Sunday, 13 October 2019

10th october 2019 telugu current affairs


                         కరెంట్ అఫైర్స్ 10 అక్టోబరు 2019 Thursday
జాతీయ వార్తలు
పల్లవుల నగరంలో స్నేహానికి కొత్త పల్లవి.. మామల్లాపురంలో మోదీ జిన్పింగ్ భేటీ :
i.       సముద్ర తీర నగరమైన చెన్నై సమీపంలోని మామల్లాపురంలో శుక్ర, శనివారాల్లో మోదీ-జిన్‌పింగ్‌ల సదస్సు జరుగుతుందని ఇరుదేశాల విదేశీ వ్యవహారాల శాఖలు అధికారికంగా ప్రకటించాయి.
ii.      2017లో చైనా సరిహద్దులోని డోక్లాం వద్ద రెండు దేశాల సైనికుల మధ్య ప్రతిష్టంభన నెలకొన్న అనంతరం ఉద్రిక్తతలను తొలగించడానికి గత ఏడాది ఏప్రిల్‌లో చైనాలోని వూహన్‌లో తొలిసారి లాంఛనాలు లేని శిఖరాగ్ర సదస్సు జరిగింది. దానికి కొనసాగింపుగా రెండోది ప్రస్తుతం భారత్‌లో జరగనుంది.
iii.    మోదీ, జిన్పింగ్లకు సాదరస్వాగతం పలుకుతామని తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి చెన్నైలో చెప్పారు. 1956లో మామల్లాపురానికి  సమీపంలోని కుళిప్పందళానికి అప్పటి చైనా అధ్యక్షుడు చౌ ఎన్లై వచ్చారని గుర్తు చేశారు.
iv.    మోదీ, జిన్పింగ్సముద్ర తీర మందిరాల సముదాయం’ (సీ షోర్టెంపుల్‌)లో సమావేశమవుతారు. అక్కడ ఉన్న వెయ్యేళ్లనాటి చారిత్రక కట్టడాలను సందర్శిస్తారు
v.     మామల్లాపురంలోని శిల్పాలన్నింటిలోనూ పరమశివుడి నుంచి అర్జునుడు పాశుపతాస్త్రం పొందే ఘట్టం అద్భుతంగా ఉంటుందిచైనాతో మామల్లాపురానికి ఉన్న బంధం రెండు వేల ఏళ్ల నాటిదనడానికి చారిత్రక అధారాలు ఉన్నాయి.
vi.    పల్లవుల కాలంలో అప్పటి చైనా రాజువి’  దేశ వర్తకులను కడల్మల్లై (మహాబలిపురం)కు పంపించారు. పల్లవ రాజు అనుమతితో చైనా రాజు నాగపట్నం ఓడరేవులో బుద్ధుడి విగ్రహాన్ని నెలకొల్పారు.
తెలంగాణ వార్తలు
జోర్గ్స్రోఫెన్‌’పై సూర్య నమస్కారాలు. మూడేళ్లలో 9 పర్వతాలు ఎక్కిన జగిత్యాల యువకుడు :
i.       ఇటీవల ఆస్ట్రియా దేశంలోని అగెన్స్టయిన్పర్వతాన్ని అధిరోహించిన జగిత్యాల జిల్లా యువకుడు మరిపెల్లి ప్రవీణ్మరోసారి అదే దేశంలోని జోర్గ్స్రోఫెన్పర్వతాన్ని ఎక్కి సత్తా చాటారు. అక్కడ 9 డిగ్రీల ఉష్ణోగ్రతలో 26 నిమిషాల్లో 108 సూర్య నమస్కారాలు చేశారు.
ii.      మూడేళ్లలో ఆరు దేశాల్లో ఎనిమిది పర్వతాలను ఎక్కిన ఆయన జోర్గ్స్రోఫెన్పర్వతాన్ని అధిరోహించి తొమ్మిదోసారి ఘనతను సాధించారు.
iii.    మెట్పల్లి మండలం వెల్లుల్లకు చెందిన ప్రవీణ్వడోదరాలో యోగా శిక్షకుడిగా పనిచేస్తూ శిఖరాలను అధిరోహిస్తున్నారు. జర్మనీ దేశం నుంచి 1635 మీటర్ల ఎత్తయిన జోర్గ్స్రోఫెన్పర్వతాన్ని ఎక్కారు.
