి సేవలందించింది.
రాజకీయ వార్తలు
కమలదళంలోకి రెజ్లర్ యోగేశ్వర్‌దత్ :
⦁ ఒలింపిక్ క్రీడల్లో (2012) కాంస్య పతకాన్ని సాధించిన రెజ్లర్ యోగేశ్వర్ దత్ త్వరలో భాజపాలో చేరేందుకు రంగం సిద్ధమవుతోంది.
⦁ హరియాణా శాసనసభకు వచ్చే నెలలో జరిగే ఎన్నికల్లో దత్‌ను భాజపా తరఫున పోటీకి నిలపాలని కమలదళం యోచిస్తోంది.
అంతర్జాతీయ వార్తలు
ట్రంప్‌పై అభిశంసనకు దర్యాప్తు. తీర్మానం ప్రవేశపెట్టిన డెమోక్రాట్లు :
⦁ అమెరికా రాజకీయాల్లో నాటకీయ పరిణామం చోటుచేసుకుంది. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను పదవి నుంచి తొలగించేందుకు ఉద్దేశించిన అభిశంసన దర్యాప్తు తీర్మానాన్ని ప్రతినిధుల సభ (హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్)లో ప్రతిపక్ష డెమోక్రాటిక్ పార్టీ సభ్యులు ప్రవేశపెట్టారు.
⦁ ఒబామా హయాంలో ఉపాధ్యక్షుడిగా పనిచేసిన జో బిడెన్ వచ్చే ఎన్నికల్లో డెమోక్రాటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థిగా పోటీ చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు.
⦁ ఆయనకు ఇబ్బందులు కలిగించే ఉద్దేశంతో తూర్పు ఐరోపా దేశమైన ఉక్రెయిన్ సహాయాన్ని తీసుకున్నారన్నది ట్రంప్‌పై ఉన్న ప్రధాన ఆరోపణ.
⦁ బిడెన్ కుమారుడు హంటర్ గతంలో ఉక్రెయిన్ దేశంతో వ్యాపారాలు చేశారు. దాన్ని అవకాశంగా తీసుకొని బిడెన్, హంటర్‌లపై అవినీతి ఆరోపణలు చేసి, దర్యాప్తు చేయించాల్సిందిగా ఉక్రెయిన్ అధ్యక్షుడు వోల్డీమిర్ జెలినిస్కీపై ట్రంప్ ఒత్తిడి తీసుకొచ్చారు.
⦁ ఒత్తిడి పెంచడంలో భాగంగా ఆ దేశం రక్షణ అవసరాల కోసం ఇవ్వవలసిన 400 మిలియన్ డాలర్ల (రూ.2,800 కోట్లు) సహాయాన్ని తొక్కిపెట్టారు.
Defence News
‘వరాహ’ గస్తీ నౌక జాతికి అంకితం :
⦁ తీర గస్తీ నౌక ‘వరాహ’ను రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ చెన్నై రేవులో జాతికి అంకితం చేశారు. శత్రు సైన్యాలను ఎదుర్కోవడంలో తీర గస్తీ దళం కీలక పాత్ర పోషిస్తోందని తెలిపారు.
⦁ ఎల్‌అండ్‌టీ సంస్థ తయారు చేసిన ఈ నౌక మంగళూరు కేంద్రంగా సేవలందిస్తుందని అధికారులు పేర్కొన్నారు.
⦁ శత్రు సైన్యంతో దీటుగా పోరాడగల సామర్థ్యం దీనికి ఉందని, నౌకలో హెలికాప్టర్లు, అధిక వేగంతో నడిచే చిన్న పడవలు ఉంటాయని, 2,100 టన్నుల బరువు మోయగల సామర్థ్యం దీనికి ఉందని చెప్పారు.
India-US Tri-Services ”Exercise Tiger Triumph” to be held in November :
⦁ భారతదేశం మరియు యునైటెడ్ స్టేట్స్ ఈ ఏడాది నవంబర్‌లో ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం మరియు కాకినాడలో తమ మొదటి ట్రై-సర్వీసెస్ వ్యాయామ కోడ్ పేరు “టైగర్ ట్రయంఫ్” ను నిర్వహించనున్నాయి.
