Wednesday, 30 October 2019

జోనల్‌ విధానంపై ఉత్తర్వుల సవరణకు లేఖ :

హైదరాబాద్‌ : తెలంగాణలో జోనల్‌ విధానానికి సంబంధించిన రాష్ట్రపతి ఉత్తర్వుల సవరణలకు సత్వరమే ఆమోద ముద్ర వేసి, ఆదేశాలివ్వాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసింది. తెలంగాణలో కొత్త జోనల్‌ విధానం అమల్లోకి వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ములుగు, నారాయణపేట జిల్లాలను ఏర్పాటు చేయడంతోపాటు వికారాబాద్‌ జిల్లాను జోగులాంబ గద్వాల జోన్‌ నుంచి చార్మినార్‌ జోన్‌లోకి మార్చింది . ఈ సవరణలను జోనల్‌ వ్యవస్థలో చేర్చి ఉత్తర్వులు జారీ చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ రాష్ట్ర మంత్రిమండలి తీర్మానం చేసి ప్రతిపాదనలు పంపింది. రెండు నెలలుగా ఈ దస్త్రం కేంద్రం వద్ద పెండింగులో ఉంది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇటీవల దిల్లీ పర్యటనలో ప్రధానమంత్రి నరేంద్రమోదీకి దీనిపై వినతిపత్రం అందజేశారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు తాజాగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషి దీనిపై కేంద్ర హోంశాఖకు లేఖ రాశారు.

No comments:

Human Body

 మానవ శరీరం గురించి మనం మానవ శరీరాన్ని మైక్రోస్కోపిక్ స్థాయిలో "విచ్ఛిన్నం" చేస్తే, కణం దాని అత్యంత ప్రాథమిక యూనిట్‌గా ఉంటుంది. సగ...