Defence News
చేతికందిన రఫేల్‌.. ఫ్రాన్స్లో తొలి విమానాన్ని అందుకున్న రాజ్నాథ్‌ :

i.       మొత్తం 36 రఫేల్యుద్ధ విమానాల కొనుగోలుకు సంబంధించిన అంతర్ప్రభుత్వ ఒప్పందంపై భారత్‌, ఫ్రాన్స్లు 2016 సెప్టెంబరులో సంతకాలు చేశాయి. ఒప్పందం విలువ రూ.58 వేల కోట్లు.
ii.      ఫ్రాన్స్కు చెందిన డసో ఏవియేషన్సంస్థరఫేల్‌’లను తయారుచేస్తుంది. భారత వాయుసేన వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకొని మిరిన్యాక్వైమానిక స్థావరం వద్ద తొలి రఫేల్విమానాన్ని రాజ్నాథ్అందుకున్నారు.
iii.    రఫేల్ఒప్పందంలో వైమానిక దళం ప్రస్తుత అధిపతి ఎయిర్చీఫ్మార్షల్ఆర్‌.కె.భదౌరియా కీలక పాత్ర పోషించిన నేపథ్యంలో తొలి విమానం తోక భాగంపైఆర్బీ 01’ అని రాశారు.

iv.    రఫేల్‌’ ఫ్రెంచి పదం. ‘గాలి దుమారంఅని దానికి అర్థం. ఇది మధ్యశ్రేణి బహుళ ప్రయోజనకర యుద్ధ విమానం(ఎంఎంఆర్సీఏ). వేగం, చురుకుతనం దాని ప్రత్యేకత. క్షిపణులు సహా భిన్న తరహా ఆయుధాలను మోసుకెళ్లగలదు. అత్యంత కచ్చితత్వంతో లక్ష్యాలను ఛేదించగలదు. భారత వాయుసేన అవసరాలకు అనుగుణంగారఫేల్‌’లో 13 మార్పులు చేశారు.
ఆర్థిక అంశాలు
Reliance MF renamed as “Nippon India Mutual Fund” :
i.       రిలయన్స్ మ్యూచువల్ ఫండ్ పేరు “నిప్పాన్ ఇండియా మ్యూచువల్ ఫండ్” గా మార్చబడింది. రిలయన్స్ నిప్పాన్ లైఫ్ అసెట్ మేనేజ్‌మెంట్‌లో 75% వాటాను నిప్పాన్ లైఫ్ ఇన్సూరెన్స్ కొనుగోలు చేసిన తరువాత ఈ సంస్థ పేరు మార్చబడింది.
ii.      నిప్పాన్ ఇండియా మ్యూచువల్ ఫండ్ భారతదేశంలో అతిపెద్ద విదేశీ యాజమాన్యంలోని ఆస్తి నిర్వహణ సంస్థగా మారింది. సంస్థగా సీఈఓగా సందీప్ సిక్కా నాయకత్వం వహిస్తారు.