⦁ హెడ్‌క్వార్టర్స్ ఈస్టర్న్ నావల్ కమాండ్‌లో ముగిసిన ఇండియా-యుఎస్ ట్రై-సర్వీసెస్ హ్యుమానిటేరియన్ ఎయిడ్ అండ్ డిజాస్టర్ రిలీఫ్ (HADR) కోసం తుది ప్రణాళిక సమావేశం (FPC) లో ఈ వ్యాయామం యొక్క ప్రణాళిక చర్చించబడింది.
⦁ తొలిసారిగా, అమెరికా మరియు భారతదేశం త్రి-సేవా సైనిక వ్యాయామాన్ని నిర్వహించనున్నాయి. భారత్ ఇంతకుముందు రష్యాతో ఇటువంటి ట్రై-సర్వీస్ వ్యాయామం నిర్వహించింది.
⦁ అమెరికాలో జరిగిన ‘హౌడీ మోడీ!’ కార్యక్రమంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ‘టైగర్ ట్రయంఫ్’ కోసం ప్రకటన చేశారు.
సదస్సులు
64వ సభాపతుల సమావేశం – కంపా (ఉగాండా)
⦁ కామన్వెల్త్ దేశాల 64వ సభాపతుల సమావేశంలో పాల్గొనేందుకు వెళ్లిన తెలంగాణ శాసనసభాపతి పోచారం శ్రీనివాస్‌రెడ్డి ఉగాండా దేశ రాజధాని కంపాలకు చేరుకున్నారు. ఆయన వెంట శాసనసభ కార్యదర్శి నర్సింహాచార్యులున్నారు.
Appointments
ఐఎంఎఫ్ ఎండీగా క్రిస్టలీనా జార్జియెవా :
⦁ అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ (ఐఎంఎఫ్) మేనేజింగ్ డైరెక్టర్ (ఎండీ)గా బల్గేరియాకు చెందిన క్రిస్టలీనా జార్జియెవా ఎంపికయ్యారు.
⦁ 189 సభ్యులు కలిగిన ఐఎంఎఫ్‌కు నేతృత్వం వహించనున్న రెండో మహిళ కావడం గమనార్హం.
⦁ ఈ నెల ప్రారంభంలోనే ఐఎంఎఫ్ ఎండీ పదవి రేసులో క్రిస్టలీనా ఒక్కరే ఉన్నట్లు సంస్థ ప్రకటించింది. ఇంతకు ముందు ఈమె ప్రపంచ బ్యాంక్ సీఈఓగా సైతం వ్యవహరించారు.
Persons in news
నింగిలోకి యూఏఈ తొలి వ్యోమగామి :
⦁ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) చరిత్రలో సరికొత్త అధ్యాయం మొదలైంది. ఆ దేశ తొలి వ్యోమగామి హజ్జా అల్ మన్సూరీ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి (ఐఎస్‌ఎస్) పయనమయ్యారు.
⦁ కజఖ్‌స్థాన్‌లోని బైకనూర్ నుంచి మన్సూరీతోపాటు రష్యాకు చెందిన ఒలెగ్ స్క్రిపొచ్కా, నాసా వ్యోమగామి జెస్సికా మీర్‌ను సోయజ్ రాకెట్ నింగిలోకి మోసుకెళ్లింది.
Reports/Ranks/Records
2100 నాటికి 64 శాతం హిమనీ నదాలు మాయం. హిందూకుష్ హిమాలయ పర్వత ప్రాంతాలకు ముప్పు : IPCC నివేదిక
⦁ భూతాపం పెరుగుదల హిందూకుష్ హిమాలయ పర్వత(హెచ్‌కేహెచ్) ప్రాంతంలోని హిమనీ నదాలను ‘అగ్నిజ్వాలై’ హరించే ప్రమాదం పొంచి ఉంది.
⦁ 2100 నాటికి ఈ ప్రాంతంలోని 64 శాతం హిమనీ నదాలను మానవాళి కోల్పోయే మహా విషాదం కనుచూపుమేరలోనే ఉన్నట్లు ‘వాతావరణ మార్పుపై అంతర్ ప్రభుత్వ నిపుణుల సంఘం(ఐపీసీసీ) ప్రత్యేక నివేదిక హెచ్చరించింది.
⦁ ఇప్పటికే మాయమవుతున్న మంచు హెచ్‌కేహెచ్ సహా పలు ప్రాంతాల్లో వ్యవసాయ దిగుబడులపై దుష్ప్రభావాన్ని చూపుతున్న విషయాన్ని ఐపీసీసీ నివేదిక ప్రస్తావించింది.