                            Appointments
ఐపీఏ అధ్యక్షుడిగా సతీశ్రెడ్డి :
i.          భారత ఔషధ సంఘం (ఐపీఏ) నూతన అధ్యక్షుడిగా డాక్టర్రెడ్డీస్లేబొరేటరీస్ఛైర్మన్సతీశ్రెడ్డి నియమితులయ్యారు. ఆయన రెండేళ్ల కాలం పాటు పదవిలో కొనసాగుతారు.
ii.       ఐపీఏ ఉపాధ్యక్షుడిగా పానేసియా బయోటెక్ఎండీ డాక్టర్రాజేశ్జైన్కొనసాగుతారు. సతీశ్రెడ్డి దేశీయంగా ఔషధ రంగానికి సంబంధించిన వ్యవహారాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారని ఐపీఏ పేర్కొంది
Antonio Costa re-elected as the PM of Portugal :
i.          సాధారణ ఎన్నికలలో గెలిచిన తరువాత ఆంటోనియో కోస్టా పోర్చుగల్ ప్రధానిగా తిరిగి ఎన్నికయ్యారు.
ii.       సోషలిస్ట్ నాయకుడు మరియు ప్రస్తుత ప్రధాని ఆంటోనియో కోస్టా పోర్చుగల్ సార్వత్రిక ఎన్నికలలో అత్యధిక ఓట్లు సాధించారు, మరో నాలుగు సంవత్సరాలు ప్రభుత్వాన్ని నడిపించడానికి ఇది సిద్ధంగా ఉంటుంది.
Reports/Ranks/Records
India ranks 68th on WEF’s Global Competitiveness Index :
i.          ప్రపంచ ఆర్థిక ఫోరం గ్లోబల్ కాంపిటిటివ్నెస్ ఇండెక్స్ నివేదికను విడుదల చేసింది. మొత్తంగా, 12 స్తంభాలలో 103 సూచికలు పంపిణీ చేయబడ్డాయి, వీటిపై దేశాల పనితీరు అంచనా వేయబడింది.
ii.       WEF విడుదల చేసిన నివేదిక ప్రకారం, సింగపూర్ అగ్రస్థానంలో; వార్షిక ప్రపంచ పోటీతత్వ సూచికలో భారతదేశం 10 స్థానాలను తగ్గించి 68 స్థానంలో నిలిచింది.
iii.     ఏడాది 71 స్థానంలో ఉన్న బ్రెజిల్తో పాటు అత్యధికంగా పనిచేస్తున్న బ్రిక్స్ దేశాలలో భారత్ ఒకటి.
iv.     స్థూల ఆర్థిక స్థిరత్వం మరియు మార్కెట్ పరిమాణం పరంగా భారతదేశం అధిక స్థానంలో ఉందని WEF పేర్కొంది, అధిక అపరాధ రేటు ఉన్నప్పటికీ దాని ఆర్థిక రంగం చాలా లోతుగా మరియు స్థిరంగా ఉంది, ఇది దాని బ్యాంకింగ్ వ్యవస్థ యొక్క ధ్వనిని బలహీనపరచడానికి దోహదం చేస్తుంది.
అవార్డులు
లిథియం బ్యాటరీ సృష్టికర్తలకు నోబెల్‌. అత్యున్నత పురస్కారానికి ఎంపికైన గుడెనవ్‌, విట్టింఘమ్‌, యోషినో. రసాయన శాస్త్ర విభాగంలో ప్రకటన. నోబెల్‌కు ఎంపికైన అతిపెద్ద వయస్కుడిగా గుడెనవ్‌ రికార్డు :
i.       మానవాళి చరిత్రలో విప్లవాత్మక ఆవిష్కరణల్లో ఒకటిగా పేరుగాంచినలిథియం అయాన్బ్యాటరీసృష్టికర్తలు జాన్గుడెనవ్‌, స్లాన్లీ విట్టింఘమ్‌, అకీరా యోషినోలకు సముచిత గౌరవం లభించింది.
ii.      తమ పరిశోధనలతో ఎన్నెన్నో ఎలక్ట్రానిక్ఉపకరణాల తయారీకి, శిలాజ ఇంధన రహిత సమాజానికి బాటలు పరిచినందుకుగాను రసాయన శాస్త్ర విభాగంలో అత్యున్నత నోబెల్పురస్కారం వారిని వరించింది.