⦁ పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో 2100 నాటికి హిమనీనదాల ఘనపరిమాణం 36 నుంచి 64శాతం వరకూ తగ్గిపోవచ్చని నివేదిక హెచ్చరించింది.
భారత శ్రీమంతుల్లో మళ్లీ ముకేశ్ నెం.1. హిందుజాలకు రెండో స్థానం :
⦁ భారత్‌లోని అత్యంత శ్రీమంతుడిగా రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ తన అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్నారు. వరుసగా ఎనిమిదో సంవత్సరం ఆయన ఈ స్థానంలో నిలవడం విశేషం.
⦁ ప్రస్తుత సంవత్సరానికి (2019) భారత్‌లోని శ్రీమంతులపై ఐఐఎఫ్‌ఎల్ వెల్త్ మేనేజ్‌మెంట్, హ్యురన్ ఈ జాబితాను రూపొందించాయి.
⦁ భారత సంతతి లండన్ వాసులు ఎస్‌పి హిందుజా, ఆయన కుటుంబీకులకు రెండో స్థానం లబించింది. విప్రో వ్యవస్థాకుడు అజీమ్ ప్రేమ్‌జీ మూడో ర్యాంకు పొందారు.
⦁ భారత మహిళల్లో హెచ్‌సీఎల్ ఎంటర్‌ప్రైజెస్ సీఈఓ రోషిణి నాడార్ అత్యంత శ్రీమంతురాలు. ఈమె తర్వాతి స్థానంలో గోద్రేజ్ గ్రూపునకు చెందిన స్మితా వి కృష్ణ నిలిచారు.
⦁ స్వయం శక్తితో వ్యాపారవేత్తగా ఎదిగిన మహిళల్లో అత్యంత శ్రీమంతురాలిగా బయోకాన్ వ్యవస్థాపకురాలు కిరణ్ మజుందార్ షా తన స్థానాన్ని నిలబెట్టుకున్నారు.
⦁ శ్రీమంతుల ఖిల్లాగా ముంబయి నిలిచింది. జాబితాలో 246 మంది ఈ నగరవాసులే. ఆ తర్వాతి స్థానంలో దిల్లీ (175 మంది), బెంగళూరు (77) నగరాలు నిలిచాయి. హైదరాబాద్ నాలుగో స్థానానికి ఎగబాకింది.
⦁ జాబితాలోని తొలి 25 స్థానాల్లో నిలిచిన వాళ్ల మొత్తం సంపద భారత జీడీపీ విలువలో (సుమారు రూ.190 లక్షల కోట్లు) 10 శాతం కావడం గమనార్హం.
అవార్డులు
పాయల్‌కు ఛేంజ్‌మేకర్ అవార్డు :
⦁ బాల్య వివాహాల నిర్మూలనకు కృషి చేసిన పాయల్ జంగిడ్(17) ప్రతిష్ఠాత్మక ‘ఛేంజ్‌మేకర్-2019’ పురస్కారాన్ని అందుకుంది. బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్ ఈ అవార్డును ప్రకటించింది.
⦁ ఆమె స్వస్థలం రాజస్థాన్‌లోని హిన్‌స్లా.
గ్రెటా థెన్‌బర్గ్‌కు రైట్ లైవ్‌లీహుడ్ అవార్డు :
⦁ వాతావరణ మార్పుపై తక్షణ కార్యాచరణకు ఉద్యమించిన స్వీడన్‌కు చెందిన గ్రెటా థెన్‌బర్గ్‌కు అత్యంత ప్రతిష్ఠాత్మక ‘రైట్ లైవ్‌లీ హుడ్’ అవార్డు లభించింది.
మరణాలు
హాస్యనటుడు వేణుమాధవ్ కన్నుమూత :
⦁ తెలుగు ప్రేక్షకుల్ని అలరించిన ప్రముఖ హాస్యనటుడు వేణుమాధవ్(51) తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. సూర్యాపేట జిల్లా కోదాడకు చెందిన వేణుమాధవ్ గత కొంతకాలంగా కాలేయ సంబంధ వ్యాధితో బాధపడుతున్నారు.
⦁ మిమిక్రీ కళాకారుడిగా తన ప్రస్థానం ప్రారంభించిన వేణుమాధవ్ ‘సంప్రదాయం’ సినిమాతో వెండితెరపైకొచ్చారు. దాదాపు ఆరు వందల చిత్రాలలో వివిధ పాత్రలతో నవ్వించారు. ‘లక్ష్మి’ చిత్రానికి గానూ ఆయనను నంది అవార్డు వరించింది.