iii.     గుడెనవ్అమెరికాకు చెందినవారు కాగా, విట్టింఘమ్బ్రిటన్పౌరుడు. యోషినో జపాన్కు చెందిన పరిశోధకుడు. పురస్కారంతోపాటు అందే రూ.6.50 కోట్ల నగదు బహుమతిని సంయుక్తంగా పంచుకుంటారు.
iv.    గుడెనవ్వయసు 97 ఏళ్లు. అతిపెద్ద వయసులో నోబెల్పురస్కారం గెల్చుకున్న వ్యక్తిగా ఆయన రికార్డులకెక్కారు.
v.      1991లో లిథియం బ్యాటరీలు తొలిసారి విపణిలోకి ప్రవేశించాయి. నాటి నుంచి మానవ జీవితాల్లో అవి విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చాయి. లిథియంలోని అంతర్గత శక్తిని మెరుగ్గా ఉపయోగించుకునే ఉపాయాన్ని స్లాన్లీ విట్టింఘమ్కనుగొన్నారు.
vi.    లిథియం అనేది నీటిపై తేలియాడేటంత తేలికైన లోహం. పాక్షికంగా లిథియం మూలకాన్ని ఉపయోగించి బ్యాటరీని ఆయన తయారు చేశారు. ఎలక్ట్రాన్లను కోల్పోవడం ద్వారా అందులో శక్తిని లిథియం ప్రసరింపజేసింది.
భౌతిక శాస్త్రంలో ముగ్గురిని వరించిన పురస్కారం. విశ్వం ఆవిర్భావంపై పరిశోధనలకుగాను జేమ్స్పీబుల్స్కు.. సౌర కుటుంబం ఆవల గ్రహాన్ని గుర్తించినందుకు మేయర్‌, కెలాజ్లకు.. :
i.       అనంత విశ్వంపై మానవాళి అవగాహన పరిజ్ఞానాన్ని పెంచేలా కీలక అంశాలను గుర్తించిన కెనడా-అమెరికన్ఖగోళ శాస్త్రవేత్త జేమ్స్పీబుల్స్‌, స్విట్లర్జాండ్శాస్త్రవేత్తలు మిషెల్మేయర్‌, డిడియెర్కెలాజ్లకు అత్యున్నత గుర్తింపు లభించింది.
ii.       భౌతిక శాస్త్రంలో నోబెల్పురస్కారానికి వారు ఎంపికయ్యారు. మొత్తం బహుమతిలో సగ భాగాన్ని పీబుల్స్‌; మిగిలిన సగాన్ని మేయర్‌, కెలాజ్సంయుక్తంగా గెల్చుకున్నట్లు రాయల్స్వీడిష్అకాడమీ ఆఫ్సైన్సెస్సెక్రటరీ జనరల్ప్రొఫెసర్గొరాన్హాన్సన్ప్రకటించారు.
iii.    మహా విస్ఫోటనం (బిగ్బ్యాంగ్‌) చోటుచేసుకున్నాక కాంతి కిరణాలు అంతరిక్షం ఆవలికి ప్రసరించడం ప్రారంభించాయి. నాటి పరిణామాలను పీబుల్స్విశ్లేషించారు.
iv.    మనకు తెలిసిన నక్షత్రాలు, గ్రహాలు, భూమి.. ఇవన్నీ మహా విస్ఫోటనంతో ఏర్పడిన పదార్థంలో కేవలం ఐదు శాతం మాత్రమేనని ఆయన గుర్తించారు. కృష్ణ పదార్థం, కృష్ణ శక్తి 95 శాతం విస్తరించి ఉన్నాయని తేల్చారు
సౌర కుటుంబం ఆవల తొలిసారి..