⦁ ‘హంగామా’తో కథానాయకుడిగా మారారు. ‘భూకైలాస్’, ‘ప్రేమాభిషేకం’ చిత్రాల్లోనూ హీరోగా మెరిశారు. ‘ప్రేమాభిషేకం’ సినిమాను నిర్మించారు.
⦁ తెదేపా తరఫున అనేక సార్లు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బరిలోకి దిగి కోదాడలో నామినేషన్ కూడా వేశారు. కానీ పొత్తులో భాగంగా ఆ సీటును తెదేపా కాంగ్రెస్‌కు వదిలేయడంతో పార్టీ ఆదేశానుసారం పోటీ నుంచి తప్పుకొన్నారు.
⦁ నేరేళ్ల వేణుమాధవ్ స్ఫూర్తితో వెంట్రిలాక్విజం (బొమ్మతో మాట్లాడించడం) నేర్చుకున్నారు. తెలుగుదేశం పార్టీ నిర్వహించే ‘మహానాడు’లో ప్రదర్శనలు ఇచ్చారు. అప్పుడే నందమూరి తారక రామారావుతో పరిచయం ఏర్పడింది.
⦁ కొంతకాలం అసెంబ్లీలో లైబ్రేరియన్‌గానూ ఉన్నారు. ఆ తరవాత టీడీపీ కార్యాలయంలో టెలిఫోన్ ఆపరేటర్‌గా పనిచేశారు. అప్పుడు రవీంద్రభారతిలో నాటకాలు చూడడం అలవాటు చేసుకున్నారు.
⦁ ఓసారి ‘ఈడ్లు లాడ్లు’ అనే నాటికలో నటించారు. అది చూసి దర్శకనిర్మాతలు ఎస్వీకృష్ణారెడ్డి, అచ్చిరెడ్డి ‘సంప్రదాయం’లో తొలి అవకాశం ఇచ్చారు. ‘తొలిప్రేమ’ నటుడిగా గుర్తింపు తెచ్చింది.
ముఖ్యమైన రోజులు
President Ram Nath Kovind inaugurates 6th India Water Week, 2019 : 24th-28th September
⦁ Theme 2019 : Water cooperation-coping with 21st century challenge
⦁ న్యూ డిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో “21 వ శతాబ్దపు సవాల్‌తో నీటి సహకారం-ఎదుర్కోవడం” అనే థీమ్‌తో ఆరవ “ఇండియా వాటర్ వీక్ -2019” ను అధ్యక్షుడు రామ్ నాథ్ కోవింద్ ప్రారంభించారు.
⦁ ప్రస్తుతం ఉన్న జలాశయాలు, ఆనకట్టలు, ఇతర నీటి వనరులను ఉపయోగించడం ద్వారా వర్షపునీటిని నిల్వ చేసి స్వాధీనం చేసుకోవలసిన అవసరాన్ని రాష్ట్రపతి నొక్కి చెప్పారు.
ప్రపంచ గర్భనిరోధక దినం (World Contraception Day) – September 26
⦁ ప్రపంచ గర్భనిరోధక దినం ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 26 న జరుగుతుంది. 2007 లో ప్రారంభించబడింది.
⦁ అందుబాటులో ఉన్న అన్ని గర్భనిరోధక పద్ధతులపై అవగాహన మెరుగుపరచడం మరియు వారి లైంగిక మరియు పునరుత్పత్తి ఆరోగ్యంపై యువతకు సమాచారం ఇవ్వడానికి వీలు కల్పించడం ఈ రోజు లక్ష్యం.
దీన్‌దయాళ్ ఉపాధ్యాయ 103వ జయంతి – 25 సెప్టెంబర్
⦁ దీన్‌దయాల్ ఉపాధ్యాయ (25 సెప్టెంబర్ 1916 - 11 ఫిబ్రవరి 1968) ఆర్‌ఎస్‌ఎస్ భావజాలం యొక్క భారతీయ ఆలోచనాపరుడు మరియు భారతీయ జనతా పార్టీకి పూర్వగామి అయిన భారతీయ జనసంఘ్ రాజకీయ పార్టీ మాజీ నాయకుడు.