v.     మేయర్‌, కెలాజ్‌ 1995 అక్టోబరులో దక్షిణ ఫ్రాన్స్లోని అంతరిక్షశాలలో పరిశోధనలు సాగిస్తూ.. పాలపుంతలోనే సౌర కుటుంబం ఆవల వేరే నక్షత్రం చుట్టూ పరిభ్రమిస్తున్న అంతుచిక్కనివస్తువును గుర్తించారు. గాలితో నిండిన బంతి తరహాలో అది కనిపించింది. గురుగ్రహం పరిమాణంలో ఉన్న వస్తువు’.. గ్రహమేననిడాప్లర్ఎఫెక్ట్‌’ సిద్ధాంతం ద్వారా నిర్ధారించారు. ‘51 పెగాసుస్బిగా శాస్త్రవేత్తలు దానికి నామకరణం చేశారు. సౌర వ్యవస్థ ఆవల గుర్తించిన తొలి గ్రహం అదే
vi.    ‘51 పెగాసుస్బిను ఉనికి బయటపడ్డాక, సౌర కుటుంబం ఆవల ఇప్పటివరకు 4 వేలకుపైగా గ్రహాలను శాస్త్రవేత్తలు గుర్తించిన సంగతిని గుర్తుచేశారు
సినిమా వార్తలు
బేగం హయత్బక్షి జీవిత కథతో యానిమేషన్చిత్రం :
i.       గోల్కొండను పరిపాలించిన మహ్మద్కులీ కుత్బ్షా కుమార్తె బేగం హయత్బక్షి జీవిత కథను ఐఐటీయన్లు యానిమేషన్చిత్రంగా రూపొందించారు.
ii.      అలనాటి అపురూప కట్టడాల ప్రత్యేకతను తరానికి పరిచయం చేస్తూమా షాహెబా-ది క్వీన్ఆఫ్హైదరాబాద్‌’ పేరుతో కళాఖండానికి ప్రాణం పోశారు
iii.    హెచ్ఐసీలో నిర్వహించేహైదరాబాద్డిజైన్‌’ వారోత్సవాల్లో చిత్రాన్ని ప్రదర్శించనున్నట్లు  ఐఐటీహెచ్ప్రొఫెసర్దీపక్మాథ్యూ తెలిపారు
“Spirit Of Kerala” wins People’s Choice Award :
i.       కేరళ నుండి వచ్చిన షార్ట్ ఫిల్మ్ “స్పిరిట్ ఆఫ్ కేరళ ఇటీవల ముగిసిన మై రోడ్ రీల్ చిత్ర పోటీలో పీపుల్స్ ఛాయిస్ అవార్డును గెలుచుకుంది.
ii.      ఈ చిత్రం 1,680 ఎంట్రీలను ఓడించి గౌరవాన్ని గెలుచుకుంది. లఘు చిత్రం బోట్ రేసు ఆధారంగా మరియు అరుణ్ జోసెఫ్ దర్శకత్వం వహించారు.
iii.    మై రోడ్ రీల్ చలనచిత్ర పోటీని ‘ప్రపంచంలోనే అతిపెద్ద లఘు చిత్ర పోటీ అని పిలుస్తారు.

ముఖ్యమైన రోజులు
World Mental Health Day : 10 October
i.       Theme 2019 : Suicide Prevention
ii.      ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతి సంవత్సరం అక్టోబర్ 10 న ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవాన్ని జరుపుకుంటుంది. ప్రపంచవ్యాప్తంగా మానసిక ఆరోగ్య సమస్యలపై అవగాహన పెంచడం మరియు మానసిక ఆరోగ్యానికి మద్దతుగా ప్రయత్నాలను సమీకరించడం అనే లక్ష్యంతో ఈ రోజును జరుపుకుంటారు.
iii.    మానసిక ఆరోగ్య సమస్యలపై పనిచేసే వాటాదారులందరికీ వారి పని గురించి మాట్లాడటానికి మరియు మానసిక ఆరోగ్య సంరక్షణను ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలకు రియాలిటీగా మార్చడానికి ఇంకా ఏమి చేయాలి అనేదానిని ఈ రోజు అందిస్తుంది.
iv.    ఈ సంవత్సరం దినోత్సవం కోసం ఎంచుకున్న థీమ్ : ఆత్మహత్యల నివారణ.
v.     ఈ సంవత్సరం దినోత్సవానికి WHO, ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఫర్ సూసైడ్ ప్రివెన్షన్ మరియు యునైటెడ్ ఫర్ గ్లోబల్ మెంటల్ హెల్త్ మద్దతు ఇస్తున్నాయి. ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవాన్ని మానసిక ఆరోగ్యం కోసం ప్రపంచ సమాఖ్య నిర్వహిస్తుంది.
World Sight Day - Second Thursday of October (In 2019, October 10)
i.       This year, the ‘Call to Action‘ for World Sight Day is : Vision First !
ii.      ప్రపంచ దృష్టి దినోత్సవం, ఏటా అక్టోబర్ రెండవ గురువారం నాడు జరుపుకుంటారు, ఇది అంధత్వం మరియు దృష్టి లోపంపై దృష్టిని ఆకర్షించడానికి ఉద్దేశించిన ప్రపంచ సంఘటన. దీనిని మొదట 2000 లో లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ యొక్క సైట్ ఫస్ట్ క్యాంపెయిన్ ప్రారంభించింది.
iii.    అప్పటి నుండి ఇది విజన్ 2020 లో విలీనం చేయబడింది మరియు ప్రపంచ ఆరోగ్య సంస్థ సహకారంతో IAPB చే సమన్వయం చేయబడింది.
National Postal Day - October 10
i.       ప్రతి సంవత్సరం అక్టోబర్ 10 న జాతీయ పోస్టల్ డే జరుపుకుంటారు. భారతీయ పోస్టల్ విభాగం 150 సంవత్సరాలకు పైగా దేశానికి సేవలు అందిస్తోంది.
ii.      భారత పోస్టల్ డే (October 10) వేడుక ప్రపంచ పోస్ట్ డే (October 9) యొక్క పొడిగింపు.
iii.    తపాలా కార్యాలయాలు, మెయిల్ కేంద్రాలు మరియు పోస్టల్ మ్యూజియంలు, సమావేశాలు, సెమినార్లు మరియు వర్క్‌షాప్‌లలో బహిరంగ రోజులు మరియు సాంస్కృతిక, క్రీడ మరియు ఇతర వినోద కార్యక్రమాలు వంటి ఇతర కార్యకలాపాలు కూడా జాతీయ పోస్టల్ రోజున నిర్వహించబడతాయి.
క్రీడలు
ఇరాన్ఫుట్బాల్స్టేడియాల్లో మహిళలకు ప్రవేశం :
i.          ఇరాన్లో జరిగే ఫుట్బాల్మ్యాచ్లకు సుదీర్ఘ విరామం తర్వాత మహిళల్ని అనుమతించనున్నారు. ఇక్కడ దాదాపు 40 ఏళ్ల నుంచి ఫుట్బాల్స్టేడియాల్లోకి మహిళలకు ప్రవేశం లేదు.
ii.         ఇది ఇలాగే కొనసాగితే ఇరాన్ను అంతర్జాతీయ ఫుట్బాల్నుంచి బహిష్కరిస్తామని ఫిఫా హెచ్చరించడంతో మహిళల్ని స్టేడియాల్లోకి అనుమతించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
iii.       తెహ్రాన్లోని ఆజాది స్టేడియంలో జరగబోయే ఇరాన్‌-కంబోడియా 2022 ప్రపంచకప్క్వాలిఫయర్మ్యాచ్లో మహిళలు సందడి చేయబోతున్నారు




No comments:

bio mechanics in sports

భౌతిక విద్యలో బయోమెకానిక్స్ అనేది మానవ కదలికను నియంత్రించే యాంత్రిక సూత్రాల అధ్యయనం మరియు శారీరక కార్యకలాపాల సమయంలో శరీరం శక్తులతో ఎలా సంకర్...