⦁ అతను డిసెంబర్ 1967 లో జనసంఘ్ అధ్యక్షుడయ్యాడు. అతను మర్మమైన పరిస్థితులలో మరణించాడు, అతని మృతదేహం 11 ఫిబ్రవరి 1968 న మొఘల్సరై జంక్షన్ రైల్వే స్టేషన్ సమీపంలో రైల్వే ట్రాక్ లో కనుగొనబడింది. ఆయన మరణించిన 50 సంవత్సరాల తరువాత రైల్వే స్టేషన్ పేరు 2018 లో అతని గౌరవార్థం మార్చబడింది.
⦁ దీనదయాళ్ ఉపాధ్యాయ రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ మాజీ అధ్యక్షుడు, భారతీయ జనతా పార్టీ హైందవ రాష్ట్రం సిద్దాంతకర్త . పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ 1916 సెప్టెంబర్ 25న ఉత్తర ప్రదేశ్ లోని మధుర దగ్గర 'నగ్ల చంద్రభాన్' అనే గ్రామంలో జన్మించారు. 1937లో మొదటి కొద్దిమంది స్వయంసేవకులలో ఒకరిగా చేరి ప్రాదేశిక సహ ప్రచారక్ స్థాయికి ఎదిగారు.
⦁ 1952లో భారతీయ జన సంఘ్లో చేరి ఉపాధ్యక్షుడిగా నియమితులయ్యాడు. 1967లొ జన సంఘ్ అధ్యక్ష పదవి చేపట్టేవరకు ఆ పదవిలో కొనసాగారు. శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ మరణంతరము పార్టీ బాధ్యతలు భుజానవేసుకొని విజయపధంలో నడిపించారు. అలాగే ఆర్.ఎస్.ఎస్ వారపత్రిక పాంచజన్య మరియు లక్నొ దినపత్రిక 'స్వదేశ్'లకు సంపాదకీయులుగా వ్యవహరించారు.
⦁ భారతీయ జనతా పార్టీ హైందవ రాష్ట్రం సిద్దాంతానికి పునాదిగా చెప్పబడే ఏకాత్మతా మానవతా వాదం, శంకరాచార్య జీవిత చరిత్ర వంటి పుస్తకాలు, హిందీలో 'చంద్రగుప్త మౌర్య' నాటకం, మరాఠీ నుండి ఆర్.ఎస్.ఎస్ వ్యవస్థాపకులు డా. హెడ్గేవార్ జీవిత చరిత్ర అనువాదం వంటి పలు రచనలు చేశారు. 1968 ఫిబ్రవరి 11న ఆయన అకాల మరణం చెందినాడు.
⦁ భారతీయ జనసంఘ్‌కు సిద్ధాంతాలు లేవన్నవారి నోర్లు మూయించడానికి ఏకాత్మతా మానవతా వాదం అనే సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. అట్టడుగున పడివున్న మానవుడు ఐహిక సుఖంతో వర్థిల్లి, ఆధ్యాత్మిక దృష్టితో మానవసేవ చేయడమే సరైన జీవిత విధానమని అందులో వాదించాడు.
క్రీడలు
పంకజ్‌కు మరో ప్రపంచ టైటిల్ @మందాలయ్ (మయన్మార్)
⦁ ఆదిత్య మెహతాతో కలిసి ప్రపంచ స్నూకర్ టీమ్ విభాగంలో ఛాంపియన్‌గా నిలిచాడు. పంకజ్‌కు ఇది 23వ ప్రపంచ టైటిల్ కాగా.. ఆదిత్యకు ఇదే మొదటిది.
⦁ ఫైనల్లో పంకజ్- ఆదిత్య జోడీ 5-2 తేడాతో థాయ్‌లాండ్‌పై నెగ్గింది.
పీటీ ఉషకు ఐఏఏఎఫ్ వెటరన్ పిన్ :
⦁ పరుగుల రాణి పీటీ ఉషకు ప్రపంచ అథ్లెటిక్స్ సమాఖ్య వెటరన్ పిన్‌ను బహూకరించింది. క్రీడ ఎదుగుదలలో పాలుపంచుకున్నందుకు ఆమెకు ఈ గౌరవం దక్కింది.
⦁ ఐఏఏఎఫ్ 52వ కాంగ్రెస్ సందర్భంగా సమాఖ్య అధినేత సెబాస్బియన్ కో.. ఉషకు పిన్‌ను అందించారు. ఆసియా నుంచి ఈ గౌరవాన్ని పొందిన ముగ్గురిలో ఉష ఉంది.
⦁ 1985 ఆసియా క్రీడల్లో ఉష ఐదు స్వర్ణ పతకాలు గెలిచింది.

No comments:
Post a Comment